టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమంది మాస్టర్లను తయారు చేసిన ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ఆయన మృతిపట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన పడిన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
(ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!)
పరుచూరి మాట్లాడుతూ..' రాకేశ్ మాస్టర్‌తో ఎక్కువగా పనిచేయలేదు. ఆయన గురువైన ముక్కురాజుతో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశా. రాకేశ్ మాస్టర్ ఇక లేరంటూ టీవీలో చూడగానే షాకయ్యాను. తాజాగా వాళ్ల అబ్బాయి మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయండి అని చెప్పగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.' అంటూ విచారం వ్యక్తం చేశారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'రాకేశ్ మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఆయన అద్భుతాలు సృష్టించాడు. దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ , జానీ అనే ఇద్దరు అద్భుతమైన మాస్టర్లను తీర్చిదిద్దాడు. వాళ్లంతా వచ్చి ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది. ఆయన ఆవేదనను ఎవరైనా పట్టించుకుని ఉంటే ఆయన జీవితం ఇంకో రకంగా ఉండేది. కానీ ఎవరూ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయన జీవితానికి మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు.' అని అన్నారు.
అలా జరిగి ఉంటే..
పరుచూరి మాట్లాడుతూ.. 'టాలీవుడ్‌లో ప్రస్తుతమున్న అప్‌కమింగ్ హీరోలు, అప్ కమింగ్ దర్శకులో ఎవరో ఒకరు మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. ఆయన షో చూస్తే నాకు అనుక్షణం ఆవేదనే కనిపించేది. ఎంతలా ఆవేదన అనుభవించాడో. మిత్రులారా.. ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకోండి. మనకు భగవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడు. మన జీవితంలో జరిగే స్ట్రగుల్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆయన ఆత్మ పరమాత్మను చేరుకుని.. శివుడి కూడా ఆయన లయ, విన్యాసాలు చూడాలని ఆశిస్తున్నా.' అని అన్నారు.
(ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!)
Comments
Please login to add a commentAdd a comment