
గణేశ్ ఆచార్య, విధి, నవీన్, జాన్య, సుశాంత్
సుశాంత్, జాన్య జోషి, విధి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిస్ కిస్ కిస్సిక్’. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య భార్య విధి ఆచార్య (వీ2ఎస్‌ప్రొడక్షన్) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మల్టీ లాంగ్వేజ్‌లలో ఈ సినిమాను విడుదల చేస్తోంది.
ఈ చిత్రానికి కొరియోగ్రఫీ వహించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటించిన గణేశ్ ఆచార్య ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవిగారు, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌చరణ్ లాంటి బిగ్ స్టార్స్‌తో వర్క్ చేసే అవకాశం నాకు లభించింది. ఇక ‘కిస్ కిస్ కిస్సిక్’ ఫ్యామిలీ ఫిల్మ్. మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ అన్నీ అలరిస్తాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేని కొత్తవాళ్లు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ‘కిస్ కిస్ కిస్సిక్’ సాంగ్ పెద్ద హిట్. ఇదే టైటిల్‌తో మార్చి 21న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాను మేం విడుదల చేయడానికి ప్రధాన కారణం గణేశ్ మాస్టర్. ఆయనతో మాకు మంచి అసోసియేషన్ ఉంది. ‘కిస్ కిస్ కిస్సిక్’ మూవీ మంచి ఎంటర్‌టైనర్.
ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు మైత్రీ నిర్మాత నవీన్ ఎర్నేని. ‘‘ఈ సినిమా మంచి కమర్షియల్ ΄్యాకేజ్‌లా ఉంటుంది’’ అని తెలిపారు సుశాంత్. ‘‘ఈ సినిమా హిందీ టైటిల్ ‘పింటూ కీ పప్పీ’. నేను పప్పీ రోల్ ప్లే చేశాను’’ అని పేర్కొన్నారు జాన్య జోషి. ‘‘ఈ సినిమా ద్వారా గణేశ్ మాస్టర్‌గారి నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు విధి.
Comments
Please login to add a commentAdd a comment