
తేజస్, వంశీ కోడూరి, వైవా హర్ష, వంశీకృష్ణ, పల్లవి డోరా తారలుగా చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమీర్‌పేట్ టు అమెరికా’. స్వప్న కొమండూరి సమర్పణలో పద్మజ కొమండూరి నిర్మించారు. కార్తీక్ కొడకండ్ల స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ ఎక్సైజ్ మంత్రి పద్మారావు విడుదల చేయగా, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్వీకరించారు.
మంత్రి పద్మారావు మాట్లాడుతూ– ‘‘ఇక్కడ కుటుంబాలను వదులుకొని చదువు కోసం, సంపాదన కోసం అమెరికా వెళ్లి అక్కడ సరైన అవకాశాల్లేక నానా ఇబ్బందులుపడే చాలామంది బాధలను ఈ చిత్రం ద్వారా చూపించడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమాని ఆదరించి హిట్ చేస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత రామ్. ‘‘ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు రామ్మోహన్ కొమండూరి.
Comments
Please login to add a commentAdd a comment