Pre release
-
'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు
నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది.ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిఅనంత వేదికగా జనవరి 9న డాకు మహారాజ్ ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముందుగానే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు శ్రీనగర్‌కాలనీ అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో ఖాళీ ప్రాంతంలో ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎస్పీ జగదీశ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఐటీశాఖ మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హజరుకానున్నారని అధికారికంగా కూడ ప్రకటించారు. అయితే, తిరుపతిలో జరిగిన ఘటనతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మమ్మిల్ని తీవ్రంగా బాధించింది: డాకు మహారాజ్ మేకర్స్తిరుపతిలో జరిగిన విషా సంఘటన మమ్మిల్ని తీవ్రంగా బాధించింది. మన కుటుంబాల సంప్రదాయాల్లో వెంకటేశ్వర స్వామి ఒక భాగం. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే భక్తులు దర్శనం కోసం వెళ్తారు. అక్కడ ఇలాంటి సంఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అనుకున్న విధంగా కొనసాగించడం సరికాదని మేము భావిస్తున్నాము. బరువెక్కిన హృదయంతో దేవునిపై ప్రజల్లో ఉన్న భక్తి, మనోభావాల పట్ల అత్యంత గౌరవంతో, మేము నేటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము.' అని వారు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: నా కుటుంబంపై తప్పుగా ప్రచారం చేస్తున్నారు: చాహల్ సతీమణి) -
Game Changer Pre Release Event : హీరో రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ప్రేమలో భిన్న కోణం
‘‘నిర్మాత బెక్కం వేణుగోపాల్‌గారు ఇప్పటివరకు తీసిన 14 సినిమాల ద్వారా ఎందరో దర్శకులను, రచయితలను, నటీనటులను పరిచయం చేశారు. ‘రోటి కపడా రొమాన్స్’’ చిత్రంతోనూ చాలా మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఆయన్ని చూస్తే ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. ఈ చిత్రం యూనిట్‌కి బ్రేక్ ఇవ్వాలి’’ అని హీరో తేజ సజ్జా అన్నారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’.బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కినుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా తేజ సజ్జా, అతిథులుగా దర్శకులు యదు వంశీ, పవన్ సాధినేని, హర్ష, రచయిత కోన వెంకట్, నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ‘‘నేటి తరం యువతకి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు విక్రమ్ రెడ్డి. ‘‘ప్రేమకథలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించాడు’’ అన్నారు బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్. -
రెడీలా బ్లాక్ బస్టర్ కావాలి: శ్రీనువైట్ల
‘‘ధూం ధాం’ సినిమా పాటలు బాగున్నాయి. ఈ చిత్రం ఫస్టాఫ్ ప్లెజంట్‌గా ఉండి సెకండాఫ్ హిలేరియస్‌గా ఉందని ఈ మూవీకి పని చేసిన నా స్నేహితులు చెప్పారు. మా ‘రెడీ’ సినిమాకి కూడా సెకండాఫ్ హిలేరియస్‌గా ఉందనే టాక్ విడుదలకి ముందే వచ్చింది. అదే తరహాలో రూపొందిన ’ధూం ధాం’ చిత్రం ‘రెడీ’లా బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ కావాలి’’ అని డైరెక్టర్ శ్రీను వైట్ల ఆకాంక్షించారు. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన సినిమా ‘ధూం ధాం’. ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ‘ధూం ధాం’ ప్రీ రిలీజ్‌కి అతిథిగా హాజరైన దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ– ‘‘సాయికిషోర్ మచ్చ నాకు మంచి మిత్రుడు. ‘ధూం ధాం’తో తనకి, యూనిట్‌కి మంచి విజయం దక్కాలి’’అన్నారు. ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు సాయి రాజేశ్ అన్నారు. ‘‘మా అబ్బాయి చేతన్‌ను ఈ సినిమా హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది’’ అన్నారు రామ్ కుమార్.‘‘శ్రీను వైట్లగారి కామెడీని, వైవీఎస్ గారి సాంగ్స్ స్టైల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేశాను. ప్రేక్షకుల టికెట్ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం’’ అని సాయికిషోర్ మచ్చా తెలిపారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో గీత రచయితగా రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకున్న రామజోగయ్య శాస్త్రిని ఈ వేదికపై సన్మానించారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దామోదర ప్రసాద్ మాట్లాడారు. -
రిషబ్ శెట్టిలా పెద్ద హీరో కావాలి: తమ్మారెడ్డి భరద్వాజ
‘‘జాతర’ సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. మంచి కథ ఉంటే.. హీరో, దర్శకుల గురించి ప్రేక్షకులు పట్టించుకోరు. కొత్తగా వచ్చిన సతీష్ హీరో, రైటర్, డైరెక్టర్ అయ్యాడు. రిషబ్ శెట్టిలా తను కూడా పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కావాలి. అలాగే ‘జాతర’ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సతీష్ బాబు రాటకొండ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్గా నటించారు. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృష్ణా రెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘జాతర’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో ఈ మూవీని చక్కగా తీశారాయన’’ అని శివ శంకర్ రెడ్డి చెప్పారు. ‘‘నటుడిగా, దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. మా చిత్రాన్ని ఆదరించాలి’’ అని సతీష్ బాబు రాటకొండ కోరారు. -
రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ కావాలి
‘‘కార్తీగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని మన తెలుగు హీరో అని చెప్పుకుంటాం. ‘96’ సినిమాకి పెద్ద ఫ్యాన్‌ని. ప్రేమ్ కుమార్‌గారు నా కలల దర్శకుడు. వారిద్దరూ కలిసి చేసిన ‘సత్యం సుందరం’ సినిమాని ఈ 28న చూడండి. అలాగే 27న ‘దేవర’ చిత్రం చూడండి. ఈ రెండు సినిమాలూ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో శ్రీదివ్య కీలకపాత్రలో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది.ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొన్ని నెలల క్రితం కార్తీగారిని కలిసి, కథ చెప్పాను. ఆయన ఓకే చేయడమే మిగిలి ఉంది. ‘సత్యం సుందరం’ ట్రైలర్, టీజర్ చాలా నచ్చాయి. ఈ సినిమా చూడ్డానికి ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.‘‘యుగానికి ఒక్కడు’ సినిమా చూసినప్పుడే కార్తీగారు నాకు చాలా నచ్చేశారు. నాకు ఇష్టమైన హీరోతో పని చేయడం హ్యాపీ. మా సినిమాని చూడండి’’ అని శ్రీదివ్య తెలిపారు. ‘‘ఆర్య, జగడం’ సినిమాలతో నా కెరీర్‌ని తెలుగులో ప్రారంభించాను. ఆ తర్వాత తమిళ పరిశ్రమకు వెళ్లాను. ఈ నెల 28న అందరం థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు ప్రేమ్ కుమార్. ‘‘చాలా హార్ట్‌ఫుల్‌గా తీసిన సినిమా ‘సత్యం సుందరం’’ అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. రచయిత, నటుడు రాకేందు మౌళి మాట్లాడారు. -
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్‌తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
‘కమిటీ కుర్రోళ్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
Vikram: తంగలాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఈ టీమ్‌ని చూస్తే ముచ్చటేసింది: విశ్వక్ సేన్
‘‘ప్రతిభ ఉన్న యువతకు సీ స్పేస్ అనే సంస్థ ద్వారా మంచి వేదిక సృష్టించాడు నవదీప్. నా తోటి నటీనటుల్లో నేను గౌరవించే వాళ్లలో చాందినీ చౌదరి ఒకరు. తను ఎప్పుడూ టెన్షన్ పడుతుంటుంది. ‘యేవమ్’తో తనకి ఆ భయం పోయింది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. చాందినీ చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘యేవమ్’. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది.ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘యేవమ్’ లాంటి ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రానికి మహిళా సంగీత దర్శకురాలు, మహిళా ఎడిటర్ పని చేయడం హ్యాపీగా ఉంది. ఈ టీమ్‌కి ఈ చిత్రం మంచి బ్రేక్ అవ్వాలి’’ అన్నారు. ‘‘యేవమ్’ చూశాను. ఇంటర్వెల్, పతాక సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి’’ అన్నారు మరో అతిథి, డైరెక్టర్ సందీప్ రాజ్. ‘‘ఈ మూవీలో నాది పోలీస్ పాత్ర అనగానే యాక్షన్ ఓరియంటెడ్ అనుకున్నాను. అయితే యాక్షన్ పాటు అన్ని షేడ్స్ నా పాత్రలో ఉన్నాయి’’ అన్నారు చాందిని. ‘‘మంచి ఇంటెన్స్‌తో నిజాయితీగా చేసిన సినిమా ‘యేవమ్’’ అన్నారు నవదీప్. ‘‘ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్’’ అన్నారు ప్రకాశ్ దంతులూరి. -
ఇండస్ట్రీ నుంచి పంపించేస్తామన్నారు: విశ్వక్ సేన్
‘‘నిజాయతీగా పని చేసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి మంచి సినిమా తీశాం. అందుకే ఈ మూవీపై చాలా నమ్మకంగా ఉన్నాం. అందరూ కుటుంబంతో కలిసి రావొచ్చు. సినిమా చూశాక రెండు మూడు రోజుల పాటు ప్రేక్షకుల మనసుల్లోనే ఉంటుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఐదేళ్ల క్రితం మార్చి 31వ తేదీనే నా ‘ఫలక్‌నుమా దాస్’ రిలీజ్ అయ్యింది. నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆ సినిమా.. ఆదరించిన ప్రేక్షకులే. నా కెరీర్ ఆరంభంలో ‘ఇలాంటి యాటిట్యూడ్ ఇండస్ట్రీలో పనికి రాదు.. తొక్కేస్తారు.. పంపించేస్తారు’ అన్నారు. అయినా నా క్యారెక్టర్ మార్చుకోలేదు. ఐదేళ్లుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ఇండస్ట్రీకి, దర్శక–నిర్మాతలకు, ముఖ్యంగా నా ఫ్యాన్స్‌కి థ్యాంక్స్. ఇప్పటికే ఐదేళ్లు గడిచిపోయాయి.మరో ఐదేళ్లు ఫైనల్.. కాల్చిపడేస్తా మొత్తం. రత్నలాంటి పాత్ర చేయాలన్నది నా కల. అలాంటి కథతో వచ్చిన కృష్ణ చైతన్యకి థ్యాంక్స్. నేను ఇప్పటి వరకూ పనిచేసిన నిర్మాతల్లో నాగవంశీ బెస్ట్’’ అన్నారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ– ‘‘మా అమ్మానాన్నల ఆశీస్సుల వల్లే ఇక్కడ ఉన్నాను. మా గురువు త్రివిక్రమ్‌గారే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి మూలం. ఆయన వల్లే ఈ సినిమా మొదలైంది. నన్ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతలు చినబాబు, నాగవంశీ, సాయి సౌజన్యగార్లకు కృతజ్ఞతలు. బుజ్జిగా నేహాశెట్టి, రత్నమాలగా అంజలి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడు. తను చేసిన రత్న పాత్ర ప్రేక్షకుల్ని నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. భయపెడుతుంది’’ అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 31 తర్వాత విశ్వక్ సేన్ గురించి మాట్లాడుకుంటే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి ముందు, తర్వాత అని మాట్లాడు కుంటారు. నట విశ్వరూపం చూపించాడు. సినిమా చూశాక నిజంగా కృష్ణ చైతన్య తీశాడా? అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఇంటెన్స్ మూవీ రాలేదు’’ అన్నారు. నటి నేహా శెట్టి, నటులు మధునందన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘లవ్ మీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘డర్టీ ఫెలో’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫోటోలు)
-
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
‘‘నా తొలి సినిమా ఆడియో లాంచ్‌కి నరేశ్‌గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నేను రావడం హ్యాపీగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని మనమంతా థియేటర్లో చూసి హాయిగా నవ్వుకుందాం’’ అని హీరో అడివి శేష్ అన్నారు.‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చిలకప్రోడక్షన్స్పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘నేను ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో ఉండటానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ డైరెక్టర్ మల్లి అంకంతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 30 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను.ఈ మండు వేసవిలో మీ బాధలు మర్చిపోయి రెండు గంటలు హాయిగా మా సినిమాతో ఎంజాయ్ చేయండి’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి మంచి మూవీ చేయడం మా అదృష్టం’’ అన్నారు రాజీవ్ చిలక. ఈ వేడుకలో సహ నిర్మాత భరత్, దర్శకులు విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవా కట్టా, రచయితలు బీవీఎస్ రవి, అబ్బూరి రవి, నటి జామి లివర్ మాట్లాడారు. -
తెప్ప సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
లవ్ గురు నవ్వులు పంచుతుంది: నిర్మాత రవిశంకర్
‘‘విజయ్ ఆంటోనిగారి ‘బిచ్చగాడు’ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫేవరెట్ మూవీ. ఆయన నటించిన ‘లవ్ గురు’ సినిమా నవ్వులు పంచుతుంది’’ అన్నారు నిర్మాత రవిశంకర్. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. సోమవారం నిర్వహించిన ‘లవ్ గురు’ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ చాలా బాగుంది. ఈ సినిమా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. హీరో, నిర్మాత విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ కథ విన్నాక నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని వినాయక్‌కు చెప్పాను. ఈ సినిమాను హిందీలో వినాయక్ డైరెక్షన్లోనే చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ ప్రపంచంలో ప్రేమ ద్వారా ఏదైనా సాధించొచ్చు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం’’ అన్నారు వినాయక్ వైద్యనాథన్. -
కథ వినగానే మా నాన్న గుర్తొచ్చారు
‘‘మనకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ మా నాన్న గోవర్ధన్. ‘ఫ్యామిలీ స్టార్’ కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. అందుకే ఈ సినిమాలో హీరో పాత్రకి గోవర్ధన్ అనే పేరు పెట్టమని పరశురామ్‌కి చెప్పాను. ఈ నెల 8న మా నాన్న పుట్టినరోజు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నాను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజుగారి బ్యానర్లో నేను ‘కేరింత’ సినిమా ఆడిషన్‌కు వెళ్లి, సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ చేశాను. లాక్ డౌన్లో నా స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్‌కి ఇబ్బంది కలిగింది. అప్పుడు రాజుగారే పంపించారు.. ఆయనకు సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఈ సినిమాకి నాకు పేరొస్తే ఆ క్రెడిట్ పరశురామ్‌కి ఇస్తాను’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘విజయ్, పరశురామ్ కలిసి ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో విజయ్. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ స్టార్’లో ఇందు పాత్రను పోషించగలనా? లేదా అని భయపడ్డాను. కానీ, విజయ్, ‘దిల్’ రాజు, డైరెక్టర్గార్లు సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు మృణాల్ ఠాకూర్. -
చరిత్ర తెలియజేసే రజాకార్
‘‘రజాకార్’ ముస్లింలకు వ్యతిరేకమైన సినిమా కాదు. మన చరిత్ర గురించి తెలియజేసే చిత్రం. నాటి కాలంలో జరిగిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేసేలా తెరకెక్కించిన మూవీ. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. దర్శకుడు సత్యనారాయణ, నిర్మాత నారాయణరెడ్డిలకు ధన్యవాదాలు’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే నటీనటులుగా యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. గురువారం జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో యాటా సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ చరిత్రపై ‘రజాకార్’ చేసే చాన్స్ ఇచ్చిన నారాయణరెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మన పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ‘రజాకార్’ నిర్మించాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
నవ్వితే చాలు.. బాలకృష్ణకు కోపం వస్తుంది
‘‘తెలుగులో బాలకృష్ణతో సినిమాలు చేశాను. ఎవరైనా బాలకృష్ణని చూసి నవ్వితే చాలు. ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది’’ అంటూ చెన్నైలో జరిగిన తమిళ చిత్రం ‘గార్డియన్’ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కేఎస్ రవికుమార్ అనడం వైరల్‌గా మారింది. బాలకృష్ణతో వరుసగా ‘జైసింహా’ (2018), ‘రూలర్’ (2019) చిత్రాలకు దర్శకత్వం వహించారు కేఎస్ రవికుమార్. ఆ చిత్రాల షూటింగ్ లొకేషన్లో జరిగిన సంఘటనలనే ‘గార్డియన్’ వేదికపై పంచుకున్నట్లున్నారు. ఇంకా ఆ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ– ‘‘ఒకరోజు లొకేషన్లో ఒక వ్యక్తి నవ్వితే.. ‘ఎందుకు నవ్వుతున్నావ్... రేయ్ ఎందుకురా నవ్వావ్.. నన్ను చూసి ఎందుకు నవ్వావ్’’ అని బాలకృష్ణ కొట్టడానికి ముందుకు వెళ్లినట్లుగా చేతులతో చూపించారు కేఎస్ రవికుమార్. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఇంకోసారి నా అసిస్టెంట్‌ని ‘ఆ ఫ్యాన్‌ని ఇలా తిప్పు’ అంటే.. అతను ఫ్యాన్ తి΄్పాడు. ఆ గాలికి బాలకృష్ణ విగ్ కాస్త చెదిరినట్లయితే అతను నవ్వాడు. ‘ఏయ్ ఎందుకు నవ్వుతున్నావ్’ అని బాలకృష్ణ అడుగుతుంటే అసలే తను నా అసిస్టెంట్.. ఎక్కడ కొట్టేస్తారేమోనని, ‘సార్ సార్.. అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ సార్..’ అన్నాను. ‘లేదు లేదు.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. చూడు ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు’ అని ఆయన అన్నారు. ఇక అప్పుడు ‘రేయ్.. వెళ్లరా ఇక్కణ్ణుంఛి’ అని అతన్ని పంపించేశాను’’ అని కూడా చె΄్పారు రవికుమార్. -
గ్రాండ్‌గా విశ్వక్ సేన్ గామి ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ బాధ్యత మనందరిపై ఉంది
‘‘మనందరిలో దేశభక్తి ఎంత ఉన్నా కానీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ దేశభక్తి ఉప్పొంగిపోతుంది. ముఖ్యంగా మన యువత ఇలాంటి సినిమాలు చూడాలి. ఈ మూవీని తీయడం యూనిట్ బాధ్యత. విజయం అందించి మన రియల్ హీరోలైన సైనికులకు నివాళి అర్పించాల్సిన, అంకితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ 75 రోజుల్లోనే చాలా రీజనబుల్ బడ్జెట్లో తీశాడు. కానీ, ట్రైలర్ చూస్తే ఎంతో రిచ్‌నెస్, ఎక్కువ బడ్జెట్ మూవీలా కనిపిస్తోంది. డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్ రాదు.. మన ఆలోచన ల నుంచి వస్తుంది. తక్కువ ఖర్చులో అలా రిచ్‌గా చూపిస్తే సినిమా బాగా వస్తుంది.. ఇటు నిర్మాతలూ బాగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. అందుకే శక్తి ప్రతాప్ సింగ్‌ని మన యంగ్ డైరెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వరుణ్ ప్రతి సినిమాలోనూ వైవిధ్యంగా కనిపిస్తాడు. నేను ‘టాప్‌గన్’ మూవీ చూసినప్పుడు ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. ఈరోజు ‘టాప్‌గన్’ లాంటి గొప్ప సినిమాని ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపంలో మనవాళ్లు సులభంగా చేశారంటే.. ప్రతిభ ఎవడి సొత్తు కాదు.. మనం ఆ స్థాయిలో ఉన్నామని ఈ మూవీ ద్వారా నిరూపించబడుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మా వరుణ్‌గాడు మంచి సినిమా ఇచ్చాడని మీరు(మెగా అభిమానులు) గర్వపడేందుకు ప్రతి సినిమాకి కష్టపడుతుంటాను. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శక్తి ప్రతాప్ సింగ్ హడా. ‘‘మా మూవీని సైనికులకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు నిర్మాత సిద్ధు ముద్ద. ఈ వేడుకలో సహ నిర్మాత నందకుమార్, కెమెరామేన్ హరి కె.వేదాంతం, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు నవదీప్, అభినవ్ గోమటం, శతాఫ్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల, ఫైట్ మాస్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కథని నమ్మి చేశారనిపిస్తోంది
‘‘విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అభినవ్ ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ చిత్రంలో తొలిసారి హీరోగా చేశాడు. ఈ చిత్రంతో తనకు మంచి సక్సెస్ రావాలి. టీజర్, ట్రైలర్ చూస్తే కథని నమ్మి చేసిన సినిమాలా అనిపిస్తోంది. టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం విజయం సాధించి, దర్శక, నిర్మాతలకు మంచి బ్రేక్ రావాలని ఆశిస్తున్నాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. అభినవ్ గోమఠం, వైశాలి రాజ్ జంటగా తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. కాసుల క్రియేటివ్ వర్క్స్‌పై భవాని కాసుల, ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై, మూవీ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అభినవ్ గోమఠం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నా కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినా ఈ మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నాకు తొలి అవకాశం ఇచ్చిన అభినవ్‌కు, నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు తిరుపతి రావు. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు భవాని కాసుల. -
‘ధీర’ట్రైలర్ బాగుంది.. వారి కష్టానికి ప్రతిఫలం రావాలి: దిల్ రాజు
‘‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తున్నాం. శ్రీనివాస్‌గారు చిన్న నిర్మాతలకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తారు. ఇక లక్ష్ నటించిన ‘ధీర’ట్రైలర్ బాగుంది. తన హార్డ్ వర్క్, చిత్ర యూనిట్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. లక్ష్ చదలవాడ హీరోగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధీర’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ మూవీ రేపు (శు క్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ‘దిల్’ రాజు, దర్శకులు గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన అతిథులుగా హాజరై, సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లలో ఎంతో మంది దర్శకులని పరిచయం చేశాను. ‘ధీర’తో విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. లక్ష్ ను చూసి తండ్రిగా గర్విస్తుంటాను. మా ప్రొడక్షన్లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి’’ అన్నారు. ‘‘పక్కోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేసే వాడికి ఓ మిషన్ అప్పగిస్తే ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యల్ని ‘ధీర’లో చూస్తారు’’ అన్నారు లక్ష్ చదలవాడ. ‘‘ధీర’ చాలా యూనిక్ పాయింట్. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు విక్రాంత్ శ్రీనివాస్. -
మా ఇద్దరికీ సంక్రాంతి కలిసొచ్చిన పండగ
‘‘నాన్నగారికి (సూపర్ స్టార్ కృష్ణ), నాకు సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజైతే అది బ్లాక్‌బస్టరే.. ఈసారి కూడా ‘గుంటూరు కారం’తో బాగా గట్టిగా కొడతాం. కానీ, ఈసారి కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్య లేరు. ఆయన నా సినిమా చూసి కలెక్షన్స్, సినిమా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా ఉండేది. ఆయన ఫోన్ కోసం ఎదురు చూసేవాణ్ణి. ఇప్పుడు అవన్నీ మీరే (ఫ్యాన్స్) చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మానాన్న.. మీరే అన్నీ (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు మహేశ్‌బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు, శ్రీలీల జంటగా మీనాక్షీ చౌదరి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం గుంటూరులో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘నేను త్రివిక్రమ్ గారి సినిమాలు చేసినప్పుడల్లా నా నటనలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాలకు మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ ఆ మ్యాజిక్ జరిగింది. ఒక కొత్త మహేశ్‌బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. మా నిర్మాత చినబాబుగారికి అత్యంత ఇష్టమైన హీరో నేనే. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో వచ్చిన సంతోషం చూసినప్పుడు నాకు ఆనందంగా అనిపించేది. శ్రీలీలతో డ్యాన్స్ చేయడమంటే వామ్మో.. అదేం డ్యాన్సు.. హీరోలందరికీ తాట ఊడిపోద్ది (నవ్వుతూ). తమన్ ప్రతిసారీ నాకు బెస్ట్ ఇస్తాడు. ‘కుర్చీ మడతపెట్టి..’ పాట చూస్తే థియేటర్లు బద్దలయిపోతాయి. పాతికేళ్లుగా మీరు (ఫ్యాన్స్) చూపించిన అభిమానం మరచిపోలేను. మాటల్లేవ్.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకేమీ తెలియదు.. మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ –‘‘కృష్ణగారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి గొప్ప మహానటుడు, మహా మనిషితో నేను నేరుగా పని చేయలేకపోయాను. కానీ, ఆయన పని చేసిన ఓ సినిమాకి పోసానిగారి వద్ద అసిస్టెంట్‌గా చేశాను. ఆ తర్వాత ‘అతడు, ఖలేజా’ సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడాను. అలాంటి గొప్ప వ్యక్తికి కొడుకుగా పుట్టిన మహేశ్‌గారు ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంటుంది. ఒక సినిమాకి 100 శాతం పని చేయాలంటే 200 శాతం పని చేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేశ్‌గారే.. ఈ మాట చెప్పడానికి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడరు. ‘అతడు, ఖలేజా’లకు పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అది అందం పరంగా, నటన పరంగానూ. ఈ సంక్రాంతిని రమణగాడితో కలిసి థియేటర్లలో ఆనందంగా జరుపుకుందాం’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చినబాబు, నాగవంశీల సక్సెస్ జర్నీ అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఏదో మాయ చేస్తారు.. ఈ సినిమాలో కూడా చేశారు. ‘గుంటూరు కారం’తో మహేశ్‌గారు కలెక్షన్ల తాట తీస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా రాబోతోంది’’ అన్నారు. -
సంక్రాంతికి పండగే పండగ
‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘సైంధవ్’ చేశాం. సంక్రాంతి పండగకు రిలీజ్ చేస్తున్నాం.. పండగే పండగ.. మీకు(అభిమానులు, ప్రేక్షకులు)నచ్చేలా నా ఎమోషనల్, యాక్షన్ సీన్స్ కొత్తగా చేశాను. ‘ధర్మచక్రం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఇలా.. అన్ని సినిమాలను ఆదరించిన మీరు ‘సైంధవ్’ ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బేబీ సారా కీలక పాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’, ‘సుందరకాండ’, ‘మల్లీశ్వరీ’, ‘గురు’, ‘గోపాల గోపాల’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చాలా చిత్రాల కోసం వైజాగ్ వచ్చాను. ఇప్పుడు ‘సైంధవ్’ కోసం వచ్చాను. న్యూ ఏజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సైంధవ్’. శైలేష్ కొలను బాగా చూపించాడు. ప్రేక్షకులు కంటతడి పెట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాకు హీరో సారా పాప. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా పండక్కి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ సినిమా ‘సైంధవ్’ బాధ్యతని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆయన్ను మీరు (ప్రేక్షకులు, అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాను. నేను కమల్‌హాసన్ గారి అభిమానినని చాలాసార్లు చె΄్పాను. ఇకపై నేను వెంకటేశ్‌గారి అభిమానిని కూడా. నవాజుద్దీన్ గారిని తెలుగుకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన సీనియర్ హీరోలు రియలిస్టిక్ సినిమాలు చేస్తే చూడాలనుకుంటాం.. అలాంటి ఓ సినిమా ‘సైంధవ్’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘బ్రహ్మపుత్రుడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు తొలిసారి వెంకటేశ్‌గారిని చూశాను. ‘సైంధవ్’ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. ఈ వేడుకలో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, కెమెరామేన్ మణికందన్ , బేబీ సారా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు. -
హను–మాన్: ప్రతి టిక్కెట్‌పై ఐదు రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళం
‘‘సంక్రాంతి అన్నది సినిమాలకు చాలా మంచి సీజన్. ఎన్ని చిత్రాలు వచ్చినా సరే కథ బాగుండి.. కంటెంట్‌లో సత్తా ఉండి.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలతో పాటు ‘హను–మాన్’ కూడా బాగా ఆడాలి.. ఆడుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘హను–మాన్’ టీజర్, ట్రైలర్ చూడగానే అద్భుతంగా అనిపించడంతో డైరెక్టర్ ఎవరని అడిగి, ప్రశాంత్ వర్మ గురించి తెలుసుకున్నాను. ‘మీ సూపర్ హీరో ఎవరు?’ అని ఓ ఇంటర్వ్యూలో సమంత అడిగినప్పుడు.. ‘హను–మాన్’ అని టక్కున చెప్పేశాను. అదే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ వర్మ ఆలోచన, తేజ కష్టం వృథా కావు. అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరక్కపోవచ్చు. కానీ, సినిమాని విడుదల రోజు.. లేకుంటే మరుసటి రోజు.. ఫస్ట్ షో.. లేదంటే సెకండ్ షో చూస్తారు. సినిమా బాగుంటే ఎన్ని రోజులైనా చూస్తారు. ‘హను–మాన్’లాంటి మంచి సినిమా తీసిన నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ చిత్రం ఆడినన్ని రోజులు ప్రతి టిక్కెట్‌పై వచ్చే డబ్బులో ఐదు రూపాయలు అయోధ్యలోని రామమందిరానికి విరాళంగా ఇస్తామని యూనిట్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రామమందిరంప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది.. కుటుంబ సమేతంగా వెళతాను’’ అన్నారు. కె.నిరంజన్ మాట్లాడుతూ– ‘‘నేను ఏదైతే నమ్మానో దాన్ని అలాగే తెరపైకి తీసుకొచ్చిన ప్రశాంత్‌కి థ్యాంక్స్. మా విజన్‌తో నిర్మించిన ‘హను–మాన్’ని ప్రేక్షకులు బిగ్స్క్రీన్స్లో చూసి ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవిగారికే. ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేస్తున్నా. రామ్‌చరణ్‌గారికి రాజమౌళిగారు, రవితేజగారికి పూరి జగన్నాథ్‌గారు, నాకు.. ప్రశాంత్ వర్మగారు అని సగర్వంగా చెబుతున్నా’’ అన్నారు తేజ సజ్జా. ‘‘నన్ను నమ్మి ‘హను–మాన్’ తీయమని సపోర్ట్ చేసిన నిరంజన్ రెడ్డి సర్కి థ్యాంక్స్. కలలో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడు తేజ.. తనకి సినిమా అంటే అంత ప్రేమ. ఈ సంక్రాంతికి పిల్లలు, పెద్దలందరూ థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేసేలా ‘హను–మాన్’ ఉంటుంది అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నటుడు వినయ్ రాయ్, కెమెరామేన్ దాశరథి శివేంద్ర, డైరెక్టర్ కేవీ అనుదీప్, రచయిత–డైరెక్టర్ బీవీఎస్ రవి, సంగీత దర్శకులు అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, గౌర హరి తదితరులు పాల్గొన్నారు. -
యానిమల్ తరహాలో ‘దీనమ్మ జీవితం’
దేవ్ బల్లాని, ప్రియా చౌహాన్, సరిత ప్రధాన పాత్రల్లో మురళీ రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై. మురళీకృష్ణ, వై. వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి. సోనియా నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దేవ్ మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రం ఇది.పెద్ద విజయాన్ని అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘యానిమల్’ వంటి రా అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ ‘దీనమ్మ జీవితం’. తమిళ్, మలయాళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి కంటెంట్‌తో సినిమా చేయగలరని నిరూపించే చిత్రమిది’’ అన్నారు మురళీ రామస్వామి. ‘సమాజంలో జరిగే కథ ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని ప్రియా చౌహాన్ అన్నారు. -
వ్యూహం.. ఒక వాస్తవం
సాక్షి, అమరావతి/ విజయవాడ స్పోర్ట్స్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2019 వరకు కుట్రలు– ఆలోచనల మధ్య జరిగిన రాజకీయమే ‘వ్యూహం’ చిత్రమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. రాజకీయాలను ప్రజలు చూసే కోణం నుంచే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ చిత్రంలో ఎలాంటి కల్పితాలు లేవని, పాత్రల పేర్లు సైతం రాజకీయ నాయకుల వాస్తవ పేర్లతోనే తెరకెక్కించామని స్పష్టం చేశారు. విడుదలను ఆపేందుకు పన్నిన కుట్రలను సైతం ఛేదించుకుని ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వ్యూహం’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘జగ గర్జన’ పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. వ్యూహం సినిమాలో షాట్ వన్ను ఎంపీ నందిగం సురేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ వెన్నుపోటుతోనే ఫేమస్ అయిన చంద్రబాబునాయుడు ఇప్పటికీ తన రాజకీయ సౌలభ్యం కోసం ఎన్టీఆర్ అభిమానులను వాడుకుంటున్నారని చెప్పారు. ఈ చిత్రం ద్వారా తన పరువు పోతుందని, విడుదల ఆపాలని లోకేశ్ కోర్టుకెళ్లడం పెద్ద జోక్ అన్నారు. తెల్లారి లేస్తే లోకేశ్ అందర్నీ పచ్చి బూతులు తిడుతూ అవమానించడం ఇతరుల పరువు తీయడం కాదా.. అని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ను రంగుల రాజాగా అభివర్ణించారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పవన్‌కల్యాణ్‌కు లేదని, ఆంధ్రాలో చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రస్తుతం బర్రె ‘లెక్క’ పవన్‌కల్యాణ్ మారాడని ఎద్దేవా చేశారు. బట్టలూడదీస్తాం.. రోడ్డు మీద ఈడ్చి తంతాం.. కోస్తాం.. అంటూ పవన్‌కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ ప్రతిరోజూ మాట్లాడుతుంటారని, ఇలాంటి వ్యాఖ్యలు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సైతం మాట్లాడరని ఆయన చెప్పారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో జరిగిన కుట్ర రాజకీయాలను, కాంగ్రెస్‌తో చేతులు కలిపి చంద్రబాబు పన్నిన పన్నాగాలను, బాబు హయాంలో జరిగిన ప్రజాధనం దోపిడీని ఈ చిత్రంలో తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ మంచి మనసున్న ప్రజానేత సీఎం జగన్ జీవిత చరిత్రను తెరకెక్కించడం తనకు దక్కిన అదృష్టమన్నారు. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ మంచి ప్రజానాయకుల జీవిత చరిత్రను ప్రముఖ దర్శకుడు తెరకెక్కించడం మంచి పరిణామమన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పారు. ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, శివకుమార్, అదీప్‌రాజు, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి ప్రసంగించారు. సంగీత దర్శకురాలు కీర్తన, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. -
నాలోని మరో కోణాన్ని చూస్తారు
‘‘కాలింగ్ సహస్ర’లో సవాల్‌తో కూడుకున్న మంచి పాత్ర ఇచ్చిన అరుణ్‌గారికి థ్యాంక్స్. నాలోని మరో కోణాన్ని చూపించే పాత్ర ఇది. ఇకపై కొత్త కథలతో మంచి చిత్రాలు చేస్తాను. ‘కాలింగ్ సహస్ర’ మీకు నచ్చితే పది మందికి చెప్పండి’’ అని ‘సుడిగాలి’ సుధీర్ అన్నారు. అరుణ్ విక్కీరాలా దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి నటుడు జేడీ చక్రవర్తి, దర్శకులు దశరథ్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సుధీర్ మాట్లాడుతూ–‘‘మా సినిమాను మంచి థియేటర్లలో విడుదల చేసేందుకు సాయం చేసిన బెక్కం వేణుగోపాల్గారికి ధన్యవాదాలు. నా ‘గాలోడు’ సినిమా అభిమానుల వల్లే హిట్ అయింది. ఎన్ని జన్మలు ఎత్తినా వారి రుణం తీర్చుకోలేను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు విజేష్ తయాల్, వెంకటేశ్వర్లు కాటూరి. -
మళ్లీ కలసి పనిచేస్తాం
‘‘మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ‘బ్రీత్’. వంశీకృష్ణగారు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దారు.. భవిష్యత్‌లో మేము మళ్లీ కలసి పనిచేస్తాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో చైతన్య కృష్ణ అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా జంటగా నటించిన చిత్రం ‘బ్రీత్’. బసవతారకరామ క్రియేషన్స్ పై నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ–‘‘బ్రీత్’ మంచి ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘చైతన్య కృష్ణ కోసం అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన, ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని అద్భుతమైన కథని రెడీ చేశాను. ‘బ్రీత్’ సక్సెస్ తర్వాత అది కూడా చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. ఈ వేడుకలో వైదిక సెంజలియా, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు
‘‘ఈగ’ సినిమా తమిళంలో విడుదలైన తర్వాత నేను ఎప్పుడు చెన్నై వెళ్లినా.. నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు. అలాగే కార్తీని చూస్తే చాలామంది తెలుగు ప్రేక్షకులు తెలుగబ్బాయిలా ఉన్నాడంటారు. నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు కార్తీని సొంతం చేసుకున్నారు. వరుసగా మూడు హిట్స్ సాధించి ఇప్పుడు ‘జపాన్’తో ముందుకొస్తున్నాడు కార్తీ. దీపావళికి వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో నాని అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ – ‘‘జపాన్’ లాంటి చిత్రం తీసి ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులభం కాదు. కానీ, ఈ మూవీ ట్రైలర్ చూశాక టీమ్ ఎనర్జీ, నమ్మకం నాకు కనిపించింది. అనూ ఇమ్మాన్యుయేల్ నా ‘మజ్ను’ సినిమాతో పరిచయమైంది. ‘జపాన్’ ట్రైలర్ చూసినప్పుడు చాలా మంచి సినిమాలో భాగస్వామ్యం అయినట్లు అనిపించింది. ప్రభుగారు మంచి సినిమాలు నిర్మిస్తుంటారు. లెక్కలు చూసుకుని పని చేసే నిర్మాత కాదు.. ఫ్యాషన్‌తో,ప్రాణం పట్టి పనిచేసే నిర్మాతలాగా అనిపిస్తారు. ఇలాంటి మంచి సినిమా తీసిన డైరెక్టర్ రాజు మురుగన్‌కి అభినందనలు’’ అన్నారు. ‘‘జపాన్’ నా మనసుకు బాగా దగ్గరైంది’’ అన్నారు కార్తీ. ‘‘జపాన్’ అంతా రాజు మురుగన్ శైలిలో ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని ఎస్ఆర్ ప్రభు అన్నారు. రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘కళకు భాషతో సంబంధం లేదు. తెలుగు ప్రేక్షకులు సినిమాని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. భారతీయ సినిమాకి ఐకానిక్‌గా గుర్తింపు పోందింది టాలీవుడ్’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత సుప్రియ, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటులు సునీల్, రాకేందు మౌళి, పాటల రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. -
మా ఊరి పొలిమేర 2 నా సినిమా లాంటిది
‘‘నా ‘క్షణం’ సినిమాకి పని చేసిన టీమ్ అంతా ‘‘మా ఊరి పొలిమేర 2’ టీమ్‌లో ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ నాకు మంచి స్నేహితుడు. ‘మా ఊరి పొలిమేర ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసి, దానికి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ తీయడం ఆనందంగా ఉంది. ఇది నా సొంత సినిమా లాంటింది. తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. ‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర–2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథులుగా అడివి శేష్, నిర్మాత ఎస్కేఎన్ హాజరయ్యారు. ఎస్కేఎన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏదైనా అదే కష్టమే. ప్రేక్షకులకు మంచి సినిమా కావాలి.. అంతే. ‘మా ఊరి పొలిమేర–2’కి హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ఇంత గ్రాండ్‌గా విడుదల కావడానికి కారణం వంశీ నందిపాటిగారు. మా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్ విశ్వనాథ్. ఈ వేడుకలో కామాక్షీ భాస్కర్ల, గాయకుడు పెంచల్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ దసరా మీదే
‘‘మణిరత్నంగారి ‘నాయగన్’ తరహా సినిమాలు తెలుగులో ఎప్పుడు వస్తాయా? అనుకునేవాడిని. ‘పుష్ప’తో నెరవేరింది. ‘టైగర్ నాగేశ్వర రావు’ కూడా అలా అనిపించింది’’ అన్నారు రచయిత–దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. రవితేజ టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కె. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రవితేజగారు చేసిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని తమిళ, కన్నడ, హిందీలో రీమేక్ చేశారు. అయితే ఎవరూ ఆయన్ను మ్యాచ్ చేయలేకపోయారు. రవితేజగారు తెలుగు సినిమాలకే పరిమితమైపోకుండా ఇతర భాషల చిత్రాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ‘టైగర్ నాగేశ్వర రావు’ ట్రైలర్ చూడగానే ప్రతి ఫేమ్‌ను దర్శకుడు వంశీ అద్భుతంగా తీశారనిపించింది. అభిషేక్ అగర్వాల్గారికి మంచి టైమ్ నడుస్తోంది. దసరా పండగ వచ్చింది. దుర్గమ్మవారికి ఎవడూ ఎదురు నిలబడలేడు. ఆ దుర్గమ్మ తల్లి వాహనం టైగర్ ముందు కూడా ఎవడూ నిలబడలేడు. దసరా మీదే (టైగర్ నాగేశ్వరరావు టీమ్‌ను ఉద్దేశించి)’’ అన్నారు. మరో ముఖ్య అతిథి ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా మాట్లాడుతూ– ‘‘రవితేజగారికి ఉత్తరప్రదేశ్‌లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీ గర్వపడేలా నా మిత్రుడు అభిషేక్ అగర్వాల్ మరిన్ని సినిమాలు తీయాలి. ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా కథ విని, ఎగ్జయిట్ అయ్యాను. ఎమోషన్, థ్రిల్.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. సినిమాలో ఉన్నవన్నీ ఒరిజినల్ పాత్రలే. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన అభిషేక్‌గారు ‘టైగర్’తో హ్యాట్రిక్ హిట్ సాధించాలి’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక బెస్ట్ ఫిలిమ్‌గా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు వంశీ. ‘‘నాలుగేళ్ల ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ఈ వేడుకలో చిత్ర సహ–నిర్మాత మయాంఖ్, దర్శకులు గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, టీజీ విశ్వప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి – శర్వానంద్
‘‘మేం ఒక్క పాత్ర చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అలాంటిది ‘మామా మశ్చీంద్ర’లో సుధీర్ ఏకంగా మూడు పాత్రలు చేశారు.. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు శర్వానంద్. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల అతిథులుగా హాజరయ్యారు. ‘‘సుధీర్ మూడు పాత్రలు చేశారంటే కథ ఎంత విలక్షణంగా ఉండి ఉంటుందో అర్థమవుతోంది’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘సుధీర్ కొత్త రకం కథలు ప్రయత్నిస్తుంటారు’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘మామా మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం.. అన్నీ ఉంటాయి’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘ఇది ఒక అమ్మ, తండ్రీకూతుళ్ల కథ’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘రచయితల నుంచి డైరెక్టర్స్‌గా మారిన త్రివిక్రమ్, కొరటాల శివల్లా హర్షవర్ధన్ కూడా పెద్ద డైరెక్టర్ కావాలి’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
'రూల్స్ రంజన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రతి సినిమాకు అదే అసలైన బలం : విశ్వక్ సేన్
‘చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదని ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్‌నుమా దాస్’ వంటి ఎన్నో చిత్రాలు నిరూపించాయి. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలామంది. కానీ ఆ చిత్రంలో పనిచేస్తున్న వాళ్లు ఎంత ప్రతిభావంతులు అనేది చూస్తే అదే సినిమాకు అసలైన బలం. ‘రామన్న యూత్’ చిత్రానికి అలాంటి మ్యాజిక్ జరగాలి.ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్గా చేశారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడకకి విశ్వక్ సేన్, నటులు ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో తిర్వీర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నాతో కలిసి ఆటోలో తిరిగిన అభయ్ నవీన్ ఇప్పుడు ఇలా సినిమా చేశాడని అంటే ఆనందంగా ఉంది. డబ్ స్మాష్ ద్వారా చాలా వీడియోలు చేసేవాడు. కలిసి సినిమాలో నటించాం. అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చిన అభయ్..ఇప్పుడు డైరెక్టర్ అయి మా ఫ్రెండ్స్ కు అవకాశాలు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. ‘నేను సినిమా చూశాను. చాలా ఫన్ ఫీలయ్యా, అలాగే కొన్ని చోట్ల సర్ ప్రైజ్ అయ్యాను. రామన్న యూత్ సినిమాలో ఒక జీవితం ఉంటుంది’ అని హీరో ప్రియదర్శి అన్నారు. ‘‘ప్రేక్షకులకు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనేది తెలియదు. మంచి కథ ఉంటే ఆ చిత్రాన్ని తప్పకుండా చూస్తారు. ‘రామన్న యూత్’ని థియేటర్ లో చూసి ప్రోత్సహించాలి’’ అన్నారు అభయ్ నవీన్. -
ఛాంగురే బంగారురాజాని ఎంజాయ్ చేస్తారు: రవితేజ
‘‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ నాకు నచ్చింది. ఈ కథని సతీష్ చెబుతున్నంత సేపు నాకు ‘లేడీస్ టైలర్’ సినిమా, దర్శకులు వంశీ గుర్తొచ్చారు. ఆయనతో నేను ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా చేశాను. అలాంటి వినోదం ‘ఛాంగురే బంగారు రాజా’లో ఉందనిపించింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో రవితేజ. కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. సతీష్ వర్మ దర్శకత్వంలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్‌కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘కార్తీక్ రత్నం ఇందులో మంచి ఎంటర్టైనింగ్ రోల్ చేశాడు. నా టీమ్ సభ్యులపై నమ్మకంతో నేను ఒక్కరోజు కూడా ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లలేదు.. ఈ మూవీ విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘ప్రతిభా వంతులను, కష్టపడేవారిని రవితేజగారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. సతీష్ వర్మతో నాకు పదేళ్ల పరిచయం. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ‘‘శ్రీనువైట్లగారి నుంచి మొదలుపెడితే వంశీ వరకు చాలామంది కొత్త దర్శకులను అన్నయ్య(రవితేజ) ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దర్శకులనే కాదు.. సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులను కూడా ప్రోత్సహిస్తారు. ఆయన సినిమాలపై అప్పుడప్పుడు విమర్శలు వస్తుంటాయి. అలా అన్నవాళ్లు పడిపోయారు కానీ అన్నయ్య అలానే ఉన్నారు. ‘ఇడియట్’ మూవీలోలా ‘ఇండస్ట్రీకి ఎందరో వస్తుంటారు.. వెళ్తుంటారు. రవితేజ మాత్రం ఇక్కడే ఇలానే ఉంటారు’’ అన్నారు దర్శకుడు హరీష్ శంకర్. ‘‘నేను హీరోగా రవితేజగారు సినిమాను నిర్మించారనే ఆ స్పెషల్ మూమెంట్ లోనే ఇంకా నేను ఉన్నాను’’ అన్నారు కార్తీక్ రత్నం. ‘‘కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది’’ అన్నారు సతీష్ వర్మ. ఈ వేడుకలో దర్శకులు వెంకటేష్ మహా, కేవీ అనుదీప్, సందీప్ రాజ్, వంశీ, కృష్ణ చైతన్య, నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, శరత్ మరార్, ఎస్‌కేఎ¯Œ , చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడారు. -
ముక్కోణపు ప్రేమకథ
అభినవ్ మదిశెట్టి, స్నేహా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ సే’. మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 4న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పి. కౌశిక్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా హాజరయ్యారు.‘‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది’’అని మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని అన్నారు. -
BRO Pre Release Event Photos: బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'1923లో జరిగిన ఓ ఘటనే ఈ సినిమాకు మూలం'
‘‘హత్య’ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటే హాలీవుడ్ డిటెక్టివ్ చిత్రాలు గుర్తొస్తాయి. గిరీష్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ‘హత్య’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు విజయ్ ఆంటోని. బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, రితికా సింగ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హత్య’. ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. గ్లోబల్ సినిమాస్, సురేశ్ ్ర΄÷డక్షన్స్ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరై, ‘హత్య’ హిట్టవ్వాలన్నారు. ‘‘1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రం తీశాను’’ అన్నారు బాలాజీ కుమార్. -
'మహావీరుడు'ని తెలుగువారు ఇష్టపడతారు: అడివి శేష్
'మహావీరుడు’ సినిమా ట్రైలర్, విజువల్స్ గొప్పగా ఉన్నాయి. ఈ మూవీలో గ్రేట్ వైబ్ కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. శివ కార్తికేయన్ హీరోగా ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మహావీరన్’. అదితీ శంకర్ హీరోయిన్. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ ఈ నెల 14న తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరో అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడివి శేష్ మాట్లాడుతూ–'నా గురువు శేఖర్ కమ్ముల ముందు మాట్లాడటం గౌరవంగా ఉంది. శివ కార్తికేయన్‌తో పని చేయాలని ఉంది' అన్నారు. 'రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్’ సినిమాల్లా ‘మహావీరుడు’ ని తెలుగువారు ఇష్టపడతారు' అన్నారు శివ కార్తికేయన్. ‘‘మహావీరుడు’ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మడోన్ అశ్విన్. ‘‘మా అమ్మగారి పేరుతో ఈ సంస్థ మొదలుపెట్టి, శివ కార్తికేయన్‌తో తొలి మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు అరుణ్ విశ్వ. -
చీరాలలో ‘అహింస’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Ramabanam Pre Release Event : ‘రామబాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ హైలైట్స్
-
కార్తీ నిరూపించుకున్నాడు: నాగార్జున
‘‘ఓ సూపర్‌స్టార్ అన్నగా(సూర్య) ఉన్నప్పుడు.. ఆ షాడో నుంచి బయటకు వచ్చి... సొంత ప్రతిభను నిరూపించుకోవడం అనేది చాలా తక్కువ. అటువంటి వారిని అరుదుగా నేను ఇద్దర్నే చూశాను. తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కన్నడలో శివరాజ్‌కుమార్ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్. ఇప్పుడు తమిళ్లో సూర్య బ్రదర్ కార్తీ. ఇలా నిరూపించుకోవడం కష్టమైన పని. విభిన్నమైన, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అన్నలా సూపర్‌స్టార్ అయ్యాడు కార్తీ’’ అని నాగార్జున అన్నారు. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో లైలా ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘సర్దార్’ ప్రీ రిలీజ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఊపిరి’ సినిమా నుంచి కార్తీతో నా అనుబంధం ప్రారంభమైంది. తను తెలుగులో మాట్లాడతాడు.. పాటలు పాడతాడు. తెలుగులో మాట్లాడినవారిని మనం హృదయాల్లో పెట్టుకుంటాం.. అందుకే కార్తీని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాను సమర్పిస్తున్నందుకు చాలా గర్వంగా, హ్యాపీగా ఉంది’’అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారు నాకు రియల్ బ్రదర్.. పెద్ద స్ఫూర్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఆయన్ని ఎఫెక్ట్ చేయలేవు. సినిమాలంటే ఆయనకు ఎంతో ప్యాషన్. మంచి మనవతావాదిగా ఉంటేనే మంచి యాక్టర్‌గా ఉండగలమని నాగార్జునగారు ఓ సందర్భంలో చెప్పారు. నేనూ ఎప్పట్నుంచో ఫాలో అవుతున్నాను. నాగార్జునగారు యాక్ట్ చేస్తున్నారనే నేను ‘ఊపిరి’ సినిమా చేశాను. నా కెరీర్లో ‘సర్దార్’ చాలా ముఖ్యమైన సినిమా. ‘సర్దార్’ ఇండియన్ స్పై థ్రిల్లర్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘శివపుత్రుడు’ దీపావళికి రిలీజై హిట్ సాధించింది. ‘సర్దార్’ కూడా దీపావళికి విడుదలవుతోంది. నా బర్త్ డే కూడా ఈ దీపావళి రోజునే (అక్టోబరు 24). చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ప్రతి ఒక్కరూ ‘సర్దార్’ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’అన్నారు. గేయ రచయిత రాకేందు మౌళి. అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా పాల్గొన్నారు. -
అప్పుడు చైన్‌తో వచ్చా... ఇప్పుడు కత్తితో వస్తున్నా
‘‘ముప్పైమూడు సంవత్సరాల క్రితం అక్టోబరు 5న ‘శివ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాతో సైకిల్ చైన్ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఈ అక్టోబరు 5న ఓ కత్తితో ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో వస్తున్నాను. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయదశమి మా ‘ది ఘోస్ట్’ చిత్రానికి కూడా విజయాన్ని ఇస్తుందనుకుంటున్నాను’’ అని నాగార్జున అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల కానుంది. కాగా ఆదివారం కర్నూలులో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈరోజు ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్ ఇంత ప్రేమను పొందడానికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్నగారికి (దివంగత అక్కినేని నాగేశ్వరరావు) థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ‘ది ఘోస్ట్’ లో అలానే కనపడతాను. నేను, చైతన్య చేసిన ‘బంగార్రాజు’ సినిమా థియేటర్స్‌లోనే కాదు.. టెలివిజన్ టీఆర్పీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. నెక్ట్స్ అఖిల్‌తో నేను చేయబోయే సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. మహేశ్‌బాబు ఎప్పుడంటే అప్పుడు అతనితో కలిసి నటిస్తాను. నాకు ఎంతో ఆప్తులైన చిరంజీవిగారి సినిమా ‘గాడ్‌ఫాదర్’ కూడా అక్టోబరు 5న రిలీజ్ కాబోతుంది.. ‘ది ఘోస్ట్, గాడ్‌ఫాదర్’ సినిమాలకు విజయాలు చేకూరాలి’’ అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ–‘‘గత నాలుగైదు నెలలుగా నాన్నగారిని(నాగార్జున) కలిసిన ప్రతిసారి ‘ది ఘోస్ట్’ గురించే మాట్లాడుకుంటున్నాం.. ఇలాంటి ఎగై్జట్‌మెంట్‌ను నాన్నలో చూసి చాలా రోజులైంది. ‘బంగార్రాజు’ చిత్రం నుంచి ‘ది ఘోస్ట్’కి ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయిన తీరు అద్భుతం. ఈ విధంగా నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. స్క్రీన్‌పై నాన్నని ఎలా చూడాలనుకున్నానో అలా ప్రవీణ్‌గారు ఈ సినిమాలో చూపించారు’’అన్నారు. హీరో అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను, అన్నయ్య.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాం. ముప్పై ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో నాన్నగారు సినిమాలు చేస్తున్నారు.. దాన్నిబట్టి మేం ఎంత పరిగెత్తాలనేది అర్థం అవుతోంది. ‘ది ఘోస్ట్’ లో ఏదో ఒక ఫైర్ ఉంది.. సినిమా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయన అభిమానుల అంచనాలను అందుకునేలా ‘ది ఘోస్ట్’ ఉంటుంది’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘నాగార్జున ఎంత స్టైలిష్‌గా ఉంటారో అంతే స్టైలిష్‌గా ఈ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత రామ్మోహన్రావు. ‘‘ది ఘోస్ట్’ తీసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సోనాల్ చౌహాన్, నటుడు విక్రమాదిత్య, కెమెరామేన్ ముఖేష్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, మ్యూజిక్ డియో భరత్, సౌరభ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ సినిమా కథ విని షాకయ్యాను: సునీల్
‘‘హాస్యం పండించే హాస్యనటులు ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం ఓ డేరింగ్ స్టెప్. ఇక్కడే మొదటి విజయం సాధించింది ఈ చిత్రం. సునీల్, ధన్ రాజ్ లాంటి మంచి నటులతో జి. నాగేశ్వరరెడ్డిగారు ఇలాంటి థ్రిల్లర్‌తో రావడం ఆసక్తికరంగా ఉంది’’ అన్నారు దర్శకుడు మారుతి. సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో కెమెరామేన్ ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బుజ్జి.. ఇలారా’. రూపా జగదీష్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జి. నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు మారుతి హాజరయ్యారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు అసలైన స్టార్స్ నిర్మాతలే. నాపై నమ్మకంతో నాలుగు కోట్లు ఖర్చుపెట్టారు. ఈ కథకు నేనే కరెక్ట్ అని నమ్మి, నాతో సినిమా చేసి అండగా నిలబడ్డారు నాగేశ్వరరెడ్డిగారు’’ అన్నారు.‘‘ఈ సినిమా కథ విని షాకయ్యాను. మంచి సందేశం ఉంది’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమాతో దర్శకత్వం ఎంత కష్టమో తెలిసింది’’ అన్నారు అంజి. ‘‘ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు నిర్మాతలు. -
ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు.. చేసింది ఇరవై సినిమాలు : నటి
గౌతమ్ కృష్ణ, పూజితా పొన్నడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో..’. గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో మనోజ్ డీజే, డా. మణికంఠ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘ఓ కామన్‌మేన్ రాక్‌స్టార్ ఎలా అయ్యాడు? అన్నదే ఈ సినిమా కథ. ‘ఆకాశవీధుల్లో...’ పక్కా యూత్‌ఫుల్ చిత్రం. ఈ సినిమా ఓ స్లో పాయిజన్. యూత్ బాగా కనెక్ట్ అవుతారు. నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశాం’’ అన్నారు. ‘‘గౌతమ్ ఎమ్‌బీబీఎస్ చదువుతున్నప్పుడే ఈ సినిమా చేస్తానని అన్నాడు. మెడిసిన్ పూర్తి చేయమన్నాను. పీజీ కూడా పూర్తయ్యేది. కానీ సినిమాలపై ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చాడు. గౌతమ్‌కృష్ణ చాలా తెలివైనవాడు. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు నిర్మాత మనోజ్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లవుతోంది. దాదాపు ఇరవై సినిమాలు చేశాను. కానీ ఓ మంచి సినిమా చేశాననే తృప్తి ఈ సినిమాతో కలిగింది’’ అన్నారు పూజిత. -
ప్రతి జనరేషన్లో ఒకడుంటాడు – నాని
‘‘రామారావు: ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రవితేజ అన్న గురించి మాట్లాడొచ్చని వచ్చాను. రవి అన్నకు చిరంజీవిగారంటే చాలా ఇష్టం. రవి అన్న కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవిగారిని ఎలా స్ఫూర్తిగా తీసుకున్నారో... మేం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు రవి అన్నగారు మాకు అది. ప్రతి జనరేషన్‌కు ఒకడుంటాడు. నేను అయ్యాను కదరా.. నువ్వెందుకు కాలేవు అనే ధైర్యం ఇచ్చేవాడు ఒకడుంటాడు. అది మా అందరికీ అప్‌కమింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రవి అన్న. చిరంజీవిగారితో రవితేజ అన్న సినిమా చేస్తున్నారు. అలా నాకూ రవితేజ అన్నతో సినిమా చేయా లని ఉంది’’ అన్నారు నాని. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. రజీషా విజయన్, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ – ‘‘ఇరవైఏళ్ల నుంచి రవితేజ అన్న డ్యూటీ (నటుడిగా). ఈ నెల 29 నుంచి థియేటర్స్‌లో ‘రామారావు: ఆన్ డ్యూటీ’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ – ‘‘సౌత్ ఇండస్ట్రీలో వన్నాఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ నాని. అనుభవం ఉన్న దర్శకుడిలా శరత్ సినిమా చేశాడు. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయని ఓ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ క్యారెక్టర్ చేశాను. నిర్మాత సుధాకర్ కూల్ అండ్ పాజిటివ్ పర్సన్. మరో నిర్మాత శ్రీకాంత్ బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు. వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను’’ అన్నారు. శరత్ మండవ మాట్లాడుతూ – ‘‘సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదన్న విషయంలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు. కానీ మా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టికెట్ రేట్స్ చెబుతున్నాను. ఈ చిత్రానికి తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో చార్జి 195 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్‌లో 150, 100, 50 రూపాయలు. ఏపీలో మల్టీప్లెక్స్‌లో 177, సింగిల్ స్క్రీన్స్‌లో 147, 80 చార్జీలు ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేస్తే 30 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. దయచేసి థియేటర్స్ కౌంటర్లో టికెట్ తీసుకోండి’’ అన్నారు. కెమెరామేన్ సత్యన్ సూర్యన్, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, లిరిక్ రైటర్ కల్యాణ్ చక్రవర్తి, దర్శకుడు బాబీ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
మా అబ్బాయిని ఆదరించండి
‘‘నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘మాయోన్’ చిత్రం ద్వారా తెలుగులోకి హీరోగా పరిచయమవుతున్న నా కుమారుడు సిబి సత్యరాజ్‌ను కూడా ఆదరించాలి. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’’ అని నటుడు సత్యరాజ్ అన్నారు. కిషోర్ దర్శకత్వంలో సిబి సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన చిత్రం ‘మాయోన్’. అరుణ్ మోజి మాణికం నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ఈ నెల 7న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్లో వేడుకలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నేను రాసుకున్న ‘బాహుబలి’ కథలో కట్టప్పగా సత్యరాజ్ నటించడంతో తనకి, నాకు ఏదో రుణానుబంధం ఏర్పడింది. ‘మాయోన్’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది’’అన్నారు కిషోర్. ‘‘మాయోన్’ చిత్రంలో నేను ఆర్కియాలజిస్ట్‌గా నటించాను’’ అన్నారు హీరో శిబి సత్యరాజ్. ‘‘పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు మామిడాల శ్రీనివాస్. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: రామ్‌ప్రసాద్. -
నాని నటనే కాదు.. వ్యక్తిత్వం అంటే ఇష్టం: పవన్ కల్యాణ్
‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ఒక కుటుంబానిది కాదు.. ఇది మనందరిది. మా సినిమా బాగుండాలని ఎక్కువగా కోరుకుంటాం.. అది సహజం. అంతేకానీ ఎదుటివారి సినిమా బాగుండకూడదని కోరుకోం. ఇండస్ట్రీలో రాజకీయపరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు.. అయినప్పటికీ సినిమా వేరు.. రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది’’ అని హీరో పవన్ కల్యాణ్ అన్నారు. నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నాని విలక్షణమైన నటుడు.. తన నటనే కాదు.. వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం.. గౌరవం. తనకు మరిన్ని హిట్ సినిమాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. వివేక్ ఆత్రేయ ఈ సినిమాని అద్భుతంగా తీసి ఉంటాడని నమ్ముతున్నాను. భవిష్యత్‌లో నవీన్ యెర్నేని, రవిశంకర్గార్ల నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో నేను హీరోగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా చేయబోతున్నాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్లలో అందరి హీరోలను కలిశాను. కానీ పవన్ కల్యాణ్‌గారిని కలిసే సందర్భం రాలేదు. ఇప్పుడు కలిశాక చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. ‘అంటే.. సుందరానికీ’ నాట్ ఎంటర్టైన్మెంట్.. ఇట్స్ ఎంజాయ్మెంట్’’ అన్నారు. నవీన్ యెర్నేని మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ ప్రివ్యూ చూశా. ఫస్టాఫ్ చూసి ‘పర్లేదమ్మా.. బాగుంది’ అని వివేక్ ఆత్రేయకి చెప్పా. సెకండాఫ్ చూశాక నా అహం పోయింది.. మనస్ఫూర్తిగా ఆత్రేయని హత్తుకుని మంచి సినిమా తీశావని అభినందించాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘జయమ్మ పంచాయతీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్‌గా ఈ స్టార్ హీరోలు
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తాన్ని ఖరారు చేసింది చిత్ర బృందం. రేపు (ఏప్రిల్ 30) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇక ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా స్టార్ హీరోలైన నాగార్జున అక్కినేని, నేచురల్ స్టార్ నాని వస్తున్నారు. జయమ్మ పంచాయి ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు మేకర్స్. Get ready for the Grand Pre release event of #JayammaPanchayathi. Chief guests King @iamnagarjuna & Natural 🌟 @NameisNani 📍Daspalla convention ⏰Tomorrow 6PM onwards#JayammaPanchayathiOnMay6th@ItsSumaKanakala @VijayKalivarapu @vennelacreation @adityamusic @shreyasgroup pic.twitter.com/iTBPj5aYsk — Vennela Creations (@vennelacreation) April 29, 2022 -
బన్నీ ఇండస్ట్రీకి దొరికిన ఓ బహుమతి: రాజమౌళి
Rajamouli Speech In Pushpa Pre Release Event: ‘‘నా ఫేవరెట్ డైరెక్టర్ సుక్కు (దర్శకుడు సుకుమార్) ‘పుష్ప’ చిత్రాన్ని అత్యున్నతంగా ప్రెజెంట్ చేయడానికి ముంబైలో బిజీగా ఉన్నాడు. నేను, సుక్కు ఒకరికొకరం మెసేజ్‌లు పెట్టుకుంటూ ఉంటాం. రీసెంట్గా ‘నాకు టైమ్ సరిపోవడంలేదని మెసేజ్‌లు పెడుతున్నాడు’. ‘నువ్వు చేయగలిగినదంతా ఈ సినిమాకు చేసెయ్’ అన్నాను. దానికి తగ్గట్లుగానే రాత్రీపగలు వర్క్ చేస్తున్నాడు’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. నవీన్, రవి, విజయ్, అల్లు అర్జున్, రష్మికా, రవిశంకర్, అనసూయ, చెర్రీ అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘పుష్ప’. ముత్తం శెట్టి మీడియా సహనిర్మాత. ‘పుష్ప’ తొలి పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ ఈ నెల 17న విడుదల కానున్న సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథిగా పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ పని మీద ముంబై వెళ్లినప్పుడు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అక్కడ ఎవర్ని అడిగినా.. ‘పుష్ప’ అన్నారు. బన్నీ (అల్లు అర్జున్).. ఈ సినిమాను ఇంకా ప్రమోట్ చేయాలి. ముంబైలో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో నా స్వార్థం మాత్రమే కాదు. మొత్తం ఇండస్ట్రీ స్వార్థం ఉంది. ఎందుకంటే ‘పుష్ప’ మన తెలుగు సినిమా. ఇది ఎంతదూరం వెళ్లాలో అంత దూరం వెళ్లాలి. బన్నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్. నువ్వు పడే కష్టానికి.. నువ్వు పెట్టే ఎఫర్ట్‌కి... డైరెక్టర్‌పై నీకు ఉన్న నమ్మకానికి హ్యాట్సాఫ్. ఇండస్ట్రీకి నువ్వు ఒక గిఫ్ట్. నిన్ను చూసి చాలామంది ఇన్‌స్పయిర్ అవుతారు’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘సుకుమార్.. రెండేళ్లకోసారి జరిగే మహా అద్భుతం. అల్లు అర్జున్... చాలా రోజులుగా తాను చూపించాలని తపనపడుతున్న విశ్వరూపం, నా కలల ప్రతిరూపం.. దేవిశ్రీ ప్రసాద్.. మూడో దశాబ్దంలో కూడా మన కర్ణభేరిపై కూర్చొని వాయిస్తున్న మధుర మృదంగం. రష్మికా... గీతా ఆర్ట్స్‌లో పుట్టిన ఈ చిన్న సితార ఇప్పుడు మేం గర్వపడేంత ఎత్తుకు ఎదిగిన ఒక ధృవతార. మైత్రీ.. చాలామందికి వీరంటే ఇష్టం. నొప్పించక.. తానొవ్వక పరిగెత్తడం కష్టం... త్వరలో వీరు ప్రధమ స్థానానికి చేరడం స్పష్టం’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘పుష్ప’లాంటి ప్రపంచాన్ని సృష్టించి, అందులో ఇలాంటి క్యారెక్టర్స్‌ను ఉంచడం సుకుమార్ వల్లే అవుతుంది’’. ఇక ఇప్పుడు నేను మాట్లాడేది సుకుమార్ స్పీచ్ అనుకోండి. ‘‘మైత్రీ మూవీ మేకర్స్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. క్యూబాగారు టఫ్ లొకేషన్స్‌లో కూడా మంచి విజువల్స్ ఇచ్చారు. సినిమాలో క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. సినిమా సినిమాకు ఎదుగుతున్న స్టార్ బన్నీ. ‘పుష్ప’ పాత్ర కోసం బన్నీలా కష్టపడేవారు ఇంకొకరు ఉండరని నమ్ముతున్నాను’’ అన్నారు. -
అల్లు అర్జున్ ‘పుష్ప’ ప్రి-రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా?
Allu Arjun Pushpa Pre Release Business: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఫస్ట్ పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘పుష్ప ది రైజ్’ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. చదవండి: Pushpa Movie: సమంత స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్ ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్ర బృందం స్పెషల్ సాంగ్‌ను విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగులోనే కాదు మిగతా భాషల్లో సైతం పుష్పకు మంచి స్పందన వస్తోంది. ఈ రునథంమంలో పుష్ప ప్రి-రిలీజ్ ఈవెంట్ రేపు(డిసెంబర్ 12) జరగనున్న సంగతి తెలిసిందే. పుష్ప మూవీకి వస్తోన్న రెస్పాన్స్ దృష్టా ఈ ప్రి-రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఏకంగా 250 కోట్ల రూపాయల బిజినెస్‌తో జరుపుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్‌కు రజనీ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అన్ని ఏరియాల్లో ప్రి-రిలీజ్ బిజినెస్‌కు ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేశారట డిస్ట్రిబ్యూటర్లు. అన్నింటికీ మించి సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో వందల కోట్ల బిజినెస్ సాధ్యమైందని ట్రెడ్ వర్గాల నుంచి సమాచారం. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్.. అలాగే నాన్ థియేట్రికల్ (ఓటీటీ, డిజిటిల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, హిందీ డబ్బింగ్ రైట్స్) కలుపుకొని పుష్ప బిజినెస్ 250 కోట్ల వరకు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పినట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ తగ్గేదేలె అనిపిస్తుంది. -
నన్ను నడిపిస్తున్నది ఆ రెండే!
‘‘పుష్పకవిమానం’ సినిమాకు నిర్మాతను నేను. ఈ సినిమాపై కొందరి కెరీర్స్ ఆధారపడి ఉన్నాయి. ఒక్కోసారి నిర్మాణం అవసరమా? అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఒక్కొక్కరూ తమకు దక్కిన అవకాశాల గురించి మాట్లాడుతుంటే.. ఇలాంటి ఎమోషన్‌తోనే కదా మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందని గుర్తొచ్చి, కష్టమైనా చేయాలనిపిస్తుంది. నన్ను రెండే నడిపిస్తున్నాయి. అనుకున్నది సాధించగలనన్న నా ఆత్మవిశ్వాసం. రెండోది నా ఓవర్ కాన్ఫిడెన్స్. అది మీ (అభిమానులు, ప్రేక్షకులు) మీద ఉన్న కాన్ఫిడెన్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా దామోదర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధనరావు, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘సృజన్ (చిత్రదర్శకుడు దామోదర) మంచి రైటర్, డైరెక్టర్. ఈ సినిమాకు మరో పిల్లర్ ఆనంద్. నటన చింపేశాడు.’’ అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్ర చేశాను. వైవాహిక జీవితం గురించి ఎన్నో ఊహించుకున్న చిట్టిలంక సుందర్ భార్య వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నదే కథ’’ అన్నారు. ‘‘చాలామందిని సపోర్ట్ చేయడానికి విజయ్ ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు విజయ్ మిట్టపల్లి. ‘‘ఆనంద్ నటనతో పాటు ఈ సినిమాలోని కామెడీ, థ్రిల్లింగ్ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అన్నారు దామోదర. నటుడు హర్షవర్థన్, మ్యూజిక్ డైరెక్టర్స్ మార్క్ కె రాబిన్, సిద్దార్థ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్‌ను మహిళలు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను . సమస్యలుంటే ఈ యాప్ ద్వారా పోలీసులను కాంటాక్ట్ కావొచ్చు. పోలీసులు రెస్పాండ్ అవుతారు. కానీ ఎవరికీ ఈ యాప్ అవసరం రాకూడదనే కోరుకుంటున్నాను . -
నటుడిగా రానా బాగా ఎదిగాడు: వెంకటేష్
‘‘ప్రకృతితో మనందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనమందరం బాధ్యతగా ఉండాలి. ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ‘అరణ్య’ సినిమా చూశాను. అందరం గర్వపడేలా ఉంది’’ అన్నారు వెంకటేష్. రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘లీడర్’, ‘ఘాజీ’, ‘బాహుబలి’ వంటి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసిన రానా యాక్టర్‌గా నేర్చుకుంటున్నాడని అనుకున్నాను. కానీ ‘అరణ్య’ సినిమాలోని పాత్రలో తను ఒదిగిపోయిన తీరు చూస్తుంటే.. నటుడిగా బాగా ఎదిగాడనిపించింది. ఇండియన్ స్క్రీన్ పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. జంతువుల హావభావాలను కెమెరాలో షూట్ చేయడం కష్టం. కానీ దర్శకుడు ప్రభు సాల్మన్ అండ్ టీమ్ బాగా తీశారు’’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘రానా ఎప్పుడూ విభిన్నమైన సినిమాలే చేస్తాడు. ఈ సినిమాలో తన యాక్టింగ్ సూపర్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘సాధారణంగా నువ్వు ఎవరు? అని తెలుసుకోవాలని అంటారు. కానీ ఈ సినిమా నాకు నేను ఎందుకు? అని నేర్పించింది. జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో ఈ సినిమా నాకు నేర్పించింది. ప్రభు సాల్మన్ బాగా డైరెక్ట్ చేశాడు. ‘అరణ్య’ సినిమాతో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళతారు’’ అని రానా అన్నారు. ‘‘ఈ సినిమాతో తెలుగుకి పరిచయమవుతున్నందుకు హ్యాపీ. నేను హైదరాబాద్ అల్లుణ్ణి కానున్నాను. త్వరలో గుత్తా జ్వాల (బ్యాడ్మింటన్ ప్లేయర్), నేను పెళ్లి చేసుకోబోతున్నాం’’ అన్నారు విష్ణు విశాల్. ‘‘మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని వీడియో సందేశం పంపారు ప్రభు.‘‘ప్రాణం, మనసుపెట్టి చేస్తే కానీ ఇలాంటి సినిమాలు రావు. రానా తన జీవితాన్ని మర్చిపోయి ఈ సినిమాలోని పాత్రలో జీవించాడు. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు వచ్చేందుకు ‘అరణ్య’ ఓ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. ‘‘నేను హైదరాబాదీ అమ్మాయిని. నా ఫస్ట్ తెలుగు మూవీ ‘అరణ్య’. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు జోయా. -
ప్రపంచం ఎదురుచూస్తోంది
‘‘తెలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. మేమంతా ఎదురు చూస్తున్నాం’ అని లాక్డౌన్ సమయంలో దుబాయ్‌కి చెందిన ఓ నిర్మాత అన్నారు.. అంటే మన తెలుగు సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ప్రతి యాక్టర్‌కీ ఒక పెద్ద హిట్ సినిమా అనేది వస్తుంది. సందీప్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అని హీరో రామ్ అన్నారు. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో డెన్నిస్ జీవన్ మాట్లాడుతూ– ‘‘కథ వినగానే సందీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు’’ అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ఎవరికీ అవకాశాలు రావు. వాటిని మనమే సృష్టించుకోవాలి. ఆ టైమ్‌లో అండగా నిలబడ్డవారే మనకు దేవుళ్లు... గొప్పవాళ్లు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్ 25వ సినిమా మా బ్యానర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. -
ఎ1 ఎక్స్‌ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
'నాంది' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
‘ఎఫ్‌సీయూకే’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
'ఉప్పెన' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
తేజ మా మెగాఫ్యామిలీ మెంబర్
‘‘తేజ చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో నటించాడు. వాడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్. చిరంజీవిగారి ఆశీస్సులు తనకి ఎప్పుడూ ఉంటాయి. ‘ఓ బేబీ’ సినిమాలో తనని చూసి సర్ప్రై జ్ అయ్యాను. ప్రశాంత్ వర్మ గుడ్ విజన్ ఉన్న డైరెక్టర్. తెలుగులో ఫస్ట్ టైమ్ జాంబీ జానర్లో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాంబిరెడ్డి’ ప్రీ–రిలీజ్ వేడుకలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘ ‘శివ’ సినిమా టైమ్‌లో ఆర్జీవీని చూసి గొప్ప డైరెక్టర్ అవుతాడనుకున్నాను. ఇప్పుడు ప్రశాంత్ వర్మను చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయాలనే నా కల. ‘జాంబిరెడ్డి’తో నిజమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా నిర్మాత రాజశేఖర్ వర్మగారు కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. తేజ నాకు మంచి ఫ్రెండ్. ‘అ!’ సినిమా కన్నా ముందే తనతో ఓ చిత్రం చేయాలి... కుదరలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి, లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ కుమార్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. -
‘జాంబీ రెడ్డి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
దేవుడే దిక్కు.. నిత్యపూజలు, ప్రార్థనలు
సాక్షి, చెన్నై: జైలు జీవితం నుంచి ముందుగానే విముక్తి పొందాలని శశికళ చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ బెడిసికొట్టాయి. ససేమిరా అని కర్ణాటక జైళ్లశాఖ చెప్పేసింది. దీంతో మనుషులను నమ్మి ప్రయోజనం లేదు.. దేవుడే దిక్కు అని శశికళ భావించారో ఏమో ఆధ్యాత్మిక జీవనంలో మునిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరిలోని శశికళ విడుదలపై ఆసక్తి నెలకొంది. జయలలిత హయాంలోనే అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ ఆ తరువాత పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచుకున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు అన్న చందంగా సీఎం కావాల్సింది జైలుపక్షిగా మారిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అనుభవిస్తున్న నాలుగేళ్ల జైలు శిక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంతో పూర్తయి విడుదల కావాల్సి ఉంది. చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..) ముందస్తు విడుదలపై ముందుకూ, వెనక్కి... కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి నెలరోజుల జైలు జీవితానికి మూడు సెలవు రోజుల చొప్పున మొత్తం 129 రోజుల సెలవులను బేరీజు వేసుకుని నవంబరులోనే విడుదల చేయాలని శశికళ తరఫున్యాయవాది గతంలో బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు. ఇక అప్పటి నుంచి శశికళ ముందుస్తు విడుదల వ్యవహారం నిత్యం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు విడుదల అడ్డంకిగా ఉండిన రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించి ఆశగా ఎదురుచూడడం ప్రారంభించారు. (శశికళ ఆశలు అడియాశలు..!) నరసింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని జైలు సూపరింటెండెంట్ బదులిచ్చారు. అవినీతినిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయిన కొందరిని సత్ప్రవర్తన పరిధిలో చేర్చిన కర్ణాటక ప్రభుత్వం ముందుగానే విడుదల చేసిన దాఖలాలు ఉన్నందున శశికళను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లింపు, కోర్టు ఆమోదం పూర్తయినందున సత్ప్రవర్తన కింద ముందే విడుదల చేయాలని కోరుతూ జైళ్లశాఖకు ఈనెల 17న శశికళ న్యాయవాదులు మరోసారి వినతిపత్రం సమర్పించారు. శశికళ చెన్నై జైల్లో ఉన్న రోజులు, పెరోల్ రోజులు, సెలవు దినాలు పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. అయితే ఈ వినతిని జైళ్లశాఖ నిరాకరించడంతో శశికళకు మళ్లీ నిరాశే మిగిలింది. చదవండి: (పవన్ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు) దైవ పూజల్లో నిమగ్నం.. ముందస్తు విడుదల వ్యవహారం మూడడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనకలా మారడంతో శశికళ దైవపూజల్లో గడుపుతున్నారు. జైల్లోని తనగదిలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు పెట్టుకుని రోజుకు నాలుగు గంటలపాటు పూజలు చేస్తున్నారు. తలపెట్టిన కార్యాలు నెరవేరాలని పార్థసారథి స్వామికి పదేపదే ప్రార్థనలు చేస్తున్నారు. జయలలితలా ఆంజనేయస్వామిని సైతం ప్రత్యేకంగా ఆరాధించడం ప్రారంభించారు. మాంసాహారం మానివేసి పూర్తిగా శాఖాహారాన్ని అలవాటు చేసుకున్నారు. ఆరునెలలుగా ఎవ్వరికీ ములాఖత్ ఇవ్వలేదు. శశికళ న్యాయవాదులు బెంగళూరులోనే తిష్టవేసి ముందస్తు విడుదలపై కృషి చేస్తున్నారు. -
అప్పుడు మంచి సినిమా బతుకుతుంది
‘‘మూడు నెలల క్రితం ‘ప్రెజర్ కుక్కర్’ చూసి, నచ్చింది కానీ చిన్న కరెక్షన్స్ చేయాలని చెప్పాను. 3 వారాల క్రితం మళ్లీ చూశాను. సుజోయ్, సుశీల్ మంచి సినిమా తీశారనిపించింది. 12 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోని చాలామంది హెల్ప్ చేయడం వల్ల నేనిప్పుడీ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి ఈ డైరెక్టర్లు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు క్రిష్. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా సుజోయ్, సుశీల్ దర్శకత్వంలో సుశీల్ సుభాష్, అప్పిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘బాగున్న సినిమాను చూసినవారు మరో పదిమందికి చూడమని చెబితే మంచి సినిమా బతుకుతుంది. ఈ టీజర్ చూసినప్పుడు నా ప్రెజర్ కుక్కర్ జర్నీ గుర్తుకు వచ్చింది’’ అన్నారు. ‘‘డైరెక్టర్ క్రిష్ మాకు ఎంతో సహాయం చేశారు. భవిష్యత్‌లో కొత్తవారికి మేం కూడా ఇలానే చేయాలని చెప్పారు. ఆ మాట గుర్తుపెట్టుకుంటాం. తరుణ్ భాస్కర్, ‘మధుర’ శ్రీధర్‌కు థ్యాంక్స్’’ అన్నారు దర్శకులు. ‘‘అమెరికా వెళ్లిన చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. నువ్వు అమెరికాకు వెళ్లకపోతే ఎందుకూ పనికిరావని తోమేస్తున్న తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ కనువిప్పు’’ అన్నారు నటుడు తనికెళ్ల భరణి. నటి సంగీత, హీరోలు సాయి రోనక్, విశ్వక్ సేన్, నిర్మాతలు రాజ్ కుందుకూరి, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ తదితరులు మాట్లాడారు. -
ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను
‘‘మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీద చెయ్యేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో ‘అశ్వథ్థామ’ సినిమాలో హీరో అదే చేస్తాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా కుటుంబమే’’ అన్నారు నాగశౌర్య. ఆయన కథ అందించి, హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్ కథానాయిక. రమణ తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘ఇదో నిజాయితీ గల కథ. నా స్నేహితుడి చెల్లికి జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. కథ రాస్తున్నాను అన్నప్పుడు అమ్మానాన్న ఎంతో సపోర్ట్ చేశారు. ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. నేను ఈ కథ రాయడానికి సమాజంలో చాలా సంఘటనలు ప్రేరేపించాయి’’ అన్నారు. ‘‘ఈ కథ అందర్నీ ఆలోచింపజేస్తుంది’’ అన్నారు మెహరీన్. ‘‘సహజంగా నటించే నటుల్లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి’’ అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ‘‘ఈ సినిమాలో కొత్త నాగశౌర్యని చూస్తారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు రమణ తేజ.‘‘ మంచి కథా బలంతో వస్తున్న చిత్రం అశ్వథ్థామ. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి. ‘‘సినిమాలో నాలుగు పాటలున్నాయి. అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. -
న్యూఇయర్ గిఫ్ట్
‘‘సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా..’ పాట ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. ఈ సూపర్ హిట్ పాట టీజర్‌ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా డిసెంబర్ 31 సాయంత్రం రిలీజ్ చేస్తున్నాం’’ అని ‘అల వైకుంఠపురములో’ చిత్రబృందం పేర్కొంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మాతలు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ (మ్యూజికల్ కన్సెర్ట్) ఈవెంట్ జనవరి 6న హైదరాబాద్‌లో జరగనుంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 12న విడుదలకానుంది. -
‘బ్యూటిపుల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
ఆ స్ఫూర్తితోనే రూలర్ చేశాం
‘‘రైతుల మీద సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఓ సందర్భంలో చాలామందిని కలిశాను కూడా. కానీ కుదర్లేదు. ‘రూలర్’ సినిమాతో ఆ కోరిక కొంత తీరింది’’ అన్నారు బాలకృష్ణ. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. ఇందులో వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్లో సినిమా ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి శీను, నందమూరి రామకృష్ణ విడుదల చేశారు. బాల కృష్ణ మాట్లాడుతూ–‘‘నేనూ, కల్యాణ్, కేఎస్ రవికుమార్ కలిసి చేసిన ‘జై సింహా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే ‘రూలర్’ సినిమా తీశాం. మొదట్లో ఈ సినిమాకు మరో కథ అనుకున్నాం. కుదర్లేదు. ఆ సమయంలో నేను పరుచూరి మురళిగారికి ఫోన్ చేశాను. ఆయన దగ్గర ఉన్న ఓ కథను వినిపించారు. ఆ కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించు కున్నాను. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, కొత్తదనం అందించాలనే ప్రయత్నాలు చేస్తుంటాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. కళామతల్లికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘‘రూలర్’ అనే పేరు బాలకృష్ణగారికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తమిళంలో రవికుమార్‌గారు చేసిన సినిమాలు మాలాంటి దర్శకులకు రిఫరెన్స్లా ఉపయోగపడతాయి. సి.కల్యాణ్‌గారికి అభినందనలు’’అన్నారు బోయపాటి శీను. ‘‘ఇండస్ట్రీలో నాకు బాగా సపోర్ట్ అందించిన వ్యక్తి బాలకృష్ణగారు. కేఎస్ రవికుమార్ సూపర్ డైరెక్టర్. సి.కల్యాణ్‌గారితో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఇంతమంది నాకు కావాల్సిన వ్యక్తులు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘జైసింహా’ తర్వాత మా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ఇది. టీమ్ అందరూ ఎంతగానో కష్టపడ్డారు’’ అన్నారు కేఎస్ రవికుమార్. ‘‘బాలకృష్ణగారు ఈజ్ గ్రేట్’ అనేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు సి. కల్యాణ్. కథానాయికలు సోనాల్ చౌహాన్, వేదిక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, అంబికా కృష్ణ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది
ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కానూరి శ్రీనివాస్ నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్ కొట్టి సక్సెస్ఫుల్ దర్శకుడిగా వెలుగొందుతాననే నమ్మకం ఉంది. నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. నా పక్కనే నిలబడి నన్ను నడిపించారు నిర్మాత కానూరి శ్రీనివాస్. బతికున్నంత కాలం అతన్ని వదలను. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అనుష్క, కాజల్, రెజీనా లాంటి హీరోయిన్స్ కథ విన్నా డేట్స్ కుదరక చేయలేదు. తెలుగందం ఈషారెబ్బాతో పని చేశామని గర్వంగా చెబుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డిగారు అద్భుతమైన సినిమా చేశారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్ కానూరి. ‘‘కథ విన్న తర్వాత ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. అద్భుతమైన కథ. మంచి పాత్రలను డిజైన్ చేశారు శ్రీనివాస్‌రెడ్డిగారు’’ అన్నారు సత్యదేవ్. ‘‘తెలుగు అమ్మాయిలకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావాలంటే అదృష్టం కావాలి. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. శ్రీనివాస్ రెడ్డిలాంటి దర్శకులు ఉండబట్టే మేం ఇండస్ట్రీలో ఉన్నాం. శ్రీనివాసరెడ్డిగారు చాలా కూల్. సత్యదేవ్ మన తెలుగు విక్కీకౌశల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మలుపుల సరోవరం
విశాల్ వున్న, ప్రియాంకా శర్మ, శ్రీలత, తనికెళ్ల భరణి, ‘ఛత్రపతి’ శేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సరోవరం’. సురేష్ యడవల్లి దర్శకత్వంలో శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సురేష్ యడవల్లి మాట్లాడుతూ– ‘‘సరోవరం’ అనే గ్రామంలో జరిగిన కథ ఇది. భావోద్వేగంతో నడిచే ఈ కథలోని మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్.శ్రీలత. ‘‘మాస్కు కావాల్సిన అంశాలతో పాటు యూత్‌ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి’’ అన్నారు నటులు ‘జబర్దస్త్’ నవీన్, రాము. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు. -
నేనీ స్థాయిలో ఉండటానికి కారణం నా తమ్ముళ్లే
అశ్విన్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘రాజుగారి గది 3’. ఓక్ ఎంటర్టైన్మెంట్స్పై ఓంకార్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో ప్రముఖ కెమెరామన్ ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుంది. సాంకేతిక అభివృద్ధి వల్ల నటీనటుల్లో బద్ధకం పెరిగిందని నేను చెప్పినట్లు ఓ దిన పత్రికలో వచ్చింది. నా ఉద్దేశం అది కాదు. సాంకేతికత పెరగడం వల్ల సాంకేతిక నిపుణుల పని కాస్త తేలికైందని నా అభిప్రాయం’ అన్నారు. ‘‘యాంకర్ నుంచి నేనీ స్థాయికి ఎదగడానికి కారణం నా తమ్ముళ్లు అశ్విన్, కల్యాణ్. చదువును కూడా మర్చిపోయి నా కెరీర్ కోసం కష్టపడ్డారు. నాకు జన్మనిచ్చింది మా అమ్మానాన్నలు అయితే.. నా సినీ కెరీర్‌కు జన్మనిచ్చింది నా తమ్ముళ్లే. ఈ సినిమాతో అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. కల్యాణ్ నిర్మాతగా త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వరంగల్ శ్రీనుగారి నమ్మకం నిజం అవుతుందని నమ్ముతున్నాను. మా నాన్నగారు గత ఏడాది చనిపోయారు. అందుకే నేను ఎక్కువగా తెల్ల దుస్తుల్లో కనిపిస్తున్నా. ఈ సినిమాతో అశ్విన్‌ను ప్రేక్షకులు హీరోగా అంగీకరించిన తర్వాత తిరిగి మామూలు దుస్తులు వేసుకుంటాను’’ అన్నారు ఓంకార్. ‘‘జీనియస్’ నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాను. హీరోగా ఈ శుక్రవారం నా డ్రీమ్‌ను చూడబోతున్నాను’’ అన్నారు అశ్విన్. ‘‘ఇదివరకు ‘హుషారు’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘గద్దలకొండ గణేష్’ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ విజయాల వరుసలో ఈ చిత్రం కూడా చేరుతుంది’’ అన్నారు వరంగల్ శ్రీను. -
అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది
‘‘యంగ్ హీరోలందరూ కలిసి డబ్బులు పెట్టి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే సినిమా చేశారు. నేనూ అటువంటి మనస్తత్వం ఉన్న హీరోనే. ఇప్పటికీ చెబుతుంటా... నాకు కథ నచ్చితే రెమ్యునరేషన్ ఇవ్వొద్దు అని. కొత్త దర్శకులు, నిర్మాతలకు డబ్బులొస్తేనే ఇవ్వమని చెబుతా. డబ్బులు వస్తేనే తీసుకోవాలి అనే మనస్తత్వం నాది. అందరూ ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది’’ అని నటుడు రాజశేఖర్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్‌రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘1990లలో కశ్మీర్లో పండిట్లకు ఏం జరిగిందో అందరికీ తెలియాలని చేసిన ప్రయత్నం ఇది. ఆది ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం సాయికుమార్‌గారు.. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కశ్మీర్ పండిట్ల ఎమోషన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా తీయలేదు. మాకు తెలిసిన విషయాలను పదిమందికి చెబుదామని తీశాం’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘నాకు ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఆది మా అబ్బాయిలాంటివాడు’’ అన్నారు జీవితారాజశేఖర్. ‘‘ఈ ఫంక్షన్‌కి నేను ఆది కుటుంబ సభ్యుడిగా వచ్చాను.’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘‘ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రమిది’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి. నిర్మాతలు కేశవ్, ప్రతిభ, హీరో అడివి శేష్, నటులు కృష్ణుడు, మనోజ్ నందం, పార్వతీశం, కార్తీక్ రాజు, అనీష్ కురువిళ్ల, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు. కెమెరా: జైపాల్‌రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్). -
నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజు : చిరంజీవి
నా మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22నే విడుదలైందని..అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కల్గిందో.. మళ్లీ 41ఏళ్ల తరువాత అప్పటి ఫీలింగే మళ్లీ కలుగుతోంది. దానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. దాదాపు పుష్కర కాలం నుంచి ఈ కథ నా మదిలో మెలుగుతూ ఉండేదంటూ నేటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి మాట్లాడారు. పూర్తి ప్రసంగం కోసం కింది వీడియోను చూడండి. పవన్‌కళ్యాణ్ మట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్‌కు నన్ను పిలిచింనందు అదృష్టంగా భావిస్తున్నాను.. ఆయనకు మీలా నేనూ ఓ అభిమానినే. ఆ విధంగానే నేను ఇక్కడకు వచ్చాను. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి. మీ అభిమానుం నాకు దక్కిందటే.. ఆయన నేర్పిన పాఠాలే కారణం. ఆయన అప్పుడు ఇచ్చిన ధైర్యం.. నన్ను ఇప్పుడు మీ ముందు నిలబెట్టింది’అంటూ మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమా వేడుక జరుగుతుందంటే.. పరుచూరి బ్రదర్స్ గారికిథ్యాంక్స్ చెప్పాలి. బ్రిటీష్ వారిపై మొట్టమొదటగా పోరాడింది మన తెలుగు వాడని అందరికీ తెలిసేలా మా హీరో రామ్ చరణ్ చేశాడు. ఇది మీ డాడీకే గిఫ్ట్ కాదు.. మొత్తం తెలుగు వారికి అందిస్తున్న గిఫ్ట్’అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం.. వర్షం ఇంత కురుస్తున్నా మీరు ఇలా ఉంటూ.. మెగాస్టార్‌పై మీకున్నా అభిమానాన్ని చూపిస్తున్నారు.. సమయం లేనందున.. అందరి గురించి చెప్పలేకపోతున్నాను. ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెబుతాను. పవర్స్టార్కూడా తెలియనిది చెబుతాను. నేను సైరాను చూశాను.. నేను మొట్టమొదటి ప్రేక్షకుడిని. సినిమా చూసి కింద పడిపోయాను.. ఈ మూవీ సూపర్‌హిట్’ అని అన్నారు. . చిత్ర నిర్మాత, హీరో రాంచరణ్ మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సినిమాకు పనిచేసిన అన్ని శాఖల వారికి థ్యాంక్యూ. షూటింగ్ చేసిన ప్రతి రోజు వారందరికీ థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాను. వారంతా సహకరించడం వల్లే ఈ సినిమా పూర్తి చేయగలిగాం. ఎక్కువసేపు నాన్నగారిని, బాబాయ్‌ని వెయిట్ చేయించి మాట్లాడలేను. అందుకే ముగించేస్తున్నాను. అంతేకాకుండా వర్షం వచ్చేలా కూడా ఉంది కాబట్టి మరోసారి అందరికి ధన్యవాదాలు చెబుతూ ముగించేస్తున్నాను’ అని తెలిపాడు. హైదరాబాద్‌లో సముద్రం లేదని ఎవరు చెప్పారు..? తరలిరాదా తనే వసంతం తనదరికి రాని వనాల కోసం అంటూ రుద్రవీణ పాట పాడాడు మాటల రచయిత సాయి మాధవ్‌బుర్రా. చిరంజీవి పిలిస్తే.. వసంతాలు కాదు సముద్రాలే తరలివస్తాయన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. మా అమ్మమ్మకు 80లో ఉన్న హీరోలు ఎవరూ తెలీదు. ఒక్క చిరంజీవి తప్పా.. ఆయన పాటను వింటూనే ఉంటుంది. నేను సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు చిరంజీవికి మాటలు రాయమని మా అమ్మమ్మ అనేది. ఆకాశాన్ని అందుకోమని అంటే ఎలా అది కుదరని పని అంటూ చెప్పేవాడ్ని కానీ ఆయన సినిమాకు ఇప్పుడు మాటలు రాశాను. ఆయనకు ఒక్క మాట రాసినా చాలు అనుకునే వాడిని.. ఖైదీ నెం.150కు డైలాగ్స్రాయమని పిలిచారు. ఆయన డైలాగ్చెబితే.. ఆయన మాత్రమే చెప్పేలా ఉండాలి.. అందుకే ఓ డైలాగ్రాశానని.. పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది అనే మాటలు రాశాను. అది ఆయనకు తప్పా ఇంకెవరికి సెట్ కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ టెక్నీషియన్‌ను రామ్ చరణ్ బాగా చూసుకున్నాడు. అతనొక గొప్ప హీరో మాత్రమే కాదు.. గొప్ప ప్రొడ్యూసర్. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయంటే.. నా ఒక్కడి కృషి కాదు.. అది అందరి సమష్టి కృషి. ఈ సినిమా ద్వారా సురేందర్ రెడ్డి ఓ మంచి స్నేహితుడయ్యాడు. ఈ సినిమా తమకు పదేళ్ల కల అని.. కల ఎపపుడు చెదిరపోదని పరుచూరి వెంటేశ్వర్రావు అన్నారు. ఈ కథను చిరంజీవి కోసమే ఎంతోమంది పెద్దొళ్లు వదిలేశారని అనిపిస్తుంది. అందుకే పదేళ్ల తరువాత కూడా చిరు కోసమే ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఆయన ఇప్పుడు కూడా ఆలానే కనిపిస్తున్నాడు. తన తండ్రి కోసం రామ్ చరణ్.. ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాడు. తండ్రిని ఎక్కడో కూర్చోబెట్టాలని ఈ చిత్రాన్ని తీశాడు. సినిమాలోని ఓ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు. తన గురువైన గోసాయి వెంకన్న దగ్గరికి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వెళ్లి.. భార్యాబిడ్డల్నీ వదిలేసి యుద్దానికి వెళ్తున్నా ఆశీర్వందించండి అనే చెప్పే సందర్భంలో వచ్చే ఈ డైలాగ్‌ను స్టేజ్‌పై చెప్పాడు. ‘భార్య కోసం యుద్దం చేస్తే పురాణం అవుతుంది.. భూమి కోసం యుద్దం చేస్తే ఇతిహాసం అవుతుంది.. జాతి కోసం యుద్దం చేస్తే చరిత్ర అవుతుంది’ అంటూ అమితాబ్ చెప్పే అద్భుతమైన డైలాగ్‌ను ఆయన స్టేజ్‌పైనే చెప్పారు. తన తండ్రి అచ్చం నరసింహారెడ్డిలా కనిపించాలని దగ్గరుండి మరీ సుష్మిత క్యాస్టూమ్స్‌ను డిజైన్ చేసిందని కొనియాడారు. ఎవరిని ఎంతగా వాడుకోవాలో.. ఎవరి చేత ఎంతగా నటింపజేయాలో సురేందర్ రెడ్డికి బాగా తెలుసంటూ.. ఈ సినిమా హిట్ కాబోతోన్నందుక ముందుగానే అతని కంగ్రాట్స్ చెప్పారు. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మొదలైంది. ఈ వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభిమానుల మధ్య ‘సైరా’ ప్రీ–రిలీజ్ వేడుక కన్నుల పండవగా జరుగనుంది. రెండు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ వేడుకకు భారీగా హాజరయ్యారు. ముందుగా చిరంజీవి నటించిన హిట్ చిత్రాలలోని పాటలను గాయనీ,గాయకులు ఆలపిస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబరు 2న ‘సైరా’ చిత్రం విడుదల కానుంది. సాయంత్రం 6 గంటల నుంచి సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం -
యంగ్ టైగర్ వర్సెస్ రియల్ టైగర్?
రాజమౌళి సినిమాల్లో హీరో పరిచయ సన్నివేశాలు ఎక్స్ట్రా స్పెషల్‌గా ఉంటాయి. ‘యమదొంగ’ సినిమా అందుకు ఓ ఉదాహరణ. సర్కస్‌లో ‘పులిని మనిషిగా మార్చు.. చూద్దాం’ అని ఓ ప్రేక్షకుడు అడగడంతో మెజీషియన్ అలీ నిజమైన పులిని ఎన్టీఆర్‌గా మార్చుతాడు. అది ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్. ఈ సీన్‌కి విపరీతమైన విజిల్సూ, క్లాప్స్ పడ్డాయి. ఇప్పుడు మరోసారి రియల్ టైగర్ని, యంగ్ టైగర్ని ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారట దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మాత. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన పరిచయ సన్నివేశాలను బల్గేరియాలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సన్నివేశాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియల్ టైగర్‌తో నటిస్తున్నారని తెలిసింది. ఈ సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ హైలెట్‌గా నిలుస్తుందట. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జూలైలో రిలీజ్ కానుంది. -
నా మనసుకు నచ్చిన చిత్రమిది
జె.ఎస్.కె ఫిలింస్ కార్పొరేషన్ సమర్పణలో అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తారామణి’. రామ్ దర్శకుడు. డి.వి.వెంకటేశ్, ఉదయ్ హర్ష వడ్డేల్ల ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్, ఉదయ్ ఎంతో అభిరుచి ఉన్న నిర్మాతలు. ట్రైలర్ చూశాక ఇది రియలిస్టిక్ ఫిల్మ్ అని అర్థమైంది. మనం బయటకు చెప్పుకోలేని ఎన్నో ఎమోషన్స్‌ని ఇప్పటి సినిమాలు చెబుతున్నాయి. ఇది అలాంటి సినిమానే’’ అన్నారు. డీవీ వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘తమిళ్లో పెద్ద హిటై్టన చిత్రమిది. తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదర్లేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎక్కడా రాజీపడకుండా అనువాదం చేశాం’’ అన్నారు. మరో నిర్మాత ఉదయ్ మాట్లాడుతూ– ‘‘సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా ఉంటుంది. టెక్నాలజీ మాయలో పడి యువత ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? అనేది ప్రధానాంశం’’ అన్నారు. హీరోయిన్ ఆండ్రియా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం తమిళ్లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది. నా మనసుకు నచ్చిన చిత్రమిది. తెలుగు ట్రైలర్ చూశాక చాలా ఎగ్జయిట్ అయ్యాను. తెలుగులో ఈ సినిమా విడుదల అవటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డి.ఎస్. రావు, పద్మిని తదితరులు పాల్గొన్నారు. -
ఓ విద్యార్థి జీవితం
హైస్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుంది? అనే కథతో రూపొందిన చిత్రం ‘బోయ్’. లక్ష్ , సాహితి జంటగా అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘తొలి ప్రయత్నంగా ఓ కమర్షియల్ సినిమానో, ప్రేమకథో చేయవచ్చు. కానీ, ‘బోయ్’ లాంటి సినిమా చేయడం గొప్ప విషయం. నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ‘బోయ్’ కూడా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో హీరో పాత్ర కోసం ఇండియా మొత్తం వెతికాను. మా కెమెరామేన్ ఆష్కర్ ల„Š ని చూపించడంతో వెంటనే ఓకే చేశా. తను ఇండియాలోనే నంబర్ వన్ హీరో అవుతాడు’’ అన్నారు అమర్ విశ్వరాజ్. ‘‘ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు లక్ష్ . ఈ చిత్రానికి సంగీతం: ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్.జె, సహ నిర్మాతలు: శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి. -
వారికి శర్వానంద్ ఆదర్శం
‘‘ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా శర్వానంద్ ఈ స్థాయిలో ఉండటం నిజంగా గొప్ప విషయం. ఎంతోమంది యువ హీరోలకు శర్వానంద్ ఆదర్శం’’ అని హీరో నితిన్ అన్నారు. శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియ దర్శన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రి–రిలీజ్ వేడుకలో అతి«థిగా పాల్గొన్న నితిన్ మాట్లాడుతూ– ‘‘ ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో 45 ఏళ్ల వ్యక్తిగా ఎలా కనిపిస్తాడా? అనుకున్నా. కానీ పోస్టర్స్, ప్రోమోస్ చూస్తుంటే కరెక్ట్‌గా సెట్ అయ్యాడనిపిస్తోంది. డైరెక్టర్ సు«ధీర్ వర్మ మంచి టెక్నీషియన్’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. దర్శకుడు సుధీర్ వర్మ టేకింగ్ సినిమాకు అదనపు ఆకర్షణ. నేను హ్యాపీగా ఉన్నానని వంశీ చెప్పడం ఇంకా హ్యాపీ. ‘రణరంగం’ చూసిన యూనిట్ అంతా సినిమా బాగుందంటున్నారు. ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయం చెబుతారనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్. ‘‘ఇందులో హీరో శర్వానంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. శర్వా బాగా నటించారు’’ అన్నారు సుధీర్‌వర్మ. ‘‘శర్వానంద్ దగ్గర కొత్త విషయాలు నేర్చుకున్నా. అనుకున్న కథను స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్ చేశారు సుధీర్వర్మగారు. నిర్మాతల సహకారం మరవ లేనిది’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్. -
నా ఫిట్నెస్ గురువు తనే
‘‘మిస్టర్ కేకే’ ట్రైలర్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ చిత్రంలో చాలా వైవిధ్యమైన పాత్ర చేశాను. మా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్. కమల్‌గారికి మరీ మరీ థ్యాంక్స్. తెలుగులో చాలా బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు’’ అని విక్రమ్ అన్నారు. అక్షరాహాసన్, అభిహాసన్ కీలక పాత్రల్లో విక్రమ్ లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘కడరమ్ కొండాన్’. రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ ‘మిస్టర్ కేకే’ పేరుతో శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నటించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా ఫ్రెండ్ సెల్వ హార్డ్ వర్కర్. నా ఫిట్నెస్ గురువు కూడా ఆయనే’’ అన్నారు. ‘‘కమల్‌హాసన్‌గారు ఇండస్ట్రీకి ఒక డిక్షనరీ లాంటివారు. ఆయన సొంత బ్యానర్లో నిర్మించిన చిత్రంలో మేం భాగమైనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. విక్రమ్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎనర్జీలో కొంత నాకు ఉన్నా ఓకే. మళ్లీ ఈ సినిమా సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అన్నారు టి. అంజయ్య. ‘‘నా రెండవ సినిమానే రాజ్‌కమల్ ప్రొడక్షన్లో చేయడం నా అదృష్టం. రవీంద్రన్‌గారు ఈ ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. తర్వాత విక్రమ్‌గారు యాడ్ అయ్యాక ఇదొక పెద్ద సినిమా అయిపోయింది. రామజోగయ్య శాస్త్రిగారు చాలా మంచి పాటలు అందించారు’’ అన్నారు దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ. ‘‘ఇందులో గర్భవతి పాత్ర చేశాను. ఈ పాత్ర చేయలేననుకున్నా. కానీ రాజేష్‌గారు, మా నాన్నగారు చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు అక్షరాహాసన్. రామజోగయ్య శాస్త్రి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.