Couple
-
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు. -
సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన సందీప్ (36)కు ఆరేళ్ల కిందట మంచిర్యాలకు చెందిన కీర్తి (34)తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ మియాపూర్‌లో ఉండేవారు. 9 నెలల కిందట అమీన్పూర్ పరిధిలోని బంధంకొమ్ము శ్రీదామ్ హిల్స్‌లో సొంతిల్లు కొనుగోలు చేసి కూతురు గగనహిత(3), కుమారుడు సాకేత్‌రామ్ (ఏడాదిన్నర)తో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. సోమవారం పాప గగనహిత పుట్టినరోజు ఉంది.వేడుక జరిపే విషయంలో 5వ తేదీ (ఆదివారం) ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సందీప్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి మియాపూర్ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఒక్కడే ఇంటికొచ్చిన సందీప్‌కు కీర్తి ఉరేసుకొని కనిపించింది. వెంటనే అతడి తండ్రికి ఫోన్లో కీర్తి ఉరేసుకుందని విషయం చెప్పాడు. సందీప్ తల్లిదండ్రులు అక్కడికి వచ్చేలోపు అతడు కూడా తాడుతో ఉరేసుకున్నాడు. కీర్తి తండ్రి ప్రభాకర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్పూర్ సీఐ నాగరాజుతోపాటు ఎస్ఐ సోమేశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!
ఇటీవల రోజుల్లో దాంపత్యం అన్న మాట విలువలేనిదిగా అయిపోతోంది. ఎక్కడ చూసినా..విడాకులు కేసులే అధికమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధ జంటను చూస్తే భార్యభర్తల బంధం అంటే ఇది కదా అనిపిస్తుంది. ప్రేమ అనే ఒక్క పదం ఇరువురి మధ్య ఉంటే ఎలాంటి వైకల్యమైనా జయించొచ్చు అనిపిస్తుంది. ఈ ఏజ్‌లో తమ కాళ్లపై తాము నిలబడాలనే తపనతో ఆ జంట పడుతున్న పాట్లు చూస్తే..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంతకీ ఎవరంటే వారు..థానే రైల్వే స్టేషన్(Thane Station) వద్ద స్నాక్ అమ్ముకుని జీవించే వృద్ధ జంట(Elderly Couple). వారితో ఇన్స్టాగ్రామ్ వ్లాగర్(vlogger) సిద్ధేష్ లోకారే మాటలు కలిపి..ఆ సంభాషణను నెట్టింట వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వృద్ధ జంట కథ నెట్టింట వైరల్‌గా మారింది. బీం రావు శోభ దంపతులతో వ్లాగర్ సిద్ధేష్ సంభాషిస్తూ..మీకు ఎప్పుడు పెళ్లి అయ్యిందని ప్రశ్నిస్తారు. వారు 1982లో పెళ్లై అయ్యిందని బదులిస్తారు. మూడు దశాబ్దాలకు పైగా కలిసే ఉన్నామని అంటారు. ఇక్కడకి ప్రతిరోజు వచ్చి స్నాక్స్ అమ్ముతామని, ఎవ్వరైన స్నాక్స్/స్వీట్లు కావాలని ఆర్డర్ చేస్తే ఇంటికి కూడా వెళ్లి డెలివరీ చేస్తామని చెప్పారు. బీంరావు తాను రెండేళ్ల వయసులో చూపుకోల్పోగా, భార్య శోభాకు ఒక చేయి సరిగా లేదు. అయినా ఇరువరు ఎంతో అన్యోన్యంగా ఉంటామని చెప్పారు. రోజువారీ పనులను ఎలా ఇరువురు చకచక చేసుకోగలరో కూడా వివరించారు. అంతేగాదు భీంరావు తనకు చూపులేకపోయినా తన భార్యకు వంట చేయడంలో సహకరిస్తారట. పైగా కూరగాయాలు కట్ చేయడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని భర్తపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది శోభా. ఆ జంటని వ్లాగర్ సిద్ధేష్ ప్రేమంటే ఏంటనీ అడగగా..వారు "ఒకరికొకరు" అని గొప్పగా సమాధానం ఇచ్చారు. యవతకు మీరిచ్చే సందేశం ఏంటని అడిగితే.." "కష్టపడితే దేన్నైనా పొందగలం". అలాగే నీ కోసం బతకడం కాదు ఇతరుల మేలు కోరితేనే జీవితానికి అసలైన అర్థం అని చెప్పారు". చివరిగా వ్లాగర్ మీకు ఏదైనా కావాలా అని అడగగా..ఒక స్టాల్ ఉంటే బాగుండునని, ఇంతలా నిలబడాల్సిన శ్రమ ఉండదని నవ్వుతూ చెబుతారు ఆ దంపతులు. ఈ వీడియో నెటిజన్లను కదలించింది. ప్రేమకు అసలైన నిర్వచనం ఆ దంపతులు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: ఏజ్‌లో సెంచరీ కొట్టిన మరో బామ్మ..హెల్త్ సీక్రెట్ ఏంటంటే..) -
మృత్యువు కబళించింది
తుగ్గలి/పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వలుకూరు రాజు(35), సుమలత (30) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఊర్లో ఈనెల 22న జరిగే దేవర ఉత్సవాలు ఉన్నందున నేత చీరల తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై అనంతపు రం జిల్లా యాడికి వెళ్లారు. అక్కడ పట్టుచీరలు కొనుగోలు చేసిన అనంతరం తిరిగి మోటారు సైకిల్‌పై వ స్తుండగా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలో 67వ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద గుత్తి వైపు నుంచి యాడికికి శరవేగంగా వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో దంపతులిద్దరూ మృతిచెందారు. బొలెరో వాహనంలో ఉన్న యాడికి గ్రామానికి చెందిన యువకుడు సాయి మణికంఠకూ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న యాడికి ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మృతితో చెన్నంపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. -
విశాఖ జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య
-
కలిసే దూరంగా ఉందాం!
