పార్టనర్‌కి బీపీ ఉంటే..వచ్చే అవకాశం ఉందా..? | Study Said Couples Often Share High Blood Pressure | Sakshi
Sakshi News home page

పార్టనర్‌కి బీపీ ఉంటే..వచ్చే అవకాశం ఉందా..?

Published Mon, Jul 15 2024 4:07 PM | Last Updated on Mon, Jul 15 2024 4:38 PM

Study Said Couples Often Share High Blood Pressure

బీపీ, ఘుగర్‌ వంటి వ్యాధులు ఒకరి నుంచి మరొకరకి సంక్రమించే వ్యాధులు కాకపోయినప్పటికీ భార్యభర్తలో ఎవరో ఒకరికి ఉంటే మరొకరికి ఆటోమెటిక్‌గా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. భాగస్వామికి గనుకు రక్తపోటు ఉంటే..సదరు వ్యక్తిని కూడా కచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. నిపుణులు జరిపిన తాజా అధ్యయనాల్లో ఇది నిర్థారణ అయ్యింది కూడా. చైనా, ఇంగ్లండ్‌, భారత్, అమెరికా వంటి దేశాల్లోని జంటలపై చేసిన పరిశోధనలో అధిక బిపీ ఉన్న పురుషులను చేసుకున్న స్త్రీలు కూడా రక్తపోటుకి గురవ్వుతున్నట్లు గమనించారు. 

భాగస్వామి నుంచి రక్తపోటు నేరుగా సంక్రమించకపోయినా పరోక్షంగా ఇది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది తీసుకునే ఆహారం, జీవనశైలి, ఒత్తిడి తదితర కారకాలచే ప్రభావితమవుతుందని వివరించారు నిపుణులు. భాగస్వామి ఎదుర్కొంటున్న రక్తపోటు, ఒత్తిడి అనేవి వారితో కలిసి జీవిస్తున్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. వారికేమవుతుందన్న ఆందోళన వారిని ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. దీన్ని 'సంరక్షకుల ఒత్తిడిగా' పేర్కొనవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎంత సేపు తమ భాగస్వామికి ఏమవుతుందనే అప్రమత్తత వారిలో తెలియని ఒత్తిడిని కలుగ చేసి, ఆందోళనకు గురి అయ్యేలా చేస్తుంది. దీంతో క్రమేణ వారు కూడా ఈ బీపీ బారినపడతారని వివరించారు. 

అందుకు దారితీసే కారణాలు..

జీవనశైలి..
జంటలు తరుచుగా జీవనశైలి అలవాట్లను పంచుకుంటారు. ఇవి రక్తపోటులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు అనారోగ్యకరమైన జీవనశైలి ఫాలో అయితే అది మరొకరిని ఆటోమేటిగ్గా ప్రభావితం చేస్తుంది. 

భావోద్వేగ కోణం..
తనకు ఇష్టమైన వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం భావోద్వేగ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆందోళన ఒత్తడికి దారితీసి రక్తపోటు వచ్చేందుకు కారణమవుతుంది. అంతేగాదు భాగస్వామి ఆరోగ్యం పట్ల ఆందోళన కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనవ్వుతారు. దీని వల్ల కలిగే అపార్థాలు లేదా సంఘర్షణలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌కి అంతరాయం ఏర్పడి భావోద్వేగానికి గురవ్వడం జరుగుతుంది. ఒకరకంగా మానసికంగా కుంగిబాటుకు గురయ్యి వారు కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు నిపుణులు.

ఏం చేయాలంటే..
ఆరోగ్యకరమైన రీతీలో రక్తపోటుని మెరుగ్గా నిర్వహించాలంటే జంటలు పాటించాల్సినవి ఇవే..

  • రోజూవారిగా తీసుకోవాల్సిన పరిమాణంలో ఉప్పు తీసుకోవడం, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం

  • శారీరక కార్యకలాపాల్లో కలిసి పనిచేయడం

  • ధూమపానం, మధ్యపానం మానుకోవడం

  • అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా  ఉండటం

  • యోగా, ధ్యానం కలిసి సాధన చేయడం

  • పుస్తకాలు చదవడం లేదా కలిసి సంగీతం వినడం

ఆరోగ్యకరమైన జీవనశైలితో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటే ఈ రక్తపోటు నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆరోగ్యంగా నిండు నూరేళ్ల జీవితాన్ని ఆస్వాధించగలుగుతారు భార్యభర్తలు.

(చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement