భారత వైమానికదళంలోకి 'తేజస్'
బెంగళూరు: భారత వైమానిక దళం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను బెంగళూరులో శుక్రవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' చేరికతో భారత వైమానిక దళం అగ్రశ్రేణి దేశాల సరసన చేరినట్లు చెప్పొచ్చు. భారత వైమానిక దళంలో దీనిని చేర్చడానికి 33 ఏళ్ల సుదీర్ఘకాలం పట్టడం పూడ్చలేని లోటు అయినప్పటికీ.. తేజస్ చేరిక వైమానిక దళానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
ఇవాళ జరిగిన కార్యక్రమంలో రెండు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లను భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. మొట్టమొదటి తేజస్ స్క్వాడ్రన్ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్లోకి మరో ఆరు తేజస్లు త్వరలోనే చేరనున్నాయి.