రాజా మార్కండేయ.. కోట్లు కొల్లగొట్టాలి: సుమన్‌ | Raja Markandeya Movie Title Logo Released By Suman | Sakshi
Sakshi News home page

రాజా మార్కండేయ.. కోట్లు కొల్లగొట్టాలి: సుమన్‌

Aug 25 2024 4:44 PM | Updated on Aug 25 2024 4:45 PM

Raja Markandeya Movie Title Logo Released By Suman

'బన్నీ అశ్వంత్'ను దర్శకుడు గా పరిచయం చేస్తూ... శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా - వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తేజస్ వీరమాచినేని - అక్షయ రోమి జంటగా నటిస్తున్న ఈ మూవీ టైటిల్‌ లోగోని తాజాగా ప్రముఖ నటుడు సుమన్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి "రాజా మార్కండేయ" అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్‌.  ‘వేట మొదలైంది’ అన్నది ట్యాగ్ లైన్. లోగో రిలీజ్‌ అనంతరం సుమన్‌ మాట్లాడుతూ.. కంటెంట్ బాగుంటే... చిన్న చిత్రాలు కూడా కోట్లు కొల్లగొడుతున్నాయని, "రాజా మార్కండేయ" ఆ చిత్రాల కోవలో చేరాలని ఆకాంక్షించారు.  

సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయిందని పేర్కొన్న దర్శకనిర్మాతలు.. ఈ చిత్ర రూపకల్పనలో సహాయసహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కిస్తున్న "రాజా మార్కండేయ" సంచలన విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని అతిధులు అభిలషించారు. ఈ కార్యక్రమంలో  ప్రముఖ నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వైశ్య ప్రముఖులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గంగపురం పద్మగౌడ్, నవీన్ మాచర్ల  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement