choreographer
-
బాలీవుడ్లో ఒక్క హీరోకు కూడా చేతకాలేదు, కానీ అల్లు అర్జున్..: గణేశ్ ఆచార్య
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలాగే 24 విభాగాలు సరిగా పనిచేస్తేనే సినిమా సంపూర్ణమవుతుంది. కానీ సినిమా విజయం సాధించినప్పుడు చాలామంది కేవలం దర్శకులు, హీరోలను మాత్రమే మెచ్చుకుంటారు. ఆ విజయానికి దోహదపడ్డవారిని ప్రత్యేకంగా గుర్తించరు. అయితే దక్షిణాదిన మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందంటున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya). ముఖ్యంగా అల్లు అర్జున్ పిలిచి మరీ అభినందించడం మర్చిపోలేనంటున్నాడు. ఇతడు పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ అందించాడు.ఒకేసారి మేకప్తాజాగా కమెడియన్ భారతీ సింగ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గణేశ్ ఆచార్య మాట్లాడుతూ.. 'దక్షిణాదిలో టెక్నీషియన్లకు గుర్తింపు, గౌరవం ఇస్తారు. నటీనటులు పదేపదే మేకప్స్ వేసుకోరు. ఉదయం ఒక్కసారి మేకప్ వేసుకున్నాక నేరుగా లంచ్‌కు వెళ్లిపోతారు. ఆ మధ్యలో మళ్లీ ముఖానికి రంగు పూసుకోవడం ఉండదు. మేనేజర్ల హడావుడి అసలే ఉండదు. అంతా ఒక పద్ధతిగా సాగిపోతుంది.చివరి నిమిషంలో డ్యాన్స్ స్టెప్పులు మార్చమంటారుడ్యాన్స్ విషయానికి వస్తే.. చాలామంది దర్శనిర్మాతలు మా కొరియోగ్రఫీ బాగుందని, దాన్ని యథాతథంగా పాటలో ఉంచాల్సిందేనని మా ముందు బీరాలు పలుకుతారు. కానీ స్టార్ హీరోల ముందు మాత్రం మౌనంగా ఉండిపోతారు. వారు అభ్యంతరం చెప్పగానే చివరి నిమిషంలో స్టెప్పుల్ని మార్చేయమంటారు. ఆ పాట కోసం మేమెంత కష్టపడ్డామన్నది పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా నాకెంతో బాధగా అనిపిస్తుంది.మనకు ఇగో ఎక్కువ.. కానీ సౌత్‌లో..బాలీవుడ్లో జనాలు కేవలం హీరోనే పొగుడుతారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్, టెక్నీషియన్ల ప్రతిభను, కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు. పైగా మనకు ఇగోలు ఎక్కువ. కానీ సౌత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పుష్ప పాటలకు నేను కొరియోగ్రఫీ చేసిన కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) నన్ను పిలిచి మరీ అభినందించాడు. మాస్టర్, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని మెచ్చుకున్నారు. బాలీవుడ్లో అలా అభినందించిన హీరో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. (చదవండి: విశాల్ చెల్లెలి భర్తపై సీబీఐ కేసు)పుష్ప సక్సెస్ పార్టీకి ఆహ్వానంకానీ అల్లు అర్జున్ నన్ను గుర్తించాడు. జనాలు నా డ్యాన్స్ చూసి పొగుడుతున్నారంటే దానికి కారణం మీరే అన్నారు. మనసు సంతోషంతో నిండిపోయింది. అక్కడితో ఆగలేదు. హైదరాబాద్‌లో జరిగిన పుష్ప సక్సెస్ పార్టీకి నన్ను ఆహ్వానించాడు. తాగి తూలుతూ డ్యాన్స్ చేసే పార్టీ కాదది. ప్రతి టెక్నీషియన్ ఆ పార్టీలో భాగమయ్యాడు. స్టేజీపై పుష్ప సినిమాకు పని చేసిన లైట్మెన్ను కూడా అవార్డుతో సత్కరించారు.బాలీవుడ్‌ను తక్కువ చేయాలని కాదు!నేను బాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. హిందీ ఇండస్ట్రీ మాకెంతో ఇచ్చింది. దానివల్లే ఈ స్థాయిలో ఉన్నాం. కానీ కొందరి కారణంగా మన చిత్రపరిశ్రమ అద్వాణ్నంగా మారిపోతోంది. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గణేశ్ ఆచార్య చెప్పుకొచ్చాడు. ఈయన పుష్ప 1లో దాక్కో దాక్కో మేక.., ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా పాటకు కొరియోగ్రఫీ చేశాడు. పుష్ప 2లో సూసేకి అగ్గిరవ్వ మాదిరి.., కిస్సిక్.. పాటకు స్టెప్పులు నేర్పించాడు.చదవండి: ఇంట్లో ఉన్నప్పుడు ఐదారుగురు మంది అసభ్యంగా తాకారు.. ఏడ్చేసిన వరలక్ష్మి -
పుష్ప- 2 గంగమ్మ జాతర సాంగ్.. అల్లు అర్జున్ ఒంటినిండా గాయాలే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2. గతంలో 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో కేజీఎఫ్ 2, బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాల రికార్డులను తిరగరాసింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.అయితే ఈ సినిమాలో సాంగ్స్ కూడా అభిమానులను ఊర్రూతలూగించాయి. కిస్సిక్ సాంగ్‌తో పాటు గంగమ్మ జాతర పాట కూడా ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పించాయి. ముఖ్యందా గంగమ్మ జాతర సాంగ్ బన్నీ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన గణేష్ ఆచార్య తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. గంగో రేణుక తల్లి పాట చిత్రీకరణ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సాంగ్ షూట్ సమయంలో అల్లు అర్జున్‌కు గాయాలైనప్పటికీ పట్టు వదలకుండా పూర్తి చేశాడని కొనియాడారు.కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాట్లాడుతూ..'జాతర పాటను చిత్రీకరించడం మాకు చాలా సవాలుగా అనిపించింది. దాదాపు 29 రోజుల పాటు నిరంతరాయంగా చిత్రీకరించడం చాలా కష్టమైన పని. కానీ ఈ సాంగ్ క్రెడిట్ అంతా అల్లు అర్జున్‌కే చెందుతుంది. పుష్ప రెండు చిత్రాలకు ఆయన ఐదేళ్లు అంకితమిచ్చారు. జాతర సాంగ్‌లో అతను చీర, నెక్లెస్, బ్లౌజ్ ధరించాడు. షూట్ సమయంలో ప్రతి 5 నుంచి 10 రోజులకు అతనికి గాయాలు అయ్యేవి. కొన్నిసార్లు అతని పాదాలు, మెడకు కూడా గాయాలయ్యాయి. కానీ అల్లు అర్జున్ ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వలేదు' బన్నీ అంకితభావాన్ని కొనియాడారు. కాగా..బాలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గణేశ్ ఆచార్య.. గోవిందా, సంజయ్ దత్, సన్నీ డియోల్, సునీల్ శెట్టి, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్‌తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం పింటూ కి పప్పి చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. -
అందుకే ఈ సినిమాని మేం రిలీజ్ చేస్తున్నాం: నిర్మాత నవీన్ ఎర్నేని
సుశాంత్, జాన్య జోషి, విధి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిస్ కిస్ కిస్సిక్’. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య భార్య విధి ఆచార్య (వీ2ఎస్ప్రొడక్షన్) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మల్టీ లాంగ్వేజ్‌లలో ఈ సినిమాను విడుదల చేస్తోంది.ఈ చిత్రానికి కొరియోగ్రఫీ వహించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటించిన గణేశ్ ఆచార్య ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవిగారు, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌చరణ్ లాంటి బిగ్ స్టార్స్‌తో వర్క్ చేసే అవకాశం నాకు లభించింది. ఇక ‘కిస్ కిస్ కిస్సిక్’ ఫ్యామిలీ ఫిల్మ్. మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ అన్నీ అలరిస్తాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేని కొత్తవాళ్లు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ‘కిస్ కిస్ కిస్సిక్’ సాంగ్ పెద్ద హిట్. ఇదే టైటిల్‌తో మార్చి 21న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాను మేం విడుదల చేయడానికి ప్రధాన కారణం గణేశ్ మాస్టర్. ఆయనతో మాకు మంచి అసోసియేషన్ ఉంది. ‘కిస్ కిస్ కిస్సిక్’ మూవీ మంచి ఎంటర్టైనర్.ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు మైత్రీ నిర్మాత నవీన్ ఎర్నేని. ‘‘ఈ సినిమా మంచి కమర్షియల్ ΄్యాకేజ్లా ఉంటుంది’’ అని తెలిపారు సుశాంత్. ‘‘ఈ సినిమా హిందీ టైటిల్ ‘పింటూ కీ పప్పీ’. నేను పప్పీ రోల్ ప్లే చేశాను’’ అని పేర్కొన్నారు జాన్య జోషి. ‘‘ఈ సినిమా ద్వారా గణేశ్ మాస్టర్‌గారి నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు విధి. -
అమ్మాయితో కనిపించిన చాహల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య ధనశ్రీ వర్మ!
భారత స్టార్ క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆట కంటే వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆర్జే మహ్వాష్గా గుర్తించారు. ఇంకేముంది ఆమెతో మనోడు పీకల్లోతు డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే.. యుజ్వేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో రీ లోడ్ చేసింది. అతనితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా అన్ని ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా చాహల్ ఫోటోలు రీ లోడ్ చేయడంతో వీరిద్దరు విడాకుల రూమర్స్‌కు చెక్ పడే అవకాశముంది. వాటిని ఫుల్స్టాప్ పెట్టేందుకే ఇచ్చేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలన్నింటినీ రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది.కాగా.. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు తెలుస్తోది. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహోని ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబం ఖండించింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
కలిసి డ్యాన్స్.. వారసుడిని పరిచయం చేసిన ప్రభుదేవా
ప్రభుదేవా పేరు చెప్పగానే అద్భుతమైన డ్యాన్సులే గుర్తొస్తాయి. రీసెంట్ టైంలో పెద్దగా మెరుపుల్లేవ్. కొన్నాళ్ల ముందు వరకు పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నటుడిగా తమిళ మూవీస్ చేస్తున్నాడు. సరే ఇదలా ఉంచితే ఇప్పుడు డ్యాన్స్ తో తన వారసుడిని పరిచయం చేశాడు.(ఇదీ చదవండి: ఇది 40 ఏళ్ల ప్రేమ.. ఉపాసన పోస్ట్ వైరల్)ప్రభుదేవా.. చెన్నైలో తాజాగా ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ పేరుతో కాన్సర్ట్ నిర్వహించాడు. దీనికి పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలోనే ప్రభుదేవా.. తన కొడుకు రిషి రాఘవేందర్ ని పరిచయం చేశాడు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ కూడా చేయడం విశేషం.కొడుకు స్టేజీ పెర్ఫార్మెన్స్ వీడియో షేర్ చేసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. కొడుకుని పరిచయం చేయడం ఎంతో గర్వంగా ఉందని, ఇది కేవలం డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కాదని అంతకు మించి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రభుదేవాకు ఇద్దరు కుమారులు. వాళ్లలో రిషి ఒకడు. మరొకరు అదిత్.(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా) View this post on Instagram A post shared by Prabhudeva (@prabhudevaofficial) View this post on Instagram A post shared by Prabhudeva (@prabhudevaofficial) -
బెస్ట్ కాంప్లిమెంట్ ఏ సాంగ్ కి వచ్చింది..?
-
'మహిళల భద్రతకు ఈ తీర్పే నిదర్శనం'.. జానీ మాస్టర్ కేసుపై ఝాన్సీ పోస్ట్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల వేధింపులకు గురైన లేడీ కొరియోగ్రాఫర్ ఓ టీవీ ఇంటర్వ్యూకు హాజరైంది. జానీ మాస్టర్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది.అయితే ఈ కేసుపై టాలీవుడ్ నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. జానీ భాష విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయం సాధించిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. పని ప్రదేశంలో ఎక్కడైనా సరే మహిళలపై వేధింపులను సహించేది లేదని ఈ తీర్పు చూస్తే అర్థమవుతోందని.. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య పోరాటం చేసినందుకు ఝాన్సీ ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!)ఝాన్సీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసును గెలుచుకుంది. కొరియోగ్రాఫర్ జానీ బాషా జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేశారు. ఈ రోజు కోర్టు ఆయన మధ్యంతర పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. పని ప్రదేశంలో మహిళల భద్రత ముఖ్యమని ఈ తీర్పు చెబుతోంది. ఈ విషయంలో సీరియస్‌గా తీసుకుని పోరాటం చేసినందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్యకు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
జాతర పాటను బాధ్యతగా భావించాను: నృత్యదర్శకుడు విజయ్ పోలాకి
‘‘అల్లు అర్జున్‌గారి ‘పుష్ప 2’ సినిమాలోని జాతర సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయడాన్ని ఒత్తిడిగా ఫీలవ్వలేదు. బాధ్యతగా ఫీలయ్యాను. ఈ సినిమాలోని ‘జాతర’ పాటకు, పుష్ప 2 టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి. ‘అమ్మాడి...’ (నాని ‘హాయ్ నాన్న’), ‘మార్ ముంత చోడ్ చింత...’ (రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’), ‘లింగిడి లింగిడి...’ (శ్రీకాంత్ ‘కోట బొమ్మాళి’), ‘నక్కిలిసు గొలుసు...’ (‘పలాస’), ‘కళ్ల జోడు కాలేజ్ పాప...’ (‘మ్యాడ్’) పాటలకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ పోలాకి ‘పుష్ప 2’ చిత్రంలోని జాతర పాట, టైటిల్ సాంగ్ ‘పుష్ప పుష్ప’లకు నృత్యరీతులు సమకూర్చారు.ఈ నేపథ్యంలో విజయ్ పోలాకి మాట్లాడుతూ– ‘‘నేను కోరియోగ్రఫీ చేసిన మొదటి సాంగ్ సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని ‘అఆఇఈ...’. ఆ తర్వాత చాలా హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశాను. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని ‘ఊ అంటావా..’ పాట కోసం గణేష్ ఆచార్య మాస్టర్‌గారితో కలిసి వర్క్ చేశాను. అయితే ‘పుష్ప 2’లో నాకు కొరియోగ్రాఫర్‌గా చాన్స్ వస్తుందని అప్పుడు ఊహించలేదు. ‘పుష్ప 2’లోని ‘గంగమ్మ తల్లి...’ జాతర పాట, ‘పుష్ప... పుష్ప...’ పాటకు వర్క్ చేశాను. జాతర పాట రొటీన్‌గా ఉండకూడదని సుకుమార్‌గారు చె΄్పారు. ఇలా ఉండాలి అంటూ... కొన్ని మూమెంట్స్ ఆయన చూపించారు. పుష్పరాజ్ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఈ పాట చేయాలనుకున్నాను. అందుకని ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌ని చాలాసార్లు చూశాను. జాతర సాంగ్‌కి మూడు నెలలు ప్రిపేర్ అయ్యి, 20 రోజులు షూట్ చేశాం. అల్లు అర్జున్‌గారు చాలా కష్టపడి చేశారు. ప్రస్తుతం సాయితేజ్‌గారి ‘సంబరాల ఏటిగట్టు’, రామ్ గారి సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్‌గారి ‘భైరవం’, ‘మ్యాడ్ 2’ (సింగిల్ కార్డు), హిందీలో ‘బేబీ’ సినిమాలకు వర్క్ చేస్తున్నాను’’ అన్నారు. -
జీవితంలో కొత్త అధ్యాయం షురూ అంటున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
HYD: ‘ఓయో’లో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ అరెస్టు
సాక్షి,హైదరాబాద్: మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డారు. కన్హమహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ప్రియాంకరెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్లు తెలుస్తోంది.ప్రముఖ టీవీ షోలలో కన్హా మహంతి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ డ్యాన్స్‌షోలలో చాలా కాలం పాటు పనిచేసిన కన్హా మహంతి పలుమార్లు విజేతగా నిలిచారు. మహంతి, ప్రియాంక రెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం.పార్టీలో పాల్గొన్న నలుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.పార్టీ జరిగిన ప్రదేశం నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
Choreographer: సొనాలీ భదౌరియా
డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్. సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్ చేస్తున్న కంపెనీలోని డాన్స్ క్లబ్ ‘క్రేజీ లెగ్స్’లో జాయిన్ అయింది. ఎన్నో డాన్స్ పోటీల్లో పాల్గొంది. ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసింది. అందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్‌కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ సిల్వర్ బటన్నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్‌తో సొనాలీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. -
జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్!
లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇవాళ విడుదలయ్యారు. గురువారం ఆయనకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చారు. దాదాపు 36 రోజులుగా జానీమాస్టర్ జైలులోనే ఉన్నారు.కాగా.. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెల గోవాలో అరెస్టు చేశారు. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరి పూచీకత్తును రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టులో మేజి్రస్టేట్‌కు సమర్పించాలని జానీని ఆదేశించింది. బాధితురాలి వ్యక్తిగత జీవితంలో జానీగాని, అతని కుటుంబ సభ్యులుగానీ ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, బాధితురాలిని కలిసే ప్రయత్నం కూడా చేయవద్దని స్పష్టం చేసింది. జానీ మాస్టర్ తనను వేధించారని, పలుమార్లు అత్యాచారం చేశారని, మైనర్‌గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశారంటూ అతని అసిస్టెంట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెలలో గోవాలో అరెస్టు చేశారు. అయితే, జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈ నెల 6 నుంచి 10 వరకు ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచి్చంది. కానీ ఆయనకు ఇచి్చన అవార్డును వెనక్కు తీసుకోవడంతో బెయిల్ రద్దయింది. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పుష్ప-2 మేకర్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే 50 రోజులు ముందుగానే పుష్ప-2 కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.అయితే తాజాగా పుష్ప-2 నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. గతంలో ప్రకటించిన విడుదల తేదీని మారుస్తున్నట్లు ప్రకటించారు. పుష్ప-2 డిసెంబర్ 5 వ తేదీనే థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు. దీంతో ఒక రోజు ముందుగానే పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఈ ప్రెస్‌మీట్‌కు హాజరైన నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.(ఇది చదవండి: కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్'కు బెయిల్)అందులో భాగంగానే జానీ మాస్టర్ గురించి ప్రశ్న ఎదురైంది. పుష్ప-2 ఓ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాల్సి ఉంది.. ఆయనతోనే చేస్తున్నారా? లేదా వేరే వాళ్లను తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై నిర్మాత నవీన్ యేర్నేని క్లారిటీ ఇచ్చారు. జానీ మాస్టర్‌తో ఎలాంటి సాంగ్‌ను చేయడం లేదు.. ఇప్పటికే ఆ పాటను మరో కొరియోగ్రాఫర్‌తో పూర్తి చేశామని ఆయన తెలిపారు. దీంతో పుష్ప-2 చిత్రానికి జానీ మాస్టర్‌ను దూరంగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పుష్ప మేకర్స్ నిర్ణయంతో జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలినట్లైంది. కాగా.. జానీమాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. -
మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు
టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పటికే రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాపై చీటింగ్ కేసు నమోదైంది. ఇతడి భార్యతో పాటు మరో ఐదుగురి కలిసే తనని మోసం చేశారని 26 ఏళ్ల డ్యాన్సర్.. ముంబైలోని మీరారోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)ఫిర్యాదు ప్రకారం.. డ్యాన్సర్ టీమ్ 2018-24 మధ్యలో టీవీ షోలో విజేతగా నిలిచింది. వీళ్ల గెలుచుకున్న రూ.11.96 కోట్ల ప్రైజ్‌మనీని రెమో డిసౌజా తదితరులు తదమే అన్నట్లు బిల్డప్ ఇచ్చి మరీ లాక్కున్నారు. రెమో డిసౌజాతో పాటు అతడి భార్య లీజెల్ డిసౌజా, ఓం ప్రకాశ్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవన్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, రమేశ్ గుప్తా ఉన్నారు.వీళ్లపై డ్యాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. రెమో డిసౌజాతో పాటు మరో ఆరు మందిపై 465 (ఫోర్జరీ), 420 (మోసం) సహా ఇతర సెక్షన్ల కింద కేసు మోదు చేశారు. ఇకపోతే రెమో డిసౌజా కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించాడు. ఫ్లయింగ్ జాట్, ఏబీసీడీ ఫ్రాంచైజీ, సల్మాన్ ఖాన్ 'రేస్ 3' సినిమాలతో దర్శకుడిగానూ అలరించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'హ్యాపీ' త్వరలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏదేమైనా స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యిండి ఇలా చీటింగ్ చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్) -
జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్‌కు గుండెపోటు వచ్చింది. జానీ జైలుపాలవడంతో అతడిపై బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లి అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసింది.జైల్లో ఖైదీగా..మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం, బెదిరింపుల కేసులో షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో అతడికి రావాల్సిన జాతీయ అవార్డు (బెస్ట్ కొరియోగ్రఫీ) సైతం రద్దయింది. ప్రస్తుతం ఇతడు చంచల్‌గూడ కేంద్రకారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు.చదవండి: జిగ్రా చూద్దామని వెళ్లా.. థియేటర్ మొత్తం ఖాళీ.. అయినా..! -
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై జానీమాస్టర్ బంధువు ఫిర్యాదు
నెల్లూరు (క్రైమ్): సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీమాస్టర్ కేసులో బాధితురాలైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధిస్తోందని ఓ యువకుడు శుక్రవారం నెల్లూరు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సేకరించిన సమాచారం మేరకు.. రంగనాయకులపేటకు చెందిన సమీర్ ప్రస్తుతం బిటెక్ చదువుతున్నాడు. అతను కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ మేనమామ కుమారుడు. సమీర్ ఎక్కువగా హైదరాబాద్‌లో జానీమాస్టర్ వద్ద ఉండేవాడు. ఆయనతో పాటు షూటింగ్‌లకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న యువతితో అతనికి పరిచయం అయింది. ఆమె 2020 నుంచి తనను తరచూ లైంగిక వేధింపులకు గురిచేసిందని సమీర్ ఆరోపించారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సదరు యువతి జానీమాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టడం, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం తెలిసిందే. తాజాగా ఆ యువతిపై జానీమాస్టర్ మేనమామ కొడుకు ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం మొత్తం తెలంగాణ, చైన్నె రాష్ట్రాల్లో జరగడంతో పోలీసులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు ఇటీవలే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు గానూ తనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే జానీ పోక్సో కేసు నమోదు కావడంతో పలువురు తనకు నేషనల్ అవార్డు రద్దు చేయవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దాంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేస్తున్నట్టు కేంద్ర అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది. 2022 బెస్ట్ కొరియోగ్రఫీకి గాను ఈ నెల 8న ఢిల్లీలో జతీయ అవార్డు అందుకోవలసి ఉంది. అందుకు గాను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు జానీ మాస్టర్‌కు కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ జానీపై పోక్సో కేసు కారణంతో అవార్డు రద్దు అయింది. దీంతో అతని బెయిల్‌పై అనిశ్చితి నెలకొంది. -
మరికాసేపట్లో నార్సింగి పోలీస్ కస్టడిలో జానీ మాస్టర్
-
బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య చౌకబారు వ్యాఖ్యలు
లైంగిక వేధింపుల వ్యవహారం, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి భార్య ఆయేషా అలియాస్ సుమలత తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ఎదగకూడదనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్అయితే హీరోయిన్ అవ్వాలి, లేదంటే టాప్ కొరియోగ్రాఫర్ అవ్వాలన్న లక్ష్యంతోనే ఆమె ఇలాంటి పనులు చేస్తోంది. 16 ఏళ్లకే అత్యాచారం జరిగిందంటున్నారు.. అందుకు సాక్ష్యం ఉందా? దానికంటే ముందు ఎవడి దగ్గరకు వెళ్లలేదని గ్యారెంటీ ఏంటి? తనకు చాలామంది కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్ ఉన్నాయి. మహిళ అనే పదానికే ఆమె కళంకం అని బాధితురాలి గురించి నీచమైన వ్యాఖ్యలు చేసింది.జానీపై కేసుఅవకాశాల కోసం ఇండస్ట్రీకి వస్తే, సాయం చేస్తాడనుకున్న జానీ మాస్టర్ తనను లైంగికంగా, మానసికంగా హింసించాడని ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని చెప్పడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటినుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు. నిప్పు లేనిదే పొగ రాదునిజంగానే అతడు ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇన్నిరోజులు పోలీసులకు చిక్కకుండా దాక్కోవాల్సిన గత్యంతరం ఏంటి? ఈ ప్రశ్నలకు సుమలత సమాధానాలు చెప్పలేకపోయింది కానీ తానే ఒప్పని చూపించుకోవడం కోసం బాధితురాలిపై నానా నిందలు వేసింది. తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయని, ఎంతోమందితో తిరిగిందన్నట్లుగా చౌకబారు వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎన్ని చెప్పినా సరే నిప్పు లేనిదే పొగ రాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.చదవండి: సోనియా దిగజారుడు ప్రవర్తన.. ఛీ కొడుతున్న జనం -
ఎస్ వోటీ పోలీసుల అదుపులో కొరియోగ్రాఫర్ జానీ
-
బయటకొస్తున్న జానీ అరాచకాలు.. భయపడుతున్న కొరియోగ్రాఫర్స్!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచారం కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.తాజాగా కొరియోగ్రాఫర్ జానీకి సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న జానీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జానీ మరింత రెచ్చిపోయారు. తన తోటి కొరియోగ్రాఫర్లను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’)సభ్యత్వం ఇవ్వకుండా వేధింపులు..జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జానీ మాస్టర్ దారుణాలకు అడ్డులేకుండా పోయింది. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తోటి కొరియోగ్రాఫర్స్‌ను వేధింపులకు గురి చేశారు. కార్యవర్గం నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారు. అసోసియేషన్ ఆడిషన్స్‌లో సెలక్ట్ అయిన వారికి సభ్యత్వం ఇవ్వకుండా వేధించారు. దాదాపు 90 మంది కొరియోగ్రాఫర్స్‌ను సభ్యత్వం ఇవ్వకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేశారు. ఇండస్ట్రీలో అతనికి పలుకుబడి ఉండడంతో అరాచకాలపై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్స్ జంకుతున్నారు.గాలిస్తున్న పోలీసులు..యువతి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు అతని కోసం లడఖ్ బయలుదేరి వెళ్లారు. త్వరలోనే జానీమాస్టర్ అరెస్ట్ అయ్యే అవకాశముంది. -
లడఖ్ పారిపోయిన జానీ మాస్టర్ పోక్సో కేసు నమోదు
-
జానీమాస్టర్‌పై పోక్సో కేసు నమోదు
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ ఇటీవలే ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువ డ్యాన్సర్ ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.(ఇది చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీమాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జానీమాస్టర్ కోసం ప్రత్యేక బృందం లడఖ్ బయలుదేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అసలు కేసు ఏంటంటే?మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా ఆమెకు అవకాశమిస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. అయితే తనని లైంగికంగా, మానసికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నాడని.. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడ్డాని సదరు యువతి చెప్పింది.అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్‌లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ పెట్టిన బాధని బయటపెట్టింది. -
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు.. బాధితురాలి సంచలన ఆరోపణలు!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తాజాగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. దాదాపు 3 గంటలపాటు జరిగిన విచారణలో జానీ మాస్టర్ దారుణాలను మహిళ డ్యాన్సర్ పోలీసులకు వివరించింది.షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో జానీ మాస్టర్ బలవంతం చేశాడని బాధిత యువతి పోలీసులకు తెలిపింది. తన కోరిక తీర్చమని ఎంతో వేధించాడని.. లేకుంటే ఎలాంటి ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు వివరించింది. అంతే కాకుండా పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు వాపోయింది. బాధిత యువతి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు పోలీసులు.. ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అసలేం జరిగిందంటే??ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలానే ఇండస్ట్రీలోని అవకాశాలని అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు చెప్పింది. -
జానీ మాస్టర్ పై కేసు నమోదు..
-
జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
-
జాతీయ అవార్డ్.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి సన్మానం (ఫొటోలు)
-
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం
టాలీవుడ్ లీడింగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. తోడబుట్టిన తమ్ముడు కన్నుమూశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనసూయ తన సంతాపాన్ని తెలియజేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో శేఖర్ మాస్టర్ వదిన చనిపోయారు.(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌పై కేసు నమోదు..?)'నిన్ను మిస్ అవుతున్నాం సుధా. ఎక్కడికెళ్లినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తావ్. నువ్వు చనిపోయావనే చేదు నిజాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఎక్కడో ఓ చోట నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావ్. మిస్ యూ రా తమ్ముడు' అని శేఖర్ మాస్టర్ పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యాడు.'ఢీ' డ్యాన్స్ షోతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్.. తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్స్‌తో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డ్యాన్స్ మాస్టరగా కొనసాగుతున్నాడు.(ఇదీ చదవండి: నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి.. లావణ్య అబార్షన్‌పై రాజ్ తరుణ్ రియాక్షన్) View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) -
తారక్ అద్భుతమైన డ్యాన్సర్.. ఆయన స్టెప్పులేస్తుంటే..: కొరియోగ్రాఫర్
హీరో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్.. ఎంతో అలవోకగా స్టెప్పులేస్తాడు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు అంటున్నాడు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్. ఈయన దేవర: పార్ట్ 1 సినిమాకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.అద్భుతమైన డ్యాన్సర్తాజాగా ఆయన దేవర విశేషాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నేను దేవర మూవీకి పని చేస్తున్నాను. హీరో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తి. సూపర్‌గా డ్యాన్స్ చేసే హీరోల్లో ఈయన ఒకరు. ఏ స్టెప్పులైనా సులువుగా నేర్చేసుకుంటాడు. ఆయన డ్యాన్స్ చేయడం చూస్తుంటే మనకే సంతోషంగా అనిపిస్తుంది. ఆయన డ్యాన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. తనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం అని చెప్పుకొచ్చాడు.ఆ వైరల్ స్టెప్పులు నేర్పింది ఈయనే!బోస్కో ఇటీవలే తారక్‌తో కలిసి దిగిన ఫోటోను సైతం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇకపోతే ఈ మధ్య వైరల్‌గా మారిన తాబ తాబ..(విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్ మూవీలోని ఓ సాంగ్) స్టెప్పులు కూడా ఈయన కనిపెట్టినవే! దేవర విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. ఈ మూవీని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Bosco Martis (@boscomartis) చదవండి: సినిమా దారుణంగా ఫ్లాప్.. ఆ బాధ్యత నాదే: దర్శకురాలు -
ఆ పాట టైంలో విమర్శలు.. డైమండ్ గిఫ్టిచ్చిన జ్యోతిక
చంద్రముఖి సినిమాలో వారాయ్.. సాంగ్ ఎంతో ఫేమస్. ఇందులో జ్యోతిక డ్యాన్స్, ఎక్స్ప్రెషన్ను మాటల్లో వర్ణించలేం. ఈ ఒక్క పాట సినిమాను మరో మెట్టు ఎక్కించింది. తాజాగా ఈ సాంగ్ గురించి కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రారా(వారాయ్.. నానుడి తేడి) పాట షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో విమర్శించారు. నిజానికి జ్యోతికకు క్లాసికల్ డ్యాన్స్ రాదు. దీనివల్ల ఆమెకు డ్యాన్స్ నేర్పించడానికి కొంత సమయం పట్టింది. రెండు రోజుల్లో పూర్తితర్వాత రెండు రోజుల్లో సాంగ్ పూర్తి చేశాం. రిజల్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. ఆ పాట ఎడిటింగ్ అయిపోయే సమయానికి జ్యోతిక స్టూడియోలోనే ఓ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది. నాట్యమే తెలియనివారు నా శిక్షణ వల్ల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? చంద్రముఖి మలయాళ వర్షన్ చూడకుండానే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాను. ప్రత్యేకంగా ఈ పాటను మాత్రమే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.కొరియోగ్రాఫర్ ఎలా అయ్యానంటే?కమల్ హాసన్ 'పున్నగి మన్నన్' మూవీకి రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్. కానీ అప్పుడు ఆయనకు ఓ తెలుగు సినిమా చేయాల్సి ఉండటంతో పున్నగి చిత్రాన్ని నాకు అప్పగించాడు. అప్పటికి నేనింకా డ్యాన్స్ స్కూల్లో స్టూడెంట్ను మాత్రమే కావడంతో కమల్ హాసన్ సహా అందరూ భయపడ్డారు. తీరా నా డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు అని కళా మాస్టర్ చెప్పుకొచ్చింది. చదవండి: లైలాగా టాలీవుడ్ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా.. -
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు!
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు నమోదైంది. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఆయనపై కంప్లెంట్ చేశారు. జానీ మాస్టర్‌పై డ్యాన్సర్ సతీశ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన అరాచకాలపై ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొరియర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..ఈ నెల 5న కూడా తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశారు. తనని షూటింగ్‌లకు పిలవకుండా వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. షూటింగ్స్‌కు సతీష్‌ను పిలవవద్దని జానీ మాస్టర్ యూనియన్ సభ్యులతో ఫోన్లు చేయిస్తున్నాడని ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నానని వెల్లడించారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ సమస్యలపై మాట్లాడినందుకే జానీ మాస్టర్ తనపై పగ పెంచుకున్నాడని కంప్లైంట్లో సతీశ్ వివరించారు. కాగా.. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రస్తుతం జానీ మాస్టర్ బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. -
Maithri Rao: తెలుగు నేల మీద తుళు అడుగులు
మహిళలు చదువుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మహిళలు అభిరుచిని కెరీర్‌గా మలుచుకోగలుగుతున్నారు. మహిళలు సాధికారత లక్ష్యంలో విజేతలవుతున్నారు. ‘సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాట్యమే నా మాధ్యమం’ అంటున్నారు మైత్రి రావు. భరతనాట్యం ద్వారా ప్రదర్శించగలిగేది పౌరాణిక ఐతిహాసిక కథనాలనే కాదు, సామాజిక అంశాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా ఇది దీటైన మాధ్యమం అన్నారామె. సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపిణే అన్నారామె. అందుకే ప్రతి భావాన్నీ లోతుగా వ్యక్తీకరించే ఈ మాధ్యమం ద్వారా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెబుతూ, నాట్యాన్నే కెరీర్‌గా మలుచుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు స్త్రీ శక్తి పురస్కార గ్రహీత మైత్రిరావు. ‘‘మహారాష్ట్రలోని మాలేగావ్‌లో పుట్టాను. మా మూలం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల. నేను పెరిగింది, చదువుకున్నది మైసూర్లో. ఇప్పటికీ ఇంట్లో తుళు భాష మాట్లాడతాం. మైసూర్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. డాన్, యోగాలను పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకోవడానికి ముందు నోకియా కంపెనీలో రెండేళ్లపాటు డెవలపర్‌గా బెంగళూరులో ఉద్యోగం చేశాను. డాన్ మీద ఆసక్తి నాలుగేళ్ల వయసులోనే బయటపడింది. నా ఆసక్తిని గమనించి మా అమ్మానాన్న నాకు ఎనిమిదవ ఏట నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. 2010లో అరంగేట్రం జరిగింది. నాట్యంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ప్రతి చిన్న పెద్ద క్లిష్టమైన కీలకమైన సున్నితమైన లోతైన భావాలన్నింటినీ చాలా స్పష్టంగా, సునిశితంగా వ్యక్తీకరించగలిగిన మాధ్యమం ఇది. సాధన ద్వారా సాధించిన ఈ నైపుణ్యాన్ని దూరం చేసుకోవడానికి కళాకారులెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే కళాసాధన ద్వారా వచ్చే సంతృప్తికి సమానం కాదు, కాలేదు. మయూరి, మాధురి ఉపాధ్యాయ ఇద్దరూ నాకు ఇష్టమైన నాట్యకారిణులు, స్ఫూర్తిప్రదాతలు కూడా. మా డాన్ టీచర్లు, సీనియర్ స్టూడెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరిలో ఒక్కో అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవాలన్నంత ఆసక్తిగా గమనిస్తే ప్రతి వ్యక్తిలోనూ గురువు కనిపిస్తారు. భరతనాట్యంతోపాటు కలరియపట్టు, అట్టక్కలరి, వ్యాలికవల్ రీతులను కూడా సాధన చేశాను. నాట్యాన్ని విస్తరింపచేయడమే నా బాధ్యత అనుకున్నాను. బెంగళూరులో శివాన్ష్ స్కూల్ ఆఫ్ డాన్ 2017లో స్థాపించాను. ఆ తర్వాత శివాన్ష్ శాఖలను హైదరాబాద్‌లోని సన్ సిటీ, కిస్మత్పూర్, కొండాపూర్, బంజారా హిల్స్లకు విస్తరించాను. శాస్త్రీయ నాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు అరుదైన ఇతివృత్తాలతో రూపకల్పన చేశాను. కళలనే కెరీర్‌గా తీసుకున్న మహిళలే నాతోపాటు మా ‘టీమ్ శివాన్ష్’లో ఉన్నారు. సాధించాం... ఇంకా ఉంది నాట్యం నాకు చాలా ఇచ్చింది. టీవీ రియాలిటీ షోలలో విజేత కావడం ఒక సరదా. అయితే మైసూర్ లిటరరీ అండ్ కల్చర్ ఫౌండేషన్ నుంచి యువశ్రీ పురస్కారం, ఉత్కళ యువ సాంస్కృతిక సంఘ్ నుంచి నృత్యమణి, హైదరాబాద్ డాన్ ఫెస్టివల్ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో స్త్రీ శక్తి పురస్కారాలందుకోవడం గర్వకారణం. నాట్యం ఇతివృత్తంగా రెండు సినిమాలు చిత్రీకరించారు. వాటికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇక నా వంతుగా నాట్యం మాధ్యమంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. సమాజంలో మహిళలు తమకెదురైన సమస్యలను ఎదుర్కొంటూ శక్తిమంతులుగా మారుతున్నారు. మహిళ సాధికారత కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక తరానికి మరో తరానికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళల స్థితి చాలా మెరుగైంది. మహిళల్లో అక్షరాస్యత పెరగడం తొలి విజయం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు కచ్చితంగా ఉంటున్నాయి, అలాగే శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహిళాభివృద్ధి పురోగమనంలో సాగుతోందనే నాకనిపిస్తోంది. అయితే ‘మనం సాధించేశాం’ అని సంతృప్తి చెందగలిగిన స్థితికి మాత్రం చేరలేదు. కానీ... సమానత్వ స్థాయిని మా తరంలోనే చూడగలమనే భరోసా కలుగుతోంది’’ అని మహిళాభివృద్ధి పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మైత్రి రావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. స్టార్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవలే ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇండియాలోని ప్రముఖ స్టార్స్ భాగం కానున్నారు. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ప్రభు దేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది. ఇండియాలోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా 'కన్నప్ప' సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభు దేవా కొరియోగ్రఫీ ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. #Prabhudeva joins @iVishnuManchu on #Kannappa shoot in #NewZealand pic.twitter.com/StgCcLO3Os — FridayWall Films (@FridayWallMag) March 4, 2024 -
అలా సినిమాలు తీయడం సులభం కాదు
‘‘నేను దాదాపు 95మందికి పైగా దర్శకులతో పని చేశాను. చక్కని క్లారిటీతో సినిమాలు చేసే కొద్దిమంది దర్శకుల్లో విజయ్ ఒకరు అని నాకనిపించింది. ‘నా సామిరంగ’ మూవీని ఓ పాటలా అందంగా తీసి, కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు. ఇలా తీయడం అంత సులభం కాదు’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ‘నా సామిరంగ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ – టీవీ డ్యాన్సర్స్ – డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లు కలిసి విజయ్ బిన్నీని సన్మానించాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు రావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ్‌తో వండర్ఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు. మరో అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని కావాలనుకున్న తన కలను సక్సెస్‌ఫుల్‌గా నెరవేర్చుకున్నారు విజయ్. ఇక్కడున్న డ్యాన్స్ మాస్టర్స్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నాగార్జునగారు నన్ను దర్శకుడిగా ఎంచుకోవడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘విజయ్‌గారు డైరెక్టర్‌గా గొప్ప విజయాన్ని అందుకోవడం మా అందరికీ గర్వకారణం’’ అన్నారు శేఖర్ మాస్టర్. -
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ స్పెషల్ వీడియో!
ఎటు చూసినా జై శ్రీరామ్ పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆ అయోధ్య రాముని నామ జపం చేస్తోంది భారతావని. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఆ రాముని పట్ల తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తన భార్య జ్యోతిరాజ్ సందీప్‌తో కలిసి నృత్యం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు మీ కొరియోగ్రఫీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు జై శ్రీరామ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
శేఖర్, సందీప్ మాస్టర్ సంపాదన ఎంతో తెలుసా? ఒక్క సంగీత్‌కు..
ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నవాళ్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. రాకేశ్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న ఇతడు తర్వాతి కాలంలో గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో పెద్ద హీరోలతో స్టెప్పులేయిస్తూ టాప్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు. రాకేశ్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా చేరి డ్యాన్స్‌లో మెళకువలు నేర్చుకున్న మరో వ్యక్తి బషీర్ మాస్టర్. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ అందుకునే పారితోషికాన్ని బయటపెట్టాడు. బషీర్ మాస్టర్ నేను లక్ష తీసుకుంటా బషీర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'సంగీత్ వేడుకల కోసం నేను ఐదు రోజులపాటు కొరియోగ్రఫీ చేసి రూ.1 లక్ష తీసుకుంటాను. అదే అమెరికా వాళ్లకు ఆన్లైన్లో ఒక్క పాటకు డ్యాన్స్ నేర్పించినందుకుగానూ రూ.30 వేలు తీసుకుంటాను. నా పార్ట్‌టైమ్ సంపాదన ఇదే! ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లందరూ ఇలా సంగీత్ వేడుకలు చేసినవారే! సందీప్ కూడా.. శేఖర్ మాస్టర్ ఒక్క సంగీత్ కోసం రూ.40 లక్షలు తీసుకుంటాడు. జానీ మాస్టర్, సత్య మాస్టర్, సందీప్ అందరూ సంగీత్‌లలో చేసినవారే! మొన్నటివరకు సందీప్ కూడా రూ.2-3 లక్షలకు సంగీత్ చేశాడు. నాక్కూడా మంచి రేంజ్ వచ్చినప్పుడు రూ.50 లక్షలు తీసుకుంటాను. బిగ్‌బాస్ షోలో పాల్గొనడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఛాన్స్ వస్తే వెళ్తానేమో, అంతా ఆ దేవుడి చేతిలో ఉంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: డిసెంబర్లో నటుడి మరణం.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని ఫ్యామిలీ! -
కథ విన్నారా?
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసి, ఓ కథ వినిపించారట నవీన్. స్క్రిప్ట్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు పూర్తిస్థాయిలో మెరుగులుదిద్దే పనిలో నవీన్ ఉన్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. నాగార్జున కెరీర్లో ఇది వందో చిత్రమట. మరోవైపు ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘నా సామిరంగ’ విడుదల కానుంది. -
'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!
సినిమా ఇండస్ట్రీలో వేధింపులు ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువగా ఈ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. తాజాగా షూటింగ్లో పాల్గొన్న ఓ హీరోయిన్‌కు అలాంటి సంఘటనే ఎదురైందిృ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సినిమా సెట్స్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేయడంతో వెంటనే షూటింగ్ నుంచి వచ్చేశానని తెలిపింది. (ఇది చదవండి: టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!) కోల్‌కతాకు చెంది బెంగాలీ నటి, రాజకీయవేత్త అయిన సయంతిక బెనర్జీ ఇటీవలే బంగ్లాదేశ్‌లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. అయితే సెట్స్‌లో తనపట్ల కొరియోగ్రాఫర్ మైఖేల్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. షూటింగ్ సమయంలో నా అనుమతి లేకుండానే చేతులు పట్టుకున్నాడని తెలిపింది. అయితే ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించింది. నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో షూట్ మధ్యలోనే ఆపేసి ఇండియాకు తిరిగొచ్చానని పేర్కొంది. (ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) అయితే ఈ ఘటనపై నిర్మాతలు ఇంకా స్పందించలేదు. బంగ్లాదేశ్ నుంచి తిరిగొచ్చిన సయంతిక తన రాబోయే చిత్రం 'చాయాబాజ్' షూటింగ్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె షూటింగ్లో జరిగిన సంఘటనను వివరించింది. కాగా.. ప్రస్తుతం తాజు కమ్రుల్ దర్శకత్వం వహిస్తోన్న 'ఛాయాబాజ్' చిత్రంలో జయేద్ ఖాన్ సరసన సయంతిక నటిస్తోంది. View this post on Instagram A post shared by Sayantika Banerjee (@iamsayantikabanerjee) -
ఆ కొరియోగ్రాఫర్ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్
కృతి సనన్..ఇప్పుడొక స్టార్ హీరోయిన్. అయితే ఆ స్టార్డమ్ వెనుక చాలా కష్టం ఉంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించి.. టాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఆమె తొలి సినిమా ‘వన్:నేనొక్కడినే’. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది కానీ.. కెరీర్ పరంగా మాత్రం కృతికి చాలా ఉపయోగపడింది. ఆ మూవీ తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం..ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా మారింది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డు లభించింది. అయితే తన కెరీర్ ప్రారంభంలో మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురయ్యిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను మోడలింగ్ కోసం ముంబైకి వచ్చిన కొత్తలో జరిగిందది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల కోసం ట్రై చేస్తున్నాను. నా అదృష్టం కొద్ద ఒకేసారి రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒకటి టాలీవుడ్ మూవీ వన్: నేనొక్కడినే, రెండోది ‘హీరోపంతీ’. ఈ రెండు సినిమాల షూటింగ్‌కి కొద్ది రోజుల ముందు నేను ఒక ర్యాంప్ షోలో పాల్గొనడానికి వెళ్లాను. పచ్చికలా ఉన్నర లాన్లో క్యాట్‌వాక్ చేస్తున్నాడు. నేను ధరించిన హీల్స్ గడ్డిలో కూరుకొని పోయాయి. దీంతో నేను కాస్త గందరగోళానికి గురైయ్యాను. మధ్యలోనే ఆగిపోయాడు. దీంతో ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ నాపై గట్టిగా అరిచింది. దాదాపు 50 మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టి అవమానించింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. పక్కకెళ్లి చాలాసేపు ఏడ్చాను. ఇప్పటివరకు మళ్లీ ఆమెతో కలిసి పని చేయలేదు’అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’సినిమాలో సీతగా నటించిన మెప్పించిన కృతి.. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్‌తో కలిసి గణపత్:పార్ట్‌వన్ 1 చిత్రంలో నటిస్తోంది. అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించి, కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. (చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్) -
నాగార్జున నెక్ట్స్ సినిమా ప్రకటన ఎప్పుడంటే..
‘ది ఘోస్ట్’ చిత్రం విడుదల తర్వాత నాగార్జున నెక్ట్స్ సినిమా గురించిన ప్రకటన రాని విషయం తెలిసిందే. అయితే ఆ సమయం ఆసన్నమైందని, ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రకటన అధికారికంగా వెల్లడి కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారని, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిసింది. -
త్వరలో జైలర్ నటుడి పెళ్లి, తలైవా ఆశీర్వాదాలు కూడా..
మాస్ ఫైటింగ్స్.. హీరోయిన్‌తో డ్యూయెట్స్.. ఇవేవీ లేకుండా సినిమా తీయొచ్చు.. హిట్టు కొట్టనూవచ్చు అని నిరూపించాడు తలైవా. తను స్లోమోషన్లో నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే తన ముందు మోకరిల్లుతాయని జైలర్‌తో చెప్పకనే చెప్పాడు. ఇప్పటికీ జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంంగా దూసుకుపోతూనే ఉంది. ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అందులో జాఫర్ సాదిఖ్ కూడా ఒకరు! ఈయన తమిళనాడులో ఫేమస్ కొరియోగ్రాఫర్. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసిన పావ కథైగల్ సిరీస్‌లో తొలిసారి నటించాడు. ఈ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్లో మాత్రమే ఆయన నటించాడు. తర్వాత అతడు వేందు తనైంతాతు కాదు అనే చిత్రంలో నెగెటివ్ రోల్లో మెరిశాడు. కానీ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ విక్రమ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ హిట్ జైలర్‌లో నటించి మరిన్ని మార్కులు కొట్టేశాడు. జైలర్ సినిమాలో జాఫర్ రజనీకాంత్‌ను కత్తితో భయపెట్టాలని చూస్తాడు.. అందుకుకానీ శివరాజ్‌కుమార్.. అతడిని ఫ్యాన్‌కు కట్టేసి తిప్పుతాడు. ఈ సీన్ చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ఇకపోతే త్వరలో ఇతడు పెళ్లిపీటలెక్కబోతున్నాడట. జాఫర్ కొంతకాలంగా తన కో డ్యాన్సర్ షెరిన్తో ప్రేమలో ఉన్నాడు. తనతో కలిసి అప్పుడప్పుడు రీల్స్ కూడా చేస్తుంటాడు. జైలర్ షూటింగ్ సమయంలో జాఫర్ తన ప్రియురాలిని రజనీకి పరిచయం చేశాడట. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ రజనీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట. మరి తన పెళ్లి తేదీ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి! ఇకపోతే సైతాన్ వెబ్ సిరీస్‌లోనూ నటించిన జాఫర్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. చదవండి: క్రికెటర్‌తో కూతురి ప్రేమాయణం.. దగ్గరుండి పెళ్లి చేసిన ప్రముఖ నటుడు 400కు పైగా సినిమాలు, మోసం చేసిన కూతురు.. చితికి డబ్బుల్లేని దుస్థితి.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు! -
ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు
రాకేశ్ మాస్టర్ తెలుగు హీరోలకు డ్యాన్స్ నేర్పించాడు, డ్యాన్స్‌లో స్టైల్ ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. వెండితెరపై ఎన్నో హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశాడు. టాప్ కొరియోగ్రాఫర్‌గా వెలుగు వెలిగిన ఆయన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేశ్ మాస్టర్ జూన్ 18న మరణించాడు. ఆయనకు గుర్తుగా విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. రాకేశ్ మాస్టర్‌కు అత్యంత సన్నిహితుడు, తన చివరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఓ డ్యాన్స్ షోలో వైష్ణవుడి వేషధారణలో బీభత్సమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు రాకేశ్ మాస్టర్. ఇది చాలామందికి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అందుకే ఆ వైష్ణవుడి వేషధారణలోనే రాకేశ్ మాస్టర్ గెటప్ ఉండేలా విగ్రహాన్ని రెడీ చేయిస్తున్నారు. ఎవరి దగ్గరా సాయం కోసం చేతులు చాచకుండా సొంత డబ్బుతోనే దీన్ని రెడీ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రాకేశ్ మాస్టర్ శిష్యుడు, కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రాకేశ్ మాస్టర్ విగ్రహం ఎలా ఉందో వీడియో రిలీజ్ చేశాడు. విగ్రహం ఎలా ఉందో కామెంట్స్‌లో తెలియజేయండని కోరాడు. అయితే చాలామందికి ఈ విగ్రహం నచ్చినట్లు లేదు. ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహంలా లేదు, పుల్లయ్యగాడి విగ్రహంలా ఉంది, మీకు ఏ ఫోటో దొరకలేదా భయ్యా? అస్సలు మ్యాచ్ కాలేదు అని కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. ఒకరైతే.. వీడు దేనికి పనికిరాని వెధవ అని కామెంట్ చేయగా బషీర్ అందుకు సేమ్ టు యూ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఈ విగ్రహం పూర్తిగా తయారవడానికి మరో నెల రోజులు పడుతుందని మరో వీడియోలో వెల్లడించాడు బషీర్. పూర్తిగా సిద్ధమైన తర్వాతైనా అందరికీ నచ్చుతుందో, లేదో చూడాలి! చదవండి: బతికుండగానే అంత్యక్రియలు, బ్యూటీ క్వీన్ కన్నుమూత -
రాకేశ్ మాస్టర్ కోసం ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమంది మాస్టర్లను తయారు చేసిన ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ఆయన మృతిపట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన పడిన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!) పరుచూరి మాట్లాడుతూ..' రాకేశ్ మాస్టర్‌తో ఎక్కువగా పనిచేయలేదు. ఆయన గురువైన ముక్కురాజుతో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశా. రాకేశ్ మాస్టర్ ఇక లేరంటూ టీవీలో చూడగానే షాకయ్యాను. తాజాగా వాళ్ల అబ్బాయి మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయండి అని చెప్పగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.' అంటూ విచారం వ్యక్తం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'రాకేశ్ మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఆయన అద్భుతాలు సృష్టించాడు. దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ , జానీ అనే ఇద్దరు అద్భుతమైన మాస్టర్లను తీర్చిదిద్దాడు. వాళ్లంతా వచ్చి ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది. ఆయన ఆవేదనను ఎవరైనా పట్టించుకుని ఉంటే ఆయన జీవితం ఇంకో రకంగా ఉండేది. కానీ ఎవరూ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయన జీవితానికి మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు.' అని అన్నారు. అలా జరిగి ఉంటే.. పరుచూరి మాట్లాడుతూ.. 'టాలీవుడ్లో ప్రస్తుతమున్న అప్‌కమింగ్ హీరోలు, అప్ కమింగ్ దర్శకులో ఎవరో ఒకరు మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. ఆయన షో చూస్తే నాకు అనుక్షణం ఆవేదనే కనిపించేది. ఎంతలా ఆవేదన అనుభవించాడో. మిత్రులారా.. ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకోండి. మనకు భగవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడు. మన జీవితంలో జరిగే స్ట్రగుల్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆయన ఆత్మ పరమాత్మను చేరుకుని.. శివుడి కూడా ఆయన లయ, విన్యాసాలు చూడాలని ఆశిస్తున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో జూన్ 18న ఆదివారం ఆకస్మాత్తుగా మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమందికి సాయంగా నిలిచిన డ్యాన్స్ మాస్టర్ మృతిని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. (ఇది చదవండి: Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్) టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే. అలాంటి మాస్టర్‌కు తోటి కొరియోగ్రాఫర్స్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఇవాళ హైదరాబాద్‌లోని బోరబండలో అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ విషాద సమయంలో ఆయనతో పనిచేసిన కొరియోగ్రాఫర్స్, స్టూడెంట్స్ సగర్వంగా తుది వీడ్కోలు పలికారు. సత్య, బషీర్ మాస్టర్‌తో పాటు మరికొందరు కొరియోగ్రాఫర్లు డ్యాన్స్ చేస్తూ సాగనంపారు. రాకేశ్ మాస్టర్ అంత్యక్రియల్లో భారీగా అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం (జూన్ 18న) కన్నుమూశారు. రక్త విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే! ఎందుకో తెలియదు కానీ శేఖర్ మాస్టర్, రాకేశ్ మాస్టర్ల మధ్య దూరం పెరిగింది. గురుశిష్యుల బంధం చెదిరిపోయింది. శేఖర్ మాస్టర్ పేరెత్తితే చాలు నిప్పులు చెరిగేవారు రాకేశ్. అటు శేఖర్ మాత్రం.. ఆయన ఎప్పటికీ తన గురువే అని చెప్తూ ఉండేవారు. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ తన గురువును చివరి చూపు చూసేందుకు వచ్చారు. దీనవదనంతో అక్కడికి చేరుకున్న శేఖర్ మాస్టర్ తన గురువును నిర్జీవంగా చూసి కంటతడి పెట్టుకున్నారు. జానీ మాస్టర్ సైతం రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం -
రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో సడన్ గా చనిపోయారు. ఒకప్పటి జనరేషన్ కు డ్యాన్స్ మాస్టర్ గా తెలిసిన ఆయన.. ఇప్పటి జనరేషన్ కి మాత్రం యూట్యూబ్ వీడియోలతో బాగా పరిచయం. పలు ఫన్నీ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో చాలామంది హ్యాపీనెస్ కు కారణమయ్యారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలాంటి టైంలోనూ వాళ్లు గుండె నిబ్బరం చేసుకుని ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి చెందిన రాకేశ్ మాస్టర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఈయన్ని చేర్చారు. అలా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయారు. అయితే తను చనిపోతానని కొన్నిరోజుల ముందే పసిగట్టిన రాకేశ్ మాస్టర్.. తన అవయవాల్లో పనికొచ్చే వాటిని దానం చేయాలని సూచించారట. ఈ విషయాన్ని ఆయన అసిస్టెంట్ సాజిద్ బయటపెట్టాడు. ఇదే విషయాన్ని డాక్టర్లకు చెప్పిన సాజిద్.. పోస్టుమార్టం చేసి, బాడీపార్ట్స్ తీసుకున్న తర్వాత తమకు అప్పజెప్పాలని, దహన సంస్కారాలు చేసుకుంటామని వాళ్లకు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఇక చూపులేని వారికి రాకేశ్ మాస్టర్ కళ్లని దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు సాజిద్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా తన అవయవాలని దానం చేయాలనే గొప్ప మనసు రాకేశ్ మాస్టర్ కు ఉందని తెలిసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ లాస్ట్ వీడియో) -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి సినిమా ఏదంటే?
తెలుగు చలన చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నృత్య దర్శకుడు ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్(53) ఆదివారం మృతిచెందారు. వారం క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం, భీమవరం వెళ్లి వచ్చిన ఆయన అప్పటినుంచి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 10 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ వైపు అడుగులు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ప్రాంతంలో రాకేష్ మాస్టర్ జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. 10 ఏళ్ల వయస్సులో డిస్కో డాన్స్ చూసి డ్యాన్సర్‌గా మారాలనుకున్నారు. కానీ, ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరు నేర్పుతారు? అని తెలియక టీవీలో వచ్చే పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతి టౌన్‌కి వెళ్లి ఓ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. తొలిరోజుల్లో కేవలం రూ.5 ఫీజుతో డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. ప్రభుదేవాపై సంచలన వ్యాఖ్యలు చాన్స్‌లు రాకపోవడంతో మళ్లీ తిరుపతికి వచ్చి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను నడిపారు. ఆ తర్వాత ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు రాకేష్ మాస్టర్. ‘ఆట’, ‘ఢీ’ లాంటి డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారాయన. ‘ఢీ’ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ షోకి ఓ జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు ప్రభుదేవాతో ‘తెలుగు తెలిసిన వాళ్లే జడ్జిలుగా ఉండాలి’ అంటూ కామెంట్స్ చేసి, వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. చిరునవ్వుతో సినిమాతో మొదలైన ప్రయాణం వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ లో ‘నిన్నలా మొన్నలా లేదురా..’ పాటతో సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా తొలి అవకాశం అందుకున్నారాయన. ఆ తర్వాత ‘లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతారామరాజు, యువరాజు, గర్ల్ ఫ్రెండ్, బడ్జెట్ పద్మనాభం, మనసిచ్చాను, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు’ వంటి దాదాపు 1500 చిత్రాలకుపైగా కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్. ‘గ్లోబల్ పీస్ యూనివర్సిటీ’ నుంచి డాక్టరేట్‌ను అందుకున్నారాయన. ప్రభాస్ వంటి పలువురు హీరోలకు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చారు. కామెడీ షోలోనూ పార్టిసిపేట్ చేసిన రాకేశ్ టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం తెలుగులో అగ్ర కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం. ఓ టీవీ చానల్లో ప్రసారం అవుతున్న షోలో పలు స్కిట్లు చేసి, బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన శైలిలో నవ్వించారు రాకేష్ మాస్టర్. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. యూట్యూబ్ చానల్స్ వేదికగా పలువురు సెలబ్రిటీలపై వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చి ఇటీవల మళ్లీ ట్రెండ్ అయ్యారాయన. వివాదాలతో కుటుంబానికి దూరం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారి అభిమానుల నుంచి రాకేష్ మాస్టర్‌కి, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చేవి. ఈ కారణంగా ఆయన కుటుంబానికి దూరంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో ఉంటూ వచ్చారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు చరణ్‌తేజ్, కుమార్తె శ్రీజ ఉన్నారు. రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని బోరబండలో నేడు రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే.. ‘‘ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ని గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. డయాబెటిక్ పేషెంట్ కావడం, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి సాయంత్రం 5గంటలకు మృతి చెందారు’’ అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మీడియాకు తెలిపారు. చదవండి: డబ్బులు తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలు.. రెడ్ నోటీసులిచ్చేందుకు చిత్రమండలి రెడీ -
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
-
Rakesh Master: రాకేశ్ మాస్టర్ మృతి.. వైద్యులు ఏమన్నారంటే?
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం(జూన్ 18న) సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. 'వాంతులు, విరోచనాలు అవుతున్నాయని రాకేశ్ మాస్టర్‌ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. అడ్మిట్ అయిన గంటకే ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన్ను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మరణించారు' అని పేర్కొన్నారు. చదవండి: శేఖర్ మాస్టర్‌తో గొడవ.. కానీ ఎందుకో ఇప్పటికీ తెలియదు కాగా రాకేశ్ మాస్టర్ లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
Rakesh Master: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ వీడియో వైరల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసిన ఆయన రియల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఆయన కుటుంబానికి సైతం దూరంగా ఉన్నారు. ఆయన తన చావును ముందే పసిగట్టాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. 'నాకు మోకాళ్ల నొప్పులు.. నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. తెలుసు, నేను అస్తమించే సూర్యుడిని.. నాకన్నీ తెలుసు' అంటూ బాధతో మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు బాధగా ఉంది మాస్టర్, మీ మాటలు వింటుంటే ఏడుపొస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by CELLULOID PANDA (@celluloid_panda) చదవండి: ఒక్కమాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ రక్త విరోచనాలు, కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి -
Rakesh Master: అనాథాశ్రమంలో జీవితం వెల్లదీసిన రాకేశ్ మాస్టర్, ఎందుకంటే?
టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్‌గా కీర్తి గడించిన రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆయన ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. గత కొంతకాలంగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్న రాకేశ్ మాస్టర్ వేరు, అంతకుముందున్న మాస్టర్ వేరు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్.. ఇలా ఎంతో కీర్తి పొందిన ఆయన కొంతకాలం క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్‌లోని అనాథాశ్రమంలో చేరారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా చివరి రోజుల వరకు అదే ఆశ్రమంలో జీవించారు. మానసికంగా కుంగిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో అనాథాశ్రమానికి వెళ్లానని రాకేశ్ మాస్టరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 'నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. అదే నాకు సమస్యలు తెచ్చిపెట్టింది. మణికొండలో కారు పార్కింగ్ విషయంలో ఇంటి యజమానితో గొడవ జరిగింది. అక్కడెందుకు ఉండటమని నా భార్య దగ్గరకు వెళ్లిపోయా. అక్కడికి వెళ్లగానే గొడవ మొదలైంది. ఆమె.. మీరు రావొద్దండీ.. మీ వల్ల నా పిల్లలకు హాని అన్నారు. నా ఇంటర్వ్యూ వల్ల పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నా కొడుకు చరణ్‌ను కొట్టారు. చదవండి: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ అందుకే ఆమె అలా మాట్లాడింది. ఎక్కడికైనా వెళ్లిపోండి, ఆఖరికి నేను చచ్చిపోయినా రానని అనేసింది. తన మాటల్లోని బాధ నాకు అర్థమైంది. అందుకే కుటుంబానికి దూరమయ్యాను. అయితే ఓ మహిళ నాకు అన్ని పనుల్లో సాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నావెంటే వచ్చేది. కొంతమంది.. ఆమెను నా మూడో భార్య అని రాశారు. అందరి ముందు ఆమె పరువు పోతుందని, తనతో సహజీవనం చేస్తున్నానని చెప్పాను. ఎవరూ పట్టించుకోనప్పుడు తను నాకు సమయానికి తిండి పెట్టిందని నెత్తిన పెట్టుకున్నాను. కానీ ఆమె నా డబ్బులే దోచుకుంటూ నన్ను, నా కుటుంబాన్ని నిలువెల్లా ముంచింది. నా పరువుప్రతిష్టలు బజారునపడేసింది. నన్ను వశీకరణ చేయాలనుకుంది. తనవల్ల నా కుటుంబానికి మరింత దూరమై మనోవేదనకు గురయ్యాను. అందుకే అనాథాశ్రమంలో చేరాను' అని చెప్పుకొచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రక్త విరోచనాలు.. రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. రాకేష్ మాస్టర్ సినీ పరిశ్రమలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరు. 10 సంవత్సరాల వయస్సులో అతను డిస్కో డాన్సర్‌ని చూసి డ్యాన్సర్‌గా మారాలని అనుకున్నారు. కానీ డ్యాన్స్ ఎవరు నేర్పుతారు..? ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. దీంతో అతనే టీవీలో వచ్చే వైవిధ్యమైన పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతికి వెళ్లి అక్కడ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. కేవలం రూ. 5 ఫీజుతో చాలా మంది విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అందుకోసం మద్రాసు వెళ్లిపోయారు. తన టాలెంట్‌కి అక్కడ విలువ లేదని మళ్లీ తిరుపతికి వచ్చి ఇన్స్టిట్యూట్ను నడిపారు. (ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత) రాకేష్ మాస్టర్‌కు టర్నింగ్ పాయింట్ ఇదే.. ఢీ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాకు సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. తెలుగు గురించి తెలిసిన వాళ్లే జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వాళ్లే వచ్చి ఈ షోలో పాల్గొని మన దమ్ము ఏంటో చూపించాలని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. తెలుగు డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఢీ వేదికగా ప్రపంచానికి తెలియజేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే! ప్రభుదేవా అప్పటికే స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు రాకేష్ మాస్టర్. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ పరిచయం అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న చాలా మంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం పొందినవారే. శేఖర్ మాస్టర్‌తో విబేదాలు టాలీవుడ్లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్ కూడా ఆయన శిష్యుడే.. కానీ వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై శేఖర్ మాస్టర్ పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఒకరోజు ఫేస్బుక్ లైవ్ చాట్‌లో రాకేష్ మాస్టర్‌తో మీ గొడవ ఏమిటి? అని ఓ అభిమాని ప్రశ్నకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. తనపై మాస్టర్‌కు ఉన్న కోపానికి కారణం ఏంటో తెలియదు. కానీ ఆయన మాటల చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపాడు. గొడవకు కారణం ఇప్పటికీ సస్పెన్సే రాకేష్ మాస్టర్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ శేఖర్‌తో గొడవకు గల కారణాలను తెలపకుండానే కొన్ని ఆరోపణలు చేసేవారు. వారి మధ్య ఏం జరిగింది? అని అడిగితే అసలు విషయం చెప్పకుండా దాటవేసేవారు. వారి మధ్య జరిగిన విషయాలు చెప్పకుండా వాళ్ల పాప బర్త్ డేకు పిలవలేదు, చిరంజీవి సాంగ్ చేస్తే చెప్పలేదు అని శేఖర్‌పై ఫైర్ అయ్యేవారు. దీంతో ఇప్పటికీ వారి మధ్య గొడవకు కారణం మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?) -
Rakesh Master Unseen Photos: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (ఫొటోలు)
-
Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. ఆదివారం ఉదయం ఆయన రక్తవిరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్.. ఆ తరువాత లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫర్‌గా పని చేశారు. ఆ గొప్ప డ్యాన్సర్లు ఈయన శిష్యులే దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! రాకేశ్ మాస్టర్ మరణవార్త గురించి ఆయన అసిస్టెంట్ సాజిత్ మాట్లాడుతూ.. 'హనుమాన్ క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు రాకేశ్ మాస్టర్‌కు విరోచనాలు, వాంతులు జరిగాయి. అప్పుడు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కాళ్లు, చేతులు పడిపోవడంతో ఈయన బతకడం కష్టమని డాక్టర్లు అప్పుడే చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు అవుతోంది. వారం రోజుల క్రితం ఓ ప్రాజెక్ట్ షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం, భీమవరం వెళ్లి ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారు. అప్పటినుంచి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన కాళ్లు, చేతులు పడిపోయాయి అని ఫోన్ వచ్చింది. పక్షవాతంలాగా అనిపిస్తోందని ఇంటిసభ్యులు చెప్పారు. ఇంతలోనే ఆయన మరణించినట్లు తెలిసింది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: శ్రీజతో విడాకులు.. కన్ఫర్మ్ చేసిన కల్యాణ్ దేవ్ -
ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. జబర్దస్త్‌లో కన్నా ఢీలో తక్కువ పారితోషికం ఇస్తారని, ఇక్కడ పేరు మాత్రమే వస్తుందని ఆయన వాపోయాడు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం చైతన్యకు అప్పులుండే అవకాశమే లేదని చెప్తూ వస్తున్నారు. తాజాగా చైతన్య తల్లి లక్ష్మి రాయ్ ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'కాస్ట్యూమ్స్‌కు డబ్బులు కావాలంటూ రెండు, మూడు వేలు నా దగ్గర తీసుకునేవాడు. మీకు తెలియని ఇంకో విషయమేంటంటే.. ఢీ ఫైనల్ కోసం రూ.3,50,000 అడిగాడు. మా ఆయన్ని అడిగితే ఒప్పుకోలేదు. వాడిని చెడగొడుతున్నావు, డబ్బులివ్వను అన్నాడు. ఒక రోజంతా అలిగి కూర్చుంటే ఆ డబ్బంతా తెచ్చి ఇచ్చాడు. అమ్మ, నేను గెలిస్తే రూ.7,50,000 వస్తాయి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలియలేదు. ఇలా రెండుసార్లు జరిగింది. ఢీ షోకి వెళ్లిన తర్వాత దాదాపు రూ.6 లక్షల దాకా ఇచ్చాను. ఇంత చేసినదాన్ని ఏదైనా అప్పులున్నాయంటే తీర్చకపోయేదాన్నా? అప్పుల వల్ల చనిపోయాడనే మరక ఉండకూడదనే నా బాధ. ఢీ షోలో పేమెంట్స్ ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఢీ లేకపోతే మా అబ్బాయి లేడు. వాడికి ఇంత గుర్తింపు ఢీ వల్లే వచ్చింది' అని చెప్పుకొచ్చింది చైతన్య తల్లి. చదవండి: క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్‌చరణ్ నావల్ల హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందన్నారు: నవదీప్ -
ఢీలా పడుతున్నారా?
-
నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం.. చైతన్య తల్లి ఎమోషనల్
నెల్లూరు(క్రైమ్): ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మృతదేహానికి నెల్లూరు ప్రభుత్వ వైద్యులు సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా స్వగ్రామానికి తరలించారు. వివరాలు.. లింగసముద్రం మండలం ముత్తంవారిపాళెం గ్రామానికి చెందిన సి.చైతన్య(32)కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. అమ్మ, నాన్న, చెల్లెలితో హైదరాబాద్‌లో ఉంటూ పలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే రియాల్టీ షోల్లో కొరియోగాఫర్గా వ్యవహరిస్తున్నాడు. ఐదేళ్లుగా ఢీ షోలో ఓ బృందానికి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. దీని ద్వారా వచ్చే రెమ్యునరేషన్ తన మెయింటినెన్స్, తనను నమ్ముకున్న డ్యాన్సర్లకు సరిపోయేది కాదు. దీంతో అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన నెల్లూరు క్లబ్‌లోని ఓ గదిలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై మృతుడి బాబాయి మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. చైతన్య తల్లిదండ్రులు హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు. చైతన్య సెల్ఫీ వీడియో ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయన అభిమానులు, స్నేహితులు, డ్యాన్సర్లు పదుల సంఖ్యలో సోమవారం నెల్లూరు జీజీహెచ్‌లోని మార్చురీ వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. డ్యాన్స్‌లో మెళుకువలు నేర్పడంతోపాటు తమను నడిపించిన మాస్టర్ చైతన్య భౌతికకాయాన్ని చూసి పలువురు డ్యాన్సర్లు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధువులు, డ్యాన్సర్లు, స్నేహితుల అశ్రునయనాల నడుమ చైతన్య మృతదేహాన్ని కుటుంబసభ్యులు తమ స్వగ్రామానికి తరలించారు. నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం. ఇలా చేస్తాడని అనుకోలేదు. నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. అప్పుల కోసం చనిపోతాడని ఊహించలేదు. ఆత్మహత్య చేసుకునే 15 నిమిషాల ముందు నాతో ఫోన్లో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్‌గా ఉన్నావు నవ్వూతూ ఉండమని చెబితే సరే అన్నాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ కట్ చేయక ముందు జామాయిల్ చెట్లు అమ్మాను.. రూ.4 లక్షలు వస్తున్నాయని చెప్పాను. అప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను వాడి వద్ద ఏది దాచేదాన్ని కాదు. డబ్బులదేముంది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని చెప్పేవాడు. ఓ సారి ఫోన్ చేసి నీవు ఇంటికి రాలేదంటే నేను చచ్చిపోతా అంటే.. నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కూడా బెర్త్ కన్ఫామ్ చేయమ్మా అన్నాడు. ఇప్పుడేమో ఒక్కడే వెళ్లిపోయాడు. నేను చచ్చిపోతున్నా.. నువ్వు కూడా రా అమ్మ అంటే.. నేను కూడా వెళ్లేదాన్ని కదా. – చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం పదేళ్ల ప్రయాణం మా ఇద్దరిది పదేళ్ల ప్రయాణం. చైతన్య చాలా సెన్సిటివ్ మనస్తత్వం. తన పక్కనుండే వారూ బాగుండాలని కోరుకుంటాడు. ఎవరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండేవాడు. రెండు రోజుల క్రితం తనతో మాట్లాడాను. ఎప్పుడూ అప్పులున్నాయని చెప్పలేదు. – చిట్టి, డ్యాన్స్‌మాస్టర్ చైతన్య లేడని ఊహించలేను ఇద్దరం పక్కపక్క సీట్లలోనే ఉండేవాళ్లం. ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. అప్పులున్నాయని ఎప్పుడూ చెప్పలేదు. ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదు. మాటలు రావడం లేదు. – పండు, డ్యాన్స్‌మాస్టర్ -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్‌పై స్పందించిన యాంకర్ రష్మీ
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే!అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. చదవండి: ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు స్వయంగా వెల్లడించాడు. ఇక చైతన్య మాస్టర్ మరణంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా తాజాగా ఆయన మరణంపై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించింది. నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. నీ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది. చదవండి: వెక్కి వెక్కి ఏడ్చా.. చైతన్య మాస్టర్ మరణంపై శ్రద్ధాదాస్ ఎమోషనల్ పోస్ట్ -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వారి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను తన సహచరులతో పంచుకున్నారు. (ఇది చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి) నెల్లూరులోని ఓ హోటల్లో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ వీడియోలో చైతన్య వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. (ఇది చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?) -
ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఘటన టాలీవుడ్లో సంచలనంగా మారింది. అప్పుల బాధలు తట్టుకోలేకనే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి, ఉరేసుకొని చనిపోయాడు. అయితే చైతన్య అప్పులపాలయ్యాడంటే స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు. భారీగా అప్పులు చేసే అవసరం తనకు లేదని, ఒకవేళ అప్పులైనా తీర్చేంత ఆస్తులు తన కుటుంబానికి ఉన్నాయని చెబుతున్నారు. ఇక చైతన్య తల్లి లక్ష్మీ రాజ్యం అయితే తన కొడుకు అప్పుల బాధతో చనిపోయాడనేది అబద్దం అంటున్నారు. అన్ని సమస్యలు ఉన్నా.. తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆత్మహత్యకు 15 నిమిషాల ముందు నాతో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్‌గా ఉన్నావ్.. నవ్వుతూ ఉండమని చెప్పా. ‘పెద్ద పెద్ద వాళ్లు నీకు సన్మానం చేస్తున్నారు. అందరితో పరిచయాలు పెంచుకొ’ చెప్పా. సరే అన్నారు. ఆ తర్వాత 15 నిమిషాలకే సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. (చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ) అంతకు ముందు టెంపుల్‌కి వెళ్లాలి ఇంటికి రా అంటే.. ‘నాక్కుడా చిరాకుగా ఉందమ్మా..గుడికి వెళ్దాం.. ప్లాన్ చెయ్’ అన్నాడు. ఇప్పుడు నన్ను వదిలి అన్యాయం చేశాడు. గతంలో ఒక్కసారి ఫోన్ చేసి ‘నువ్వు ఇంటికి రా లేదంటే చచ్చిపోతా’అంటే.. ‘నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కుడా ఒక బెర్త్ కన్ఫామ్ చేయమని అన్నాడు. మరి ఇప్పుడు ఒక్కడే వెళ్లిపోయాడు. ‘నేను చనిపోతున్న.. నువ్వు కూడా రా అమ్మా’అంటే నేను కూడా వెళ్లేదాన్ని కదా’ అని చైతన్య తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్ ) ఇంకా మాట్లాడుతూ.. ‘డబ్బుల కంటే ఎక్కువగా ఆరోగ్యం కాపాడుకోవాలని తరచూ చెప్పేవాడు. ‘పిల్లలకు మంచి ఫుడ్ పెడితేనే మనల్ని గౌరవిస్తారు. డబ్బులదేముంది. ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ’అని చెప్పేవాడు. ఇప్పుడు డబ్బులు వల్లే నేను చనిపోతున్నానని అనడమే నాకు నచ్చట్లేదు. అడిగితే నేను ఇవ్వానా? తనకు అప్పులున్నాయనే విషయం ఫ్రెండ్స్‌కి కూడా చెప్పకపోవడం బాధేస్తుంది. నన్నుమోసం చేసి పోయాడు. వాడు చేసిన పనికి ఏడుపు కూడా రావడం లేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నా జీవితమే వాడు. వాడి కోసం ఎన్నో బాధలు పడ్డా. డబ్బుల విషయం ఏముంది? అది నాకో లెక్క కాదు. వాడు చనిపోయాడనే దానికంటే.. నాకు ద్రోహం చేశాడనే బాధే ఎక్కువగా ఉంది’అంటూ ఆమె ఎమోషనల్ అయింది. -
చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ
కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధ భరించలేకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అయితే తనకు తెలిసినంతవరకు చైతన్యకు ఎలాంటి అప్పులు లేవని ఆయన మేనమామ అంటున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. చైతన్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అలాగని తనకు పెద్ద మొత్తంలో అప్పులున్నాయని కూడా నేను అనుకోవడం లేదు. తనకు లక్షల కొద్ది అవసరం ఏముంటుందని? అయినా అంత అప్పు ఎవరిస్తారు? మహా అయితే ఏదో పది, పదిహేను వేలు అప్పు చేసి ఉంటాడంతే! ఇంకేదో జరిగింది. చైతన్య చెల్లి పెళ్లి కూడా మేమే చేశాం. తను రూపాయి ఇవ్వలేదు. అతడు చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నాడు. తన ఆదాయంపై కుటుంబం ఏనాడూ ఆధారపడలేదు. తను సంపాదించిందేమీ ఇంటికి పంపించేవాడు కాదు. పైగా తనకు అవసరమైనప్పుడల్లా వీళ్లే చైతూకు తిరిగిచ్చేవాళ్లు. తనకు ఊర్లో 30 ఎకరాల భూమి ఉంది. అప్పులు కాకుండా మరింకేదైనా కారణం ఉండొచ్చు' అని అనుమానం వ్యక్తం చేశాడు ఆయన మేనమామ. కాగా చైతన్య మరణంపై పలువురు డ్యాన్సర్లు, సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చైతన్య మాస్టర్ ఓ ఈవెంట్ ఒప్పుకున్నాడని, తీరా సమయానికి కొందరు డ్యాన్సర్లు ఆయనకు హ్యాండ్ ఇవ్వడంతో మేనేజ్మెంట్ టీమ్ పేమెంట్ ఇవ్వకుండా ఆపేసిందని డ్యాన్సర్, కండక్టర్ ఝాన్సీ పేర్కొంది. ఈవెంట్‌కు వచ్చిన మిగతా డ్యాన్సర్లకు డబ్బులు ఇచ్చేందుకు మాస్టర్ వేరే వాళ్ల దగ్గర అప్పు చేశాడని, బహుశా ఆ ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆమె అభిప్రాయపడింది. చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య, గుండె బద్ధలైందన్న శేఖర్ మాస్టర్ రూ.7 లక్షలు రావాల్సి ఉంది.. పేమెంట్ ఇవ్వలేదు: కండక్టర్ ఝాన్సీ -
చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధలు తాళలేకపోతున్నానంటూ ఉరేసుకుని చనిపోయారు. చైతన్య మాస్టర్ మరణంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో నటి శ్రద్దా దాస్.. మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనలైంది. 'పుట్టుక, చావు ఎప్పుడు? ఎందుకు? జరుగుతాయో అంతుచిక్కవు. కానీ జననమరణానికి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మనల్ని గొప్పవారిలా చేస్తుంది. నిజంగా చెప్తున్నా.. చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నవ్వుతూ అందరినీ నవ్వించేవాళ్లు. కానీ ఈరోజు నన్ను ఎంతగానో ఏడిపించారు. మీ స్మైల్ నాకెప్పటికీ గుర్తుండిపోతుంది' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ మేరకు అతడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. చైతన్య మరణంపై శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. నీలాంటి టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్‌ను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త వినగానే నా గుండె ముక్కలయింది. చాలా డిస్టర్బ్ అయ్యాను. నీ చిరునవ్వు ఎన్నటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. యాంకర్ రష్మీ సైతం స్పందిస్తూ.. 'చావు అన్నింటికీ పరిష్కారం కాదు మాస్టర్. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. 'అమ్మానాన్న, చెల్లి.. ఐ లవ్యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివ్వలేదు. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కానీ కుదురలేదు. అప్పులయ్యాయి. తీర్చగలను కానీ తీర్చలేకపోతున్నా. తట్టుకోలేకపోతున్నా. ఢీ పేరు ఇస్తుందని కానీ సంపాదన తక్కువ. జబర్దస్త్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ' అని వీడియోలో పేర్కొన్నారు. ఇది చూసిన చైతన్య అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) చదవండి: మొన్ననే నాకు మాటిచ్చాడు, అంతలోనే ఇంత దారుణం: ఝాన్సీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య -
అన్నయ్య, ఎందుకింత పని చేశావు?: కండక్టర్ ఝాన్సీ ఎమోషనల్
ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని ఆయన వాపోయారు. తాజాగా ఆయన మరణంపై డ్యాన్సర్ ఝాన్సీ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. 'చైతన్య అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల తన కుటుంబం బాధపడుతోంది. తను డబ్బులు ఇవ్వాల్సిన కళాకారులతో కూర్చుని మాట్లాడాల్సింది. ఎందుకంటే.. అందరూ తనతో కలిసి ప్రయాణం చేసినవాళ్లే! నా పరిస్థితి ఇలా ఉంది, చచ్చిపోవాలనిపిస్తోందని చెప్పుంటే ప్రతి ఒక్క డ్యాన్సర్ కరిగిపోయేవాళ్లు. మా కళాకారులు డబ్బులు ఇవ్వమని వేధించేంత కఠినమైనవాళ్లు కాదు. అన్నయ్య.. ఎందుకింత పని చేశావో అర్థం కావడం లేదు. మీరెంత మంచివాళ్లంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటివారికి సాయం చేసేవాళ్లు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో అన్నయ్యకు కొంత డబ్బు రావాల్సి ఉంది. కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. కానీ మిగతా కొంతమంది ఆర్టిస్టులు అన్నయ్యకు హ్యాండిచ్చారు. దీంతో కమిటీ వాళ్లు రూ.6-7 లక్షలు పేమెంట్ ఇవ్వకుండా ఆపేశారు. అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు తమకు డబ్బులివ్వకపోతే ఊరుకోరు కాబట్టి చైతన్య అన్నయ్య వేరే దగ్గర అప్పు తెచ్చి వాళ్లకు డబ్బులిచ్చారు. కళాకారులకు అన్యాయం చేయకూడదన్న మనస్తత్వం ఆయనది. ఇలా పేమెంట్ సర్దే క్రమంలో అప్పు మీద అప్పు చేస్తూ తను ఇబ్బందిపడ్డారు. నాలుగైదు రోజుల క్రితమే ఆయన్ని కలిశాను. నాకు ఢీ షోలో కనిపించాలనుంది, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే నెక్స్ట్ సీజన్లో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నా తన కింద ఉన్న కళాకారులకు ఎంతో మర్యాద ఇస్తారు' అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది కండక్టర్ ఝాన్సీ. చదవండి: దుబాయ్‌లో లగ్జరీ విల్లా కొన్న మహేశ్‌బాబు డీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య -
ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య అప్పుల బాధ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరు క్లబ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?) 'మమ్మీ, డాడీ, చెల్లి నన్ను బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానీయలేదు. చెల్లి ఫీల్ అవ్వొద్దు. లవ్ యూ అమ్మా. నా సహచరులందరికీ సారీ. నేను చాలామందిని ఇబ్బంది పెట్టేశా. మీ అందరికీ సారీ. డబ్బు విషయంలో నా మంచితనాన్ని కోల్పోయా. అప్పులు చేయడమే కాదు.. తీర్చే సత్తా ఉండాలి. సత్తా ఉంది.. కానీ నా వల్ల అవ్వట్లేదు. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నా. ఇది నా లాస్ట్ డే. అప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. నా వల్ల ఇబ్బంది పడిన వారందరికీ సారీ. డ్యాన్స్ షోతో నాకు పేరు వచ్చింది. కానీ తగినంత సంపాదన రాలేదు.' అంటూ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. (ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by ROCK N ROLL DANCE STUDIO (@team_rds_1) -
విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ కన్నుమూశారు. అతనిది సహజ మరణం కాదని, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే సూసైడ్‌కు గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాజేష్ మాస్టర్‌కు మంచి పేరు ఉంది. పలు సినిమాల్లో ఆయన పనిచేశారు. కాగా రాజేష్ మాస్టర్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ మాస్టర్ మరణవార్త తనను షాక్‌కి గురి చేసినట్లు ప్రముఖ నటి బీనా ఆంటోనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ప్రేమ్ రక్షిత్
-
Oscar Naatu Naatu: నాటునాటు ప్రేమ్‌రక్షిత్.. నాటి నుంచి నేటివరకు (అరుదైన ఫోటోలు)
-
డాన్స్ మాస్టర్ బృందా దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘థగ్స్’. ఈ చిత్రం ద్వారా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయమవుతున్నారు. తమీన్స్ సింహ, ఆర్కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ ముఖ్య పాత్రలు చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో జియో స్టూడియోస్‌తో కలిసి రియా శిబు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్స్‌ని విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తీ సురేష్ విడుదల చేశారు. తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ బృందా గోపాల్ మాట్లాడుతూ..‘‘కోనసీమ నేపథ్యంలో జరిగే రా యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి శామ్ సీఎస్ సింగీతం అందించారు. -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్‌గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు. అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్లోనే విన్నర్‌గా నిలిచారు సందీప్. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
బాత్రూమ్లోకి వెళ్లి గంటన్నర ఏడ్చా: నాటు నాటు కొరియోగ్రాఫర్
ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో నాటు హిట్ కొట్టింది. సినిమానే కాదు అందులోని పాటలూ విదేశీయులతో ఈలలు కొట్టించేలా చేశాయి. మరీ ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల్ని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికే నాటునాటు బెస్ట్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు అందుకుంది. ఈ పాటకు కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేశాడు. హుక్ స్టెప్ కోసం 50 రకాల మూవ్మెంట్స్ సిద్ధం చేస్తే డైరెక్టర్‌కు ఇప్పుడున్నది నచ్చింది. చరణ్, తారక్ ఇద్దరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే అయినా పర్ఫెక్ట్ సింక్ కోసం దాదాపు 46 రీటేకులు తీసుకున్నారు. ఎట్టకేలకు నాటునాటు పాట అంతర్జాతీయ స్థాయిలో మార్మోగడంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నప్పుడు కొద్దిక్షణాలపాటు నాకేమీ అర్థం కాలేదు. వాష్‌రూమ్‌లోకి వెళ్లి గంటన్నరపాటు ఏకధాటిగా ఏడ్చాను. రాజమౌళి సర్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. తారక్ అన్నయ్య, చరణ్ సర్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. కీరవాణి సర్ అందించిన సంగీతంతో ఇద్దరూ రెచ్చిపోయి ఆడారు. ఫుల్ ఎనర్జీతో సాగే ఈ డ్యాన్స్ రిహార్సల్స్‌లో హీరోలు కాసేపు కూడా బ్రేక్ తీసుకునేవారే కాదు. మంచి స్టెప్స్ డిజైన్ చేయడానికి నాకు రెండు నెలలు పట్టింది. వాటిని పర్ఫెక్ట్గా చేయాలన్న కసితో హీరోలు 20 రోజులు రిహార్సల్స్ చేశారు. ప్యాకప్ చెప్పేశాక రాజమౌళి సర్ మాతో కలిసి ఆ స్టెప్ నేర్చుకునేవారు. మేము పొద్దున ఆరింటికి లేచి రాత్రి పదింటికి పడుకునేవాళ్లం. ఈ సినిమా కోసం అందరం ఎంతగానో కష్టపడ్డాం' అని చెప్పుకొచ్చాడు ప్రేమ్ రక్షిత్. చదవండి: నాటు నాటు సాంగ్‌కు మరో అవార్డ్, ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తున్న మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య ఎన్ని కోట్లు రాబట్టిందంటే? -
చిరు, బాలయ్యలో ఉన్న కామన్ క్వాలిటీ అదే: శేఖర్ మాస్టర్
‘‘చిరంజీవి, బాలకృష్ణగార్లలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అంటే వారి అంకితభావం, సమయపాలన. ఏ డ్యాన్స్ మూమెంట్‌ని అయినా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేంతవరకూ రిలాక్స్ అవ్వరు’’ అన్నారు నృత్యదర్శకుడు వీజే శేఖర్. చిరంజీవీ టైటిల్ రోల్లో, రవితేజ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా వరుసగా జనవరి 13, జనవరి 12న రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ‘వాల్తేరు వీరయ్య’లోని అన్ని పాటలకు, ‘వీరసింహారెడ్డి’లోని రెండు పాటలకు (సుగుణసుందరి, మా భావ మనోభావాల్) కొరియోగ్రఫీ చేశారు శేఖర్. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ ఒకేసారి సంక్రాంతి సమయంలోనే రిలీజ్ అవుతాయనుకోలేదు. కాబట్టి ఈ సినిమాల్లోని పాటలకు నృత్యరీతులు సమకూర్చేప్పుడు పెద్దగా ఆందోళనపడలేదు. కానీ ఇప్పుడు రెండు చిత్రాలూ సంక్రాంతికే వస్తుండటంతో ఒకవైపు ఆందోళనగా మరోవైపు సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి నాకు పెద్ద పండగ అని చెప్పగలను. ఇక సోషల్ మీడియాలో కొన్ని మూమెంట్స్ రీల్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఈ మూమెంట్స్ బాగుంటే వీటి తాలూకు పాటలను, కంటెంట్‌ను బట్టి సినిమాను ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. సో.. సిగ్నేచర్ స్టెప్స్ ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేలా అనిపిస్తోంది. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నేను సిగ్నేచర్ స్టెప్స్‌ను ఫాలో అవుతూ వస్తున్నాను. అలాగే సీనియర్లకు కొన్నిసార్లు మూమెంట్స్‌ని బట్టి రెండు, మూడు ఆప్షన్లు రెడీ చేసుకుంటుంటాం. ఇక దర్శకత్వ ఆలోచన ఉంది కానీ ఎప్పుడో కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం మహేశ్‌బాబు–త్రివిక్రమ్‌గార్ల కాంబినేషన్ సినిమా, రవితేజగారి ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. -
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
మాజీ భర్తకు కాజల్ సర్ప్రైజ్.. విడాకులు తీసుకున్న పదేళ్లకు..!
తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్. అతను నటి కాజల్ పశుపతిని వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని విభేదాల కారణంగా ఈ జంట 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ తాజాగా అకస్మాత్తుగా మాజీ భార్య కాజల్ అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చింది. విడాకులు తీసుకుని పదేళ్లకు ఆమె శాండీ ఇంటికి వెళ్లడంతో షాక్‌కు కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. అయితే ఇటీవలే శాండీ ఇంటికి వెళ్లిన కాజల్ పసుపతి అతని భార్య సిల్వియా, ఇద్దరు పిల్లలు లాలా, షాన్ మైఖేల్‌తో మాట్లాడారు. అంతే కాకుండా శాండీ కుటుంబంతో ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. విడాకుల తర్వాత కూడా ఈ జంట కలవడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా మంచి స్నేహం కొనసాగించడంపై కాజల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసిన కాజల్.. 'శాండీ, సిల్వియా మీరు, మీ పిల్లలు సంతోషంగా ఉండాలి" అంటూ తన ఫేస్బుక్లో రాసుకొచ్చింది. గతంలో శాండీ, సిల్వియా వివాహంపై కాజల్ విమర్శలు చేసింది. కానీ ఆ తర్వాత శాండీకి శుభాకాంక్షలు తెలిపింది. తమ విడాకులపై శాండీని నిందించవద్దని.. అలాగే అతని రెండో భార్యను లక్ష్యంగా చేసుకోవద్దని ఆమె తన అభిమానులను అభ్యర్థించింది. కాగా.. 2019లో కాజల్ ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించింది. View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) -
కొరియోగ్రాఫర్ కణల్ కన్నన్ బెయల్‌పై నిబంధనలు రద్దు
తమిళసినిమా: సినీ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ బెయిల్‌పై మద్రాసు హైకోర్టు సడలింపు ఆదేశాలు జారీ చేసింది. ఆ మధ్య స్థానిక మదురవాయిల్‌లో హిందూ మున్నని పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఈయన అరెస్టయిన విషయం తెలిసిందే. అనంతరం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. నాలుగు వారాల పాటు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు విచారణ అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో కణల్ కన్నన్ షూటింగ్ నిమిత్తం ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సి ఉండడంతో తన బెయిల్‌పై నిబంధనలను రద్దు చేయాలని దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి జగదీష్ చంద్ర ఒక వారం పాటు కణల్ కన్నన్ బెయిల్‌పై నిబంధనలు రద్దు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. -
డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
హైదరాబాద్‌లొ మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా తరుచుగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. హఫీజ్‌పేట్ గోకుల్ ఫ్లాట్స్‌లో నిందితుడు గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 10గ్రాముల డ్రగ్స్, రూ55వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరబిక్ ట్యూటర్ అష్రఫ్ బేగ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 13 గ్రాముల కొకైన్, రూ 65 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల ఫోన్స్‌ను సీజ్ చేశారు. -
హీరోగా మారిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘యథా రాజా తథా ప్రజా’ సినిమా ఆరంభమైంది. శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరోగా, శ్రష్టి వర్మ నాయికగా నటిస్తున్నారు. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభ మైంది. ముహూర్తపు సన్నివేశానికి సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో శర్వానంద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘జానీ మాస్టర్ అంటే డ్యాన్స్, కమర్షియల్ అంశాలు కాకుండా మంచి కథతో వస్తే బాగుంటుందని ‘యథా రాజా తథా ప్రజా’లో నటిస్తున్నాను. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు జానీ. ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: సునోజ్ వేలాయుధన్. Thank you for gracing the Pooja Ceremony of my new film #YathaRajaTathaPraja 🙏🏼@ImSharwanand garu, #AayushSharma ji & #JKarunaKumar garu 😇@imVdeshK @verma_shrasti #SrinivasVittala #HareshPatel #OmMovieCreations #SriKrishnaMovieCreations @PulagamOfficial pic.twitter.com/ggVBogGXSL — Jani Master (@AlwaysJani) August 22, 2022 -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న శేఖర్‌మాస్టర్ కూతురు?
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఓ ప్రముఖ డ్యాన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన స్టార్ కొరియోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యాడు. ఒకవైపు సినిమాల్లో పనిచేస్తూనే మరెవైపు బుల్లితెరపై కూడా పలు షోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీయెప్ట్ కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్‌కి పేరుంది. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టిక్‌టాక్ సహా డ్యాన్స్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె హీరోయిన్గా నటించేందుకు సిద్ధమైందట. ఇప్పటికే దీని కోసం ఓ కొత్త దర్శకుడు కథ చెప్పగా, శేఖర్ మాస్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజ్ ఉన్న ఓ యంగ్ హీరోను ఈ సినిమాలో భాగం చేసేందుకు శేఖర్ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ తెలిపారు. విద్యాసాగర్ కరోనా బారిన పడకముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. చదవండి: బెనారస్: మాయ గంగ సాంగ్ వచ్చేసింది ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీనా తన భర్తను కాపాడుకునేందుకు ఎంతో పరితపించారని ఆమె వివరించారు. ‘ఈ ఏడాది జనవరిలో కోరాన బారిన పడిన విద్యాసాగర్ అనంతరం కోలుకున్నారు. మీనా తల్లి బర్త్‌డే సందర్భంగా ఫిబ్రవరిలో వారి కుటుంబాన్ని కలిశాను. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత నెల రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఏప్రిల్‌లో మీనా ఫోన్ చేసి విద్యాసాగర్ ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఆవేదన చెందారు. దీంతో నేను ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలకరించాను’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: షికారు అందరికీ తెలిసిన కథే, తప్పకుండా నచ్చుతుంది ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వారంతా సాయం చేసినా ట్రాన్స్‌ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని తెలిపారు. ఈ క్రమంలో భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి క్షణం వరకు ప్రయత్నించారని, చిన్న వయసులోనే తను భర్తను కోల్పోవడం బాధాకరమని కళా మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత
Choreographer Thrinath Rao Passed Away In Chennai: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ త్రినాథ్ రావ్ (69) కన్నుమూశారు. బుధవారం (జూన్ 15) ఉదయం గుండెపోటుతో చైన్నైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గురువారం (జూన్ 16) చెన్నైలో త్రినాథ్ రావ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. 'చిన్న' పేరుతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన త్రినాథ్ రావ్ స్వస్థలం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 500 చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రముఖ హీరో, దర్శకుడు కె. భాగ్యరాజ్ డైరెక్షన్లో వచ్చిన 'తూరల్ నిన్రు పోచ్చు' మూవీతో నృత్య దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. తమిళ స్టార్ హీరో అజిత్ తొలి సినిమా 'అమరావతి'కి త్రినాథ్ రావ్ కొరియోగ్రఫీ అందించారు. తర్వాత తమిళంలో 'ముందానై ముడిచ్చు', 'దావడి కలవుగల్', 'వైదేహి కాత్తిరుందాల్', 'వానత్తై పోల' వంటి తదితర చిత్రాలతోపాటు తెలుగులో 'రాణీకాసుల రంగమ్మ' లాంటి పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు -
నోరాతో డేటింగ్? ష్, అది సీక్రెట్ అంటున్న కొరియోగ్రాఫర్!
బాహుబలి, టెంపర్‌తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోని ఐటం సాంగ్స్‌లో ఆడిపాడింది నోరా ఫతేహి. మెరుపులాంటి స్టెప్పులు, అదరగొట్టే ఎక్స్ప్రెషన్తో ఎంతోమందిని బుట్టలో వేసుకుందీ బ్యూటీ. అయితే నోరా సింగిల్ కాదని ఓ కొరియోగ్రాఫర్‌తో ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. డ్యాన్స్ మాస్టర్ టెరెన్స్ లూయిస్‌తో డేటింగ్ చేస్తోందని ఫిల్మీదునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై టెరెన్స్ స్పందించాడు. ఈ సీక్రెట్‌ను సీక్రెట్లాగే ఉంచితే బాగుంటుంది. కావాలంటే నేను మీకు కెమెరా ఆఫ్ చేశాక చెప్తాను. నాకు తెలిసి ఆన్‌స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందనుకుంటున్నాను. నిజంగానే ఆమె ఎనర్జీ, వైబ్‌ను ఇష్టపడతాను. తను డ్యాన్సర్ కాబట్టి ఆ విషయం తనకూ తెలుసు. తనది చాలా కష్టపడి పనిచేసే స్వభావం. ఇకపోతే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఎప్పుడూ చెప్పను, కాకపోతే మా మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా నోరా పంజాబీ సింగర్ గురు రంధవతో కూడా డేటింగ్ చేస్తుందంటూ ఇటీవల కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నోరా ఫతేహి డ్యాన్స్ దీవానీ జూనియర్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. హరిహర వీరమల్లులోనూ కథానాయికగా నటించనుందని ప్రచారం జరుగుతోంది. చదవండి: ఓటీటీల్లోకి బీస్ట్, అప్పటి నుంచే స్ట్రీమింగ్ ఏడాదవుతున్నా ఇంకా తొలిరోజు గాయంలా నొప్పి నన్ను వెంటాడుతూనే ఉంది. -
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్‌కు రాలేదు: శేఖర్ మాస్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా నుంచి ఇటీవల రిలీజైన ట్రైలర్ 24 గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్‌ను క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది. ఇక కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాటలో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్‌కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రీల్స్ సందడి చేశాయి. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్ కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. కళావతి, పెన్నీ పాటలతో పాటు సర్కారువారి పాట నుంచి రాబోయే మాస్ సాంగ్ విశేషాలు ఇలా పంచుకున్నారు... ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ? బుల్లితెర, వెండితెరని అలరిస్తున్నారు. మీ సీక్రెట్ ఏమిటి ? సీక్రెట్ ఏం లేదండీ. ఇచ్చిన పని చక్కగా చేయడమే. నా దృష్టి వెండితెరపైనే వుంది. ఐతే నెలకు రెండు రోజులు టీవీ షూటింగ్ కి సమయం కేటాయించా. సర్కారు వారి పాటలో ఎన్ని పాటలు చేశారు ? మూడు. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నపుడు ఒత్తిడి వుంటుందా ? ఒత్తిడి వుండదు. ఒక సాంగ్ కి మించిన సాంగ్ ఇవ్వాలనే పట్టుదల వుంటుంది, దాని కోసమే కష్టపడి పని చేస్తాం. సరిలేరు నికెవ్వరులో మైండ్ బ్లాక్ పాట సూపర్ హిట్. దానికంటే గొప్ప పాట ఇవ్వడానికి ప్రయత్నించాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. మహేశ్ గారితో మీ కాంబినేషన్ ? మహేశ్‌బాబు గారితో సరిలేరు నికెవ్వరులో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్, సర్కారు వారి పాటలో మూడు సాంగ్స్. మహేశ్‌బాబు చాలా త్వరగా నేర్చుకుంటారు. మహేష్ బాబుగారిలో అద్భుతమైన రిధమ్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకుంటే చాలు. కళావతి పాటని అందరూ రీల్స్ చేశారు. మహేష్, సితార ల్లో ఎవరు బాగా చేశారు ? ఒక కోరియోగ్రఫర్ గా చెప్పండి? మహేష్-సితార ఇద్దరూ బాగా చేశారు. సితార పాపలో గొప్ప గ్రేస్ వుంది. ఐతే పెన్నీ ప్రమోషనల్ సాంగ్ కొరియోగ్రఫీలో నేను లేను. మా అసిస్టెంట్స్ చేశారు. సినిమాలో వచ్చే పాటలో సితార పాప కనిపించదు. కాపీ స్టెప్పులు అని విమర్శలు వస్తుంటాయి కదా ? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? మనం ఒరిజినల్ గా చేస్తే మనది మనకే తెలిసిపోతుంది. మూమెంట్ కంపోజ్ చేస్తున్నపుడే కొత్తగా వుందా లేదా ? అనేది అర్ధమైపోతుంది. డ్యాన్స్ కాకుండా సాంగ్ లో కోరియోగ్రఫర్ ఇన్పుట్స్ ఎలా వుంటాయి ? ప్రాపర్టీస్ ని కూడా సజస్ట్ చేస్తారా ? కోరియోగ్రఫి అంటే డ్యాన్స్ మాత్రం కాదు.. సాంగ్ ని అందంగా ప్రజంట్ చేయాల్సిన బాధ్యత వుంటుంది. మూమెంట్స్ తో పాటు పాటలో కనిపించే ప్రాపర్టీ, కాస్ట్యూమ్స్ కూడా కొన్నిసార్లు చెబుతాం. దర్శకులు కూడా సూచనలు చేస్తారు. కళావతి పాటని ఫారిన్ లో షూట్ చేశాం. బ్యాగ్ గ్రౌండ్ లో సితారలు వుంటే బావుంటుంది అనిపించింది. దర్శకుడు పరశురాం గారికి చెప్పా. ఆయన ఓకే అన్నారు. అప్పటికప్పుడు వేరే చోట నుంచి తెప్పించి షూట్ చేశాం. సాంగ్ లో బ్యుటిఫుల్ గా కనిపించాయి. మహేశ్ గారితో పని చేయడం ఎలా అనిపిస్తుంది ? మహేశ్ గారికి ఒక డ్యాన్స్ మాస్టర్ గా ఎన్ని మార్కులు వేస్తారు? మహేశ్‌బాబు గారితో పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఓకే అన్నా .. ''మాస్టర్ ఇంకోసారి చేద్దామా' అంటారు. ఈ సినిమాలో ఆయన మరింత అందంగా కనిపిస్తారు. డ్యాన్స్ విషయానికి వస్తే సర్కారు వారి పాటలో సరికొత్త మహేశ్‌బాబు గారిని చూస్తారు. మహేష్ గారి డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా. మీ పిల్లల్ని కూడా ఈ రంగంలో ప్రోత్సహిస్తున్నారా ? ఈ మధ్య డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ పాప ప్యాషన్ డిజైన్ అవుతానని అంటుంది. బాబు డాక్టర్ అంటున్నాడు. ఏం కావాలో ఛాయిస్ వాళ్ళకే ఇచ్చేశా. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి కదా ? ఇది కొరియోగ్రఫీలో కూడా వుంటుందా ? కొరియోగ్రఫీకి అలా ఏం వుండదు. ఇప్పుడు పాన్ ఇండియా అని అంటున్నారు కానీ 'టాపు లేచిపోద్ది' పాటని ప్రపంచ వేదికలపై ప్రదర్శించారు. 'పుష్ప' మూమెంట్స్ కూడా పాన్ వరల్డ్ లో సందడి చేశాయి కదా. మూమెంట్ యునిక్ , క్యాచిగా వుంటే జనాల దృష్టిని ఆకట్టుకుంటుంది. టీమ్ ఇండియా క్రికెటర్లు, ఆస్ట్రేలియా ఆటగాళ్ళు మా మూమెంట్స్ రీల్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా వుంటుంది. ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ ని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా అంచనా వేశారు కదా ? ఆచార్య సాంగ్ ఎంత డిమాండ్ చేసిందో అంతా చేశాం. కథలో సందర్భాన్ని బట్టే కొరియోగ్రఫీ వుంటుంది. కొరియోగ్రాఫేర్ గా మీ డ్రీమ్ ఏమిటి ? చిరంజీవి గారికి, ప్రభు మాస్టర్ కి చేయాలని అనుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అయ్యింది. రాజమౌళిగారితో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి చేయాలని వుంది. మీరు పని చేసిన హీరోల్లో తక్కువ టైంలో మూమెంట్స్ నేర్చుకునే హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా రిహర్సల్ కి రాలేదు. ఆయన స్పాట్ లో చేసేస్తారు. మిగతా హీరోలు కూడా ఒక సారి చెప్పిన వెంటనే మూమెంట్ పట్టేస్తారు. మీ అంచనాలు తప్పిన పాట ? 'జైలవకుశ లో ట్రింగ్ ట్రింగ్ సాంగ్. చాలా కొత్తగా చేశాం. చాలా ఆదరణ పొందుతుందని భావించాం. కానీ అది అనుకున్నంత కనెక్ట్ కాలేదు. కోరియోగ్రఫీ విషయంలో ఇంకా చెన్నై మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందా ? లేదు. ఇప్పుడు అంతా మన వాళ్ళకే ఇస్తున్నారు. నేను వచ్చిన కొత్తలో అక్కడ అనుభవం వున్న వారికి ఇచ్చేవాళ్ళు. ఇందులో నిర్మాతల తప్పులేదు. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు. కొత్తవారితో రిస్క్ చేయలేరు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే అలోచించాల్సిందే. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ? చిరంజీవి గారు మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ గారి ధమాకా సినిమాలకి చేస్తున్నా. శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా. సల్మాన్ ఖాన్ రాధే కి కూడా పిలిచారు. కానీ నాకే కుదరలేదు. చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ ట్రోలింగ్ నాన్నను బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్ ఏడ్చేశా: నటి -
జానీ మాస్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
BB Kannada Host Gift To Dhee 14 Judge Jani: టాలీవుడ్‌కి చెందిన టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్స్‌లో జానీ మాస్టర్ ఒకరు. స్టార్ హీరోల సినిమాల్లో చాలామందికి జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ఇటీవలె బీస్ట్ మూవీ నుంచి 'అరబిక్ కుతు...' సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసింది కూడా ఆయనే. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో జానీ మాస్టర్‌కి మాంచి పేరుంది. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్తో ఆయన పనిచేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్‌కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు సుదీప్. ఖరీదైన థార్ కారును ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను జానీ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సుదీప్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ థార్ కారు ధర సుమారు రూ. 12-14 లక్షలు ఉండొచ్చని తెలుస్తుంది.కాగా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. త్వరలో విడుదల కానుంది. ఇందులో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. View this post on Instagram A post shared by Jani Master (@alwaysjani) -
కంటెస్టెంట్ అప్పు మొత్తం తీర్చేస్తా: ప్రముఖ కొరియోగ్రాఫర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజ ప్రస్తుతం డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ ఐదో సీజన్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో డ్యాన్స్ నేర్చిన చిన్నారులు తమ స్టెప్పులతో షోను షేక్ చేస్తున్నారు. ఇటీవల ఎనిమిదేళ్ల బాలుడు హిమాన్షు తన డ్యాన్స్‌తో జడ్జీలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అనంతరం తన జీవితంలోని కష్టాలను వివరించాడు. ఢిల్లీ తమ స్వస్థలం అని, చిన్నవయసులోనే నాన్న చనిపోవడంతో అప్పటినుంచి సోదరుడితోపాటు తనను తల్లే పెంచుతుందని చెప్పాడు. రిక్షా తొక్కుతూ తమను పెంచి పోషిస్తుందని పేర్కొన్నాడు. ఆ రిక్షా కొనడానికి కూడా డబ్బుల్లేకపోవడంతో లోన్ తీసుకుందని చెప్పాడు. ప్రతినెలా లోన్ డబ్బులు కట్టేందుకు ఆమె నానాకష్టాలు పడుతోందని వాపోయాడు. అతడి కన్నీటిగాథ విని కదిలిపోయిన రెమో డిసౌజ ఆ రిక్షా కొనేందుకు చేసిన అప్పు తీర్చేందుకు ముందుకు వచ్చాడు. ఇకపై ఆ రిక్షా మీదేనని, మిగిలిన లోను తాను కట్టేస్తానని హామీ ఇచ్చాడు. చదవండి: రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు -
కొరియోగ్రాఫర్ యశ్ అందమైన ఇంటిని చూశారా?
ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓ డ్యాన్స్ షో ద్వారా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చిన యశ్ ఆ తర్వాత సొంతంగా కొరియోగ్రాఫర్‌గా మారాడు. స్టయిలిష్ స్టెప్పులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సమంత హీరోయిన్గా నటించిన యూటర్న్ సినిమాతో పాటు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు సైతం కొరియోగ్రఫీ అందించాడు. అలా యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యశ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇటీవలె యూట్యూబ్ ఛానెల్ పెట్టిన యశ్ తాజాగా తన ఇంటికి సంబంధించిన హోం టూర్ చేశాడు. ఇందులో తన ఇంటికి సంబంధించి పలు విషయాలను నెటిజన్లతో పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే..
Actress Sudha Sensational Comments On Sundaram Master: సీనియర్ నటి సుధ ప్రముఖ కొరియోగ్రాఫర్, ప్రభుదేవ తండ్రి సుందరం మాస్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఓ మూవీ సెట్లో ఆయన తనని ఘోరంగా అవమానించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తమిళంలో ఓ సినిమా పాటను షూట్ చేస్తున్న సమయంలో సుందరం మాస్టర్ నాతో డ్యాన్స్ మూమెంట్స్ చేయిస్తున్నారు. అయితే అవి నాకు అర్థం కాకపోవడంతో ఐదుకు పైగా టేకులు తీసుకున్నాను. దీంతో ఆయన కోపంతో నాపై అందరి ముందే అరిచారు. చదవండి: దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి అంతేకాదు నాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నువ్వు వ్యభిచారానికి కూడా పనికి రావు’ అంటూ అనకుడని మాట అన్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటలు భరించలేకపోయానని, ఆ సమయంలో ప్రభు, పి.వాసు సహా పలువురు పెద్దలు సెట్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లానని, ఈ విషయం తన తల్లికి చెప్పుకుని బాధపడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఆర్టిస్టు అయినా, పెద్ద ఆర్టిస్టు అయినా నటీనటులను అలా అనడం తప్పని, ఆయన నాపై వాడకూడని పదాలు వాడారంటూ సుధ వాపోయారు. చదవండి: బాబోయ్ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్ చేసిందేంటి! ఇక ఎప్పటికీ ఆయన సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నన్నారు. అయితే ఓ రోజు ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో తల్లి పాత్ర కోసం సుందరం మాస్టర్ తనని కలిశారని, ఆయనని చూడగానే సినిమా చేయనని చెప్పానన్నారు. కానీ ఆయన తనను అన్న వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడ్డారని, అందుకు క్షమాపణలు చెప్పేందుకు వచ్చినట్లు సుందరం మాస్టర్ తనతో అన్నట్లు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పాగానే ఆయన సినిమా చేసేందుకు ఓకే చెప్పానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో రెండు పేజీల డైలాగ్ ఫస్ట్ షాట్‌కే చెప్పడంతో ఆయనే స్యయంగా వచ్చి ప్రశంసించడమే కాకుండా, అందరి ముందు అవమానించినందుకు క్షమాపణలు కూడా కోరారని నటి సుధ వెల్లడించారు. -
‘మెగా ఫోన్’ పట్టుకున్న టెక్నీషియన్లు.. హిట్ పడేనా?
Technicians Turned Into Directors: విలన్ ముఖం మీద హీరో పంచ్‌లు ఇస్తుంటే.. ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు. హీరో హీరోయిన్ డ్యూయట్ పాడుకుంటే... ఫ్యాన్స్ స్టెప్స్ వేస్తారు. విదేశీ అందాలు తెర మీద కనబడితే అదో ఐ ఫీస్ట్. ఎక్కువ అయిందనుకున్నప్పుడు సీన్ పూర్తయితే అదో రిలీఫ్. ప్రేక్షకులకు ఈ అనుభూతులన్నీ కలగాలంటే తెర వెనక ఫైట్ మాస్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్ ఎంతో శ్రమించాలి. ఈ క్రమంలో ఈ టెక్నీషియన్లకు సినిమా డైరెక్షన్ మీద ఓ అవగాహన వచ్చేస్తుంది. అందుకే కొందరు డైరెక్టర్లుగా మారతారు. ప్రస్తుతం ‘మెగా ఫోన్’ పట్టుకుని దర్శకులుగా స్టార్ట్.. కెమెరా, యాక్షన్.. కట్ చెబుతున్న టెక్నీషియన్ల గురించి తెలుసుకుందాం. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డుతో పాటు తమిళనాడు, కేరళ ప్రభుత్వ అవార్డులూ గెలుచుకున్నారు బృందా మాస్టర్. ఆమె దర్శకురాలిగా మారారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీ రావు హైదరీ హీరో హీరోయిన్లుగా బృందా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హే సినామిక’. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక యశ్ ‘కేజీఎఫ్’ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా మెప్పించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని స్టంట్స్‌ని అన్బు, అరివు ద్వయం సమకూర్చారు. ఈ చిత్రానికి బెస్ట్ స్టంట్ మాస్టర్స్‌గా జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్‌లానే ఈ ఇద్దరు కూడా కవలలే. ఇప్పుడు ఈ ఇద్దరి దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ‘దుర్గ’ అనే చిత్రం రూపొందనుంది. ఇక కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి లారెన్స్ విజయాలు చవి చూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. లారెన్స్‌తో అన్బు, అరివు మరోవైపు ‘సీతారాముడు’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బుర్రకథ’ ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి సినిమాలకు వర్క్ చేసిన కెమెరామేన్ అంజి కూడా రీసెంట్గా దర్శకుడిగా మారారు. శ్రీరామ్, అవికా గౌర్ హీరో హీరోయిన్లుగా నటించనున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాకు అంజి దర్శకుడు. పి. అచ్యుత్ రామారావు, రవితేజ మన్యం ఈ సినిమాను నిర్మించనున్నారు. సునీల్, ధన్‌రాజ్ హీరోలుగా రిలీజ్‌కు రెడీ అయిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బుజ్జీ.. ఇలారా’కి కూడా అంజియే దర్శకుడు. నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక 2016లో వచ్చిన ‘క్షణం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు గ్యారీ. 2018లో వచ్చిన ‘గూఢచారి’తో గ్యారీ ఎడిటర్‌గా మారారు. ఆ తర్వాత ‘ఎవరు’, ‘హిట్: ది ఫస్ట్ కేస్’ ఇటీవల ‘ఇచట వాహ నములు నిలుపరాదు’ .. ఇలా దాదాపు 20కి పైగా సినిమాలకు ఎడిటర్‌గా చేసిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. నిఖిల్ హీరోగా దేశభక్తి నేపథ్యంలో ఓ స్పై థ్రిల్లర్ మూవీని గ్యారీ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రాజశేఖర రెడ్డి నిర్మించనున్నారు. మరికొందరు సాంకేతిక నిపుణులు కూడా తమలోని దర్శకత్వ ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్‌కి ఎంత మంచి గుర్తింపు ఉందో తెలిసిందే. కెమెరామేన్‌గా నాలుగు జాతీయ అవార్డులు సాధించిన ఆయన డైరెక్టర్‌గాను (ది టెర్రరిస్టు, మల్లి, నవరస చిత్రాలకు) జాతీయ అవార్డులు సాధించారు. ఇప్పుడు సంతోష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ముంబైకర్’. విజయ్ సేతుపతి, విక్రాంత్ మెస్సీ ప్రధాన పాత్రధారులు. తమిళ హిట్ మూవీ ‘మానగరం’కు హిందీ రీమేక్‌గా ‘ముంబైకర్’ రూపొందుతోందని టాక్. ‘దిల్ చాహ్ తా హై’, ‘కోయీ మిల్ గయా’, ‘ఫనా’, ‘గజిని’ ఇలా ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామ్యాన్‌గా చేసిన రవి కె. చంద్రన్ ప్రస్తుతం ‘తామర’ అనే ఇండో–ఫ్రెంచ్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. తెలుగులో అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదిలా ఉంటే.. 1992 నుంచి కెమెరామేన్‌గా కొనసాగుతున్న రవి. కె. చంద్రన్ పాతికేళ్లకు తెలుగు సినిమా చేయడం విశేషం. 2018లో మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ ఛాయాగ్రాహకుడిగా రవి కె. చంద్రన్‌కు తెలుగులో తొలి సినిమా. అలాగే తెలుగు నిర్మాణ సంస్థలో దర్శకుడిగా ‘తామర’ రవికి తొలి చిత్రం అయినప్పటికీ తమిళంలో ‘యాన్’ (2014), మలయాళంలో ‘భ్రమమ్’ (2021) చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
'ఊ అంటావా మావ, ఉ ఊ అంటావా మావ' కొరియోగ్రాఫర్‌కు ఆఫర్స్
‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావ, ఉ ఊ అంటావా మావ..’ పాటలో సమంత వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేశాయి. అంతేకాదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ డ్యాన్స్‌లకు ఆయన అభిమానులు సంబరపడిపోయారు. ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసి అల్లు అర్జున్, సమంతల ప్రశంసలు అందుకున్నారు నృత్య దర్శకుడు విజయ్ పొలంకి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘పలాస 1978’ లో హిట్ అయిన ‘నక్కిలీసు గొలుసు..’పాట నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘విజేత, కొబ్బరిమట్ట, శశి’ ఇటీవల ‘పుష్ప, హీరో’ చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చాను. ప్రస్తుతం ‘నరకాసుర’ చిత్రంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా’’ అన్నారు. -
గిన్నిస్ రికార్డు కెక్కిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్
Choreographer Radhika Guinness Record: ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు రాధిక గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ఏఎంఎస్ ఫైన్ఆర్ట్స్ సంస్థ నిర్వాహకుడు, సమాజ సేవకుడు డాక్టర్ ఆర్.జె.రామనారాయణన్ నాట్యకళలను ప్రోత్సహించే విధంగా వాటిపై అవగాహన కలిగించే విధంగా చెన్నైలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా సినీ నృత్య దర్శకురాలు రాధిక బృందం నేతృత్వంలో చెన్నైలోని పలు వేదికలపైనా, అదే విధంగా ఆన్లైన్ ద్వారా రోజూ గంట చొప్పున 365 రోజులు నాట్యకళ వేడుకలను నిర్వహించారు. ఇందులో పలువురు నాట్య కళాకారులు పాల్గొన్నారు. కాగా చివరిరోజున 600 మంది నాట్య కళాకారులతో నిర్వహించిన నాట్యకళ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో నమోదైంది. న్యాయమూర్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డ్ బుక్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా తిలకించారు. పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అతిథిగా పాల్గొని నాట్య కళాకారులను అభినందించడంతో పాటు గిన్నిస్ రికార్డ్ ధ్రువపత్రాన్ని నృత్య దర్శకురాలు రాధికకు ప్రదానం చేశారు. -
శివ శంకర్ మాస్టర్ తొలి పారితోషికం ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: శివ శంకర్ మాస్టర్ సాక్షాత్తు ఆ నటరాజు రూపంగా అభిమానులు భావిస్తారు. డ్యాన్స్మీద ప్రేమ వ్యామోహంతో సినిమా రంగం వైపు అడుగులు వేశారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పట్టుదలగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కరియర్ ఆరంభంలో ప్రముఖ కొరియాగ్రాఫర్లు సలీం, సుందరం లాంటి వారి దగ్గర అసిస్టెంట్ మాస్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత కొరియాగ్రాఫర్‌గా తనదైన శైలిలో రాణించారు. అలా సుమారు నాలుగున్నర దశాబ్దాలు పాటు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కొరియాగ్రాఫర్, నటుడుగా, బుల్లితెరపై జడ్జ్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే తన ఆహార్యం, వేషధారణ, దుస్తులపై వచ్చిన విమర్శలను కూడా చాలా సున్నితంగా తిరస్కరించేవారు. తను కళకు అంకితమైన వాడిననీ వృత్తిపరంగా తాను చేయాల్సిందంతా చేశానని చెప్పేవారు. నృత్యమంటేనే అర్దనారీశ్వరత్వం అది ఉంటేనే నృత్యానికి అందమనీ, ప్రేక్షకుల అభిమానం, వారి ఆదరణే తనకు ముఖ్యమని, వారుచెందే గొప్ప అనుభూతే తన కళకు సార్థకమని గర్వంగా ప్రకటించారు శివ శంకర్ మాస్టర్. అంతేకాదు అసిస్టెంట్ డ్యాన్స్‌మాస్టర్‌గా తనకు అందుకున్న రెమ్యునరేషన్ 7.50 రూపాయలట. ఈ విషయాన్ని శివ శంకర్ మాస్టారే స్వయంగా వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో. అంతేకాదు తెలుగు పరిశ్రమే తనను ఉద్ధరించిందనీ, టాలీవుడ్ తనంటూ ఒక స్థాయిని తెచ్చిపెట్టిందంటారు శివ శంకర్. కాగా లెజెండరీ డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచినసంగతి తెలిసిందే. -
ఆయన మరణం సినీ పరిశ్రమకే తీరని లోటు: మెగాస్టార్ భావోద్వేగం
Megastar Chiranjeevi Emotional Sentences On Shiva Shankar Death: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడి ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపట్ల సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. శివశంకర్ మాస్టర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. మాస్టర్ మరణం తనను కలచివేసిందని చిరింజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలు అందించారని మెగాస్టార్ కొనియాడారు. 'శివశంకర్ మాస్టర్, నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్‌గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు, అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. చరణ్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శివశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను, అదే చివరి సారి అవుతుందని అస్సలు ఊహించలేదు, ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు' అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఇది చదవండి: శివశంకర్ మాస్టర్‌కు చిన్నప్పుడు గాయం.. సుమారు ఎనిమిదేళ్లు.. -
శివశంకర్ మాస్టర్‌కు చిన్నప్పుడు గాయం.. సుమారు ఎనిమిదేళ్లు..
Shiva Shankar Master On Bed For Eight Years: కరోనా రక్కసి ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. అందులో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ కన్ను మూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు. కల్యాణ సుందర్, కోమల అమ్మాళ్ తల్లిదండ్రులు కాగా, తండ్రి కొత్వాల్ చావిడిలో పండ్ల వ్యాపారం చేసేవారు. శివ శంకర్ మాస్టర్‌కు చిన్నతనంలో ఉండగా ఒక ప్రమాదం కూడా జరిగిందట. భయపడి.. శివశంకర్ మాస్టర్ ఏడాదిన్నర వయసు ఉండగా, తనని వాళ్ల పెద్దమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని ఇంటి బయట అరుగుమీద కబుర్లు చెప్పుకునేవారట. ఒకరోజు అరుగు మీద కూర్చొన్న సమయంలో ఒక ఆవు తాడు తెంపుకొని రోడ్డుపైకి వచ్చింది. అది తమ మీదకు వస్తుందేమోనని శివ శంకర్ పెద్దమ్మ భయపడి ఆయన్ను ఎత్తుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లే సమయంలో గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న శివ శంకర్ కూడా కింద పడిపోయారు. దీంతో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు జ్వరం. ఏ డాక్టర్‌కు చూపించినా సరికాకపోవడంతో మాస్టర్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అదే సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్ అనే ఆయన వద్దకు శివ శంకర్‌ను తీసుకెళ్లారు మాస్టర్ తల్లిదండ్రులు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. అప్పుడు ఆ డాక్టర్ శివ శంకర్ తల్లిదండ్రులకు ‘ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేస్తే లేచి నడిచేలా చేయగలను’ అని హామీ ఇచ్చారు. ఆయనను నమ్మి శివ శంకర్ తండ్రి అక్కడే వదిలేసి వెళ్లిపోయారట. అంతే సుమారు ఎనిమిదేళ్లపాటు శివ శంకర్ పడుకునే ఉన్నారు. తర్వాత ఆ గాయం నుంచి కోలుకున్నారు. ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు -
టాలీవుడ్లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు
Shiva Shankar Master Is No More: టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 7, 1948న చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్ జన్మించారు. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి కాగా 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు. 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. -
శివశంకర్ మాస్టర్‌కు మెగాస్టార్ చేయూత.. తక్షణ సాయంగా..
Megastar Chiranjeevi Support To Shiva Shankar Master: మెగాస్టార్ చిరంజీవి పేరు వింటే ఫ్యాన్స్ విజిల్స్ వేయకుండా ఉండలేరు. తనదైన నటనతో అలరించడమే కాకుండా బ్లడ్, ఐ, ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టి ఎంతోమందికి ఆసరాగా నిలుస్తున్నారు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు ఆచార్య. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో పరిస్థితి విషమంగా ఉన్నసంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మాస్టర్‌తో పాటు ఆయన భార్యకు వైరస్ సోకడంతో ఆమె హోం క్వారంటైన్ అయ్యారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి సైతం కొవిడ్ సోకగా వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇది చదవండి: విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం, సాయం కోసం ఎదురుచూపు! ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులకు కరోనా సోకడంతో ఇబ్బందుల్లో పడింది శివశంకర్ కుటుంబం. దీంతో ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు రూ. లక్ష ఖర్చు అవుతున్నందున మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం చేయాల్సిందిగా సినీ పెద్దలను కోరారు. విషయం తెలిసిన మెగాస్టార్ అజయ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని, తక్షణ సాయంగా రూ. 3 లక్షల చెక్కు అందజేశారు. వైద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివశంకర్ మాస్టర్ కుటుంబానికి తామంతా ఉన్నామని అభయమిచ్చారు. ఇది చదవండి: శివశంకర్ మాస్టర్‌కు సోనూసూద్ సాయం! 'నాన్నకు అనారోగ్యం అని తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి రమ్మని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు. చిరంజీవి అంటే నాన్నకు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి నాన్న సినిమాలు చేశారు. ఇటీవల ఆచార్య షూటింగ్లో కూడా నాన్న, చిరంజీవిని కలిశారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి నాకు చాలా అవసరం. చిరంజీవి గారు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనకు ఎన్నటికీ రుణపడి ఉంటాను' అని శివశంకర్ మాస్టర్ చిన్నకుమారుడు అజయ్ తెలిపారు. ఇది చదవండి: శివశంకర్ మాస్టర్‌కు ధనుష్ సాయం!.. టాలీవుడ్ స్టార్స్‌పై నెటిజన్ల విమర్శలు -
శివశంకర్ మాస్టర్‌కు సాయం.. పబ్లిసిటీ చేయవద్దని కోరిన ధనుష్!
Dhanush Extend Support To Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఆయన పరిస్థితి తెలుసుకొని నటుడు సోనూసూద్ సాయం చేసేందకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ సైతం శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం పది లక్షల రూపాయలు ఇచ్చారని సమాచారం. అంతేకాకుండా తాను డబ్బులు ఇచ్చిన విషయం గురించి పబ్లిసిటీ చేయవద్దని ధనుష్ కోరినట్లు తెలుస్తుంది. సాయం చేసినా ఎవరికి చెప్పొద్దని కోరడం ధనుష్ మంచి మనసుకు నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే టాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ పాటలకు కొరియోగ్రాఫీ చేసిన ఆయనకు టాలీవుడ్ నుంచి స్పందన లేకపోవడం ఏంటని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ధనుష్‌ని చూసి టాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో వందల సంఖ్యలో పాటలకు కొరియోగ్రాఫీ చేసిన శివశంకర్ మాస్టర్ పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా సైతం వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం.. రంగంలోకి దిగిన సోనూసూద్
Sonu Sood Helps To Choreographer Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకగా.. ఆయన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. విషయం తెలుసుకున్న రియల్ హీరో సోనూసూద్.. సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శివశంకర్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. Iam already in touch with the family, Will try my best to save his life 🙏 https://t.co/ZRdx7roPOl — sonu sood (@SonuSood) November 25, 2021 -
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం
Siva Shankar Master Health Condition Critical: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం. శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. Noted Choreographer #ShivaShankar Master affected with #COVID19 and now in critical condition. Due to expensive treatment the family is unable to pay the bills.Wishing him a speedy recovery. For Contact Ajay Krishna (Son) 9840323415 pic.twitter.com/2IqBiQUnM7 — SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 24, 2021 -
కంటెస్టెంట్ మృతి.. విషాదంలో కొరియోగ్రాఫర్ యశ్
Yash Master Shares An Emotional Post : ప్రముఖ డ్యాన్స్ షోతో గుర్తింపు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ కంటెస్టెంట్లలో ఒకరైన కేవల్ కన్నుమూశాడు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచాడు. కేవల్‌ను కాపాడేందుకు యశ్ ఎంతగానో ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కేవల్ ఆపరేషన్ కోసం తోచినంత ఆర్థిక సహాయం చేయాల్సిందిగా సోషల్‌మీడియా వేదికగా యశ్ కోరాడు. కేవల్‌కు బ్లడ్ డొనేషన్ కోసం కూడా పలుమార్లు నెటిజన్లను కోరిన సంగతి తెలిసిందే. యశ్ పోస్టుతో ప్రియమణి, సుధీర్, రష్మీ, మేఘన వంటి సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తోచినంత ఆర్థిక సహాయాన్ని అందించారు. అయితే ఆ ప్రయత్నాలేవీ కేవల్‌ను కాపాడలేకపోయాయి. బ్లడ్ క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేవల్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ యశ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. నా సోదరుడి మరణాన్ని భరించలేకపోతున్నా. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటికీ నువ్వు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. మా అందరిని ఒంటరి చేసి త్వరగా వెళ్లిపోయావ్ అంటూ యశ్ పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టిస్తుంది. రిప్ కేవల్ అంటూ నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'కావ్య నా పిల్ల'.. కాలర్ పట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్ భీమ్లా నాయక్: పవర్ ఫుల్ డైలాగ్‌తో బెదిరించిన రానా View this post on Instagram A post shared by Yashwanth Master (@yashwanthmaster) -
బిగ్‌బాస్ 5: అబ్బాయిని కొట్టానన్న యానీ మాస్టర్
Anee Master In Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లోకి రావట్లేదంటూనే షోలో అడుగు పెట్టి అభిమానులకు స్వీట్ షాకిచ్చింది యానీ మాస్టర్. చూడటానికి డిఫరెంట్‌గా కనిపించే యానీ మాస్టర్ ఇక్కడే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో పుట్టింది. 10వ తరగతిలో ఒక అబ్బాయిని కొట్టేశానన్న యానీ హౌస్‌లో తన జోలికి వచ్చినవారిని కొట్టిపడేస్తుందా? లేదా సహనంతో భరిస్తుందా? అనేది చూడాలి! మాస్ అయినా క్లాస్ అయినా డ్యాన్స్‌తో ఇరగదీసే ఆమె బిగ్‌బాస్ షోలో తన ఎనర్జీతో అందరికీ చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తన బాబును ఘోరంగా మిస్ అవుతానంటున్న యానీ మాస్టర్ ఈసారి కప్పు కొడతానని చెప్తోంది. మరి ఆమె కల నెరవేరుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఆ రోజు ఆటోలో కూర్చోని బాగా ఏడ్చాను: కృతి సనన్
టాలీవుడ్లో ‘వన్.. నేనోక్కడినే’ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన జతకట్టింది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చిన ఈ అమ్మడు అక్కడ బిజీ హీరోయిన్గా మారిపోయింది. బీ టౌన్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఈ భామ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి తాను మోడలింగ్ చేస్తున్నప్పటి విషయాలను పంచుకుంది. తన మొదటి ర్యాంప్ వ్యాక్ షోలో ఏదో పొరపాటు విషయమై కొరియోగ్రాఫర్ తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ షో ముగింపులో దాదాపు 20 మోడళ్ల ముందు ఆ కొరియోగ్రాఫర్ తనని తిట్టాడని చెప్పింది కృతి. ఆ తర్వాత తను ఆటోలో కూర్చుని ఆ విషయాన్ని తలుచుకుని ఏడవటం మొదలుపెట్టి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మతో చెప్పి బాధపడినట్లు తెలిపింది. దీంతో ఆమె కృతిసనన్‌తో.. ఈ వృత్తిలో నువ్వు రాణించగలవో లేదో నాకు తెలీదు గానీ ముందు నువ్వు మానసికంగా మరింత బలంగా ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలంటూ ధైర్యం చెప్పిందని అప్పటి విషయాలని గుర్తుచేసుకుంది కృతి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఈ నటి బచ్చన్ పాండే షూటింగ్ పూర్తి చేసింది. ఇందులో అక్షయ్ కుమార్ సరసన నటించింది. గణపత్‌లో టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తుండగా, వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న ‘భేదియా’ చిత్రం కోసం షూట్ కూడా చేసింది. ‘హమ్ దో హుమారే దో’ లో కూడా నటిస్తోంది. చదవండి: Street Light Movie: పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..? -
దూసుకుపోతున్న సాఫ్ట్వేర్ కొరియోగ్రాఫర్!
జీవితంలో ఎన్నో సాధించాలని ప్రణాళికలు రూపొందించుకుంటుంటాం. కానీ వాటిలో మనం సాధించగలమన్న నమ్మకం ఉన్న కలను మాత్రమే నిజం చేసుకోగలుగుతామని చెబుతోంది ముంబైకి చెందిన సోనాలి భదౌరియా. కెరియర్ని ఎంచుకునేటప్పుడు ఇష్టమైన డ్యాన్స్‌లో ఎదగాలా? ఉన్నత చదువులు చదవాలా అని సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ చివరికి తనకి ఎంతో ఇష్టమైన డ్యాన్స్‌ను వృత్తిగా మార్చుకుని అందులో రాణిస్తూ లక్షలమంది అభిమానులను సొంతం చేసుకుని యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది సోనాలి. ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సోనాలికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎనలేని అభిమానం. టీవీ, రేయోలలో పాటలు వస్తున్నాయంటే వెంటనే ఆ సంగీతానికి తగ్గట్టుగా తన శరీరాన్ని రకరకాల భంగిమల్లో కదిలించేది. తల్లిదండ్రులు కూడా సోనాలి ఆసక్తిని గమనించి డ్యాన్స్‌ను ప్రోత్సహించేవారు. ఇంటర్మీడియట్ అయ్యాక.. డ్యాన్స్‌ను కెరియర్‌గా మలుచుకోవాలో?.. ఇంజినీరింగ్ చేయాలా అన్న సందేహం ఎదురైంది సోనాలికి. అప్పుడు బాగా ఆలోచించి ఇంజినీరింగ్‌ను ఎంచుకుంది. బీటెక్ పూర్తయ్యాక ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చేరింది. ఆఫీసులో పనితోపాటు, ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి ‘క్రేజీ లెగ్స్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిసి సోనాలి క్రేజీ క్లబ్లో చేరింది. ఇక్కడే ఆమె డ్యాన్సర్‌గా మారడానికి మొదటి అడుగు పడింది. ఒకపక్క క్రేజీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూl.. మరోపక్క నాట్యంలోని మెళకువలను నేర్చుకుంటూ కఠోర సాధన చేసి వివిధ డ్యాన్స్ కాంపిటీషన్లలో పాల్గొనింది. లీవ్ టు డ్యాన్స్ విత్ సోనాలి అదే సమయంలో ..తనలాగే డ్యాన్స్ గ్రూప్‌లో పనిచేస్తోన్న వ్యక్తి పరిచయమవ్వడంతో అతన్నే పెళ్లి చేసుకుంది. సోనాలికి డ్యాన్స్ పట్ల ఉన్న అంకిత భావాన్ని గమనించిన భర్త ప్రోత్సహించడంతో సోనాలి మరింత క్షుణ్ణంగా డ్యాన్స్ నైపుణ్యాలను ఔపోసన పట్టి స్వయంగా డ్యాన్స్ స్టెప్పులను క్రియేట్ చేయగల స్థాయికి ఎదిగి, ఏకంగా కొరియోగ్రాఫర్‌గా మారింది. దీంతో 2016లో ‘లీవ్ టు డ్యాన్స్ విత్ సోనాలి’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. ఒక పక్క సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే మరోపక్క తన డ్యాన్స్ వీడియోలను రూపొందించి యూ ట్యూబ్ ఛానల్ల్లో పోస్టుచేసేది. ఆమె డ్యాన్స్ వీడియోలకు మంచి స్పందన లభించడంతో మరిన్ని వీడియోలు అప్లోడ్ చేసేది. ఉద్యోగ బాధ్యతలతో డ్యాన్స్ వీడియోలు అప్లోడ్ చేయడానికి తీరికలేకుండా పోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి.. పూర్తి సమయాన్ని డ్యాన్సింగ్ స్కిల్స్ పెంచుకోవడంపై వెచ్చించింది. ఈ క్రమంలోనే 2017లో సోనాలి స్వయంగా కొరియోగ్రఫీ చేసిన ‘నషే సి చా«ద్ గాయి’, ‘షేప్ ఆఫ్ యూ’ సీక్వెన్స్ వీడియోలు యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయ్యాయి. దీంతో సోనాలికి మంచి డ్యాన్సర్గానేగాక, కొరియోగ్రాఫర్‌గా కూడా గుర్తింపు వచ్చింది. అక్కడ నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫ్యాన్ఫెస్ట్లలో సోనాలికి ఆదరణ పెరిగింది. ఒక పక్క డ్యాన్సర్ అవ్వాలన్న కలను నెరవేర్చుకోవడమేగాక, మరోపక్క పెద్దపెద్ద డ్యాన్స్ ఈవెంట్స్, వెడ్డింగ్ ప్రాజెక్టులు చేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. వీటితోపాటు డ్యాన్సింగ్ వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఎంతో మందిని డ్యాన్సర్లుగా తీర్చిదిద్దుతోంది. లక్షలమంది సబ్‌స్రై్కబర్స్‌తో.. సోషల్ మీడియా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవాలంటే కొత్త కంటెంట్‌తో వ్యూవర్స్‌ను ఆకట్టుకొంటుండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సోనాలి ఎప్పటికప్పుడూ వినూత్న స్టెప్పులు, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, అదిరిపోయే ఎనర్జీతో డ్యాన్స్ వీడియోలు రూపొందిస్తూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఏడులక్షలకుపైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, 23 లక్షల మంది యూ ట్యూబ్ ఛానల్ సబ్‌స్రై్కబర్స్‌తో దూసుకుపోతూ నేటి యువతరానికి డ్యాన్సింగ్ ఐకాన్‌గా నిలుస్తోంది సోనాలి. -
ఆనాడు 500 మందిలో ఒకడు, ఇప్పుడు ఫేవరెట్ హీరోకే..
Jani Master: అవకాశాలు వెతుక్కుంటూ రావు, మనమే వాటిని అందుకుంటూ పోవాలి. వచ్చిన ఏ చిన్న అవకాశమైనా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయానికి బాటలు వేసుకోవాల్సిందే. దీనివల్ల సక్సెస్ రావడానికి, ఫేమ్ తెచ్చుకోవడానికి కాస్త టైం పడుతుందేమో కానీ ఫలితం మాత్రం దక్కకుండా పోదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇదే సూత్రాన్ని నమ్మి పైకొచ్చారు చాలామంది. అందులో ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్ ఒకరు. స్టేజ్ పర్ఫామర్‌గా కెరీర్ మొదలు పెట్టి గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరిగా పని చేసి చివరకు డ్యాన్స్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు జానీ. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కొరియోగ్రఫీ అందిస్తున్న అతడు ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే హీరోగా మారినా తన ప్యాషన్‌ను పక్కన పడేయలేదు. తాజాగా అతడు రామ్‌చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న మెగా మూవీకి కొరియోగ్రాఫర్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. "శంకర్ డైరెక్ట్ చేసిన ప్రేమికుడు చిత్రంలోని ముకాబులా పాటకు స్టేజ్ పర్ఫామర్‌గా మొదలైంది నా ప్రయాణం. తర్వాత బాయ్స్ సినిమాలో 500 మంది బ్యాకప్ డ్యాన్సర్లలో ఒకరిగా పని చేశాను. ఇప్పుడు ఏకంగా శంకర్ సినిమాలో అది కూడా నా ఫేవరెట్ హీరో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రంలో కొరియోగ్రాఫర్‌గా పని చేసే అవకాశం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు రామ్‌చరణ్‌కు, నిర్మాత దిల్ రాజుకు సర్వదా కృతజ్ఞుడిని" అని జానీ మాస్టర్ ట్వీట్ చేశాడు. Being a stage performer to #Muqabula song to Backup dancer among 500+ people in #Boys, I've admired @shankarshanmugh Sir alot. Now, being the main choreographer to his film with my fvt. Hero, person #RamCharan Sir #RC15 feels unbelievable. Thank you for believing in me Sir 😍 pic.twitter.com/W6uCWU8Kt8 — Jani Master (@AlwaysJani) July 17, 2021 -
తెరపైకి ఆమె డ్యాన్స్ కహానీ
బాలీవుడ్ దివంగత ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితం వెండితెరపైకి రానుంది. సరోజ్ ఖాన్ బయోపిక్‌ను నిర్మించనున్నట్లు నిర్మాత భూషణ్ కుమార్ శనివారం వెల్లడించారు. సరోజ్‌ఖాన్ తొలి వర్ధంతి (జూలై 3) సందర్భంగా ఈ బయోపిక్‌ని ప్రకటించారు. ‘‘సరోజ్‌ఖాన్ తన డ్యాన్స్ మూమెంట్స్‌తో హిందీ సినిమాలో ఓ విప్లవాన్నే తీసుకువచ్చారు. ఆమె కంపోజ్ చేసిన స్టెప్స్‌లో తమ అభిమాన తారల డ్యాన్స్‌ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. సరోజ్ బయోపిక్కు ఆమె కుమారుడు రాజు ఖాన్, సుఖైనా ఖాన్ సహకరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత భూషణ్ కుమార్. ‘‘మా అమ్మగారి బాటలోనే నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. చిన్నతనం నుంచే అమ్మ ఎన్ని కష్టాలు పడి, ఇండస్ట్రీలో ఎంత ఉన్నత స్థానం సంపాదించిందో నాకు తెలుసు. అమ్మ బయోపిక్ తెరపైకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రాజు ఖాన్. ‘‘ఈ బయోపిక్‌లో అమ్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చూపించనున్నాం’’ అన్నారు సుఖైనా ఖాన్. సరోజ్ ఖాన్ పాత్రను ఎవరు చేస్తారనేది త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు భూషణ్ కుమార్. దాదాపు 3 వేల పాటలకు పైగా కొరియోగ్రఫీ చేసిన సరోజ్ ఖాన్ మూడు సార్లు జాతీయ అవార్డు సాధించారు. 2020 జూలై 3న గుండెపోటుతో ఆమె మరణించారు. -
ఆట సందీప్‌కు వాయిస్ మెసేజ్ పంపిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్- జ్యోతీ రాజ్ దంపతులకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ మెసేజ్ పంపించారు. 'మీ థ్యాంక్యూ మెసేజ్ నాకు అందింది. అమ్మ మాటలు, ఆమె దీవెనలు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. మీరు ఇద్దరు చేసే డ్యాన్స్ బిట్స్ అప్పుడప్పుడు నా దృష్టికి వస్తుంటాయి. మీ కపుల్స్ చాలా లవ్లీ డ్యాన్సర్స్. మీ క్రేజ్ నన్ను బాగా ఆకటుకుంటుంది. భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద కొరియోగ్రాఫర్‌గా రాణించాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను' అని స్వయంగా చిరంజీవి పంపిన వాయిస్ మెసేజ్‌ను ఆట సందీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో చిరంజీవి ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆట సందీప్ తల్లికి కూడా వ్యాక్సిన్ వేయించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ వల్ల ఎంతోమంది డ్యాన్సర్లు కూడా పని లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలుస్తూ, గత కొన్ని రోజులుగా డ్యాన్సర్లకు సందీప్ దంపతులు నిత్యవసర వస్తువులు పంపిస్తున్న సంగతి తెలిసిందే. షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డ్యాన్సర్లు సహా చాలామందికి ఆదాయం లేకుండా పోయింది. దీనివల్ల పూట గడవక చాలామంది బాధపడుతున్నారు. వాళ్లను ఆదుకునేందుకు ఆట సందీప్ దంపతులు తమవంతు సహాయం చేస్తున్నారు. మరోవైపు సందీప్‌కు మరింత సహకారం అందించేందుకు చిరంజీవి అల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ సైతం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు స్వయంగా చిరంజీవి నుంచి వాయిస్ మెసేజ్ అందడంతో ఆట సందీప్ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నోటి నుంచి తమ పేరు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆట సందీప్ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరంజీవి నుంచి మెసేజ్ రావడం నిజంగా సూపర్ అంటూ అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి : సినీ కార్మికులందరికి ఉచితంగా వ్యాక్సిన్ : చిరంజీవి 'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే! -
సన్నిహిత సన్నివేశాల రూపశిల్పి
తాము చేస్తున్నది నటన అని నటీనటులకు తెలుసు. దర్శకుడు చెప్పింది చేయాలని కూడా తెలుసు. అయితే ఆ చెప్పింది తమ కంఫర్ట్ లెవల్లో చేయాలని అనుకుంటే అందుకు ఒక ఎక్స్పర్ట్ కావాలి. ప్రేమ సన్నివేశాలు, శోభనం సన్నివేశాలు, సన్నిహిత సన్నివేశాలు ఇప్పుడు కథల్లో పెరిగాయి. చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ‘డాన్స్ కొరియోగ్రాఫర్లు’ ఉన్నట్టుగానే ‘ఇంటిమసీ కొరియోగ్రాఫర్లు’ ఎందుకు లేరు అనుకున్నారు ఆస్థా ఖన్నా. భారతదేశపు తొలి ‘ఇంటిమసి కో ఆర్డినేటర్’గా ఇప్పుడు ఆమె ఒక కొత్త ఉపాధి మార్గాన్ని చూపుతున్నారు. ‘మీ టూ’ ఉద్యమం వచ్చే వరకూ ప్రపంచ సినిమా మేకింగ్ ఒకలా ఉండేది. ‘మీ టూ’ వచ్చాక మారిపోయింది. సన్నిహిత సన్నివేశాలలో నటించేటప్పుడు ఆ నటక ఏదైనా తప్పు సంకేతం ఇస్తే అపార్థాలు జరిగి సమస్య ఉత్పన్నం కావచ్చునని ముఖ్యంగా మగ నటులు భావించడం మొదలెట్టారు. మరో వైపు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ వల్ల, మారిన సినిమా ధోరణుల వల్ల ‘సన్నిహిత’ సన్నివేశాలు విపరీతం గా పెరిగాయి. సన్నిహితమైన కంటెంట్తోటే కొన్ని వెబ్ సిరీస్ జరుగుతున్నాయి. ప్రేక్షకులు భిన్న అభిరుచులతో ఉంటారు. వీరిని ఆకర్షించడానికి రకరకాల కథలు తప్పవు. అయితే ఇలాంటి కథల్లో ఏ చిక్కులూ రాకుండా ఉండేందుకు, నటీనటులు ఇబ్బంది లేకుండా నటించేందుకు సెట్లో ఉండి తగిన విధంగా సూచనలు ఇస్తూ బాధ్యత తీసుకునే కొత్త సినిమా క్రాఫ్ట్వారు ఇప్పుడిప్పుడే మొదలయ్యారు. వీరిని ‘ఇంటిమసీ కోఆర్డినేటర్లు’ లేదా ‘ఇంటిమసీ కొరియోగ్రాఫర్లు’ అంటున్నారు. బాలీవుడ్లో ఒక మహిళ మొట్టమొదటిసారి సర్టిఫైడ్ ఇంటిమసి కోఆర్డినేటర్ అయ్యింది. ఆమె పేరు ఆస్థా ఖన్నా. ముంబైలోని ‘ఇంటిమసీ ప్రొఫెషనల్ అసోసియేషన్’ ద్వారా శిక్షణ, సర్టిఫికెట్ పొందిమరీ ఈమె ఈ రంగంలోకి వచ్చారు. నిజంగా ఇదొక విశేషమైన వార్త. సగటు సమాజ భావజాలంలో ఒక స్త్రీ ఇలాంటి ఉపాధి ఎంచుకోవడం విశేషమే. ఎవరీ ఆస్థా చద్దా ఆస్థా చద్దా లండన్‌లో చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి బాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. ఆ మధ్య హిట్ అయిన ‘అంధా ధున్’కు పని చేసింది. భారతదేశంలో తయారయిన ‘మస్త్ రామ్’ అనే వెబ్ సిరీస్‌కు ‘ఇంటిమసీ కోఆర్డినేటర్’గా ఆస్ట్రేలియాకు చెందిన అమండా కటింగ్ వచ్చి పని చేసింది. ఆ సంగతి ఆస్థా చద్దా తెలుసుకుంది. అదీ గాక తాను పని చేసిన సినిమాలలో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ సమయం లో నటీనటులు, దర్శకుడు ఏదో ఒక ‘తక్షణ ఆలోచన’తో పని చేస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది. నిజానికి సన్నిహిత సన్నివేశాలు అప్పటికప్పుడు ఆలోచించి చేసేవి కావు. వాటికి ప్రత్యేక సూచనలు, జాగ్రత్తలు అవసరం. ఆ ఖాళీ భారతీయ సినిమారంగంలో ఉందని ఆస్థా అర్థం చేసుకుంది. వెంటనే తాను శిక్షణ పొంది ఇంటిమసి కోఆర్డినేటర్‌గా ఉపాధి ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్‌లో తయారవుతున్న మూడు నాలుగు వెబ్ సిరీస్‌కు పని చేసింది ఆస్థా. వీరేం చేయాలి? హీరో హీరోయిన్లుగాని, కేరెక్టర్ ఆర్టిస్టులు కాని వివిధ సందర్భాలకు తగినట్టుగా సన్నిహితంగా నటించాలి. అయితే ఇద్దరూ భిన్న నేపథ్యాల నుంచి వచ్చి ఉంటారు. ఎంత అది నటన అయినా దానికి ఇబ్బంది పడే వీలు ఎక్కువ. కొందరు అదుపు తప్పి వ్యవహరించవచ్చు కూడా. వీటన్నింటిని ‘ఇంటిమసి కోఆర్డినేటర్లు’ పర్యవేక్షిస్తారు. దుస్తులు, కెమెరా యాంగిల్స్, నటీనటుల మూవ్మెంట్స్ వీరే గైడ్ చేస్తారు. ‘నటీనటులకు తగ్గట్టు అవసరమైతే డూప్స్‌ను వాడటం, వారి శరీరాలు దగ్గరగా ఉన్నా ఇద్దరి మధ్య కొన్ని అడ్డంకులు ఉంచడం, ఎంతవరకు సీన్‌కు అవసరమో అంతవరకూ నటించేలా చూడటం మా పని’ అంటుంది ఆస్థా ఖన్నా. ఏ సన్నివేశాలలో ఏ నటీనటులైతే నటించాలో వారితో ముందు వర్క్‌షాప్ నిర్వహించడం కూడా ఆస్థా పని. ‘దానివల్ల నటీనటులు తీయవలసిన సీన్‌కు ప్రిపేర్ అవుతారు. చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటుందామె. పిల్లల రక్షణ కూడా ఇంటిమసీ కోఆర్డినేటర్లు షూటింగ్లో పాల్గొనే పిల్లలతో తోటి నటుల ‘స్పర్శ’ను కూడా గమనిస్తారు. తండ్రి పాత్రలు వేసేవారు కుమార్తెగా లేక కుమారుడిగా నటించే పిల్లలతో నటించేటప్పుడు ఆ పిల్లలు ఎంత కంఫర్ట్‌గా ఉన్నారు, ఆ టచ్‌లో ఏదైనా దురుద్దేశం ఉందా ఇవన్నీ కూడా ఇంటిమసీ కోఆర్డినేటర్లు గమనించి పిల్లలకు సూచనలు ఇస్తారు. ‘వాళ్లు ఇబ్బంది పడే సన్నివేశానికి నో చెప్పడం మేము నేర్పిస్తాం’ అంటుంది ఆస్థా ఖన్నా. శరీరాలు ఇబ్బంది పడే సన్నివేశాలంటే కేవలం అత్యాచార సన్నివేశాలే కాదు... బైక్ మీద హీరోను కరుచుకుని కూచోవాల్సిన సమయంలో కూడా ఆ నటికి ఇబ్బంది ఉండొచ్చు. లేదా నటుడికి ఇబ్బంది ఉండొచ్చు. ఆ సమయంలో ఇంటిమసి కోఆర్డినేటర్లు తగిన జాగ్రత్తలు చెప్పి షూట్ చేయిస్తారు. గతంలో ఫలానా సన్నివేశంలో నటించడానికి ఇబ్బంది పడి షూటింగ్ మానేసిన తారలు ఉన్నారు. ఇప్పుడు కోఆర్డినేటర్లుగా స్త్రీలు ముందుకు రావడం వల్ల తమ ఇబ్బందులు వారితో షేర్ చేసుకునే వీలుంది. వీరు డైరెక్టర్‌తో చెప్పి షూటింగ్ సజావుగా అందరి ఆమోదంతో జరిగే విధంగా చూసే వీలు ఉంది. చూడబోతే మున్ముందు ఆస్థా ఖన్నా వంటి ప్రొఫెషనల్స్ అవసరం మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఉపాధిని కనిపెట్టడమే కాదు దానిని గౌరవప్రదంగా నిర్వహించడం కూడా ఈ తరం తెలుసుకుంటోంది. దానిని మనం స్వాగతించాలి. – సాక్షి ఫ్యామిలీ -
లాక్డౌన్ తిప్పలు: డ్యాన్సర్లకు శేఖర్ మాస్టర్ సాయం!
లాక్డౌన్ వల్ల చాలామందికి పూట గడవలేని పరిస్థితి నెలకొంది. కళను నమ్ముకుని జీవనం సాగిస్తోన్న ఎంతోమంది డ్యాన్సర్లు కూడా పని లేక పస్తులు ఉండాల్సిన దుస్థితి వచ్చింది. అందరికీ ఎంటర్టైన్మెంట్ అందించే డ్యాన్సర్లు కడుపు మాడ్చుకునే పరిస్థితికి రావడాన్ని చూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చలించిపోయాడు. డ్యాన్సర్లకు తానున్నాంటూ అండగా నిలబడ్డాడు. నిత్యావసర సరుకుల కోసం తనను సంప్రదించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. "గత కొద్దిరోజులుగా డ్యాన్సర్లకు పని లేదు. అలాగే షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డ్యాన్సర్లు సహా చాలామందికి ఆదాయం లేకుండా పోయింది. దీనివల్ల పూట గడవక చాలామంది బాధపడుతున్నారు. ఏ డ్యాన్సర్ అయినా సరే, మీకు నిత్యావసర సరుకులు అవసరమైతే కింది నంబర్‌కు ఫోన్ చేయండి. కాల్ చేసి సరుకులు తీసుకెళ్లండి. లాక్డౌన్ ఉంది కాబట్టి హైదరాబాద్‌లో ఉన్నవారికే సరుకులు ఇవ్వడం సాధ్యమవుతుంది. బయట పరిస్థితులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరూ బయట అడుగు పెట్టకండి" అని శేఖర్ మాస్టర్ విజ్ఞప్తి చేశాడు. -
సల్మాన్ భాయ్‌కు థ్యాంక్స్: కొరియోగ్రాఫర్ భార్య
ఇటీవలే గుండెపోటుకు గురైన ప్రముఖ కొరియోగ్రాఫర్, 'ఏబీసీడీ' దర్శకుడు రెమో డిసౌజ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే రెమో గుండెపోటుకు గురైన సమయంలో అతడి భార్య లిజెల్ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ ఆమెకు బాసటగా నిలబడి, మానసిక స్థైర్యాన్ని నింపారట. ఈ విషయాన్ని లిజెల్ సోషల్ మీడియాలో తెలుపుతూ కష్టకాలంలో తనకు కొండంత అండనిచ్చిన సల్మాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన భర్తను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. (చదవండి: ఇంతకూ ధనశ్రీ ఎవరో తెలుసా!) పట్టలేనంత సంతోషంగా ఉంది "నాకు దక్కిన బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ ఇదే. నా భర్త మళ్లీ కోలుకోవడం సంతోషంగా ఉంది. వారం రోజులుగా అత్యంత దారుణమైన క్షణాలను గడిపిన తర్వాత ఆయన్ను హత్తుకోవడం ఎంతో బాగుంది. రెమో ఆస్పత్రిలో ఉన్న సమయంలో నాకు మానసిక ధైర్యాన్ని నూరిపోసిన సల్మాన్ భాయ్‌కు హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఒక దేవదూతలాగా ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటున్నందుకు థ్యాంక్యూ సో మచ్. రెమో కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెమో ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చినందుకు నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. ఛలో ఇప్పుడు మనం క్రిస్మస్ పండగ సంబరాలను మొదలు పెడదాం" అని ఆమె రాసుకొచ్చారు. కాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రేస్ 3' చిత్రానికి రెమో దర్శకత్వం వహించారు. అలాగే 'ఏబీసీడీ (ఎనీ బడీ కెన్ డాన్స్)', 'ఏబీసీడీ 2', 'ఎ ఫ్లయింగ్ జాట్' సినిమాలకు డైరెక్షన్ చేశారు. 'బాజీరావ్ మస్తానీ' చిత్రంలోని దీవానీ మస్తానీ పాటకుగాను అతడు 63వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డును సొంతం చేసుకున్నారు. డ్యాన్స్ ప్లస్, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, ఝలక్ దిఖ్లా జాలాంటి రియాల్టీ షోలలో జడ్జిగా కూడా వ్యవహరించారు. (చదవండి: ప్రముఖ కొరియోగ్రాఫర్‌కు గుండెపోటు) View this post on Instagram A post shared by Liz (@lizelleremodsouza) -
8 ఏళ్ల తర్వాత జుట్టు కత్తిరించా: కొరియోగ్రాఫర్
ముంబై: కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ మెల్విన్ లూయిస్ క్యాన్సర్ పేషెంట్ల కోసం తన జుట్టును దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ లేఖను షేర్ చేశారు. "క్యాన్సర్ రోగులకు దానం చేయడం కోసం నా జుట్టును పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాన్ని కత్తిరించే సమయం ఆసన్నమైందని భావించాను. నిజానికి నాకు భుజాల వరకు జుట్టు ఉండటమే ఇష్టం. కానీ దాన్ని ఇంకా పొడవుగా పెంచుకుని.. క్యాన్సర్ పేషెంట్లకు అవసరమయ్యే విగ్గుల కోసం దానం చేయవచ్చు కదా అనిపించింది. ఈ క్రమంలో నేను పొడవు జుట్టుతో చేసిన వీడియోలు కొన్ని వైరల్ కూడా అయ్యాయి" (చదవండి: నేనేమీ తనను బలవంతపెట్టలేదు: సనా భర్త) "అయితే ఇలా ఎందుకు జుట్టు పెంచుకుంటున్నానన్నది కొందరికే తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసింది. 8 ఏళ్ల తర్వాత నేను నా జుట్టును కత్తిరించాను. క్యాన్సర్ మహమ్మారితో పోరాడేవారి కోసం నేను ఎప్పటికీ ప్రార్థిస్తాను, వారిపై నా ప్రేమ ఎల్లప్పటికీ ఉంటుంది. ఇలాంటి మంచి పనులు చేయడానికి నన్ను ప్రేరేపించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చారు. కాగా మెల్విన్ స్నేహితులు చిన్న వయసులోనే క్యాన్సర్ పేషెంట్ల కోసం జుట్టును దానం చేశారు. దాన్ని ప్రేరణగా తీసుకునే అతడు ఈ పనికి పూనుకున్నారు. మెల్విన్ చేసిన మంచిపనికి అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మీరు మాకు ఇన్స్పిరేషన్గా నిలిచారని కీర్తిస్తున్నారు. (చదవండి: క్యాన్సర్ పిల్లలకు తల్లిగా...) View this post on Instagram A post shared by Melvin Louis (@melvinlouis) View this post on Instagram A post shared by Melvin Louis (@melvinlouis) -
98 కిలోలు ఎలా తగ్గాడబ్బా?
ముంబై: బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు గణేశ్ ఆచార్య ఏకంగా 98 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు. కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఏబీసీడీ చిత్రంలో గణేష్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అయన భారీ శరీరంతో కనిపించారు. అయితే ఆ సమయంలో ఆయన దాదాపు 200 కిలోల బరువు ఉన్నారంట. ఇటీవల ప్రముఖ కపిల్ శర్మ కామెడీ షోకు అథితిగా వచ్చిన ఆయన ఏడాదిన్న కాలంలో 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. అయితే ఇదంతా అంత ఈజీగా జరగలేదని, ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్కరోజు కూడా జిమ్ మానకుండా కఠిన కసరత్తులు చేసి తగ్గానని చెప్పుకొచ్చారు. అంతేగాక 2015లో తను నటించిన ‘హే బ్రో’ సినిమా కోసం కూడా దాదాపు 40 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. కాగా బాలీవుడ్లో గణేశ్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, గోవింద, అజయ్ దేవగన్ వంటి సూపర్ స్టార్లకు ఆయన కొరియోగ్రాఫి అందించారు. ఈ క్రమంలో 2018లో ‘టాయ్‌లెట్’ సినిమాలోని ‘గోరీ తూ లాత్ మార్’ పాటకు పని చేసిన ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
ప్రముఖ కొరియోగ్రాఫర్‌కు గుండెపోటు
సాక్షి, ముంబై: ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘రేస్ 3’ దర్శకుడు రెమో డిసౌజా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం ఆందోళన రేపింది. శుక్రవారం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. తమ అభిమాన కొరియోగ్రాఫర్ రెమో త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. రెమో ప్రస్తుతం అతను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని రెమో భార్య లిజెల్ వెల్లడించారు. డాక్టర్లు అతనికి యాంజియోప్లాస్టీ నిర్వహించారనీ, ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కాగా డ్యాన్స్ ప్లస్, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, ఝలక్ దిఖ్లా జాలాంటి రియాల్టీ షోలలో జడ్జిగా కూడా వ్యవహరించారు. వరుణ్ ధావన్ , శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ‘స్ట్రీట్ డాన్సర్ 3 డి’ ఆయన లేటెస్ట్ మూవీ. ముఖ్యంగా ఏబీసీడీ (ఎనీ బడీ కెన్ డాన్స్), ఏబీసీడీ 2, ఎ ఫ్లయింగ్ జాట్ సినిమాలకు దర్శకత్వం నిర్వహించారు రెమో. బాజీరావ్ మస్తానీ మూవీలోని దీవానీ మస్తానీ పాటకుగాను అతడు 63వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డును సొంతం చేసుకున్నారు. Hope that #RemoDsouza Get Well Soon .Praying for his speedy recovery 🙏🙏❤️❤️ @remodsouza — Dhirendra Tiwari (@DhiruBhai0495) December 11, 2020 Get well soon man you are an inspiration for all the youth praying to God #Godblessyou #RemoDsouza — Sanghi (@saanvi_j) December 11, 2020 Get well soon @remodsouza Praying for you #RemoDsouza❣️ pic.twitter.com/EttCqVmwBb — PavitraPunia🤙 (@PavitraPunia_Fc) December 11, 2020 -
నెల కిత్రమే కరోనా పాజిటివ్: శేఖర్ మాస్టర్
శేఖర్ మాస్టర్ స్టెప్పులకు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందరో స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్. స్టెప్పులతో వెండితెరపై, పంచ్‌లతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతాడు. ఈమధ్యే శేఖర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే తొందరగానే కరోనాను జయించి ప్లాస్మాదానం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. (బలవంతంగా ఒప్పించారు: రియా) ఇందులో శేఖర్ మాట్లాడుతూ.. "ఇప్పుడే ప్లాస్మా ఇచ్చాను. నెల కిత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. కిమ్స్‌లో చికిత్స తీసుకున్నా. ఇప్పుడు నా వంతు సాయంగా ప్లాస్మా ఇచ్చాను. సంతోషంగా ఉంది. కరోనా నుంచి రివకరీ అయిన వారు కూడా ప్లాస్మాదానం చేయండి, ప్రాణాలు నిలబెట్టండి" అని కోరాడు. కాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేశారంటూ మాస్టర్‌ను కొనియాడుతున్నారు. (శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు: సంజన అరెస్టు!) -
ప్రముఖ కొరియోగ్రాఫర్ నిశ్చితార్థం
ముంబై : ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు పునీత్ పాథక్ తన చిరకాల ప్రేయసి నిధి నిధి మూనీసింగ్ను నిశ్చితార్థం చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇరువురు నిశ్చితార్థపు ఉంగరాలను మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పునీత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీటికి ‘జీవితానికి ఆరంభం’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక ఈ నూతన జంటకు పలువురు అభినందనలు తెలిపారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పునీత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వరణ్, పునీత్ కలిసి ఎబీసీడీ2, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. (టీమిండియా క్రికెటర్ నిశ్చితార్థం..) కొరియోగ్రాఫర్ టెరెన్స్ టూయిస్, సింగర్ ఆదిత్య నారాయణ్, మౌని రాయ్, ఇషా గుప్తా, గౌహర్ ఖాన్, మో డిసౌజాతో పాటు ఇతరులు సోషల్ మీడియా వేదికగా పునీత్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ షోలో రన్నరప్‌గా నిలిచారు. తర్వాత హలా లక్ దిఖా జా, దిల్ హై హిందుస్తానీ, డాన్సు ప్లస్, ఇండియా బనేగా మంచ్, డాన్స్ ఛాంపియన్స్ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. 2013లో రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఏబీసీడీ సినిమా ద్వారా పునీత్ బాలీవుడ్లో అడుగు పెట్టారు. ('ఫిదా' నటుడి నిశ్చితార్థం) View this post on Instagram To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . . PC : @tanmayechaudhary . . #ENGAGED A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on Aug 26, 2020 at 6:32am PDT View this post on Instagram To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . , PC: @tanmayechaudhary . . #engaged A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on Aug 26, 2020 at 6:31am PDT View this post on Instagram To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . . PC : @tanmayechaudhary . . #engaged A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on Aug 26, 2020 at 6:30am PDT -
ఇంతకూ ధనశ్రీ ఎవరో తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. చహల్ కొంతకాలంగా ధనశ్రీ వర్మ అనే యువతిని ప్రేమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తననే పెళ్లి చేసుకోబోతున్నానని, ఇవాళ (శనివారం) రోకా కార్యక్రమం కూడా జరిగినట్లు చహల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రోకా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ అవును ‘మేము ప్రేమించుకున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఈ ధనశ్రీ వర్మ ఎవరా? అని తెలుసుకునేందుకు నెటిజన్లు, చహల్ అభిమానులు గూగుల్‌లో వెతకడం మొదలు పెట్టారు. అయితే ఈ ధనశ్రీ.. ఓ డ్యాన్సర్, కొరియోగ్రఫర్. తన పేరు మీద సొంతంగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. (చదవండి: టీమిండియా క్రికెటర్ చహల్ పెళ్లి ఆమెతోనే) అతే విధంగా బాలీవుడ్ ట్రాక్స్ డ్యాన్సర్‌తో పాటు హిప్ హాప్లో శిక్షణ కూడా ఇస్తూ ఉంటుంది. అంతేకాదు తను ఫేమస్ యూట్యూబర్ కూడా. యుట్యూబ్లో తనకు 1.5 మిలియన్న్ల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాగా ధనశ్రీ వర్మ జూలై 23 చహల్ పుట్టిన రోజు సంద్భంగా శుభకాంక్షలు చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో సల్మాన్ ఖాన్ ‘భరత్’లోని ఓ స్లో మోషన్ సాంగ్‌కు చహల్ డ్యాన్స్ చేస్తున్నవీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. “డ్యాన్స్ టీచర్‌గా నేను మీ వికెట్ తీశానని చెప్పాలనుకుంటున్నాను @yuzi_chahal23 మీరు ఎప్పుడు సరదాగా ఉండే విద్యార్థి, అద్భుతమైన వ్యక్తి కూడా” అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. దీనికి చహల్ ‘ధన్యవాదాలు’ అంటూ హర్ట్ ఎమోజీని జోడించి సమాధానం ఇచ్చాడు. -
కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తనున్న హీరోయిన్?!
సాయి పల్లవి పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆమె డ్యాన్స్. 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి డ్యాన్స్ పరంగా తనకు పోటీ వచ్చే హీరోయిన్స్ లేరని నిరూపించుకున్నారు. ఇప్పటికే సాయి పల్లవి ‘రౌడీ బేబి’, ‘పిల్లా రేణుకా’ పాటలకు ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆమెకు ఓ కొత్త బాధ్యత అప్పగించారట. ఎలాంటి డాన్స్ అయినా అలవోకగా చేయగలిగే సత్తా సాయి పల్లవిది. ఆ నమ్మకం తోనే 'లవ్ స్టోరీ'లో ఓ పాట కొరియోగ్రఫీ బాధ్యతలను ఆమె భుజాలపై వేశారట. ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లవ్ స్టోరీ’ సినిమాకు సంబంధించి మరో రెండు వారాల షూటింగ్ పెండింగ్‌లో ఉంది. ఈ షెడ్యూల్లో ఓ పాటను కూడా చిత్రీకరించాల్సి ఉన్నట్లు సమాచారం. ఇదే పాటకు సాయి పల్లవిని కొరియోగ్రఫీ చేయమని కోరారంట శేఖర్ కమ్ముల. మరికొద్ది రోజుల్లో రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. -
‘మాస్టర్ జీ’ మరి లేరు
బాలీవుడ్ చిత్రపరిశ్రమ గౌరవంగా ‘మాస్టర్ జీ’ అని పిలుచుకునే సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. ఆమె అసలు పేరు నిర్మల నాగ్‌పాల్. ఇండస్ట్రీలో సరోజ్ ఖాన్‌గా గుర్తింపు పొందారు. జూన్ 20న ఆమెకు శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురైతే బాంద్రాలోని గురునానక్ హాస్పిటల్లో చేర్చారు. కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అయితే సుదీర్ఘకాలంగా ఆమె డయాబెటిస్ పేషెంట్ కావడం చేత ఇతర వయసు సంబంధ సమస్యల రీత్యా హాస్పిటల్లోనే ఉన్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా హఠాత్తుగా వచ్చిన గుండెపోటు వల్ల మరణించినట్టు ఆస్పత్రివర్గాలు చెప్పాయి. ఆమె ఖననం శుక్రవారమే ముగిసిందని ఆమె మేనల్లుడు మనిష్ జగ్వాని తెలియచేశాడు. సరోజ్ ఖాన్ తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో దాదాపు 2000 పాటలకు కొరియోగ్రాఫ్ చేశారు. వైజయంతీ మాల, వహీదా రహెమాన్లు మొదలు శ్రీదేవి, మాధురి దీక్షిత్, కరీనా కపూర్ వరకు ఎందరో తారలు ఆమె నాట్యరీతుల వల్ల పేరు తెచ్చుకున్నారు. మూడుసార్లు జాతీయ పురస్కారం పొందారు. ఫిల్మ్‌ఫేర్‌లో హ్యాట్రిక్ కొట్టిన ఏకైక కొరియోగ్రాఫర్ ఆమె. చిరంజీవి హిందీ సినిమా ‘జంటిల్మేన్’, రామ్ గోపాల్ వర్మ ‘రంగీలా’ సినిమాలకు సరోజ్‌ఖాన్ నృత్యరీతులు అందించారు. డాన్స్ ఏమాత్రం చేయలేని సంజయ్ దత్‌కు నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి ‘తమ్మా తమ్మా దేదే’ హిట్ ఇచ్చిన గురువు ఆమె. సరోజ్ ఖాన్ తన నాట్యగురువు సోహన్‌లాల్‌ను తన 13వ ఏట వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 41. ఆ వివాహం నిలువలేదు. ఆ తర్వాత సర్దార్ రోషన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు రాజు ఖాన్ బాలీవుడ్లో కొరియోగ్రాఫర్‌గా ఉన్నాడు. -
‘సినిమా ఆఫర్లు లేవు.. సల్మాన్ మాటిచ్చాడు’
ముంబై: ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె తీవ్రమైన గుండెపోటుతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక సరోజ్ ఖాన్ హఠాన్మరణంతో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. నృత్య దర్శకురాలికి సెలబ్రిటీలంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు. సరోజ్ ఖాన్ తన 14 ఏళ్ల వయస్సులోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టగా, దిల్ హి తో హై(1963) సినిమాలోని ‘నిగహీన్ మిలాన్ కో జీ చహహ్తా’ పాటకు మొదట కొరియోగగ్రాఫ్ చేశారు. అప్పటి నుంచి ఎన్నో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రాఫ్ చేసి ఎంతో మంది ప్రశంసలు పొందారు. (సరోజ్ ఖాన్ చివరి పోస్ట్ అతడి గురించే) ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గిపోయాయని వెల్లడించారు. ఆమె పరిస్థితిని గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ సరోజ్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు పేర్కొన్నారు. ‘నేను సల్మాన్‌ను కలిసినప్పుడు ఏం చేస్తున్నానని అడిగాడు. సినిమా ఆఫర్లు ఏమి లేవని నిజాయితీగా సమాధానమిచ్చాను. కేవలం యువ హీరోయిన్లకు భారతీయ శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్నాని తెలిపాను. అది విన్న వెంటనే సల్మాన్ నాతో కలిసి పనిచేస్తానని, నా కొరియోగ్రఫీలో తను డ్యాన్స్ చేస్తానని చెప్పాడు. ఇచ్చిన మాటకు సల్మాన్ కట్టుబడి ఉంటాడని నాకు తెలుసు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు’ అని సరోజ్ ఖాన్ పేర్కొన్నారు. (ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత) నాలుగు దశాబ్దాల కెరీర్లో, దాదాపు 200కు పైగా సినిమాలకు 2 వేలకు పైగా పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు మూడు జాతీయ అవార్డులు వరించాయి. ఎనిమిది సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. చివరిసారిగా గతేడాది విడుదలైన మాధురి దీక్షిత్ నటించిన ‘కలంక్’ చిత్రంలోని ‘తబా హో గయే’ పాటకు కొరియోగ్రఫీ అందించారు. (బాలీవుడ్లో విషాదం: గుండెపగిలే వార్త) -
సీనియర్ కొరియోగ్రాఫర్‌కు కరోనా పరీక్షలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ వెటరన్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం నుంచి ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు బాంద్రాలోని గురునానక్ ఆస్పతిలో చేర్పించారు. శ్వాస సంబంధింద సమస్యలతో బాధపడుతున్న సరోజ్ ఖాన్‌కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్‌గా తేలింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండు మూడు రోజులు వైద్యుల పరిశీలనలో ఉంచిన అనంతరం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (అతడు కృతజ్ఞత లేని వాడు) ఇక బాలీవుడ్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో సరోజ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఇక 1980-90 కాలంలో కొరియోగ్రాఫర్‌గా సరోజ్‌ఖాన్‌ను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీదేవి, మాధురి దీక్షిత్ చిత్రాల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసి ఆడియన్స్ చేత డ్యాన్స్‌లు చేయించారు. దేవదాస్ సినిమాలోని ‘డోలా రే డోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ ఆడిపాడిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి గాను సరోజ్ ఖాన్‌కు జాతీయ అవార్డులు లభించాయి. చివరగా మాధురి నటించిన ‘కలంక్’ చిత్రంలోని కొన్ని పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. (పొలం పనుల్లో బిజీ అయిన స్టార్ నటుడు) -
కుముదిని కదంబం
‘ప్రశ్న తలెత్తితేనే సృష్టించగలం.. స్పష్టత ఉంటేనే జయించగలం’ అని నాట్యాచారిణి కుముది లఖియా తొమ్మిది పదుల జీవితం చెబుతుంది. జీవితమంతా నేర్చుకోవడం, అన్వేషించడం, బోధించడం, సృష్టించడం.. వీటికే అంకితమైంది. డెబ్భయ్యేళ్లుగా నాట్య వృత్తిలో కుముదిని లఖియా పేరు కథక్కు పర్యాయపదంగా నిలిచింది. దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి అయిన కుముదిని లఖియా పొడవాటి జుట్టుతో, సాధారణ చీర కట్టుతో వేదికపై అడుగుపెట్టింది. చూస్తున్న ప్రేక్షకుల్లో విస్మయం కలిగించింది. అప్పటి వరకు శాస్త్రీయ కథక్ నర్తకిగా భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందినప్పటికీ సంప్రదాయ స్టేజ్ మేకప్ ఇతర అలంకారాలేవీ ఆమె ఆ సమయంలో ధరించలేదు. ఒక మధ్య వయస్కుడైన భర్తకు భార్యగా, తల్లిగా స్వతంత్రభావాలను ప్రేక్షకులు ముందు రూపుకట్టిన ఆ ఒకే ఒక్క ప్రదర్శన కథక్ నృత్యానికి ఒక గొప్ప మలుపు, కొత్త శకానికి నాంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో నృత్యరీతులను కథక్ ద్వారా పరిచయం చేస్తున్న కుముదిని లఖియా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1930లో జన్మించారు. ఈ నెల 17న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. సనతాన శైలిలో కొత్త ఒరవడి సనాతన సంప్రదాయ శైలిలో శిక్షణ తీసుకున్నప్పటకీ ఎన్నో ప్రయోగాలను కథక్ కళ ద్వారా సృష్టించారు కుముదిని. నేడు భారతీయ సమకాలీన కథక్ నృత్య రీతులకు కుముదిని లఖియానే మార్గదర్శకురాలిగా భావిస్తారు. ఆమె కొరియోగ్రఫీలు నృత్య వార్షికోత్సవాలలో మైలురాళ్లుగా నిలిచాయి. ‘నా చిన్నతనం నుంచీ నాలో ఎప్పుడూ అనేక ప్రశ్నలు తలెత్తేవి. కథక్ అంటే సంప్రదాయ రీతుల్లో ఒకే విధంగా నృత్యం చేయాలా..! దీంట్లో కొత్తగా ఏమీ చేయలేమా? అని. అవే నన్ను మిగతావారి నుంచి విభిన్నంగా చూపాయి’ అంటారు కుముదిని. భారతీయ నృత్యంలో ప్రసిద్ధుడైన రామ్‌గోపాల్‌తో కలిసి 1941లో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు కుముదిని వయసు 11 ఏళ్లు. 1950లో న్యూయార్క్‌లో ప్రదర్శన ఇచ్చింది మొదలు సోలో పెర్ఫార్మర్గా, కొరియోగ్రాఫర్‌గా ప్రపంచమంతా పర్యటించింది. 1967లో భారతీయ నృత్యానికి, సంగీతానికి కేంద్రబిందువుగా ‘కదంబ్’ పాఠశాలను నెలకొల్పింది. పెరుగుతున్నది వయసు కాదు ప్రఖ్యాత కథక్ నృత్యకారులు అదితి మంగల్దాస్, దక్షా శేత్, ప్రశాంత్ షా, అంజలి పాటిల్, పరుల్ షా.. వంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఎందరో ఆమెకు శిష్యులు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డులు ఆమె ఖాతాలో సగౌరవంగా చేరాయి. రచయిత రీనా షా రాసిన ‘మూవ్మెంట్ ఇన్ స్టిల్స్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిచ్చిన జీవిత చరిత్ర ఆమెది. ఇన్నేళ్లూ నృత్యకారిణిగా కొనసాగుతున్న ఆమెలోని శక్తి రహస్యాన్ని అడిగితే – ‘నాలోనే కాదు మీ అందరిలోనూ ఉంది ఆ శక్తి. మీరు జీవితం నుండి ఏం కోరుకుంటున్నారో ఆ విషయం పట్ల స్పష్టత ఉంటే చాలు. మీద పడుతున్న వయసును కాదు గుర్తుచేసుకోవాల్సింది. మన జ్ఞానాన్ని, హృదయాన్ని ఇతరులతో ఎంత విస్తృతపరుచుకుంటే అంత శక్తిమంతులం అవుతాం. ఇప్పటికీ పాతికేళ్ల వయసున్న విద్యార్థులతో ప్రతిరోజూ చర్చిస్తుంటాను. ఆ విధంగా యువతరం ఆలోచనలను అర్థం చేసుకుంటుంటాను. నా దినచర్య బ్రహ్మముహూర్తం నుంచే మొదలవుతుంది. జీవనాన్ని తపస్సుగా భావిస్తేనే కఠినమైన పనులైనా సులువుగా అవుతాయని నా నమ్మకం’ అని చెప్పే ఈ నాట్యాచారిణి మాటలు నేటితరానికి మార్గదర్శకాలు. ముందెన్నడూ చూడని నృత్యరూపాలు ‘నా మొదటి గురువు ఎవరో నాకు తెలియదు’ అని చెప్పే కుముదినికి నృత్యం పుట్టుకతోనే అబ్బిన కళగా ప్రస్తావిస్తారు అంతా. కుముదిని రూపొందించిన కొరియోగ్రఫీలలో ధబ్కర్, యుగల్, అటాహ్ కిమ్.. వంటివి అత్యంత ప్రసిద్ధ చెందాయి. వీటిలో ముందెన్నడూ చూడని కథక్ నృత్య రూపాలను ప్రదర్శించడం ఆమె గొప్పతనం. ఈ కొరియోగ్రఫీలు కథక్‌లో ఇప్పుడు క్లాసిక్‌గా పరిగణించబడుతున్నాయి.సినిమా కొరియోగ్రాఫర్‌గానూ.. శాస్త్రీయ నృత్యానికి, సంగీతానికి కోటలా ఎదిగిన కుముదిని చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ‘బాలీవుడ్లో మూడు సినిమాలకు కొరియోగ్రఫీ చేశాను. వాటిలో ‘ఉమ్రావ్ జాన్’ సినిమా హిట్ అయ్యింది. ఒక సినిమాలో నటి జయప్రదకు కథక్ నేర్పించాను. నటి రేఖ భరతనాట్యం నేర్చుకోవడానికి చాలా కష్టపడేది. అప్పట్లో సినిమాల్లో అర్థవంతమైన నృత్యాలు ఉండేవి. ఈ రోజుల్లో ఏరోబిక్ డాన్స్ల్లా కాదు’ అంటూ నవ్వుతారు కుముదిని. కుటుంబ జీవనమూ తోడుగా.. ‘జీవితంలో ఏదీ కోల్పోలేదు. వృత్తినీ – కుటుంబాన్ని సమంగా చూసుకుంటూ వచ్చాను’ అని చెప్పే కుముదిని లా చదివిన రజనీకాంత్ లఖియాను పెళ్లి చేసుకున్నారు. రజనీకాంత్ వయోలిన్ వాద్యకారుడు కూడా. నాట్యాచార్యుడు రామ్‌గోపాల్ బృందంలో రజనీకాంత్ ఉండేవారు. వీరికి కొడుకు, కూతురు సంతానం. ప్రస్తుత మహమ్మారి పరిస్థితులను కుముదిని ముందు ప్రస్తావిస్తే –‘కరోనా గురించే కాదు జీవితంలో దేని గురించీ భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు స్వీకరించే అవగాహన మనలో పెరగాలి’ అంటారు కుముదిని. -
రాకేష్ మాస్టర్‌పై మాధవీలత ఫైర్
సాక్షి, హైదరాబాద్: గత కొద్దిరోజులుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాకేష్ మాస్టర్‌పై హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ మాస్టర్ ఎవరో తనకు తెలియదని పేర్కొన్న ఈ నటి అతడి వ్యాఖ్యలను తనను ఎంతగానో బాధించాయన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తానన్నారు. రాకేష్ మాస్టర్‌ను ఉపేక్షించేది లేదని కోర్టు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేలా చేస్తానని హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని, అతడికి పరువునష్టం కేసు ద్వారానే సమాధానం చెప్పబోతున్నట్లు వివరించారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్సీ, న్యాయవాది రాంచంద్రరావు దిశానిర్దేశంలో ముందుకు వెళ్లబోతున్నట్లు మాధవీ లత తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారాడు. అతడి వ్యాఖ్యలతో ఇండస్ట్రీ వర్గాల్లో పలు చర్చలకు కారణమవుతున్నాడు. ఇప్పటికే రాకేష్ మాస్టర్‌కు శ్రీరెడ్డి లీగల్ నోటీస్ పంపించగా తాజాగా మాధవీలత కూడా అదే మార్గంలో వెళ్లనుంది. మరి ఈ నోటీస్‌లపై రాకేష్ మాస్టర్ మరేం కామెంట్స్ చేస్తాడో వేచిచూడాలి. చదవండి: తాతయ్య కన్నుమూత.. ఉపాసన ట్వీట్ ఈశ్వర్,అల్లా,జీసస్‌లపై ఒట్టేసిన వర్మ -
బోట్ డ్యాన్సర్.. కొరియోగ్రాఫర్.. విజయ్
బౌద్ధనగర్: లక్ష్యాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడంతోపాటు ఓర్పు, నేర్పు, కష్టపడేతత్వం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రుజువు చేస్తున్నాడు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన వర్ధమాన కొరియోగ్రాఫర్ విజయ్. బోట్ డ్యాన్సర్‌గా రూ.50 రోజువారీ వేతనంతో జీవితాన్ని ప్రారంభించి నేడు సొంతంగా డ్యాన్స్ స్టూడియోను ఏర్పాటు చేసుకుని ఆసక్తిగల చిన్నారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నాడు. రోల్‌రిడా ఆల్బమ్స్‌కు నృత్యాలు అందించడంతోపాటు డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్, క్యాస్టూమ్స్ డిజైనర్‌గా ఇలా విభిన్న రంగాల్లో రాణిస్తున్నాడు విజయ్. బోట్ డ్యాన్సర్‌గా ప్రస్థానం మొదలు.. నిరుపేద కుటుంబానికి చెందిన విజయ్‌కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లంటే ఆసక్తి. లుంబినీ పార్కులో బోట్ డ్యాన్సర్‌గా చేరాడు. రోజుకు కేవలం రూ.50 వేతనం ఇచ్చేవారు. బోట్ డ్యాన్సర్‌గా కొనసాగుతూనే సొంతంగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడు. వీ9 డ్యాన్స్ స్టూడియో ఏర్పాటు సోదరుడు సంతోష్‌కుమార్ సాయంతో వారాసిగూడలో సొంతంగా వీ9 డ్యాన్స్ స్టూడియోను స్థాపించాడు. హిప్హప్, కాంటెంపరరీ, సెమిక్లాసికల్, లిరికల్ హిప్హప్ తదితర డ్యాన్స్‌ల్లో శిక్షణ ఇస్తున్నాడు. స్టూడియో సక్సెస్ కావడంతో మణికొండ, హబ్సిగూడల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి వేలాదిమందికి శిక్షణ ఇస్తున్నాడు. సినిమా ఇండ్రస్టీ నుంచి పిలుపు.. సినిమా ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో 2012లో సినిమాల్లోకి ప్రవేశించిన విజయ్ డ్యాన్సర్‌గా సుమారు 150 సినిమాల్లో నటించాడు. మిర్చి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాల్లో ప్రభాస్, పవన్‌కళ్యాణ్ సరసన స్టెప్పులేశాడు. అనంతరం కొరియోగ్రాఫర్‌గా అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. చచ్చిందిగొర్రె, తమిళతంబి వంటి సినిమాలతోపాటు రోల్‌రిడా ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా తన పనితనానికి పదునుపెట్టాడు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. చిన్నారులతో డ్యాన్స్ పోటీలు నిర్వహించి ‘ఢీ’ తరహా ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాడు. -
కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య అసభ్యంగా ప్రవర్తించారు..
ముంబై : ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని మరో మహిళ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేశారు. గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని గతవారం మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన క్రమంలో మరో మహిళ ఇదే తరహా ఆరోపణలతో ముందుకు రావడం గమనార్హం. 1990లో ముంబైలోని అంథేరిలోని సహిబా హాల్‌కు తాను వెళుతుండగా అక్కడ పలువురు మాస్టర్లు డ్యాన్స్ క్లాసులు తీసుకునేవారని, కమల్ మాస్టార్జీ వద్ద ఆచార్య అసిస్టెంట్‌గా పనిచేసేవాడని బాధిత మహిళ చెప్పుకొచ్చారు. అప్పట్లో తనకు 18 సంవత్సరాల వయసుండేదని, నాన్ మెంబర్ డ్యాన్సర్‌గా పనిచేశానని చెప్పారు. ఓ రోజు ఆచార్య లైవ్ క్లాస్‌ల పేరుతో తనను హోటల్‌కు పిలిపించి లైంగిక దాడికి యత్నించాడని, తన ఇష్టానికి వ్యతిరేకంగా తన శరీరాన్ని అభ్యంతరకరంగా తాకాడని ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానంటూ మభ్యపెడుతూ అసభ్యకరంగా వ్యవహరించాడని, తాను పీరియడ్స్‌లో ఉన్నట్టు చెప్పగానే విడిచిపెట్టాడని వాపోయారు. గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని, తనకు వచ్చిన పనిపై కమిషన్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేవాడని 33 ఏళ్ల మహిళా డ్యాన్సర్ గత వారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తనపై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను గణేష్ ఆచార్య తోసిపుచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారు పరిశ్రమలో కార్మిక సంఘాలను తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నించాడాన్ని తాను వ్యతిరేకించినందుకే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా తాను భయపడనని మిడ్డేతో మాట్లాడుతూ ఆచార్య అన్నారు. ఇక గణేష్ ఆచార్యను బహిష్కరించాలని బాలీవుడ్ పరిశ్రమను నటి తనుశ్రీ దత్తా ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. చదవండి : అశ్లీల వీడియోలు చూడమనలేదు -
అశ్లీల వీడియోలు చూడమనలేదు
స్టార్ కొరియోగ్రాఫర్,ఐఎఫ్‌టీసీఏ(ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్) ప్రధాన కార్యదర్శి గణేశ్ ఆచార్య తనపై వస్తున్న వేధింపుల ఆరోపణలపై స్పందించాడు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశాడు. తనపై అసత్య నేరాన్ని మోపుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబైకి చెందిన ముప్పైమూడేళ్ల మహిళా కొరియోగ్రాఫర్.. గణేశ్ తనను లైంగికంగా వేధించాడంటూ జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలసిందే. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ తనకొచ్చే ఆదాయంలో కమీషన్ కావాలని బెదిరించేవాడంది. అంతేకాక అశ్లీల వీడియోలు చూడాలని తనను బలవంతపెట్టేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం అతని వల్ల ఉద్యోగం కూడా కోల్పోయానని వాపోయింది. దీనిపై స్పందించిన గణేశ్ ‘నాపై వస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం కావు. నేను 2007లో పనిచేసిన బృందంలో ఆమె కూడా ఓ సభ్యురాలు. అంతకుమించి ఆమె గురించి నాకేమీ తెలియదు. ఓరోజు ఆమె ఇద్దరు వ్యక్తులతో గొడవకు దిగడానికి ముందే నేను షూటింగ్‌కు వెళ్లిపోయాను. తనకు అశ్లీల వీడియోలు చూడమని చెప్పడం అబద్ధం. ఆమె చెప్తున్నవన్నీ నిరాధారమైనవి’ అని పేర్కొన్నాడు. ఆమె ఆదాయంలో వాటా కావాలన్న వ్యాఖ్యలను సైతం ఆయన ఖండించాడు. తానెందుకు ఆమె ఆదాయంలో కమీషన్ కోరుతానని అసహనం వ్యక్తం చేశాడు. గతంలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ సైతం గణేశ్‌పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనతో బాలీవుడ్లో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు మొదలయ్యాయి. చదవండి: మహిళా కొరియోగ్రాఫర్‌కు లైంగిక వేధింపులు.. -
‘ఆ కొరియోగ్రాఫర్‌ను దూరం పెట్టాలి’
ముంబై : మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను బహిష్కరించాలని బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా సినీ పరిశ్రమను కోరారు. బాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమలు గణేష్ ఆచార్యను పూర్తిగా బహిష్కరించాల్సిన సమయం ఇదేనని ఆమె పేర్కొన్నారు. పురుష సూపర్స్టార్లతో పనిచేస్తూ మహిళా డ్యాన్సర్లు, నటులను వేధిస్తున్న అతడికి బుద్ధి చెప్పాలని అన్నారు. పరిశ్రమలో తన హోదాను అడ్డుపెట్టుకుని వర్థమాన నటీమణులు, కొరియాగ్రాఫర్లను గణేష్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. హార్న్ ఓకే ప్లీజ్ సెట్లో తాను ఎదుర్కొన్న వేధింపుల్లో గణేష్ ఆచార్య పాత్ర కూడా ఉన్నప్పటికీ ఆ తర్వాత తన ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం సాగించాడని గతంలో తాను చేసిన మీటూ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆమె పేర్కొన్నారు. హార్న్ ఓకే ప్లీజ్ సెట్లో తాను ఎదుర్కొన్న వేధింపులు, భయాందోళన పరిశ్రమను వీడేలా చేశాయని వీటితో తాను ఎదుర్కొన్న మానసిక, ఆర్థిక సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కారుపైనా వారు దాడి చేశారని, వారు నా కారును మాత్రమే ధ్వంసం చేయలేదని..నా మానసిక స్థైర్యాన్ని, స్ఫూర్తినీ దెబ్బతీశారని అన్నారు. చదవండి : వేధింపులు చిన్న మాటా! -
మహిళా కొరియోగ్రాఫర్‌కు లైంగిక వేధింపులు..
ముంబై : మహిళా కొరియోగ్రాఫర్‌ను అశ్లీల చిత్రాలు చూడాలని ఒత్తిడి చేస్తూ, లైంగిక వేధింపులకు లోనుచేస్తున్నాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. మహారాష్ట్ర మహిళా కమిషన్, అంబోలి పోలీస్ స్టేషన్లలో గణేష్ ఆచార్యపై 33 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీసీఏ) ప్రధాన కార్యదర్శి కూడా అయిన గణేష్ ఆచార్య తన ఆదాయంలో కమీషన్ ఇవ్వాలని కోరేవాడని, అశ్లీల వీడియోలు చూడాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఎఫ్‌టీసీఏ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత గణేష్ ఆగడాలు మితిమీరాయని వాపోయారు. గణేష్ కోరికను తిరస్కరించడంతో ఆయన తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ తన ఐఎఫ్‌టీసీఏ సభ్యత్వాన్ని తొలగించారని ఆరోపించారు. తనకు పని ఇవ్వరాదని ఇతర కొరియోగ్రాఫర్లకు గణేష్ లేఖలు రాశారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ సైతం గణేష్ ఆచార్య డ్యాన్సర్లను వేధిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. తనపై గణేష్ వదంతులు ప్రచారం చేశారని తనుశ్రీ దత్తా ఆరోపించారు. నానా పటేకర్‌తో పాటు గణేష్‌పైనా ఆమె ఆరోపణలు గుప్పించారు. 2008లో నిర్మించిన హార్న్ ఓకే ప్లీజ్ మూవీకి గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ మూవీ సాంగ్ చిత్రీకరణ సమయంలోనే నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. చదవండి : డబ్బులు ఇవ్వకుంటే లైంగిక దాడి కేసు పెడతా! -
ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కన్నుమూత
సాక్షి, చెన్నై: సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ చెన్నై టీనగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన ప్రముఖ నృత్య దర్శకుడు హీరాలాల్ వద్ద శిష్యరికం చేశారు. సుమారు 1700లకు పైగా చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని. 1970లలో కొరియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి శ్రీను మాస్టర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
జాని మాస్టర్‌కు జైలు శిక్ష
మేడ్చల్: రెండు డ్యాన్స్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్‌కు మేడ్చల్ ఎఎస్‌జే కోర్టు న్యాయమూర్తి జయప్రసాద్ ఆరు నెలల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. సీఐ గంగాధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షేక్ జానీ పాషా(డ్యాన్స్ మాస్టర్) తన అనుచరులు ఐదుగురితో కలిసి 2014లో మరో డ్యాన్స్ గ్రూపుతో గొడవపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మేడ్చల్ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి జయప్రసాద్ బుధవారం జాని మాస్టర్‌తో పాటు అతని అనుచరులు ఐదురురికి ఆరు నెలల జైలు శిక్ష రూ.1000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. -
స్టెప్పుకి మెప్పు
డ్యాన్స్‌లో సరికొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చి దక్షిణాది, ఉత్తరాది తారలతో ఉర్రూతలూగించే స్టెప్పులేయించిన ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అనిపించుకున్నారు ప్రభుదేవా. తండ్రి సుందరం మాస్టారుని ఆదర్శంగా తీసుకుని, ఆయన దగ్గరే సహాయకుడిగా చేసి, ఆ తర్వాత నృత్యదర్శకుడిగా మారారు ప్రభుదేవా. 13 ఏళ్ల వయసులో తొలిసారి ‘మౌనరాగం’(1986) చిత్రంలో ఫ్లూట్ వాయించే కుర్రాడిగా ఓ పాటలో కనిపించిన ప్రభుదేవా ఆ తర్వాత ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా చేశాడు. ‘ఇదయం’ (1991) (తెలుగులో ‘హృదయం’)లో చేసిన స్పెషల్ సాంగ్ ‘ఏప్రిల్ మేయిలే..’ అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఇక ‘జెంటిల్‌మేన్’లో ‘చికుబుకు చికుబుకు రైలే...’ సాంగ్‌లో ప్రభుదేవా వేసిన స్టెప్స్ సూపర్ అననివాళ్లు లేరు. ఇతర హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాటలు చేయడంతో పాటు పలువురు అగ్రహీరోల చిత్రాలకు నృత్యదర్శకుడిగానూ చేశారు ప్రభుదేవా. 16 ఏళ్ల వయసులో తొలిసారి నృత్యదర్శకుడిగా కమల్‌హాసన్ ‘వెట్రి విళా’కి చేసిన ప్రభుదేవా ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా అయ్యాడు. రజనీ ‘దళపతి’లోని ‘చిలకమ్మా చిటికెయ్యంట...’, చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’... వంటి చిత్రాలతో పాటు రీ–ఎంట్రీ మూవీ ‘ఖైదీ నం. 150’ వరకూ ప్రభుదేవా పలు చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. నాగార్జునతో ‘విక్రమ్, కెప్టెన్ నాగార్జున’ వంటి చిత్రాలకు, బాలకృష్ణ, వెంకటేశ్ .. ఇలా అగ్రహీరోలందరితో కొత్త స్టెప్పులు వేయించారు. ఒకవైపు నృత్యదర్శకుడిగా కొనసాగుతూ నటుడిగా మారారు ప్రభుదేవా. దర్శకుడు పవిత్రన్ ‘ఇందు’ చిత్రంలో ప్రభుదేవా తొలిసారి లీడ్ రోల్ చేశారు. శంకర్ ‘ప్రేమికుడు’ హీరోగా ప్రభుదేవాకు పెద్ద బ్రేక్. ఆ సినిమాలో ‘ముక్కాలా ముక్కాబులా..’, ‘ఊర్వశీ ఊర్వశీ.. టేకిట్ ఈజీ పాలసీ..’ పాటలకు ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ని నేటి తరం కూడా ఫాలో అవుతోంది. ‘మెరుపు కలలు’, ‘సంతోషం’..వంటి చిత్రాలతో పాటు డ్యాన్స్ బేస్డ్ మూవీస్ ‘స్టైల్’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలు కూడా చేశారు. డైరెక్షన్ మారింది తండ్రి దగ్గర సహాయకుడిగా చేసి, నృత్యదర్శకుడిగా స్టెప్ వేసి, నటుడిగా మరో అడుగు వేసి, ఆ తర్వాత డైరెక్టర్‌గానూ తన కెరీర్ డైరెక్షన్ మార్చారు ప్రభుదేవా. సిథ్ధార్థ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన తొలి చిత్ర ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సూపర్ హిట్. ప్రభాస్‌తో ‘పౌర్ణమి’ని తెరకెక్కించారు. చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’కి కూడా దర్శకత్వం వహించారు. తెలుగు ‘పోకిరి’కి రీమేక్‌గా తమిళంలో ‘పోకిరి’, హిందీలో ‘వాంటెడ్’గా ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రాలు దర్శకుడిగా అతని ప్రతిభను నిరూపించాయి. ఆ తర్వాత పలు తమిళ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రభుదేవా. నిర్మాతగా తమిళంలో దేవి, బోగన్తో పాటు మరో మూడు చిత్రాలను రూపొందించారు. మైసూర్లో 1973 ఏప్రిల్ 3న ముగూర్ సుందర్, మహదేవమ్మ సుందర్‌లకు జన్మించిన ప్రభుదేవా పెరిగింది చెన్నైలో. ధర్మరాజ్, ఉడుపి లక్ష్మీనారాయణన్ మాస్టార్ల దగ్గర క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని టీనేజ్లోనే సినిమాల్లోకొచ్చారు. దాదాపు 30 ఏళ్ల కెరీర్‌ని సొంతం చేసుకున్న ప్రభుదేవా సినీ రంగంలో నృత్యదర్శకుడిగా చేసిన సేవలకు గాను ‘పద్మశ్రీ’ వరించింది. -
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు : బాలీవుడ్ కొరియో గ్రాఫర్ అరెస్ట్
సాక్షి, ముంబై: ముంబై పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్‌ను ఛేధించారు. ఈ కేసులో బాలీవుడ్ కొరియో గ్రాఫర్ ఆగ్నేస్ హామిల్టన్ (56) పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని లోఖండ వాలాలో డాన్స్ క్లాసులు నిర్వహించే ఆమె వ్యభిచారం నిమిత్తం విదేశాలకు యువతులను తరలిస్తోందన్న ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం డాన్స్ అకాడమిని నిర్వహిస్తున్న ఆగ్నేస్ డ్యాన్స్ క్లాసులు పేరుతో అమ్మాయిలకు ఎరవేస్తుంది. ఆ తరువాత విదేశాల్లో, బార్లలో డాన్స్ చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయంటూ మభ్యపెడుతుంది. అనంతరం వారిని వ్యభిచారంలోకి బలవంతంగా దించుతోంది. ఇలా కెన్యా, బహ్రెయిన్ దుబాయికి అమ్మాయిలను తరలిస్తుంది. ముఖ్యంగా ఇలా ఒక యువతిని తరలిస్తుండగా ఆమె క్రైం బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించడంతో ఆమె బండారం బట్టబయలైంది. కెన్యా హోటల్లో ఉద్యోగమంటూ సదరు యువతిని కెన్యాకు తరలించగా, అక్కడ రజియా పటేల్ అనే మరోవ్యక్తి (హామిల్టన్ ఏజంట్) ఆమెను నైరోబికి తీసుకెళ్లాడు. అక్కడ వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేయడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశామని క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ సావంత్ తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇండియా మలేషియా మధ్య చక్కర్లు కొడుతూ విదేశీ వ్యభిచార రాకెట్‌ను గతకొన్నేళ్లుగా నిర్వహిస్తోందని విచారణ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు ఈ విషయాలను ఎవరికైనా చెబితే మత్తుమందుల కేసులో ఇరికిస్తానని కూడా బెదిరిస్తుందట. ఇలా విదేశాలకు పంపిన ప్రతి యువతికి 40వేల రూపాయలు తీసుకుంటుందట. -
మైనర్‌పై దారుణం : కొరియోగ్రాఫర్ అరెస్ట్
సాక్షి, ముంబై : మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కొరియోగ్రాఫర్, రియాల్టీ షో మాజీ కంటెస్టెంట్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆదిత్య గుప్తాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనకు పరిచయమైన 17 ఏళ్ల కాలేజీ విద్యార్థినికి గుప్తా మత్తు మందు ఇచ్చి లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి తల్లితండ్రులు అంథేరి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెస్టారెంట్ సమీపంలో సోమవారం స్పృహ కోల్పోయిన బాధితురాలిని పోలీసులు గుర్తించి వైద్య పరీక్షలకు తరలించారు. అనంతరం బాలిక స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడినట్టు గుప్తా పోలీసు విచారణలో అంగీకరించాడు. -
డాక్టర్ కావాలనుకుని డాన్సర్ అయ్యా..!
తమిళసినిమా: అనుకున్నవన్నీ జరగవు. జరిగేవన్నీ మన మంచికే అనుకోవాలని అంటున్నారు నృత్యదర్శకురాలు భారతి. చిన్నతనం నుంచి తాను డాక్టర్ అవ్వాలనుకుంటే.. నృత్యదర్శకురాలిగా స్థిరపడ్డానని అంటున్నారు. ఆమె సినీ పయనం ఒక డాన్సర్‌గా మొదలైంది. 17 ఏళ్లుగా ఈ రంగంలో తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ నృత్యదర్శకురాలి ఒక స్థాయికి ఎదిగారు. భారతి ప్రముఖ నృత్యదర్శకులు బృందా, కల్యాణ్, రాబర్ట్ తదితరుల వద్ద సహాయకురాలిగా పని చేశారు. దాదాపు 1000 పాటలకు డ్యాన్స్‌లో శిక్షణ మాస్టర్‌గా పనిచేశారు. డాన్సర్‌గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని బిగ్‌బాస్ రియాలిటీ షో ఫేం నటి ఓవియ కథానాయకిగా నటించిన ‘ఓవియ విట్టా యారు’చిత్రం ద్వారా నృత్యదర్శకురాలిగా ప్రమోట్ అయ్యారు. ఇటీవల పవిత్రన్ దర్శకత్వంలో విడుదలైన ధారవి చిత్రానికి నృత్య దర్శకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం వీరదేవన్, పా.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆరుద్ర, నటుడు తంబిరామయ్య కొడుకు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ఉలగం విలైక్కు వరుదు వంటి పలు చిత్రాలకు నృత్య దర్శకురాలిగా ఆమె పనిచేస్తున్నారు. దర్శకుడు ఎళిల్, లింగుస్వామి, భూపతిపాండియన్, ఆర్.కన్నన్, పన్నీర్‌సెల్వం చిత్రాలకు, తెలుగులో దర్శకులు కిరణ్, భరత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాలకు భారతి నృత్య రీతులను సమకూరుస్తున్నారు.ఏ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న నేత్ర చిత్రంలో ‘వందుటాంగయ్యా.. వందుటాంగయ్యా పాటలో సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా, నటుడు రోబోశంకర్, ఇమాన్అన్నాచ్చిలతో కలిసి మాస్స్టెప్స్ వేసి దుమ్మరేపారట. నటనే తన వృత్తిగా.. మంచి నృత్యదర్శకురాలిగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్నారు భారతి. -
ఇక మెగాఫోన్ పట్టడమే!
నెక్ట్స్గోల్ డైరెక్షనే అంటున్నారు ప్రముఖ నృత్యదర్శకుడు శోభి. కోలీవుడ్ టూ టాలీవుడ్ వయా మాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ అంటూ పలు భాషల్లో స్టార్ హీరోలతో స్టెప్స్ వేయిస్తూ ప్రముఖ నృత్య దర్శకుడిగా రాణిస్తున్న శోభి గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సీనియర్ నృత్యదర్శకుడు పౌల్రాజ్ వారసుడైన ఈయన ప్రముఖ నృత్య దర్శకులు సిన్నిప్రకాశ్, రాజుసుందరంల వద్ద సహాయకుడిగా పని చేసి నృత్యదర్శకుడిగా ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం తమిళం,తెలుగు భాషల్లో స్టార్ హీరో చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ నంబర్‌వన్ నృత్యదర్శకుడిగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సాక్షి చిట్ చాట్. చిత్ర రంగప్రవేశం గురించి? నాన్న ప్రముఖ నృత్యదర్శకుడు. నాకు ఆయనే గురువు కూడా. నృత్యదర్శకుడిగా నా చిత్రరంగప్రవేశం తెలుగు చిత్రంతోనే జరిగింది. కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అల్లరిబుల్లోడు నా తొలి చిత్రం. తమిళంలో 2004లో కమలహాసన్ నటించి న వసూల్‌రాజా ఎంబీబీఎస్ చిత్రంతో పరిచయం అయ్యాను. ఆ తరువాత నృత్యదర్శకుడిగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. ఎలాంటి పాటకు నృత్యరీతులు సమకూర్చడం కష్టం అనిపిస్తుంది. సిట్యువేషన్ సాంగ్స్‌కు నృత్యరీతులు సమకూర్చడం కష్టమనే చెప్పాలి. హీరోహీరోయిన్లతోనే చిత్రీకరించే యువళగీతాలకు డాన్స్ కంపోజ్ చేయడం అంత సులభం కాదు. డాన్స్ విషయంలో తమిళంకు, తెలుగుకు వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? పెద్దగా ఏమీ ఉండదు. అయితే తమిళంలో కథానుగుణంగా పాటల చిత్రీకరణ ఉండాలని భావిస్తారు. తెలుగులో కాస్త స్టార్ వ్యాల్యూస్‌ను బట్టి డాన్స్ కోరుకుంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఎలాంటి పాటకైనా నృత్యరీతుల్ని డిసైడ్ చేసేది సంగీతమే. ఏ హీరోకు నృత్యరీతులను సమకూర్చడం ఛాలెంజ్‌గా భావిస్తారు? తమిళంలో విజయ్‌కు నృత్యరీతులను సమకూర్చడం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ తాజా చిత్రం పీకే 25, రామ్‌చరణ్‌తేజ రంగస్థలం, మహేశ్‌బాబు కొత్త చిత్రం, నాగచైతన్య చిత్రం అలాగే తమిళంలో నీదాన్, శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న వేలైక్కారన్, పొన్రామ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మరో చిత్రం, ఏంజిలినా ఇలా చాలా చిత్రాలు చేస్తున్నాను. తమిళం, తెలుగు చిత్రాలేనా ఇతర భాషా చిత్రాలు చేశారా? మలయాళం, కన్నడం, హిందీ చిత్రాలు కూడా చేశాను. తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇతర భాషల్లో ఎక్కువ చేయలేకపోతున్నాను. మీది ప్రేమ వివాహమా? అందరూ అదే అనుకుంటారు. నిజానికి మాది పెద్దల అనుమతితో జరిగిన పెళ్లే. నా భార్య లలిత నృత్యదర్శకురాలే. మా పాప పేరు శమంతకమణి అశ్విక. ఈ పేరును నటుడు కమలహాసన్ పెట్టారు. ప్రముఖ నృత్యదర్శకుడిగా రాణిస్తున్నారు. తదుపరి గోల్? జ: దర్శకుడిగా మెగాఫోన్ పట్డడమే. అందుకు కథ సిద్ధం చేశాను. ఎప్పుడన్నది త్వరలోనే వెల్లడిస్తాను. మరి హీరో కోరిక లేదా? మీకో విషయం చెప్పాలి. నేను మొదట బాల నటుడిగానే పరిచయం అయ్యాను. తెలుగులో జూలకటక అనే చిత్రంలో నటించాను. ఆ తరువాత డాన్స్ పై దృష్టిసారించాను. ఏమో మంచి కథ అనిపిస్తే హీరోగా నటించవచ్చు. -
200 కేజీల నుంచి 85 కేజీలకు తగ్గిన సెలబ్రిటీ
ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కొత్తగా దర్శనమిచ్చారు. ఆయన లుక్ పాత గణేశ్‌ను మరిపించేస్తోంది. భారీ కాయంతో నిన్నమొన్నటి వరకూ కనిపించిన ఆచార్య.. దాదాపు 115 కిలోల బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. బరువు తగ్గడంపై మాట్లాడిన ఆచార్య ఏమన్నారంటే.. దాదాపు ఏడాదిన్నర కాలం పాటు శ్రమించిన తర్వాత నా బాడీ ఇలా తయారైంది. దాదాపు 200 కేజీల వరకూ బరువు పెరిగాను. చాలా కష్టపడ్డాను. ఆ తర్వాతే శ్రమకు తగిన ఫలితం లభించింది. నాలోని కొత్తదనాన్ని చూపించేందుకు బరువు తగ్గాను. ప్రస్తుతం నా బరువు 85 కిలోలు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా స్పష్టం తెలుస్తోంది. ఇప్పుడు చాలా కంఫర్టబుల్‌గా డ్యాన్స్ చేయగలుగుతున్నా. త్వరలోనే నా ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పెడతానని చెప్పారు ఆచార్య. భాగ్ మిల్కా భాగ్ సినిమాలో మస్తాన్ కా ఝుండ్ పాటకు కొరియోగ్రఫీ చేసిన ఆచార్యకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. -
శేఖర్ మాస్టర్‌తో సరదాగా కాసేపు
-
విద్యార్థినిపై కొరియోగ్రాఫర్ గ్యాంగ్‌రేప్
వెస్ట్‌మారేడ్‌పల్లిలో దారుణం.. హైదరాబాద్: నగరంలోని వెస్ట్‌మారేడుపల్లిలో దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థిని నగరంలో సందర్శించేందుకు వచ్చింది. బీకామ్ విద్యార్థి అయిన ఆమెకు ఎయిర్‌పోర్టులో పింకీ అనే మహిళ పరిచయం అయింది. తనతో వస్తే హైదరాబాద్ నగరాన్ని తిరిగి చూపిస్తానని మాయమాటలు చెప్పి.. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన అపార్ట్మెంటుకు తీసుకెళ్లింది. అక్కడ ఆమె స్నేహితుడు, కొరియోగ్రాఫర్ అయిన ప్రీత్ సెర్గిల్ విద్యార్థినికి నరకం చూపించాడు. ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత హించించాడు. మరునాడు తన స్నేహితులతో కూడా గ్యాంగ్‌రేప్ చేయించాడు. తనపై జరిగిన దారుణాన్ని టిష్యూ పేపర్ మీద రాసి బయటకు విసరడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఐదుగురు సామూహిక అత్యాచారం జరిపారని బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులు కొరియోగ్రాఫర్ సెర్గిల్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
టాలీవుడ్‌కు మెరుపుతీగ రీ ఎంట్రీ
ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. డ్యాన్సర్ గానే కాదు నటుడిగా కూడా మంచి మార్కులు సాధించిన ఈ మెరుపు తీగ, తరువాత దర్శకుడిగానూ సత్తా చాటాడు. బాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకొని వరుస వంద కోట్ల సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. నార్త్‌లో ఇంత సాధించినా.. ప్రభుదేవా దర్శకుడిగా మారింది మాత్రం తెలుగు సినిమాతోనే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా, తరువాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తరువాత బాలీవుడ్ వెళ్లిపోయి, సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవలే నిర్మాతగా మారి సౌత్‌లో అడుగుపెట్టిన ప్రభుదేవా.. మరోసారి తన సొంత గడ్డ పై ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తనకు దర్శకుడిగా బ్రేక్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీలో మరో సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే స్టార్ హీరోలతో కాకుండా మినిమమ్ బడ్జెట్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరి ప్రభుదేవా మరోసారి తెలుగు ప్రేక్షకులతో నువ్వొస్తానంటే మేమొద్దంటామా అని అనిపిస్తాడేమో చూడాలి. -
స్నేహితుడి సహకారంతోనే..
‘ఇద్దరం’ కొరియోగ్రాఫర్‌గా ఆదోని వాసి ఈనెల 8న విడుదల కానున్న చిత్రం ఆదోని : తెలుగు చలన చిత్ర రంగంలో ఆదోని వాసి తన ప్రతిభను చాటుతున్నాడు. ఆదోని పట్టణంలోని గౌళిపేటకు చెందిన బెనకప్ప, లక్ష్మి దంపతుల కుమారుడు కామవరం రాజు 1998లో క్లాస్, వెస్ట్రన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి స్థానికంగా గుర్తింపు పొదాడు. 2001లో హైదరాబాద్‌కు వెళ్లి సినిమా యాక్టింగ్‌లో శిక్షణ ఇస్తున్న అరుణాభిక్షు వద్ద శిక్షణ పొందాడు. అక్కడ నుంచి ఎదుగుతూ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా, మరి కొన్ని సిమాలకు కొరియో గ్రాఫర్ పని చేశారు. ఏడు సంవత్సరాల క్రితం మహేష్ బాబు నటించిన బాబీ, కన్నడ చిత్రం గానాభజనా, జై బజరంగ్‌బలి చిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. గత మూడునెలల క్రితం కన్నడ సినిమా ప్రీతికితాబ్లో ఆరు పాటలకు కొరియో గ్రాఫర్‌గా చేశాడు. ఈనెల 8వ తేదీన విడుదలవుతున్న ఇద్దరం సినిమాలో మూడు పాటలకు కొరియో గ్రాఫర్‌గా పని చేశారు. స్నేహితుడి సహకారంతోనే.. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ కొరియో గ్రాఫర్ కావాలని లక్ష్యం ఉండేది. ఆదోని నుంచి నా స్నేహితుడు విజయ విఠల్ భట్ సినిమా రంగంలో డైరెక్టర్‌గా ఎదగడంతో నాకు కొరియో గ్రాఫర్‌గా అవకాశం వచ్చింది. ఆయన డైరెక్షన్లో ప్రీతికితాబ్ సినిమాకు మొత్తం పాటలకు కొరియోగ్రఫీ చేశా. ఆ సినిమా హిట్ కావడంతో నాకు అవకాశాలు వస్తున్నాయి. -
హీరోయిన్ కొన్నేళ్ల కల నెరవేరబోతోంది..
ముంబై: బాలీవుడ్ అందాలతార మాధురీ దీక్షిత్ అద్బుతమైన డాన్సరన్న విషయం తెలిసిందే. ఎన్నో చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్‌లో మాధురి అభిమానులను అలరించింది. రెండు దశాబ్దాలకుపైగా తన డాన్స్‌లతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన మాధురికి.. కొరియోగ్రాఫర్ కావాలనే కోరికఉందట. కొన్నేళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఇప్పుడు ఆ కల నెరవేరనుంది. ఓ టీవీ షోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసే అవకాశం మాధురికి వచ్చింది. మాధురీ నృత్యదర్శకత్వంలో టెరెన్స్ లూయిస్, బొస్కో మార్టిస్, రణదీప్ హుడా, కాజల్ అగర్వాల్ కాలుకదపనున్నారు. 'కోరియాగ్రాఫర్ కావాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నా. ఆ కల టీవీ షో ద్వారా నెరవేరింది. టెరెన్స్, బొస్కొ, రణదీప్, కాజల్‌తో డాన్స్ చేయిస్తా' అని మాధురీ చెప్పింది. మాధురి జడ్జిగా వ్యవహరిస్తున్న 'సో యు థింక్ యు కెన్ డాన్స్ అబ్ ఇండియా కి బారీ' టీవీ షో త్వరలో ప్రసారం కానుంది. -
నా డాన్స్ అలా ఉండదట!
ముంబై: తాను డాన్స్ చేస్తుండగా చూసేవాళ్లంతా డాన్స్ చేస్తున్నట్టుగా అనిపించదని అందరూ అంటుంటారని బాలీవుడ్ నటుడు గోవింద వ్యాఖ్యానించాడు. డాన్స్‌లో తనదైన శైలీలో కొత్తదనాన్ని ప్రదర్శించగల నైపుణ్యం ఉన్న గోవింద.. సినీ పరిశ్రమలో నటుడిగా అద్భుతంగా రాణించాడు. డాన్స్ పట్ల తనకు ఉన్న మక్కువను ప్రస్తావించాడు. కోరియోగ్రాఫర్ సందీప్ సోపార్కర్ నిర్వహించిన '3వ ఇండియా డాన్స్ వీక్' లో పాల్గొన్న సందర్భంగా గోవింద మీడియాతో ముచ్చడించాడు. డాన్స్ చేయడంలో చాలామందికి చాలా రకాల యాంగిల్స్ తెలిసి ఉండొచ్చు. కానీ ఇకముందు డాన్స్ లోనూ కొత్త రూపాలు సంతరించుకోనున్నాయని చెప్పాడు. డాన్స్ చేయడం వల్ల కేవలం ఆరోగ్యమే కాదు.. మంచి వినోదం కూడా. డాన్స్‌లో ప్రదర్శించే యాంగిల్స్‌తో మనం ఎన్నో కొత్త విషయాలను సృష్టించవచ్చనన్నాడు. ప్రపంచంలో అందరూ తొలుత లేవగానే వ్యాయామం చేస్తుంటారు. అయితే ప్రాణాయం అనేది డాన్స్ నుంచే ఉద్భవించిందన్నాడు. స్ట్రీట్ డాన్సర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన గోవింద.. డిస్కో డాన్స్‌లతో దుమ్మురేపి నెంబర్ వన్ హీరో స్థాయికి చేరుకున్నాడు. కాగా, ఇటీవల బాలీవుడ్లో విడుదలైన పలు సినిమాలు 'కిల్ దిల్' హ్యాపీ ఎండింగ్' వంటి చిత్రాల్లో అద్భుతమైన డాన్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. -
లారెన్స్‌లో... కొత్త కోణం
కొరియోగ్రాఫర్‌గా మొదలై, నటుడిగా, దర్శకుడిగా ఎదిగిన సినీ ప్రముఖుడు రారెన్స్. తాజాగా ఆయన తన బహుముఖ ప్రజ్ఞలోని మరో కోణం కూడా బయటకు తీస్తున్నట్లు చెన్నై ఖబర్. ఆ మధ్య ‘ముని’, ‘గంగ’ లాంటి సినిమాలతో అదరగొట్టిన లారెన్స్ తన తాజా చిత్రంలో ఏకంగా గాయకుడి అవతారమెత్తుతున్నారట! తమిళ చిత్రం ‘మొట్ట శివ... కెట్ట శివ’ (‘గుండుతో కనిపించే శివ... చెడ్డవాడైన శివ’ అని తెలుగులో స్థూలంగా అర్థం)లో ఆయన ‘లోకల్ మాస్...’ అంటూ ఉత్సాహంగా సాగే ఒక పాట పాడినట్లు కోడంబాకమ్ వర్గాల కథనం. గాయని సుచిత్రతో లారెన్స్ గొంతు కలిపారట! ఇదే పాటకు మంచి ఫాస్ట్ వెర్షన్ కూడా ఉందట! ఆ వెర్షన్నేమో గాయనీ గాయకులు మాలతి, టిప్పు గానం చేశారట! సంగీత దర్శకుడు అమ్రేశ్ గణేశ్ ఈ రెండు పాటల్నీ వేర్వేరుగా రికార్డ్ చేశారని చెబుతున్నారు. అన్నట్లు, విషయం ఏమిటంటే - ఈ సినిమా మరేదో కాదు... గత ఏడాది మొదట్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెలుగులో వచ్చి, హిట్టయిన నందమూరి కల్యాణ్‌రామ్ చిత్రం ‘పటాస్’కు అధికారిక తమిళ రీమేక్. సాయి రమణి దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ రీమేక్‌లో లారెన్స్, ఆయన పక్కన నిక్కీ గల్రానీ, మరో ముఖ్యపాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తానికి, దర్శకుడిగా, నటుడిగా విజృంభిస్తున్న లారెన్స్ కొంపదీసి ఇప్పుడు తన సినిమాల్లో పూర్తిస్థాయి సింగర్‌గా కూడా దృష్టి పెడతారా? -
ప్రభుదేవా డైరెక్షన్లో కార్తీ
కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ సాధించిన సౌత్ స్టార్ ప్రభుదేవా. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా.. తర్వాత నటుడిగా, ఆ తరువాత దర్శకుడిగా దక్షిణాదిలో ఆకట్టుకున్నాడు. అదే జోష్‌లో బాలీవుడ్లో అడుగుపెట్టిన ప్రభు, రీమేక్ సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ప్రభుదేవా డైరెక్ట్ చేసిన హిందీ సినిమాలు ఆశించిన స్ధాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో తిరిగి సౌత్ బాట పట్టిన ప్రభుదేవా మరోసారి ఇక్కడే తనను తాను రుజువు చేసుకోడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఓ సౌత్ సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభుదేవా, దర్శకుడిగా కూడా సౌత్ సినిమానే ఎంపిక చేసుకున్నాడు. తమిళ యంగ్ హీరో కార్తీ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కార్తీకి కథ కూడా వినిపించిన ప్రభుదేవా త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. -
పవన్‌ని డీల్ చేయగలడా..?
కొద్ది రోజులుగా తన సినిమాల విషయంలో అభిమానులను తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్, గోపాల గోపాల సినిమాలో దేవుడిగా కనిపించి అలరించాడు. అయితే ఆ సినిమాలో పవన్ పాత్ర పూర్తిస్థాయిలో లేకపోవటంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. గబ్బర్‌సింగ్ సీక్వల్తో చాలాకాలం వార్తల్లో నిలిచినా, ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకురాకుండా ఊరించాడు. గబ్బర్‌సింగ్ సీక్వల్కు డైరెక్టర్‌గా సంపత్ నందిని ప్రకటించినా, ఆ తరువాత పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో ఆ సినిమా చేస్తున్నాడు. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న బాబీ దర్శకత్వంలో పవన్ సినిమా అంటే అభిమానులు కూడా షాక్ అయ్యారు. మరోసారి అలాంటి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు పవన్. ప్రస్తుతం టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌గా సూపర్ ఫాంలో ఉన్న జానీ మాస్టర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడట. రేసుగుర్రం, జులాయి, రచ్చ, ఎవడు లాంటి సినిమాలతో కొరియోగ్రాఫర్‌గా టాప్ రేంజ్‌కు చేరుకున్నాడు జానీ మాస్టర్. అయితే చాలా రోజులుగా దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్న జానీ, దాసరి నారాయణరావుకు కథ వినిపించాడు. దాసరి కథ నచ్చటంతో పవన్ హీరోగా తాను నిర్మించాలనుకుంటున్న సినిమాను, జానీ చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నాడట. మరి ఈ ప్రపోజల్‌కు పవర్ స్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
కొరియోగ్రాఫర్ ఆత్మహత్య..
-
కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
ఓ టీవీ ఛానల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పనిచేసే.. కొరియోగ్రాఫర్ భరత్ తన గదిలో ఉరేసుకుని మరణించాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ నగర్ లోని తన గదిలో.. శనివారం రాత్రి అందరూ నిద్రపోయాక.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. భరత్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి భరత్ సెల్ ఫోన్ లో వచ్చిన మెసేజీల ఆధారంగా ఈ ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్న భరత్, ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. -
డ్యాన్స్ మాస్టర్!
రికార్డింగ్ థియేటర్లో గాయకులతో పాడించడమే కాదు....సెట్లో హీరో, హీరోయిన్లకు స్టెప్స్ కూడా కూడా నేర్పిస్తానంటున్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మంచి పాటలు స్వరపరచడమే కాదు.. చక్కగా పాడగలుగుతారు. డ్యాన్సులు కూడా చేయగలుగుతారు. స్టేజ్ ఎక్కితే చాలు.. పాప్ స్టార్లా రెచ్చిపోతారు. వేదికపై డ్యాన్సులతో రాక్‌స్టార్‌లా దుమ్మురేపే ఈ స్వరకర్త తాజాగా తనలోని కొరియోగ్రాఫర్‌ను తెరకు పరిచయం చేయనున్నారు. సుకుమార్ నిర్మాతగా మారి, రూపొందించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో ఓ పాటకు దేవిశ్రీ ప్రసాద్ నృత్య దర్శకత్వం వహించడం విశేషం. పైగా ఈ పాటను ఎడిటింగ్ రూమ్‌లో తానే స్వయంగా ఎడిట్ చేసుకున్నారట. వెరైటీ ట్యూన్‌తో దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర నిర్మాతలు విజయకుమార్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి చెప్పారు. రాజ్ తరుణ్, హేభా పటేల్ జంటగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
నృత్యమే ‘సత్య’మ్...
నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం కొత్త సినిమాకు రిలీజ్ కన్నా పెద్ద పండుగ ఉందా? అంటే కాస్తంత సినీ జ్ఞానం ఉన్న ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానం ఆడియో రిలీజ్. ఈ వేడుకలను భారీ సభల స్థాయికి తీసుకెళ్లి... అసలు సినిమా కన్నా కొసరుకే పెద్ద సంరంభంగా మార్చేశాయి. దాదాపు ప్రతి ఆడియో విడుదల వేడుకకీ హైదరాబాద్ వేదిక ఎలాగో... 90శాతం ఫంక్షన్లలో కనిపించే ఏకైక నృత్య బృందం సత్యా డ్యాన్స్ ట్రూప్. టెన్త్‌క్లాస్ పూర్తి చేయడానికి తంటాలు పడ్డ ఓ భీమవరం బుల్లోడు సృష్టించిన ఈ గ్రూప్... సినిమా వేడుకల్లో నృత్యాలు మొదలు టీవీ రియాలిటీ షోస్ దాకా అలుపెరగని జైత్రయాత్ర కొనసాగిస్తోంది. - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి ‘మాది భీమవరం గురూగారూ. డ్యాన్స్ పిచ్చికీ.. చదువుకీ లంకె కుదరక టెన్త్‌తోనే ఆపేశా. ఇంట్లో వాళ్లు చదువుకోమని వినుకొండలోని అక్కయ్య ఇంటికి పంపిస్తే... డ్యాన్స్ పిచ్చితో ముందు విజయవాడ వెళ్లా. ఆ తర్వాత ఈ సిటీకి వచ్చేశా. డ్యాన్సర్‌గా నా కెరీర్ 1998లో స్టార్ట్ అయింది’ అని చెప్పాడు డ్యాన్స్ మాస్టర్ సత్య అలియాస్ టి.సత్యనారాయణ. ఓ టీమ్‌ని విజయపథంలో నిలిపిన ఈ సక్సెస్ జర్నీ సత్య మాటల్లోనే... ‘ఫ్రెండ్స్‌తో కలిసి ఇందిరానగర్‌లోని ఇరుకు గదిలో ఉండేవాడిని. సీనియర్ కొరియోగ్రాఫర్ ముక్కురాజు మాస్టర్ దగ్గర ప్రాక్టీస్ చేశాను. రాకేష్ మాస్టర్ క్లాసెస్ తీసుకునేవారు. సుచిత్రా మాస్టర్ వంటి వారి గెడైన్స్ మంచి డ్యాన్సర్‌ని చేసింది. అప్పట్లో ఇక్కడ తమిళ డ్యాన్సర్లదే హవా. దీంతో మాకు ఒక పట్టాన అవకాశాలు రాలేదు. అతి కష్టం మీద డ్యాన్సర్‌గా కార్డు మాత్రం దొరికింది. స్మాల్ స్టెప్స్ టు బిగ్ ఈవెంట్స్.. అప్పుడంతా మద్రాస్ వాళ్లదే డామినేషన్. తెలుగు డ్యాన్సర్లకు ఖాళీ టైమ్ బాగానే ఉండేది. అలా ఖాళీగా ఉన్న మరికొందరిని కలుపుకుని డ్యాన్స్ ట్రూప్ తయారు చేశా. తక్కువ మొత్తానికి కాలేజీ, స్కూల్స్‌లో చిన్న చిన్న ఈవెంట్స్ చేసేవాళ్లం. తలా రూ.100, 200 వచ్చినా చాలనుకునేంత పరిస్థితి. సినిమాల సంగతెలా ఉన్నా ఈవెంట్స్‌కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది. వాటి మీదే బాగా కాన్సన్ట్రేట్ చేశా. ఈవెంట్స్ బాగా పెరగడం మొదలుపెట్టాయి. అదే సమయంలో డ్యాన్స్ షోస్‌కి రిహార్సల్స్‌గా ఉపకరిస్తుందని శ్రీనగర్ కాలనీలో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఆడియో రిలీజ్లు పెద్ద స్థాయి ఈవెంట్స్‌గా మారడం అనేది 2007-2008లో మొదలైంది. అప్పటికే ఈ తరహా వేడుకల విషయంలో అనుభవం బాగా ఉండడం ఉపకరించింది. పూర్తి స్థాయి టీమ్‌తో వెళ్లి ఇచ్చే పెర్ఫార్మెన్స్లు సూపర్‌హిట్ కావడంతో ఆడియో రిలీజ్ వేడుకల ఛాన్స్‌లు బాగా వచ్చాయి. ఢీ వంటి టీవీ రియాలిటీ షోస్ కూడా మంచి పేరు తెచ్చాయి. ఢీ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసిన ఏకైక తెలుగు డ్యాన్స్ మాస్టర్ని నేనే. మిగిలిన వాళ్లంతా వందల సినిమాలకు పనిచేసిన సీనియర్లు. నేను భలేదొంగలు సినిమాకి మాత్రమే డ్యాన్స్ మాస్టర్‌గా చేశాను. 100 సంవత్సరాల సినిమా వేడుకల కోసం చెన్నై వె ళ్లిన ఏకైక తెలుగు డ్యాన్స్ మాస్టర్ నేనే. దాదాపు 50 మంది హీరో, హీరోయిన్స్ నా సారథ్యంలో అక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనుభవం మర్చిపోలేనిది. ఆడియో వేడుక... ఆషామాషీ కాదు... సినిమాలో ఒక సాంగ్‌కి స్టెప్స్ డిజైన్ చేసి... కొరియోగ్రఫీకి సుమారు వారం రోజులు పడుతుంది. అలాంటిది ఒక్క ఆడియో రిలీజ్‌కి ఒకటి రెండు రోజులు... కొన్నిసార్లయితే ఒక్క పూట మాత్రమే మాకు టైమ్ దొరుకుతుంది. దీంతో ఒక్కరోజులోనే 6సాంగ్స్ కంపోజ్ చేయాలి. అన్ని పాటలనూ ఒక్క రోజులోనే విని... ప్రత్యక్షంగా ప్రదర్శించేయాలి. పోనీ పాల్గొనేది ఏమైనా చిన్న ప్రోగ్రామా? అంటే కాదు. పెద్ద పెద్ద సినిమా ప్రముఖులు, వేలాదిగా అభిమానులు... హాజరవుతారు. ఆడియోకుతగ్గ డ్యాన్స్‌లు లేకపోతే రక్తికట్టదు. అది సినిమా క్రేజ్‌ను దెబ్బతీసే ప్రమాదమూ ఉంది. మొదటి నుంచీ ఈవెంట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం... ఈ ఒత్తిడిని తట్టుకోవడంలో నాకు హెల్ప్ అయింది. అందుకే ఆడియో ఆల్బమ్స్ రిలీజ్‌లలో దాదాపు 80శాతం నేనే చేశాను. సినిమా కన్నా కూడా లైవ్ పెర్ఫార్మెన్స్‌లోనే కొరియోగ్రఫీ బాగుంది అనే స్థాయిలో చేయగలిగాం. ఈవెంట్స్ సమయంలోనే దేవిశ్రీప్రసాద్ చూసి...అప్పటిదాకా ఆయన తమిళ డ్యాన్సర్లతో చేసే ఈవెంట్స్, షోస్ అన్నీ మాకు ఇచ్చారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఆయన చేసిన షోస్ నాతోనే. ఇప్పుడు మా టీమ్‌లో దాదాపు 40 మంది ఉంటారు. వీరిలో అత్యధికులు ఫుల్‌టైమ్ ఎంప్లాయీస్. గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్‌కి చేసిన నృత్యానికి బాగా పేరొచ్చింది. ఇటీవల ఉత్తమ విలన్ ఆడియో రిలీజ్ కూడా మంచి పేరు తెచ్చింది. దాదాపు 10 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాం. ఒక టీవీ చానెల్ కోసం స్టైల్ అనే రియాలిటీ షోని విభిన్నంగా డిజైన్ చేశా. దాదాపు 60మందితో ఖతార్‌లో ప్రిలిమినరీస్, దుబాయ్‌లో ఫైనల్స్ చేశాం. మొత్తం15 మంది సింగర్స్, 20 మంది హీరోయిన్స్ ఇందులో ఉన్నారు. అమీర్‌పేటలో ప్రారంభించిన డిజోన్ డ్యాన్స్-ఫిట్నెస్ స్టూడియో ద్వారా మరింత మంది డ్యాన్స్ డ్రీమ్స్ నిజం చేయాలని అనుకుంటున్నాను. అంతేకాదు సినిమా ఆర్టిస్ట్‌ల కోసం ప్రత్యేకంగా రాత్రి 8 గంటల నుంచి క్లాసెస్ తీసుకుంటున్నాను. -
అన్ని భాషల్లోనూ అగ్రస్థాయి దర్శకురాలు కావాలన్నదే లక్ష్యం
అన్ని భారతీయ భాషా చిత్రాలకు దర్శకురాలిగా పని చేసి, అందరూ మెచ్చుకొనే అగ్రస్థాయి దర్శకురాలిగా ఎదగాలన్నదే తన లక్ష్యమని వర్థమాన దర్శకురాలు ‘సుజి’ అన్నారు. కొరియోగ్రాఫర్‌గా సినీరంగ ప్రవేశం చేసి, దర్శక, నిర్మాతగా ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అంజనీ ప్రొడక్షన్స్‌తో కలిసి తన విరించి అకాడమీ ద్వారా నూతన నటీనటులతో ‘బోళాశంకర్’ చిత్రం నిర్మించనున్నామని చెప్పారు. ఆ చిత్రం షూటింగ్‌కు లొకేషన్స్ పరిశీలన కోసం వచ్చిన ‘సుజి’ మండలంలోని వాడపాలెంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రశ్న : ఎవరి ప్రేరణతో డ్యాన్స్ నేర్చుకున్నారు? సుజి : ఎల్.విజయలక్ష్మి అంటే ఎంతో ఇష్టం. ఆమె డ్యాన్స్ స్క్రీన్‌పై చూశాను. ఆమె స్ఫూర్తిగా డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆమే నాకు స్క్రీన్ గురువు. ప్రశ్న : సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? సుజి : మాది ఉద్యోగుల కుటుంబం. నాన్న పోలీసు అధికారి. నన్ను ఐఏఎస్ అధికారిని చేయాలన్నది ఆయన ఆకాంక్ష. కానీ నాకు డ్యాన్స్ అంటే మక్కువ ఎక్కువ. టేపు రికార్డర్ పెట్టుకుని పాటలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా హైదరాబాద్ వచ్చి ముక్కురాజు మాస్టర్, హరీష్‌పాయ్ మాస్టర్ల వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరాను. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా మొదట చిన్నబ్బులు సినిమాకు పని చేశాను. ప్రశ్న : కొరియోగ్రాఫర్‌గా ఎన్ని సినిమాలకు పని చేసారు? సుజి : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా సుమారు 150, కొరియోగ్రాఫర్‌గా 35 చిత్రాలకు పని చేశాను. వాటిలో ప్రధానంగా మౌనమేలనోయి, లగ్నపత్రిక, శేషు, రావే నా చెలియా, దేవీ నాగమ్మ వంటి చిత్రాలున్నాయి. ప్రశ్న : దర్శక నిర్మాతగా ఎప్పుడు మారారు? సుజి : కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతూనే దర్శకత్వం కూడా చేపట్టాలన్న ఆలోచన వచ్చింది. ఆమేరకు పలువురు ప్రముఖ నిర్మాతలను సంప్రదించాను. ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో నేనే ‘విరించి అకాడమీ’ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి, అనురాగ్, కాజల్ యాదవ్ హీరో హీరోయిన్లుగా ‘మనసా తుళ్ళిపడకే’ చిత్రం నిర్మించాను. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, లాభాలు ఇవ్వకపోయినా మంచి చిత్రం నిర్మించానన్న సంతృప్తినిచ్చింది. పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు లబించాయి. ప్రశ్న : త్వరలో నిర్మించే చిత్రం ఏ తరహాలో ఉంటుంది? సుజి :తెలుగు, తమిళ భాషల్లో నిర్మించే ఈ చిత్రానికి ‘భోళాశంకర్’ అనే టైటిల్ నిర్ణయించాం. కొత్త, పాత నటీ నటులతో ఈ చిత్రం చేయాలనుకుంటున్నాం. ఇది స్వచ్ఛమైన పల్లెటూరి కామెడీ సినిమా. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఎక్కువ భాగం కోనసీమలో ఈ సినిమా చిత్రీకరించనున్నాం. ప్రశ్న : ఇంకేమైనా చిత్రాలు చేస్తున్నరా? సుజి : ఈ చిత్రం తరువాత మనసా తుళ్ళిపడకే చిత్రాన్ని కన్నడలో చిత్రించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రశ్న : డెరైక్టర్‌గా ఎవరు స్ఫూర్తి? సుజి : ఎవరి స్ఫూర్తీ లేదు. దర్శకత్వ శాఖలో ఎవ్వరివద్దా అసిస్టెంట్‌గా కూడా పని చేయలేదు. కొరియోగ్రాఫర్‌గా ఉన్న అనుభవం తోడ్పడుతోంది. ప్రశ్న : దర్శక నిర్మాతగా మీ లక్ష్యం? సుజి : దర్శకురాలిగా ఒక తెలుగమ్మాయి అన్ని భాషల్లోనూ టాప్ లెవెల్లో ఉందని అందరిచేతా అనిపించుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. అలాగే విరించి అకాడమీ బ్యానర్లో ఎక్కువమంది కొత్త నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తూ, లో బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరాలన్నది నా లక్ష్యం -
అమ్మకు ఆలయం
అమ్మకు మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి కని పెంచి, పెద్ద చేసిన తల్లి రుణం తీర్చుకోలేనిది. అలాంటి అమ్మ జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆమె ప్రతి రూపాన్ని ఆలయంలో ప్రతిష్టించి పూజించుకోవాలనుకంటున్నారు ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శక నిర్మాత రాఘవ లారెన్స్. నిజమే ఇప్పటికే పలువురు అనాథలకు ఆశ్రయం కల్పించి ఆదుకుంటున్న ఈయన తన పుట్టినరోజు (బుధవారం) సందర్భంగా తన తల్లికి గుడి కట్టించడానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా లారెన్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తన తండ్రి పుట్టిన ఊరు చెన్నై పూందమల్లి సమీపంలోని మెవలూర్కుప్పంలో కొంత స్థలాన్ని సేకరించి అమ్మకు ఆలయాన్ని కట్టించనున్నట్లు తెలిపారు. అమ్మ విగ్రహాన్ని రాజస్థాన్‌లో తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు. అమ్మ వడే ఆలయం అని తన తల్లి జీవించి ఉండగానే ఆమెకు గుడి కట్టించాలని ఆశించానన్నారు. తనను పెంచడానికి తల్లి పడ్డ కష్టాలను ఒక పుస్తక రూపంలోకి తెచ్చి వచ్చే ఏడాది తనపుట్టిన రోజు నాడు ఇదే ఆలయంలో ఆవిష్కరించనున్నట్లు రాఘవ లారెన్స్ వెల్లడించారు. -
మంచి సినిమాలే తీస్తా
దర్శకురాలు ఫరాఖాన్ న్యూఢిల్లీ: ఆమె సినిమాలు నృత్యాలు, పాటలు, మెలోడ్రామా, శృంగారం, అనేక రకాల ఎమోషన్లు, రంగులు, స్టార్ పవర్ సమ్మిళితం. అందువల్ల ఏ సినిమా అయినా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది. అవి మాస్ నుంచి క్లాస్‌ను కూడా అలరిస్తుంది. సొంత గడ్డపైతోపాటు విదేశాల్లోనూ మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఆ ప్రతిభాశాలి మరెవరో కాదు... ఫరాఖాన్. అసాధ్యాన్ని సుసాధ్యంచేయగలిగిన సత్తా ఉన్నప్పటికీ విజయానికి పొంగిపోయి, అపజయానికి కుంగిపోయే స్వభావం ఫరాఖాన్‌కు లేదు. సినిమా నిర్మాతగా మారకముందు కొరియోగ్రఫర్‌గా ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రేక్షకులు మైమరిచిపోయేవిధంగా నృత్యాన్ని సమకూర్చింది. ఈ విషయమై ఫరాఖాన్ తన అనుభవాలను మీడియాతో పంచుకుంటూ తాను పనికిమాలిన సినిమాలను తీయనని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రాలనే తెరపెకైక్కిస్తానని అంది. ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుందనే విషయాన్ని అంత తేలిగ్గా ఎవరూ అంచనా వేయలేరంది. ముఖ్యంగా బీక్లాస్ ఆడియన్స్‌తోపాటు లండన్, అమెరికా దేశాలకు చెందిన ప్రేక్షకులను ను మెప్పించడం అంత సులువేమీ కాదంది. కొంతమంది పెద్ద పెద్ద నటులతో కలిసి మంచి కళాతమకమైన సినిమాలే తీస్తానని, పనికిమాలిన సినిమాలు అసలు తీయనని‘తీస్ మార్ ఖాన్’ దర్శకురాలైన ఈ 49 ఏళ్ల ఈ కొరియోగ్రాఫర్ తెలిపింది. షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా ఇటీవల ‘హేపీ న్యూ ఇయర్’ సినిమా తీసింది. ఇందులో షారుఖ్‌ఖాన్ కథానాయకుడు కాగా ఇంకా దీపికా పదుకొణే, అభిషేక్ బచ్చన్, బొమన్ ఇరానీ, సోనూసూద్, వివన్షా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. -
హీరో అయిన మరో నృత్య దర్శకుడు
నృత్య దర్శకులు హీరోలుగా మారడం అన్నది దక్షిణాది చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. ప్రభుదేవా, లారెన్స్, హరికుమార్ లాంటి నృత్య దర్శకులు కథా నాయకులుగా మారినవారే. ఇప్పడీ కోవలో తాజాగా మరో నృత్య దర్శకుడు చేరారు. ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం పోకిరి మన్నన్. శ్రీనిధి ఫిలింస్ పతాకంపై కన్నడ నిర్మాత రమేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్ఫూర్తి హీరోయిన్గా నటిస్తున్నారు. రాఘవమాదేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎటి ఇంద్రవర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమల థియేటర్లో జరిగింది. నృత్య కళాకారుల సంఘం అధ్యక్షుడు మారి ఆధ్వర్యంలో నిర్మాత కలైపులి ఎస్.ధాను చిత్ర ఆడియోను ఆవిష్కరించగా, తొలి అప్రతిని నటుడు శాంతను అందుకున్నారు. ఈ సందర్భంగా ధాను మాట్లాడుతూ నృత్య దర్శకుడు ప్రభుదేవాలోని ప్రతిభను గుర్తించి దర్శకత్వం చెయ్యమని సలహా ఇచ్చానన్నారు. కొంతకాలం తర్వాత ఆయన తన వద్దకు వచ్చి ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారన్నారు. అలాగే ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ కూడా హీరోగా రాణిస్తారనే నమ్మకం తనకుందన్నారు. విజయ్ నటించిన పోకిరి, రజనీకాంత్ నటించిన మన్నన్ చిత్రాలు ఘన విజయం సాధించాయన్నారు. ఆ రెండు చిత్రాల పేరుతో రానున్న పోకిర మన్నన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నానన్నారు. నిర్మాత కర్ణాటక నుంచి వచ్చి తమిళంలో చిత్రం నిర్మించారని, ఆయనకు అన్ని విధాలా తన సహకారం ఉంటుందని ధాను భరోసా ఇచ్చారు. -
ఆ రెండు సినిమాల్నీ ఒకే టికెట్‌పై చూపించనున్నా!
లారెన్స్... సినీ నృత్యాలను కొత్త పుంతలు తొక్కించిన పేరిది. కొన్నేళ్ల పాటు దక్షిణాదిలో అగ్రశ్రేణి నృత్యదర్శకునిగా వెలుగొందిన ఘనత ఆయనది. మాస్, ముని, డాన్,కాంచన సినిమాలతో దర్శకునిగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు. త్వరలో ‘గంగ’తో మన ముందుకు రానున్న ఆయన దర్శకునిగా ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం... ‘కాంచన’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారేంటి? త్వరగా సినిమా తీసేసి... త్వరగా విడుదల చేసేసి, మంచి హిట్ సాధించాలని.. ఎవరికుండదు చెప్పండి. కానీ... నా టైమే బాలేదు. అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాను. దాంతో ‘గంగ’ (ముని-3) షూటింగ్‌కి పెద్ద విరామమే వచ్చేసింది. అనారోగ్యమేంటి? ‘స్టైల్’ చిత్రంలో మీరు చూసే ఉంటారు. క్లైమాక్స్‌లో ప్రభుదేవాగారిని భుజాలపై ఎక్కించుకొని డాన్స్ చేస్తాను. ఆ సినిమా కోసం నేను చేసిన ఆ సాహసమే నాకు కష్టాలు తెచ్చిపెట్టింది. అప్పుడే.. నొప్పి చేసి డాక్టర్‌కి చూపించుకుంటే... మెడ చేరువలో ఉన్న వెన్నెముక భాగంలో ఇబ్బంది ఏర్పడిందని తేల్చారు. మూడు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. వైద్యుల మాట లక్ష్యపెట్టకుండా నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. ‘కాంచన’ దాకా ఎలాంటి ఇబ్బందీ తెలీలేదు. ‘గంగ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంటుందనగా... ఒక్కసారిగా లొకేషన్లో పడిపోయాను. పరీక్షలు నిర్వహించాక, నా నిర్లక్ష్యం వల్ల గాయం ఇంకాస్త డిస్ట్రబ్ అయ్యిందని తేలింది. అందుకే... ఈ దఫా ‘అయిదు నెలలు విశ్రాంతి’ అన్నారు. దాంతో ‘గంగ’ షూటింగ్ ఆపేసి, విశ్రాంతి తీసుకుంటున్నాను. మరి... మళ్లీ రంగంలోకి దిగేదెప్పుడు? ‘గంగ’ క్లైమాక్స్ మినహా పూర్తయింది. త్వరలోనే పతాక సన్నివేశాలు తీసేస్తాను. డిసెంబర్లో సినిమా విడుదల చేస్తాం. ‘కాంచన’లో స్ల్పిట్ పర్సనాలిటీ అద్భుతంగా పండించారు కదా. ఇందులో అలాంటి ప్రయోగం ఏమైనా ఉందా? ఇందులో ఏకబిగిన ఏడు కేరక్టర్లలో కనిపిస్తా. ఆ వివరాలు ఇప్పుడే బయట పెట్టలేను. అది తెరపై చూస్తేనే బావుంటుంది. ‘కాంచన’ చిత్రాన్ని బాలీవుడ్లో కూడా తీస్తామన్నారు కదా? అవును.. అజయ్‌దేవగణ్ హీరో. అయితే శరత్‌కుమార్ పోషించిన పాత్రకు సరైన స్టార్ కోసం చూస్తున్నాం. ‘గంగ’ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఓ ప్రయోగం చేయనున్నాను. ఆ తర్వాత బాలీవుడ్లో ‘కాంచన’ తీస్తా. ఏంటా ప్రయోగం? ‘ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు’.... ఈ అయిదు నెలల విశ్రాంతి సమయంలో నాకొచ్చిన ఓ వెరైటీ ఆలోచన ఇది. ఇంట్రవెల్ వరకూ గంటన్నర పాటు ఓ సినిమా. ఇంట్రవెల్ తర్వాత గంటన్నర పాటు మరో సినిమా. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూపించాలనుకుంటున్నాను. కథలు కూడా రెడీ చేశాను. తొలి గంటన్నర సినిమా పేరు -‘ముసలోడు’. రెండో గంటన్నర సినిమా పేరు - ‘ది లేటెస్ట్’. రెండింటికీ దర్శకుణ్ణీ, హీరోనూ నేనే. ‘ముసలోడు’లో హీరోయిన్గా ఆండ్రియాను ప్రయత్నిస్తున్నాను. ‘ది లేటెస్ట్’లో మాత్రం లక్ష్మీరాయ్ కథానాయికగా నటిస్తారు. ఆ సినిమాలు ఏ తరహాలో ఉంటాయి? ‘ముసలోడు’ సందేశాత్మకంగా ఉంటుంది. ఓ విధంగా ‘కాంచన’ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లాంటి భావన కలుగుతుంది. అలాగని వినోదానికి దూరంగా ఉండదు. రెండు పాటలు, ఒక ఫైట్ కూడా ఉంటాయి. ఇందులో నేను ముసలివాడి గెటప్‌లో కనిపిస్తా. ఇక ‘ది లేటెస్ట్’ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో అత్యాధునికంగా కనిపిస్తా. రెండు కథలకూ అస్సలు సంబంధం ఉండదు. తొలి సినిమా కాగానే ‘శుభం’ కార్డ్ పడిపోతుంది. తర్వాత టైటిల్స్‌తో రెండో సినిమా మొదలవుతుంది. ఈ వెరైటీ ఆలోచన ఎలా వచ్చింది మీకు? డాన్స్ మాస్టర్‌గా ఉన్నప్పుడే కొత్తదనం కోసం పాకులాడేవాణ్ణి. కొత్త కొత్త స్టెప్స్ సృష్టించేవాణ్ణి. దర్శకుడయ్యాక కూడా ఆ బుద్ధి పోలేదు. ఒక్కసారి హాలీవుడ్ సినిమాలు చూడండి. గంటన్నరలో అన్నీ చెప్పేస్తున్నారు వాళ్లు. మనం మాత్రం ఎందుకు ఆ ప్రయత్నం చేయకూడదు. అందుకే ఈ కొత్త ప్రయత్నం చేయనున్నాను. నేను ‘కాంచన’ చేయగానే... ఇప్పుడు అందరూ హారర్ కామెడీ వైపు చూస్తున్నారు. రేపు ఈ ట్రెండ్ కూడా మొదలవుతుందేమో. అంతా రాఘవేంద్రస్వామి దయ. మరి కొరియోగ్రఫీ? చేస్తున్నానుగా.. అది అదే.. ఇది ఇదే. తుది శ్వాస విడిచేవరకూ డాన్స్‌ను నేను విడిచిపెట్టను. ఈ విశ్రాంతి పుణ్యమా అని కుటుంబానికి కొన్నాళ్లయినా దగ్గరగా ఉన్నారు కదా? అవునండీ... నా ఫ్యామిలీ లైఫ్ ఆనందంగా ఉంది. నాకు టెన్త్ చదివే కొడుకున్నాడు తెలుసా! బుర్రా నరసింహ