vamshi krishna
-
వంశీ చేతికే పెద్దపల్లి టికెట్..
కరీంనగర్: తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో పోటీచేసేందుకు ఐదుగురు పేర్లతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం గురువారం ప్రకటించింది. ఇందులో పెద్దపల్లి(ఎస్సీ) నుంచి మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆమోదముద్ర వేసింది. కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రవీణ్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. వెలిశాల రాజేందర్రావు సహా మరికొందరు నేతలు కరీంనగర్ టికెకోసం భారీగా ప్రయత్నాలు చేస్తుండడంతో మరోజాబితాలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తాత, తండ్రి పోటీచేసిన స్థానం నుంచి.. లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన జోష్‌తో పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని చూస్తోంది. గెలుపు గుర్రాలను బరిలో నిలిపేలా వ్యూహా రచన చేస్తోంది. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి గెలిచిన గడ్డం వెంకటస్వామి, మాజీ ఎంపీ వివేక్ కుటుంబానికి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారినప్పుడు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి గడ్డం వంశీకి టికెట్ కేటాయించేట్లు చేసి మాట నిలుపుకున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలకు బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బండిసంజయ్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్లు ఖరారు చేశాయి. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అభ్యర్థి తేలితే ఉమ్మడి జిల్లాలోని రాజకీయం మరింత వేడెక్కనుంది. బయోడేటా.. పేరు: గడ్డం వంశీకృష్ణ భార్య: రోష్ని, ఇద్దరు పిల్లలు చదువు: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ (యూఎస్‌లోని పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి 2010లో) వృత్తి: విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీకృష్ణ -
ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు
-
అమెరికా డ్రీమ్స్.. ఇదీ రియాల్టీ
అమెరికాలో మాస్టర్స్ చేసే ఓ ఇండియన్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అతడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన షార్ట్ ఫిలిం ‘మాస్టర్స్’. వంశీకృష్ణ అచ్చుత హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ లఘు చిత్రానికి యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘చాలా మంది ఎన్నారైలు నా షార్ట్ ఫిలింపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెరికానే కాదు..కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఫోన్ చేసి ఫిలిం బాగుందని మెచ్చుకుంటున్నారు. నేను కూడా మాస్టర్స్ కోసం.. మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు తమని తాము సినిమాలో చూసుకుంటున్నట్లుగా ఉందని చెప్పడం ఆనందంగా ఉంది. నేను కూడా మాస్టర్స్ కోసమే 21 ఏళ్ల వయసులో యూఎస్ వచ్చాను. నాతో పాటు నా స్నేహితుల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలతోనే ఈ లఘు చిత్రాన్ని తీర్చిదిద్దాను. గన్ కల్చర్‌ని ఇందులో కవర్ చేశాం. చదువు కోసమో, ఉద్యోగం కోసమో వచ్చిన విదేశీయులను ఎందుకు చంపుతున్నారు? విదేశాల్లో ఒక అమ్మాయి చనిపోతే బాధపడకపోగా, ఇండియాను వదిలి ఎందుకు వెళ్లాలి? డబ్బు కోసం తెల్లోడి బూట్లు నాకాలా? అంటూ వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. రిచ్ లైఫ్ కోరుకోవడం తప్పా? ఓ మధ్య తరగతికి చెందిన వాడు రిచ్ లైఫ్‌ని కోరుకోవడం తప్పా? తన పేరెంట్స్‌ని కార్లలో తిప్పాలని కోరుకోవడం తప్పా? ఒక ఇండియన్ స్టూడెంట్ అమెరికాలో చనిపోతే వాళ్ల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇవేమీ ఆలోచించరు, నోటికొచ్చింది మాట్లాడుతారు. ఎంతోమంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో పిట్టల్లా రాలిపోతున్నా ఇప్పటివకు ఒక్కటంటే ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయలేదు. ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి? అని ఆరా తీసి వాటిపై అవగాహన కల్పిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడుకోగలుగుతాం' అని ఎమోషనల్ అయ్యాడు వంశీకృష్ణ. -
మాస్టర్స్.. NRI విద్యార్థుల్లో మార్పు కోసం
-
డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన జోకర్..వంశీ కృష్ణని జనసేన వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు
-
వంశీ వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచారు : ఎంపీ ఎంవీవీ
-
జనసేన నేత వంశీకృష్ణ, టీడీపీ నేత వెలగపూడిపై ఎంపీ ఎంవీవీ ఆగ్రహం
-
చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్
సాక్షి, విశాఖపట్నం: రంగాను చంపిన వ్యక్తి వెలగపూడి అని వైఎస్సార్సీపీ ఎంవీవీ సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎంపీ ఎంవీవీ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘రంగాను చంపి పారిపోయి వైజాగ్ వచ్చిన వ్యక్తి వెలగపూడి. కాపుల ఓట్ల కోసం పవన్ ఫొటో పెట్టుకుని తిరుగుతున్నారు. రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయలపెడతాను. ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి. వంశీ చెబితే ఓడించేస్తారు అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారు. వంశీ మీద చెక్ బౌన్స్ కేసులు ఎన్నో ఉన్నాయి. వంశీ ఎంతో మంది డబ్బులు ఎగ్గొట్టారు. సీటు లేక వంశీ ఫస్ట్రేషన్‌కు గురవుతున్నారు. మేయర్ పదవి స్థానికంగా ఉన్న యాదవులకు ఇస్తే తప్పేంది. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన వంశీ. పవన్ కల్యాణ్‌ను వంశీ ఎన్నో సార్లు తిట్టారు. వంశీ చిత్త కార్తి కుక్కతో సమానం. బాబు మోహన్, బ్రహ్మానందంలా కామెడీ యాక్టర్ వంశీ. అతడిలాగా నేను చిల్లర వ్యక్తిని కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
Jamuna: కళాభారతికి నీరాజనం
'వంశీ ఇంటర్నేషనల్ అండ్ శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు నటించిన సినిమాలలో ఆమె నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో ‘‘మీరజాలగలడా నా యానతి’’ కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా నిర్వహించబడింది. భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, ఖతార్, యుగాండా, కెనడా, అమెరికా దేశాల నుండి 35 మంది ప్రఖ్యాత రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని జమున నటించిన చిత్రరాజాల నుండి 35 ఆణిముత్యాలు అయిన సినిమాలను ఎంపిక చేసుకొని, వాటిలో ఆమె కనబరిచిన నటనా ప్రావీణ్యం, వివిధ రకాల పాత్రలలో ఆమె ఇమిడిపోయిన తీరు గురించి విశ్లేషిస్తూ అద్భుతమైన ప్రసంగాలను చేశారు. ముఖ్యఅతిథిగా చెన్నై నుండి ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర పాల్గొని జమున నటనా ప్రభావ విశేషాలను గూర్చి, నిజ జీవితంలో ఆమె కనబరిచిన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రసంగించారు. జమున కుమారులు, అమెరికా వాస్తవ్యులైన డా. వంశీ కృష్ణ ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా పాల్గొని తన మాతృమూర్తి చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి, అందరి ప్రసంగాలను విని ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వంశీ -సింగపూర్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విదేశాల వారితోపాటు హైదరాబాద్ నుండి ప్రముఖ రచయితలైన ఆచార్య టీ గౌరీ శంకర్, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, డాక్టర్ కె వి కృష్ణకుమారి, డాక్టర్ తిరునగిరి దేవకీదేవి లు ప్రసంగవ్యాసాలను అందించడం విశేషం. "తాము కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపరచగానే పది దేశాల నుంచి స్పందించి 35మంది రచయితలు ముందుకొచ్చి విశ్లేషణ వ్యాసాలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని, త్వరలో ఈ వ్యాసాలు అన్నింటితో వంశీ ప్రచురణగా, పుస్తకాన్ని ప్రచురిస్తామని" కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. రచయిత్రి రాధిక మంగిపుడి సభా నిర్వహణ గావించగా అలనాటి మేటి చిత్రాలైన మిస్సమ్మ, శ్రీకృష్ణతులాభారం, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, యశోదా కృష్ణ, మంగమ్మ శపథం, మూగమనసులు, చిరంజీవులు, బంగారు తల్లి.. వంటి చిత్రాలలో జమున నటించిన వైవిధ్యభరితమైన పాత్రల ఔచిత్యాన్ని చక్కగా రచయితలు అభివర్ణించారు. సినిమాలతో పాటు జమున గారితో వీరందరికీ ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గూర్చి కూడా తలచుకుంటూ ఆమెకు నివాళులు అర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణా సహకారం అందించారు. ఇవి చదవండి: అను వైద్యనాథన్: సాహసాల నుంచి నవ్వుల వరకు -
మళ్లీ కలసి పనిచేస్తాం
‘‘మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ‘బ్రీత్’. వంశీకృష్ణగారు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దారు.. భవిష్యత్‌లో మేము మళ్లీ కలసి పనిచేస్తాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో చైతన్య కృష్ణ అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా జంటగా నటించిన చిత్రం ‘బ్రీత్’. బసవతారకరామ క్రియేషన్స్ పై నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ–‘‘బ్రీత్’ మంచి ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘చైతన్య కృష్ణ కోసం అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన, ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని అద్భుతమైన కథని రెడీ చేశాను. ‘బ్రీత్’ సక్సెస్ తర్వాత అది కూడా చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. ఈ వేడుకలో వైదిక సెంజలియా, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఆన్లైన్ యాప్! ఫొటో మార్ఫింగ్ బెదిరింపులతో.. తీవ్ర విషాదం!!
కరీంనగర్: ఏడాదిక్రితం సింగరేణిలో బదిలీపిల్లర్ (ఆర్జీ–ఏఎల్పీ)గా ఉద్యోగం పొంది భవిష్యత్తును ఆనందంగా గడపాల్సిన పల్లె వంశీకృష్ణ(26) ప్రాణాలను ఆన్లైన్ యాప్ బలిగొంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన వంశీకృష్ణ తండ్రి రాయమల్లు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించగా.. ఆ ఉద్యోగాన్ని ఏడాదిక్రితం పొందిన వంశీ మకాం పెద్దపల్లికి మార్చాడు. పట్టణంలోని చీకురాయి రోడ్డులో నివాసముంటున్న సమయంలో గుర్తుతెలియని ఆన్లైన్ యాప్ నుంచి కొంత రుణం పొందాడు. ఆ తర్వాత తిరిగి చెల్లించినా ఇంకా బాకీ ఉన్నావంటూ నిర్వాహకులు వంశీకృష్ణపై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత తన ఫొటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో బంధు, మిత్రులందరికీ షేర్ చేసి పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారని కుటుంబీకులు ఆరోపించారు. ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన వంశీకృష్ణ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సైబర్‌నేరంగా కేసు నమోదు చేసి సైబర్‌క్రైం పోలీసులకు బదిలీ చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ చీటర్ వంశీకృష్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా.. సోమవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ఉద్యోగాల పేరిట వంశీకృష్ణ దాదాపు రూ. 5కోట్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో 500 మంది యువతులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఆన్లైన్లో వితంతువులు, విడాకులు పొందిన మహిళలనే వంశీకృష్ణ టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవాడు. అయితే, వంశీకృష్ణ.. స్కీంల పేరుతో అటు ప్రజా ప్రతినిధులను సైతం మోసం చేశాడనే ఆరోపణలున్నాయి. -
కబ్జాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతల దుష్ప్రచారం
విశాఖపట్నం: విశాఖ అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ దుయ్యబట్టారు. విశాఖలో ప్రభుత్వ భూములను కబ్జా చేసింది టీడీపీ నేతలే అని ఆరోపించారు. కబ్జా చేసిన భూములను వెనక్కి తీసుకుంటే విమర్శలు చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే కబ్జా చేయలేదని టీడీపీ నేతలు నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్ కేకే రాజు మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని ప్రశంసించారు. కబ్జాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతల దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఘాటుగా స్పందించారు. టీడీపీ అయిదేళ్ల పాలనలో విశాఖ భూములు దోచుకున్నారని విరుచుకుపడ్డారు. భీమిలి.. గాజువాక.. పెందుర్తి.. అనకాపల్లి పరిసరాల్లో వందల ఎకరాలు అన్యాక్రాంతం చేశారని పేర్కొన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీను అరవై ఎకరాలు కబ్జా నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం దొంగ దీక్షలు చేసే పల్లా శ్రీను స్టీల్ ప్లాంట్ భూములు కబ్జా చేసి కార్మికులను మోసగించారని దుయ్యబట్టారు. తుంగ్లాం....కాపు జగ్గారావు పేటలో పల్లా శ్రీను భూ దందా అందరికీ తెలిసిందేనని అన్నారు. టీడీపీ నాయకుల కబ్జాలో ఉన్న అసైన్డ్ భూములు అభివృద్ధి కోసం తీసుకుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేకే రాజు విమర్శించారు. చదవండి: ‘జగనన్న పచ్చతోరణం’పై ప్రత్యేక దృష్టి: పెద్దిరెడ్డి -
‘ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ’
సాక్షి, విశాఖపట్నం: ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలీ నియోజకవర్గంలో మధురవాడలో నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కార్యక్రమాన్ని మంత్రి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయిరెడ్డి, మంత్రి శ్రీరంగనాథ్ రాజు, ఎంపీ ఎంవీవీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణలు పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్లను కాకుండా ఊళ్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అర్హతే ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని, పార్టీలకు అతీతంగా ఇళ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్లున్న కబోదని, సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో జిల్లాలో ఎక్కడైన అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమని, చంద్రబాబు కోర్టులకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని అవంతి పేర్కొన్నారు. -
ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించినందుకు..
సాక్షి, విశాఖపట్నం : మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని మందలించారని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆరిలోవలో అక్క ఇంట్లో ఉంటున్న వంశీకృష్ణ అనే 13 సంవత్సరాల యువకుడు మొబైల్లో ఆన్లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. గత రాత్రి అక్క తీవ్రంగా మందలించడంతో మొబైల్ విసిరేసిన వంశీ ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చేసాడు. ఈ క్రమంలో ఈ రోజు(బుధవారం) ఉదయం ముడ సర్లోవ పార్క్ ఎదురుగా మామిడి చెట్టుకు వంశీకృష్ణ ఉరిపవేసుకుని విగతా జీవిగా కనిపించాడు. (రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు) మొబైల్ ఆటలకు అలవాటు పడ్డ వంశీకృష్ణ కుటుంబ సభ్యులు వద్దనే మందలించడంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమ్మ నాన్న చనిపోవడంతో తన వద్ద ఉంటున్న తమ్ముడు వంశీకృష్ణ ఈ రకంగా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి ఆన్లైన్ గేమ్‌లకు బానిసలైన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఓ ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. -
ప్రేమ కోసం ఏదైనా..
వంశీకృష్ణ, ఆనంద్ కుమార్, వికాస్ చంద్ర హీరోలుగా, ఉషా, రూపాలి సెలోకర్, ఏంజెల్ గరేవాల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రియతమా’. ‘ఎనీథింగ్ ఫర్ లవ్’ అనేది ఉపశీర్షిక. సంతోష్ పార్లవార్ దర్శకత్వం వహించారు. కర్నూలుకు చెందిన ప్రముఖ నాయకుడు పులకుర్తి కొండయ్య ఆర్కె టాకీస్ పతాకంపై నిర్మించారు. నేడు (ఆగస్టు 5) కొండయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీయాలని తొలి ప్రయత్నంగా ‘ప్రియతమా’ చిత్రాన్ని నిర్మించాను. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సామాజిక సందేశాన్ని అందించే చిత్రాలతోపాటు పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రాల్ని నిర్మించాలనుకుంటున్నాం. ‘ప్రియతమా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య, కెమెరా: ఆనెం వెంకట్. -
కోవిడ్‌కు మరో ఔషధం..
