తెలుగు చలన చిత్ర రంగంలో ఆదోని వాసి తన ప్రతిభను చాటుతున్నాడు.
‘ఇద్దరం’ కొరియోగ్రాఫర్‌గా ఆదోని వాసి
ఈనెల 8న విడుదల కానున్న చిత్రం
ఆదోని : తెలుగు చలన చిత్ర రంగంలో ఆదోని వాసి తన ప్రతిభను చాటుతున్నాడు. ఆదోని పట్టణంలోని గౌళిపేటకు చెందిన బెనకప్ప, లక్ష్మి దంపతుల కుమారుడు కామవరం రాజు 1998లో క్లాస్, వెస్ట్రన్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసి స్థానికంగా గుర్తింపు పొదాడు. 2001లో హైదరాబాద్‌కు వెళ్లి సినిమా యాక్టింగ్‌లో శిక్షణ ఇస్తున్న అరుణాభిక్షు వద్ద శిక్షణ పొందాడు.
అక్కడ నుంచి ఎదుగుతూ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా, మరి కొన్ని సిమాలకు కొరియో గ్రాఫర్ పని చేశారు. ఏడు సంవత్సరాల క్రితం మహేష్ బాబు నటించిన బాబీ, కన్నడ చిత్రం గానాభజనా, జై బజరంగ్‌బలి చిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. గత మూడునెలల క్రితం కన్నడ సినిమా ప్రీతికితాబ్‌లో ఆరు పాటలకు కొరియో గ్రాఫర్‌గా చేశాడు. ఈనెల 8వ తేదీన విడుదలవుతున్న ఇద్దరం సినిమాలో మూడు పాటలకు కొరియో గ్రాఫర్‌గా పని చేశారు.
స్నేహితుడి సహకారంతోనే..
చిన్నప్పటి నుంచి డ్యాన్స్ కొరియో గ్రాఫర్ కావాలని లక్ష్యం ఉండేది. ఆదోని నుంచి నా స్నేహితుడు విజయ విఠల్ భట్ సినిమా రంగంలో డైరెక్టర్‌గా ఎదగడంతో నాకు కొరియో గ్రాఫర్‌గా అవకాశం వచ్చింది. ఆయన డైరెక్షన్‌లో ప్రీతికితాబ్ సినిమాకు మొత్తం పాటలకు కొరియోగ్రఫీ చేశా. ఆ సినిమా హిట్ కావడంతో నాకు అవకాశాలు వస్తున్నాయి.