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు. కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్‌లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం.. ఏమిటీ ఎల్ఏటీ? లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు. ఎవరికి బాగా నప్పుతుంది?వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్‌ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా సాధ్యం?కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు. చివరగా చెప్పేదేమంటే? విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్‌లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్‌లో దశాబ్దాలుగా ఎల్ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. -
అయ్యో పాపం అని పని ఇస్తే
-
రాజ్యాంగమే సాక్షి.. ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ వివాహం చేసుకున్న జంట
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో ఓ జంట ఆదర్శ వివాహం చేసుకుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు,ఆచారాలు పక్కనపెట్టి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారు. ఏడడుగులు నడవడం, తాళి కట్టడం, సింధూరం పెట్టడం లాంటి అన్ని ఆచారాలను దూరంగా పెట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయడమే కాకుండా దండలు మార్చుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇంతటితో ఆగకుండా పెళ్లికి అనవసర ఖర్చు కూడా చేయకుండా సింపుల్‌గా కానిచ్చేశారు. పెళ్లికయ్యే ఖర్చులతో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చనే ఆలోచనతోనే ఇలాచేసినట్లు పెళ్లికొడుకు ఇమాన్ లాహ్రె చెప్పారు. తమకు ఆచారాలు,సంప్రదాయాల మీద కన్నా రాజ్యాంగం మీదనే తమకు నమ్మకం ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్ జిల్లాలోని కాపు గ్రామంలో డిసెంబర్ 18న ఈ పెళ్లి జరిగింది. ఈ జంట చేసుకున్న ఆదర్శ వివాహంపై వారి బంధువులు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. -
సినిమాని తలపించే ప్రేమకథ..వింటే కన్నీళ్లు ఆగవు..!
ఎన్నో ప్రేమ కథలు చూశాం. వాటిలో కొన్ని మాత్రం విషాదంగా ముగిసిపోతే..మరికొన్ని కన్నీళ్లు తెప్పించేస్తాయి. అలాంటి భావోద్వేగపు గాథే ఈ ప్రేమ జంట కథ. సుఖాల్లో ఉన్నప్పుడు ఉండే ప్రేమ.. కష్టాల్లో కనుమరుగైపోతుందంటారు పెద్దలు. కానీ ఈ జంట మాత్రం కష్టాల్లో అంతకు మించి..ప్రేమ ఉందని ప్రూవ్ చేసింది. విధికే కన్నుకుట్టి వారి ప్రేమను పరీక్షించాలనుకుందో, కబళించాలనుకుందో గానీ కేన్సర్ మహమ్మారి వారి ప్రేమను దూరం చేయాలనుకుంది. కానీ ఈ నేపాలీ జంట తమ ప్రేమ అత్యంత గొప్పదని నిరూపించుకుని కష్టమే కుంగిపోయేలా చేశారు.సృజన, బిబేక్ సుబేదిలు తమ జీవితాన్ని డాక్యుమెంట్ రూపంలో ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆ జంట ప్రేమకథ అందరి దృష్టిని ఆకర్షించింది. బిబేక్ కేన్సర్‌తో భాదపడుతున్నాడు. కేన్సర్ ఫస్ట్ స్టేజ్ నుంచి ఫోర్త్స్టేజ్ వరకు తామెలా కష్టాలు పడుతుంది తెలియజేసింది. చెప్పాలంటే నెటిజన్లంతా సృజన కోసమైనా.. అతడు మృత్యవుని జయిస్తే బావుండనని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. బిబేక్ ఆ మహమ్మారి కారణంగా తనకెంతో ఇష్టమైన భార్యను కూడా గుర్తించలేని స్థాయికి వచ్చేశాడు సృజన పోస్ట్ చేసిన చివరి రీల్లో. అంతేగాదు ఇన్‌స్టాలో బిబెక్ 32వ పుట్టిన రోజుని సెలబ్రెట్ చేసిన విధానం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే అప్పటికే అతడి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. ఏ పరిస్థితిలోనూ అతడి చేతిని వీడక ఎంతో ప్రేమగా చూసుకున్న సృజన తీరు అందరి మనసులను తాకింది. సృజన అధికారికంగా అతడు చనిపోయాడని ప్రకటించనప్పటికీ..నిశబ్ద వాతావరణంతో పరోక్షంగా బిబేక్ ఇక లేరనే విషయం వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి సృజన నుంచి ఎలాంటి వీడియో పోస్ట్ కాకపోయినా.. నెటిజన్లంతా సృజనకు ధైర్యం చెప్పడమేగాక, బిబేక్ లేకపోయినా.. మీప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇలాంటి కాలంలో ఇంత గొప్ప ప్రేమలు కూడా ఉన్నాయని చూపించారంటూ సృజనను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Crzana Subedi (@crzana_subedi_) (చదవండి: చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..) -
వివాహబంధంతో ఒక్కటైన 37 జంటలు
సోలాపూర్: సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ శాసనసభ్యుడు సుభాష్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో లోకమంగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజాపూర్ రోడ్డు వైపునున్న డీఈడీ కళాశాల మైదానంలో పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 37 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ముస్తాబైన వధూవరులను గుర్రపు బగ్గీల్లో, బ్యాండ్ బాజాలతో ఊరేగించారు. ఈ వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే సుభాష్ దేశముఖ్, మాజీ ఎంపీ జయసిద్ధేశ్వర మహాస్వామి, లోకమంగల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రోహన్ దేశముఖ్, మనీష్ దేశముఖ్, పంచాక్షరి శివాచార్య మహాస్వామిజీ, శ్రీకాంత్ శివచార్య మహాస్వామి, సిద్ధ లింగ మహాస్వామి లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇకపై ప్రతిగ్రామంలో నిర్వహిస్తాం: ఎమ్మెల్యే సుభాష్ దేశ్‌ముఖ్ భవిష్యత్తులో లోకమంగల్ ఫౌండేషన్ దక్షిణ సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని ప్రతి గ్రామంలో సామూహిక వివాహాలను నిర్వహించాలని సంకల్పించినట్లు సుభాష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. వివాహం చేసుకోదలచిన జంటలు ముందస్తుగా తమ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామపంచాయితీ మెంబర్ల ద్వారా లోక్‌మంగల్ ఫౌండేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఒక్కో గ్రామం నుంచి కనీసం ఐదు జంటలు లేదా అంతకుమంచి ఎందరు ముందుకు వచ్చినా వారిని వివాహబంధంతో ఒక్కటి చేస్తామని, వివాహ వేడుకల నాడు గ్రామప్రజలందరికీ విందును కూడా ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. -
పెళ్లి తర్వాత రిసెప్షన్లో మెరిసిన చైతూ - శోభిత.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మోడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా కనిపించారు చైతూ- శోభిత. ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్లో జంటగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. #SobhitaDhulipala and #NagaChaitanya, who recently tied the knot, attend #AaliyahKashyap and #ShaneGregoire’s reception as newlyweds. ✨#FilmfareLens pic.twitter.com/P5Dw8fmqA4— Filmfare (@filmfare) December 11, 2024 -
ఈ సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! వెడ్డింగ్ కార్డు వేరేలెవెల్..!
శాస్త్రవేత్తలంటేనే అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తారు. అయితే వారి పరిశోధన వృత్తి వరకే పరిమితం కాకుండా అంతకు మించి ఉంటే.. ఈ సైంటిస్ట్ జంటలానే ఉంటుందేమో..!. ఇద్దరూ అగ్రికల్చర్ పరిశోధకులే..ఆ ఇష్టాన్నే తమ వివాహా ఆహ్వాన పత్రికలో కూడా చూపించి ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి కార్డో, లేక రీసెర్చ్ పేపరో అర్థంకాకుండా భలే గందరగోళానికి గురి చేశారు. ఆలపాటి నిమిషా, ప్రేమ్ కుమార్ అనే వ్యవసాయ శాస్త్రవేత్తలిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే వారిద్దరి అభిరుచి పరిశోధనే. ఐతే నిమిషా ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)లో రీసెర్చ్ స్కాలర్ కాగా, ప్రేమ్ కుమార్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో అసిస్టెంట్ మేనేజర్. ఈ నేపథ్యంలోన వారిద్దరూ తమ రీసెర్చ్‌పై ఉన్న ప్రేమతో పరిశోధనా పత్రం స్టైల్లో వివాహ కార్డుని డిజైన్ చేశారు. చూసేవాళ్లకు ఇది ఆహ్వాన పత్రిక.. రీసెర్చ్పేపరో అర్థం కాదు. క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుంది. అందులో వివరాలు కూడా రీసెర్చ్ పేపర్ తరహాలో ఉన్నాయి. అయితే వారి వివాహ బంధాన్ని కూడా కెమిస్ట్రీలోని స్థిర సమయోజనీయ బంధంతో వివరించడం అదుర్స్. అవసరానికి ఉపయోగ పడని ఆస్తి, ఆపదల నుంచి గట్టేకించుకోలేని విజ్ఞానం రెండూ వ్యర్థమే అంటారు పెద్దలు. కానీ వీళ్లిద్దరూ తమ వ్యవసాయ పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలవడమే గాక తమకు వ్యవసాయ పరిశోధనా రంగం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సైంటిస్ట్‌ల రూటే సెపరేటు అన్నట్లుగా ఆహ్వానపత్రిక వేరేలెవెల్లో ఉంది. మరో విశేషమేమిటంటే ఆ శాస్తవేత్తల జంట తమ వివాహ తేదిని కూడా ప్రపంచ మృత్తికా దినోత్సవం రోజునే ఎంచుకోవడమే. (చదవండి: డిప్రెషన్‌తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!) -
మా చావులకు ఎవరూ కారణం కాదు..
ఉప్పల్: భార్యకు కేన్సర్ అని తేలడంతో భర్త తల్లడిల్లిపోయాడు. అనారోగ్యంతో భార్య రోజురోజుకూ కుంగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మానసిక వ్యధకు గురైన దంపతులు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకానగర్ డివిజన్ ధర్మపురి కాలనీకి చెందిన దుర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి (60), జగదీశ్వరి (56) భార్యాభర్తలు. సూర్యనారాయణ ఎన్టీపీసీలో జీఎంగా పని చేసి మూడేళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరి కుమారుడు సుశాంత్ గచ్చిబౌలిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల జగదీశ్వరి కేన్సర్ వ్యాధికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా కలత చెందారు. ఈ క్రమంలో ఈ నెల 3న సూర్యనారాయణ శాస్త్రి తన కుమారుడికి ఫోన్ చేసి తాను ఓ సెమినార్ కోసం బయటకు వెళ్తున్నానని, అమ్మను కూడా తీసుకెళ్తున్నాను.. నాలుగు రోజుల వరకు రాను అని చెప్పారు. ఆ తర్వాత వారం రోజులుగా ఎలాంటి ఫోన్ రాకపోవడంతో బుధవారం కుమారుడు తండ్రికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. సెమినార్కూ వెళ్లలేదని తెలిసింది. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం ఉప్పల్‌లోని ఇంటికి వచ్చి చూడగా గేట్‌కు తాళం వేసి ఉంది. పని మనిషికి ఫోన్ చేసి పిలిపించి తాళం తీసి వెళ్లగా ఇంటి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా దుర్వాసన రావడంతో వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే కుళ్లిన స్థితిలో మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాల పక్కన, ఇంకా రెండు చోట్ల మూడు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ‘అనారోగ్య కారణాల చేత సూసైడ్ చేసుకుంటున్నాం. మా చావులకు ఎవరూ కారణం కాదు’ అంటూ రెండు లైన్లు తెలుగులో నోట్ రాసి ఉంది. దీంతో కుమారుడు సుశాంత్ ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాదీనం చేసుకున్నారు. సుశాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వారం రోజుల క్రితమే సూర్యనారాయణ శాస్త్రి, జగదీశ్వరి దంపతులు గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి -
భార్యాభర్తల డ్రగ్స్ దందా!
సాక్షి, సిటీబ్యూరో: ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి మాదకద్రవ్యం ఏంఫెటమైన్తో నగరానికి వచ్చి, విక్రయానికి ప్రయత్నించినా భార్యా భర్తల్ని వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షలు విలువైన 254 గ్రాముల డ్రగ్, ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర శనివారం వెల్లడించారు. అసోంలోని లాల్పానీ గ్రామానికి చెందిన ఆతిఫ్ అస్లం ఖాన్ గతంలో నగరానికి వలసవచ్చి నిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. దాదాపు ఐదారేళ్లు ఇక్కడ ఉండటంతో ఇతడిలా వచి్చ, సిటీలో నివసిస్తున్న పలువురు అసోం వారితో పరిచయం ఏర్పడింది. అసోంలోని మొరాంగా గ్రామానికి చెందిన సుభానీ బేగంను వివాహం చేసుకున్న అస్లం ఖాన్ స్వస్థలానికి వలసవెళ్లాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మార్గాలు అన్వేషించాడు. అసోంలో తయారయ్యే మాదకద్రవ్యం ఏంఫెటమైన్ను ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది వినియోగిస్తూ ఉంటారు. దీంతో ఆ డ్రగ్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్‌పెడ్లర్ ప్రణోయ్ దాస్‌కు రూ.2 లక్షలు చెల్లించిన అస్లం ఖాన్ 300 గ్రాముల ఏంఫెటమైన్ ఖరీదు చేశాడు. భార్య సుభానీ బేగంతో కలిసి మాదకద్రవ్యం తీసుకుని అస్లం ఖాన్ గత నెల్లో రైలు మార్గంలో నగరానికి చేరుకున్నాడు. బేగంపేటలోని ప్రకాష్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఓ బైక్ ఖరీదు చేశాడు. దీనిపై సంచరిస్తూ నగరంలో ఉన్న అసోం వాసులకు ఏంఫెటమైన్ విక్రయించడం మొదలెట్టాడు. డిమాండ్‌ను బట్టి రేటు నిర్ధారిస్తూ తమ వద్ద ఉన్న 300 గ్రాములు అమ్మడం ద్వారా రూ.25 లక్షలు సంపాదించాలని, ఆ మొత్తంతో స్వస్థలానికి తిరిగి వెళ్లిపోవాలని పథకం వేశారు. ఇప్పటి వరకు 11 మంది అసోం వాసులకు 46 గ్రాములు విక్రయించారు. వీరి దందాపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ ఇ.జంగయ్య నేతృత్వంలో ఎస్సై జి.నవీన్ తమ బృందంతో వలపన్నారు. శనివారం ఇద్దరితో పాటు 11 మంది వినియోగదారులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. -
తీవ్ర కాలుష్యం నడుమ..ఓ జంట అద్భుతాన్ని ఆవిష్కరించింది!
ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేరుకుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. కాలుష్య స్థాయి పెరుగుతోందని, పొగమంచు సమస్య అంతకంతకు తీవ్రతరం అవుతోందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది కూడా. అంతలా తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశా రాజధాని నడిబొడ్డున పాశ్చాత్య దేశాల కంటే నాణ్యమైన గాలితో కూడిన పరిశుభ్రమైన ఇల్లు ఒకటి ఉంది. అదెలా సాధ్యం అనుకోకండి. ఎందుకంటే ఈ జంట సాధ్యం చేసి చూపించి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఆ జంట ఏం చేశారంటే..మన దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు కారణంగా మరింత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్లో కాలుష్యం, పొగమంచు కారణంగా ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజ్‌లు కూడా మూతపడుతున్నాయి. అంతలా ఘోరంగా ఉందక్కడ పరిస్థితి. పీల్చుకునే గాలిలోనే నాణ్యతలేకపోవడంతో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల పాలవ్వుతున్నారు. ఇలాంటి ఘోరమైన స్థితిలో ఓ జంట ఇల్లు వంద శాతం గాలి నాణ్యతో అందంగా ఉంది. అది ఇల్లు పర్యావరణానికి స్వర్గధామమా..! అన్నట్లుగా పచ్చదనంతో అలుముకుని ఉంది. ఢిల్లీకి చెందిన పీటర్ సింగ్, నీనో కౌర్ దంపుతులది ఆ ఇల్లు. ఢిల్లీలోనే ఇలాంటి ఇల్లు కూడా ఉందా అని విస్తుపోయాలా అత్యంత పరిశుభ్రంగా ఉంది. మండు వేసవిలో సైతం ఆ ఇంటిలో కేవలం 25 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుందట. ఈ విధమైన పర్యావరణానుకుల జీవనశైలిని నీనా కేన్సర్‌తో బాధపడుతున్నప్పటి నుంచి ప్రారంభించారట.ప్రస్తుతం నీనోకి 75 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకునేందుకు సాగిన ప్రయాణం ఇలా పర్యావరణానికి పెద్దపీటవేసేలా దారితీసిందని చెబుతున్నారు పీటర్ సింగ్, నీనో దంపతులు. ఇంట్లోనే చేపల పెంపంక, కూరగాయల మొక్కల పెంపకం. ఈ రెండింటినీ ఏకీకృతం చేసేలా వ్యవసాయం చేస్తోంది ఆ జంట. వారికి నాలుగు పెద్దపెద్ద చేపల ట్యాంకులు ఉన్నాయి. ఆ చెరువుల్లోని చేపలు అమ్మోనియా అధికంగా ఉంటే నీటిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఫిల్టర్ చేసి మొక్కలకు సరఫరా చేస్తారు. మళ్లీ మొక్కలు నీటిలోని పోషకాలను గ్రహించగా మిగిలిని నీటిని శుద్ధిచేసి తిరిగి చేపల ట్యాంకులోకి పంపిస్తారు. అంతేగాదు వర్మికంపోస్ట్, కోకో పీట్ ఉపయోగించి దాదాపు పదివేల నుంచి 15 వేల దాక వివిధ రకాల మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. తాము దుకాణానికి వెళ్లాల్సిన పనిలేదంటున్నారు. ఇంట్లోకి అవసరమయ్యే అన్ని రకాల కూరగాయాలను తామే పండిస్తామని సగర్వంగా చెప్పారు. అలాగే తమ వంటగది వ్యర్థాలను సేంద్రీయ కంపోస్ట్‌గా రీసైకిల్ చేసేలా ఏర్పాట్ల తోపాటు రెయిన్ వాటర్‌ని శుద్ది చేసి ఉపయోగించుకునేలా ప్రత్యేకంగా రూపొందించారట. ఇలా పర్యావరణ హితంగా జీవించడానికి కార్యకర్తనో, సెలబ్రిటీనో కానవసరం లేదని చాటిచెప్పారు. బురదలో తామర పువ్వు వికసించినట్లుగా.. అత్యంత కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీలో ఈ పచ్చదనంతో కూడిన ఇల్లు ఓ కొత్త ఆశను రేకెత్తించింది!. నిజానికి అందరూ ఇలా పర్యావరణానుకూలంగా జీవించడం ప్రారంభిస్తే కాలుష్యం క్లీన్ అయిపోతుంది ఆరోగ్యం సొంతమవుతుంది కదూ..!.(చదవండి: కేరళ సంప్రదాయ ‘కసావు చీర’తో ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం..!) -
విషాదం.. 5 నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని బలవన్మరణానికి దంపతులు పాల్పడ్డారు. దుర్వాసన రావటంతో స్థానికులతో తలుపులు బద్ధలు కొట్టించిన పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు.. కృష్ణ కిషోర్ (45) శిరీష (35), చిన్నారి (5నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు. -
కన్నా.. నువ్వున్న చోటుకే వచ్చేస్తున్నాం!
సేలం: అనారోగ్యంతో ఏడేళ్ల కుమారుడి మృతి చెందడాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఉన్న దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోవైలో కలకలం రేపింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని పూలావూరని గ్రామానికి చెందిన పళని స్వామి (39). ఈయన ఇంటిలో విద్యార్థులకు ట్యూషన్ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన భార్య వత్సలా (35). ఈమె అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నారు. వీరికి ఏడేళ్ల వయస్సులో కుమారుడు ఉండేవాడు. అయితే గత ఏప్రిల్ నెల మెదడు జ్వరం కారణంగా మృతి చెందాడు. కుమారుడు చనిపోయినప్పటి నుంచి పళనిస్వామి, వత్సలాలు అమిత వేదనతో ఉంటూ వచ్చారు. వారిని బంధువులు సముదాయిస్తూ వచ్చారు. అయినప్పటికీ తీవ్ర ఆవేదనతో ఉన్న దంపతులను కోవైలో ఉన్న బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. కొన్ని రోజులు బంధువుల ఇంటిలో ఉన్న వారు ఇటీవల వేట్టపట్టి వీకేవీ శ్రీనగర్ ప్రాంతంలో అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తూ వచ్చారు. అయినా కొడుకు పోయాడనే ఆవేదనతో కనిపిస్తూ వచ్చారు.ఆత్మహత్య..ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి గాంధీపురం కోట్టూర్ ప్రాంతంలో ఒక లాడ్జ్‌లో ఇద్దరు బస చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వరకూ ఇద్దరు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో సందేహించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాట్టూర్ పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా గదిలో దంపతులు ఇద్దరు నోటిలో నురగలు కక్కున్న స్థితిలో మృతదేహాలుగా పడి కనిపించారు. దీంతో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు ఆ గదిని తనిఖీ చేయగా, అక్కడ రెండు కూల్ డ్రింక్స్ బాటిళ్లు ఉన్నాయి. ఒక లేఖ చిక్కింది. ఆ లేఖలో.. తమ మృతికి ఎవరూ కారణం కాదని, తమ కుమారుడి వద్దకే వెళుతున్నామని రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఒకే రోజు ఐఏఎఫ్, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్‌కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో లెఫ్టెనెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇటీవల కాలంలో సుదీర్ఘకాలం జీవించాలనే ధోరణి ఎక్కువయ్యింది. కొందరూ సాధారణ వయసు కంటే తక్కువ వయసు వారిలా యవ్వనంగా ఉండాలని చూస్తున్నారు. కొందరూ యవ్వనంగా ఉండటం తోపాటు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం కఠినమైన జీవనశైలిని పాటిస్తున్నారు. వారి జీవసంబంధ వయసు ఎవ్వరూ ఊహించనంత తక్కువగా ఉండేలా ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే బాటలో పయనిస్తోంది యూఎస్‌కి చెందిన ఓ జంట. ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏకంగా 150 ఏళ్లు పాటు జీవించాలనే సంకల్పంతో ఏం చేస్తున్నారో వింటే నోరెళ్లబెడతారు. అమెరికాలోని మిడ్వెస్ట్కు చెందిన 33 ఏళ్ల కైలా బర్న్స్ లెంట్జ్, ఆమె భర్త వారెన్ లెంట్జ్(36) వందేళ్లకు మించి జీవించి చూపాలనుకుంటున్నారు. అందుకోసమని ఈ ఇరువురు బయోహాకింగ్ రొటీన్‌ను స్వీకరించారు. ఇక్కడ బయోహాకింగ్ అంటే..సైబర్నెటిక్ పరికరాలు లేదా బయోకెమికల్స్‌ను వంటి సాంకేతిక మార్గాల ద్వారా శరీరం విధులను మెరుగుపరచడం లేదా మార్చడాన్ని బయోహాకింగ్ అని అంటారు. ఇక్కడ ఈ బయోహ్యికింగ్ను అనుసరిస్తున్న జంటలో కైలా క్లీవ్‌ల్యాండ్‌లోని దీర్ఘాయువు క్లినిక్ ఎల్వైవీ ది వెల్నెస్ స్పేస్ సహ యజమాని కాగా, ఆమె భర్త వారెన్ మార్కెటింగ్ ఏజెన్సీలో చీఫ్ రెవెన్యూ ఆఫీసర్. వీరిద్దరు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునేలా మంచి జీవనశైలిని అనుసరిస్తున్నారు.ఎలాంటి జీవన విధానం అంటే.. వారి రోజు దినచర్య ఆప్టిమైజింగ్ పద్ధుతులతో నిండి ఉంటుంది. ఆ జంట ప్రతి ఉదయం పల్సెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వర్కౌట్లు, ఉదయపు సూర్యకాంతిని ఆస్వాదిస్తూ సాగే వాకింగ్ తదితరాలు ఉంటారు. ఆ తర్వాత క్లినిక్ గ్రేడ్ పరికరాలతో ఆరోగ్య మెరుగదలను పరీక్షించడం తదరితరాలన్నింటిని ఓ పద్ధతిలో అనుసరిస్తారు. చెప్పాలంటే అత్యంత మెరుగైన ఆర్యోగ్యకరమైన జీవిన విధానాన్ని అవలంభిస్తోంది ఈ జంట. దీంతోపాటు సెల్ రిపేర్‌కు సంబంధించి..రోజంతా హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్, నానోవి వంటి ఆరోగ్య సాంకేతికతను ఉపయోగిసస్తారు. అలాగే సాయంత్రం పూర్తి విశ్రాంతికి కేటాయిస్తారు. సేంద్రీయ భోజనమే తీసుకుంటారు. సూర్యాస్తమయ సమయానికల్లా ఆవిరి సెషన్లో పాల్గొంటారు. అలాగే అందుకు తగ్గట్లు ఇంటి వాతావరణాన్నికూడా సెట్ చేస్తారు. ఇంట్లో రెడ్‌లైట్లు వంటి సహజ సిర్కాడియన్ రిథమ్లతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తారు. రాత్రి తొమ్మిందింటి కల్లా నిద్రపోవడం వంటి మంచి నియమాలను పాటిస్తున్నారు. అంతేగాదు పిల్లలను కనాలనే ఆశతో కొన్నేళ్లుగా శరీరాన్ని ఆప్టిమైజ్(సాంకేతికతో పరిశీలించడం) చేస్తున్నట్లు తెలిపారు. పేరెంటింగ్ అనుభూతిని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇరువురి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. అంతేగాదు వారి జీవనశైలికి అనుగుణంగా పిల్లలను పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. ఈ జంట స్క్రీన్ సమయాన్ని తగ్గించి ఆరుబయట గడపడం, ప్రకృతితో సేద తీరడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధ్యమేనా..?వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా లేదా రివర్స్ చేసేలా మంచి ఆరోగ్యకరమైన బయోహ్యాకింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇంతకముందు ఇలాంటి వాటికి సంబంధించి..వెంచర్ క్యాపిటలిస్ట్ బ్రయాన్ జాన్సన్ వార్తల్లో నిలవగా ఇప్పుడూ ఈ జంట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రకృతి ధర్మంగా వచ్చే మార్పులను అంగీకరించాలే గానీ అందుకు విరుద్ధంగా బతికే ప్రయత్నం చేస్తే కొన్ని రకాల పరిణామాలను ఎదుర్కొనక తప్పదనేది కఠిన సత్యం. మరీ వీరంతా ఆ కఠిన సత్యాన్ని తిరగరాసేలా అనుకున్నది సాధించి చూపగలుగుతారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.(చదవండి: ఎత్తుకు తగ్గా బరువు ఉంటున్నారా..? -
పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులెందుకు?
శాయంపేట: ఆస్తులు సంపాదించి ముగ్గురు కుమారులకు ఇచ్చాం. ఇళ్లు కట్టి ఇచ్చాం. వృద్ధాప్యంలో పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులు ఎందుకు? మా ఆస్తులు మాకు ఇప్పించండి.. అంటూ ఓ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం శాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో విలేకర్ల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన చెక్క చంద్రయ్య సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంద్రయ్య హమాలీ పనిచేసి గ్రామంలో 10 ఎకరాల భూమి, పరకాల పట్టణంలో మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ముగ్గురు కుమారులకు 2002లో మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చాడు. పరకాలలో మూడు గుంటల్లో కట్టిన ఇంటిని 2012లో సమానంగా పంచాడు. వృద్ధ దంపతులిద్దరు గ్రామంలో ఓ షెడ్డు వేసుకొని అందులో ఉంటున్నారు. వృద్ధాప్యం మీద పడడంతో తమ ఆరోగ్యాలు సరిగ్గా లేవని, ఏ కుమారుడు కూడా పట్టించుకోవడం లేదని చెక్క చంద్రయ్య, సారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారులు పట్టించుకోకపోవడంతో జూలై 7న పోలీస్‌స్టేషన్‌లో, 8న పరకాల ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చంద్రయ్య తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
దంపతుల్ని చిదిమేసిన ఐషర్
అనంతపురం: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైన ఘటన నగర శివారు నేషనల్ పార్కు సమీపంలో జరిగింది. వివరాలు.. గుత్తి మండలం అబ్బేదొడ్డికి చెందిన కమతం హనుమంత రెడ్డి (72), కమతం రంగమ్మ (68) దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, కాంతమ్మ, కృష్ణకుమారి, ఒక కుమారుడు నాగేశ్వర రెడ్డి సంతానం. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. నాగేశ్వర రెడ్డి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అనంతపురంలోని చిన్మయనగర్‌లో నివాసముండే కుమార్తెలను చూసేందుకు ప్రతి వారం హనుమంత రెడ్డి, రంగమ్మ వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలోనే సోమవారం వచ్చి తిరిగి స్వగ్రామం బయలుదేరారు. నేషనల్ పార్కు వద్ద వెళ్తున్న సమయంలో ఓ ఐషర్ వాహనం అదుపుతప్పి బైకుపై పడిపోయింది. తీవ్ర గాయాలైన దంపతులిద్దరూ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాద ధాటికి హనుమంతు రెడ్డి తల తెగిపోయింది. కక్కలపల్లి మండీలో టమాట బాక్సులు లోడు చేసుకున్న ఐషర్ డ్రైవర్ ముంబైకు వెళ్తున్నట్లు తెలిసింది. నేషనల్ పార్కు సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద వేగం అదుపు కాకపోవడంతో బోల్తా కొట్టి పక్కనే హనుమంత రెడ్డి, రంగమ్మలు వెళ్తున్న బైకుపై పడినట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మృతుల కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. -
పులివెందులలో బీటెక్ రవి అనుచరుల దాష్టీకం
-
ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంట
చాలా మంది ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడానికి లేదా కొత్త పద్ధతులు, విధానాలకు ఆకర్షితులై ఇండియా వదిలి విదేశాల్లో నివాసముండిపోతున్నారు. అయితే ఇటీవల బెంగళూరుకు చెందిన 'ప్రతీక గుప్తా, నేహా మహేశ్వరి' దంపతులు జంట ట్యాక్స్ తగ్గుతుందని, ఎక్కువ పొదుపు చేయొచ్చని, ఇతరత్రా ప్రయోజనాల దృష్ట్యా యూరోపియన్ దేశమైన లక్సెంబర్గ్‌లో స్థిరపడ్డారు. అక్కడ స్థిరపడటం వల్ల లాభాలు ఏంటనే విషయాలను కూడా వారు వెల్లడించారు.ప్రతీక గుప్తా అమెజాన్ కంపెనీలో సీనియర్ అనలిస్ట్‌గా, నేహా శర్మ రియర్ ఎస్టేట్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్ ఉద్యోగాలు చేశారు. ఇండియాలో పనిచేయడం వల్ల ఇంక్రిమెంట్స్ వచ్చేవి. అయితే దుబాయ్ లేదా అమెరికాలలో ఉద్యోగాలు చేసే చాలా డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు.దుబాయ్, అమెరికాల కంటే యూరప్ దేశాలలో జీవన నైపుణ్యం బాగుందని వారు వెల్లడించారు. డబ్బు సంపాదించాలనుకునే వారు యూరప్ దేశాలకు రావడం తక్కువే. అయితే ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి ఇండియా కంటే కూడా యూరప్‌లో తక్కువ. ఇది మాత్రమే కాకుండా అక్కడ కొన్ని సర్వీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రతీక, నేహా చెప్పుకొచ్చారు. ఇక్కడ మన సంపాదనలో మూడు శాతం తప్పనిసరిగా ఆరోగ్యభీమాకు అందించాలి.ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్లక్సెంబర్గ్లో ప్రతీక్, నేహలకు ఇష్టమైన మరో అంశం నిరుద్యోగ నిధి. దీనికి వారిరువురు.. తమ ఆదాయంలో రెండు శాతం విరాళంగా ఇవ్వాలి. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఎవరైనా ఉద్యోగం కోల్పోతే.. రెండు సంవత్సరాలు లేదా ఉద్యోగం దొరికే వరకు చివరగా తీసుకున్న జీతంలో 80 శాతం ప్రభుత్వమే అందిస్తుందని వారు వివరించారు.లక్సెంబర్గ్‌లో నివసించడం వల్ల లభించే మరో ప్రయోజనం ఏమిటంటే.. ఇక్క లగ్జరీ కార్ల ధరలు కూడా చాలా తక్కువ. నేహా, ప్రతీక్ దంపతులకు అక్కడ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారు ఉంది. ఈ కారు ధర మన దేశంలో రూ. 50 లక్షల కంటే ఎక్కువ. కానీ లక్సెంబర్గ్‌లో దీని ధర కొంత తక్కువే. -
Wedding Outfits: లవ్‌బర్డ్స్ కోసం డ్రీమీ ఔట్ ఫిట్స్ (ఫోటోలు)
-
హైదరాబాద్: ఇద్దరు పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.మృతులను భార్యాభర్తలు వెంకటేష్, వర్షిణి, వారి పిల్లలు విహంత్, రిషికాంత్లుగా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు.