
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్‌కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో లెఫ్టెనెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్‌తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Comments
Please login to add a commentAdd a comment