మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్‌లు కీ రోల్ పోషించారు. తాజాగా చిరంజీవి సినిమా గాడ్‌ఫాదర్‌పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ చెప్పారు. సినిమాలో ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే ఇంకాస్త బాగుండేదని ఆయన అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'తెలుగులోనే ఈ సినిమా బాగుందని చెబుతా. పేరుకు మలయాళ రీమేక్ చిత్రమైనా తెలుగు రాజకీయాన్ని ఈ చిత్రంలో పరిచయం చేశారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నేను చెబుతున్నా. ఈ సినిమాలో కథ చాలా స్లో పేస్‌లో వెళ్లింది. మెగాస్టార్‌కు స్లో కథనం అనేది సరిపోదు. ఇంకా మార్పులు చేయాల్సింది. స్లో పేస్‌తో పాటు చిరు బాడీ లాంగ్వేజ్‌కు తగిన క్యారెక్టర్ కాదు. కానీ ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. చిరంజీవి డ్యాన్స్, పాట లేని సినిమా కాస్త ఇబ్బంది అనిపించింది. షఫీ పాత్రలో సునీల్ ఉండి ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేదేమో అనిపించింది.' అని అన్నారు.
సల్మాన్ పాత్రపై ఆయన ఏమన్నారంటే..
పరుచూరి మాట్లాడూతూ.. 'ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ ఒకరకంగా ప్లస్. మరో రకంగా మైనస్. ఎందుకంటే మెగాస్టార్ నడుస్తుంటే సల్మాన్ ఫైట్ చేయడం ఫ్యాన్స్‌కు బాధ కలిగించింది. ఆచార్య మాదిరిగా చరణ్ లేదా పవన్ కల్యాణ్‌ను తీసుకుంటే మరోలా ఉండేదేమో. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా మరిన్ని డైలాగ్స్ ఉంటే బాగుండేది. 'రాజకీయానికి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' డైలాగ్ లాగా ఇంకా ఉండి ఉంటే ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చి ఉండేది.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment