
వైదిక, చైతన్య కృష్ణ, జయకృష్ణ, వంశీకృష్ణ
‘‘మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ‘బ్రీత్’. వంశీకృష్ణగారు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దారు.. భవిష్యత్‌లో మేము మళ్లీ కలసి పనిచేస్తాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో చైతన్య కృష్ణ అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా జంటగా నటించిన చిత్రం ‘బ్రీత్’. బసవతారకరామ క్రియేషన్స్ పై నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ–‘‘బ్రీత్’ మంచి ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘చైతన్య కృష్ణ కోసం అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన, ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని అద్భుతమైన కథని రెడీ చేశాను. ‘బ్రీత్’ సక్సెస్ తర్వాత అది కూడా చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. ఈ వేడుకలో వైదిక సెంజలియా, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment