tejas
-
‘ఉరుకు పటేల’ మూవీ రివ్యూ
‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఖుష్బూ చౌదరి హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. పటేల(తేజస్ కంచర్ల) బాగా ఆస్తి ఉంటుంది. కానీ చదువు అబ్బదు. తరగతిలో తనది చివరి ర్యాంకు. దీంతో తోటి విద్యార్థులు అతన్ని చులకగా చూస్తారు. అమ్మాయిలు అయితే.. తనవైపే చూడడానికి ఇష్టపడరు. దీంతో పెద్దయిన తర్వాత ఎలాగైన బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిపోతాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదివిన పటేల.. ఊర్లో బార్ నడుపుతూ సర్పంచ్ అయిన తన తండ్రి(గోపరాజు రమణ)కు రాజకీయంగా తోడుగా ఉంటాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటే.. ఆ ఊరివాళ్లు ఎవ్వరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రారు. అయితే పక్క ఊరికి చెందిన డాక్టర్ అక్షర(ఖుష్బూ చౌదరి ) మాత్రం పటేల్‌ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఏడో తరగతి వరకు మాత్రమే చదివి జులాయిగా తిరుగుతున్న పటేలాను డాక్టర్ అయిన అక్షర ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది? నిజంగానే పటేలాను అక్షర ప్రేమించిందా? అక్షర బర్త్‌డే సెలెబ్రేషన్స్ కోసం ఆస్పత్రికి వెళ్లిన పటేలాకు ఎదురైన అనుభవం ఏంటి? అక్షర ఫ్యామిలీ చేసిన కుట్ర ఏంటి? అసలు పటేలా ఎందుకు పరుగెత్తాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఈ టెక్నాలజీ యుగంలోనూ మూఢ నమ్మకాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. మంచి జరుగుతుందని నమ్మి నరబలి ఇవ్వడానికి చూడా వెనుకాడడం లేదు. తరచు మనం ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. అలాంటి వాటిని బేస్ చేసుకొని తెరకెక్కించిన చిత్రమే ఉరుకు పటేలా. థ్రిల్లర్ కామెడీ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వివేక్ రెడ్డి . ఆయన ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంతో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం నార్మల్‌గా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండాఫ్‌పై ఆస్తకి పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకోవడమే కాదు.. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా చేస్తుంది. అయితే కథనం మొత్తం ఒక ఆస్పత్రి చుట్టే సాగడం.. ఈ కమ్రంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సినిమా అయిపోతుంది అనుకున్న టైంలో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. కథను మరింత బలంగా రాసుకొని, స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. పటేలా పాత్రలో తేజస్ కంచర్ల ఒదిగిపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో థ్రిల్లర్ జోనర్ లో తను ఇరుక్కుపోయిన ప్లేస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని భయపడే పాత్రలో అదరగొట్టేసాడు. ఉరుకు పటేల సినిమాని తన భుజాలమీదే మొత్తం నడిపించాడు. ఓవైపు భయపడుతూనే... మరోవైపు కామెడీ పండించాడు. డ్యాన్స్ కూడా బాగా చేశాడు. కొన్ని చోట్ల ఆయన పాత్ర డీజే టిల్లుని గుర్తు చేస్తుంది.ఇక డాక్టర్ అక్షరగా కుష్భు చౌదరి తన అందంతో చాలా క్యూట్ గా మెప్పించింది. సెకెండాఫ్ లో వచ్చే ఆమెలోని మరోకోణం నటనతో ఆకట్టుకుంది. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగమ్మాయిలా కనిపించి అలరించింది. ఇక మరో పాత్రలో హీరోయిన్ వదిన పాత్ర వేసిన లావణ్య రెడ్డి కూడా ఆకట్టుకుంటుంది. గ్రామ సర్పంచ్, పటేల తండ్రి పాత్రలో గోపరాజు రమణ ఎప్పటిలాగే తనమార్క్ డైలాగులు, నటనతో మెప్పంచారు. సుదర్శన్ తో డబుల్ మీనింగ్ డైలాగులతో కాస్త శ్రుతిమించే చెప్పించారు. చమ్మక్ చంద్ర పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది.మూఢనమ్మకాలతో జరిగిన కొన్ని సంఘటనల చుట్టూ ఈ కథను అల్లుకుని... థ్రిల్లర్, కామెడీ జానర్లో చాలా ఆసక్తికరంగా ఎంటర్టైన్మెంట్గా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఈ చిత్రం ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే జత చేసి మొదటి సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వివేక్. మూవీలో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం రాత్రి పూట ఒకే హాస్పిటల్ లో కథ జరగడంతో దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఈ వారం వినాయకచవితి సందర్భంగా వచ్చిన హాలీడేస్ ను ఈ సినిమాతో ఎంజాయ్ చేసేయండి. -
రాజా మార్కండేయ.. కోట్లు కొల్లగొట్టాలి: సుమన్
'బన్నీ అశ్వంత్'ను దర్శకుడు గా పరిచయం చేస్తూ... శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా - వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తేజస్ వీరమాచినేని - అక్షయ రోమి జంటగా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ లోగోని తాజాగా ప్రముఖ నటుడు సుమన్ విడుదల చేశారు. ఈ చిత్రానికి "రాజా మార్కండేయ" అనే పవర్ఫుల్ టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్. ‘వేట మొదలైంది’ అన్నది ట్యాగ్ లైన్. లోగో రిలీజ్ అనంతరం సుమన్ మాట్లాడుతూ.. కంటెంట్ బాగుంటే... చిన్న చిత్రాలు కూడా కోట్లు కొల్లగొడుతున్నాయని, "రాజా మార్కండేయ" ఆ చిత్రాల కోవలో చేరాలని ఆకాంక్షించారు. సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయిందని పేర్కొన్న దర్శకనిర్మాతలు.. ఈ చిత్ర రూపకల్పనలో సహాయసహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కిస్తున్న "రాజా మార్కండేయ" సంచలన విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని అతిధులు అభిలషించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వైశ్య ప్రముఖులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గంగపురం పద్మగౌడ్, నవీన్ మాచర్ల తదితరులు పాల్గొన్నారు. -
మిస్టరీ వీడిన తేజస్ మర్డర్ కేసు
హైదరాబాద్: ప్రగతినగర్‌లో జరిగిన ప్రతీకార హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురు మైనర్లు ఉన్నారు. ఎస్హెచ్ఓ ఉపేందర్ కథనం ప్రకారం వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 24న తెల్లవారుజామున ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి దాసారం బస్తీలో తరుణ్‌రాయ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఏ–1గా షేక్ షరీఫ్ అలియాస్ అమీర్ షరీఫ్, ఏ–2గా అభిషేక్, అలియాస్ అభి, ఏ–3గా పిల్లి తేజస్ అలియాస్ తేజు, అలియాస్ డీల్, ఏ–4గా బండ నాగరాజు, ఏ–5గా రాహుల్, ఏ–6గా రాబిన్ బెన్నీలు నిందితులు. వీరిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షేక్ షరీఫ్, తేజస్‌లు రెండు నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వీరిని ఎలాగైనా హత్య చేయాలని తరుణ్‌రాయ్ అనుచరులు పథకం రచించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తేజస్ బోరబండ నుంచి ప్రగతినగర్‌కు వచ్చి తన తల్లితో కలిసి అద్దె ఇంటిలో ఉండేవాడు. పక్కా ప్రణాళికతో.. తరుణ్‌రాయ్ బంధువులైన రోహిత్‌తో పాటు అతని అనుచరులు దినేష్ తదితరులు తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా శివప్పను ప్రగతినగర్‌లో ఉంటున్న తేజస్ దగ్గరకు మద్యం తాగడానికి పంపించారు. దీంతో శివప్పతో పాటు కౌశిక్, మహేశ్ ముగ్గురూ ఈ నెల 7న ప్రగతినగర్‌లోని తేజస్ ఇంటికి చేరుకుని రాత్రి 11 గంటల వేళ మద్యం తాగుతున్నారు. ఇదే సమయంలో మోతీనగర్‌లోని అల్సఫా హోటల్లో రోహిత్‌తో పాటు మరో 13 మంది తేజస్ హత్యపై చర్చించారు. శివప్ప ప్రగతినగర్‌లోని ఇంటి లొకేషన్‌ను షేర్ చేశాడు. తెల్లవారుజాము 2 గంటల సమయంలో సమీర్, సిద్ధేశ్వర్ నాయక్, జయంత్‌లు బైక్‌పై వచ్చారు. రోహిత్, దినే‹Ù, ప్రతీక్, రాహుల్, సునీల్, గానప్ప, సంతోష్, శ్రీకర్లు బైక్‌లపై లొకేషన్‌కు చేరుకుని చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఇదే సమయంలో శివప్ప సిగరెట్ తాగేందుకు కిందికి వెళదామనడంతో అందరూ కలిసి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను శివప్ప తన స్కూటీపై ఎక్కించుకుని సమీర్, జయంత్, సిద్ధేశ్వర్ల ఎదుట నిలిపాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తేజస్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే జయంత్, సిద్ధేశ్వర్ కత్తులతో తేజస్‌పై దాడి చేశారు. వెంటనే సమీర్ సిమెంట్ రాయితో తలపై బలంగా కొట్టాడు. అప్పటికే తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన తేజస్ రోడ్డుపై పడిపోయాడు. దాడి చేసే క్రమంలో సిద్ధేశ్వర్ చేతికి గాయమైంది. దీంతో వెంటనే శివప్ప.. సిద్ధేశ్వర్ నుంచి కత్తి తీసుకుని తేజస్ గొంతు కోశాడు. మర్మాంగాలపై రాళ్లతో దాడి చేశాడు. తేజస్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం అందరూ అక్కడి నుంచి డాన్సులు చేసుకుంటూ బైక్‌పై రీల్స్ చేసుకుంటూ వెళ్లిపోయారు. తేజస్ ఇంటిని అదీనంలోకి తీసుకుని.. ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న తేజస్ నివాసానికి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చేరుకున్న సుమారు 10 మందికి పైగా అతని ఇంటి పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి అనంతరం 10 నిమిషాల్లోనే తేజస్‌ను హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. రోహిత్, సమీర్, సిద్ధేశ్వర్, శివప్ప, గణేశ్, సునీల్, రాహుల్, తిరుమల్, మహేశ్‌లను రిమాండ్‌కు తరలించారు. దినేష్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని, ఈ కేసులో నలుగురు మైనర్లు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు వినియోగించిన ఆరు సెల్ ఫోన్లు, నాలుగు బైక్‌లు స్వా«దీనం చేసుకున్నారు. బాలానగర్ జోన్ డీసీపీ ఆదేశాలతో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో కేసును ఛేదించిన ఎఎస్ఎహ్ఓ ఉపేందర్, ఎస్ఐలు మహేశ్, సత్యనారాయణ, కానిస్టేబుళ్లు రాజేశ్, యాదగిరి, బాల్‌రాజ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. నాడు తేజస్.. నేడు శివప్ప.. తరుణ్‌రాయ్ హత్య కేసులో ఏ–3గా ఉన్న తేజస్.. తరుణ్రాయ్కి నమ్మకంగా ఉండేవాడు. దీంతో అప్పట్లో ప్రత్యర్థులు తేజస్‌ను నమ్మకంగా వాడుకుని తరుణ్‌కు సంబంధించిన కదలికలను తెలుసుకుని అనువైన సమయం కోసం వేచి చూసి హత్య చేశారు. ఇదే క్రమంలో తరుణ్‌రాయ్ అనుచరులు సైతం తేజస్‌కు నమ్మకంగా ఉండే శివప్పను ప్రలోభపెట్టి తేజస్‌ను హత్య చేయడం గమనార్హం. అందరూ నేర చరిత్ర కలిగిన వారే.. తేజస్ హత్యకేసు నిందితుల్లో అందరూ నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారు. తిరుమల్ రౌడీ షీటర్ కాగా..సిద్ధేశ్వర్ మర్డర్ కేసులో నిందితుడు. మిగతా వారిపై సైతం పలు రకాల కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా అందరూ 25 సంవత్సరాల వయసు లోపు వారే కావడం గమనార్హం. -
23 ఏళ్లలో తొలిసారి.. కుప్పకూలిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్
జైపూర్: రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జైసల్మేర్‌లోని ఓ స్టూడెంట్ హాస్టల్ భవనం వద్ద తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. దీంతో ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. జెట్ కూలకముందే పారాచూట్‌తో దూకడంతో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే తేజస్ సింగిల్ సీటర్ ఫైటర్ జట్ 23 ఏళ్ల చరిత్రలో కూలిపోవడం ఇదే తొలిసారి. 2001లో తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ సేవలు ప్రారంభమైన తర్వాత ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవటం ఇప్పటి వరకు జరగలేదని అని అధికారులు తెలిపారు. One Tejas aircraft of the Indian Air Force met with an accident at Jaisalmer, today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been constituted to find out the cause of the accident. — Indian Air Force (@IAF_MCC) March 12, 2024 -
OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
సినీ ఆడియన్స్ ప్రస్తుతం ఓటీటీల పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే వారంలో సంక్రాంతి సందడి మొదలు కానుంది. ఇప్పటికే పొంగల్‌కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. ఈ వారంలో దాదాపు థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ కానున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆరాటంతో ఉన్నారు. ఈ వీకెండ్లో మిమ్మల్ని అలరించేందుకు పలు చిత్రాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ వారంలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ -2 లాంటి సినిమాలు కాస్తా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీకీ రానుందో ఓ లుక్కేద్దాం. ఈ వీకెండ్లో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2(దక్షిణ కొరియా సిరీస్)- జనవరి 5 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 క్రంచీ రోల్ సోలో లెవెలింగ్- (సౌత్ కొరియా సిరీస్)- జనవరి 6 -
న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈ సోమవారంతో కొత్త సంవత్సరం మొదలైంది. 2024కి స్వాగతం పలుకుతూ తెలుగు ప్రేక్షకులు బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు ఈ వారమంతా కూడా ఇదే మూడ్‌లో ఉంటారు. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారమైతే థియేటర్లలో చెప్పుకోదగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఇందుకు తగ్గట్లే ఈ వారం కూడా బోలెడన్ని కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు.. పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ 2 చిత్రాలు కాస్త స్పెషల్‌గా కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ (జనవరి 01 నుంచి 07 వరకు) నెట్‌ఫ్లిక్స్ బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 01 ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01 మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ) - జనవరి 01 యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01 డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 హాట్‌స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) - జనవరి 01 మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) - జనవరి 01 ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో నాల్ 2 (మరాఠీ సినిమా) - జనవరి 01 ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 (ఇదీ చదవండి: ) -
ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరోయిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్. 2006లో బాలీవుడ్ హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగింది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే రేంజ్‌కు చేరుకుంది. అయితే సినిమాలతో పాటు అంతేస్థాయిలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోన్న కంగనా.. ఈ ఏడాది తేజస్ మూవీతో అభిమానులను పలకరించింది. అక్టోబర్ 27న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రముఖి -2 తర్వాత నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి జీ5 స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించగా.. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. View this post on Instagram A post shared by ZEE5 (@zee5) -
మరిన్ని యుద్ధ విమానాలు భారత్‌కు.. రక్షణ శాఖ అనుమతి
భారత రక్షణ దళంలోని వాయుసేన విభాగం పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రక్షణ దళ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తేలికపాటి యుద్ద విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా మరో 97 తేజస్ యుద్ధ విమానాలను, 156 ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. ఈ రెండు రకాల విమానాలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయనున్నారు. దేశీయ కంపెనీల నుంచి రూ.1.5 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) గురువారం ఆమోదం తెలిపింది. వీటి ఒప్పందాల విలువ సుమారు రూ. 1.1 లక్షల కోట్లు ఉండనుంది. అదనంగా భారత వైమానిక దళం కోసం తేజస్ మార్క్ 1-ఏ యుద్ధ విమానాలు.. వైమానిక దళం, సైన్యం కోసం హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ సుమారు రూ. 2 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించనుంది. రాబోయే కొన్నేళ్లలో భారత వైమానిక దళంలో అమ్ముల పొదలో కొత్త యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే.. భారత్ చరిత్రలోనే స్వదేశీ సంస్థ తయారుచేయనున్న అతిపెద్ద ఆర్డర్ కానుంది. ఇప్పుడే అనుమతి లభించిన నేపథ్యంలో విమానాలు రూపుదిద్దుకునే వరకు సమయం పట్టనుంది. అయితే విదేశీ తయారీదారులు భాగస్వామ్యం అయితే తక్కువ కాలంలో పూర్తిచేసే అవకాశం ఉంది. -
తేజస్‌లో మోదీ
సాక్షి బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు విచ్చేసిన సందర్భంగా దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ప్రయాణించారు. యుద్ధ విమానంలో దేశ ప్రధాని ప్రయాణించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. శనివారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు చెందిన తయారీయూనిట్కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. పైలట్ యూనిఫామ్ ధరించి తేజస్ యుద్ధ విమానంలో సుమారు 10 నిమిషాల పాటు ప్రయాణించారు. తన యుద్దవిమాన ప్రయాణం తాలూకు ఫొటోలు, వీడియోలను ఆ తర్వాత ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘తేజస్‌లో ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయాణ అనుభవం భారతదేశ దేశీయ సామర్థ్యాలపై నా నమ్మకాన్ని మరింతగా పెంచింది. దేశీయ టెక్నాలజీ, వైమానిక సత్తా, కృషి, అంకితభావం చూస్తే గర్వంగా ఉంది. స్వావలంబనలో ప్రపంచంలోని ఏ దేశంతోనూ భారత్ తీసిపోదు. భారతీయులుగా మనందరం ఈ విషయంలో భారత వాయుసేన, డీఆర్డీవో, హాల్‌ను అభినందించాల్సిందే’’ అని మోదీ ట్వీట్‌చేశారు. విమాన ప్రయాణం తర్వాత హాల్లోని తయారీ కేంద్రం పనితీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. -
ఢిల్లీ : తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్‌ను నేడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వదేశంలో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానంలో పర్యటించారు. స్వదేశీ తయారీ సామర్థ్యం పట్ల నమ్మకం కలిగిందని చెప్పారు. హాల్లో తయారీ కేంద్రం వద్ద జరుగుతున్న పనులను ఆయన సమీక్షించారు. తేజస్‌లో విహరించిన ఫొటోలను ప్రధాని అధికారిక ఖాతా నుంచి పంచుకున్నారు. "తేజస్‌పై ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం మన స్వదేశీ సామర్థ్యంపై విశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. మన జాతీయ సామర్థ్యంపై కొత్త ఆశావాదాన్ని పెంపొందించింది." అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national potential. pic.twitter.com/4aO6Wf9XYO — Narendra Modi (@narendramodi) November 25, 2023 ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ తయారీపై ఎక్కువ దృష్టి పెట్టింది. స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఇప్పటికే ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా Mk-II-Tejas యుద్ధ విమాన ఇంజన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి అమెరికా రక్షణ దిగ్గజం జీఈ ఏరోస్పేస్.. హాల్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లకు చేరాయని ఈ ఏడాది ఏప్రిల్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశానికి అపురూపమైన విజయమని ఆయన అన్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: No Non Veg Day In UP: యూపీలో నేడు 'నో నాన్ వెజ్ డే'.. యోగీ సర్కార్ ప్రకటన -
యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!
ఇటీవలే చంద్రముఖి-2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం తేజస్. వైమానిక దళం పైలట్‌గా ఈ చిత్రంలో కంగనా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తాజాగా తేజస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇవాళ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. (ఇది చదవండి: యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!) ట్రైలర్ చూస్తే ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్లో కంగనా రనౌత్‌ని శక్తివంతమైన వైమానిక దళ పైలట్‌గా కనిపించారు. ఈ చిత్రంలో దేశం కోసం పోరాడుతూ వైమానిక దళంలో పని చేస్తున్న కంగనా వైమానిక యుద్ధ విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రవాదంపై పోరాడే కథనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ చిత్రాన్ని సర్వేశ్ మెవారా దర్శకత్వంలో రూపొందించగా.. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, ఆశిష్ విద్యార్థి, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 27, 2023న థియేటర్లలో సందడి చేయనుంది. -
భారత వాయుసేనలోకి తేజస్
సాక్షి, బెంగళూరు: భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ తయారీ రంగాన్ని రక్షణ రంగంలో విస్తరిస్తున్న హెచ్ఏఎల్ కృషిని ఆయన కొనియాడారు. ప్రపంచ స్థాయి విమానాల డిజైన్, అభివృద్ధి తయారీలో మన దేశానికి అమోఘమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత వాయుసేనలో శిక్షణ ఇవ్వడానికి తేజస్ అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉందని, అవసరమైతే యుద్ధ రంగంలో కూడా సేవలు అందిస్తుందని హాల్ వెల్లడించింది. తక్కువ బరువు కలిగి ఉండి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలిగిన 4.5 జనరేషన్‌కు చెందిన యుద్ధ విమానం తేజస్. రెండు సీట్లు ఉండేలా డిజైన్ చేయడం వల్ల అప్పుడే వాయుసేనలో అడుగు పెట్టిన పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. -
యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్. 2006లో బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ..వరుస సినిమాతో తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగింది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే రేంజ్‌కి ఎదిగింది. బాలీవుడ్ పెద్దలను ఎదురించి ఫైర్ బ్రాండ్‌గా మారింది. అందరి హీరోయిన్లలా కమర్షియల్‌గా కాకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ చిత్రాన్ని అంగీకరిస్తుంది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన చంద్రముఖి 2 విడుదలైంది. త్వరలోనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీ ‘తేజస్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా కనిపించనుంది. అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ని షూరూ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2న ఈ మూవీ టీజర్‌ని విడుదల చేయాలని టీమ్ భావిస్తోందట. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. -
INS Vikrant : తూర్పు నౌకా దళం చారిత్రాత్మక ముందడుగు
ఆత్మ నిర్భర భారత్ దిశ గా భారత్ సొంతంగా రూపొందించిన యుద్ద నౌక విక్రాంత్. ఐఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకా పై తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను దింపింది నేవీ సిబ్బంది. తద్వారా భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలికింది. సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: రక్షణ రంగంలో పాటవ ప్రదర్శనలో భారత నౌకాదళం మరో కీలక అడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ప్రదర్శనకు వేదికగా మారింది. భారత సముద్రజలాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా లైట్ కాంబోట్ ఎయిర్‌క్రాఫ్ట్స్(ఎల్సీఏ)ని నేవీ పైలట్లు సోమవారం వేర్వేరు ట్రయల్స్‌లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌పై స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడం శుభపరిణామమని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు అభినందనలు తెలిపాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది అతివేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేసే ఈ ఐ ఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధనౌక పై అతి వేగంగా ప్రయాణించే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. ఈ ప్రక్రియ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధనౌకలపై విమానాలు దిగే సాంకేతిక పరిజ్ఞానం భారత్ వినియోగిస్తుంది. ఇప్పుడు భారతదేశ తొలిసారిగా విమాన వాహక యుద్ధనౌకను సిద్ధం చేసుకోవడంపై భారతీయులు గర్వపడుతున్నారు. విక్రాంత్‌పై మిగ్–29కే రయ్..రయ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా మిగ్–29కే యుద్ధ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దీనికి సంబంధించిన పరీక్షల్ని సముద్ర జలాల్లో సోమవారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. 2.5 సెకన్లలో 240 నుండి 0 కి.మీ సముద్ర ట్రయల్స్‌లో భాగంగా స్వదేశీ యుద్ధ విమానం తేజస్.. విజయవంతంగా బయలుదేరి విమాన వాహక నౌక ఫ్లైట్ డెక్‌పై ల్యాండ్ అయింది. ఈ నేవల్ వేరియెంట్ జెట్ మిషన్కి నేతృత్వం వహించారు కామ్రేడ్ జైదీప్ మావోలంకర్(రిటైర్డ్). చిన్న నౌక మీద ల్యాండ్ కావడం అంటే చాలా కష్టతరమైన వ్యవహారం. కేవలం 2.5 సెకండ్లలోనే గంటకు 240 కిలోమీటర్ల నుంచి సున్నాకు జెట్‌ను అదుపు చేయడం పైలట్లకు ఛాలెంజ్‌తో కూడిన వ్యవహారం. ఆ టైంలో ల్యాండింగ్‌పై నియంత్రణ కూడా కష్టమేనని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్.. భారత నౌకాదళం కోసం కేరళలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) నిర్మించిన విమాన వాహక నౌక. 45,000 టన్నుల బరువున్న ఈ నౌకను.. ₹ 20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌తో యుద్ధ విమానాల అనుసంధానం 2023 మే లేదంటే జూన్ నాటికి పూర్తవుతుందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ గతంలో వెల్లడించారు. మరో విశేషం ఏంటంటే.. ఐఎన్ఎస్ విక్రమాదిత్యా డెక్ మీద తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ప్రొటోటైప్‌ను కామ్రేడ్ మావోలంకర్ స్వయంగా ల్యాండ్ చేయడం గమనార్హం. తద్వారా అలాంటి ఘనత సాధించిన కొద్ది దేశాల సరసన భారత్ నిలిచినట్లయ్యింది. -
మన ‘తేజస్’పై 6 దేశాల ఆసక్తి..రక్షణ శాఖ సహాయ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెప్పారు. తేజస్‌ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్ మలేషియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ప్రాథమిక టెండర్‌ను హెచ్ఏఎల్ స్వీకరించిందని అన్నారు. ట్విన్–సీటర్ వేరియంట్ తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని వెల్లడించారు. కాలంచెల్లిన రష్యన్ మిగ్–29 ఫైటర్ విమానాల స్థానంలో తేజస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు అజయ్ భట్ సమాధానమిచ్చారు. స్టీల్త్ ఫైటర్ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ‘అటనామస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్’ను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి తేజస్ యుద్దవిమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఏఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. -
తేజస్ ముగింపు పార్టీలో కంగనా.. గోల్డెన్ గౌనులో తళుక్కుమందిగా
బాలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలకు నిలయంగా మారింది కంగనా రనౌత్(Kangana Ranaut ). తాజాగా 1947లో వచ్చిన భారతదేశ స్వాతంత్యం ఓ భిక్షగా అభివర్ణించి పెద్ద దుమారాన్నే రేపింది. ఇదిలా ఉండగా కంగనా రాబోయే చిత్రం 'తేజస్' ముగింపు పార్టీలో తన అందచందాలతో కనువిందు చేసిందీ క్వీన్. ఈ పార్టీలో గాల్వన్ లండన్ గోల్డెన్ ఈవెనింగ్ గౌన్‌లో కంగనా తళుక్కుమంటు మెరిసింది. మినిమిలిస్టిక్ మేకప్ వేసుకుని తన సహజమైన కర్ల్స్ హేయిర్‌తో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సెలబ్రిటీల ఫొటోగ్రాఫర్ వైరల్ భయాని షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) 'తేజస్'లో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ 'తేజస్ గిల్' పాత్రలో కనిపించనుంది. సర్వేష్ మేవారా ఈ చిత్రానికి రచన, దర్శకత్వం చేశారు. 2016లో భారత వైమానిక దళం మహిళలను పోరాటల్లోకి ప్రవేశపెట్టిన దేశ రక్షణ దళాలలో మొదటిది. ఈ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమే తేజస్. కంగనా చేతిలో 'మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిద్దా', 'ఎమర్జెన్సీ', 'ది ఇంకర్నేషన్: సీత' వంటి ఇతర ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) -
‘తేజస్’లో విహారం అద్భుతం
సాక్షి, బెంగళూరు: రూ.35 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆయన శుక్రవారం కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ)ను సందర్శించారు. ఈ సందర్భంగా తేజస్ ఎల్సీఏ (లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) విమానంలో విహరించారు. కాక్‌పిట్‌లో కూర్చున్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తేజస్ యుద్ధ విమానంలో విహరించడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేషనల్ కాంక్లేవ్ ప్రారంభోత్సవానికి రాజ్‌నాథ్ హాజరయ్యారు. 1971 నాటి ఇండో–పాక్ యుద్ధం బ్రోచర్‌ను ఆవిష్కరించి.. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శిక్షణ పూర్తి చేసుకున్న 1,185 మంది పైలెట్లను రాజ్‌నాథ్ అభినందించారు. -
తేజస్ ప్రధాన విడి భాగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మితమవుతున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు అవసరమైన ప్రధాన భాగం (సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్) దేశీయంగా సిద్ధమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఈఎం టెక్నాలజీస్‌లో తయారైన తొలి సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్‌ను సోమవారం తేజస్ రూపొందిస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు అందజేశారు. వీఈఎం టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు చేతుల మీదుగా తొలి యూనిట్ దస్తావేజులను హెచ్ఏఎల్ సీఎండీ ఆర్.మాధవన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కేంద్రం ఇటీవల ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని హెచ్ఏఎల్ 2011లోనే ప్రారంభించిందని పేర్కొన్నారు. తేజస్‌లోని ప్రధాన భాగాలను ఐదు ప్రైవేట్ కంపెనీలు చేపట్టాయని, మధ్య భాగమైన సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్ తయారీని వీఈఎం టెక్నాలజీస్ తక్కువ సమ యంలో పూర్తి చేసిందని కొనియాడారు. ఎల్సీఏ మార్క్–1 కోసం మొత్తం 83 యూనిట్లు అవసరం కాగా, కొన్ని మార్పులతో ఎల్సీఏ మార్క్–2 కోసం మరో 120 యూనిట్ల అవసరమని చెప్పారు. నావికాదళం, ఇతర విమానాల కోసం మరో 100 యూనిట్లు కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
వచ్చే ఏడాదిలో తేజస్ మార్క్–2
న్యూఢిల్లీ: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బహుళ ప్రయోజక యుద్ధ విమానం తేజస్ సరికొత్త రూపంతో వచ్చే ఏడాదిలో తయారవుతుందని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సీఎండీ ఆర్.మాధవన్ వెల్లడించారు. తేజస్ మార్క్–2లో మరింత శక్తివంతమైన ఇంజిన్, ఎక్కువ బరువులు మోసే సామర్థ్యం, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంటాయని వివరించారు. తేజస్ మార్క్–2 తయారీ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయనీ, 2023లో హైస్పీడ్ ట్రయల్స్ మొదలవుతాయన్నారు. 2025 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త వెర్షన్ జెట్ మరింత పెద్దదిగా ఉండటంతోపాటు ఎక్కువ దూరం ప్రయాణించలగలదనీ, నిర్వహణ కూడా మరింత తేలిగ్గా ఉంటుందన్నారు. హెచ్ఏఎల్ తయారు చేసిన తేజస్ మార్క్–1ఏ రకం 73 జెట్ విమానాలను రూ.48 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జనవరి 13న అంగీకారం తెలిపిందన్నారు. వీటి ఉత్పత్తి 2028 వరకు కొనసాగుతుందని చెప్పారు. మార్క్–2 జెట్ల తయారీ 2025 మొదలై 6 నుంచి 8 ఏళ్ల నడుస్తుందన్నారు. దీంతోపాటు, 5 బిలియన్ డాలర్ల మేర ఖర్చయ్యే 5వ తరం మీడియం ఫైటర్ జెట్ విమానం తయారీపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దీని నమూనా 2026 వరకు సిద్ధమవుతుందనీ, ఉత్పత్తి 2030 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెచ్ఏఎల్, డీఆర్డీవోతోపాటు మరో రెండు ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశాలున్నాయని మాధవన్ తెలిపారు. ఇందులో రూ.2,500 కోట్ల పెట్టుబడి ప్రైవేట్ సంస్థలది కాగా, మిగతాది తాము భరిస్తామన్నారు. చైనా జేఎఫ్–17 యుద్ధ విమానం కంటే తేజస్ మార్క్–1ఏ జెట్ ఎంతో మెరుగైందని ఆయన వివరించారు. ఇంజిన్, రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలతోపాటు సాంకేతికత పరంగా కూడా చైనా జెట్ కంటే మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పారు. -
నేనూ బాలీవుడ్‌కి ఇచ్చాను!
ఒకటి ఎయిర్‌ఫోర్స్ పైలట్ పాత్ర.. మరొకటి గూఢచారి పాత్ర. రెండూ సీరియస్ పాత్రలే. సీరియస్‌గా తీసుకుని చేయాల్సిన పాత్రలు. అందుకే కంగనా రనౌత్ చాలా సీరియస్‌గా శిక్షణ మొదలుపెట్టారు. ‘తేజస్’ అనే చిత్రంలో ఆమె ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గానూ ‘ధాకడ్’లో గూఢచారిగానూ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల కోసమే శిక్షణ తీసుకుంటున్నారు. ‘‘వరుసగా రెండు యాక్షన్ చిత్రాలు చేయబోతున్నాను. ఆషామాషీ విషయం కాదు. అందుకే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. బాలీవుడ్ నా ప్లేట్‌కి చాలా ఇచ్చింది. కానీ ‘మణికర్ణిక’ తర్వాత నేను కూడా బాలీవుడ్‌కి ఓ మంచి యాక్షన్ హీరోయిన్ని ఇచ్చాను (ఈ చిత్రంలో తను చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రను ఉద్దేశించి)’’ అన్నారు కంగనా రనౌత్. కిక్ బాక్సింగ్, పిల్లిమొగ్గలు వేయడం.. ఇలా ట్రైనింగ్‌లో భాగంగా చాలా నేర్చుకుంటున్నారు కంగనా. శిక్షణ తీసుకుంటున్న కంగనా -
సిప్లా- తేజస్ నెట్వర్క్స్ .. అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం సిప్లా లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ నుంచి ఆర్డర్‌ను పొందినట్లు బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీ తేజస్ నెట్వర్క్స్ వెల్లడించింది. దీంతో రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. సిప్లా లిమిటెడ్ షేరు 52 వారాల గరిష్టానికి చేరగా.. తేజస్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. సిప్లా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సిప్లా నికర లాభం 27 శాతం పెరిగి రూ. 566 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం బలపడి రూ. 4346 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. దేశీ బిజినెస్ 10 శాతం వృద్ధితో రూ. 1608 కోట్లకు చేరినట్లు సిప్లా పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు మరింత అధికంగా 64 శాతం జంప్‌చేసి రూ. 457 కోట్లను తాకినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సిప్లా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లింది. రూ. 793కు చేరింది. ఇది 52 వారాల గరిష్టం కాగా.. గత 6 నెలల్లో ఈ షేరు 74 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. తేజస్ నెట్వర్క్స్ మౌలిక సదుపాయాల దిగ్గజం ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ నుంచి GPON ఆధారిత ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొడక్టుల సరఫరా కోసం ఆర్డర్ లభించినట్లు తేజస్ నెట్వర్క్స్ తాజాగా పేర్కొంది. రూ. 66 కోట్ల విలువైన ఈ ఆర్డర్లో భాగంగా గరిష్ట పనితీరు చూపగల మెట్రో ఇథర్నెట్ స్విచెస్‌ను సైతం సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో తేజస్ నెట్వర్క్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 64 సమీపంలో ఫ్రీజయ్యింది. -
వాయుసేనలోకి ‘తేలికపాటి’ తేజస్
కోయంబత్తూరు: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తన తొలి లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్సీఏ) తేజస్ ఎంకే–1ను బుధవారం స్క్వాడ్రన్ నం.18 ఫ్లయింగ్ బుల్లెట్స్‌లోకి ప్రవేశపెట్టింది. తమిళనాడులోని కోయంబత్తూరు శివార్లలో సూలూరులో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హెచ్ఏఎల్) రూపొందించింది. ఈ సందర్భంగా హెచ్ఏఎల్ చైర్మన్, ఎండీ ఆర్.మాధవన్ సంబంధిత పత్రాలను ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాకు అందజేశారు. తేజస్ ఎంకే–1 నాలుగోతరం సూపర్‌సానిక్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో అతి తేలికైన, చిన్నదైన యుద్ధ విమానం. ప్రత్యేకతలు.. ► ఒక ఇంజిన్, డెల్టా వింగ్‌తో కూడిన నాలుగో తరం యుద్ధ విమానం. ► హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని డిజైన్ చేసింది. ► ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ► బరువు 6,560 కిలోలు ► 15 కిలోమీటర్ల ఎత్తులోనూ పనిచేయగలదు. ► పొడవు 13.2 మీటర్లు... పరిధి ► 1,850 కిలోమీటర్లు తేజస్ చరిత్ర ► 1983: మిగ్–21 విమానాల స్థానంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తేలికపాటి యుద్ధ విమానాన్ని సిద్ధం చేసే ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ► 1986: తేలికపాటి యుద్ధ విమానం లేదా ఎల్సీఏ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.575 కోట్లు కేటాయించింది. ► 2001: ఎల్సీఏ తొలి ప్రయోగాత్మక పరీక్ష ► 2003: ఎల్సీఏకు ‘తేజస్’ అని నామకరణం చేసిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ► 2016: భారతీయ వాయుసేనలోని 48వ స్క్వాడ్రన్‌లో తొలిసారి తేజస్ నియామకం. బహ్రెయిన్‌లో తొలిసారి అంతర్జాతీయ వేదికపై తేజస్ ప్రదర్శన ► 2017: 68వ గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారి తేజస్ ప్రదర్శన ► 2018: వాయుసేన నిర్వహించిన గగన్ శక్తి కార్యక్రమంలో సత్తా చూపిన తేజస్ ► 2020: వాయుసేన 18వ స్క్వాడ్రన్‌లోకి తేజస్. -
తేజస్ విమానం నడిపిన ఎయిర్ చీఫ్ మార్షల్
సాక్షి, చెన్నై: భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా బుధవారం ఎంకే1 తేజస్ తేలికపాటి యుద్ధ విమానంలో విహరించారు. తమిళనాడులోని సూలూరు ఎయిర్‌స్టేషన్‌లో ఈ విమానాన్ని ఆయన పరిశీలించారు. ఇది నాలుగో తరం సూపర్సోనిక్ విమానాల్లో చిన్న ది, తెలికపాటిది. ఈ విమానాలను ఫ్లయింగ్ బుల్లెట్లుగా పిలుస్తారు. (హద్దు మీరుతున్న డ్రాగన్) తేజస్ విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా స్వయంగా నడిపారు. ఈ విమానాన్ని కోయంబత్తురు సమీపంలో ఉన్న సూలూరు 45వ స్కాడ్రన్ చేర్చారు. దీంతో సూలూరు ఎయిర్‌స్టేషన్ తేజస్ విమానాలను కలిగి ఉన్న రెండో ఐఏఎఫ్ స్కాడ్రన్గా నిలుస్తోంది. ఈ తేజస్ విమానం స్వదేశి పరిజ్ఞనంతో తయారు చేయబడింది. (మేకలు అమ్మి సొంతూరికి పయనం) -
ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కంగనా.. ఫస్ట్ లుక్
ముంబై : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల నటించిన ‘పంగా’ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. మహిళా కబడ్డీ మాజీ చాంపియన్ జయా నిగమ్ నిజజీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలోని కంగన నటకు మంచి మార్కులే పడినప్పటికీ మూవీ కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయింది. ఇటీవల కంగనా నటించిన క్వీన్ సినిమాకు పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంగనా ‘తలైవి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎంజీఆర్‌గా అరవిందస్వామి కనిపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాకు కంగనా ఓకే చెప్పారు. సర్వేశ్ మేవర దర్శకత్వంలో రూపొందుతున్న ‘తేజస్’ మూవీలో కంగనా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇందులో యుద్ధ విమానం నడిపే పైలెటగా ఆమె కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇందులో ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కనిపిస్తున్న కంగనా లుక్కు అభిమానులు ఫిదా అవుతూ..ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని తన నటనతో కంగనా మరోసారి అద్భుతమైన నటిగా రుజువు చేసుకోనున్నారని అభిమానులు అభిపప్రాయపడుతున్నారు. రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్లో వార్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. View this post on Instagram For all the brave hearted and strong headed women in Uniform who make sacrifices for our nation day in and day out .... Kangana to play an airforce pilot in her next , titled - #TEJAS . . #KanganaRanaut @team_kangana_ranaut #RonnieScrewvala @sarveshmewara @nonabains @rsvpmovies A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Feb 16, 2020 at 7:35pm PST -
పైలెట్ కంగనా
ఈ ఏడాది ద్వితీయార్ధంలో పైలెట్‌గా గగనతలంలో విహరించనున్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. సర్వేష్ మేవరా దర్శకత్వంలో రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్లో తెరకెక్కనున్న వార్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు ‘తేజస్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా నటించనున్నారట. ‘‘చిన్నతనం నుంచే మన సైనిక బలగాలంటే నాకు చాలా గౌరవం. దేశం, ప్రజల రక్షణ కోసం వారు చేస్తున్న సేవలు, త్యాగాలు చాలా గొప్పవి. సోల్జర్ పాత్రలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. పైలెట్‌గా నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ‘తలైవి’ (నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్) సినిమాతో బిజీగా ఉన్నాను. ‘తలైవి’ తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటాను. అయితే ఈ షూటింగ్లో జాయిన్ అవ్వడానికంటే ముందే మా డైరెక్టర్ సర్వేష్ చెప్పినట్లు సరైన శిక్షణ తీసుకుంటాను. అప్పుడే లొకేషన్లో మా పని సులువు అవుతుంది. మంచి స్క్రిప్ట్‌ను నా వద్దకు తీసుకువచ్చి సైనికుల హీరోయిజాన్ని వెండితెరపై సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించిన సర్వేష్, రోనీగార్లకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘సోల్జర్స్లో మీకు ఎవరు స్ఫూర్తి’’ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ– ‘‘గత ఏడాది వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ గురించిన వార్తలను బాగా ఫాలో అయ్యాను. ఆ విపత్కర పరిస్థితులను అభినందన్ హ్యాండిల్ చేసిన విధానం ఆయన్ను నిజమైన హీరోని చేసింది’’ అన్నారు కంగనా. -
వాయుసేనకు 200 జెట్ విమానాలు
కోల్‌కతా: భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసే 83 ఎల్సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోందన్నారు. ఎల్సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయినందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు. -
యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
న్యూఢిల్లీ: భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ ‘ప్రయోగదశ’ విమానం.. యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతికొన్ని దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ నావికాదళ తేజస్‌ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), ఏర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సీఎస్ఐఆర్ తదితర సంస్థలు కలసి అభివృద్ధి చేశాయి. తీర ప్రాంత పరీక్ష సౌకర్యాలపై పరీక్షించిన అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై శనివారం ఉదయం 10 గంటల 2 నిమిషాలకు తేజస్ యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయించినట్లు డీఆర్డీవో ప్రతినిధి తెలిపారు. నావికాదళానికే సంబంధించిన తేజస్ లైట్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. భారత యుద్ధ విమానాల అభివృద్ధి కార్యక్రమంలో ఇదో గొప్ప మెట్టు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. -
రాజ తేజసం
బెంగళూరు: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించారు. ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపి ఎంతో థ్రిల్‌కి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి రాజ్నా›థే. బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది అని రాజ్‌నాథ్ చెప్పారు. రాజ్‌నాథ్ వెంట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ ఉన్నారు. తేజస్‌లో పైలట్ వెనక సీట్లో కూర్చొని రాజ్‌నాథ్ ప్రయాణించారు. 68 ఏళ్ల వయసున్న రాజ్‌నాథ్ స్వదేశీ యుద్ధ విమానం కావడం వల్లే తాను ఇందులో ప్రయాణించే ధైర్యం చేశానని చెప్పారు పైలట్ అవతారం అరగంటసేపు యుద్ధ విమాన ప్రయాణంలో ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. పైలట్ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ విమానాన్ని రాజ్‌నాథ్ నియంత్రించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. రాజ్‌నాథ్ విమానాన్ని నడిపిన విషయాన్ని డీఆర్డీఓ చీఫ్ డా. జీ. సతీష్ రెడ్డి వెల్లడించారు. దీనికి రాజ్‌నాథ్ స్పందిస్తూ తాను చేసింది ఏమీ లేదని పైలెట్ తివారీ చెప్పింది చెప్పినట్టుగా చేశానని నవ్వుతూ వెల్లడించారు. తేజస్ వైపు ప్రపంచ దేశాల చూపు.. యుద్ధ విమానంలో ప్రయాణించిన తర్వాత విలేకరుల సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. హాల్, డీఆర్డీఓతో పాటుగా ఈ యుద్ధ విమానం తయారీ కోసం పని చేసిన ఇతర సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘యుద్ధ విమానాల తయారీ విషయంలో మనం ఎంతో అభివృద్ధి చెందాం. మనమూ యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి’అని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యుద్ధ విమానం తేజాస్‌లో రాజ్‌నాథ్ సింగ్
-
తేజస్ ‘అరెస్టెడ్ ల్యాండింగ్’ సక్సెస్
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’మరో అరుదైన ఘనత సాధించింది. గోవాలోని ఓ నావికా కేంద్రంలో తొలిసారి విజయవంతంగా అరెస్టెడ్ ల్యాండింగ్‌ను పూర్తి చేసింది. అతి తక్కువ స్థలం మాత్రమే ఉండే విమాన వాహక నౌకలపై సమర్థవంతంగా దిగేందుకు అరెస్టెడ్ ల్యాండింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. విమానం ముందుభాగంలో ఉన్న కొక్కెం ల్యాండింగ్ సమయంలో డెక్‌పై ఉన్న ఓ తీగను అందుకోవడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంటుంది. తద్వారా తక్కువ పొడవున్న విమాన వాహక యుద్ధ నౌక రన్‌వేపై సులువుగా ల్యాండ్ అవుతుంది. నిమిషానికి 1,500 అడుగుల వేగంతో ప్రయాణిస్తూ.. యుద్ధ విమానానికి ఏ మాత్రం నష్టం కలగకుండా ల్యాండ్ కావడం ఈ ప్రక్రియలోని విశేషం. ఇది విజయవంతంగా పూర్తవడంతో నేవీలోనూ తేజస్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. నేవీ కోసం ప్రస్తుతం రెండు తేజస్ విమానాలను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఒకే ఒక్క సీటుండే తేజస్‌తో అరెస్టెడ్ ల్యాండింగ్ విజయవంతం కావడంతో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తరువాత ఈ సామర్థ్యమున్న యుద్ధ విమానాన్ని రూపొందించిన ఘనత భారత్‌కే దక్కింది. మరి కొన్నిసార్లు ఇదే ఫలితాలను సాధిస్తే పరీక్ష కేంద్రంలో కాకుండా అసలైన యుద్ధనౌకపై అరెస్టెడ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు మొదలవుతాయి. -
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా ‘RDX లవ్’
ఆర్ఎక్స్ 100 సినిమాతో అలరించిన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్(RDX లవ్) . తేజస్ కంచెర్ల హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని, సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ విక్టర్ వెంకటేశ్ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్‌తో పాటు ‘పవర్’ చిత్ర దర్శకుడు డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ), చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌కు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత సి.కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. శంకర్ భాను రచనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. -
సగం విరాళానికి...
తేజస్, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్ హీరో హీరోయిన్లుగా ఎం.వి. ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మనసా.. వాచా’. నిశ్చల్ దేవా–లండన్ గణేష్ నిర్మించిన ఈ సినిమా ఎం.జి.ఎం (మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా ఈ నెల 15న విడుదలవుతోంది. ఎం.వి.ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు మందులు వేసుకుని నయం చేసుకుంటాం. క్యాన్సర్ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పని చేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో సగం క్యాన్సర్ వ్యాధికి ఉచితంగా వైద్యం అందించే సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘లైఫ్ స్టైల్, తులసిదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను ‘మనసా.. వాచా’ కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. ఎం.వి. ప్రసాద్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు నిశ్చల్ దేవా. ‘‘ఇంత మంచి సినిమా మా ఎం.జి.ఎం ద్వారా రిలీజవ్వడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎం.జి.ఎం అధినేత అచ్చిబాబు. -
తేజన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పీవీ సింధు చక్కర్లు
-
తేజస్‌లో విహరించిన పీవీ సింధు
సాక్షి, బెంగళూరు: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. ఏరో ఇండియా షోలో వుమెన్స్ డే సందర్భంగా ఏవియేషన్ అధికారులు సింధుకు ఈ అవకాశం కల్పించారు. ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా ఏరో ఇండియా ఇవాళ పలు కార్యక్రమాలను చేపట్టింది. దానిలో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. వీరితో పాటు పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విమానం కూడా ఎగరనుంది. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపారు. Badminton player PV Sindhu waves as she is about to take off for a sortie in the indigenous Light Combat Aircraft - Tejas in Bengaluru. #AeroIndia2019 pic.twitter.com/KvYkPLiGT5 — ANI (@ANI) 23 February 2019 -
ఏరో ఇండియా - 2019 ప్రదర్శనలో తేజోస్
-
ప్రేమికుల లక్ష్యం
‘‘లైఫ్ స్టైల్, తులసీదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను కథ నచ్చడంతో ‘మనసా.. వాచా’ సినిమాతో నిర్మాతగా మారాను. దర్శకుడు ఎం.వి.ప్రసాద్ ప్రాణం పెట్టి ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా మొత్తం లండన్‌లో తీశాం’’ అని నిశ్చల్ దేవా అన్నారు. తేజస్ హీరోగా, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్ హీరోయిన్లుగా ఎం.వి. ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘మనసా.. వాచా’. గణేష్ క్రియేషన్స్ పతాకంపై నిశ్చల్ దేవా, లండన్ గణేష్ నిర్మించిన ఈ చిత్రం ‘ఎం.జి.ఎం (మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా మార్చి 1న విడుదలవుతోంది. ఎం.వి.ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘విభిన్న ప్రేమ కథా చిత్రమిది. జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు మందులు వేసుకుని నయం చేసుకుంటాం. అలాగే క్యాన్సర్ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పనిచేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్‌గారు నా పాత్రని చాలా అందంగా తీర్చిదిద్దారు’’ అని కరిష్మా కర్పాల్ అన్నారు. ‘‘మనసా.. వాచా’ వంటి మంచి సినిమాని మా సంస్థ ద్వారా విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని ఎం.జి.ఎం అధినేత అచ్చిబాబు అన్నారు. -
తేజస్ డిఫెన్స్ ఆకాడమీ విద్యార్థుల అద్భుత ప్రతిభ
-
అది రాంగ్ స్టెప్
‘‘ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు రాలేదు. ఈ నేపథ్యంలోని ‘ఈ నగరానికి ఏమైంది’, హుషారు’ ఒకేసారి మొదలయ్యాయి. అయితే ఆ సినిమా రిలీజ్ అయింది. నలుగురు స్నేహితులు కలిసి చేసే సాహసాలే మా చిత్రం’’ అని తేజస్ కంచర్ల అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తేజస్, దక్ష, అభినవ్, ప్రియా ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానున్న సందర్భంగా హీరో తేజస్ చెప్పిన విశేషాలు. ∙మాది సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు. సినిమాలపై ఇంట్రెస్ట్‌తో ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టా. తేజాగారి ‘నీకు నాకు’లో హీరోగా అవకాశం ఫస్ట్ నాకే వచ్చింది. ‘అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయి, నెక్ట్స్ సినిమాలో హీరోగా చేద్దువుగానీ’ అని తేజాగారు అన్నారు. ఆ సినిమా చేయడంవల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. ∙నిర్మాత కేయస్ రామారావుగారు, మా నాన్న స్నేహితులు. దాంతో ప్రకాశ్‌రాజ్‌గారి ‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే విభిన్న కథలు ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యాను. రెండో సినిమా ‘కేటుగాడు’ చేశాను. అది రాంగ్ స్టెప్ అని అర్థం అయ్యింది. ‘హుషారు’ నా మూడో సినిమా. ఈ సినిమా మేకింగ్‌లో ఆలస్యం అయ్యింది. అయినా కూడా నిర్మాత వేణుగోపాల్‌గారు మాలో హుషారు నింపారు. ∙కాలేజ్ పూర్తయిన తర్వాత లైఫ్‌లో ఏం చేయాలి? అని ఆలోచిస్తున్న టైమ్‌లో మా ఫ్రెండ్‌కి క్యాన్సర్ వస్తుంది. అప్పుడు అతని స్నేహితులుగా మేం ఎలా రియాక్ట్ అయ్యాం? లైఫ్‌లో ఎలా ఎదిగాం? అన్నదే చిత్రకథ. ఇందులో నా రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండే ఆర్య అనే పాత్ర చేశా. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. ఇకపై లీడ్ క్యారెక్టర్స్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. పెద్ద బ్యానర్లో మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. -
నవంబర్ 16న ‘హుషారు’
‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ తరువాత ‘ మేము వయసుకు వచ్చాం’ , ‘ సినిమా చూపిస్త మావ’ లాంటి సూపర్ హిట్లు అందించారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘హుషారు’. రియాజ్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని,హేమ ఇంగ్లే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’ ఫేం రధన్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 16న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు చిత్రయూనిట్. -
గాల్లోనే ఇంధనం నింపుకున్న తేజస్
బెంగళూరు: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ మరో ఘనత సాధించింది. గాల్లో ప్రయాణిస్తూనే ఐఏఎఫ్ ఐఎల్78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. దీంతో యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో తేజస్(ఎస్ఎస్పీ8) యుద్ధవిమానం రష్యన్ తయారీ ఐఎల్–78 ఎంకేఐ ఆయిల్ ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. గంటకు 500 కి.మీ వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఫీట్‌ను సాధించింది. ఇటీవల ట్యాంకర్ విమానంతో డాకింగ్(గాల్లో అనుసంధానం కావడం) ప్రక్రియను పూర్తిచేసిన తేజస్ తాజాగా ఇంధనాన్ని నింపుకుని చరిత్ర సృష్టించింది. దీంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్‌కు ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్(ఎఫ్ఓసీ) జారీచేసేందుకు మార్గం సుగమమైంది. 123 తేజస్ మార్క్–1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) గతేడాది డిసెంబర్లో హాల్‌కు రూ.50,000 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
నౌకాదళ తేజస్ పరీక్ష సక్సెస్
బెంగళూరు / న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ నౌకాదళ వెర్షన్‌ను అధికారులు గురువారం విజయవంతంగా పరీక్షించారు. యుద్ధవాహక నౌక నుంచి టేకాఫ్ కావడం, ఆతర్వాత హుక్ వ్యవస్థ సాయంతో సురక్షితంగా ల్యాండ్ కావడం వంటి పరీక్షల్ని పూర్తిచేశారు. దీంతో ఈ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, యూరప్‌ల సరసన భారత్ చేరింది. యుద్ధ విమానం నౌకపై దిగే సమయంలో దాని వేగాన్ని అదుపు చేయడానికి ఉండే ‘అరెస్టర్ హుక్ సిస్టమ్’ను కూడా ఈ సందర్భంగా విజయవంతంగా పరీక్షించారు. రాబోయే రోజుల్లో ల్యాండింగ్, ఇంధనం నింపే విషయంలో తేజస్‌కు మరిన్ని ట్రయల్స్ నిర్వహిస్తామని నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత వాయుసేన(ఐఏఎఫ్) ఇప్పటికే 40 తేజస్ యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్కు ఆర్డర్ ఇచ్చారు. -
అమెరికా కష్టాలు
తేజస్, వంశీ కోడూరి, వైవా హర్ష, వంశీకృష్ణ, పల్లవి డోరా తారలుగా చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమీర్‌పేట్ టు అమెరికా’. స్వప్న కొమండూరి సమర్పణలో పద్మజ కొమండూరి నిర్మించారు. కార్తీక్ కొడకండ్ల స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ ఎక్సైజ్ మంత్రి పద్మారావు విడుదల చేయగా, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్వీకరించారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ– ‘‘ఇక్కడ కుటుంబాలను వదులుకొని చదువు కోసం, సంపాదన కోసం అమెరికా వెళ్లి అక్కడ సరైన అవకాశాల్లేక నానా ఇబ్బందులుపడే చాలామంది బాధలను ఈ చిత్రం ద్వారా చూపించడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమాని ఆదరించి హిట్ చేస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత రామ్. ‘‘ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు రామ్మోహన్ కొమండూరి. -
వాయుసేనలోకి 324 తేజస్ ఫైటర్లు
సాక్షి, న్యూఢిల్లీ : 324 తేజస్ ఫైటర్ జెట్లను వాయుసేనలోకి ప్రవేశపెట్టేందుకు భారతీయ వాయుసేన(ఐఏఎఫ్) అంగీకారం తెలిపింది. దీంతో ఎంతోకాలంగా యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల కొరతతో ఇబ్బందిపడుతున్న వాయుసేనకు ఊరట లభించనుంది. దాదాపు మూడు దశాబ్దాల పాటుగా అభివృద్ధి దశలో ఉన్న తేజస్ ఫైటర్ జెట్లు అనుకున్న స్థాయి సాంకేతికతతో సిద్ధం కాలేదు. దాదాపు రూ. 75 వేల కోట్లతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి 123 తేజస్ మార్క్ 1ఏ జెట్లను కొనుగోలు చేసేందుకు ఐఏఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన 201 జెట్లను తేజస్ మార్క్-2 సిద్ధమైన తర్వాత తీసుకుంటామని తెలిపింది. తేజస్ మార్క్ 2ను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దాలని ఐఏఎఫ్ డిమాండ్ చేస్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో), ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లు సంయుక్తంగా తేజస్ మార్క్ 2 అభివృద్ధిపై దృష్టి సారించాయి. ప్రపంచస్థాయి ఫైటర్‌గా తేజస్ మార్క్ 2ను రూపొందిస్తే 18 స్క్వాడ్రన్ల తేజస్‌లను తయారు చేసుకోవాలని ఐఏఎఫ్ భావిస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. తేజస్ గంటకు 350-400 కిలోమీటర్ల రేడియస్‌లో మాత్రమే ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో తనతో పాటు కేవలం 3 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్తోంది. మిగిలిన ప్రపంచ దేశాల వద్ద ఉన్న సింగిల్ జెట్ ఫైటర్లు అన్ని తేజస్ కంటే మెరుగ్గా ఉన్నాయి. స్వీడన్ సింగిల్ ఇంజన్ జెట్ ఫైటర్ గ్రైపెన్-ఈ తేజస్‌కు మూడు రెట్ల సామర్ధ్యాన్ని కలిగివుంది. గతేడాది జులైలో రెండు తేజస్ ఫైటర్లు ఐఏఎఫ్‌లో చేరిన విషయం తెలిసిందే. వీటి స్వ్కాడ్రన్‌కు ‘ఫ్లయింగ్ డాగర్స్ 45’ అని పేరు పెట్టారు. 2018-2020ల మధ్య ఈ స్క్వాడ్రన్‌లో పూర్తి స్థాయిలో తేజస్ ఫైటర్లు చేరుతాయి. -
తేజస్ కీలక పరీక్ష విజయవంతం
బెంగళూరు: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధవిమానం (ఎల్సీఏ) ‘తేజస్’ మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సోమవారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తేజస్ ఎల్ఎస్పీ8 విమానం తిరిగి సురక్షితంగా చేరుకోవటంతోపాటు, ఇంజిన్ ఆన్‌లో ఉండగానే ఇంధనం నింపుకుంది. ఇలాంటి సదుపాయం ఉన్న భారత వైమానిక దళ విమానాల్లో తేజస్ మొట్టమొదటిదని హాల్ తెలిపింది. తేజస్‌కు ఉన్న ఈ సౌలభ్యంతో ఇంధనం నింపుకునే సమయం సగానికి సగం తగ్గిపోతుందని వివరించింది. -
తేజస్‌లో అమెరికా వాయుసేనాధిపతి
జోధ్‌పూర్, రాజస్థాన్ : భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో అమెరికా వాయుసేన చీఫ్ ఆఫ్ స్టాఫ్, జనరల్ డేవిడ్ ఎల్ గోల్డ్‌ఫిన్ ప్రయాణించారు. ఇలా ఓ విదేశీ జనరల్ భారతీయ జెట్‌లో ప్రయాణించడం భారతీయ వాయుసేన చరిత్రలో ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పెంచుకునే దిశగా శుక్రవారం ఆయన భారత్‌కు విచ్చేశారు. శనివారం ఉదయం జోధ్‌పూర్‌లోని వాయుసేన స్థావరాన్ని సందర్శించారు. అనంతరం జనరల్ గోల్డ్‌ఫిన్‌తో కలసి వైస్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ 40 నిమిషాల పాటు తేజస్ జెట్‌లో విహరించారు. సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలను భారతీయ వాయుసేనకు అప్పగించే విషయంపై మాట్లాడిన గోల్డ్‌ఫిన్.. ఈ తరహా విమానాలను వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ఇప్పటికే రెండోస్థానంలో ఉందని చెప్పారు. అత్యవసర సమయాల్లో సీ-17 విమానాలు యుద్ధట్యాంకులను పాకిస్తాన్, చైనా దేశాల సరిహద్దులకు చేర్చగలవు. తేజస్‌లో ప్రయాణం ఇరు దేశాల వైమానిక దళాల మధ్య పెరుగుతున్న సత్సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది. మూడు దశాబ్దాల తర్వాత పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధవిమానం తేజస్ భారత వైమానిక దళంలో చేరింది. గోల్డ్‌ఫిన్ సాధారణ వ్యక్తి కాదు.. జనరల్ గోల్డ్‌ఫిన్ సాధారణ వ్యక్తి కాదు. ఇప్పటివరకూ 42 వేల గంటల పాటు యుద్ధవిమానాలను ఆయన నడిపారు. గల్ఫ్ యుద్ధం, ఆప్ఘనిస్థాన్ సంక్షోభం, యుగోస్లేవియాతో జరిగిన యుద్ధంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 1999లో ఓ ఆపరేషన్ సందర్భంగా గోల్డ్‌ఫిన్ నడుపుతున్న యుద్ధ విమానాన్ని శత్రువుల క్షిపణి కూల్చేసింది. కానీ, ఆ ప్రమాదంలో పారాచ్యూట్ ద్వారా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. -
ఎ టు ఎ మంచి విజయం సాధించాలి – మంత్రి తలసాని
‘‘ఇప్పుడు ఏ సమాచారం, వార్త కోసం అయినా ముందు వెతుకుతున్నది డిజిటిల్ మీడియాలోనే. అలాంటి డిటిజల్ మీడియాలో ప్రమోషన్స్ చేయడం వైవిధ్యం. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్న ‘అమీర్‌పేట్ టు అమెరికా’ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బ్రహ్మానందం, మణిచందన, సమ్మెట గాంధీ, రజని, వేణుగోపాల్, వేణు మాధవ్ ప్రధాన పాత్రల్లో రామ్మోహన్ కొమండూరి, భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎ టు ఎ’(అమీర్‌పేట్ టు అమెరికా). తమ సినిమా విశేషాలను పంచుకునేందుకు, ప్రమోషన్‌కు ‘ఎ టు ఎ’’ టీమ్ రూపొందించిన యాప్‌ని తలసాని విడుదల చేశారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తేజస్, పల్లవి దొర, మేఘనా లోకేష్, వంశీకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: స్వప్న కొమండూరు, కెమెరా: అరుణ్ ఐ.కె.సి, జి.ఎల్.బాబు, సంగీతం: కార్తీక్ కొడకండ్ల. -
‘తేజస్’ అద్భుతం: సింగపూర్ మంత్రి
కలైకుండ: దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అద్భుతంగా ఉందని సింగపూర్ రక్షణ మంత్రి జీ ఇంగ్ హెన్ మంగళవారం కితాబిచ్చారు. ఇది అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానమని ఆయన కొనియాడారు. పశ్చిమబెంగాల్లోని కలైకుండ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన.. ఎయిర్ వైస్ మార్షల్ ఏపీ సింగ్‌తో కలసి తేజస్ విమానంలో చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత మాట్లాడుతూ భారత వాయుసేనలోని పైలట్లకు నైపుణ్యంలో కొదవలేదనీ, అలాగే విమానాలు కూడా చాలా బాగున్నాయని హెన్ ప్రశంసించారు. అందుకే తమ సైనికులకు భారత వాయుసేనతో కలసి శిక్షణనిస్తున్నామన్నారు. తేజస్‌లో కూర్చుంటే విమానంలో కాకుండా ఏదో కారులో వెళ్తున్నట్లుగా ఉందని హెన్ ప్రశంసించారు. హెన్ బుధవారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో కలవనున్నారు. -
సిగ్గు చేటు: తేజస్ రైల్లో ప్రయాణీకుల చేతివాటం
భారతదేశపు తొలి లగ్జరీ రైలు తేజస్. సోమవారం ముంబై-గోవాల మధ్య ఈ రైలును అట్టహాసంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. ఎన్నో అత్యధునిక సౌకర్యాలున్న ఈ రైల్లో ప్రయాణీకులు వీక్షించేందుకు ప్రతి సీటు వెనుక భాగంలో ఎల్సీడీ స్క్రీన్లు, హెడ్ ఫోన్లను అమర్చారు. అయితే, సర్వీసును ప్రారంభించిన మూడు రోజుల్లోనే ప్రయాణీకులు చేతివాటం చూపించారు. మొత్తం రైలులో 20 బోగీలు ఉన్నాయి. వీటిలో కొన్ని బోగీల్లో ఎల్సీడీ స్క్రీన్లు పగలిపోయాయి. మరికొన్ని బోగీల్లో అందుబాటులో ఉంచిన హెడ్ ఫోన్లు మాయమయ్యాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్ధ కథనాన్ని ప్రచురించింది. రైలు ప్రవేశపెట్టిన మూడు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో విస్తుపోవడం రైల్వే అధికారుల వంతైంది. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తొలి లగ్జరీ రైలు తేజస్. అలాంటిది ప్రయాణీకులే సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తించడం సిగ్గు చేటు. -
తేజస్ జెట్లను వినియోగించలేం: నేవీ
న్యూఢిల్లీ: దేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తేజస్ కు సేవలను అందుకోగల సామర్ధ్యం భారత విమానవాహక నౌకలకు లేదని భారతీయ నేవీ పేర్కొంది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, అడ్మిరల్ సునీల్ లాన్బా ఓ ప్రకటన విడుదల చేశారు. తేజస్ అధిక బరువు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అధిక బరువు కలిగిన జెట్లను విమానవాహక నౌకలపై వినియోగించడం అసాధ్యమని చెప్పారు. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ నేవీకి ఉపయోగపడుతుందని తాము భావించామని చెప్పారు. దురదృష్టవశాత్తూ తేజస్ జెట్ల అధిక బరువు విమానవాహక నౌక సామర్ధ్యానికి కంటే ఎక్కువ ఉందని చెప్పారు. ప్రస్తుతం మిగ్-29కే జెట్లను విమానవాహక నౌక విక్రమాదిత్యపై వినియోగిస్తున్నామని, తర్వలో దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్ మీద కూడా మిగ్-29కేలను ఉపయోగించనున్నట్లు తెలిపారు. నేవీ వద్ద ఉన్న విమానవాహక నౌకల సామర్ధ్యానికి తగిన విధంగా ఉండే సరికొత్త జెట్ల కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు చెప్పారు. తేజస్ జెట్లకు సరిపడే విమానవాహక నౌక అవసరం నేవీకి ఉందని లాన్బా అన్నారు. నేవల్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను అభివృద్ధి చేసేందుకు డీఆర్డీవోను నేవీ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కాగా, తేజస్ ను భారతీయ వాయుదళంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి కొనుగోలు చేసిన విమానవాహక నౌకల సామర్ధ్యానికి.. మనం సొంతగా తయారుచేసే జెట్లు సరితూగకపోతే కాలానుగుణంగా టెక్నాలజీలో వచ్చిన మార్పులు అందుకు కారణంగా భావించవచ్చు. దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్(విమానవాహక నౌక)పై కూడా తేజస్ ను వినియోగించలేమని నేవీ చెప్పడం దూరదృష్టి లేకుండానే దేశీయ జెట్లు, విమానవాహక నౌకలను తయారు చేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మిగ్ విమానాలకు ప్రత్యామ్నాయంగా ఓ ఫైటర్ డెవలప్ మెంట్ ను చేయాలని 1980ల్లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1999లో విక్రాంత్ ను అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. -
‘తేజస్ కూడా రఫెల్ అంత స్ట్రాంగే’
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ కూడా త్వరలో ఫ్రాన్స్ దేశ నుంచి రాబోతున్న రఫెల్ యుద్ధ విమానాలంత పటిష్టమైనవని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ప్రపంచంలోనే ఈ తరహా యుద్ధ విమానాలు మేలైనవని, సాటిలేనివని చెప్పారు. తేజస్ యుద్ధ విమానాలను ఈ ఏడాది ప్రారంభంలో భారత సైన్యానికి అప్పగించిన విషయం తెలిసిందే. ‘ఈ విమానాలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ప్రపంచంలోని ఏ యుద్ధ విమానంతోనైనా పోటిపడే సత్తా ఉండేలా దీన్ని తయారు చేశారు. రఫెల్ యుద్ధ విమానమంతటి శక్తిమంతమైనది. అయితే, ఈ విమానం అత్యంత తేలికపాటి యుద్ధ విమానం’ అని పారికర్ అన్నారు. అయితే, రఫెల్ యుద్ధ విమానాలు తొమ్మిది టన్నుల పేలుడు పదార్థాలు మోసుకెళ్లగలిగితే తేజస్ మాత్రం మూడున్నర టన్నులు మోసుకెళుతుందని, 33 ఏళ్లపాటు తేజస్ సేవలు అందిస్తుందని తెలిపారు. -
ప్రభుత్వ షాపింగ్ లిస్టు చాలా పెద్దదే...
న్యూఢిల్లీ : మేడ్ ఇన్ ఇండియా మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోలకు ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చుచేసేందుకు సిద్ధమైంది. 83 తేలికపాటి తేజాస్ యుద్ధవిమానాలు, 15 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, 464 టీ-90 ట్యాంక్స్ కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్యానెల్ సోమవారం ఆమోదముద్ర వేసింది. తేజాస్ తయారీదారి హిందూస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఇప్పటికే 40 ఎయిర్క్రాప్ట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ ఏడాది అవి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు డెలివరీ కానున్నాయి. నిన్న ఆమోదముద్ర వేసిన తేజాస్ కొనుగోలుకు ప్రభుత్వం దాదాపు రూ.50,025 కోట్లు ఖర్చు చేయనుంది. ఆర్మీ, వైమానికదళం కోసం కొనుగోలు చేస్తున్న హెలికాప్టర్ల వ్యయం రూ.2,911 కోట్లు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తున్న ట్యాంకుల ఖర్చు రూ.13,448 కోట్లుగా ఉంది. అంతేకాక, భారత ఆర్మీ కోసం 598 మినీ మినీ మానవరహిత వైమానిక వాహనం లేదా డ్రోన్స్ కొనుగోలుకు కూడా డిఫెన్స్ అక్విషిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఎయిర్ ఫోర్స్ ఈ ఏడాది జూలైలో రెండు యుద్ధ విమానాల కొనుగోలుతో తేజాస్ స్క్వాడ్రాన్ల సంఖ్యను పెంచింది.తేజాస్‌లో లోపాలున్నప్పటికీ, ఈ ప్రొగ్రామ్‌ను ఎప్పటికీ ఉండేలా, యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు 2015లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే తేజాస్ యుద్ధవిమానాలను కొనుగోలు చేస్తూ స్క్వాడ్రాన్ల సంఖ్యను పెంచుతూ ఉంది. 83 తాజా తేజాస్ ఫైటర్స్‌తో మొత్తం ఈ జాబితా 120కు చేరుకోనుంది. ఈ డెలివరీ హెచ్ఏఎల్ ఉత్పత్తి సామర్థ్యంపై డెలివరీ ఆధారపడి ఉండనుంది.వీటి కోసం ప్రస్తుతం భారత వైమానిక దళం కొత్త పైలెట్లను నియమిస్తూ వారికి శిక్షణ కూడా ఇస్తోంది. -
ఇది యావత్ జాతికి గర్వకారణం:ధోని
బెంగళూరు:ఇటీవల భారత వైమానిక దళంలోకి తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను ప్రవేశపెట్టడాన్ని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్వాగతించాడు. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్కరికి ధోని అభినందనలు తెలియజేశాడు. వైమానిక దళంలో తేజస్ ను ప్రవేశపెట్టడం యావత్ జాతి గర్వించదగ అంశం అంటూ ధోని తాజాగా ట్వీట్ చేశాడు. ఇది భారత్ సాధించిన అరుదైన ఘనతగా పేర్కొన్నాడు. ఈ నెల ఆదిలో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' ను భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తేజస్ స్క్వాడ్రన్‌ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్‌లోకి మరో ఆరు తేజస్‌లు త్వరలోనే చేరనున్నాయి. Cngrts to IAF on their latest warbirds and every1 who were part of the project indeed a very proud moment for INDIA pic.twitter.com/de6YANPzqE — Mahendra Singh Dhoni (@msdhoni) 1 July 2016 -
భారత వైమానికదళంలోకి 'తేజస్'
బెంగళూరు: భారత వైమానిక దళం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను బెంగళూరులో శుక్రవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' చేరికతో భారత వైమానిక దళం అగ్రశ్రేణి దేశాల సరసన చేరినట్లు చెప్పొచ్చు. భారత వైమానిక దళంలో దీనిని చేర్చడానికి 33 ఏళ్ల సుదీర్ఘకాలం పట్టడం పూడ్చలేని లోటు అయినప్పటికీ.. తేజస్ చేరిక వైమానిక దళానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇవాళ జరిగిన కార్యక్రమంలో రెండు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌లను భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. మొట్టమొదటి తేజస్ స్క్వాడ్రన్‌ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్‌లోకి మరో ఆరు తేజస్‌లు త్వరలోనే చేరనున్నాయి. -
కొడుకును చంపి సాప్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
పుణె: జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళా సాప్ట్వేర్ ఇంజనీర్... కొడుకును చంపి, అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది. క్షణికావేశంతో కొడుకును అతి దయనీయంగా హతమార్చిన దీప్తి మోరె, మర్నాడు ఉదయం అపార్ట్ మెంట్ మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇనస్ట్రుమెంటల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నదీప్తి మోరె(34) కొడుకు ఆర్నవ్(5), భర్త తేజాస్‌తో కలిసి పుణేలో విలాసవంతమైన ఏరియాలో నివస్తోంది. ఏమైందో ఏమో తెలియదు గానీ భర్త వేరే గదిలో నిద్రిస్తుండగా, శనివారం తెల్లవారుఝామున దీప్తి.. కొడుకు ఆర్నవ్ గదిలోకి వెళ్లి అతడి చేతిమణికట్టు కోసి, తరువాత గొంతు నులిపి హత్య చేసింది. ఆదివారం ఉదయం ఏడుస్తూ భర్తతో ఈ విషయాన్నిచెప్పింది. అతడు ఆందోళనతో పిల్లాడి చూసేందుకు గదిలోకి వెళ్లాడు. ఇంతలో తన గదిలో గడియ పెట్టుకున్న దీప్తి బాల్కనీలోంచి దూకేసింది. తేజాస్ ఇరుగు పొరుగువారి సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో దీప్తి మోరె రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసపులు దర్యాప్తు మొదలు పెట్టారు. తనకు జీవితంలో చాలా ఆశలు ఉన్నాయని, అయితే ఏదీ తాను అనుకున్నట్టుగా జరగడం లేదనే ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఆ సూసైడ్ నోట్ లో పేర్కొంది అందుకే కొడుకుతో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో మానసిక వేదనతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి సుధాకర్ పథేర్ తెలిపారు. -
తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్
‘‘తేజస్ నాకు ‘ఉలవచారు బిర్యానీ’ సినిమా చేస్తున్నప్పట్నుంచీ తెలుసు. అతనికి సినిమా అంటే చాలా ప్యాషన్. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మించిన చిత్రం ‘కేటుగాడు’. కిట్టు నల్లూరి దర్శకుడు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నిర్మాత కె.ఎస్. రామారావు ఆవిష్కరించి ప్రకాశ్‌రాజ్‌కు అందించారు. ఈ సందర్భంగా కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా మొదలు కాకముందు తేజస్ వచ్చి కథ చెప్పాడు. చాలా బాగుంది. అలాగే చాలా ఎనర్జిటిక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. సాయికార్తీక్ చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అని చెప్పారు. మా సంస్థ నుంచి వచ్చినతొలి చిత్రం ఇదని, అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత అన్నారు. ఈ వేడుకలో హీరో తేజస్, హీరోయిన్ చాందినీ చౌదరి, నటుడు అజయ్, చిత్రసమర్పకుడు వీఎస్పీ తెన్నేటి తదితరులు పాల్గొన్నారు. -
తొలిసినిమా విడుదల కాకముందే..!
ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమాలో అవకాశం కొట్టేస్తే ఏ యువనటీనటులకైనా ఆనందంగానే ఉంటుంది. ప్రస్తుతం తేజస్ ఆ ఆనందంలోనే ఉన్నారు. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు తేజస్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరో చిత్రాన్ని అంగీకరించారు. రామకృష్ణ నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బలసాని ఈ చిత్రం నిర్మించనున్నారు. ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందించనున్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. రఘు కారుమంచి, రాజీవ్ కనకాల, అజయ్, ప్రవీణ్, సప్తగిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: రాజు, సంగీతం: సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్వీఏ ప్రకాశ్, సహనిర్మాత: ఎం. శ్రీనివాసరావు. -
వాయుసేనకు కొత్త ‘తేజస్సు’!
సాక్షి, బెంగళూరు: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) ‘తేజస్’ వాయుసేన అమ్ములపొదికి చేరేందుకు మరింత చేరువైంది. వాయుసేనలో ప్రవేశంకోసం తేజస్‌కు ఈ మేరకు ప్రాథమిక నిర్వహణ అనుమతి(ఐవోసీ-2) లభించింది. బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తేజస్‌ను వాయుసేనకు అప్పగించేందుకుగాను ‘రిలీజ్ టు సర్వీస్’ ధ్రువపత్రాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌనేకు రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అందజేశారు. అనంతరం ఆంటోనీ మాట్లాడుతూ.. తేజస్ అత్యంత యుద్ధపాటవంగల అస్త్రంగా రూపొందిందన్నారు. ఇటీవలే సర్వీసు నుంచి వైదొలగిన మిగ్-21 ఎఫ్ఎల్ యుద్ధవిమానం స్థానాన్ని తేజస్ భర్తీ చేయనుందని, తేజస్‌ను మూడేళ్లుగా పరీక్షించి, దాని సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చారన్నారు. సామర్థ్యానికి గుర్తింపుగానే వాయుసేనలో ప్రవేశం కోసం ఐఓసీ-2 లభించిందన్నారు. 2006లో తాను రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పుడు స్వదేశీ ఎల్సీఏ భవిష్యత్తుపై అనుమానాలుండేవని, అవన్నీ ఈ రోజు పటాపంచలు అయ్యాయన్నారు. జైసల్మేర్‌లో జరిపిన ఐరన్ ఫిస్ట్ (ఉక్కు పిడికిలి) పరీక్ష, ఇటీవల గోవాలో నిర్వహించిన క్షిపణి ప్రయోగాలూ తేజస్ సామర్థ్యాన్ని చాటాయన్నారు. కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌనే మాట్లాడుతూ.. ఐఓసీ రావడం తేజస్ సామర్థ్యానికి ‘ఖరారు పత్రం’లాంటిదన్నారు. తేజస్ ఒక్క ఈ ఏడాదిలోనే 500 సార్లు ఎగిరిందని, 2001 నుంచి మొత్తం 2,400 పరీక్షల్లో 3 వేల గంటలపాటు ఎగిరినా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రాజెక్టు: స్వదేశీ తేలికపాటి యుద్ధవిమానాల తయారీ కోసం రక్షణ శాఖ 1983లోనే రూ. 560 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే అనేక అవాంతరాలు, అనుమానాల మధ్య ఈ ప్రాజెక్టు మూడుదశాబ్దాలుగా సాగుతూ ఎట్టకేలకు తుదిదశకు చేరింది. తద్వారా స్వదేశీయంగాఎల్సీఏలను తయారుచేయగలిగిన అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.25 వేల కోట్లు అవుతుందని అంచనా. ఇప్పటికే అనేక పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత 2014 చివరినాటికి తేజస్ కు తుది నిర్వహణ అనుమతి (ఎఫ్‌వోసీ) లభిస్తుంది. ఆ తర్వాత ఇది వాయుసేనలో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఐవోసీ కోసం 20 విమానాలను, ఎఫ్‌వోసీ కోసం మరో 20 విమానాలను హెచ్ఏఎల్ ఉత్పత్తి చేయనుంది. -
‘తేజస్’ వెబ్సైట్ ఆవిష్కరణ
చెన్నై, సాక్షి ప్రతినిధి : వార్తల సేకరణలో పెరిగిన వేగానికి అనుగుణంగా తేజస్ కార్యకలాపాలతో వెబ్సైట్ రూపకల్పన శుభపరిణామమని గవర్నర్ కే రోశయ్య ప్రశంసించారు. తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తేజస్, చెన్నై) కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కాలంలోని వేగంతోపాటు పాత్రికేయుల పాత్ర కూడా వేగవంతమైందని చెప్పారు. 1952లో కార్బన్ కాపీపై వార్త రాసి విలేకరికి అందజేస్తే వారం, పది రోజులకు పత్రికలో ప్రచురితమయ్యేదని గుర్తుచేశారు. ఈ జాప్యాన్ని కాలదోషంగా భావించకుండా ఎంతో సంతోషించే వారమన్నారు. నేడు సభ జరుగుతుండగానే వార్తలు పంపేయడం, మీడియాలో ప్రసారం కావడం కూడా పూర్తవుతోందని చెప్పారు. నేటి వార్త మరుసటిరోజు రాకుంటే కాలదోషం పట్టినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. ఇటువంటి ఎలక్ట్రానిక్ యుగం తో పోటీపడుతున్నట్లుగా తేజస్ ఒక వెబ్‌సైట్‌ను రూపొం దించుకోవడం, దాన్ని రాజ్‌భవన్‌లో తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందకరమన్నారు. తనకు కనీసం సెల్‌ఫోన్ వినియోగించడం కూడా రాదని తెలిపారు. మాట్లాడడం మినహా ఆన్ ఆఫ్‌లు కూడా సహాయకులు చేస్తారని వివరించారు. భవిష్యత్తులో తమవంటి వారికి తేజస్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తమిళనాడు నుంచి వెలువడుతున్న తెలుగు వార్తా పత్రికల్లో తెలుగుదనాన్ని మరింతగా పెంచాలని సూచించారు. విషయ సేకరణను పెంచి పాఠకులకు అందించాలని ఒక పాఠకునిగా కోరుతున్నానని అన్నారు. తేజస్ సభ్యుల సంక్షేమ నిధికి రూ 2 లక్షల భూరి విరాళాలు ప్రకటించిన పల్లవ గ్రానైట్స్ అధినేత కే సుబ్బారెడ్డి, రూ లక్షకు హామీ ఇచ్చిన జయరాజ్ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్ సీఎండీ టీ రాజశేఖర్‌ను, వెబ్సైట్ రూపకర్త భాస్కర్‌రెడ్డిని, తేజస్ బృందాన్ని గవర్నర్ అభినందించారు. తేజస్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపునకు 12వ తరగతి కారణమైనట్లే, తేజస్ సైతం 12 ఏళ్ల ప్రస్తానా న్ని దాటేటప్పుడు వెబ్‌సైట్‌ను సిద్ధం చేసుకుందన్నారు. తమిళనాడులో పనిచేసే తెలుగు జర్నలిస్టుల వివరాలు, తేజస్ కార్యకలాపాలను ప్రపంచానికి చాటేలా వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. మంచి మనస్సు కలిగిన మచ్చలేని రాజకీయవేత్త రోశయ్య చేతుల మీదుగా వెబ్సైట్ ఆవిష్కరించుకోవడం తమకు సంతోషదాయకమన్నారు. విలేకరులకు కూడా విమర్శలేగానీ సుఖమయ జీవితం, జీతం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తేజస్ సభ్యుల సంక్షేమం కోసం శాశ్వత నిధిని ఏర్పాటు చేసి మృతి చెందిన విలేకరి కుటుంబానికి బీమా ద్వారా రూ 5 లక్షలు అందజేయనున్నామని ప్రకటించారు. సభ్యుల సంక్షేమం కోసం తేజస్‌ను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తేజస్‌కు ఊపిరిగా నిలుస్తున్న కే సుబ్బారెడ్డి, ఆరోగ్య సంజీవని వలె అండగా ఉన్న ‘ఉంగళుక్కాగ’ సునీల్ తదితరుల సహకారం మరువలేనిదని అన్నారు. తేజస్ ప్రధాన కార్యదర్శి వందన సమర్పణ చేస్తూ శాశ్వత నిధికి విరాళాలు అందించిన కల్పవృక్ష చారిటబుల్ ట్రస్ట్ (రూ 1 లక్ష), సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ (జీవితాంతం ఏడాదికి రూ 10 వేలు), తేజస్ సభ్యురాలు ఎన్ అరుణశ్రీ (రూ 25 వేలు)లకు, సభకు హాజరైన ఇతర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రముఖులు పల్లవ గ్రానైట్స్ అధినేత కే సుబ్బారెడ్డి, ఉంగళుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సునీల్, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యులు చిరంజీవి, పెరియార్ వర్సిటీ సెనేట్ సభ్యులు తంగుటూరి రామకృష్ణ, గొల్లపల్లి ఇజ్రాయల్ తదితరులు పాల్గొన్నారు.