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే మరో దేశీయ ఔషధ సంస్థ హెటిరో ‘కోవిఫర్’ అనే తమ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని తెలిపింది. పిల్లలు, పెద్దల్లో కోవిడ్ అనుమానిత, నిర్ధారిత కేసుల చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్‌గా రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతి మంజూరు చేసిందని హైదరాబాద్ సంస్థ హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఆదివారం వెల్లడించారు. ‘కోవిఫర్’తో కోవిడ్–19 చికిత్సకు కీలక మలుపు కానుందన్నారు. రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్ ‘కోవిఫర్’ అనే పేరుతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. కోవిఫర్ ఔషధం 100 మిల్లీగ్రాముల వయల్‌లో ప్రవేశపెడుతున్నామనీ, ఈ ఇంజెక్షన్‌ను ఆస్పత్రిలో వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ధర రూ.5–6 వేల మధ్య..: ఒక్కో డోస్ ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటుందని వంశీ కృష్ణ అన్నారు. ప్రస్తుతం రిటైల్‌గా దీనిని విక్రయించడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారానే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా వెంటనే అందుబాటులోకి తెస్తున్నట్లు హెటిరో చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన గిలియాడ్ సైన్సెస్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లో దీనిని కోవిడ్ చికిత్సలో వాడేందుకు అనుమతి పొందినట్లు హెటిరో వెల్లడించింది. ఈ ఔషధానికి అమెరికాలో కోవిడ్–19 రోగులకు అత్యవసర ఉపయోగం (ఎమర్జెన్సీ యూజ్) కోసం యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డీఏ) అనుమతినిచ్చింది. కాగా, భారత్‌కు చెందిన మరో ఫార్మా కంపెనీ సిప్లా సైతం రెమ్‌డెసివిర్ ఔషధం తయారీ, విక్రయానికి డీసీజీఐ అనుమతి పొందింది. సిప్లా ఈ ఔషధాన్ని సిప్రెమి పేరుతో ప్రవేశపెట్టనుంది. -
భయం వద్దు.. ప్లాస్మాథెరపీ ఉంది!
అల్వాల్ (హైదరాబాద్): కరోనా బారినపడితే ఏదో అయిపోతుందనే భయం వద్దు. ఈ వైరస్‌కు ప్రస్తుతానికి మందులు లేకున్నా.. వైద్యులు తమకున్న అనుభవంతో, ప్లాస్మా థెరపీ వంటి వివిధ చికిత్స పద్ధతులతో రోగులను కోలుకునేలా చేస్తున్న తీరు అద్భుతం. గాంధీ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ధైర్యం చెబుతూ రోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు’ అని చెప్పారు హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రగతిశీల్ కాలనీకి చెందిన వంశీకృష్ణ. కరోనా వైరస్ బారినపడిన ఆయన ఇటీవలే గాంధీ ఆస్పత్రి నుంచి ఆరోగ్యవంతంగా ఇంటికి చేరుకున్నారు. వంశీకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నతోద్యోగి కాగా, ఆయన భార్య అడ్వకేట్. రాష్ట్రంలోనే ప్లాస్మా థెరపీ చికిత్స పొందిన మొదటి వ్యక్తి అయిన వంశీకృష్ణ గురువారం తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కంటికిరెప్పలా చూసుకున్నారు.. ‘ప్రతి గంటకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వారు. సమయానికి మందు లు, ఆహారం ఇవ్వడంతో పాటు వ్యాయామం చేయించడం ద్వారా రోగిని సంపూ ర్ణ ఆరోగ్యవంతుడిని చేస్తున్నారు. ప్లాస్మా థెరపీ పొందిన నన్ను గాంధీ ఆస్పత్రి ఆర్ఎం డాక్టర్ రాజారావు కంటికిరెప్పలా చూసుకున్నారు. ఆయన స్వయంగా ప్రతి బాధితుని వద్దకు వెళ్లి క్షేమ సమాచారాలు అడిగే వారు. ధైర్యం నింపేవారు. రోగనిరోధక శక్తి బాగుంటే కరోనా నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మను చూడ్డానికి తరచూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే క్రమంలో నాకు కరోనా వైరస్ సోకింది. దీంతో మే 11న నన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నా భార్య, ఇద్దరు పిల్లలను ఆస్పత్రిలో క్వారంటైన్ చేశారు. మే 26న భార్యాపిల్లల్ని, 30న నన్ను వైద్యులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపారు. ప్రస్తుత కరోనా సమయంలో, దాని చికిత్సకు నూతన ఒరవడిగా చెబుతున్న ప్లాస్మా థెరపీ చికిత్సను రాష్ట్రంలో పొందిన మొదటి వ్యక్తిని నేనే. కరోనా నుంచి చికిత్సానంతరం కోలుకున్న ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. దాన్ని వైరస్‌తో బాధపడుతున్న వారికి అందిస్తారు. ఆరోగ్యవంతుడి నుంచి తీసుకున్న రక్తం ద్వారా రోగికి వ్యాధిని జయించే శక్తి వస్తుంది. ఈ చికిత్స విధానంలో నేను కొద్దిరోజుల్లోనే కరోనా నుంచి బయటపడ్డాను’. ఇంటికొచ్చేసరికి ఇల్లు గుల్ల కరోనా బారినపడి.. చికిత్స పొంది, ఆరోగ్యంగా ఇంటికి చేరుకునే సరికి వంశీకృష్ణ ఇల్లు గుల్లయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘ టన వివరాలు బాధితులు, పోలీసు లు తెలిపిన ప్రకారం.. గత నెల 11న వంశీకృష్ణకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో పాటు భార్య, ఇద్ద రు పిల్లలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి క్వారంటైన్లో ఉంచిన వంశీకృష్ణ భార్యాపిల్లల్ని మే 26న ఇంటికి పంపారు. వారొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బంగారం, నగదు, విలువైన సామగ్రి కనిపించలేదు. 10 తులాల బంగారం, రూ.30 వేలు, 2 ల్యాబ్టాప్లు, 3 ఐప్యా డ్లు చోరీ అయినట్టు గుర్తించి అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి యాజమాని వంశీకృష్ణ చికిత్స పూర్తి చేసుకొని మే 30న ఇంటికి వచ్చారు. ఇంటికి సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, ఆధునిక లాకింగ్ సదుపాయాలతో కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లున్నా కూడా దొంగతనం జరిగిన తీరు విస్తుగొలుపుతోంది. కాగా, ఘటన జరిగిన 8 రోజుల తరువాత ఈ నెల 4న అల్వాల్ పోలీసులు బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని అందచేశారు. -
10 లక్షల డోసులతో సిద్ధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ 19 వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తున్న ఔషధం రెమ్డిసివిర్ సరఫరాకి సంబంధించి ఫేజ్–1లో ప్రభుత్వం ఆదేశాలొస్తే సత్వరం 10 లక్షల డోసులను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫార్మా దిగ్గజం హెటిరో ల్యాబ్స్ ఎండీ బి.వంశీకృష్ణ వెల్లడించారు. ఈ ఔషధాన్ని తయారు చేసి, విక్రయించేందుకు అమెరికన్ సంస్థ గిలీడ్ సైన్సెస్‌తో హెటిరో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ఈ విషయం చెప్పారు. దేశీయంగా డిమాండ్ ఎంత స్థాయిలో ఉంటుందనేది కూడా ఇప్పుడే అంచనా వేయలేమని, ప్రభుత్వం చెప్పే దాన్ని బట్టే తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. డిమాండ్ ఎలా ఉండబోతున్నప్పటికీ తమ వంతుగా ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు 10 లక్షల డోసులు అందించేందుకు సిద్ధమవుతున్నామని వంశీకృష్ణ చెప్పారు. లైసెన్సీలు అందరితో మాట్లాడి ఎంత మేరకు అవసరమవుతుందనేది బహుశా రెండు, మూడు వారాల్లో ప్రభుత్వం తెలియజేయొచ్చని భావిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికైతే దీన్ని అందుబాటులోకి తేవడంపైనే దృష్టి సారిస్తున్నామన్నారు. దేశీయంగా ఈ ఔషధం వినియోగం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా తెలియడం లేదు కాబట్టి ఆదాయ అవకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. ప్రభుత్వం, ఐసీఎంఆర్, డీసీజీఐ చెప్పేదాన్ని బట్టి వినియోగం గురించి తెలుస్తుందన్నారు. త్వరలో అనుమతులు.. డీసీజీఐకి తదుపరి రెండు వారాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోబోతున్నామని వంశీకృష్ణ తెలియజేశారు. ‘‘ఇది అత్యవసరమైన అంశం కాబట్టి డీసీజీఐ కూడా అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయొచ్చని ఆశిస్తున్నాం. అవి వచ్చాక 7–10 పనిదినాల్లో దీన్ని అందుబాటులోకి తేగలం. జూన్‌లోనే దీన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ధర విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు’’ అని వంశీకృష్ణ వివరించారు. సాధారణంగా ధరను నిర్ణయించుకునేందుకు తయారీ సంస్థలకు అధికారం ఉందని, అయితే ప్రస్తుతం ప్రభుత్వపరమైన కొనుగోళ్ల కారణంగా దీనిపై ప్రభుత్వంతో కూడా చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. బహుశా రెండు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. తాము ఉత్పత్తి చేసే ఈ ఔషధం పూర్తిగా మేకిన్ ఇండియా నినాదానికి అనుగుణంగా ఉంటుందని వంశీకృష్ణ తెలిపారు. రెమ్డిసివిర్ను విశాఖ, హైదరాబాద్ ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నామని, పూర్తిగా ఇండియా ఉత్పత్తిగా దీన్ని చెప్పుకోవచ్చని చెప్పారాయన. ఇతర దేశాలకూ ఎగుమతి.. ఒప్పందం ప్రకారం.. ఎగుమతి మార్కెట్లకు సంబంధించి ఆఫ్రికా, ఆసియా మొదలైన ఖండాల్లో మధ్య, తక్కువ స్థాయి ఆదాయాలుండే సుమారు 127 దేశాలకు దీన్ని ఎగుమతి చేయొచ్చని వంశీకృష్ణ చెప్పారు. ఇప్పటికే వాటిల్లో చాలా దేశాలకు తాము ఇతర ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఆయా మార్కెట్లలో గిలీడ్‌కు నేరుగా కార్యకలాపాలు లేవు. అలాంటి దేశాల్లో మా ద్వారా ఈ ఔషధం అందుబాటులోకి తేవాలని ఆ సంస్థ భావిస్తోంది’’ అని చెప్పారు. -
కాకర్ల వంశీకృష్ణ అనే కార్తీక్
ఈ రోజుల్లో బుల్లితెర అందిస్తున్న అవకాశాలు మెండు. వాటికి తగిన విధంగా తెలుగు వారే కాదు కన్నడ, తమిళ ఆర్టిస్టులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ప్రాంతాల అడ్డుగోడలను చెరిపేస్తూ బుల్లితెర అభిమానాన్ని మూటగట్టుకుంటూ ఉంటారు. అలా వచ్చినవాడే కార్తీక్. కన్నడ ఆర్టిస్ట్ అయినా తెలుగు బుల్లితెర నటుడిగా రాణిస్తూ ‘మాటే మంత్రం’ అంటూ మెప్పిస్తున్నాడు కార్తీక్. కాకర్ల వంశీకృష్ణగా బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న కార్తీక్ చెబుతున్న కబుర్లివి.. ‘‘వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ మనల్ని మనం నిరూపించుకుంటూ వెళ్లాలి. ప్రతీ పాత్రకు లైఫ్ ఉంటుంది. ఈ పాత్ర అయితేనే చేస్తాను అని ఈ ఇండస్ట్రీలో గిరిగీసుక్కూర్చోనక్కర్లేదు. సినిమాలకు రావాలనే ఆలోచనల్లో ఉండగానే బుల్లితెరపై నటించే అవకాశాలు వచ్చాయి. వాటిని వినియోగించుకుంటూ నన్ను నేను నిలబెట్టుకునే ్రçపయత్నం చేస్తున్నాను. ‘మాటేమంత్రం’ సీరియల్ ద్వారా కాకర్ల వంశీకృష్ణగా తెలుగువారి అభిమానం పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆరిస్టుగా రాణించాలనే ఆలోచన ఉండేది. అందుకు కాలేజీ రోజుల నుంచే ఆడిషన్స్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. బిఎస్సీ పూర్తయ్యాక ఆరునెలల పాటు దాదాపు అన్ని టీవీ ఆడిషన్స్‌కి వెళ్లాను. పుట్టి పెరిగింది అంతా మైసూరులో. కన్నడలో ఖుషి, అక్క, మహాకాళీ, శని.. సీరియల్స్‌లో నటించాను. తమిళంలోనూ ఓ సీరియల్లో నటించాను. తెలుగు, కన్నడ, తమిళ నటుడిగా మంచి గుర్తుంపు పొందాలన్నదే నా అభిలాష. ‘జీ’ తెలుగులో వస్తున్న మాటేమంత్రం సీరియల్లో కాకర్ల వంశీకృష్ణగా లీడ్రోల్లో నటిస్తున్నాను. అన్నీ చెడు అలవాట్లు ఉన్న వ్యక్తిగా ఈ సీరియల్లో కనిపిస్తుంటాను. వంశీకృష్ణ దగ్గర పి.ఎగా వసుంధర చేరుతుంది. చాలా మంచి అమ్మాయి. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల నేర్పు, ధైర్యం గల అమ్మాయి. వంశీకృష్ణకు వసుంధరతో పెళ్లి అవుతుంది. అక్కణ్ణుంచి వంశీకృష్ణలో కుటుంబ విలువలతో కూడిన మార్పు వస్తుంటుంది. ఈ క్రమంలో వచ్చే ఒడిదొడుకులు, మార్పులు.. వంటి అంశాలతో ‘మాటేమంత్రం’ సీరియల్ నడుస్తుంది. మంచి రేటింగ్‌తో ఉన్న ఈ సీరియల్ రీప్లేసింగ్ ద్వారా నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. అమ్మనాన్నల ప్రేమ యాక్టింగ్ అనేది ప్రతి రోజూ కొత్తగానే ఉంటుంది. సీనియర్స్ నటన చూసే కాదు స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుంటూ ఇంకాస్త మెరుగుపరుచుకుంటూ ఉంటాను. మొదట ఈ ఫీల్డ్‌వైపు రావడానికి అమ్మనాన్నలు అంతగా ఆసక్తి చూపలేదు. ‘చదువుంది, లేదంటే నాన్న చేసే ఫ్యాబ్రిక్ బిజినెస్ చూసుకో’అన్నారు. కానీ, నా ఇష్టాన్ని కాదనలేకపోయారు. అమ్మ గృహిణి. అక్క ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఇంట్లో ఇప్పుడు నా సీరియల్స్ చూస్తూ ‘నెక్ట్స్ ఏమవుతుంది స్టోరీలో’ అని అడుగుతుంటారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. టీవీ ఇండస్ట్రీ అంటే నిలకడలేని జాబ్ అన్నారు కానీ, ఎప్పుడూ నన్ను వెనక్కిలాగాలని ప్రయత్నించలేదు. ప్రయత్నించు.. ఏ మాత్రం సౌకర్యంగా లేకున్నా వెనక్కి వచ్చేయ్ అన్నారు. కుటుంబం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటే ఇష్టమైన ఫీల్డ్‌లో హ్యాపీగా రాణించవచ్చు. నా విషయంలో ఇది నిజమైంది. మహాకాళీ, శని సీరియల్స్‌లో నారాయణుడిగా నటించాను. దైవ పాత్రల్లో నటిస్తున్నప్పుడు తెలియని అలౌకిక భావన నన్ను చుట్టుముట్టేది. నారాయణుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు టీవీలో చూసిన అమ్మనాన్నలు ‘ఎంత బాగా చేశావు నాన్నా’ అన్నప్పుడు కలిగిన ఆనందం వెలకట్టలేనిది. ఆటలంటే పిచ్చి నటనతోపాటు స్పోర్ట్స్ అంటే బాగా పిచ్చి. క్రికెట్, ఫుట్‌బాల్‌ను బాగా ఇష్టపడతాను. కాస్త ఖాళీ సమయం దొరికినా గ్రౌండ్లో ఉండేలా చూసుకుంటాను. ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లడం నాకున్న మరో అలవాటు. కాస్ట్యూమ్స్ కోసం పాపింగ్ చేయడమే కాదు డిజైనర్ డ్రెస్సులకు సంబంధించిన వాటికి అప్పుడప్పుడు మా సిస్టర్ అడ్వైజ్ కూడా తీసుకుంటూ ఉంటాను. నటనలోనే కాకుండా ఒక మంచి కథతో నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది. అందుకే సీరియల్ కథ రెడీ చేస్తున్నాను.’’ సంభాషణ: నిర్మలారెడ్డి -
నంబర్ 1 ఎవరు?
రాజ్ వాడపల్లి, వంశీ కృష్ణ, ప్రియా అగస్టీన్, కావ్యకీర్తి బండారి ముఖ్య తారలుగా కుమార్ రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మొనగాడెవరు’. ‘హు ఈజ్ నెం.1’ అన్నది ట్యాగ్ లైన్. వాడపల్లి జగన్నాథం సమర్పణలో మెగా ఆర్ట్స్ బ్యానర్‌పై వాడపల్లి రాజు, దావల రాజ్‌కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ గౌరవ దర్శకత్వం వహించగా, మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ లోగో లాంచ్ చేశారు. కుమార్ రాజేంద్ర మాట్లాడుతూ– ‘‘హీరోయిన్లు కావాలని ఇద్దరు అమ్మాయిలు, డైరెక్టర్ అవ్వాలని ఓ కుర్రాడు, హీరో కావాలని మరో యువకుడు సిటీకొస్తారు. ఇండస్ట్రీలో ఎదగడం అంత సులభం కాదని తెలుసుకుని ఎలా కష్టపడ్డారు? చివరకు సక్సెస్ సాధించారా? అనేదే కథ. సినిమాల్లో ఇప్పటివరకు నటించిన, నటిస్తున్న ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఏ విధంగా ఎదిగారనే అంశాలు (బయోపిక్స్) చూపించనున్నాం’’ అన్నారు. ‘‘సినిమా వాళ్ల కష్టాలను మా చిత్రంలో చూపిస్తాం. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాల్లో సగభాగాన్ని పేద సినీ కళాకారులకు అందిస్తాం’’ అని వాడపల్లి రాజు, దావల రాజ్‌కిరణ్ అన్నారు. హేమ సుందర్, ‘బస్టాప్’ కోటేశ్వర్ రావు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్.రాజు, కెమెరా: ఎం.మురళి. -
అమెరికా కష్టాలు
తేజస్, వంశీ కోడూరి, వైవా హర్ష, వంశీకృష్ణ, పల్లవి డోరా తారలుగా చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమీర్‌పేట్ టు అమెరికా’. స్వప్న కొమండూరి సమర్పణలో పద్మజ కొమండూరి నిర్మించారు. కార్తీక్ కొడకండ్ల స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ ఎక్సైజ్ మంత్రి పద్మారావు విడుదల చేయగా, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్వీకరించారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ– ‘‘ఇక్కడ కుటుంబాలను వదులుకొని చదువు కోసం, సంపాదన కోసం అమెరికా వెళ్లి అక్కడ సరైన అవకాశాల్లేక నానా ఇబ్బందులుపడే చాలామంది బాధలను ఈ చిత్రం ద్వారా చూపించడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమాని ఆదరించి హిట్ చేస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత రామ్. ‘‘ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు రామ్మోహన్ కొమండూరి. -
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య
హైదరాబాద్: ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగవేటలో ఉన్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మౌలాలి ఎస్పీనగర్ కాలనీలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వంశీకృష్ణ(22) ఇటీవలే బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు రేగుతుండటంతో.. మనస్తాపానికి గురైన వంశీకృష్ణ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల అదుపులో మోసగాడు
సాక్షి, సిటీ బ్యూరో: భార్యను మోసం చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని మహిళా ఠాణా పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువతికి అనంతపురం వాసి ఆర్.వంశీకృష్ణతో 2009లో వివాహమైంది. ఇతడు సాఫ్ట్వేర్ ఉద్యోగని చెప్పడంతో ఆ సమయంలో యువతి కుటుంబీకులు భారీగా కట్నకానుకలు ఇచ్చారు. వీరికి ఒక పాప పుట్టింది. ఆ తర్వాత వంశీకృష్ణ భార్యను వేధించడం మొదలెట్టాడు. ఆమె నుంచి దాదాపు రూ.50 లక్షల నగదు తీసుకొని ఖర్చు చేశాడు. అంతేకాకుండా 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక ప్లాటు అమ్మేశాడు. వంశీ సోదరికి పిల్లలు లేకపోవడంతో మగపిల్లాడిని దత్తత ఇవ్వాలని భావించాడు. బయట వారి పిల్లలను దత్తత ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో తనకు పుట్టిన వారినే ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఇతడికి జగద్గిరిగుట్టకు చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉండటంతో ఆమె ద్వారా బాలుడికి జన్మనిచ్చాడు. ఈ మేరకు నగరంలోని జీహెచ్ఎంసీ నుంచి ధ్రువీకరణ తీసుకున్నాడు. అయితే నిబంధనల ప్రకారం దత్తత ఇవ్వాలంటే తన భార్యకు పుట్టిన బిడ్డ మాత్రమే అయి ఉండాలని తెలిసి.. ప్రియురాలికి పుట్టిన మగపిల్లాడు తన భార్యకే పుట్టినట్టు అనంతపురంలో నమోదు చేయించి ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. ఇటీవల కాలంలో వంశీ నుంచి వేధింపులు పెరగడంతో అతడి భార్య అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చేసింది. ఈ బర్త్‌సర్టిఫికెట్ల విషయం ఆమెకు తెలిసి న్యాయవాది కె.శేతకర్ణి సహకారంతో మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. -
చీటర్ చిక్కాడు
జనాన్ని ముంచడమంటే ఇంత పచ్చి మోసంగా ఉంటుందా.. ఏకంగా తాను మరణించినట్లు నమ్మించేందుకు తెగపడతారా.. అవునని రుజువుచేశాడు చీటర్ వంశీకృష్ణ. రియల్టర్ అవతారమెత్తి నమ్మిన వారిని ఫోర్జరీ సంతకాలతో నట్టేట ముంచడంతోపాటు తన కస్టమర్లను నిలువు దోపిడీ చేసిన అతని పాపం ఎట్టకేలకు పండింది. రెండున్నర ఏళ్ల అదృశ్యం తర్వాత మంగళవారం రాత్రి పోలీసులకు చిక్కాడు. వంశీకృష్ణ పాపాల పుట్ట పగిలి మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. విజయవాడ : అతను కమిషనరేట్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్... రెండున్నర సంవత్సరాలుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. ఎట్టకేలకు సూర్యారావు పేట పోలీసులకు చిక్కాడు. కస్తూరిబాయిపేటలోని ఒక ఆస్పత్రికి చికిత్స కోసం రాగా.. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అయితే అతనే కావాలని లొంగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అతనిని సూర్యారావు పేట పోలీసులు విచారణ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని కోట్ల రూపాయలకు ముంచేసి అదృశ్యమైన వీనస్ బిల్డర్స్ యజమాని నార్ల వంశీకృష్ణ 2011 జనవరి 4వ తేదీ నుంచి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. 2011 జనవరి 4వ తేదీన వంశీకృష్ణ కారు గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో పంట కాలువలో పల్టీ కొట్టింది. ఆ ప్రమాదంలో వంశీతోపాటు అతని తల్లి కూడా గల్లంతైనట్లు అందరూ భావించారు. కాలువలో ఎంత గాలించినా వారి మృతదేహాలు దొరక్కపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి తాను చనిపోయినట్లు నమ్మించడం కోసం కారును కావాలనే కాలువలోకి పల్టీ కొట్టించి వంశీ కనపడకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్లు తేలింది. దీంతో అతన్ని నమ్మి లక్షల రూపాయలకు ప్లాట్లు కొన్నవారు, అడ్వాన్సులు ఇచ్చినవారు ఆందోళన చెందారు. తొలుత దీనిపై కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు పట్టించుకోలేదు. అయితే బాధితులందరూ నగరానికి చెందినవారే కావడంతో చివరికి పోలీసులు ఈ విషయంపై దృష్టి పెట్టి వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇతనిపై నగరంలోని వన్‌టౌన్, కృష్ణలంక, మాచవరం పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల పోలీస్ స్టేషన్లోనూ పలు కేసులున్నాయి. ప్లాట్లు కొనిపించడం ఆ తర్వాత వారికి తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకులో రుణాలు తీసుకోవడం, ఒకే ప్లాటును ఇద్దరు, ముగ్గురికి విక్రయించడం వంటి మోసాల ద్వారా వంశీకృష్ణ కోట్ల రూపాయలు మింగేశాడని పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా ఒక బ్యాంకు లోనులో ఉన్న ప్లాటుకు మరొక బ్యాంకు లోను ఇవ్వదు. కానీ కొందరు బ్యాంకు అధికారులను మేనేజ్ చేయడం ద్వారా లోన్లు ఉన్న ప్లాట్లకే మళ్లీ లోన్లు ఇప్పించినట్లు తెలుస్తోంది. రెప్కో, యూనియన్ బ్యాంకులతోపాటు మరికొన్ని బ్యాంకుల ద్వారా రెండోసారి ఇవి మంజూరు చేయించినట్లు సమాచారం. బాధితుల్లో కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన ఒక సీఐ రియల్టర్ వంశీకష్ణకు రూ.5 కోట్లకుపైనే ఇచ్చిన విషయం బయటకొచ్చింది. ఇంతేకాకుండా గతంలో జిల్లా పోలీస్ బాస్ కూడా ఇతని వలలో పడినట్లు పోలీసువర్గాలే చెబుతున్నాయి. గుడ్డిగా నమ్మి ప్లాట్లు కొనడంతోపాటు కొందరు అతని పేరిట పవర్ ఆఫ్ ఆటార్నీ ఇచ్చి నిండా మునిగిపోయినట్లు తేలింది. పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న ప్లాటును అతను వేరొకరికి రిజిస్టర్ చేసి బ్యాంకు రుణాన్ని మాత్రం వారి పేరుతో తీసుకున్నాడు. దీంతో పలువురు ప్లాటు తమది కాకపోయినా బ్యాంకులకు వాయిదాలు కడుతున్నారు. ఇలా రూ.100 కోట్లకుపైనే అతను పలువుర్ని ముంచేశాడు. ప్లాట్ల పేరుతో అనేక మందికి టోపీ పెట్టి, చివరికి వ్యాపార భాగస్వాములను సైతం నట్టేట ముంచి అదృశ్యమైన నార్ల వంశీకృష్ణ మోసాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వ్యాపారం చేద్దామని నమ్మించి జాయింట్ ఎకౌంట్లో ఉన్న రూ.80 లక్షల్ని తన సంతకం ఫోర్జరీ చేసి డ్రా చేసినట్లు చలసాని మైథిలి మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సిద్ధార్థ మెడికల్ హెల్త్‌కేర్ అండ్ హోల్డింగ్స్ పేరుతో వ్యాపారం కోసం రూ.కోటిని వంశీకృష్ణ, మైథిలి కలిసి గవర్నర్‌పేట ఇండియన్ బ్యాంకులో జమ చేశారు. ఆ డబ్బు డ్రా చేయాలంటే ఇద్దరూ సంతకాలు చేయాలి. అయితే వంశీయే చెక్కుపై మైథిలి సంతకాన్ని కూడా చేసి రూ.80 లక్షల్ని డ్రా చేశాడు. ఇందుకు బ్యాంకు అధికారులు కూడా సహకరించినట్లు మైథిలి ఫిర్యాదులో పేర్కొంది. భవానీపురంలో తులసి ఎన్‌క్లేవ్‌ను వంశీ, శ్రీనివాసరావు కలిసి నిర్మించారు. అయితే ఆ తర్వాత శ్రీనివాసరావుకు తెలియకుండా అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి వంశీ దానిపై రూ.కోటిన్నర రుణం తీసుకున్నాడు. ఇందుకు ఒక పోలీసు అధికారి తన ఆస్తులను ష్యూరిటీగా పెట్టారు. దీనిపై శ్రీనివాసరావు వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసూ పెండింగ్‌లోనే ఉంది. అతను దొరకడంతో ఇంకా చాలా విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మ్యాన్ మిస్సింగ్ కేసు ఉండటంతో పోలీసులు నేడు గుంటూరు జిల్లాకు తరలించే అవకాశం ఉంది.