indian air force
-
ఒకే రోజు ఐఏఎఫ్, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్‌కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో లెఫ్టెనెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ కీలక ఒప్పందం
దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. వీటి విలువ రూ. 32,000 కోట్లు కాగా ఈ డీల్ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఓ) సదుపాయాన్ని నెలకొల్పడంతో పాటు యూఎస్ నుంచి మొత్తం 31 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు గత వారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అనుమతి ఇచ్చింది. మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు.కాగా డెలావేర్లో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సు సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు జరిగిన నెలలోపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాక ఈ డీల్ మొత్తం విలువ రూ.34,500 కోట్లకు పెరగే అవకాశం ఉంది. చెన్నై సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్బందర్, ఉత్తరప్రదేశ్‌లోని సర్సావా మరియు గోరఖ్‌పూర్‌తో సహా నాలుగు సాధ్యమైన ప్రదేశాలలో భారతదేశం డ్రోన్లను ఉపయోగించనుంది.అయితే చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఈ డ్రోన్లు అవసరమని భారత్ భావిస్తోంది. ఈ డ్రోన్లు గరిష్టంగా గంటకు 442 కిమీ వేగంతో, దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. నాలుగు హెల్ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్ వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్‌పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది. -
ఎయిర్ షో విషాదం.. స్పందించిన సీఎం స్టాలిన్
చెన్నై: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షో ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు, ఆదివారం మెరీనా బీచ్‌లో వైమానిక ప్రదర్శన కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోరిన దానికి మించిని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ షో కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రమాదంపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. భారత వైమానిక దళం కోరిన దాని కంటే మించిన ఏర్పాట్లను అధికారులు చేశారని చెప్పారు. ఊహించినదానికంటే ఎయిర్‌షోకు ఎక్కువ ప్రజలు వచ్చారని తెలిపారు. ప్రజలు తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను చేరుకోవడానికి, ప్రజా రవాణాను చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ అంశాలపై మరింత శ్రద్ధ చూపుతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.కాగా చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వేడి తట్టుకోలేక, ఊపిరి అందక, లోకల్ స్టేషన్ వద్ద తొక్కిసలాట వంటి కారణాల వల్ల ఐదుగురు మరణించగా వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. -
ఎయిర్‌ఫోర్స్‌లో లైంగిక వేధింపులు.. వింగ్ కమాండర్‌పై కేసు
శ్రీనగర్: భారత వైమానిక దళంలో సీనియర్ ర్యాంక్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా ఫ్లయింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుద్గామ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.కాగా ఇద్దరు అధికారులు శ్రీనగర్ బేస్‌లోనే పనిచేస్తున్నారు. మహిళ తన ఫిర్యాదులో.. 31 డిసెంబర్ 2023న ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో సీనియర్ అధికారి వింగ్ కమాండర్ పీకే సెహ్రావత్ బహుమతి పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. బహుమతి తీసుకోమని అతని గదిలోకి పిలిచి తనతో అసహ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసినట్లు తెలిపారు. చివరికి తనను తోసేసి అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.ఈ ఘటన అనంతరం తనలో తానే మానసికంగా కుమిలిపోయానని.. ఎంతగానో భయపడ్డానని చెప్పారు. కానీ అతను మాత్రం ఏం జరగనట్లు సాధారణంగా వ్యహరించారని, కనీసం పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారులకు ఈ విషయం తెలియజేయగా వారి సాయంతో అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కల్నల్ స్థాయి అధికారిని ఆదేశించారని, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు తనతోపాటు వింగ్ కమాండర్ వాంగ్మూలాలు నమోదు చేయించుకున్నారని చెప్పారు.అనంతరం వింగ్ కమాండర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. రెండు నెలల తర్వాత మరోసారి ఫిర్యాదు చేయగా.. అధికారులు పక్షపతంతో నిందితుడికి సహకరించారని, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవనే సాకుతో కేసును నీరుగార్చరని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది.అప్పటి నుంచి అనేక సార్లు వింగ్ కమాండర్ చేతిలో వేధింపులకు గురవుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. వీటన్నింటితో మానసిక వేధనకు గురవుతున్నట్లు, ఒకానొక సమయంలో చనిపోదామని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నీసం సెలవులపై వెళ్లడానికి లేదా వేరే చోట పోస్టింగ్ కోసం అభ్యర్థించినా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని నిరంతరం భయంతో జీవిస్తున్నానని తెలిపారు. తన జీవితం మొత్తం నాశనం అయ్యిందని, పూర్తిగా నిస్సహాయకురాలిగా మారినట్లు చెప్పారు.అయితే వింగ్ కమాండర్‌పై వేధింపుల ఆరోపణల వ్యహారంపై భారత వాయుసేన స్పందించింది. ఈ కేసు గురించి తమకు సమాచారం ఉందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా శ్రీనగర్‌లోని భారత వైమానిక దళాన్ని బుద్గామ్ పోలీసులు సంప్రదించారని.. వారి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వాయుసేనకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
ఎయిర్ లిఫ్టింగ్.. నదిలో పడిపోయిన హెలికాప్టర్
డెహ్రాడున్: మరమ్మత్తులకు గురైన ఓ హెలికాప్టన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ఎంఐ-17 హెలికాప్టర్ తరలిస్తుండగా.. ఒక్కసారిగా గాలిలోనే జారి నదిలో పడిపోయింది. ఇటీవల కేదార్నాథ్ సమీపంలోని భీంబాలి సమీపంలో ఓ హెలికాప్టర్ మరమ్మతులకు గురైంది. అయితే దానిని శనివారం ఎంఐ17 హెలికాప్టర్‌తో అధికారులు లిఫ్ట్ చేశారు. తరలిస్తుండగానే ఎంఐ17 హెలికాప్టర్ తీగ తెగి నదిలో పడిపోయింది. ఈ ఘటనుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.‘‘ఎంఐ-17 హైలికాప్టర్ మరమ్మత్తులకు గురైన చిన్న హెలికాప్టర్‌ను గౌచర్ ల్యాండింగ్ స్ట్రిప్‌కు తీసుకువెళుతోంది. గాలి పీడనం, చిన్న హెలికాప్టర్ బరువు కారణంగా ఎంఐ-17 హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. అనంతరం కిందకు జారి నదిలో పడిపోయింది’’ అని జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే పేర్కొన్నట్లు జాతీయమీడియా పేర్కొంది.VIDEO | Uttarakhand: A defective helicopter, which was being air lifted from #Kedarnath by another chopper, accidentally fell from mid-air as the towing rope snapped, earlier today.#UttarakhandNews(Source: Third Party) pic.twitter.com/yYo9nCXRIw— Press Trust of India (@PTI_News) August 31, 2024 -
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్
ఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన పోర్టబుల్ హాస్పిటల్‌ను విజయవంతంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌గా పేర్కొనే ఈ ఆస్పత్రిని 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు పేర్కొంది. భీష్మా (భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి) అనే ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌ని ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సంబంధించిన వీడియోను రక్షణ శాఖ విడుదల చేసింది. ఇక.. ఇది ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ కావటం విశేషం.#IAF & #IndianArmy have jointly carried out a first-of-its-kind precise para-drop operation of Aarogya Maitri Health Cube at a high-altitude area close to 15,000 ft.These critical trauma care cubes have been indigenously developed under Project #BHISHM👉🏻https://t.co/QmA6ZYBPST pic.twitter.com/iEufwVcEG3— Defence Production India (@DefProdnIndia) August 17, 2024విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సేవలు అందించాలనే ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించినట్లు తెలిపింది. మారుమూల, పర్వత ప్రాంతాల్లో విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఇక.. పోర్టబుల్ హాస్పిటల్లో మొత్తం 72 క్యూబ్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించి 200 మందికి ఆరోగ్య సేవలందించవచ్చు. భారత వైమానికి దళానికి సంబంధించిన విమానం సీ-130జీని సాయంతో దీనిని నిర్దేశించిన ప్రాంతానికి చేరవేస్తుంది. -
సమున్న‘తరంగ్’
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలుస్తూ.. ప్రపంచ దేశాలకు ఆతిథ్యమిస్తోంది. మిలాన్, ఐఎఫ్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్ని నిర్వహించిన భారత్.. మరో కీలక విన్యాసాలకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నుంచి రెండు దశల్లో జరిగే తరంగ్‌శక్తి యుద్ధ విన్యాసాలు తమిళనాడులోని సూలూరులో జరగనున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో భారత నౌకాదళ సహకారంతో ప్రారంభం కానున్న విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొంటున్నాయి.భారత్ సత్తా చాటేలా..భారత రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచానికి చాటేలా త్రివిధ దళాల సమన్వయం ఎలా ఉంటుందో శత్రు దేశాలకు తెలియజేసేలా.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా ‘తరంగ్ శక్తి’ యుద్ధ విన్యాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత వాయుసేన, ఆర్మీ, ఇండియన్ నేవీ కలిసి నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలకు 51 దేశాలకు ఆహ్వానమందించగా.. 30కి పైగా దేశాలు హాజరవుతున్నాయి. మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకూ రాజస్థాన్‌లోని జో«ధ్‌పూర్‌లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు రష్యా, ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి.తొలి దశలో భారత నౌకాదళంతమిళనాడులో జరిగే ఫేజ్–1 విన్యాసాల్లో భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహిస్తోంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల్లో యుద్ధ నౌకలపై హెలికాప్టర్ల ల్యాండింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లపై మిగ్–29, రాఫెల్ యుద్ధ విమానాల ల్యాండింగ్, ఫైరింగ్ తదితర విన్యాసాలు నిర్వహించనున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన, అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తరంగ్ శక్తి కీలకంగా మారనుంది. సత్తా చాటనున్న ఐఏఎఫ్ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఈ విన్యాసాల్లో సత్తా చాటనుంది. ఎల్సీఏ తేజస్ యుద్ధ విమానాలు, రాఫెల్, మిరాజ్ 2000, ఎల్సీహెచ్ ప్రచండ్, ధృవ్, రుద్ర, జాగ్వర్, మిగ్–29, సీ–130, ఐఎల్–78 తదితర యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత వైమానిక దళంతో పాటుగా ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్–18, బంగ్లాదేశ్‌కు చెందిన సీ–130, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్‌కు చెందిన ఎఫ్–16, స్పెయిన్‌కు చెందిన టైపూన్, యూఏఈకి చెందిన ఎఫ్–16, యూకేకి చెందిన టైపూన్, యూఎస్ఏకి చెందిన ఏ–10, ఎఫ్–16, ఎఫ్ఆర్ఏ, సింగపూర్‌కు చెందిన సీ–130 యుద్ధ విమానాలు, బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. -
‘సుదర్శన్ ఎస్-400’ పరీక్ష విజయవంతం
భారత వైమానిక దళం ‘సుదర్శన్ ఎస్-400’ రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. భారతదేశం తన వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి రష్యాతో కలిసి ‘సుదర్శన్ ఎస్-400’ను తయారుచేసినట్లు చెప్పారు.ఈ మేరకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ..‘సుదర్శన్ ఎస్-400 రక్షణ క్షిపణి పరీక్ష విజయవంతం అయింది. శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసింది. విమానాలపై అటాక్ చేసి అవి ముందుకు కదలకుండా నిరోధించింది. ఈ వ్యవస్థ వల్ల భారత వైమానిక రక్షణ దళం మరింత పురోగమించింది. రష్యా-భారత్ కలిసి వీటిని ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో రెండు స్క్వాడ్రన్లు సిద్ధం అవుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్!సుదర్శన్ ఎస్-400 ఐదు స్క్వాడ్రన్ల కోసం గతంలో రెండు దేశాలు రూ.35,000 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎంఆర్-సామ్ క్షిపణి వ్యవస్థ భారత వైమానిక రక్షణ దళంలో చేరింది. దాంతోపాటు ‘ఇజ్రాయెలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్’ క్షిపణి వ్యవస్థ సైతం ఎయిర్‌ఫోర్స్‌లో చేరింది. తాజాగా ఎస్-400 కూడా వాటికి తోడవడంతో వైమానిక దళం గేమ్ ఛేంజర్‌గా మారిందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ కుషా’తో మరింత సమర్థవంతమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు భద్రతపై గతంలోనే కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. -
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం
-
Indian Air Force: ‘నైట్ విజన్ గాగుల్స్’తో విమానం ల్యాండింగ్
న్యూఢిల్లీ: భారత వాయుసేన(ఐఏఎఫ్) మరో అరుదైన ఘనత సాధించింది. నైట్ విజన్ గాగుల్స్(ఎన్వీజీ) సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో సీ–130జే రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. తూర్పు సెక్టార్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఒక వీడియోలో ఎన్వీజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానంలో లోపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్వీజీ విజువల్స్ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులో విభిన్నంగా ఉన్నాయి. మన దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకొనే ప్రక్రియలో భాగంగా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత వాయుసేన పేర్కొంది. నైట్ విజన్ గాగుల్స్ టెక్నాలజీతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో, రాత్రిపూట విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి, సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. -
ఈ లింక్‌పై క్లిక్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ప్రకాశం జిల్లా: కోరిశపాడు జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ (ఫొటోలు)
-
HYD: నేటి నుంచి ఏవియేషన్ షో.. ఏ గేటు నుంచి ఎవరెవరికి ప్రవేశమంటే..
హైదరాబాద్: నగరానికే తలమానికమైన ఏవియేషన్ షోకు సర్వం సిద్ధమైంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21 వరకు నిర్వహించే ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు, ఆ తర్వాత రెండు రోజులు సామాన్యులను సైతం అనుమతిస్తారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఉన్నతాధికారుల రాకను పురస్కరించుకుని 600 మంది కానిస్టేబుళ్లు, 30 మంది ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఏసీపీలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. విమానాశ్రయాన్ని డాగ్‌స్క్వాడ్‌తో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ఏ గేటు నుంచి ఎవరెవరు ప్రవేశం.. గేటు 1: చాలెట్ ఎగ్జిబిటర్లు, వీఐపీలు, అతిథులు గేటు 2: కాన్ఫరెన్స్ డెలిగేట్స్, సీఈఓ రౌండ్ టేబుల్‌కు హాజరయ్యేవారు గేటు 3: నిర్వాహకులు, చాలెట్ ఎగ్జిబిటర్స్, ప్రభుత్వ ప్రతినిధులు గేట్ 4: నిర్వాహకులు, ఎగ్జిబిటర్స్, మీడియా, బిజినెస్ విజిటర్స్ గేటు 5: ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్, ఎగ్జిబిటర్స్, వింగ్స్ ఇండియా విధులు నిర్వర్తించేవారు ► మీడియా, పాస్‌లు కలిగిన జనరల్ పబ్లిక్, ఎగ్జిట్ గేటు ద్వారా అందరూ బయటకు రావాల్సి ఉంటుంది. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో హైలైట్స్ ► కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై వింగ్స్ ఇండియా–2024ను ప్రారంభిస్తారు. ► ప్రపంప దేశాల నుంచి 130 ఎగ్జిబిటర్స్, 15 హాస్పిటాలిటీ చాలెట్స్.. 106 దేశాల నుంచి 1500 డెలిగేట్స్, 5,000 బిజినెస్ విజిటర్స్ పాల్గొంటారని అంచనా. ► 500కు పైగా బీ2జీ, బీ2బీ సమావేశాలు ► ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు అగస్తా వెస్ట్‌ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ ప్రదర్శన. ► ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థలు సీఎఫ్ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్ రాయిస్, ప్రట్ అండ్ వైట్నీల ఉత్పత్తుల ప్రదర్శన. ► యూఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్, జమైకా, మారిషస్, బెల్జియం, జర్మనీ, న్యూజిలాండ్, సౌత్‌కొరియా, గ్రీక్, మలేసియా, యూఏఈ వంటి దాదాపు 25 దేశాల ప్రతినిధులు ఏవియేషన్ ఎగ్జిబిషన్‌కు హాజరు కానున్నారు. సారంగ్ టీం స్పెషల్.. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకై క జట్టుగా పేరొందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీం ఇప్పటికే నగరానికి చేరుకుంది. హుస్సేన్‌సాగర్ వద్ద బుధవారం 5 నిమిషాల పాటు తమ విన్యాసాలను ప్రదర్శించిన అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ రిహార్సల్స్‌ను కొనసాగించింది. -
‘గగన’ విజయం
సాక్షి, హైదరాబాద్: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. దేశ సేవలో నేను మూడో తరం.. దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్ అఫీసర్‌గా చేశారు. మా నాన్న కర్నల్ రాజేశ్ రాజస్థాన్‌లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్‌లో నావిగేషన్ బ్రాంచ్‌లో సెలక్ట్ అయ్యాను. వెపన్సిస్టం ఆపరేటర్‌గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్ జాబ్. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్. నేను బీటెక్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టం అమేథీలో చేశాను. – ఫ్లయింగ్ కేడెట్ థాన్యాసింగ్, జైపూర్ నాన్నే నాకు స్ఫూర్తి... మాది వికారాబాద్ జిల్లా చీమల్‌దరి గ్రామం. నాన్నపేరు శేఖర్. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్ వైపు రాగలిగాను. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ పైలెట్ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్‌కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్‌లోని రాష్ట్రాయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సెలక్ట్ అయ్యాను. – సూర్యకిరణ్, చీమల్‌దరి, వికారాబాద్ జిల్లా భారత సైన్యంలో చేరడం నా కల.. నా పేరు లతా కౌషిక్. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా దుబల్దాన్ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్ చదివాను. డిఫెన్స్ ఫోర్స్‌లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్‌లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్‌ఫోర్స్‌కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. – లతా కౌషిక్, ఫ్లయింగ్ ఆఫీసర్, హరియాణా ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కని నేను ఫైటర్ పైలట్ అయ్యాను.. నాపేరు జోసెఫ్. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్ పైలెట్ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్‌ఫోర్స్‌కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్ తర్వాత ఎన్డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్‌ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్ పైలట్, గుంటూరు -
రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్ జిల్లా బహ్లోల్‌నగర్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ యుద్ధవిమానం సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే మిగ్-21 కూలిపోవడానికి ముందే పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ విమాన శకలాలు తగిలి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. వీరి ఇంటిపైనే విమానం కూలినట్లు తెలుస్తోంది. సాధారణ శిక్షణలో భాగంగానే బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. #WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV — ANI (@ANI) May 8, 2023 చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు
సూడాన్ అంతర్గత యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో చర్యలు చేపట్టింది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా పూడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. సూడాన్ నుంచి మరో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు మొదటి బ్యాచ్‌లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ ద్వారా 278 మంది ప్రయాణికులు సూడాన్ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. రెండో భాచ్‌లో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది. అయితే వీరిలో 160 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. కాగా సూడాన్‌లో 3 వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. Third batch comprising 135 Indians from Port Sudan arrived in Jeddah by IAF C-130J aircraft. Onward journey to India for all who arrived in Jeddah will commence shortly. #OperationKaveri pic.twitter.com/OHhC5G2Pg8 — V. Muraleedharan (@MOS_MEA) April 26, 2023 -
తవాంగ్ ఘర్షణ: ‘ఫైటర్ జెట్స్’ను రంగంలోకి దింపిన భారత్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు పేర్కొన్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా గగనతల కార్యకలాపాలు పెరిగిన క్రమంలో గగనతల పెట్రోలింగ్ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష -
ఉన్ని టోపీల ప్రదర్శనలో గిన్నిస్ రికార్డు
న్యూఢిల్లీ: వైమానిక దళ సభ్యుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన 41,541 ఉన్ని టోపీల ప్రదర్శన గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. 3 వేల మంది మూణ్నెల్లు శ్రమించి నాలుగు టన్నుల ముడి ఉన్నితో వీటిని అల్లారు. ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ 6వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని ప్రదర్శించారు. వచ్చే శీతాకాలంలో అవసరమైన వారికి వాటిని అందించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రశంసించారు. గిన్నిస్ రికార్డు గుర్తింపు పత్రాన్ని శనివారం ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు నీతా చౌధరికి అందజేశారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్. గిన్నిస్ రికార్డు పత్రం అందుకున్న సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి తదితరులు ఇలా హర్షం వెలిబుచ్చారు. The culmination of the event was celebrated today on occasion of the AFWWA Day & was attended by Hon'ble RM Shri @rajnathsingh & Hon'ble Smt @smritiirani. A world record was set, as recognised by Guiness World Records,when the caps were put on display at the location.@GWR pic.twitter.com/cuicVVJKuJ — Indian Air Force (@IAF_MCC) October 15, 2022 ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు -
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
వాయుసేన అమ్ములపొదిలోకి ప్రచండ్ హెలికాఫ్టర్లు
-
పాకిస్తాన్లోకి భారత క్షిపణులు మిస్‌ఫైర్.. ముగ్గురు అధికారులపై వేటు
సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్లోకి పొరపాటున బ్రాహ్మోస్ క్షిపణులను ప్రయోగించిన ముగ్గురు వాయుసేన అధికారులను విధుల నుంచి తొలగించింది కేంద్రం. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై న్యాయ విచారణ అనంతరం మంగళవారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం విధుల నుంచి తొలగించిన అధికారుల్లో ఓ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్ ఉన్నారు. భారత వాయుసేన తాజాగా చెప్పిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(SOP)లో చేసిన పొరపాటు వల్లే క్షిపణులు ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయి. మార్చి 9న జరిగిన ఈ ఘటన అనంతరం బ్రాహ్మోస్ క్షిపుణులు తమ భూభాగంలో పడ్డాయని పాకిస్తాన్ భారత్‌కు సమన్లు పంపి నిరసన వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక లోపం వల్లే క్షిపణులు పొరపాటున పాక్‌లో పడినట్లు భారత్ వివరణ ఇచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనే విషయాన్ని ప్రస్తావించింది. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
దుండిగల్‌లో సీజీపీ పరేడ్.. అదుర్స్!
-
క్రమశిక్షణ, అంకితభావం ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: భారత వైమానిక దళంలో చేరే అభ్యర్థులు నిరంతరం విజ్ఞాన సాధన కొనసాగించాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ మనోజ్ పాండే సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం ఏర్పరుచుకోవాలన్నారు. మన దేశ భద్రతా వ్యవస్థ చాలా విస్తృతమైందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్, హైపర్‌సోనిక్స్ వంటి సాంకేతికతలు ఇకపై సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కావని, యుద్ధ ప్రదేశాల్లోనూ భౌతికంగా అవసరం అవుతాయని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భరత’లో భాగంగా సాయుధ దళాల్లోనూ పలు సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రతీ యువ అధికారులు ఇతరులకు మార్గదర్శకులుగా నిలిచేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. మహిళలు సాయుధ దళాల్లోకి ప్రవేశించడం స్ఫూర్తిదాయకమని వివరించారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివా రం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) జరిగింది. భారత వైమానిక దళంలోని ‘ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ’లకు చెందిన 165 మంది ఫ్లయిట్ కెడెట్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మనోజ్ పాండే ప్రెసిడెంట్ కమిషన్లను ప్రదానం చేశారు. భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన అధికారులకు కూడా వింగ్స్ అవార్డులను అందించారు. అనంతరం పిప్పింగ్ సెరిమనీ, కవాతు, తేజస్, సూర్యకిరణ్, సారంగ్ బృందంతో ఏరోబాటిక్ ప్రదర్శనలు జరిగాయి. పైలెట్ల కోర్సులో మొదటి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ రాఘవ్ అరోరా.. రాష్ట్రపతి çపతకం, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డులను అందుకున్నారు. -
మిస్సైల్ రచ్చ! భారత్‌పై పాక్ సంచలన ఆరోపణలు
భారత్‌పై దాయాది పాకిస్థాన్ సంచలన ఆరోపణలకు దిగింది. భారత్‌కు చెందిన సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి తమ సరిహద్దులో కుప్పకూలిందంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసి కలకలం రేపింది. ఇది ఉల్లంఘనే అవుతుందని, దీనిపై భారత్ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలిందని పాక్ ఆరోపించింది. ప్యాసింజర్ ఫ్లయిట్లు తిరిగే ఎత్తులోనే ఈ దూసుకొచ్చిందని, పైగా అది పడిన ప్రాంతం జనావాసమని ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు పాక్ మేజర్ జనరల్, ISPR డీజీ అయిన బాబర్ ఇఫ్తికర్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపాడు. పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్.. భారత సరిహద్దు నుంచి వచ్చిన మిస్సైల్ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. మియా చన్ను సమీపంలో అది పడిపోయింది. ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే. ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ, అక్కడే ఉన్న గోడ మాత్రం నాశనం అయ్యింది అని ఇఫ్తికర్ వెల్లడించాడు. శిథిలాను బట్టి.. అదొక సూపర్ సోనిక్ మిస్సైల్ అయి ఉంటుందని భావిస్తున్నాం (BrahMos supersonic cruise missile గా అనుమానిస్తోంది పాక్). కానీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. భారత్ ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ ఘోరమైన ఉల్లంఘనను తీవ్రంగా నిరసిస్తూ.. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని భారత్‌ను హెచ్చరిస్తున్నాం అంటూ ప్రసంగించాడు ఇఫ్తికర్. ఇదిలా ఉంటే పాక్ ఆరోపణలపై అటు రక్షణ శాఖ, ఇటు భారత వాయు సేన గానీ స్పందించాల్సి ఉంది. 2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. -
రంగం లోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
-
ఆపరేషన్ గంగాకి మోదీ పిలుపు..ముమ్మరంగా తరలింపు చర్యలు!
IAF C-17 Aircraft Bring back Indian Nationals: చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ చర్యలు మరింత వేగవంతం చేసింది. అంతేకాదు రష్యా నేరుగా జనావాసాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో యుద్ధం మరింత తీవ్రమవుతోందంటూ ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయం విద్యార్థులను తక్షణమే కైవ్‌ని విడిచి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లోని భారతీయుల తరలింపు చర్యలను మరింత వేగవంతం చేసేలా ఆపరేషన్ గంగా చేపట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 భారత వైమానిక దళం తరలింపు ప్రయత్నాలు పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఐఏఎఫ్ సీ-17 విమానం సుమారు 336 మందిని తీసుకువెళ్లగలదు. అంతేకాదు దీన్ని అఫ్గనిస్తాన్ తరలింపులో ఉపయోగించారు. మానవతా సాయాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో ఇది సహయపడుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ భారత వైమానిక దళం ఈ రోజు నుంచే ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 విమానాలు మోహరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రదాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ సమావేశంలో మోదీ ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం 24 గంటలూ పని చేస్తుందని చెప్పారని అన్నారు. ఇంకోవైపు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు తాజా సలహాను జారీ చేసింది. కైవ్‌ను అత్యవసరంగా వదిలివేయాలని, అందుబాటులో ఉన్న రైళ్లలో లేదా మరేదైనా మార్గంలో వెళ్లాలని కోరింది. మరోవైపు భారత్ ఆపరేషన్ గంగా కింద తరలింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. అంతేకాదు ఉక్రెయిన్ చుట్టుపక్కల సరిహద్దుల నుండి తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, వేగవంతం చేయడానికి ప్రభుత్వం నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. ఈ మేరకు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ సరిహద్దుల వద్ద మొత్తం ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది!..రష్యన్ సైనికుడి చివరి సందేశం) -
రక్షణమంత్రికి సీడీఎస్ చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదిక
-
మేరా భారత్ మహాన్: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి
Indian Air Force Day 2021:దేశ రక్షణలో సైన్యం పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడు విభాగాలతో రక్షణ, నిఘాతో సరిహద్దుల్లోనే కాదు.. అవసరం పడితే దేశం లోపల కూడా తమ సేవల్ని అందిస్తుంటాయి. అక్టోబర్ 8న అంటే ఇవాళ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే. ఈ సందర్భంగా భారత వాయు సేన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం. ►యునైటెడ్ కింగ్డమ్కి చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ ప్రోత్సాహంతో పుట్టుకొచ్చింది ఈ విభాగం. ►ప్రతీ ఏడాది ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ ‘హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్’లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఉత్సవాలను నిర్వహిస్తారు. ►ఐఏఎఫ్ చీఫ్, సీనియర్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ►ఎయిర్‌క్రాఫ్ట్‌ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ వేడుకలకు. ►భారత వాయు సేన.. అక్టోబర్ 8, 1932న అధికారికంగా బ్రిటిష్ పాలనలో మొదలైంది. ►ఏప్రిల్ 1, 1933 నుంచి నుంచి సేవలు(కేవలం శిక్షణ కోసం) మొదలుపెట్టినప్పటికీ.. పూర్తిస్థాయిలో రెండో ప్రపంచ యుద్ధంలోనే రంగంలోకి దిగింది. ►ఆ టైంలో ఈ విభాగం పేరు.. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ►ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF).. దేశం తరపున ఆకాశ మార్గానా గస్తీ కాచే, శత్రువులతో పోరాడే కీలక సైన్య విభాగం. ►పాక్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ ఐఏఎఫ్ సేవలు మరువలేనివి. ►గత 89 ఏళ్లుగా.. ముఖ్యంగా స్వాతంత్ర్యం అనంతరం.. వాయు సేన క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌ను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాల తర్వాత అతిపెద్ద వాయుసేనను కలిగి ఉన్న వ్యవస్థగా భారత్ నిలిచింది. ►ఐఎఎఫ్ నినాదం ‘నభమ్ స్పర్శమ్ దీప్తమ్’(ఇంగ్లీష్‌లో టచ్ ది స్కై విత్ గ్లోరీ) అంటే.. ఆకాశాన్ని అంటే కీర్తి అని అర్థం. భగవద్గీతలోని పదకొండవ అధ్యయం నుంచి ఈ వాక్యాన్ని భారత వాయు సేన స్ఫూర్తిగా తీసుకోవడం విశేషం. ►భారత వాయు సేనలో ప్రస్తుతం సుమారు 1,400 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, లక్షా డెబ్భై వేల మంది సిబ్బంది ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ►యూపీ హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్.. ఆసియాలో అతిపెద్ద, ప్రపంచంలో 8వ పెద్ద ఎయిర్ బేస్. అందుకే ఇక్కడ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ►ఆపరేషన్ పుమాలై, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్.. ఇలా ఎన్నో ఆపరేషన్లలో ఐఎఎఫ్ సేవలు మరువలేనిది. ►యుద్ధ సమయంలోనే కాదు.. జాతి ప్రయోజనాల కోసం సైతం పని చేస్తుంది భారత వాయు సేన. గుజరాత్ తుపాన్(1998), సునామీ(2004), ఉత్తరాది వరదల సమయంలో సేవలు అందించింది కూడా. ముఖ్యంగా ఉత్తరాఖండ్ వరదల సమయంలో ‘రాహత్’ ఆపరేషన్ ద్వారా 20 వేల మంది ప్రాణాలు కాపాడగలిగింది ఐఎఎఫ్. ►ఐక్యరాజ్య సమితి శాంతి చర్యల్లోనూ ఐఎఎఫ్ పాల్గొంటోంది. ►వాయు సేనలో మహిళలకు ఉన్నత ప్రాధాన్యం ఉంటోంది. నేవిగేటర్ల దగ్గరి నుంచి పైలట్లు, ఉన్నత స్థాయి పదవుల్లో కొనసాగుతున్నారు. - సాక్షి, వెబ్ స్పెషల్ -
Air Show: ఆకాశంలో అద్భుత విన్యాసాలు
-
జమ్ము కశ్మీర్లో భారత 'వైమాని దళ విన్యాసం'
-
ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత బలగాలకు వ్యూహాత్మక శిక్షణ !
న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నేపథ్యంలో సరిహద్దు భద్రతా అంశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారతదేశ సరిహద్దు ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలతో పాటు సాయుధ బలగాలకు సరికొత్త వ్యూహాత్మక శిక్షణ ఇవ్వాలని కేంద్ర భద్రత సంస్థ సూచించింది. అఫ్గన్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడకుండా మోహరించి ఉన్న దళాలను సరికొత్త వ్యూహంతో ఎదుర్కొనేలా సంసిద్ధం చేయాలని నొక్కి చెప్పింది. అఫ్గానిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని చూస్తే అడుగడుగునా పాకిస్తాన్ ముద్ర స్పష్టంగా కనిపించడమే కాక భారత్‌పై దాడులు చేసిన హక్కానీలకు కీలక పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ సరిహద్దు ప్రాంతాలైన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, లోతట్టు ప్రాంతాలలో భద్రతా దళాలను మరింతగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోమని కోరింది. భద్రత దళాలైన బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్ దళాలు అత్యంత ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను తిప్పికొట్టగల సామర్థ్యం కలవారని ఆర్మీ ఉన్నతాధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
జాతీయ రహదారిపై ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
జైపూర్: కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కేఎస్ భదౌరియా కలిసి ప్రయాణిస్తున్న భారత వైమానిక దళానికి చెందిన సీ-130జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం మాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్) డ్రిల్ లో భాగంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలోని సట్టా-గాంధవ్ జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యింది. భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం జాతీయ రహదారిని ఉపయోగించడం ఇదే మొదటిసారి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా & రహదారి మంత్రి నితిన్ గడ్కరీ కలిసి సంయుక్తంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలో ఐఏఎఫ్ అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్మించిన సట్టా-గాంధవ్ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ మాక్ డ్రిల్ విజయవంతం కావడంతో రక్షణ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 19 నెలల్లో నిర్మించిన సట్టా-గాంధవ్ జాతీయ రహదారిపై నేడు జరిగిన ఈఎల్ఎఫ్ విమాన కార్యకలాపాలను వారు వీక్షించారు. ఐఏఎఫ్ కు చెందిన 32 సైనిక రవాణా విమానం, మీ-17వి5 హెలికాప్టర్ కూడా ఈఎల్ఎఫ్ వద్ద దిగాయి. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?) #WATCH | C-130J Super Hercules transport aircraft with Defence Minister Rajnath Singh, Road Transport Minister Nitin Gadkari & Air Chief Marshal RKS Bhadauria onboard lands at Emergency Field Landing at the National Highway in Jalore, Rajasthan pic.twitter.com/BmOKmqyC5u — ANI (@ANI) September 9, 2021 రాజస్థాన్‌లోని సట్టా-గాంధవ్ స్ట్రెచ్‌ను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో సట్టా-గాంధవ్ జాతీయ రహదారి మాదిరిగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యుద్ద సమయాలలో ఈ రహదారులు ముఖ్య భూమిక పోషిస్తాయి అని అన్నారు. కోవిడ్-19 ఆంక్షలు ఉన్నప్పటికీ ఐఎఎఫ్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగం చేతులు కలిపి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ నిర్మాణాన్ని 19 నెలల్లో పూర్తి చేసినందుకు రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. "బహుళ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి ఇది గొప్ప ఉదాహరణ" అని ఆయన అన్నారు. రాజ్ నాథ్ సింగ్ 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐఎఎఫ్ విమానాల ల్యాండింగ్ సరికొత్త ఇండియా చారిత్రాత్మక బలంగా నిర్వచించారు. భారత వైమానిక దళానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం మూడు కిలోమీటర్ల విభాగాన్ని ఎన్హెచ్ఏఐ అభివృద్ధి చేసింది. ఈ మొత్తం జాతీయ రహదారిని(196.97 కిలోమీటర్ల పొడవు) భారత్ మాల ప్రాజెక్టు కింద రూ.765.52 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి పనులు జూలై 2019లో ప్రారంభమైతే, జనవరి 2021లో పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న బార్మర్, జలోరే జిల్లాల గ్రామాలను కలుపుతుంది. చైనా, పాకిస్తాన్ సహా ఉపఖండంలో శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మరిన్ని జాతీయ రహదారులు అవసరమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ తో పాటు, సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కింద కుందన్ పురా, సింఘానియా, బఖసర్ గ్రామాల్లో మూడు హెలిప్యాడ్ లను నిర్మించారు. -
జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం
జమ్మూ: జమ్మూలోని మూడు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. ఈ పరిణామంతో పోలీసులు, సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిరాన్ సాహిబ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.23 గంటలకు ఒక డ్రోన్ కనిపించగా, కలుచక్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకి ఒక డ్రోన్, కుంజ్‌వానిలో 4.52 గంటలకి మరో డ్రోన్ కనిపించిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై ఆదివారం డ్రోన్ దాడి జరిగిన దగ్గర్నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట డ్రోన్లు కనిపిస్తూనే ఉన్నాయి. జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వైమానిక స్థావరంపైనే ఆదివారం డ్రోన్లతో తొలిసారిగా దాడి జరిగిన విషయం తెలిసిందే. డ్రోన్లతో ఏ క్షణంలో ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనని ఈ వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, సాఫ్ట్ జామర్లు ఏర్పాటు చేసినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో చైనాకు చెందిన డ్రోన్లు వాడినట్టుగా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. డ్రోన్ల నుంచి పేలుడు పదార్థాలను జారవిడిచినట్టుగా భావిస్తున్నారు. నైట్ విజన్, నావిగేషన్ వ్యవస్థ కలిగిన డ్రోన్లను ముష్కరులు వాడినట్టుగా భద్రతా అధికారులు వెల్ల డించారు. మరోవైపు రాజౌరి జిల్లాలో ఏ అవసరానికైనా డ్రోన్లను వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు. -
భారత అమ్ములపొదిలో మరో అద్భుతం
భువనేశ్వర్: ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోలను భారత వైమానికి దళం విడుదల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువస్త్రా అని నామకరణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలసోర్‌లో జూలై 15, 16 తేదీల్లో క్షిపణి ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. హెలీనా (హెలికాప్టర్ ఆధారిత నాగ్ మిస్సైల్) ప్రత్యక్ష హిట్ మోడ్‌తో పాటు టాప్ అటాక్ మోడ్‌లోనూ లక్ష్యాలను చేధించగలదని అధికారులు వెల్లడించారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన హెలీనా ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధాలలో ఒకటి. ఇందులో అమర్చిన యాంటీ ట్యాంక్ గైడెడె వ్యవస్థ ద్వారా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. లాక్-ఆన్ బిఫోర్-లాంచ్ మోడ్‌లో పనిచేసే ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ (ఐఐఆర్) ద్వారా దీనికి మార్గదర్శకాలు అందుతాయి. దీనిలో అమర్చిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా యుద్ధ ట్యాంకులను విచ్చిన్నం చేయగలదు. దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి హెలీనా సహాయపడుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో మరో కీలక ఆయుధంగా హెలీనా (ధ్రువస్త్రా)ని అభివర్ణిస్తున్నారు. (లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు ) #WATCH Trials of Helicopter-launched Nag Missile (HELINA), now named Dhruvastra anti-tank guided missile in direct and top attack mode. The flight trials were conducted on 15&16 July at ITR Balasore (Odisha). This is done without helicopter. pic.twitter.com/Jvj6geAGLY — ANI (@ANI) July 22, 2020 -
గాంధీ ఆస్పత్రికి అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో కీలకమైన వేదికగా మారిన గాంధీ ఆస్పత్రిలో ఆదివారం (మే 3) రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తున్న వేళ.. కరోనా ఫైటర్స్ గా మారి చికిత్స అందిస్తున్న ‘గాంధీ’ వైద్యులపై పూల వర్షం కురవబోతుంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. సెలవులను సైతం రద్దు చేసుకొని వైద్యం అందిస్తున్నారు. వీరి కృషి వల్ల ఎందరో బాధితులు కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య సిబ్బందికి అభినందనలు తెలపడానికి ఎయిర్ ఫోర్స్ ముందుకు వచ్చింది. కరోనాని జయిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి సంఘీభావంగా రేపు ఉదయం 9.30 గంటలకు గాంధీ ఆస్పత్రిపై హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించబోతున్నారు. (చదవండి : వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం) గాంధీ ఆసుపత్రి ఆవరణలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద డాక్టర్లు. నర్సులు. తెలంగాణ పోలీసు అధికారులు, మినిస్టీరియల్, పారామెడికల్, 4వ తరగతి సిబ్బంది, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సహా అందరూ హాజరు కావాలని హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు కోరారు. వీరందరిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించి అభినందనలు తెలియజేయాలని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్ణయించింది. ఎయిర్ ఫోర్స్ అధికారుల సూచన మేరకు సిబ్బంది అంతా తమ యూనిఫాంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద హాజరు కావాలని.. ఎయిర్ ఫోర్స్ అందించే ప్రశంశలను అందుకోవాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కోరారు. కాగా, వైద్యులు చేస్తున్న కృషికి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందిపై ఆదివారం హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించనున్నారు. -
వాయుసేనకు 200 జెట్ విమానాలు
కోల్‌కతా: భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసే 83 ఎల్సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోందన్నారు. ఎల్సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయినందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు. -
ప్రాంతీయంగా శాంతి నెలకొనాలి
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ బుధవారం ఇరుగు పొరుగు దేశాధినేతలతో ఫోన్లలో మాట్లాడారు. వారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందిస్తూనే ప్రాంతీయంగా శాంతి భద్రతల కోసం భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఒలి, భూటాన్ రాజు జిగ్మె ఖేసర్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సొలి తదితరులతో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయంగా శాంతి భద్రతల అంశానికే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు. భారత వాయుసేన వీడియో వైరల్ భారత వాయుసేన 2020 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు అందిస్తూ రూపొందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నరనరాల్లోనూ ఉప్పొంగే దేశభక్తి, ఉవ్వెత్తున ఎగిసిపడే భావోద్వేగాలతో ఈ వీడియోను రూపొందించారు. గగన తలాన్ని రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడే వాయుసేన బలగాల కర్తవ్యదీక్షలో ఎలాంటి సాహ సాలు చేస్తారో చూపించిన అత్యంత శక్తిమంతమైన దృశ్యాలు అందరినీ కట్టిపడేశాయి. హిందీలో కవితాత్మకంగా దేశభక్తిని, మాతృభూమి రక్షణ కోసం వాయుసేన చేసే సాహసాన్ని వర్ణించిన తీరుతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీడియోను ఐఎఎఫ్ తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేసింది. అది క్షణాల్లోనే వైరల్ అయింది. కొద్ది గంటల్లో 13వేలకు పైగా వ్యూస్, 5వేలకు పైగా లైక్‌లు, వెయ్యికి పైగా రీట్వీట్లతో వైరల్‌గా మారింది. -
సాగరమంతా సంబరమే!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్ వేదికగా.. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విశిష్ట, ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆయనకు తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సతీసమేతంగా స్వాగతం పలికారు. తొలుత నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల నేవీ బ్యాండ్ ప్రదర్శనతో నావికాదళ వేడుకలకు శ్రీకారం చుట్టారు. మెరైన్ కమెండోలు 84 ఎంఎం రాకెట్ వాటర్ బాంబు పేల్చి సీఎంకు స్వాగతం పలికారు. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ యుద్ధ విమానాల బృందం చేసిన విన్యాసాలు గగుర్పొడిచాయి. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో పయనిస్తూ ఐఎస్‌వీ తరహా నౌకలు సుదూరం నుంచి ఎదురెదురుగా దూసుకువచ్చే సన్నివేశం అబ్బురపరచింది. ఆరువేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్‌ల నుంచి పారా జంపింగ్ చేసిన స్కై డైవర్లు గాల్లో విన్యాసాలు చేస్తూ ప్యారాచూట్ల సహాయంతో వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా వాలారు. అనంతరం స్కై డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్ రాథోడ్ విశిష్ట అతిథి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, మిగ్ విమానాలు పల్టీలు కొడుతూ దూసుకుపోవడం, మార్కోస్‌ను సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా మరో చోటకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అద్భుతమైన రీతిలో విన్యాసాలు ప్రదర్శించారంటూ నౌకాదళ బృందాన్ని సీఎం ప్రశంసించారు. బుధవారం విశాఖ సాగర తీరంలో ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు చేస్తున్న నేవీ సిబ్బంది. (ఇన్సెట్లో) తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్‌తో కలిసి విన్యాసాలను వీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ తేనీటి విందులో సీఎం జగన్ విన్యాసాలు ముగిసిన అనంతరం నేవీ హౌస్‌లో ఎట్ హోం పేరుతో నిర్వహించిన తేనీటి విందులో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ సాగించిన వీరోచిత చరిత్రపై ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్‌ను తిలకించారు. సీఎం వెంట మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. -
ఘానంగా ఇండియన్ ఏయిర్ ఫోర్స్ 87వ వార్షికోత్సవం
-
రఫేల్‌తో బలీయ శక్తిగా ఐఏఎఫ్
పారిస్: అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల చేరికతో భారత వైమానిక దళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని యూరోప్‌కు చెందిన క్షిపణి తయారీ సంస్థ ఏంబీడీఏ పేర్కొంది. తాము తయారు చేసిన మెటియొర్, స్కాల్ప్ క్షిపణులను రఫేల్ యుద్ధ విమానాలు ప్రయోగించగలవంది. ‘ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో, కచ్చితత్వంతో దాడి చేయగల మెటియొర్, ఆకాశం నుంచి భూమిపై సుదూర లక్ష్యాలను ఛేదించగల స్కాల్ప్ క్షిపణులు భారత వైమానిక దళాన్ని మరింత శక్తిమంతం చేస్తాయి. ఈ సామర్థ్యం భారత్‌కు గతంలో లేదు’ అని ఎంబీడీఏ ఇండియా చీఫ్ పీడ్వాచ్ వ్యాఖ్యానించారు. ‘రఫేల్ అద్భుతమైన యుద్ధ విమానం. ఇది ఆధునిక ఆయుధ శ్రేణితో ఉంది. ఈ ఒప్పందంలో మేం కూడా భాగస్వాములం కావడం సంతోషకరం’ అన్నారు. ఫ్రాన్స్ నుంచి రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధవిమానాలను భారత్ కొనుగోలు చేస్తుండటం తెలిసిందే. అందులో తొలి విమానాన్ని మంగళవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్స్ మిలటరీ అధికారుల నుంచి స్వీకరించనున్నారు. కంటికి కనిపించని లక్ష్యాలను ఛేదించడంలో మెటియొర్ క్షిపణి సామర్థ్యం అమోఘమని పీడ్వాచ్ పేర్కొన్నారు. అలాగే, లక్ష్యాల ఛేదనలో స్కాల్ప్‌కు తిరుగులేదని కితాబిచ్చారు. ఈ రెండు క్షిపణులతో కూడిన రఫే ల్ చేరికతో భారత వైమానిక దళం ప్రాంతీయంగా బలీయ శక్తిగా మారుతుందన్నారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మెటియొర్ కచ్చితత్వంతో పనిచేస్తుందని, ఫైటర్ జెట్స్ నుంచి చిన్నవైన మానవ రహిత విమానాల వరకు అన్నింటినీ కచ్చితత్వంతో కూల్చివేయగలదన్నారు. ఆకాశం నుంచి ప్రయోగించి భూమిపై ఉన్న సుదూర లక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో ఛేదించడంలో స్కాల్ప్ సామర్థ్యం తిరుగులేనిదన్నారు. భారత్ అవసరాలకు అనుగుణంగా రఫేల్‌లో మార్పులు చేశారు. ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్ ఆయుధ పూజ న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాలను స్వీకరించేందుకు ఫ్రాన్స్ వెళ్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. దసరా సందర్భంగా అక్కడే పారిస్‌లో ఆయుధ పూజ చేయనున్నారు. దసరా రోజు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. దసరాతో పాటు భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం కూడా కావడం విశేషం. రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం.. పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రాజ్‌నాథ్ అందులో ప్రయాణించనున్నారు. 36 యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని మంగళవారమే స్వీకరించినప్పటికీ.. తొలి నాలుగు రఫేల్ యుద్ధవిమానాలు భారత్‌కు వచ్చే ఏడాది మేలోనే వస్తాయి. రఫేల్‌ను భారత్‌కు అందించే కార్యక్రమంలో ఫ్రాన్స్ మిలటరీ ఉన్నతాధికారులు, డసో ఏవియేషన్ సీనియర్ అధికారులు పాల్గొంటారు. రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016లో ఒప్పందం కుదిరింది. పలు ఆధునిక ఆయుధాలు, క్షిపణులను ఈ యుద్ధవిమానం నుంచి ప్రయోగించవచ్చు. మొదట వచ్చే యుద్ధవిమానాలను అంబాలాలోని వైమానిక దళ స్థావరంలో మోహరించనున్నారు. -
మరో ‘బాలాకోట్’కు రెడీ
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని పరిస్థితులపై భారత వాయు సేన(ఐఏఎఫ్) ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, అవసరమైతే బాలాకోట్ తరహాలో మరో వైమానిక దాడికి దిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా వెల్లడించారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి ఆపరేషన్లు అయినా చేపడతామని తెలిపారు. అంతకుముందు భారత వాయు సేనలో 26వ ఎయిర్ చీఫ్ మార్షల్‌గా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందిన చీఫ్ బీఎస్ ధనోవా స్థానంలో రాకేశ్ బాధ్యతలు స్వీకరించారు. -
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
-
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత వాయుసేన ఆధునీకరణ దిశగా పెద్ద ముందడుగు పడింది. వాయుసేన అమ్ములపొదిలోకి తాజాగా ఎనిమిది అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరాయి. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్-64ఈ (ఐ) హెలికాప్టర్లు మంగళవారం భారత్ చేరాయి. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో వీటిని వాయుసేన స్వాధీనం చేసుకుంది. వాయుసేనకు చెందిన125 హెలికాప్టర్ యూనిట్ ’గ్లాడియేటర్స్’ ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వినియోగించనున్నారు. వాయుసేన అమ్ములపొదిలోకి ఈ హెలికాప్టర్లు చేరిన సందర్భంగా వాటిని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ పరిశీలించారు. అమెరికా నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లను భారత్ దిగుమతి చేసుకొంది. వీటిని కొనుగోలు చేసేందుకు 2015లోనే భారత్ అమెరికా రక్షణ సంస్థ బోయింగ్‌తో 1.1 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2022నాటికి భారత వాయుసేనలోకి మొత్తం 22 అపాచీయుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో వీటిని బోయింగ్ భారత్‌కు అప్పగించనుంది. ప్రస్తుతం భారత వాయుసేన సోవియట్ నాటి ఎంఐ-25, ఎంఐ 35 హెలికాప్టర్లను వినియోగిస్తోంది. వీటి స్థానంలో అపాచీ హెలికాప్టర్లను వాయుసేన ఇకనుంచి వినియోగించనుంది. పాకిస్థాన్ సరిహద్దులకు కొద్ది దూరంలోనే ఉన్న పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌లో ఈ యుద్ధ హెలికాప్టర్లలోని నాలుగింటిని వాయుసేన మోహరించనుంది. -
గగనతలంలో అరుదైన ఘట్టం
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌తో కలిసి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మిగ్ 21 సోర్టీ యుద్ధవిమానాన్ని చివరిసారిగా నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఇది ధనోవా చివరి గగన విహారం. అంతేకాదు.. ఈ విహారానికో ప్రత్యేకత ఉంది. గతంలో అభినందన్ తండ్రి సింహకుట్టి వర్థమాన్‌తో కలిసి ధనోవా యుద్ధవిమానాన్ని నడిపించారు. ఎయిర్ మార్షల్‌గా సింహకుట్టి రిటైరయ్యారు. ఆయన కొడుకు అయిన అభినందన్ భారత వైమానిక దళంలో పనిచేస్తుండటమే కాదు.. గత ఫిబ్రవరిలో గగనతలంలో పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరి వైమానిక పోరులో దాయాదికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని వీరోచితంగా కూల్చేసిన సంగతి తెలిసిందే. దాయాదితో వీరోచిత పోరులో అసమాన ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలిచిన అభినందన్‌తో కలిసి మిగ్ 21 యుద్ధవిమానాన్ని నడిపించిన ధనోవా అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభినందన్‌తో తనకు పలు విషయాల్లో సారూప్యతలు ఉన్నాయని, అందుకే అతనితో కలిసి చివరిసారిగా యుద్ధవిమానాన్ని నడిపించానని తెలిపారు. తాము ఇద్దరం కూలిపోతున్న యుద్ధవిమానం నుంచి తప్పించుకొని కిందకు దిగామని, అదేవిధంగా పాకిస్థానీలతో పోరాడామని ధనోవా వివరించారు. ఇక, అభినందన్ తండ్రి సింహకుట్టితో కలిసి తాను గతంలో యుద్ధ విమానం నడిపించానని, ఇప్పుడు ఆయన కొడుకుతో కలిసి యుద్ధ విమానం నడిపించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. -
వాయుసేనకు అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత శక్తిమంతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఏహెచ్ 64ఈ త్వరలో వాయుసేన అమ్ములపొదిలో చేరనుంది. అమెరికా విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ నాలుగేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు హెలికాప్టర్లను భారత్‌కు అందజేసింది. మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లకు డీల్ కుదరగా తొలి విడతగా నాలుగు హెలికాప్టర్లు ఐఏఎఫ్‌కి అందాయి. వచ్చేవారం మరో నాలుగు వస్తాయి. మొత్తం ఎనిమిది అపాచీ హెలికాప్టర్లు పఠాన్‌కోట్ వైమానిక కేంద్రం నుంచి త్వరలో భారత వైమానిక దళంలో లాంఛనంగా చేరనున్నాయి. అపాచీ చేరికతో తమ పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని ఐఏఎఫ్ ఆశాభావం వ్యక్తంచేసింది. -
తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు!!
సాక్షి, వనపర్తి(మహబూబ్ నగర్) : దేశం కోసం పని చేయాలనే లక్ష్యంతో నూనుగు మీసాల వయస్సులో ఓ యువకుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అర్హత సాధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగంలో యుద్ధ విమానాలు నడిపే పైలెట్‌కు శిక్షణ తీసుకోనున్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమశిక్షణ, ఆలోచన, దేశభక్తి తోడైతే విజయం సాధించవచ్చని పట్టుదలతో నిరూపించాడు. ఉరిమే ఉత్సాహంతో ఉన్న ఆ యువకుడు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్థానం సంపాదించాడు. సైనిక అధికారుల పర్యవేక్షణలో మూడేళ్లపాటు సైనిక శిక్షణ పొందనున్నాడు. నేవీ, ఆర్మీ కంటే అతికష్టంగా ఉండే ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన అన్ని టెస్టుల్లోనూ ప్రతిభ సాధించడంతో అర్హత సాధించాడు. దేశానికి సేవ చేసే భాగ్యం కోసం చిన్నప్ప టి నుంచి కలలు గన్న ఆ యువకుడి తల్లిదండ్రుల ఆశయాలు ఫలించాయి. వనపర్తి లోని గాంధీనగర్‌కాలనీకి చెందిన ఎల్ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్‌సాయి యాదవ్ 2018 సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్ ఫోర్స్‌కు గాను యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎంట్రెన్స్ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్ 30న ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల కావ డంతో అర్హత సాధించిన వారికి డెహ్రడూన్ లో సర్వీస్ సెలక్షన్ బోర్డు ఈ ఏడాది జనవరి 14 నుంచి 19 వరకు డ్యాకుమెంట్ వెరిఫికేషన్, ఫిజిక ల్ ఫిట్నెస్ టెస్టు, సైకాలజీ టెస్టులో నిర్దేశిత టైం ప్రకారం నిర్వహించే టెస్టులు ఒక పిక్చర్ చూయిం చి దానిపై స్టోరీ రాయించడం, స్విచ్వేషన్ రియాక్ట్ టెస్టులో 60 స్విచ్ వేషన్లను 30 నిమిషాల్లో స్టూడెంట్ 30 రియాక్షన్స్ పేర్కొన్నాలి. సెల్ఫ్ డిక్రిప్షన్, వర్డ్ అసోసియేషన్ టెస్టులో 15 సెకన్లకు వచ్చే ఒక వర్డ్‌పై సెంటన్స్ రాయడం, పర్సనల్ ఇంటర్వ్యూ ఒక గంట మౌఖికంగా నిర్వహించడం, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ నేతృత్వంలో గ్రూప్ చర్చలు, గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్, ప్రోగ్రెసివ్ గ్రూప్ చాట్, ఆఫ్ గ్రూప్ చాట్, సెల్స్ ఆప్టికల్స్, గ్రూప్ ఆప్స్ కిల్ రేస్, కమాండ్ టాస్క్ లెక్చరేట్, ఫైనాల్ గ్రూప్ టాస్క్ మెడికల్ ఎగ్జామ్ ఇలా అన్నింటిలో అర్హత సాధించాడు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 21 నుంచి 25 వరకు ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబిలీష్మెంట్ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో అన్నింటిలో మెరుగ్గా తేలడంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశానికి చోటు దక్కింది. ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసిన వారు, చదువుతున్న వారు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు, ప్రతి ఆరు నెలలకోసారి యూపీఎస్సీ భారత రక్షణ శాఖ నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన వారు ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ అధికారి హోదాతో ఉద్యోగ జీవితం ప్రారంభం కానుంది. మూడేళ్ల శిక్షణతోపాటు బీటెక్ అని పరీక్షల్లోనూ అర్హత సాధించడంతో యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మూడేళ్ల ప్రవేశానికి చోటు కల్పిస్తూ యూపీఎస్సీ ధ్రువీకరించింది. జూలై 2న పుణెలోని కడక్వాస్లో గల ఎన్డీఏలో చేరనున్నారు. అక్కడ మూడేళ్లపాటు ఎయిర్ ఫోర్స్‌తోపాటు బీటెక్ చేయిస్తారు. ఇందుకు సంబంధించి ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదిపాటు ట్రైనీ ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ ఇస్తారు. అనంతరం అధికారికంగా నియమాక పత్రం అందజేస్తారు. దీంతో యుద్ధ విమానాలు నడిపే పైలెట్‌గా దేశానికి సేవ చేయాల్సి ఉంటుంది. సంతోషంగా ఉంది నేను దేశానికి సేవ చేయబోతున్నాననే మాట ఎంతో సంతృస్తిని ఇస్తుంది. తల్లిదండ్రుల ఆశయాన్నీ నిలబెట్టేందుకు పట్టుదలతో చదువుకున్నా. అదే పట్టుదలతో దేశానికి సేవ చేస్తాను. ప్రణాళికబద్ధంగా చదువుకొని ముందుకు సాగాను. ఇకపై కూడా అన్ని పరీక్షల్లోనూ పూర్తిగా అర్హత సాధిస్తానన్న నమ్మకం ఉంది. – నిఖిల్‌సాయి, వనపర్తి -
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌లో ఆకాడమీలో విన్యాసాలు
-
విమానం జాడపై తొలగని ఉత్కంఠ
ఈటానగర్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాయుసేన విమానం జాడ కనిపెట్టేందుకు మంగళవారం భారతీయ నేవీ కూడా రంగంలోకి దిగింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఏఎన్–32 విమానం అస్సాంలోని జోర్హత్ నుంచి టేకాఫ్ అయిన 33 నిమిషాలకే అదృశ్యమైన విషయం తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా ప్రాంతానికి చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే గల్లంతైంది. అదృశ్యమైన విమానాన్ని వెతికేందుకు శక్తివంతమైన పీ8ఐ విమానం తమిళనాడులోని ఎర్నాకులంలో ఉన్న ఐఎన్ఎస్ రాజలీ నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరిందని నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ వెల్లడించారు. ఇది ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు విమానం కోసం మెంచుకా అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాయని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో కొంతమంది బృందాలుగా ఏర్పడి విమానం జాడ కోసం వెతుకుతున్నాయని తెలిపారు. సోమవారం ఓ చోట విమానం కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని.. వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా అలాంటిదేం లేదని గుర్తించామని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో వెల్లడించింది. అస్సాంకు చేరిన ఫ్లైట్ లెఫ్టినెంట్ కుటుంబసభ్యులు పటియాలా: అదృశ్యమైన విమానంలో ఎనిమిది మంది వైమానిక సిబ్బంది సహా ఐదుగురు ప్యాసింజర్లు ఉన్నారని తెలిపింది. వీరిలో పటియాలాలోని సమానా ప్రాంతానికి చెందిన ఫ్లైట్ లెఫ్లినెంట్ మోహిత్ గార్గ్ కూడా ఉన్నారు. విమానం గల్లంతైన వార్త తెలియగానే మోహిత్ తండ్రి సురీందర్ గార్గ్, అంకుల్ రిషీ గార్గ్ అస్సాంకు చేరుకున్నారని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. మోహిత్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు అతని సోదరుడు అశ్వనీ గార్గ్ తెలిపారు. మోహిత్‌కు గతేడాది వివాహమైంది. అతని భార్య అస్సాంలోని ఓ బ్యాంకులో పనిచేస్తోంది. పదేళ్ల క్రితమూ ఇలాగే.. అది 2009 సంవత్సరం జూన్ నెల. భారత వాయుసేనకు చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మెచుకా నుంచి అసోంలోని మోహన్బరి వైమానిక స్థావరానికి వెళ్తుండగా మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా పదేళ్లకు జూన్ నెలలోనే 13 మందితో మెచుకా వెళ్తున్న ఏఎన్–32 రకం విమానం సోమవారం కన్పించకుండా పోయింది. ఇందులో కూడా 13 మందే ఉండటం గమనార్హం. ఈ విమానం మెచుకాకు వెళుతుండగా అదృశ్యం కావడం విశేషం. -
వాయుసేన వ్యూహాత్మక కేంద్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: భారతదేశ తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన నిర్ణయించింది. విపత్తు నిర్వహణ, నిఘా, రక్షణ అవసరాల కోసం మన రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో యుద్ధవిమానాల బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వ్యూహాత్మక ప్రణాళికను భారత వాయుసేన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించింది. బంగాళాఖాతంలో పటిష్ట నిఘా ప్రస్తుతం దేశ తూర్పు తీరంలో చెన్నై సమీపంలోని అరక్కోణంలో వైమానిక దళ స్థావరం ఉంది. యుద్ధ విమానాలను అక్కడ మొహరించారు. ఎక్కడైనా విపత్తులు సంభవించినా, రక్షణ అవసరాల కోసం అక్కడి నుంచే యుద్ధ విమానాలను పంపిస్తున్నారు. కాగా తూర్పు తీరంలో బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టడంతోపాటు బంగాళాఖాతంలో చైనా ఆధిపత్యంపై కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని భారత వాయుసేన గుర్తించింది. అందుకోసం బంగాళాఖాతంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉంది. ఇక ఎక్కువుగా తుఫాన్ల ముప్పు ఎదుర్కొంటున్న తూర్పుతీర ప్రాంతంలో విపత్తుల నిర్వహణ కూడా వాయుసేన ప్రాధాన్య అంశంగా ఉంది. అందుకోసం తూర్పుతీరంలో మరో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అతి పొడవైన తీరప్రాంతం ఉన్న ఏపీని అందుకు అనువైనదిగా ఎంపిక చేసింది. ఇప్పటికే విశాఖలో భారత నావికాదళ వ్యూహాత్మక కేంద్రం ‘ఐఎన్ఎస్ డేగా’ ఉంది. దాంతో రాజమండ్రి, విజయవాడ విమానాశ్రయాలను తమ వ్యూహాత్మక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన భావించింది. ఇందుకుగాను యుద్ధవిమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా విజయవాడ– రాజమండ్రి మధ్య ఉన్న జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఉత్తర భారత దేశంలో ఆగ్రా–లక్నో జాతీయరహదారిని అదే విధంగా యుద్ధ విమానాలు అత్యవసర ల్యాండింగ్‌కు వీలుగా అభివృద్ధి చేశారు. యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా జాతీయ రాహదారులు ఆరులేన్లుగా ఈ జాతీయరహదారిని అభివృద్ధి చేసిన తరువాత యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఈమేరకు ప్రతిపాదనలకు కేంద్ర రక్షణ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో రక్షణ మౌలిక వసతులను అభివృద్ధికి ప్రణాళికను రూపొందించనున్నారు. యుద్ధవిమానాల మొహరింపు, రోజువారీ విన్యాసాలు, శిక్షణ తదితర అవసరాలకు అనుగుణంగా రక్షణ మౌలిక వసతులను తీర్చిదిద్దుతారు. దాంతో తూర్పుతీరంలో భారత వాయుసేన నిఘా మరింత పటిష్టమవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
మెరుపు దాడుల వివరాలు ఏడుగురికే తెలుసు
పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన మెరుపు దాడుల నిర్ణయం గురించి కేవలం ఏడుగురికే తెలుసని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, ప్రధాని జాతీయ భద్రత సలహాదారు అజిత్‌కుమార్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, పరిశోధన, విశ్లేషణ విభాగం (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతులకు మాత్రమే వాయుసేన జరిపే దాడులకు సంబంధించిన సమాచారం ఉంది. పాక్‌పై మెరుపు దాడులకు లక్ష్యాలను గుర్తించాలని ఈ నెల 14న పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే ‘రా’ను ప్రభుత్వం ఆదేశించింది. ‘రా’ ఆరు లక్ష్యాల జాబితా సమర్పించింది. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం, జైషే స్థాపకుడు మసూద్ అజహర్ బావ యూసుఫ్ అజహర్ నడుపుతున్న ఉగ్ర శిబిరం ఈ జాబితాలో అగ్రభాగాన ఉన్నాయి. భారత్ దాడి చేయడానికి అనుకూలమైనదిగా బాలాకోట్ ఉగ్ర స్థావరం కనిపించింది. దీనిపై మెరుపుదాడి చేస్తే జైషే మహమ్మద్‌ను సూటిగా హెచ్చరించినట్టవుతుందని, పుల్వామాలో భారత భద్రతా దళాలకు జరిగిన నష్టానికి సమానంగా బాలాకోట్‌లో జైషేకు నష్టం కలగజేయవచ్చని ప్రభుత్వం భావించిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అలాగే బాలాకోట్ శిబిరంపై దాడి వల్ల సాధారణ పౌరులెవరూ మరణించే అవకాశం లేకపోవడం వల్ల వెంటనే పాక్ ప్రతిదాడికి దిగే అవకాశంగానీ, ప్రపంచదేశాల నుంచి భారత్‌పై విమర్శలుగానీ ఉండవని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో దాడులు చేసేందుకు ప్రధాని మోదీ ఈ నెల 18న తుది నిర్ణయం తీసుకున్నారు. -
పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్
న్యూఢిల్లీ : భారత వైమానిక దాడులకు ప్రతిదాడిగా పాకిస్తాన్ ప్రయత్నించిందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. ' 3 పాక్ జెట్ విమానాలు భారత గగనతలంలోకి వచ్చాయి. సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు యత్నించింది. అప్రమత్తమైన భారతవైమానిక దళం వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం. ఈ ఘటనలో భారత్‌కు చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. ఒక పైలట్ జాడ తెలియడం లేదు' అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు. మరోవైపు భారత పైలట్ తమ అధీనంలోనే ఉన్నారంటూ పాక్ ఓ వీడియోను విడుదల చేసింది. ‘నేను వింగ్ కమాండర్ అభినందన్‌ను. ఐఏఎఫ్ అధికారిని. నా సర్వీసు నెంబర్ 27981’ అని పైలట్ చెప్తున్న అంశాలు ఆ వీడియోలో ఉన్నాయి. వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ 21 బైసన్ జెట్‌లో వెళ్లాడని, ఇప్పటికీ తిరిగి రాలేదని ఐఏఎఫ్ పేర్కొంది. వీడియో ఉన్నది అభినందనా కాదా అనేది తెలియాల్సి ఉంది. -
ఒక పైలట్ జాడ తెలియడం లేదు
-
పాక్‌తో యుద్ధం జరుగుతుందా!
సాక్షి, న్యూఢిల్లీ : 1971 తర్వాత భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా కూడా పాక్‌స్థాన్ భూభాగంలోకి భారత వైమానిక దళాలు చొచ్చుకుపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం నాడు భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తూఖ్వా రాష్ట్రంలోనికి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. ఎదురుదాడికి సిద్ధమైన పాకిస్థాన్ యుద్ధ విమానాలు బుధవారం భారత సరిహద్దులోకి దూసుకురాగా భారత వైమానికి దళం గట్టిగా ప్రతిఘటించి ఓ పాక్ యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. మిగతా పాక్ విమానాలు వెనక్కి తిరిగి పోయాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్ని ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా? అన్న చర్చ పలు వర్గాల్లో మొదలైంది. (‘యుద్ధం వస్తే గట్టిగా నిలబడండి’) ‘2016లో భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. అప్పుడు కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాని ఆ పరిస్థితులు యుద్ధానికి దారితీయలేదు. ఇప్పుడు భారత వైమానిక దళం రెండోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. కాకపోతే ఈసారి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాంబులు కురిపించింది. ఇది ప్రస్తుతానికి ప్రతీకాత్మక దాడి మాత్రమే. దాడి గురించి భారత్ చెప్పే కథనానికి, పాక్ చెప్పే కథనానికి మధ్య ఎంతో వైరుధ్యం ఉంది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని, దాదాపు 350 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చని భారత దళం చెబుతుండగా, భారత విమానాలు ఖాళీ ప్రదేశంలో బాంబులను కురిపించాయని, ఆనవాళ్లు ఇదిగో! అంటూ పాక్ దళం శకలాలను చూపిస్తోంది. ఏదేమైనా పరస్పర దాడులు కొన్ని రోజులు కొనసాగవచ్చు. (సైనికేతర, ముందస్తు దాడి చేశాం) ఇది నాన్ మిలటరీ ప్రీఎంప్టీవ్ దాడులుగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారంటేనే యుద్ధానికి కాలుదువ్వడం కాదనేది అర్థం. తాము పాక్ సైనికులు లేదా పౌరులు లక్ష్యంగా దాడి చేయలేదని, ఉగ్రవాదుల లక్ష్యంగా దాడి చేశామని చెప్పడమే ఈ మాటల ఉద్దేశం. భారత్‌పై ఉగ్రదాడి జరిగినందుకు, మరిన్ని జరుగుతాయని తెల్సినందునే ఈ దాడి జరిపామని కూడా భారత వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సమాజానికి సర్ది చెప్పడం కోసం భారత వర్గాలు ఇలా మాట్లాడుతుండవచ్చు. ఒక్కసారి పాక్ సరిహద్దు రేఖను ఉల్లంఘించి లోపలకి పోయామంటే చాలు, పాక్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లే. దీనిపై ఏ దేశం ఎలా స్పందిస్తుందో భారత్‌కు ప్రస్తుతం అనవసరం. ఏ దేశమైనా తమ రాజకీయాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే స్పందిస్తాయి. 2016లో మొదటిసారి సర్జికల్ స్ట్రైక్స్ భారత వైమానిక దళం జరిపిన తర్వాత సరిహద్దులో పాక్ సైనికుల కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు మరింత పెరగవచ్చు! ఆవేశంతోనే ఉద్రేకంతోనో ఇరు దేశాల్లోని కొంత మంది యుద్ధాన్ని కోరుకోవచ్చు. ఒక్కసారి యుద్ధం మొదలయితే అది పరిమితంగా జరుగుతుందా? పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్నది చెప్పలేం. యుద్ధం అంటే ఇరువర్గాలకు అపార నష్టం. అందుకని ఇరువర్గాల సైనికులు కూడా యుద్ధాన్ని కోరుకోరు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా, లేదా? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. మరి కొన్ని రోజులు గడిస్తే స్పష్టత రావచ్చు!’ (ఢిల్లీలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అభిప్రాయాల సారాంశం ఇది) -
మన దళాలు సత్తా చాటాయ్ : ఆజాద్
-
మన దళాలు సత్తా చాటాయ్ : ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ : వైమానిక దాడులతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టిన భారత వాయుసేన దళాలను రాజకీయ పార్టీలు అభినందనల్లో ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం భారత సేనల సామర్ధ్యాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొనియాడారు. ఉగ్రవాద నిరోధానికి సైన్యం చేపట్టే చర్యలను తాము ఎల్లప్పుడూ సమర్ధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నేడు జరిగిన వైమానిక దాడులు నేరుగా ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా సాగుతూ ఉగ్రమూకలను మట్టుబెట్టి విజయవంతంగా తిరిగి భారత్ పోస్టులకు సైన్యం చేరుకుందని ఆజాద్ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులకు వైమానిక మెరుపు దాడులు జరిగిన తీరును విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన దళం మిరేజ్ యుద్ధ విమానాలతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. -
నింగి నుంచి మిరాజ్ మెరుపులు.. నేల కరిచి పాక్ అరుపులు
-
‘మా వినయాన్ని పిరికితనమనుకున్నారు..’
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. ఈ సందర్భంగా భారత సైన్యం ట్వీట్ చేసిన ఓ పద్యం ఇప్పుడు తెగ వైరలవుతోంది. ‘శత్రువు ముందు వినయ విధేయతలు చూపిస్తే.. వాడు మనల్ని పిరికివాడుగా భావిస్తాడు. పురాణాల్లో కౌరవులు పాండవుల గురించి ఎలా తక్కువ అంచనా వేశారో.. అలానే మన శత్రువు కూడా మన సహనాన్ని పిరికితనంగా భావించాడు. అయితే ఫలితం ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహించి ఉండడు’ అంటూ ‘ఆల్వేస్రెడి’ అనే హాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేసిన ఈ పద్యం ఇప్పుడు తెగ వైరలవుతోంది. అంతేకాక మనం శక్తివంతులమని, యుద్ధంలో గెలుపు మనదేనని శత్రువుకు అర్థమైతేనే శాంతి చర్చలు ఫలిస్తాయంటూ ఓ అధికారి అభిప్రాయపడ్డారు. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. -
భారత్‌కు సరైన సమాధానమిస్తాం : పాక్
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్ శిబిరాలే లక్ష్యంగా భారత్ జరిపిన మెరుపు దాడులపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్పందించారు. భారత వైమానిక దళాలు దాడి చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. ‘ భారత్ ఇలాంటి పని చేస్తుందని ప్రపంచానికి మేము చెబుతూనే ఉన్నాం. మా మాటలను ఈరోజు భారత్ నిజం చేసి చూపించింది. ఇప్పుడు వాళ్లకు సరైన సమాధానం చెప్పే హక్కు పొందాము. నియంత్రణ రేఖను దాటి భారత్ నిబంధనలు ఉల్లంఘించింది. ఆత్మరక్షణ హక్కు మాకు కూడా ఉంది కదా’ అని ఖురేషీ వ్యాఖ్యానించారు.(పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్) కాగా పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్ మాట నిలబెట్టుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా పూర్తి చేసి... దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ చర్యపై అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మంత్రులు, ఆర్మీ అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.(ఐఏఎఫ్ అంటే ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్) -
పాక్ పట్టించుకోలేదు.. అందుకే!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులపై విదేశాంగ శాఖ స్పందించింది. భారత వైమానిక దాడులలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సైనికులు వీర మరణం పొందారు. మసూద్ అజహార్‌కు చెందిన జైష్ ఏ మహ్మద్ దీనికి మూలకారణం. పాక్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాద సంస్థలు దాడులు చేయలేవు. రెండు దశాబ్ధాలుగా పాకిస్తాన్లో జైషే మహ్మద్ స్థావరాలు ఉన్నాయి. వేలమంది జిహాదీలకు శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఆపివేయాలని పాకిస్తాన్‌ను అనేకసార్లు కోరాం. వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని సూచించాం. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత నివారణకు పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2001లో డిసెంబర్లో పార్లమెంట్‌పై కూడా దాడి చేశారు. పాక్‌లో ఉగ్రవాద శిబిరాలను గుర్తించారు. పఠాన్ కోట్, యురీ, పుల్వామా దాడులకు సంబంధించి ఆధారాలు ఇచ్చాం. పుల్వామా ఉగ్రవాది ఘటన జరిగిన తర్వాత రోజు దాడులకు సిద్ధమయ్యాం. (పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్) మరిన్న దాడులకు పాక్ కుట్ర మరో భారీ దాడికి ఉగ్రవాద సంస్థలు సిద్ధమవుతున్నారన్న సమాచారం వచ్చింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఇవాళ ఉదయం ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేశాం. బాలాకోట్‌లో చేసిన దాడిలో పెద్ద ఎత్తున జిహాదీలు, కమాండర్లు హతమయ్యారు. పౌర సముదాయాలకు దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జైషే ఉగ్రవాదుల శిబిరాలపై చేశాం. మసూద్ అజహార్ మేనల్లుడు యుసుఫ్ అజహార్ కేంద్రాన్ని ధ్వంసం చేశాం. ఇప్పటికైనా పాకిస్తాన్ తన భూభాగంలో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తుందని భావిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. -
మీ ఆట అదిరింది: సెహ్వాగ్
న్యూఢిల్లీ: పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు ఘన నివాళులర్పించిందని జాతి మొత్తం గర్విస్తోంది. భారత వైమానిక దళం చేసిన తాజా దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ జవాన్లు.. మీ ఆట అదిరింది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్వీటర్ అకౌంట్లో అభినందించాడు. ఇందుకు ఎయిర్‌స్ట్రైక్ హ్యాష్ ట్యాగ్‌ను జోడించాడు. మరొక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. ‘ భారత్ ఆర్మీకి ఇదే నా సెల్యూట్’ అని ట్వీట్ చేశాడు. ఇక గౌతం గంభీర్ ‘జై హింద్ ఐఎఎఫ్’ అంటూ ట్వీట్ చేశాడు. (ఇక్కడ చదవండి: సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!) టీమిండియా యువ క్రికెటర్ యజ్వేంద్ర చహల్ భారత ఆర్మీని ప్రశంసించాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని కలచివేసిన ఆ ఘటనకు ప్రతీకారంగానే ఉగ్రస్థావరాలపై భారత్ మరో మెరుపు దాడి చేసింది. ఈ ఘటనలో 200 నుంచి 300 వరకూ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. The boys have played really well. #SudharJaaoWarnaSudhaarDenge #airstrike — Virender Sehwag (@virendersehwag) 26 February 2019 JAI HIND, IAF 🇮🇳 @IAF_MCC @adgpi #IndiaStrikesAgain #IndiaStrikesBack #IndiaStrikes — Gautam Gambhir (@GautamGambhir) 26 February 2019 Salute to the Indian Air Force. Shaandaar #IndiaStrikesBack — Mohammad Kaif (@MohammadKaif) 26 February 2019 Indian Air Force 🇮🇳👏 Bohot Hard Bohot Hard #IndiaStrikesBack #JaiHind 🇮🇳🇮🇳 — Yuzvendra Chahal (@yuzi_chahal) 26 February 2019 -
పాక్ ఆర్మీ తేరుకునేలోపే పనిపూర్తి...
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి ఘటనతో రగిలిపోతున్న భారత్ వైమానిక దళం... పాకిస్తాన్ ఆర్మీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ తేరుకునేలోపే భారత వైమానిక దళాలు కేవలం 21 నిమిషాల్లో దాడులు పూర్తి చేసుకుని వెంటనే వెనుతిరిగాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 జెట్ ఫైటర్లు...ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులను వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించగా, జైషే మహ్మద్‌కు చెందిన అల్పా-3 కంట్రోల్ రూం పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. (పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్) కీలకపాత్ర పోషించిన మిరాజ్ యుద్ధ విమానం... ఈ దాడుల్లో మిరాజ్ 2000 యుద్ధ విమానం కీలకపాత్ర పోషించింది. మొత్తం 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. అధునాతర మల్టీరోల్ ఫైటర్ అయిన ఈ యుద్ధ విమానం గంటకు 2,336 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. న్యూక్లియర్ దాడుల కోసం ఈ యుద్ధ విమానాన్ని ప్రత్యేకంగా రూపొందించబడింది. 1550 కిలోమీటర్ల లక్ష్యాన్ని మిరాజ్ అవలీలగా ఛేదించగలదు. సెకన్‌కు 280 మైల్స్ ఎగిరే సామర్థ్యం ఉండగా, 2X30 కెనాన్లతో 125 రౌండ్లు దాడి చేయగలదు. (సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!) తొలి దాడి : బాలాకోట్‌లో 3.45 గంటలకు రెండో దాడి : ముజఫరాబాద్‌లో 3.48 గంటలకు మూడో దాడి : చకౌటిలో 3.58 గంటలకు 21 నిమిషాల వ్యవధిలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన వైమానిక దళం -
వాయుసేనకు వందనం : ఫిలిం స్టార్స్
ఆత్మాహుతి దాడితో 40 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులపై భారత వైమానిక దళం పగ తీర్చుకుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం భారత వాయు సేన 29 నిమిషాల పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 200 నుంచి 300 మంది తీవ్రవాదులు హతమయ్యుంటారని భావిస్తున్నారు. ఈ ప్రతీకార చర్యపై ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ 2 అంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని విజయ గర్వాన్ని పంచుకుంటున్నారు. సినీ తారలు సైతం భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, మహేష్ బాబు, కమల్ హాసన్, రామ్ చరణ్, అఖిల్, వరుణ్ తేజ్, మంచు విష్ణు, మెహరీన్, సోనాక్షి సిన్హా, నితిన్, ఉపాసన, వెంకీ అట్లూరిలతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు విజయానందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. Our country gives a fitting reply. #IndiaStrikesBack . Salute to the Indian Air Force #JaiHind — Jr NTR (@tarak9999) 26 February 2019 Extremely proud of our #IndianAirForce. Salutes to the brave pilots of IAF🇮🇳 — Mahesh Babu (@urstrulyMahesh) 26 February 2019 Salute to the #IndianAirForce 🙏🏻. JAI HIND. #IndiaStrikesBack — rajamouli ss (@ssrajamouli) 26 February 2019 Our 12 return safely home after wreaking havoc on terrorist camps in Pakistan. India is proud of its heroes. I salute their valour. — Kamal Haasan (@ikamalhaasan) 26 February 2019 #SaluteIndianAirForce 🇮🇳🇮🇳🇮🇳 https://t.co/1G4RDOssu2 — Varun Tej Konidela (@IAmVarunTej) 26 February 2019 Proud of the Indian Air Force 🇮🇳 Jai Hind 🇮🇳 🙏🏼#IndiaStrikesBack #ramcharan pic.twitter.com/f5rN4Qc1sP — Upasana Konidela (@upasanakonidela) 26 February 2019 -
త్రివిధ దళాలకు సెలవులు రద్దు
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం త్రివిధ దళాలకు సెలవులను రద్దు చేసింది. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దీంతో తీర ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ మెరుపు దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారమన్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైమానిక మెరపుదాడుల గురించి హోంశాఖ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానికి వివరించారు. -
సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 భారత వాయిసేన విజయవంతంగా పూర్తి చేసింది. ఈ దాడులను ధృవీకరించిన పాక్.. తమ బలగాలు తిప్పికొట్టాయని చెబుతూనే.. ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. భారత వాయుసేన దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్థిక, రక్షణ శాఖతో ఆయన చర్చిస్తున్నారు. ఇక వాయుసేన దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానికి వివరించారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత వైమానిక మెరుపు దాడులపై యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత వైమానికి దళానికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. 🇮🇳 I salute the pilots of the IAF. 🇮🇳 — Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019 -
సర్జికల్ స్ట్రైక్ 2 విజయవంతం
-
పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీనగర్‌లోని వేర్పాటు వాదుల నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వేర్పాటువాదులు యాసిన్, మిర్వాయిజ్, షబీర్ షా, ఆశ్రఫ్ ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి నష్టం జరగలేదు.. భారత వైమానిక దాడులను ధృవీకరించిన పాక్.. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. భారత్ సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు ప్రేరేపిస్తోందని ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. పాక్ వైమానిక దళం ఎదురు దాడి చేయడంతో భారత యుద్ద విమానాలు వెనక్కు వెళ్లాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గఫూర్ స్పష్టం చేశారు. భారత్ వైమానిక దాడుల అనంతరం దానికి సంబంధించి ఫోటోలను పాక్ విడుదల చేసింది. అయితే ఈ దాడుల్లో 300మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. Indian aircrafts intruded from Muzafarabad sector. Facing timely and effective response from Pakistan Air Force released payload in haste while escaping which fell near Balakot. No casualties or damage. — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 26, 2019 -
గజ్వేల్‌లో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్
సిద్దిపేట జోన్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ గజ్వేల్ పట్టణంలో నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు గజ్వేల్ పట్టణంలో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్ ర్యాలీని నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో డీఆర్వో చంద్రశేఖర్, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలసి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 26, 27, 28 మార్చి 1 తేదీల్లో చేపట్టాల్సిన ర్యాలీలకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 26న ఉదయం 5 గంటలకు గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ బిల్డింగ్ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ వద్ద జరిగే ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావాలని వారు తెలిపారు. 25వ తేదీ సాయంత్రంలోగా గజ్వేల్ పట్టణంలో అందుబాటులో ఉండే విధంగా రావాలన్నారు. 26, 27 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్ జిల్లాలోని అభ్యర్థులకు రిక్రూట్మెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో ఆదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగుళాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావొచ్చన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 19 జనవరి 1999 నుంచి 1 జనవరి 2003 మధ్య జన్మించి ఉండాలన్నారు. అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని తెలిపారు. 5 నిమిషాల 40 సెకన్లలో 1.6 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. సమీక్షలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు యోగేష్ మూహ్ల, నరేందర్‌కుమార్, జోగేందర్‌సింగ్, ఏసీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఫ్లయింగ్ పరేడ్
-
క్రాస్బౌ–18 విజయవంతం
విశాఖ సిటీ: క్రాస్బౌ–2018 పేరుతో భారత వైమానిక దళం నిర్వహించిన క్షిపణి ప్రయోగ విన్యాసాలు గురువారంతో ముగిశాయి. గుంటూరు జిల్లా సూర్యలంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 3 నుంచి క్రాస్ బౌ విన్యాసాలు మొదలయ్యాయి. సదరన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షిపణి విన్యాసాల్లో ముఖ్య అతిథులుగా భారత వైమానిక దళాధిపతి బీరేందర్ సింగ్ ధనోవా, సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షన్ బి.సురేష్ పాల్గొన్నారు. ఉపరితలంపై నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్, స్పైడర్, ఒసా–ఎక్–ఎం, ఐజీఎల్‌ఏ మొదలైన క్షిపణులను విజయవంతంగా విన్యాసాల్లో పరీక్షించారు. భూ ఉపరితలం నుంచి గాలిలో ఉన్న శత్రు లక్ష్యాల్ని ఛేదించే ప్రయోగం విజయవంతమయ్యింది. రాత్రి సమయంలో ప్రత్యక్ష ఫైరింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్.యూ–30 ఫైటర్ జెట్ ఈ విన్యాసాల్లో పాల్గొంది. ఈ విన్యాసాల ద్వారా భారత వాయుదళాల మార్గదర్శక వ్యవస్థలు, అంతర్గత ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ సామర్థ్యాలను పరీక్షించారు. -
కుప్పకూలిన శిక్షణ విమానం..!
కిలోమీటర్ దూరంలోనే బాహుపేట గ్రామం.. పక్కనే నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి.. ఓ వెంచర్లో పనులు చేసుకుంటున్న పలువురు కూలీలు... ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఓ శిక్షణ విమానం పెద్దశబ్దంతో ఆ వెంచర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో కళ్లుమూసి తెరిచేలోపే కుప్పకూలింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే విమాన శకలాలు అల్లంతదూరాన పడ్డాయి. విమానం ఆనవాళ్లు లేకుండా కాలిబూడిదైపోయింది. ఉహించని ఘటనతో మండల పరిధిలోని బాహుపేట ఉలిక్కిపడింది. ప్రత్యక్ష సాక్షులు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట (ఆలేరు) : హైదరాబాద్ హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్శిక్షణ కేంద్రానికి చెందిన ఫైటర్ విమానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యోగేష్ యాదవ్ శిక్షణ తీసుకుంటున్నాడు. మరో 15 రోజులైతే శిక్షణ పూర్తి చేసుకునే దశలో యోగేష్ నడుపుతున్న ఫైటర్ విమానంలో హకీంపేట నుంచి బయలుదేరాడు. బాహుపేట సమీపంలోకి రాగానే.. బుధవారం ఉదయం సుమారు 11.40 గంటల ప్రాంతంలో యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలోకి రాగానే ఫైటర్ విమానంలోని ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారులతో ఎప్పటికప్పుడు పైలట్ యోగేష్ యాదవ్ సమస్యకు సంబంధించిన వివరాలు అందిస్తూనే ఉన్నాడు. విమానంలో తలెత్తిన సమస్య మరింత తీవ్రంగా మారింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి, పైలట్ యోగేష్ యాదవ్ విమానంలో ఉన్న ప్యారాచూట్, ఇతర సామగ్రి సహాయంతో బయటికి దూకాడు. దీంతో సుమారు అర కిలోమీటర్ దూరంలోకి వెళ్లి విమానం భారీ శబ్దంతో కుప్ప కూలిపోయి.. పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు, వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై నుంచి వెళ్లె ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సుమారు అర కిలోమీటర్ దూరంలో పడిపోయిన పైలెట్ యోగేష్ యాదవ్‌ను స్థానికులు వెళ్లి పరామార్శించారు. ఏం జరిగిందంటూ.. బాహుపేట సమీపంలో కుప్పకూలిన ఫైటర్ విమానం చూసి యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. శిక్షణ తీసుకుంటున్న పైలట్‌కు చెందిన ఫైటర్ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.. అదే సయమంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కోసం ప్రముఖ నాయకులు అప్పుడే బహిరంగ సభలకు బయల్దేరిన హెలికాప్టర్ ఏమైనా కుప్పకూలిందా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇటీవల వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హెలికాప్టర్లో పర్యటనలు చేస్తున్నారు. బుధవారం అధికంగా ప్రముఖులు వివిధ ప్రాంతాలకు పర్యటించే క్రమంలో ఏమైన ప్రమాదం జరిగాందా అనే అనుమానంతో అధిక సంఖ్యలో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో చేరుకున్నా రు. శిక్షణ తీసుకుంటున్న విమానం కుప్పకూలిందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూడా ఎవరు లేకపోవడంతో ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అధికారులు సంఘటన స్థలానికి 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో చేరుకున్నారు. తొలుత హెలికాప్టర్లో ఆర్మీకి చెందిన వైద్యులు నలుగురు అక్కడికి చేరుకున్నారు. పైలెట్‌కు వైద్య పరీక్షలు చేసి, మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలోనే మరో హెలికాప్టర్ ఆకాశంలో నాలుగు సార్లు తిరిగి దిగింది. అందులో ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సాంకేతిక నిపుణులు వచ్చి అక్కడ ఖాళీ బూడిదైన శకలాలను పరిశీలించారు. అంతకు ముందే భువనగిరి ఏసీపీ జితేదర్రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేష్‌లు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయాలతో పైలెట్.. సెల్ఫీలతో యువకులు... శిక్షణ విమానంలో గాయాలైన పైలెట్‌ను రక్షించకుండా స్థానిక యువకులు సెల్ఫీ తీసుకున్నారు. కనీస మానవతాదృక్పథంతో ఆలోచించకుండా ఖాళీ బూడిదైన విమానం వద్ద, గాయాలై కిందపడిపోయిన పైలెట్ వద్దకు వెళ్లి కొందరు యువకులు సెల్ఫీలు తీసుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ శబ్దం వచ్చింది మేము వెంచర్లో పనులు చేస్తున్నాం. అప్పుడే మా సార్ కారులో వస్తున్నాడు. ఒక్క సారిగా విమానం ఆకాశంలో నుంచి కిందకి వస్తుంటే అందులో నుంచి ఓ వ్యక్తి బెలున్ కట్టుకొని కిందకు దూకాడు. కళ్లు తెరచి మూసే లోపే భారీ శబ్దంతో విమానంలో భూమిపై పడిపోయింది.దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. దానిని చూసి షాక్‌కు గురయ్యాం. భయమేసింది. నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు. కొద్ది సేపటికి తేరుకొని చూసే సరికి జనమంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కిందపడిన వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేసిన.. భాష అర్థం కాలేదు. ఇలాంటి ప్రమాదం చూడడం ఇదే ప్రథమం. – నిర్మల, బాలలక్ష్మి, ప్రత్యక్ష సాక్షులు -
ఏకీకృత కమాండ్‌తోనే యుద్ధాల్లో విజయం
న్యూఢిల్లీ: శత్రుదేశాలతో యుద్ధాలను వీలైనంత త్వరగా గెలవడానికి ఆర్మీ, నావికాదళం, వాయుసేనలను కలిపి ఏకీకృత కమాండ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా తెలిపారు. యుద్ధాల సమయంలో త్రివిధ దళాలు పరస్పరం సమన్వయం చేసుకుంటే శత్రువులను చావుదెబ్బ తీయవచ్చని వెల్లడించారు. ఈ ఏకీకృత కమాండ్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రంతో పాటు రక్షణశాఖ వర్గాలు పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు ఈ విధానాన్ని ఇప్పటికే పాటిస్తున్నాయన్నారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనోవా మాట్లాడుతూ.. చైనా తన సైన్యాన్ని ఐదు ఏకీకృత కమాండ్లుగా విభజించిందని తెలి పారు. భారత్‌లో మాత్రం 17 కమాండ్లు ఉన్నాయనీ, ఒక్క అండమాన్–నికోబార్ దీవుల్లో మాత్రం 2001లో వ్యూహాత్మక ఏకీకృత కమాండ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. రక్షణరంగంలో స్వయంసమృద్ధి సాధించడం ప్రతి దేశానికి కీలకమని వ్యాఖ్యానించారు. ఐఏఎఫ్‌లో దశలవారీగా ఆధునీకరణ చేపడుతున్నట్లు ధనోవా వెల్లడించారు. -
రాఫెల్ డీల్ అవసరమే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ ఫైటర్ జెట్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సమర్థించారు. గతంలో కూడా ఇలా అత్యవసరంగా భారత్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిందని తెలిపారు. బుధవారమిక్కడ ధనోవా మాట్లాడుతూ.. ‘చైనా తన వాయుసేన సామ ర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. దేశ సరిహద్దులోని టిబెట్‌లో యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను మోహరిస్తోంది. ఇండియా కూడా ఇందుకు తగ్గట్లు వాయుసేనలో ఆధునీకరణ చేపట్టాలి. పక్కనే రెండు అణ్వ స్త్ర దేశాలు (చైనా, పాక్) ఉన్నటువంటి విచిత్ర పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. వీరి ఉద్దేశాలు రాత్రికి రాత్రి మారిపోవచ్చు. చైనా దగ్గర 1,700 ఫైటర్ జెట్లు ఉండగా, వీటిలో 800 జెట్లు నాలుగో తరానికి చెందినవే. ఒకవేళ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే వీటిలో చాలామటుకు రంగంలోకి దిగుతాయి. ప్రస్తుతం భారత్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని మరే దేశానికి ఈ స్థాయిలో ప్రమాదం లేదు’ అని చెప్పారు. ఒకవేళ భారత్ 42 స్క్వాడ్రన్ జెట్లను సమకూర్చుకున్నా, చైనా–పాక్‌ల సామర్థ్యంకన్నా తక్కువగానే ఉంటుందన్నారు. -
రియల్ హీరో.. ఓ బాలుడిని కాపాడేందుకు
తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వర్షాలు కేరళను ముంచేశాయి. దాదాపు అన్ని జిల్లాలు వరద ముప్పులో కూరుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. తమ ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 'గరుడ్' కమాండర్ ప్రశాంత్ అద్భుత సాహసంతో ఓ బాలుడిని కాపాడాడు. అలప్పుజ పట్టణంలో ఓ ఇంటి చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లో వారంతా ఇంటిపై కప్పుకు చేరుకున్నారు. అందులో ఓ బాలుడిని కమాండర్ ప్రశాంత్ హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో పై కప్పుకు చేరుకుని ఓ చేత్తో బాలుడిని, మరో చేత్తో తాడును పట్టుకొని సాహసంతో హెలికాప్టర్లోకి చేరుకున్నారు. కాగా బాలుడిని కాపాడిన కమాండర్‌కు ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన రియల్ హీరో, సైనికుడు మన కోసం ఏమైనా చేస్తాడు, దటీజ్ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు ప్రశాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
రియల్ హీరో.. ఓ బాలుడిని కాపాడేందుకు
-
కూలిన మిగ్ 21
షిమ్లా: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే జవాలీకి సమీపంలోగల పట్టా జతియన్ గ్రామంలో మధ్యాహ్నం 1.21గంటలకు కుప్పకూలింది. విమానం కూలిన ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. సహాయక చర్యలకోసం రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలిక్యాప్టర్లు రంగంలోకి దిగాయి. జరిగిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనతో కలిపి.. ఈ ఏడాది ప్రమాదాలకు గురైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఅఊ) విమానాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. జూన్ 27న మహారాష్ట్రలోని నాసిక్‌లో సుఖోయ్–30, జూన్ 5న గుజరాత్‌లోని కచ్‌లో జాగ్వర్ విమానాలు కుప్పకూలాయి. మే 27న జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో మిగ్–21 ఫైటర్ కూలిపోయింది. ఒకప్పుడు మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అత్యంత కీలకమైనదిగా నిలిచింది. -
అమ్మాయిలంటే ఇలా ఉండాలి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలన్న ధ్యేయంతో చిన్నప్పట్నుంచీ ప్రతి క్లాస్‌లోనూ ఫస్ట్ వచ్చింది ఆంచల్ గంగ్వాల్. క్లాస్‌లోనే కాదు, క్లాస్ బయట ఆటల్లోనూ ఫైటింగ్ స్పిరిట్ చూపించింది. కలలకు రెక్కలు కట్టుకుని చదివి, ఫ్లయింగ్ బ్రాంచ్‌లో సీటు సాధించింది! వేటూరి గారు అన్నట్లు ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు’. అంతేనా! ఆంచల్ గంగ్వాల్ కూడా అవుతారు! తమ మీద తమకు అచంచలమైన నమ్మకం ఉండి కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని నిరూపించింది ఆంచల్. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన ఈ అమ్మాయి ఇటీవలే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్వీస్‌కు ఎంపికైంది. ఆరు లక్షల మంది రాసిన ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో 22 మంది ఎంపికయ్యారు. వారిలో అమ్మాయిలు ఐదుగురు. ఆ ఐదుగురిలో ఫ్లయింగ్ బ్రాంచికి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఒకే ఒక అమ్మాయి ఆంచల్. అందుకే ఆంచల్ సాధించిన విజయం పట్ల ఆమె అమ్మానాన్నలతో పాటు రాష్ట్రం కూడా గర్వపడుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఆంచల్‌కు అభినందనలు తెలియచేశారు. ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి అర్చనా చిట్నీస్ అయితే స్వయంగా ఆంచల్ ఇంటికి వచ్చి మరీ అభినందించారు. ‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ని అంచల్ బుగ్గలు పుణికారామె. పెద్దింటమ్మాయి కాదు! ముఖ్యమంత్రి అభినందనలు, మంత్రి ప్రశంసలు అందుకున్న ఆంచల్.. ఆర్థికంగా ఒక సాధారణ దిగువ తరగతి ఇంటి అమ్మాయి. నీముచ్ జిల్లా కేంద్రంలో బస్‌స్టాండ్‌లో టీ దుకాణం నడుపుతాడు ఆంచల్ తండ్రి సురేశ్. అయితే ఇప్పుడు పట్టణంలో అందరికీ ఆంచల్ వల్లనే ‘నామ్‌దేవ్ టీ స్టాల్’ గురించి తెలిసింది. ‘‘నా టీ స్టాల్‌ని వెతుక్కుంటూ వచ్చి ఆంచల్ తండ్రి మీరేనా అని అడిగి మరీ నన్ను అభినందిస్తున్నారు, నా కూతురు పైలటయినా అంత ఆనందం కలిగిందో లేదో కానీ తండ్రిగా నా గుండె ఉప్పొంగిపోతోంది’ అంటున్నాడు సురేశ్. ఇది ఆరో ప్రయత్నం రక్షణ రంగంలో చేరాలనే ఆలోచన బాల్యంలోనే మొలకెత్తింది ఆంచల్‌లో. నీముచ్‌లోని మెట్రో హెచ్ఎస్ స్కూల్లో క్లాస్ టాపర్ అయ్యింది. దాంతో స్కూల్ కెప్టెన్ అయింది. తర్వాత ఉజ్జయిన్లో విక్రమ్ యూనివర్సిటీలోనూ ప్రతిభ కనబరిచి స్కాలర్షిప్కు ఎంపికైంది. బాస్కెట్‌బాల్, 400 మీటర్ల పరుగులో కాలేజ్‌కు ప్రాతినిధ్యం వహించింది. డిఫెన్స్‌లో చేరాలంటే అన్ని రకాల నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి కాబట్టి ఇన్నింటిలో చురుగ్గా ఉండేదాన్నని చెబుతుంది ఆంచల్. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులు కోవడానికి కారణమూ డిఫెన్స్ పట్ల ఇష్టమేనంటోంది. సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరితే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ప్రిపరేషన్‌కి వెసులుబాటు ఉండదని వదిలేసిందామె. ఆ తరువాత వచ్చిన లేబర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ప్రిపరేషన్‌కి అవకాశం ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతనే చేరింది. ఒక పక్క ఇతర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే తను కలగన్న డిఫెన్స్ ఉద్యోగానికి పరీక్షలు రాస్తూ వచ్చింది. ఐదు ప్రయత్నాలు సఫలం కాకపోయినా సంకల్పాన్ని వదలకపోవడమే ఆంచల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆరవ ప్రయత్నంలో ఆమె ఎయిర్‌ఫోర్స్ రంగంలో సెలెక్ట్ అయింది. ఆ ఫలితాలు ఈ నెల ఏడవ తేదీన వెలువడ్డాయి. అప్పటి నుంచి ఆమె ఇంటి ఫోన్ రింగవుతూనే ఉంది. ‘ఆంచల్! నేల మీద నుంచి నింగి దాకా ఎదిగావు’ అంటూ అభినందనల వాన కురుస్తూనే ఉంది. – మంజీర ఆ వరదలే కారణం! నేను పన్నెండవ తరగతిలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తాయి. అప్పుడు బాధితులను రక్షించడానికి ఆర్మీ జవాన్లు బృందాలుగా వచ్చారు. తమకు ఏమవుతుందోననే భయం వారిలో ఏ కోశానా కనిపించేది కాదు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో చొరవగా దూసుకెళ్లిపోయి బాధితులను కాపాడడం చూసినప్పుడు నాకు ఒళ్లు పులకరించినట్లయింది. ఇలాంటి సర్వీసుల్లో చేరాలని నాకప్పుడే అనిపించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పట్లో చేరలేకపోయాను. ఆ కల ఇప్పటికి తీరింది. నా కోచింగ్ కోసం నాన్న లోన్ తీసుకున్నాడు. ఉద్యోగంలో చేరగానే లోన్ తీరుస్తాను. ఆ లోన్ తీర్చినప్పుడే నాన్న కళ్లలోకి ధైర్యంగా చూడగలుగుతాను. – ఆంచల్, ఐఎఎఫ్ -
ఛాయ్‌వాలా బిడ్డ.. ‘గగన’ విజయం..
భోపాల్ : భారత వాయుసేనలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఛాయ్‌వాలా కూతురి కల నెరవేరింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఆంచల్ గంగ్వాల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్)లో ఫ్లయింగ్ బ్యాచ్‌కి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది ఏఎఫ్సీఏటీ పరీక్షకు హాజరవ్వగా అందులో ఎంపికైన 22 మంది ఆంచల్ ఒకరు. ఆంచల్ ఎఫ్‌సీఏటీ పరీక్షను ఎదుర్కొవడం ఇది ఆరోసారి. తొలి ఐదు ప్రయత్నాల్లో ఆమె రాత పరీక్ష అనంతర టెస్టుల్లో విఫలం చెందారు. ఆంచల్ తండ్రి సురేశ్ గంగ్వాల్ నీముచ్ బస్టాండ్‌లో టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. వీరంతా చదువులో రాణించడంతో ఆర్థికంగా పరిస్థితులు బాగోలేకున్నా అప్పులు చేసి మరీ చదివించారు. ఆంచల్ చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. ఉత్తరాఖండ్ వరదల సమయంలో భారత సైన్యం చూపిన తెగువను చూసి స్ఫూర్తి పొందిన ఆంచల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. చదువు పూర్తి అయ్యాక పోటీ పరీక్షలకు ఆమె ఇండోర్‌లో కోచింగ్ తీసుకుని సన్నద్ధమయ్యారు. వరుసగా పరీక్షలు రాయగా పోలీసు శాఖలో ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. అందులో ట్రైనింగ్‌లో ఉండగా లేబర్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం రావడంతో ఎయిర్‌ఫోర్స్‌కు సాధన చేయొచ్చనే ఉద్దేశంతో అందులో చేరిపోయారు. ఎంతో శ్రమకోర్చి ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలన్న తన కలను నెరవేర్చుకుంది. ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్‌కి ఎంపికైన ఆంచల్‌ను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. సోషల్ మీడియా ద్వారా ఆమెకు అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. -
భారత్ ‘గగన’ విన్యాసం..!
సాక్షి, హైదరాబాద్ : భారత వాయుసేన భారీ సైనిక కసరత్తుకు తెరతీసింది. శత్రుదేశాల నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా అతి తక్కువ సమయంలోనే కార్యరంగంలోకి దూకేలా తన సన్నద్ధతకు మరింత పదునుపెడుతోంది. దీనిలో భాగంగా గతంలో కనీవినీ ఎరుగని విధంగా దేశవ్యాప్తంగా ఉన్న తన స్థావరాల్లోని మొత్తం విమానాలు, సిబ్బందిని పరీక్షించేలా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతోంది. ‘గగన్‌శక్తి–2018’ పేరిట ఈ నెల 10 నుంచి 23 తేదీ వరకు అత్యు న్నతస్థాయి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. రెండు దశల్లో పాకిస్థాన్, చైనా సరిహద్దులలో చేపడుతున్న అత్యంత విస్తృత శిక్షణా కార్యక్రమాల ద్వారా తన అపార సైనిక శక్తిని, యుద్ధానికి ఎప్పుడైనా రెడీ అనేలా వాయుసేన బలాన్ని ప్రదర్శిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతమంతా విస్తరించేలా భారత్ చేపట్టిన ఈ కసరత్తు గత కొన్ని దశాబ్దాల కాలంలోనే అతి పెద్దది. భారత సైన్యం (ఆర్మీ), నావికా (నేవీ)దళంతో కూడా కలిసి వాయుసేన సంయుక్త సైనిక చర్యలు చేపట్టడం దీని ప్రత్యేకత. ఇందులో వాయుసేనకు సంబంధించిన యావత్ యుద్ధవిమాన శ్రేణులు పాల్గొంటున్నాయి. ఎందుకు ? వైమానిక దళానికి సంబంధించి ప్రతిదాడులతో సహా అన్ని బలాలు పరీక్షించడం యుద్ధసన్నద్ధతలో భాగంగా వివిధ విభాగాలు,రంగాల సమన్వయంపై సమీక్ష వాయుసేనకున్న బలం,బలగాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ రంగంలో తనకున్న అధిపత్యం చాటడం. ప్రత్యేకతలు... ఈ కసరత్తులో 1,100 యుద్ధ (సిబ్బంది, ఆయుధాల రవాణాతో సహా) విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. 300 మందికి పైగా ఫైటర్ పైలట్లు, ఇతర ఉన్నతస్థాయిఅధికారులు, 15 వేల మంది వైమానికదళ సభ్యులు పాల్గొన్నారు. ఎడారి ప్రాంతాలు మొదలుకుని, అత్యంత ఎల్తైన ప్రాంతాలు, సముద్రజలాలు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే ఆపరేషన్లు, గరుడ కమాండోల దాడుల వరకు విస్తృతస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకాశంలో, ఆకాశం నుంచి భూమిపైకి దాడి, పారాట్రూపర్ల ద్వారా మెరుపుదాడి, యుద్ధంలో గాయపడిన సైనికుల తరలింపు వంటి వాటిని పరీక్షించింది. ఏవేవి పరీక్షించారు... బ్రహ్మోస్, హార్పూన్ యాంటీ–షిప్ క్షిపణులతో కూడిన సుఖోయ్ (ఎస్‌యూ)–30, జాగ్వార్ యుద్ధ విమానాలు తమ లక్ష్యాలు చేధించడాన్ని పరిశీలించారు. సీ–17 గ్లోబ్‌మాస్టర్, ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లు, సీ–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాల పనితనాన్ని పరీక్షించారు. పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులో కేవలం మూడురోజుల్లోనే 5వేల సార్లు యుద్ధవిమానాలు రాకపోకలు సాగించడం విశేషం. భారత వాయుసేనకు చెందిన పీ–8ఐ ఎమ్మార్ విమానాన్ని ఉపయోగించి సుదూర లక్ష్యాల చేధన పరీక్ష. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ఇటీవలే ప్రవేశించిన ఎల్సీఏ (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) తేజాస్‌ను తొలిసారి పరీక్షించారు. తేజాస్ మార్క్–1ను ఇప్పటికే ఆమోదించిన ఐఏఎఫ్, దానిని త్వరలోనే మరింత నవీకరించి తేజస్ మార్క్–1ఏ, తేజస్–మార్క్ 2 లను రంగంలోకి దించనుంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
లక్ష కోట్లతో ఫైటర్‌జెట్స్ కొనుగోలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దాదాపు 110 యుద్ధవిమానాల కొనుగోలుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) శుక్రవారం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(ఆర్ఎఫ్ఐ) జారీచేసింది. జూలై 6లోపు తమ ప్రతిపాదనల్ని పంపాలని కోరింది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థలు మొత్తం యుద్ధ విమానాల్లో 85 శాతాన్ని మేకిన్ ఇండియా కింద భారత్‌లో దేశీయ కంపెనీలతో కలసి తయారుచేయాలి. మిగిలిన విమానాలను వినియోగానికి సిద్దంగా ఉన్న స్థితిలో అందజేయాలి. 15 బిలియన్ డాలర్ల(సుమారు రూ.97, 342 కోట్లు) విలువైన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, డసాల్ట్, బోయింగ్ వంటి సంస్థలు పోటీపడుతున్నాయి. ఎఫ్–16, ఎఫ్–18 కొనుగోలుపై భారత్ నిర్ణయంపైనే యుద్ధ విమానాలకు సంబంధించి తమతో రక్షణ సంబంధాలు ఆధారపడి ఉంటాయని అమెరికా తెలిపింది. -
ఆకాశమే హద్దుగా...
అవకాశం లభించాలేగానీ ఆకాశమే మాకు హద్దు అంటున్నారు భారత మహిళామణులు... అవనీ చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్. దేశంలోనే మొదటి మహిళా సూపర్సోనిక్ జెట్ ఫైటర్లుగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రస్తుతం భారత వాయు సేనలో శిక్షణ పొందుతున్న వీరు మరో నెల రోజుల్లో యుద్ధ విమానాలను నడపబోతున్నారు. యుద్ధ విమానాల్లో మొదటిసారి...! ఈ మహిళా త్రయం తేలికపాటి యుద్ధ విమానాలైన పిలాటస్ పీసీ-7, కిరణ్, హాక్ జెట్లను నడిపేందుకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం అవని, భావన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, అత్యధిక టేకాఫ్ వేగం కలిగిన మిగ్-21 యుద్ధ విమానాలను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. అవని 2 సీట్ల సామర్థ్యం కలిగిన మిగ్-21 రకం విమానాన్నినడిపేందుకు సూరత్‌ఘర్ ఎయిర్‌బేస్‌లో శిక్షణ పొందుతోంది. భావన కూడా అంబాల ఎయిర్‌బేస్‌లో శిక్షణకు సిద్ధమవుతోంది. ఇక మోహన హాక్ జెట్‌ను నడిపేందుకు కలైకుండ ఎయిర్‌బేస్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత ఆపరేషనల్ స్క్వాడ్‌గా వెళ్లబోతుందని సీనియర్ అధికారి తెలిపారు. కఠినమైన శిక్షణలో నెగ్గితేనే...! జెట్ ఫైటర్‌గా రాణించాలంటే కఠినమైన శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు పన్నెండుసార్లు ద్వంద్వ తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట విమానం ఎగరటంలో మెళకువలు, నిర్వహణ పద్ధతులు, టేకాఫ్, లాండింగ్ వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. యుద్ధ విమానం నడిపే సమయంలో ఏర్పడే చిక్కుల్ని ఎదుర్కొనే సమయస్ఫూర్తి, సామర్థ్యం, నేర్పు ఉండాలి. ప్రాథమిక శిక్షణ అనంతరం యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. అవసరాన్ని బట్టి ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి విమాన మార్గాన్నిమళ్లించే చతురత కలిగి ఉండాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు. ఈ దశలన్నీ దాటుకుని సుమారు ఏడాదిన్నరగా జరుగుతున్న శిక్షణ పూర్తి చేసుకుని మొదటి మహిళా పైలట్ ఫైటర్లుగా మారనున్న అవని, భావన, మోహనలకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. - సుష్మారెడ్డి యాళ్ళ -
చైనా చేష్టలకు భారత కౌంటర్ షురూ
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కవ్వింపు చర్యలకు భారత సైన్యం కౌంటర్ యాక్షన్ మొదలుపెట్టేసింది. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్)లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టును భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తమ ఆధీనంలోకి తీసేసుకుంది. ఇక్కడి నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలతో గస్తీని నిర్వహణకు సిద్ధమైపోయింది. ‘రెండు సుఖోయ్(సు-30 ఎంకేఐ) విమానాలు ఫిబ్రవరి 19వ తేదీ ఉదయాన్నే బయలుదేరుతాయి. రెండు రోజులపాటు గస్తీ నిర్వహించి 20వ తేదీ సాయంత్రం తిరిగి ఎయిర్ బేస్‌కు చేరుకుంటాయి. సినో(చైనా)-భారత్ సరిహద్దు వెంబడి ఇవి క్షుణ్ణంగా తనిఖీలు చేపడతాయి. కొన్ని రోజులకు దీనిని దీర్ఘకాలికంగా కొనసాగిస్తాం’ అని ఐఏఎఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది మాములు చర్యే అని ప్రకటించుకున్నప్పటికీ.. దీనివెనుక ముందు చూపు ఉన్నట్లు స్పష్టమౌతోంది. రెండు దేశాల మధ్య దాదాపు 4000 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంది. భవిష్యత్తులో చైనా సరిహద్దు(గగనతలం గుండా) ఉల్లంఘనకు పాల్పడితే అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు, ఉత్తరాఖండ్ ప్రాంతాలు లక్ష్యాలుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు గతంలో భారత సరిహద్దుల దాకా చైనా యుద్ధ విమానాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణాన అయినా దాడులు జరిగే అవకాశం ఉందని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే ధాటిగా సమాధానం ఇచ్చేందుకే భారత సైన్యం ఈ ఎయిర్ బేస్‌ను నెలకొల్పినట్లు అధికారి ఒకరు స్పష్టం చేశారు. -
ఎంఐ–8 హెలికాప్టర్లకు వీడ్కోలు
సాక్షి, బెంగళూరు: దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సాయుధ బలగాలకు సేవలందించిన ఎంఐ–8 హెలికాప్టర్లు తెరమరుగయ్యాయి. ‘ప్రతాప్’గా పిలిచే సోవియెట్ కాలానికి చెందిన ఈ హెలికాప్టర్లకు వాయుసేన ఆదివారం అధికారికంగా వీడ్కోలు పలికింది. 1972లో భారత వాయుసేనలో చేరిన ఇవి ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ పవన్ లాంటి కీలక సమయాల్లో సైనికులు, వాహనాల తరలింపులో విశేష సేవలందించాయి. బెంగళూరులోని ఎలహంక వైమానిక స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో చివరిసారిగా ఇవి తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్(రిటైర్డ్) ఫాలి హోమి మేజర్‌తో పాటు కొందరు మాజీ వాయు సేనాధికారులు చివరిసారి ఈ హెలికాప్టర్లను నడిపారు. కార్యక్రమంలో విశ్రాంత వాయుసేన ఉద్యోగులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హైవేపై యుద్ధవిమానాల ల్యాండింగ్
లక్నో: అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేం దుకు లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) నిర్వహించిన ‘టచ్ అండ్ గో’ కసరత్తులు కళ్లుచెదిరేలా సాగాయి. ఐఏఎఫ్ యుద్ధ, రవాణా విమానాలు మంగళవారం ఎక్స్‌ప్రెస్‌వేపై దిగి అనంతరం గాల్లోకి ఎగురుతూ తమ సామర్థ్యాన్ని చాటి చెప్పాయి. లక్నోకు 65 కి.మీ. దూరంలోని ఉన్నావ్ జిల్లా బంగర్మౌ సమీపంలో చేపట్టిన కసరత్తుల్లో 12కు పైగా మిరేజ్–2000, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో పాటు 35 వేల కిలోల బరువైన సీ–130జే సూపర్ హెర్క్యులస్ విమానం పాలుపంచుకున్నాయి. విన్యా సాలు కొనసాగిన ప్రాంతానికి ఐఏఎఫ్ ప్రత్యేక బలగాలైన గరుడ్ కమాండోలు భద్రత కల్పించారు. ఈ డ్రిల్‌లో ముందుగా సీ–130జే రవాణా విమానం తాత్కాలిక రన్‌వేపై దిగగా అందులో నుంచి గరుడ్ కమాండోలు తమ వాహనాలతో బయటకు వచ్చి హైవేకు ఇరువైపులా రక్షణ కవచంలా నిలబడ్డారు. అనంతరం ప్రధాన ఆకర్షణగా నిలిచిన సుఖోయ్ 30, మిరేజ్ 2000లు ఎక్స్‌ప్రెస్‌వేపై దిగుతూ కళ్లు చెదిరే వేగంతో గాల్లోకి ఎగిరాయి. వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ రక్షణ, సహాయక చర్యల కోసం సీ–130జే విమానం సాయపడుతుందని రక్షణ శాఖ(సెంట్రల్ కమాండ్) పీఆర్వో గార్గి మాలిక్ సిన్హా చెప్పారు. ‘ఈ విమానం పెద్ద మొత్తంలో సహాయక సామగ్రిని మోసుకెళ్లగలదు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉపయోగించవచ్చు’ అని ఆమె తెలిపారు. యుద్ధం, విపత్తుల సమయాల్లో వాయుసేన సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ కసరత్తులు నిర్వహించినట్లు సిన్హా వెల్లడించారు. ప్రధాన ఆకర్షణగా సీ–130జే సీ–130జే విమానాలు 2010లో వాయుసేనకు అందుబాటులోకి రాగా.. ఎక్స్‌ప్రెస్ వేపై దిగడం మాత్రం ఇదే మొదటిసారి.. ఒకేసారి 200 మంది కమాండోలను తరలించే సామర్థ్యం దీని సొంతం. ధర దాదాపు రూ. 900 కోట్లు. ఇక 2015, 16ల్లో మిరేజ్–2000 విమానాలు యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ‘టచ్ అండ్ గో’ డ్రిల్‌లో పాలుపంచుకోగా.. గత నవంబర్‌లో లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఆరు సుఖోయ్–30 జెట్లు యుద్ధ సన్నద్ధతను చాటిచెప్పాయి. -
రోడ్లపై యుద్ధ విమానాలు..
-
హైవేలపై యుద్ధ విమానాల ల్యాండింగ్
-
ఐఏఎఫ్: నమ్మలేని నిజాలు
ప్రపంచంలోని అత్యుత్తమ వాయుసేన దళాల్లో భారతీయ వాయుసేన ఒకటి. అత్యంత శక్తివంతమైన, నాణ్యమైన, నిపుణులైన పైలెట్లతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిండివుంది. భారతీయ వాయు సేన ఏర్పడి 85 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారతీయ వాయుసేన గురించి ఆసక్తిర విషయాలు తెలుసుకుందాం. 1933లో భారతీయ వాయుసేన ఏర్పడే నాటికి అందులో కేవలం ఆరు మంది మాత్రమే సుశిక్షుతలైన సిబ్బంది. మరో 19 మంది ఎయిర్మెన్లుతో వాయుసేన ఏర్పడింది. మొదట ఐఏఎఫ్ వినియోగించిన ఎయిర్ క్రాఫ్ట్.. వెస్ట్‌ల్యాండ్ వాప్టి ఐఐఏ. ఇవి మొత్తం 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. అదే ఏడాది ఏప్రిల్ 1న ఐఏఎఫ్ మొదటి స్క్వాడ్రాన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం మొదలైన వెంటనే ఐఏఎఫ్‌ను మరింత బలోపేతం చేశారు. 16 మంది ఉన్నతాధికారులు, 662 మంది సిబ్బంది కీలక అధికారులతో కలిపి మొత్తం 28,500కు బలం చేరింది. 1945లో ఐఏఎఫ్‌కు రాయల్ అన్న పేరు వచ్చి చేరింది. 1950 నుంచి ఇప్పటివరకూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నాలుగు యుద్ధాల్లో కీలక సేవలు అందించింది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 3,4,7,8, 10 స్క్వాడ్రాన్ టీములు ఉన్నాయి. 1946లో ఎయిర్‌ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ యూనిట్‌ను మొదలు పెట్టింది. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘధూత్, ఆపరేషన్ కాక్టస్, ఆనపరేషన్ పూమాలైలను ఐఎఎఫ్ విజయవంతంగా పూర్తి చేసింది. భారతీయ వాయు సేన ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో పలు దేశాల్లో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించింది. ప్రధానంగా కాంగో ఉద్యమాన్ని అణచడంలో ఐఏఎఫ్ పాత్ర అత్యంత కీలకమైంది. -
కుప్పకూలిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్..!
-
కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్..!
సాక్షి, న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారత వైమానిక దళం (ఐఏఎఫ్) హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు.. చాపర్‌లో ఉన్న మొత్తం ఏడుగురు ఐఏఎఫ్ సిబ్బంది ప్రాణాలు విడిచారు. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకు ఐఏఎఫ్‌కు చెందిన ఎం-17 వీ5 చాపర్ కూలిపోయింది. ఐఏఎఫ్ ఫైలట్లు శిక్షణ పొందుతున్న ప్రక్రియలో భాగంగా ఎం-17 వీ5 చాపర్ ప్రమాదానికి గురైంది. ఈ చాపర్ కూలిపోవడానికి కారణం ఏమిటన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనకు సాంకేతికలోపాలు కారణమా? లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులా? తెలియాల్సి ఉంది. -
అర్జన్ సింగ్ ఇక లేరు
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎఎఫ్ మార్షల్ అర్జన్ సింగ్ (98) తీవ్ర గుండెపోటుతో శనివారం రాత్రి ఆర్మీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవాలు కొద్దిసేపటి క్రితమే ఆర్మీ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు. భారత మిలటరీ చరిత్రలో అర్జన్ సింగ్ ఓ ఐకాన్. 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫైవ్ స్టార్ ర్యాంక్ దక్కిన అధికారి అర్జన్ సింగ్ మాత్రమే. ఫీల్డ్ మార్షల్‌తో సమానమైన డిస్టింక్షన్‌ను పొందిన ఏకైక ఐఏఎఫ్ అధికారి. అర్జన్ సింగ్ 1919 ఏప్రిల్ 15న (పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్) ల్యాలాపూర్‌లో జన్మించారు.1949లో ఎయిర్ కమాండర్‌గా ఎదిగిన ఆయన 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత వాయుసేన చీఫ్‌గా ఉన్నారు. అర్జన్ సింగ్ సేవలకు గుర్తింపుగా పనాగఢ్ ఎయిర్ బేస్‌కు ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్ పేరు పెట్టడం విశేషం. -
విషమంగా మార్షల్ అర్జన్ సింగ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎఎఫ్ మార్షల్ అర్జన్ సింగ్ (98) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆయనకు ఈ రోజు ఉదయం మాసివ్ అటాక్ రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో అర్జన్ సింగ్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ ధనోవా.. ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. అర్జన్ సింగ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అర్జన్ సింగ్‌ను చూశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్జన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అలాగే వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. We are all praying for the speedy recovery of Marshal of the Indian Air Force Arjan Singh. Doctors are doing their best. — Narendra Modi (@narendramodi) 16 September 2017 Went to R&R Hospital to see Marshal of the Indian Air Force Arjan Singh, who is critically ill. I also met his family members. — Narendra Modi (@narendramodi) 16 September 2017 భారత మిలటరీ చరిత్రలో అర్జన్ సింగ్ ఓ ఐకాన్. 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫైవ్ స్టార్ ర్యాంక్ దక్కిన అధికారి అర్జన్ సింగ్ మాత్రమే. ఫీల్డ్ మార్షల్‌తో సమానమైన డిస్టింక్షన్‌ను పొందిన ఏకైక ఐఏఎఫ్ అధికారి. అర్జన్ సింగ్ 1919 ఏప్రిల్ 15న (పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్) ల్యాలాపూర్‌లో జన్మించారు.1949లో ఎయిర్ కమాండర్‌గా ఎదిగిన ఆయన 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత వాయుసేన చీఫ్‌గా ఉన్నారు. అర్జన్ సింగ్ సేవలకు గుర్తింపుగా పనాగఢ్ ఎయిర్ బేస్‌కు ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్ పేరు పెట్టడం విశేషం. -
ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్స్‌లో అభ్యర్థుల ఇబ్బందులు
-
‘మేకిన్ ఇండియా’లో ఎఫ్–16 విమానాలు
న్యూఢిల్లీ: ఎఫ్–16 యుద్ధ విమానాలను భారత్‌లో తయారుచేయడానికి అమెరికా రక్షణ ఉత్పత్తుల సంస్థ లాక్‌హీడ్ ముందుకొచ్చింది. భారత వాయుసేన నుంచి ఈ విమానాలకు ఆర్డర్ లభిస్తే ‘మేకిన్ ఇండియా’ కింద వాటిని ఇక్కడే ఉత్పత్తి చేస్తామంది. అంతేకాకుండా భారత్ నుంచే వాటిని ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తామని తెలిపింది. అయితే వాయుసేనకు 100 ఎఫ్–16 జెట్ విమా నాలు సమకూర్చడానికి సంబంధించిన ఆర్డర్ కోసం స్వీడన్ కంపెనీ సాబ్తో లాక్‌హీడ్ పోటీ పడుతోంది. ఈ విమానాల తయారీ కేంద్రాన్ని భారత్‌కు తరలించాలన్న లాక్‌హీడ్ ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం మద్దతు తెలిపింది. -
పాక్‌తో పదిరోజులు.. చైనాతో 15రోజుల యుద్ధం!
-
పాక్‌తో పదిరోజులు.. చైనాతో 15రోజుల యుద్ధం!
సర్వసన్నద్ధంగా ఉండాలని కమాండర్లకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆదేశం న్యూఢిల్లీ: మిలిటరీ అవసరాలు శరవేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్‌తో 10 రోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం చేసేందుకు వీలుగా సర్వసన్నద్ధంగా ఉండాలని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) తన కమాండర్లను ఆదేశించింది. గతవారం న్యూఢిల్లీలో ఐఏఎఫ్ కమాండర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా ఈ మేరకు కమాండర్లకు సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ‘ఒకవేళ పాకిస్థాన్‌తో పదిరోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం వస్తే సత్వరమే ఎదుర్కొనడానికి వీలుగా ఐఏఎఫ్ కమాండర్లు స్వరసన్నద్ధంగా ఉండాలని ఎయిర్‌చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆదేశించారు. అత్యంత చురుకైన సన్నద్ధతతో, పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు’ అని ఆ వర్గాలు మీడియాకు చెప్పాయి. తన అన్ని విభాగాల సన్నద్ధత ఎలా ఉందో తెలుపాలంటూ ఇప్పటికే డైరక్టరేట్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్‌ఫెక్షన్‌కు ఆదేశాలు అందాయి. ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని, యుద్ధవిమానాలను పూర్తిస్థాయిలో ఆయుధాలు, క్షిపణులు, అలర్ట్ రాడర్ వ్యవస్థతో సర్వసన్నద్ధంగా ఉంచాలని సూచనలు అందాయి. -
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశాలు
మే 1, 3 తేదీలలో జిల్లా కేంద్రంలో ఎంపికలు 10 కొత్త జిల్లాల నుంచి అవకాశం కరీంనగర్ సిటీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్మన్గా ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం వేదికగా తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణలోని పది కొత్త జిల్లాల నుంచి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉద్యోగ అర్హతలు, ఏర్పాట్లపై విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మే ఒకటో తేదీన హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం కొత్త జిల్లాలకు చెందిన అభ్యర్థులకు, మే 3న కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల అభ్యర్థులకు ఉదయం 5 గంటల నుంచి 10 గంటలలోపు గేట్ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అభ్యర్థులు 165 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా 10+2 తత్సమాన పరీక్షలో 50 శాతంతో ఉత్తీర్ణులై ఉండాలి. 50 శాతం ఇంగ్లిష్‌లో మార్కులు పొంది ఉండాలి. ఉదయం 6 గంటల నుంచి రాతపరీక్ష ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్‌లో ఉంటుంది. అభ్యర్థులు 17 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు మూడు సెట్ల జిరాక్స్ ప్రతులు, 8 పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తెచ్చుకోవాలి. స్థానికతను గుర్తించేందుకు నేటివిటీ సర్టిఫికెట్ తప్పనిసరి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మరుసటి రోజు సైకాలజీ టెస్టు ఉంటుంది. ఆ టెస్టులో ఉత్తీర్ణులైన వారికి పరుగు పందెం 7 నిమిషాలలో 1.6 కి.మీ ఉంటుంది. అనంతరం వ్యాయామ టెస్టుల్లో భాగంగా 10 పుషప్స్, 10 సిట్టప్స్, 20 స్క్వైర్స్ పరీక్ష ఉంటుంది. అనంతరం గ్రూప్ డిస్కషన్లో ప్రత్యేక అంశంపై చర్చించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.airmenselection.gov.in వెబ్సైట్ చూడొచ్చని ఆయన వివరించారు. -
దేశీయ 'నేత్ర'
స్వదేశీ సాంకేతికతతో రూపొందిన 'నేత్ర' భారతీయ వాయుదళంలో చేరింది. నేత్రలో వినియోగించిన ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం(ఏఈడబ్ల్యూ&సీ)ను దేశీయంగా అభివృద్ధి చేశారు. యుద్ధ సమయాల్లో శత్రువుల రాకను దాదాపు 300 కిలోమీటర్లు ముందే నేత్ర గుర్తించగలదు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎయిర్ షో ఎరో ఇండియా ప్రారంభ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నేత్రను ఐఏఎఫ్ స్క్వాడ్రన్‌కు అప్పగించారు. పంజాబ్‌లోని భతిండా బేస్ నుంచి నేత్ర తన సేవలను ప్రారంభించనుంది. నేత్రలో ఉపయోగించిన రాడార్ వ్యవస్ధ, మరికొన్ని కీలక విభాగాలు స్వదేశీయంగా అభివృద్ధి చేసినవే. ప్రస్తుతం రెండు నేత్ర విమానాలను ఐఏఎఫ్‌కు అందిస్తున్నారు. భవిష్యత్తులో నేత్ర సిస్టంను భారత ఇంజనీర్లు మరింత తీర్చిదిద్దుతారని భావిస్తున్నట్లు పరీకర్ చెప్పారు. -
'36 కాదు 250 జెట్లు కావాలి'
న్యూఢిల్లీ: భారతదేశ రక్షణకు 36 రఫెల్ జెట్లు సరిపోవని అందుకు 200-250 జెట్లు కనీసం అవసరమవుతాయని ప్రస్తుత వాయుదళ చీఫ్ అరూప్ రాహా బుధవారం పేర్కొన్నారు. ఈ నెల 31వతేదిన రాహా పదవీకాలం పూర్తవుతుంది. ఏ దేశ వాయుదళానికైనా దాని వద్ద ఉన్న ఫ్లీట్లే ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. గాలిలోనే ఇంధనాన్ని నింపగల ఫోర్స్ మల్టీప్లేయర్ల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. వాటిని వేగంగా సమీకరించడానికి కొత్త టెండర్లు పలవనున్నట్లు తెలిపారు. స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న తేజస్ కు తోడు మరో జెట్ భారత వాయుసేనకు అవసరమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం మొత్తం 42 స్క్వాడ్రన్లకు అనుమతినిచ్చిందని.. కేవలం స్క్వాడ్రన్లు ఉంటే చాలదని.. తగిన శక్తిసామర్ధ్యాలు కలిగిన ఫైటర్లు కూడా వాటిలో ఉండాలని అన్నారు. భారత్ వద్ద మరో 40ఏళ్ల పాటు ఉపయోగపడే హెవీ వెయిట్ ఫైటర్లు(ఎస్ యూ30-ఎంకేఐ)లు ఉన్నట్లు చెప్పారు. లైట్ వెయిట్ ఫైటర్ల కొరతను తేజస్ లు తీరుస్తాయని చెప్పారు. కాగా, మిడిల్ వెయిట్ కేటగిరీలో రఫెల్ యుద్ధవిమానాలు అద్భుతంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అయితే, కేవలం 36 రఫెల్ లు మాత్రమే ఉండటం వింగ్ సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని చెప్పారు. మరిన్ని రఫెల్ లను వింగ్ లోకి తీసుకురావడం ద్వారా ఫ్లీట్ కు బలం చేర్చినట్లవుతుందని తెలిపారు. భారతీయ వాయుసేనలో ప్రస్తుతం 33 ఫైటర్ల స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి, ఏఎన్32 విమానం కూలిపోవడం తన కెరీర్ లో మాయని మచ్చలని అన్నారు. -
కార్లో డబ్బు.. అదుపులో ఎయిర్‌ఫోర్స్ అధికారి
న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో పాత, కొత్త నోట్లను కలిగి ఉన్న భారత వైమానిక దళ అధికారి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రోహతక్ జిల్లా బహ్వక్బార్పూర్ గ్రామానికి చెందిన పరమ్ జీత్‌గా గుర్తించారు. ఢిల్లీ నుంచి రోహతక్ వచ్చిన ఎయిర్ ఫోర్స్ అధికారి పరమ్ జీత్‌ను పోలీసులు మధ్యలో అడ్డగించారు. ఆయనను తనిఖీ చేయగా రూ.11.08లక్షల పాత, కొత్త డబ్బు లభించింది. తొలుత మాములుగానే ఆయనను తనిఖీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ తన వద్ద డబ్బు ఉందనే కంగారులో ఆర్యా నగర్ వద్ద ఏర్పాటు చేసిన నాకాబంది వద్ద తన కారును ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడిని వెంబడించిన పోలీసులు చివరకు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అసలు విషయం తెలిసింది. అయితే, ఈ డబ్బు ఎక్కడిది అనే విషయంలో వివరణ ఇవ్వలేకపోయారు. ఈ డబ్బులో రూ.3లక్షలు కొత్తవి ఉండగా.. రూ.116లక్షలు పాత కరెన్సీ.. మిగితా మొత్తం కూడా రూ.50, రూ.20, రూ.10 నోట్లలో ఉన్నాయి. అయితే, ఈ నెలాఖరున తన భార్య పుట్టిన రోజు ఉందని, ఆమెకు బహుమతిగా కారును ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్డరిచ్చే క్రమంలో భాగంగా ఈ డబ్బు తీసుకెళుతున్నట్లు తెలిపాడు. అయితే, పోలీసులు మాత్రం ఈ డబ్బుకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖ అధికారులకు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే వదంతులతో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
హైవే మీద యుద్ధ విమానాల హడావుడి
ఎక్కడైనా ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించాలంటే రిబ్బన్ కట్ చేస్తారు. కానీ, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం మాత్రం ధూమ్ ధామ్‌గా జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. భారతీయ వైమానిక దళానికి చెందిన ఆరు జెట్ విమానాలు ఆ ఎక్స్‌ప్రెస్ వే మీద ల్యాండ్ అయ్యాయి. ఆ రహదారిని సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు, రక్షణ శాఖ మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ ప్రారంభించారు. మొత్తం 302 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 3.3 కిలోమీటర్ల రోడ్డును అత్యవసర సమయాల్లో జెట్ విమానాల ల్యాండింగ్‌కు కూడా ఉపయోగించుకోవచ్చు. విమానాలు ఒకదాని వెంట ఒకటి వచ్చి రోడ్డు మీద దిగుతుంటే.. వేలాది మంది గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వాళ్లు కూడా ఆశ్చర్యంగా చూశారు. అయితే.. విమానాలు దాదాపు దిగినంత పని చేశాయి గానీ, వాటి చక్రాలు మాత్రం రోడ్డుమీద ఆనుకోలేదని, అలా ఆనుకుంటే చక్రాలు పాడవుతాయని వైమానిక దళం అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే మీదుగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ జెట్ విమానాలు వెళ్లాయి. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి మొత్తం రూ. 13,200 కోట్ల ఖర్చయింది. కేవలం 22 నెలల్లోనే 302 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేశారు. వచ్చే సంవత్సరం నుంచి దీనిమీదకు వాహనాలను అనుమతిస్తారు. ఇది దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అవుతుంది. ప్రస్తుతం ఆరు లేన్లే అయినా, అవసరాన్ని బట్టి 8 లేన్లకు కూడా విస్తరించుకోవచ్చు. లక్నో నుంచి ఢిల్లీకి రోడ్డుమార్గంలో వెళ్లాలంటే ప్రస్తుతం 11 గంటలు పడుతుండగా, ఈ ఎక్స్‌ప్రెస్ వే వచ్చిన తర్వాత అది సరిగ్గా సగం.. అంటే ఐదున్నర గంటలకు తగ్గిపోతుంది. లక్నో నుంచి ఉన్నవ్, కనౌజ్, ఇటావా, మైన్‌పురి, ఫిరోజాబాద్ మీదుగా ఇది ఆగ్రా చేరుకుంటుంది. -
17న దుండిగల్‌లో వైమానిక ప్రదర్శన
భారత వాయుసేన, రెడ్ ఆరోస్ సంయుక్త నిర్వహణ సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రెడ్ ఆరోస్ బృందం, భారత వాయుసేన బృందంతో కలిసి ఈ నెల 17న దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో వైమానిక ప్రదర్శన నిర్వహించనుంది. ఈ విషయాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రు మైక్ అలిస్టర్ వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్-బ్రిటన్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంయుక్త వైమానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ సిటీల నిర్మాణం, రక్షణ రంగాల్లో భారత దేశంతో భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత 52 ఏళ్లుగా రెడ్ ఆరోస్ బృందం 4700 వైమానికి ప్రదర్శనలు ఇచ్చిందని అలిస్టర్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్ శర్మ, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. -
మన వాయుసేన సత్తా ఎంతో తెలుసా?
రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేరుతో భారతీయ వాయుదళం 1933లో కరాచీలో ప్రారంభమైంది. నేడు సరికొత్త ఫైటర్లతో వాయుదళ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయ వాయుదళం ఇప్పటివరకూ వినియోగించిన ఫైటర్ల గురించి ఓ సారి చూద్దాం. తొలినాళ్లలో వెస్ట్ లాండ్ వాపిటి: నాలుగు వెస్ట్ లాండ్ వాపిటి-ఐఐఏ విమానాలతో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఐఏఎఫ్) 1933లో కరాచీలో ప్రారంభమైంది. దాదాపు 12 ఏళ్ల పాటు ఈ విమానాలు ఆర్ఐఏఎఫ్కు సేవలు అందించాయి. ఆర్ఐఏఎఫ్ రెండో ప్రపంచ యుద్దంలో ఈ విమానాలను వినియోగించింది. కాగా, జపాన్ వాయుసేనలు బర్మా వద్ద ఈ విమానాల్లో కొన్నింటిని ధ్వంసం చేశాయి. టైగర్ మోత్: 1939-1957 సంవత్సరాల మధ్య టైగర్ మోత్ జెట్ లు భారతీయ వాయుదళం(ఐఏఎఫ్)(ఆర్ఐఏఎఫ్ ను 1950లో ఐఏఎఫ్ గా మార్చారు) లో సేవలు అందిచాయి. వీటిని బ్రిటిష్ విమాన తయారీ కంపెనీ డీ హవిల్ లాండ్ తయారుచేసింది. దీనిని 2012లో పునరుద్దరించారు. భారత వాయుదళంలోని వింటేజ్ ఫ్లీట్ లో టైగర్ మోత్ సేవలు అందిస్తోంది. కొత్త పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి కూడా దీన్ని ఉపయోగించారు. బ్లెన్ హీమ్: 1941-42ల మధ్య బ్లెన్ హీమ్ ఆర్ఐఏఎఫ్ కు సేవలు అందించింది. లైట్ వెయిట్ బాంబులను మోసుకెళ్లగల బ్లెన్ హీమ్ లను రంగూన్ హార్బర్ లోని ఓడలకు కాపలాగా ఉపయోగించేవారు. లైశాండర్: 1940ల్లో లైశాండర్ ఆర్ఐఏఎఫ్ కు సేవలు అందించింది. బ్రిటన్ కు చెందిన ఓ ప్రముఖ విమాన తయారీదారు దీన్ని తయారుచేశారు. 1940 మే-జూన్‌ల మధ్య యూకేఆర్ఏఎఫ్ 118 లైశాండర్ విమానాలను కోల్పోయింది. దీంతో వీటిని చరిత్రలో రక్షించుకోవాల్సిన విమానాలుగా అప్పటి యూకే ప్రకటించింది. హరికేన్: హరికేన్ విమానాలను 1942లో ఆర్ఐఏఎఫ్ కు అందాయి. అప్పటి ఫైటర్లలో హరికేన్లే అత్యంత వేగవంతమైనవి. దాదాపు 300 మైళ్లకు పైగా వేగంతో హరికేన్లు దూసుకెళ్లేవీ. బర్మాలో అరకన్ యుద్దంలో హరికేన్ విమానాలు పాల్గొన్నాయి. స్పిట్ ఫైర్: 1946లో అత్యంత విజయవంతమైన జెట్ గా స్పిట్ ఫైర్ పేరుగాంచింది. హరికేన్ విమానాల స్ధానంలో స్పిట్ ఫైర్ జెట్లను చేర్చారు. 1950వ దశకం వరకూ స్పిట్ ఫైర్ జెట్లు వినియోగంలో ఉన్నాయి. డ్రాగన్ రాపిడ్, ఆడియో, డ్రాగన్ ప్లై, హార్వాడ్, హడ్సన్, వెన్ జియన్స్, డిఫియంట్, అట్లాంటా తదితర జెట్ లను ఆర్ఐఏఎఫ్ వినియోగించింది. స్వాతంత్ర్యం తర్వాత టెంపెస్ట్ 2: స్వతంత్ర దేశంగా భారత్ అవతరించిన తర్వాత దశాబ్ద కాలం పాటు ఐఏఎఫ్ టెంపెస్ట్-2 జెట్ లను వినియోగించింది. డకొటా: స్వతంత్రం వచ్చే కొద్ది నెలల ముందు ఆర్ఐఏఎఫ్ ట్రాన్స్ పోర్ట్ దళాన్ని సీ-47 డకోటాలతో ప్రారంభించింది. బీ-24 లిబరేటర్: 1948లో ఆర్ఐఏఎఫ్ మొదటి హెవీ బాంబర్ దళాన్ని అమెరికన్ లిబరేటర్లతో ప్రారంభించింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ వీటి వినియోగాన్ని నిలిపివేసిన తర్వాత హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) వీటిని పునరుద్దరించింది. 1968 వరకూ ఇవి భారతీయ వాయుదళానికి సేవలు అందించాయి. వాంపైర్స్: 1948లో బ్రిటిష్ వాంపైర్స్ ను ఎయిర్ ఫోర్స్ కొనుగోలు చేసింది. 1960వ దశకం ముందువరకూ 400పైగా వాంపైర్లను భారత్ వినియోగించింది. భారత వాయుదళంలోకి ఫ్రెంచ్ జెట్లు డస్సాల్ట్ ఔర్గాన్: ఫ్రెంచ్ వారి నుంచి భారత వాయుదళంలోకి ప్రవేశించిన తొలి జెట్ డస్సాల్డ్ ఔర్గాన్. 1953లో ఐఏఎఫ్ లో చేరిన ఔర్గాన్ జెట్లు 1968 వరకూ సేవలు అందించాయి. మిస్టరీ ఐవా: 1957లో భారత వాయుదళంలో చేరిన రెండో ఫ్రెంచ్ జెట్ మిస్టరీ ఐవా. 1957లో ఐఏఎఫ్ బాగా విస్తరించింది. బ్రిటిషర్లకు చెందిన హాకర్ హంటర్లు, అమెరికన్లకు చెందిన ఎలక్ట్రిక్ కాన్ బెర్రా బాంబర్లు 1957లోనే ఐఏఎఫ్ లో చేరాయి. కాన్ బెర్రాలు: 1961-62 మధ్య కాలంలో కాన్ బెర్రాలు కాంగో యుద్ధంలో పాల్గొన్నాయి. 1999 కార్గిల్ సమస్య సమయంలో నియంత్రణ రేఖ పరిధిలోని ప్రాంతాలను ఫోటోలు తీసేందుకు కాన్ బెర్రా విమానాన్ని వినియోగించారు. ఫోటోలు తీస్తున్న సమయంలో కాన్ బెర్రాపై మిస్సైల్ దాడి జరిగింది. కానీ విమానాన్ని సురక్షితంగా కిందకు దించడంలో పైలట్ విజయం సాధించారు. డెవాన్, సీ-119 పాకెట్, డీహెచ్సీ-3 ఒట్టర్, విక్కర్స్ విస్కోంట్, సికోర్ స్కై ఎస్-55 చాపర్లు తదితరాలను 1950ల్లో ఐఏఎఫ్ లో చేరాయి. భారత వాయుదళం-సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ కు సంబంధించిన యుద్ధవిమానాలు భారత వాయుదళంలో కీలకపాత్ర పోషించాయి. ఆ కాలంలో సోవియట్ యూనియన్ తో దౌత్యపరంగా భారత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ బంధమే ప్రస్తుత రష్యా-భారత్ ల రక్షణ ఒప్పందాలకు కారణం. మిగ్-21(మిగిలిన రకాలు): 1963లో మిగ్-21 యుద్ధవిమానాలు భారత వాయుసేనలో చేరాయి. వీటి చేరికతో భారత రక్షణ మార్కెట్లో సోవియట్ యూనియన్ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ యుద్ధవిమానానికి చెందిన కొన్ని వేరియంట్లను ఇప్పటికీ ఐఏఎఫ్ వినియోగిస్తోంది. 1980 నుంచి మిగ్-23, మిగ్-25, మిగ్-27, మిగ్-29 లాంటి పలురకాలను ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. ఆంటోనోవ్-12: 1961లో రష్యాకు చెందిన ఈ రవాణా విమానాన్ని ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. వీటిని 1962 చైనా-భారత్ యుద్ధంలో ఉపయోగించారు. కెనడా డీహెచ్సీ-4 కార్గో యుద్ధవిమానాలను యుద్ధం తర్వాత భారత్ కు ఇచ్చింది. ఎమ్ఐ-4: సోవియట్ యూనియన్ కు చెందిన ఈ హెలికాప్టర్లను 1960ల్లో ఐఏఎఫ్ లో ప్రవేశపెట్టారు. దీని వేరియంట్లు ఎమ్ఐ-8లను 1970ల్లో, ఎమ్ఐ-17లను 1985లో, ఎమ్ఐ-17 వీ5లను 2012లో ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. సుఖోయ్-7: 1968లో ఐఏఎఫ్ లో ప్రవేశించిన సుఖోయ్ లను 1971 ఇండో-పాక్ యుద్ధంలో వినియోగించారు. దీని వేరియంట్ సుఖోయ్-30ని 1997లో ఐఏఎఫ్ అందుకుంది. ఫైటర్ దళాన్ని సిద్ధం చేసేందుకు భారత్ 272 సుఖోయ్ జెట్ లను ఆర్డర్ ఇచ్చింది. ఆంటోనోవ్-32: 1983లో ఐఏఎఫ్ లో ప్రవేశించిన ఆంటోనోవ్-32లు ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి. 100కు పైగా ఆంటోనోవ్-32లు భారత వాయుసేనలో ఉన్నాయి. అమెరికా తిరిగి రంగ ప్రవేశం ఏహెచ్-64ఈ అపాచె ఎటాక్ హెలికాప్టర్లు: 2019లో యూఎస్ నుంచి భారత్ 22 అపాచె ఎటాక్ హెలికాప్టర్లను అందుకోనుంది. దీంతో హెలికాప్టర్ల ఫ్లీట్ ను భారత్ మరింతగా బలపర్చుకున్నట్లు అవుతుంది. ప్రస్తుతం 1980లో దళంలోకి వచ్చిన ఎమ్ఐ-25, ఎమ్ఐ-35 హెలికాప్టర్లను భారత్ వినియోగిస్తోంది. సీహెచ్-47ఎఫ్ చినుక్స్: భారీ బరువులను అత్యంత ఎత్తుకు మోసుకెళ్లగల సామర్ధ్యం కలిగిన చినూక్స్ ను 2019లో యూఎస్ నుంచి భారత్ కు అందనున్నాయి. ఈ కేటగిరిలో సోవియట్ యూనియన్ అందించిన నాలుగు ఎమ్ఐ-26లలో కేవలం ఒక్కటి మాత్రమే ఇప్పుడు సర్వీసులో ఉంది. సీ-17 గ్లోబ్ మాస్టర్3: 2014లో 10 గ్లోబ్ మాస్టర్ విమానాలను ఐఏఎఫ్ దళంలో చేర్చుకుంది. వీటిని అమెరికా వాయుదళం ఇరాక్, ఆప్ఘనిస్తాన్లలో వినియోగిస్తోంది. యుద్ధ ట్యాంకులను మోసుకెళ్లడం, హెలికాప్టర్లపై దాడి చేయడం తదితరాలకు దీన్ని వినియోగించవచ్చు. సీ-130జే సూపర్ హెర్ క్యూల్స్: ఆరు సీ-130జే సూపర్ హెర్ క్యూల్స్ విమానాల కొనుగోలుకు 2008లో అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటన్నింటిని ఇప్పటికే వాయుదళంలో కూడా చేర్చుకుంది. మరో ఆరు సీ-130జే సూపర్ హెర్ క్యూల్స్ ను కొనుగోలు చేయడానికి డీల్ ను కూడా ఐఏఎఫ్ కుదుర్చుకుంది. ప్రత్యేక ఆపరేషన్లు, మెరుపుదాడులకు వీటిని వినియోగిస్తారు. సొంత తయారీ గ్నాట్: బ్రిటిష్ కు చెందిన గ్నాట్ ను 1958లో వాయుసేనలోకి తీసుకున్నార. దీనికి హెచ్ఏఎల్ లైసెన్స్ ను విడుదల చేసింది. గ్నాట్ ఇంధన సామర్ధ్యాన్ని పెంచి అజీత్ గా నామకరణం చేశారు. హెచ్ఎఫ్-24 మారుత్: 1960వ దశకంలో దీన్ని ఐఏఎఫ్ లోకి ప్రవేశపెట్టారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఫైటర్ మారుత్. తేజస్: తేజస్ యుద్ధవిమానాల దళాన్ని 2016 జులైలో రెండు తేజస్ విమానాలతో ఐఏఎఫ్ ప్రారంభించింది. భవిష్యత్తులో 120 తేజస్ జెట్లను ఫ్లీట్ లో ప్రవేశపెట్టాలని ఐఏఎఫ్ యోచిస్తోంది. -
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సెల్యూట్
న్యూఢిల్లీ : 84వ వసంతాల్లోకి అడుగుపెట్టిన భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత శక్తివంతంగా రూపుదిద్దుకోనుందని, ఆధునికతను అందిపుచ్చుకోనుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఐఏఎఫ్ శక్తి సామర్థ్యాలపై దేశం గర్విస్తుందని, గడిచిన ఎనిమిది దశాబ్దాల్లో వారు అందించిన సేవలు మరువలేవని 84వ వార్షికోత్సవం సందర్భంగా ప్రణబ్ కొనియాడారు. భారత వైమానిక దళానికి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. వైమానికదళ యోధులకు, వారి కుటుంబాలకు ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మీ ధైర్య సాహసాలు భారత్‌కు గర్వించదగ్గవని పేర్కొన్నారు. భారత భద్రతను పెంచడంలో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వైమానిక దళ సభ్యులకు, వారి కుటుంబాలకు ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ఘజియాబాద్‌లోని హిండన్ బేస్‌లో వైమానిక దళ వేడుకలు అంబురాన్నంటాయి. ఈ వేడుకల్లో వైమానిక దళ చీఫ్ అరుఫ్ రహా పాల్గొన్నారు. భారత తేజాస్ బృంద వైమానిక విన్యాసాలు అదరగొట్టాయి. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర వహించే ర్యాపిడి యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) కవాతులు ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. వైమానిక దళ సిబ్బందిని వాయు సేన మెడల్స్, శౌర్య వాయు సేన మెడల్స్, విశిష్ట సేవ మెడల్స్‌తో అరుఫ్ రహా సత్కరించారు. -
డ్రగ్స్ కేసులో కమాండర్‌పై దర్యాప్తు
-
మహిళా మిస్సైల్
విశాఖపట్నం : ఎన్ 32 విమాన పైలట్.. ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రన్ లీడర్.. తండ్రి, సోదరుల వారసత్వంగా గగనతలంలో దేశం కోసం పోరాడుతున్న సాహసి.. ఆత్మవిశ్వాసంతో నేల నుంచి నింగిలోకి దూసుకుపోతున్న మిసైల్ ఆమె.. నిత్యం సవాళ్లు.. ప్రతి నిత్యం ప్రమాదాలతో సావాసం చేసే సాహస వనితలు అరుదుగా ఉంటారు. అలాంటి వారికి ప్రతిరూపం ఆమె.. పేరు నీలమ్ హుడా. విపత్తుల నిర్వహణపై తూర్పు నావికాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రకంపన’లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆమెను ‘సాక్షి’ ఐఎన్ఎస్ డేగాలో పలకరించింది. ఉత్తేజభరితమైన కెరీర్ వివరాలు ఆమె మాటల్లోనే.. హర్యానా రాష్ర్టంలోని రోతక్ జిల్లా అస్సోన్ గ్రామం నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అడుగుపెట్టాను. నాన్న రామ్మోహన్ ఇదే విభాగంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. సోదరుడు ప్రవీణ్ హుడా ఆర్మీలో పనిచేస్తున్నారు. వారిద్దరి ప్రభావంతోనే నేను ఈ రంగంలోకి వచ్చాను. ఎయిర్‌ఫోర్స్ విమానం ఎన్ 32 (ఇటీవల ఎన్ఏడీ ఉద్యోగులను చెన్నై నుంచి అండమాన్‌కు తీసుకువెళుతూ అదృశ్యమైంది ఇలాంటి విమానమే) మెడికల్ విమానంలో పైలట్‌గా ఉన్నాను. విపత్తులు ఎదురైనప్పుడు వెంటనే అక్కడికి చేరుకుంటాం. మా విమానంలో దాదాపు 25 మందికి వైద్యం అందించగలం. సురక్షిత ప్రాంతానికి తరలించగలం. ప్రతి రంగంలోనూ సవాళ్లు ఉంటాయి. మహిళలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి సవాళ్లు ఎదుర్కోవాలి. -
భారత్‌పై అమెరికా ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా ప్రశంసల జల్లు కురిపించింది. సంకట్ మోచన్పేరిట తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు భారత ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసం అద్భుతం అని అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ డెడోరా లీ జేమ్స్ అన్నారు. త్వరలో భారత్ పర్యటనకు రానున్న ఆమె సౌత్ సుడాన్ లో ఇబ్బందుల్లో పడిన భారతీయులను తమ దేశం నుంచి కొనుగోలు చేసిన భారీ యుద్ద విమానం సీ-17 గ్లోబ్ మాస్టర్ ద్వారా సురక్షితంగా తిరిగి తమ మాతృదేశంలోకి సురక్షితంగా చేర్చగలిగారని కొనియాడారు. ఈ సందర్భంగా భారత్ ను అభినందించకుండ ఉండలేకపోతున్నానని చెప్పారు. త్వరలోనే స్వయంగా తాను వెళ్లి మరోసారి భారత్‌కు ఈ విషయంలో అభినందనలు చెబుతానని చెప్పారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దక్షిణ సుడాన్ లో సంకంటంలో పడిన 156మంది భారతీయులను సంకట్ మోచన్ ఆపరేషన్ పేరిట సురక్షితంగా గత నెలలో తిరిగి తీసుకొచ్చింది. భారత్ వైమానిక దళం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని, ఇరు దేశాల మధ్య గతంలో ఆగిపోయిన పలు కార్యక్రమాలు తన పర్యటనతో తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. ఇరు దేశాల సైనికులకు ఉమ్మడి శిక్షణ, కొన్ని ఆపరేషన్లలో కలిసి పనిచేయడం, ప్రమాదాలు ఎదుర్కోవడం వంటివి చేస్తామని ఆమె చెప్పారు. -
ఆ విమానంలో ఎవరూ బతికే చాన్స్ లేదు!
చెన్నై: బంగాళాఖాతంలో అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో ప్రయాణిస్తున్నవారు ఎవరూ బతికే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో తెలిపింది. 29మంది ప్రయాణిస్తున్న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఈ విమానం గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడం ఇదే తొలిసారి. గత నెల 22న అదృశ్యమైన ఈ విమానం జాడ గురించి ఇప్పటికీ చిన్నపాటి ఆధారంకానీ, ఆచూకీ కానీ తెలియలేదు. ఈ విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి రామ్ రావు భామ్రే సమాధానమిస్తూ.. విమానంలో ప్రయాణిస్తున్న వారెవరూ బతికే అవకాశం లేదని తెలిపారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే సభ్యుడు ఎం తంబిదురై అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఏఎన్-32 విమానం ఆచూకీ దొరికేవరకు గాలింపు చర్యలను మానుకోవద్దని, అది దుర్ఘటనకు గురైన ప్రదేశాన్ని గుర్తించాలని తంబిదురై కేంద్రాన్ని కోరారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు వైమానిక దళానికి చెందిన వివిధ యుద్ధవిమానాలతోపాటు హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. ఈ విమానం ఆచూకీని కనిపెట్టేందుకు ఇప్పటికే పరిశోధక నౌకలు రంగంలోకి దిగి ఐదు రోజులు అవుతున్న సంగతి తెలిసిందే. చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌కు బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం బంగాళాఖాతం గగనతలంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గ చిన్న పాటి ఆధారంగానీ, సమాచారంగానీ లభించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది ఇందులో ఉన్న 29 మంది బతికి బయటపడే అవకాశాలు లేవనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా కేంద్రం కూడా ఇదేవిషయాన్ని వెల్లడించింది. చెన్నైకు 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఆ విమానం కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు మాత్రం ఉన్నాయి. ఈ సంకేతాలున్న ప్రదేశంలో మూడు నుంచి ఐదు వేల మీటర్ల లోతులో విమానం కూరుకుపోయి ఉండొచ్చన్న భావనతో ఆ పరిసరాల్లో 20 నౌకలు,18 విమానాలు, హెలిక్టాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తున్నా ఫలితం శూన్యం. ఓ వైపు అమెరికా సాయంతో శాటిలైట్ ద్వారా అన్వేషణకు తగ్గ ప్రక్రియ సాగుతుంటే, మరో వైపు ఆదివారం భారత్‌కు చెందిన పరిశోధక నౌక లు రంగంలోకి దిగాయి. -
ఇంకా గాలింపే!
కానరాని ఆచూకీ గడుస్తున్న రోజులు పరిశోధక నౌకలతో గాలింపు ముమ్మరం చెన్నై: అదృశ్యమైన ఏయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ కానరావడం లేదు. రోజులు గడుస్తున్నాయేగానీ, చిన్నపాటి ఆధారం లభించకపోవడంతో గాలింపులో ఉన్న బృందాలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశోధక నౌకలు రంగంలోకి దిగి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదు. చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌కు బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం బంగాళాఖాతంపై అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గ చిన్న పాటి ఆధారంగానీ, సమాచారంగానీ లభించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది అందులో ఉన్న 29 మంది ఆచూకీ పై ఆశల్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విమానం గల్లంతై మూడు వారాలు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. చెన్నైకు 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఆ విమానం కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు మాత్రం ఉన్నాయి. ఈ సంకేతాలున్న ప్రదేశంలో మూడు నుంచి ఐదు వేల మీటర్ల లోతులో విమానం కూరుకుపోయి ఉండొచ్చన్న భావనతో ఆ పరిసరాల్లో 20 నౌకలు,18 విమానాలు, హెలిక్టాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తున్నా ఫలితం శూన్యం. ఓ వైపు అమెరికా సాయంతో శాటిలైట్ ద్వారా అన్వేషణకు తగ్గ ప్రక్రియ సాగుతుంటే, మరో వైపు ఆదివారం భారత్‌కు చెందిన పరిశోధక నౌక లు రంగంలోకి దిగాయి. జాతీయ సముద్ర తీర పరిశోధనా విభాగానికి చెందిన సాగర్ నిధి, భారత భౌగోళిక పరిశోధనా సంస్థకు చెందిన సముద్ర రత్నాకర్ పరిశోధక నౌకలు రంగలోకి దిగడంతో ఏదేని ఆచూకీ లభిస్తుందన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, ఈ నౌకలు పరిశోధనలు చేపట్టి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి చిన్న ఆధారం కూడా కన్పించనట్టు సంకేతాలు వచ్చాయి. సాగర్ నిధి, రత్నాకర్ నౌకల్లో ఉన్న అన్ని టెక్నాలజీలను ఉపయోగించి తీవ్రంగా పరిశోధనలు రేయింబవళ్లు సాగుతున్నా, ఆ విమానం ఆచూకీ మాత్రం కాన రాలేదు. సముద్రంలో గల్లంతై ఉండొచ్చని భావిస్తున్న ప్రదేశంలో 20 నాటికల్ మైళ్ల దూరం సాగర్ నిధి, మిగిలిన నాటికన్ మైళ్ల దూరంలో సముద్ర రత్నాకర్ తీవ్రంగా పరిశోధనలతో దూసుకు వెళ్తున్నా, చిన్నపాటి ఆధారం అన్వేషణలో కానరాక పోవడంతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ అందులో ఉన్న 29 మంది కుటుంబాల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది. -
విమానం జాడలేదు.. నాన్న కాల్ రాలేదు!
న్యూఢిల్లీ: బంగళాఖాతం సముద్రంలో తప్పిపోయిన భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) ఏఎన్-32 యుద్ధం విమానం ఆచూకీ కోసం ముమ్మరంగా జరుగుతున్న గాలింపులు ఆదివారం నాటికి మూడోరోజుకు చేరుకున్నాయి. అయినా ఇప్పటివరకు ఈ విమానం జాడ లభించలేదు. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతైంది. ఈ విమానంలో నలుగురు అధికారులు సహా.. మొత్తం 29మంది సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో గల్లంతైన విమానంలోని తమ వారి భద్రతపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారు క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ‘విమానంలో ఉన్న మా నాన్న, ఇతర సిబ్బంది క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. విమానానికి ఏమైందోనన్న ఆందోళన మమ్మల్ని వేధిస్తోంది. అది ఎక్కడ ఉందన్న విషయమై ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం అందలేదు’ అని అశుతోష్ సింగ్ తెలిపారు. అశుతోష్ తండ్రి, ఐఏఎఫ్ అధికారి భూపత్ సింగ్ తప్పిపోయిన ఏఎన్ 32 యుద్ధవిమానంలో ఉన్నారు. ‘పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లగానే కాల్ చేస్తానని మా నాన్న చెప్పారు. కానీ ఆయన నుంచి ఎలాంటి కాల్ రాలేదు. ఆయన సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఆయనను మేం ఎంతగానో మిస్సవుతున్నాం’ అని అశుతోష్ చెప్పారు. విమానం మూడురోజులవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందకపోవడం తమను వేదనకు గురిచేస్తున్నదని తప్పిపోయిన విమానంలో ఉన్న మరో ఐఏఎఫ్ అధికారి భార్య సంగీత మీడియాకు తెలిపారు. -
వాయుసేనకు ‘తేజస్’
ఐఏఎఫ్‌లోకి రెండు తేజస్ ఫైటర్ జెట్లు - గగన దళానికి పెరిగిన బలం - తేజస్‌తో బెంగళూరు హెచ్ఏఎల్లో విన్యాసాలు - ఏడాది చివరికల్లా మరో ఆరు తేజస్‌లు సిద్ధం సాక్షి, బెంగళూరు: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి తేలికపాటి యుద్ధ విమానం(లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్-ఎల్సీఏ) ‘తేజస్’ ఎట్టకేలకు భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లోకి అధికారికంగా ప్రవేశించింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) రెండు తేజస్ ఫైటర్ జెట్లను లాంఛనంగా వైమానిక దళానికి అందజేసింది. సర్వమత ప్రార్థనల అనంతరం హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ శ్రీధరన్.. ఎయిర్ మార్షల్ జస్బీర్ వాలియాకు రెండు తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించిన పత్రాలతో పాటు విమాన నమూనాను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టం టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్(ఏఎస్‌టీఈ) ఆవరణలో 1,100 మీటర్ల ఎత్తులో గంటకు 900 కిలోమీటర్ల వేగంతో గ్రూప్ కెప్టెన్మాధవ్ రంగాచారి ఈ యుద్ధవిమానంతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తేజస్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేసి వైమానిక దళంలోకి ప్రవేశపెట్టేందుకు సుమారు 33 ఏళ్లు పట్టింది. వాయుసేనలోకి 45 స్క్వాడ్రాన్లోకి తేజస్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. 33 ఏళ్ల నిరీక్షణ.. ► స్వదేశీ పరిజ్ఞానంతో తేలికపాటి యుద్ధ విమానాన్ని రూపొందించాలనే ఆలోచన 1970ల్లోనే మొదలైనా.. తొలిసారిగా 2001లో ఇది గాల్లోకి ఎగిరింది. ►1998లో అణుపరీక్షల తర్వాత దేశంపై ఆంక్షలు విధించడంతో ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎక్కువ సమయం తీసుకుంది. ►తేజస్ ఫైటర్ జెట్.. సింగిల్ సీట్, సింగిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గగనతలం నుంచి గగనతల, భూఉపరితల లక్ష్యాలను ఛేదిస్తుంది. ►మిగ్ 21 యుద్ధ విమానాలకు ఇది ప్రత్యామ్నాయం. సుమారు నాలుగు టన్నుల పేలుడు పదార్థాలను/బాంబులను మోసుకుపోగలదు. ► ఈ ఏడాది చివరికి మరో ఆరు తేజస్ యుద్ధ విమానాలు సిద్ధం. 2018 నాటికి వైమానిక దళంలో మరో 20 తేజస్‌లు. ► హెచ్ఏఎల్కు ఏడాదికి 16 తేజస్‌లను తయారుచేసే సామర్థ్యం. తేజస్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న పొరుగు దేశాలు. ► ఒక్కో తేజస్ తయారీకి అయ్యే ఖర్చు రూ.220 కోట్లు. దేశానికి గర్వకారణం: మోదీ వైమానిక దళంలోకి తేజస్ చేరికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తేజస్ దేశానికి గర్వకారణమని, తేజస్ చేరిక భారత శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని ట్విటర్లో కొనియాడారు. భారత వైమానిక దళం శక్తి సామర్థ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తేజస్ తోడ్పడుతుందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ట్వీట్ చేశారు. తేజస్ విశేషాలు... ►1983లో తేజస్ విమానాల ప్రాజెక్టును ప్రారంభించారు. ►తేజస్ విమానాన్ని తొలిసారి 2001 జనవరి 4న పరీక్షించారు. ► గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూతలం, గగనతలం నుంచి సముద్రంపై లక్ష్యాలను చేధించేలా డిజైన్ చేశారు. ► పొడవు 13.7 మీటర్లు. ఎత్తు 4.4 మీటర్లు. రెక్కల వెడల్పు 8.3 మీటర్లు. 1.6 రెట్ల శబ్దవేగంతో దూసుకెళ్లగలదు. జీఈ-ఎఫ్414-ఐఎన్ఎస్6 ఇంజన్. ► ఈ తరహా సూపర్సోనిక్ యుద్ధవిమానాల్లో అత్యంత చిన్నది, తేలికైనది. ► దేశీయంగా డిజైన్, అభివృద్ధి, తయారైన తొలి సెమీ-ఆటోమేటిక్ విమానం. ► ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధిచేశాయి. రెండోరోజూ క్షిపణి పరీక్ష విజయవంతం బాలసోర్ (ఒడిశా): భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన మధ్య శ్రేణి ఉపరితలం నుంచి గగనతలం క్షిపణిని ఒడిశాలోని బాలసోర్‌లో శుక్రవారం మరోసారి పరీక్షించారు. గురువారం నాటి రెండు పరీక్షలలాగే శుక్రవారం జరిపిన మూడో పరీక్ష కూడా విజయవంతమైంది. రెండు వరుస రోజుల్లో మూడుసార్లు క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) హ్యాట్రిక్ నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 3వ లాంచ్‌ప్యాడ్ నుంచి దీన్ని పరీక్షించారు. బంగాళాఖాతం సముద్రంలో వెళ్తోన్న మానవ రహిత విమానాన్ని టార్గెట్‌గా నిర్ణయించారు. విమానం గురించి రాడార్ నుంచి సంకేతాలను అందుకున్న క్షిపణి, విమానాన్ని ఢీకొట్టి పరీక్షను విజయవంతం చేసింది. 70 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. బహుళ ప్రయోజనకారి అయిన ఈ క్షిపణి, నిఘా పరికరంగా కూడా పనిచే స్తుంది. వైమానిక దాడులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. దీన్ని హైదరాబాద్‌లోని డీఆర్డీవో ప్రయోగ శాలలో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో కలిసి అభివృద్ధి చేశారు. తేజస్‌ను నడపటం ఆనందంగా ఉంది: కెప్టెన్ రంగాచారి ‘స్వదేశీ తయారీ ఫైటర్ జెట్‌ను తొలిసారి నడిపే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నాను. చాలా తేలికైన ఈ ఫైటర్ జెట్‌లో ప్రయాణించటం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రపంచంలోని ఇతర యుద్ధవిమానాలకంటే ఇది ఓ తరం ముందుగానే ఉందనటంలో సందేహం లేదు. దీన్ని ఏ ఇతర యుద్ధ విమానంతోనూ పోల్చలేం.’ -
ఇది యావత్ జాతికి గర్వకారణం:ధోని
బెంగళూరు:ఇటీవల భారత వైమానిక దళంలోకి తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను ప్రవేశపెట్టడాన్ని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్వాగతించాడు. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్కరికి ధోని అభినందనలు తెలియజేశాడు. వైమానిక దళంలో తేజస్ ను ప్రవేశపెట్టడం యావత్ జాతి గర్వించదగ అంశం అంటూ ధోని తాజాగా ట్వీట్ చేశాడు. ఇది భారత్ సాధించిన అరుదైన ఘనతగా పేర్కొన్నాడు. ఈ నెల ఆదిలో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' ను భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తేజస్ స్క్వాడ్రన్‌ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్‌లోకి మరో ఆరు తేజస్‌లు త్వరలోనే చేరనున్నాయి. Cngrts to IAF on their latest warbirds and every1 who were part of the project indeed a very proud moment for INDIA pic.twitter.com/de6YANPzqE — Mahendra Singh Dhoni (@msdhoni) 1 July 2016 -
భారత వైమానికదళంలోకి 'తేజస్'
బెంగళూరు: భారత వైమానిక దళం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను బెంగళూరులో శుక్రవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' చేరికతో భారత వైమానిక దళం అగ్రశ్రేణి దేశాల సరసన చేరినట్లు చెప్పొచ్చు. భారత వైమానిక దళంలో దీనిని చేర్చడానికి 33 ఏళ్ల సుదీర్ఘకాలం పట్టడం పూడ్చలేని లోటు అయినప్పటికీ.. తేజస్ చేరిక వైమానిక దళానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇవాళ జరిగిన కార్యక్రమంలో రెండు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌లను భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. మొట్టమొదటి తేజస్ స్క్వాడ్రన్‌ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్‌లోకి మరో ఆరు తేజస్‌లు త్వరలోనే చేరనున్నాయి. -
గగన రంగాన తొలి మహిళలు
న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్) లో అరుదైన ఘట్టం ఆవిషృతం కానుంది. మొదటి సారిగా ముగ్గురు మహిళలు యుద్ధ పైలట్లుగా చేరనున్నారు. భావనా కాంత్, మోహనా సింగ్, అవని చతుర్వేది లు 2015 అక్టోబర్ లో ఓపెన్ కేటగిరీలో ఐఏఎఫ్ కు సెలక్ట్ అయ్యారు. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరిని అధికారికంగా జూన్ 18 న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో వీరు వాయు సేనలో చేరనున్నారు. అనంతరం వీరు కర్నాటక లోని బీదర్‌లో 2017 జూన్ వరకు కాక్ పిట్ అడ్వాన్స్ డ్ ట్రేనింగ్ తీసుకోనున్నారు. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ : భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించే సూపర్సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ కేంద్రంలో భారత వాయుసేన ఈ పరీక్ష నిర్వహించింది. అనుకున్న లక్ష్యాలను క్షిపణి కచ్చితత్వంతో అధిగమించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. లోపరహిత సామర్థ్యాలు కలిగిన ఈ వ్యవస్థ త్రివిధ దళాలకు సాధికారత చేకూర్చనుం ది.మన విమానాల రాకపోకలను పసిగట్టేందుకు శత్రుదేశాలు సరిహద్దుల వెంట ఏర్పాటుచేసిన రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను కూల్చేసేందుకు ఈ క్షిపణిని భారత వాయుసేన గత ఏడాది తీసుకుంది. -
అసాధారణం.. మన పాటవం..
కళ్లు చెదిరేలా యుద్ధ విమానాల విన్యాసాలు ♦ రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో వైమానిక దళ శక్తి ప్రదర్శన ♦ సుఖోయ్, జాగ్వర్, మిరేజ్ల సందడి పోఖ్రాన్: మన వైమానిక దళ పాటవమేంటో మరోసారి ప్రపంచం కళ్లారా వీక్షించింది. శత్రుదేశాలకు గుబులు పుట్టించే రీతిలో భారత వైమానిక దళం తన శక్తి సామర్థ్యాలు ఏపాటివో అత్యద్భుతంగా, అబ్బుర పరిచేవిధంగా ప్రదర్శించింది. భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం శాఖ, రక్షణ శాఖ మంత్రులు ఇతర అతిరథమహారథులు వీక్షిస్తుండగా అణ్వస్త్ర ప్రయోగ భూమి రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో శుక్రవారం భారత వైమానిక విన్యాసాలు జరిగాయి. థార్ ఎడారిలో భారత్ అణ్వస్త్రాలను రెండు సార్లు విజయవంతంగా ప్రయోగించిన పోఖ్రాన్ యుద్ధ విమానాల విన్యాసాలతో రణభూమిగా మార్మోగిపోయింది. ‘ఐరన్ ఫిస్ట్-2016’ పేరిట పొఖ్రాన్‌లో నిర్వహించిన ఈ షోలో ఎయిర్‌క్రాఫ్ట్‌లు కళ్లుచెదిరే విన్యాసాలతో కట్టిపడేశాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ విన్యాసాలను ప్రారంభించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 22 రకాల యుద్ధ వైమానిక వేదికల నుంచి ఆయుధ వ్యవస్థలు తమ పాటవాన్ని ప్రదర్శించాయి. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ద్వారా గాలిలో నుంచి గాలిలో క్షిపణిని ఛేదించడం అబ్బురపరిచింది. భూమి నుంచి గాలిలో క్షిపణిని ఛేదించే ఆకాశ్ క్షిపణిని కూడా ఇందులో ప్రదర్శించారు. త్వరలో సైన్యంలోకి చేరనున్న తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ రాకెట్లను ప్రయోగించింది. ఫైటర్ జెట్లు- సుఖోయ్ 30, మిరేజ్-2000, మిగ్-27, జాగ్వర్లు ఆకాశంలో సందడి చేశాయి. రాత్రిపూట నిర్వహించిన ప్రదర్శనలో 180 యుద్ధవిమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. నిశ్శబ్దంగా ఉన్న నీలి ఆకాశం మండితున్నట్లు భ్రమ కలిగించేలా ఈ ప్రదర్శన సాగింది. ఇందులో పలు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. భారతీయ వాయుసేన సామర్థ్యం తెలియచెప్పడమేనని విన్యాసాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఎక్సర్సైజ్ ఐరన్ ఫిస్ట్‌ను 2013లో మొదటిసారి నిర్వహించారు. -
అఫ్జల్ గురు ఉరితీతకు ప్రతీకారంగానే..!
పఠాన్‌కోట్: గురుదాస్‌పుర్ వాసి అయిన రాజేశ్ వర్మ అదృష్టవంతుడనే చెప్పాలి. శుక్రవారం ఉదయం ఆయనను నలుగురు సాయుధ ఉగ్రవాదులు అపహరంచుకుపోయారు. ఆ తర్వాత ఆయన గొంతు కోసి.. చనిపోయి ఉంటాడని భావించి వదిలేసి పోయారు. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డ ఆయన.. పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరితీయబడ్డ అఫ్జల్ గురు మరణానికి ప్రతీకారంగా తాము పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై దాడికి తెగబడుతున్నట్టు ఉగ్రవాదులు తెలిపారని ఆయన చెప్పారు. 'మిత్రుడైన ఎస్పీ సల్విందర్‌సింగ్, ఆయన వంటమనిషితో కలిసి మేం సరిహద్దుల సమీపంలోని నోరాత్ జైమాల్‌సింగ్ బ్లాక్‌కు వెళ్లి నివాళులర్పించాం. అనంతరం తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ ఉగ్రవాదులు మా వాహనాన్ని అడ్డగించారు. ఆర్మీ యూనిఫాంలు ధరించి.. భారీ ఆయుధాలతో ఉన్న వారు మమ్మల్ని బలవంతంగా వారి వాహనాల్లో ఎక్కించుకున్నాను. మా ముగ్గురిని తాళ్లతో బంధించి తీవ్రంగా కొట్టారు' అని ప్రస్తుతం ఆస్పత్రి బెడ్ మీద కోలుకుంటున్న రాజేశ్ వర్మ తెలిపారు. 'అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారంగానే మేం ఎయిర్‌బేస్‌పై దాడి చేయబోతున్నామని వారు చెప్పారు. 'మీరు అఫ్జల్ గురును చంపారు. మేం ప్రతీకారం తీర్చుకుంటాం' అని ఉగ్రవాదులు పదేపదే చెప్పారు. వారి వద్ద భారీ ఆయుధాలతోపాటు, జీపీఎస్ నావిగేషన్ సిస్టం కూడా ఉంది. ఎయిర్‌బేస్ ఎక్కడుందో కూడా వారికి స్పష్టంగా తెలుస' అని ఆయన చెప్పారు. ' ఆ తర్వాత ఎస్పీని, అతని వంటవాడిని వదిలేశారు. నన్ను మాత్రం వెంట తీసుకెళ్లి నిత్యం కొడుతూ పోయారు. ఎయిర్‌బేస్ కొంత దూరంలో నా గొంతు కత్తితో కోసి.. చనిపోయి ఉంటానని భావించి వాహనం నుంచి కింద పడేసి పోయారు. కానీ నేను మాత్రం బతుకడానికి ప్రయత్నించారు. రక్తస్రావం కాకుండా గొంతు చుట్టు వస్త్రాన్ని కట్టుకున్నాను. ఆ తర్వాత సమీపంలోని గురుద్వారలోకి పరుగెత్తికెళ్లి అక్కడ ఉన్న వారి ద్వారా మా కుటుంబసభ్యులకు ఫోన్ చేయించాను. వారు నన్ను ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలు దక్కాయి' అని ఆయన వివరించారు. పంజాబ్ పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. దాడికి దిగిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సిబ్బంది చనిపోయారు. -
ఆకాశంలో అద్భుతం
నేటి నుంచి ‘స్కై ఫెస్ట్’ ప్రారంభం ఐదు రోజుల సాంస్కృతిక సంబరాలు సెంట్రల్ యూనివర్సిటీ: రెక్కలు కట్టుకుని పక్షిలా గాలిలో తేలిపోతుంటే.. ఆ అనుభూతిని పొందాల్సిందే.. లేదంటే ప్రత్యక్షంగా చూడాల్సిందే.. ఇప్పుడు ఈ అవకాశం నగరవాసి ముంగిటకొచ్చింది. గాలిలో తేలుతూ ఆనందడోలికల్లో ముంచేందుకు సిటీ ‘స్కై ఫెస్ట్-2015’కు సిద్ధమైంది. ఈ వేడుక బుధవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ గగన పండుగ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. క్యాన్సర్ బాధితులకు సాయం అందించేందుకు బంజారాహిల్స్ రోటరీక్లబ్ ఈ కార్యక్రమానికి నడుం బిగించింది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు పారాజంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్, సినిమాలు, సంగీత ఝరితో ఈ స్కైఫెస్ట్ నగరవాసులకు కొత్త అనుభూతిని పంచనుంది. కార్యక్రమాలు ఇవే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆకాశగంగ బృందం ప్రదర్శించే పారా జంపింగ్, వాయు విన్యాసాలు ఈ ఫెస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్‌లో లాంగ్‌రైడ్, జాయ్ రైడ్ ఉంటాయి. కార్నివాల్లో ఆక్రోబాట్స్ డాన్సులు, హిప్హప్ జంపింగ్ రోప్, సల్సా, స్టిక్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణ. ఇంకా రాక్‌బాండ్ ప్రదర్శనలు, ఆరుబయట చిత్రాలు అలరిస్తాయి. తొలిరోజు డీజే అఖిల్ ప్రత్యేక రాక్నైట్ హోరెత్తనుంది. 24న బాద్షా, 25న దేవి శ్రీ ప్రసాద్, 26న సోను నిగమ్, 27న తీన్మార్ నైట్ పేరిట ఆర్పీ పట్నాయక్ సంగీత ప్రదర్శనలు స్కైఫెస్ట్ జోష్‌ను పెంచనున్నాయి. ఇవిగాక చక్కని చిత్రాలను వేలమంది ఆరుబయట తిలకించే అద్భుత అవకాశం ఇందులో ఉంది. నగరంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ స్కైఫెస్ట్ నగరవాసులకు న్యూ ఇయర్ జోష్‌ను మోసుకొస్తుందని ఫెస్ట్ నిర్వాహకులు జగదీశ్ రామడుగు, రాణిరెడ్డి, రామ్మోహనరావు తెలిపారు. వేడుక ద్వారా సమకూరిన మొత్తాన్ని ‘స్పర్శ్ హో స్పైస్’ ఆస్పత్రికి అందించి క్యాన్సర్ బాధితులకు స్వాంతన చేకూర్చనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తుంది. -
సహాయం కోసం జనాల ఎదురుచూపులు
-
సదా అప్రమత్తం
సార్వభౌమత్వ పరిరక్షణపై రాష్ట్రపతి హసిమర(పశ్చిమబెంగాల్): భారతదేశం శాంతికి కట్టుబడి ఉందని, అదే సమయంలో తన సార్వభౌమత్వ పరిరక్షణకోసం సైనిక బలగాలతో ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఇక్కడి వ్యూహాత్మక సరిహద్దు ఎయిర్‌బేస్ వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన 22వ, 18వ స్క్వాడ్రన్లను సత్కరించారు. మన సాయుధ దళాల సామర్థ్యం ఎన్నతగినదని కొనియాడారు. మనం శాంతికి కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో మన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకోసం మనకున్న సర్వశక్తులనూ ఉపయోగిస్తామన్నారు. అత్యంత పరాక్రమశాలులైన మన సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనగలవన్న విశ్వాసం తనకుందన్నారు. దేశం కోసం వైమానిక దళం అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు. మానవతా సాయం, విపత్తుల సందర్భంగా పునరావాస చర్యల్లో ఐఏఎఫ్ అందిస్తున్న సేవలు ఎన్నతగినవన్నారు. -
మా అబ్బాయి ఎయిర్‌ఫోర్సులో చేరతాడట
తన కొడుకు వైమానిక దళంలో చేరేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నాడని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అయితే, అతడు చేరతాడా లేదా అనే విషయం అప్పుడే మాత్రం చెప్పలేమన్నాడు. వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్‌గా ఉన్న సచిన్.. హిండన్ బేస్ వద్ద ఎయిర్ ఫోర్స్ డే పెరేడ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. వాస్తవానికి తన కొడుకును కూడా ఇక్కడకు తీసుకొద్దామనుకున్నానని, అతడికి ఎయిర్ ఫోర్స్ అంటే చాలా ఇష్టమని అన్నాడు. అర్జున్ టెండూల్కర్ వయసు ఇప్పుడు 16 ఏళ్లు. సుఖోయ్ యుద్ధ విమానంలో వెళ్లాలని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా, అది ఇంతవరకు కుదరలేదని మాస్టర్ చెప్పాడు. -
అలహాబాద్ లో కూలిన జాగ్వార్ విమానం
అలహాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలిపోయింది. అలహాబాద్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం కూలి పోవడానికి ముందే ప్రమాదాన్ని గుర్తించిన ఇద్దరు ఫైలట్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు అదేశించింది. -
నాలో ఎన్నో... ప్రశ్నలు రేపిన రాత్రి!
నిద్రలేని రాత్రులు అది 1971వ సంవత్సరం. నేను అప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నాను. అప్పటికి మూడేళ్ల క్రితమే నేనా ఉద్యోగంలో చేరాను. కానీ ఆ ఉద్యోగం నాకు ఎన్నో నిద్ర లేని రాత్రుల్ని మిగులుస్తుందని నేనప్పుడు ఊహించలేదు. ఇండియా, పాకిస్తాన్ల మధ్య పద్నాలుగు రోజుల పాటు హోరాహోరీగా యుద్ధం జరిగింది. దేశం తరఫున అందరం శాయశక్తులా పోరాడాం. చివరికి సంధి కుదిరింది. యుద్ధం ఆగిపోయింది. ఆ రోజు రాత్రి నేను బిల్లెట్లో (బిల్లెట్ అంటే విపత్కర సమయాల్లో సైనికులు ఉండే తాత్కాలిక నివాసం) పడుకుని ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. నిద్రించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ బిల్లెట్లోని ఓ మూలకి చూశాను. ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. అక్కడ నా స్నేహితుడు నారాయణన్ ఉండాలి. కానీ లేడు. ఏదో దిగులు కమ్మేసింది నన్ను. నారాయణన్ తమిళనాడుకు చెందినవాడు. మరో ఐదు రోజుల్లో అతని పెళ్లి. దానికి రమ్మని మమ్మల్ని రోజూ పోరేవాడు. ‘మా ఊరు చాలా అందంగా ఉంటుంది, బోలెడన్ని పక్షులు వలస వస్తాయి, అవన్నీ చూడాలంటే మా ఊరు రావాలి, అందుకు నా పెళ్లే తగిన సందర్భం, మీరంతా రావాల్సిందే’ అంటూ రోజూ పోరేవాడు. కానీ ఇప్పుడు తను లేడు. నారాయణన్ మాత్రమే కాదు... గురు మీత్సింగ్ కూడా లేడు. పంజాబ్ నుంచి వచ్చి ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు గురుమీత్. తన ముసలి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని కలలు కనేవాడు. వచ్చే భార్య వాళ్లని ఆదరిస్తుందో లేదోనని పెళ్లి కూడా చేసుకోననేవాడు. అతను ఏడి? ఎక్కడున్నాడు? ఎవరి కోసమైతే బతికాడో ఆ తల్లిదండ్రుల్ని వదిలేసి ఎలా వెళ్లిపోగలిగాడు? మా స్వామి కూడా లేడు. నేను ఎయిర్‌ఫోర్స్‌కి వెళ్లినప్పుడు ఆయనే నా తొలి గురువు. ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో... అన్నీ నేర్పాడు. నువ్వు ఇంకా బాగా చదువుకుని ఎయిర్‌ఫోర్స్‌లోనే మంచి పొజిషన్‌కి చేరుకోవాలి అంటుండేవాడు. ఇకమీదట అలా చెప్పడానికి తను లేడు. కదన రక్కసి పాదాల కింద పడి నలిగిపోయాడు. అందరినీ వదిలి వెళ్లిపోయాడు. సరిగ్గా అంతకు కొన్ని రోజుల ముందే స్వామికి కూతురు పుట్టింది. తనని ఇంకా చూసుకోనే లేదు. ‘యుద్ధం అయిపోగానే నా పాపను చూడ్డానికి వెళ్తాను, తనని బాగా పెంచుతాను, డాక్టర్ని చేసి ఎయిర్ ఫోర్సులోనే చేర్పిస్తాను’ అంటూ తన కూతురి భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. ఆ కలల గురించి ప్రతిక్షణం కలవరించేవాడు. కానీ అతని కలలు నిజం కాలేదు. అతని కూతురి కోసమైనా మృత్యువు స్వామి మీద జాలి పడలేదు. బిల్లెట్లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. అక్కడే తిరుగుతున్నారు. నవ్వుతున్నారు. నన్ను పలకరిస్తున్నారు. కబుర్లు చెబుతున్నారు. కన్నుమూసి తెరిచేలోగా మాయమవుతున్నారు. వారిని గూర్చిన తలపుల భారాన్ని మోయలేకపోయాను. వాళ్లు లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఆ రాత్రి క్షణమొక యుగంలా గడిచింది. అది మాత్రమే కాదు... క్షణమైనా కన్నంటుకోనీయకుండా నన్ను చిత్రవధ చేసిన ఆ రాత్రి... నాలో చాలా ప్రశ్నల్ని కూడా రేపింది. ఎవరి మధ్య జరిగింది యుద్ధం! దేశాల మధ్య జరిగిందా? లేదు. పాకిస్తాన్ అక్కడే ఉంది. ఇండియా ఇక్కడే ఉంది. అవి నేరుగా తలపడలేదు. నాయకుల మధ్య జరిగిందా? లేదు. వాళ్లు కూడా ఎక్కడివాళ్లక్కడ బాగానే ఉన్నారు. సుఖంగా ఉన్నారు. మరి ఎవరి మధ్య జరిగింది? అహంకారాల మధ్య జరిగింది. తమ అహాలను ప్రదర్శించడానికి జరిగింది. దానివల్ల ఏం జరిగింది? నాలాంటి కొందరి గుండెల్లో శూన్యం మిగిలింది. కొందరు తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలింది. కొందరు పిల్లలకు తండ్రి ప్రేమ దూరమయ్యింది. కొన్ని కుటుంబాల్లో చీకటి పరచుకుంది. పాకిస్తాన్‌తో సంధి కుదుర్చుకున్న మన ప్రభుత్వం వేలమంది సైనిక బలగాన్ని తీసుకెళ్లి సగర్వంగా పాకిస్తాన్ చేతుల్లో పెట్టింది. కానీ పోయిన సైనికుల ప్రాణాల్ని వెనక్కి తీసుకు రాలేకపోయింది. నా స్నేహితులను నాకు మళ్లీ చూపించలేకపోయింది. నాటి జ్ఞాపకాలను మర్చిపోలేక ఇప్పటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్న నా కంటి మీదికి కునుకును తీసుకు రాలేకపోయింది. - ఫన్డే టీమ్ -
ఐఏఎఫ్‌కు ఎయిర్‌బస్-టాటా బిడ్
ఎయిర్‌బస్ సీ295 విమానాల సరఫరా న్యూఢిల్లీ: కాలపరిమితి ముగుస్తున్న ఏవ్రో ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్)కు ఎయిర్‌బస్ సీ295 రవాణా విమానాలను సరఫరా చేసేందుకు ఎయిర్‌బస్‌తో టాటా జత కట్టింది. తద్వారా 56 విమానాల సరఫరాకు సంయుక్త బిడ్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్ తొలి 16 విమానాలను సరఫరా చేయనుంది. ఆపై మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్) తయారీ, అసెం బ్లింగ్ ద్వారా అందిస్తుంది. ప్రధానంగా విడిభాగాలను అసెంబ్లింగ్ చేయడం, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, దేశీ పరికరాల పరిశీలన, నిర్వహణ వంటి కార్యక్రమాలను టీఏఎస్ చేపడుతుంది. తగిన పరిశీలన, పటిష్ట పరిశోధన చేశాక ఈ ఒప్పందానికి టీఏఎస్‌ను దేశీ ఉత్పాదక సంస్థగా ఎంపిక చేసుకున్నట్లు ఎయిర్‌బస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏవ్రో విమానాలను ఐఏఎఫ్ తొలిసారి 1960లో అందుకుంది. -
ఐఏఎఫ్ హెచ్చరికలపై స్పందించిన షియోమీ!
న్యూఢిల్లీ: షియోమీ కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న ఫోన్లను తమ అధికారులు, కుటుంబీకులు వాడొద్దంటూ గతవారం భారతీయ వాయు సేన(ఐఏఎఫ్) హెచ్చరికలపై ఆ కంపెనీ స్పందించింది. వినియోగదారుల డేటాను భద్రతలేదంటూ చేసిన ప్రకటనపై భారత వైమానిక దళ అధికారులతో షియోమీ కంపెనీ ప్రతినిధులు చర్చించనున్నారు. 'ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రయత్నిస్తున్నాం. ఐఏఎఫ్ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం మాకు అందలేదు. మీడియాలో వచ్చే కథనాలు మా దృష్టికి వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐఏఎఫ్ అధికారులను కలుస్తాం' షియోమీ ఉపాధ్యక్షుడు హుగో బర్రా తెలిపారు. గత సంవత్సరం రెడ్ మీ 1ఎస్ ఫోన్ ద్వారా సర్వీస్ ప్రోవైడర్ పేరు, ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్లను ఏవిధంగా చేరవేస్తుందనే అంశాన్ని ఫిన్ లాండ్ కు చెందిన ఎఫ్ సెక్యూర్ కంపెనీ ఓ డెమోను నిర్వహించింది. షియోమీ ఫోన్లలోని డేటా అంతా చైనాలోని సర్వర్లకు చేరుతోందని.. దీనివల్ల సెక్యూరిటీ రిస్కులు పొంచిఉన్నాయని ఐఏఎఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
భద్రతపై సెల్ కంపెనీ షియోమీ వివరణ
న్యూఢిల్లీ: ఇండియన్ సెల్‌ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోన్న చైనాకు చెందిన సెల్ కంపెనీ షియోమీ వినియోగదారుల నుంచి తాము ఎటువంటి డేటాను తీసుకోవడంలేదని వివరణ ఇచ్చింది. ఈ కంపెనీ మన దేశంలో లాంఛ్ చేసింది రెండే రెండు ఫోన్లు. ఒకటి ఎంఐ3, రెండు రెడ్ మి 1ఎస్. ఈ రెండు ఫోన్లను ఫ్లిఫ్‌కార్ట్‌లో పెడితే స్టాక్ క్షణాల్లో ఖాళీ అయిపోతోంది. అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ ఫోన్ల భద్రపై ఇప్పుడు దేశంలో చర్చ నడుస్తోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఈ కంపెనీ ఫోన్లపై నిషేధం విధించారు. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు ఎవరూ షియోమీ ఫోన్లను వాడకూడదని ఆదేశించారు. ఈ ఫోన్ల ద్వారా ఇండియా సమాచారాన్ని చైనీయులు దొంగలిస్తున్నారనే అనుమానం నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ బ్రాండ్ వ్యాల్యును దెబ్బతీసే ఈ వార్తలపై షియోమీ వెంటనే స్పందించింది. చైనా నుంచి తన సర్వర్లను కాలిఫోర్నియా, సింగపూర్‌లకు తరలించనున్నట్లు కంపెనీ తెలిపింది. అనుమతిలేకుండా తాము ఎటువంటి డేటాను తీసుకోవడంలేదని తెలిపింది. భారత ప్రభుత్వ అధికారులను కలిసి ఈ వార్తలపై వివరణ ఇస్తామని పేర్కొంది. అభ్యంతరాలపై తగిన సమాచారం అందజేస్తామని తెలిపింది. ** -
యూపీలో కూలిన ఐఏఎఫ్ చాపర్
ఏడుగురు మృతి న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు సహా ఏడుగురు వైమానిక దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి అలహాబాద్ వస్తున్న ‘ఏఎల్‌హెచ్ ధ్రువ్’ చాపర్ సీతాపూర్ జిల్లాలోని పాలిత్పుర్వ గ్రామం దగ్గర్లోని పంట పొలాల్లో కూలిపోయింది. ప్రమాదానికి ముందు పైలట్ ‘మేడే కాల్(ఎమర్జెన్సీ కాల్)’ చేశారని, అనంతరం రేడియో, రాడార్ సంకేతాలకు చాపర్ దూరమైందని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. బరేలీలో మధ్యాహ్నం 3.53 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్ దాదాపు గంట తరువాత ప్రమాదానికి గురైందని ఆయన వివరించారు. ఆ చాపర్‌లో ఇద్దరు పైలట్లు, వివిధ హోదాల్లో ఉన్న ఐదుగురు వైమానికదళ సైనికులు ఉన్నారన్నారు. సమాచారం తెలియగానే సహాయక బృందాలు ఘటనాస్థలికి బయల్దేరాయన్నారు. ప్రమాదంపై అంతర్గత దర్యాప్తునకు ఐఏఎఫ్ ఆదేశించిందని ఆయన తెలిపారు. కూలిపోగానే చాపర్ మంటల్లో చిక్కుకుందని సిధౌలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు. -
హ్యూస్టన్ న్యాయపీఠంపై... తెలుగు ఆశ!
ఆమె ‘‘మనుషులెవ్వరూ పుట్టుకతోనే చెడ్డవారు కారు. పరిస్థితుల ప్రాబల్యం వల్లో, పరిసరాల ప్రభావం వల్లో మాత్రమే తప్పులు చేస్తారు. అలాంటి వారికి కేవలం శిక్ష వేస్తే సరిపోదు, వారికి తమ తప్పు దిద్దుకునేఅవకాశాన్ని కూడా ఇవ్వాలి కదా, అందుకే నా క్లయింట్స్ ఏ పరిస్థితుల్లో అలాంటి తప్పులు చేశారో తెలుసుకుని, వారిని వారున్న పరిస్థితి నుండి బయట పడేయటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా!’’ అంటారు ఆశారెడ్డి. ఇంతకీ ఎవరీ ఆశారెడ్డి..? క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పని చేస్తూ హ్యూస్టన్ మునిసిపల్ జడ్జిగా ఎన్నికయిన మొట్టమొదటి భారతీయ వనిత ఆమె. హైదరాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పని చేసిన వింగ్ కమాండర్ ఎస్.వి.ప్రసాద్ ఆమె తండ్రి. తల్లి ఇందిర. చిన్నప్పటినుంచి ఆమెలో అపారమైన ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు ఆమె తల్లితండ్రులు. అందుకే కాబోలు... చదువుతోబాటు, క్రీడారంగంలోనూ టాపర్‌గా నిలిచి, ఎన్నో బహుమతులు గెలుచుకుంది. తండ్రి ఉద్యోగ విరమణ అనంతరం వారి కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయింది. దాంతో ఆమె కళాశాల విద్య పూర్తి చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుండి ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు.1983లో ఆశాకు పెళ్లయింది. ఆ వెంటనే భర్త రామకృష్ణారెడ్డికి అమెరికాలో ఉద్యోగం రావడంతో భర్తతోపాటు హ్యూస్టన్ వచ్చారు. గృహిణిగా ఉంటూనే, అమెరికాలో లా డిగ్రీ చేసి, రెండు వందల మంది విద్యార్థుల్లో రెండవ స్థానంలో నిలిచినా, అది ఆమెకు సంతృప్తినివ్వకపోవడంతో న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి టాపర్‌గా నిలిచారు. దాంతో ఆమెను వెతుక్కుంటూ ఆర్ధర్ అండర్సన్ అనే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగ జీవితం బాగానే ఉన్నప్పటికీ, ఆమె మన సు మాత్రం నలుగురిలోకీ వెళ్లాలని, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగేలా చూడాలని, వారి తరఫున కేసులు వాదించి గెలవాలని ఉవ్విళ్లూరేది. దాంతో భర్త సలహా మేరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి, స్వంతంగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. వృత్తిపట్ల నిబద్ధత, అంకితభావం ఉండటం వల్ల అతి కొద్దికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి, క్రిమినల్ డిఫెన్స్ లా లో దేశం మొత్తంలోనే బిజీ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ రంగంలో ఆమెకు ఎంత మంచి పేరు వచ్చిందంటే అక్కడి న్యాయమూర్తులకు మన ఆచార వ్యవహారాల గురించి నిపుణుల సలహా అవసరం అయినపుడు ఆమెనే సంప్రదించేటంతగా! అయితే ఆమె కేవలం లా ప్రాక్టీస్‌కే పరిమితం కాలేదు. స్థానిక రాజకీయాల గురించి తెలుసుకుంటూ, రాజకీయవేత్తలతో మంచి సంబంధాలను నెలకొల్పుకుంటూ వచ్చారు. అంతేకాదు, ఎన్నో లా సంస్థలకు, ఇతర సంస్థలకు వివిధ స్థాయుల్లో పని చేశారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అవే అక్కడివారు ఆమెను మునిసిపల్ జడ్జిగా ఎన్నుకునేలా చేసి, ఆ పదవికి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ పౌరురాలిగా ఆమె పేరును రికార్డులకెక్కించాయి. న్యాయమూర్తి అయినప్పటికీ, ప్రజలతో నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉన్న న్యాయవాద వృత్తిని వదులుకోలేదు ఆశారెడ్డి. దాంతో హెచ్-టెక్సాస్ పత్రిక ఆమెకు నాలుగు సంవత్సరాలుగా హ్యూస్టన్‌లో ఉన్నతమైన లాయర్‌గా రేటింగ్ ఇస్తూ వచ్చింది. అంతేకాదు, ఆమె ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండో-అమెరికన్ చారిటీ ఫౌండేషన్ బోర్డ్‌లో 2012-2013 వరకు సభ్యురాలిగా ఉన్నారు. 2003 సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో అసమానమైన ప్రతిభ సాధించినందుకుగాను ‘తానా’ వారు ఆమెను ఉన్నత పురస్కారంతో సత్కరించారు. ఆమె సాధించిన ఎన్నో విజయాలు, అందుకున్న సన్మానాలు, సత్కారాల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఆశారెడ్డి ప్రతి ఏటా ఇండియా వస్తుంటారు. ఇక్కడ యువతీ, యువకులకు సరైన అవకాశాలు లేని వారికి లా కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే ఉచిత న్యాయ సలహాలు ఇస్తారు. వృత్తిపరంగా ఆశారెడ్డి ఎంతోమంది నేరస్థులను చూస్తుంటారు. ఈ కారణంగానే హైస్కూల్స్‌కి వెళ్లి అక్కడి విద్యార్థులతో వారు తప్పుదోవ పట్టకుండా, తప్పు నిర్ణయాలు తీసుకోకుండా వారి భవిష్యత్తుని ఎలా దిద్దుకోవాలో సలహాలిస్తూ, మొక్కగా ఉన్నప్పుడే వారి జీవితాలను అందంగా మలుచుకునేందుకు బాటలు వేస్తుంటారు. ఎవరైనా సరే తమకి ఇష్టమైన వృత్తినే ఎన్నుకొని, అందులో కృషి చేస్తే మంచి ఫలితాలొస్తాయి అని కూడా తరచు చెబుతుంటారామె. ఇది నిజమే కదా! - అమెరికా నుంచి డి. కనకదుర్గ ‘‘నాది మొదటి నుండి కలివిడిగా ఉండే స్వభావం. నేను కొత్త వారినెవరినైనా చూస్తే చిరునవ్వు నవ్వుతాను లేదా నా పేరు చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాను. నాకు అందరితో స్నేహంగా ఉండడం అంటే ఇష్టం.’’ అని వివరించారు క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పని చేస్తూ హ్యూస్టన్ మునిసిపల్ జడ్జిగా ఎన్నికయిన మొట్టమొదటి భారతీయ వనిత ఆశారెడ్డి. బహుశా అదే ఆమె విజయ రహస్యం కావచ్చు! -
‘ఆకాశ్’ పరీక్ష సక్సెస్..
వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించిన వాయుసేన బాలాసోర్: ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించగల మధ్యశ్రేణి ఆకాశ్ క్షిపణులను భారత వాయుసేన శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలసోర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం మధ్యాహ్నం 11.55, 12 గంటల సమయంలో వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించారు. మానవ రహిత విమానాలకు వేలాడ దీసిన లక్ష్యాలను ఇవి విజయవంతంగా ఛేదించాయి. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలిలోంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను ధ్వంసం చేయడానికి ఆకాశ్ క్షిపణులను రూపొందించారు. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులు 60 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలవు. ఒకే సమయంలో వివిధ లక్ష్యాలను ఛేదించగలవు. -
మలేషియా విమాన అన్వేషణలో భారత్
-
ప్రకృతి సోయగాల నెలవు
సూర్యలంక హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను. వారాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. హాయిగా గడపాలనుకున్నాం మా మిత్రబృందం. అంత చక్కని ప్రాంతం ఎక్కడా అని వెతికితే మన రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో ఉన్న ఓ అద్భుతమైన ప్రాంతం గురించి తెలిసింది. అదే సూర్యలంక. ఐదుగురం స్నేహితులం కలిసి కారులో బయల్దేరాం. ఉదయాన్నే ఐదు గంటల ప్రాంతంలో బయల్దేరి, మరో ఐదున్నర గంటల్లోగా సూర్యలంకకు చేరుకున్నాం. గుంటూరు జిల్లాలోని బాపట్ల నుంచి 9 కి.మీ దూరంలో ఉన్న పల్లె అది. ఇక్కడ ఓడరేవు కూడా ఉంది. విశాలంగా, ప్రకృతి రమణీయంగా కనువిందుచేసే ఈ ప్రాంతం గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నందుకు విచారించినా, ఇప్పటికైనా చూడగలిగినందుకు తెగ సంతోషించాం. ఇక్కడికి దగ్గరలోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వారి ఎయిర్ బేస్ ఉంది. కాని లోపలికి ప్రవేశం నిషిద్ధం. ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ వారి రిసార్ట్లు ఉన్నాయి. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా రావడం వల్ల ఇక్కడి తీరం సముద్రస్నానానికి అనువుగా ఉంటుంది. సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో ఓడరేవు బీచ్ ఉంది. సముద్రతీరానికి దగ్గర్లో ఉన్న చిన్న ఈ పల్లెటూరు ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఒక వెలుగు వెలిగిందని విన్నాం. ఇక్కడ నుంచే సుమత్రా, జావా ద్వీపాలకు సరుకులు రవాణా చేసేవారట. సుమారు రెండు వేల కుటుంబాలు ఇక్కడ చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్, విదేశాలను తలపించే సకల సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకున్నాం. వేసవిలో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడే వాటర్ స్కూటర్స్‌లో షికార్ చేశాం. అలలమీద ప్రయాణం మహా అద్భుతంగా అనిపించింది. సూరాస్తమయం అందాలను తిలకించడంతో రాత్రి ఇక్కడి ప్రాంతీయ వంటకాలతో చేసిన విందుభోజనాన్ని ఆస్వాదించాం. ఆ రాత్రి సూర్యలంకలోనే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయాన్ని తిలకించి, తిరుగు ప్రయాణం అయ్యాం. - రితేష్, ఇ-మెయిల్ హైదరాబాద్ నుంచి 320కి.మీ. ఇక్కడకు బాపట్ల రైల్వే స్టేషన్ 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సూర్యలంకకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయి. బస చేయడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ వారి హరితా రిసార్ట్స్ ఉన్నాయి. -
ఎఫ్‌డీఐ పరిమితి పెంచితే మరిన్ని పెట్టుబడులు: బోయింగ్
సింగపూర్: భారత్ గనుక రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచితే... అమెరికా కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులు వెల్లువెత్తుతాయని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిమితి 26 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌షోలో పాల్గొన్న సందర్భంగా బోయింగ్ వైస్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ జెఫ్ కోహ్లెర్ ఈ అంశంపై మాట్లాడారు. భారత ప్రభుత్వం రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని సమీప భవిష్యత్తులో పెంచొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఇప్పుడున్న 26 శాతం పరిమితితో మా కంపెనీ యాజమాన్యం భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు ముందుకురావడం కష్టం. ఇక్కడున్న భారీ మార్కెట్‌పై మా సహచరులతో చాలాసార్లు చర్చించా. అయితే, 49 శాతం లేదా 40 శాతం కంటే ఎక్కువ వాటాకు ఆమోదం లభిస్తే కచ్చితంగా యాజమాన్యాన్ని ఒప్పించేందుకు ఆస్కారం ఉంటుంది’ అని కోహ్లెర్ పేర్కొన్నారు. పన్నుల విధానాన్ని సమీక్షించాలి: బంబార్డియర్ చిన్న విమానయాన కంపెనీలకు భారత్‌లో నిర్వహణ లాభదాయకంగా ఉండాలంటే విమానాలపై ప్రస్తుత పన్నుల విధానాన్ని సమీక్షించడంతోపాటు అధిక ఇంధన ధరల భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కెనడాకు చెందిన విమానాల తయారీ సంస్థ బంబార్డియర్ సూచించింది. 76 సీట్లకు మించిన విమానాలపై భారత్ అదనపు పన్నులను విధిస్తోందని బంబార్డియర్ వైస్‌ప్రెసిడెంట్ టాబ్జార్న్ కారిసన్ పేర్కొన్నారు. 29-149 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న విమానాలను నడుపుకునేందుకు చిన్న ఎయిర్‌లైన్స్‌కు అనుమతించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బంబార్డియర్కు భారత్‌లో స్పైస్‌జెట్ అతిపెద్ద కస్టమర్(15 విమానాలు)గా ఉంది. -
భారీ సైనిక రవాణా విమానాన్ని సమకూర్చుకున్న భారత్
భారత వైమానిక దళం మరో భారీ రవాణా విమానాన్ని సమకూర్చుకుంది. బోయింగ్ సి-17 గ్లోబ్ మాస్టర్ 3 శ్రేణిలోని మూడో విమానం మన వైమానిక దళానికి వచ్చింది. ఇది అత్యంత భారీ, విభిన్నమైన సైనిక రవాణా విమానం. భారీ పరిమాణంలోను, భారీ బరువు ఉన్న సరుకులను కూడా చాలా ఎక్కువ దూరంపాటు రవాణా చేయడం, ఎలాంటి ఉపరితలం మీదనైనా ల్యాండ్ కాగల సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకతలు. ఆగస్టు 20వ తేదీన కాలిఫోర్నియాలోని బోయింగ్ లాంగ్ బీచ్ నుంచి భారత్‌కు ఈ విమానం బయల్దేరింది. ఇప్పటికే సి-17 శ్రేణిలో భారత్ వద్ద రెండు సైనిక రవాణా విమానాలున్నాయి. ఇవి జూన్, జూలై నెలల్లో మనకు వచ్చాయి. ఇప్పుడు మూడోది రాగా, మరో రెండు విమానాలను కూడా బోయింగ్ మనకు పంపనుంది. మొత్తం పది విమానాలను సమకూర్చుకోవాలన్నది భారత వైమానిక దళ లక్ష్యం. ఇవన్నీ వచ్చాయంటే, వైమానిక రంగంలో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో సి-17 విమానాలున్న దేశం మనదే అవుతుంది. 1991 నుంచి సేవలు అందిస్తున్న ఈ తరహా విమానాలను ప్రధానంగా సైనిక అవసరాలకే ఉపయోగిస్తారు. ఇప్పటికి ఈ విమానాలు 26 లక్షల ప్లయింగ్ అవర్స్ పూర్తి చేసుకున్నాయి. -
చైనాకు భారత్ ‘విమాన హెచ్చరిక’
న్యూఢిల్లీ: కొన్ని నెలల కిందట చైనా బలగాలు జమ్మూ కాశ్మీర్ లోని దౌలత్‌బేగ్ ఓల్డీ(డీబీఓ)లోకి చొరబడిన నేపథ్యంలో భారత వాయుసేన దీటైన హెచ్చరిక చేసింది. పెద్ద సంఖ్యలో సైనికులను, సామగ్రిని మోసుకెళ్లే ‘సీ-130జే’ రకానికి చెందిన భారీ రవాణా విమానం ‘సూపర్ హెర్క్యులెస్’ను తొలిసారిగా మంగళవారం డీబీఓ వైమానిక స్థావరంలో దింపింది. ఉదయం 6.54కు ల్యాండయిన హెర్క్యులెస్‌లో ఆర్మీ కమాండింగ్ అధికారి తేజ్బీర్ సింగ్, ‘వీల్డ్ వైపర్స్’ కమాండోలు వచ్చారు. లడఖ్ ప్రాంతంలోని అక్సాయ్ చిన్‌లో 16,614 అడుగుల(5,065 మీటర్లు) ఎత్తులో ఉన్న డీబీఓ స్థావరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వైమానిక స్థావరం. హెర్క్యులెస్ వినియోగంలోకి రావడంతో సరిహద్దులోకి జవాన్లను, యుద్ధ సామగ్రి తరలింపు, కమ్యూనికేషన్ల నిర్వహణ సజావుగా సాగనున్నాయి. ఈ విమానం 20 టన్నుల బరువును అవలీలగా మోసుకెళ్తుంది. భారత్, చైనాలు మూడేళ్ల విరామం తర్వాత చొరబాట్లు, ఇతర అంశాలపై మంగళవారమే చర్చలు జరిపిన నేపథ్యంలో ‘హెర్క్యులెస్’ను డీబీఓకు పంపడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా బలగాలు డీబీఓలోకి చొరబడడంతో ఇరు దేశ సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. -
ఉత్తరాఖండ్ మృతులు 6 వేలు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో సంభవించిన ప్రకృతి బీభత్సానికి ఆరువేల మందికిపైగా మరణించి ఉంటారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. అందులో 580 మంది మృతి చెందినట్లుగా ధ్రువీకరించామని, 5,474 మంది ఆచూకీ ఇప్పటికీ వెల్లడికాలేదని పేర్కొంది. ఆ ఘటనలో ఇంత భారీగా మృతులు ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం ఇదే మొదటిసారి. ఈ మేరకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మంగళవారం లోక్‌సభకు ఒక నివేదిక సమర్పించారు. జూన్ 1 నుంచి 18 మధ్య అక్కడ 385 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, అది సాధారణ వర్షపాతానికి 440 రెట్లు ఎక్కువని తెలిపారు. భారీ వర్షాలు, వరద వల్ల రోడ్లు దెబ్బతిన్నా, వాతావరణం సహకరించకున్నా తక్కువ సమయంలోనే 1.10 లక్షల మందిని సురక్షితప్రాంతాలకు తరలించామని చెప్పారు. సహాయకార్యక్రమాల్లో భారీగా సైనిక బలగాలు పాలు పంచుకున్నాయని ఆంటోనీ తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఐదుగురు వైమానికదళ సిబ్బంది, తొమ్మిది మంది విపత్తు సహాయక సిబ్బందితో పాటు మరో ఎనిమిది మంది పారామిలటరీ సిబ్బంది మరణించినట్లు చెప్పారు. నష్టపోయిన ప్రాంతాల పునరుద్ధరణకు ప్రధాని రూ. వెయ్యికోట్ల సహాయాన్ని ప్రకటించగా.. ఇప్పటికే రూ. 400 కోట్లు అందజేశామని చెప్పారు. చార్ధామ్ ప్రాంతాల పునర్నిర్మాణానికి ప్రధాని నేతృత్వంలో కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించినా.. ఇంతవరకూ ఉత్తరాఖండ్‌కు నిధులు అందలేదంటూ బీజేపీ, ఎస్పీ, తృణమూల్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా.. చార్‌ధామ్‌లో గల్లంతైనవారి సంఖ్య, వారికి నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. దేశంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను, వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపర్చాలని కోరారు. ఉత్తరాఖండ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.