high blood pressure
-
రక్తపోటు.. గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి జబ్బులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. ఈ సమస్యలు కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత పెద్ద జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 4.58 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. వీరిలో 1.17 కోట్ల మంది రాష్ట్రాల ఆరోగ్య శాఖ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు, చికిత్సలు అందుకుంటున్నారు. రక్తపోటు.. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అమెరికాలోని 27,310 మంది పెద్దల ఆరోగ్య రికార్డులను 12 ఏళ్లకు పైగా పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల సగటు వయస్సు 65 ఏళ్లుగా ఉంది. – సాక్షి, అమరావతి10 కంటే ఎక్కువైతే 20% ప్రమాదం రక్తపోటు సగటు కంటే ఎక్కువయ్యే కొద్దీ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. రక్తపోటు సగటు కంటే 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా ఉన్న వారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. 31 నుంచి 67 శాతం ఎక్కువ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐదేళ్లు అధిక రక్తపోటు సమస్యతో బాధపడిన వ్యక్తులు స్ట్రోక్ బారిన పడేందుకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించారు. ఆరు నుంచి 20 ఏళ్ల పాటు రక్తపోటు సమస్య ఉన్న వ్యక్తుల్లో 50 శాతం, రెండు దశాబ్ధాలుపైగానే సమస్యతో బాధపడే వ్యక్తుల్లో 67 శాతం ఎక్కువగా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు రక్తపోటు సంబంధిత లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకుంటే జీవితకాల వైకల్యం ముప్పు తప్పుతుందన్నారు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే కొందరిలో రక్తపోటు చాప కింద నీరులా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తరచూ రక్త పోటు పరీక్షలు చేయించుకుంటూ, ఉండాల్సినదాని కంటే ఎక్కువ రికార్డు అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పు రావాలి ఆహారం, నిద్ర, జీవన శైలిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో ఓ భాగం చేసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. – డాక్టర్ బి.విజయ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
ప్లాస్టిక్ బాటిల్ నీళ్లతో హై బీపీ
సాక్షి, హైదరాబాద్: మన రోజువారీ అలవాట్లే మన ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. అందులో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. ప్రస్తుతం మనం కూరగాయలు, పండ్లు, ఇతర ఆహారపదార్థాలు సులువుగా తీసుకెళ్లేందుకు వాడు తున్న ప్లాస్టిక్ కవర్లు, బ్యాగ్‌లు కూడా అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అంతేకాదు నీళ్లు తాగేందుకు అత్యధిక శాతం మంది ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలు కూడా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. నిత్యం ప్లాస్టిక్ సీసాలతో తాగుతున్న మంచినీటి ద్వారా శరీరంలోకి చేరుతున్న సూక్ష్మ రూపాల్లోని ప్లాస్టిక్ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్) అధిక రక్తపోటు (హై బ్లడ్‌ప్రెషర్)కు కారణమవుతున్నట్టు ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ తాజా పరిశోధనలో వెల్లడైంది.గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వంటి వాటికి బీపీనే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ఫ్లమేషన్, హార్మోన్ల అసమతుల్యత, కేన్సర్ వంటి వాటికి కారణమవుతున్నాయని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ తొలుత రక్త ప్రవాహంలోకి తర్వాత సలైవా, గుండె కణజాలం, కాలేయం, ఊపిరితిత్తులు ఇంకా ప్లాసెంటా (మావి).. ఇలా అన్ని అవయవాల్లోకీ చేరుతున్నాయి. ముఖ్యంగా ‘బాటిల్డ్ వాటర్’లో హెచ్చు స్థాయిల్లో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టుగా అధ్యయనంలో తేలింది.అధ్యయనంలో భాగంగా మైక్రో ప్లాస్టిక్స్ –పెరుగుతున్న రక్తపోటు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని పరిశీలించారు. ‘జర్నల్ మైక్రోప్లాస్టిక్స్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా రక్తపోటు సమస్యను గణనీయంగా తగ్గించవచ్చునని పేర్కొంది. రక్తపోటు సమస్యలను తగ్గించుకునేందుకు ప్లాసిక్ సీసాలలో మంచినీళ్లు, ఇతర పానీయాలు (ప్యాకేజ్డ్ బాటిల్స్) తీసుకునే అలవాటును మానుకుంటే మంచిదని సూచించింది. నల్లాల ద్వారా వచ్చే నీటిని కాచి వడబోశాక తాగడంతో పోల్చితే ప్లాస్టిక్ సీసాలలోని నీటిని, అలాగే కొన్ని సందర్భాల్లో గాజు సీసాల్లోని నీటిని తాగాక రక్తపోటు పెరిగినట్టుగా పరిశోధకులుగుర్తించారు. సింథటిక్ వ్రస్తాలు ఉతకడం వల్ల కూడా..నిత్యం ఐదు మిల్లీమీటర్ల కంటే కాస్త తక్కువ పరిమాణంలో మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరుతుండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధన స్పష్టం చేసింది. గతంలోనే నిర్వహించిన ఓ అధ్యయనంలో...ప్రతి వారం బాటిళ్ల ద్వారా తీసుకునే వివిధ రూపాల్లోని ద్రవాల ద్వారా ఐదు గ్రాముల చొప్పున మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరుతున్నట్టు వెల్లడైంది. కారు టైర్ల అరుగుదల మొదలు పెద్దమొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాల ధ్వంసం, సింథటిక్ వ్రస్తాలు ఉతకడం తదితర రూపాల్లో కూడా ఇవి శరీరంలో చేరుతున్నట్టు తెలిపింది. మనం తీసుకునే ఆహారం, నీళ్లు, పీల్చే గాలి తదితరాల ద్వారా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ రేణువులు శరీరాల్లో చేరుతున్నట్టు పేర్కొంది.అయితే బాటిల్ నీళ్లను తాగకుండా ఉంటే ఈ సమస్యను కొంతవరకు నివారించ వచ్చని, నల్లా నీళ్లను వేడిచేసి చల్లబరిచి, ఫిల్టర్ చేసి తాగడం మంచిదని సూచించింది. దీనిద్వారా మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ శరీరంలో చేరడాన్ని 90 శాతం దాకా తగ్గించవచ్చునని అధ్యయనం పేర్కొంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు..రోజువారి జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్లాస్టిక్ బాటిళ్లలో పానీయాలను భద్రపరచడం నిలిపేయాలని సూచించింది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లకు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని, స్టెయిన్లెస్ స్టీల్ లేదా గ్లాస్ కంటైనర్లు వినియోగించాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించాలని స్పష్టం చేసింది. -
పార్టనర్‌కి బీపీ ఉంటే..వచ్చే అవకాశం ఉందా..?
బీపీ, ఘుగర్ వంటి వ్యాధులు ఒకరి నుంచి మరొకరకి సంక్రమించే వ్యాధులు కాకపోయినప్పటికీ భార్యభర్తలో ఎవరో ఒకరికి ఉంటే మరొకరికి ఆటోమెటిక్‌గా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. భాగస్వామికి గనుకు రక్తపోటు ఉంటే..సదరు వ్యక్తిని కూడా కచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. నిపుణులు జరిపిన తాజా అధ్యయనాల్లో ఇది నిర్థారణ అయ్యింది కూడా. చైనా, ఇంగ్లండ్, భారత్, అమెరికా వంటి దేశాల్లోని జంటలపై చేసిన పరిశోధనలో అధిక బిపీ ఉన్న పురుషులను చేసుకున్న స్త్రీలు కూడా రక్తపోటుకి గురవ్వుతున్నట్లు గమనించారు. భాగస్వామి నుంచి రక్తపోటు నేరుగా సంక్రమించకపోయినా పరోక్షంగా ఇది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది తీసుకునే ఆహారం, జీవనశైలి, ఒత్తిడి తదితర కారకాలచే ప్రభావితమవుతుందని వివరించారు నిపుణులు. భాగస్వామి ఎదుర్కొంటున్న రక్తపోటు, ఒత్తిడి అనేవి వారితో కలిసి జీవిస్తున్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. వారికేమవుతుందన్న ఆందోళన వారిని ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. దీన్ని 'సంరక్షకుల ఒత్తిడిగా' పేర్కొనవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎంత సేపు తమ భాగస్వామికి ఏమవుతుందనే అప్రమత్తత వారిలో తెలియని ఒత్తిడిని కలుగ చేసి, ఆందోళనకు గురి అయ్యేలా చేస్తుంది. దీంతో క్రమేణ వారు కూడా ఈ బీపీ బారినపడతారని వివరించారు. అందుకు దారితీసే కారణాలు..జీవనశైలి..జంటలు తరుచుగా జీవనశైలి అలవాట్లను పంచుకుంటారు. ఇవి రక్తపోటులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు అనారోగ్యకరమైన జీవనశైలి ఫాలో అయితే అది మరొకరిని ఆటోమేటిగ్గా ప్రభావితం చేస్తుంది. భావోద్వేగ కోణం..తనకు ఇష్టమైన వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం భావోద్వేగ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆందోళన ఒత్తడికి దారితీసి రక్తపోటు వచ్చేందుకు కారణమవుతుంది. అంతేగాదు భాగస్వామి ఆరోగ్యం పట్ల ఆందోళన కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనవ్వుతారు. దీని వల్ల కలిగే అపార్థాలు లేదా సంఘర్షణలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌కి అంతరాయం ఏర్పడి భావోద్వేగానికి గురవ్వడం జరుగుతుంది. ఒకరకంగా మానసికంగా కుంగిబాటుకు గురయ్యి వారు కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు నిపుణులు.ఏం చేయాలంటే..ఆరోగ్యకరమైన రీతీలో రక్తపోటుని మెరుగ్గా నిర్వహించాలంటే జంటలు పాటించాల్సినవి ఇవే..రోజూవారిగా తీసుకోవాల్సిన పరిమాణంలో ఉప్పు తీసుకోవడం, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడంశారీరక కార్యకలాపాల్లో కలిసి పనిచేయడంధూమపానం, మధ్యపానం మానుకోవడంఅనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా ఉండటంయోగా, ధ్యానం కలిసి సాధన చేయడంపుస్తకాలు చదవడం లేదా కలిసి సంగీతం వినడంఆరోగ్యకరమైన జీవనశైలితో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటే ఈ రక్తపోటు నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆరోగ్యంగా నిండు నూరేళ్ల జీవితాన్ని ఆస్వాధించగలుగుతారు భార్యభర్తలు.(చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!) -
ఉప్పు తగ్గించండిరా బాబోయ్! ఏటా 25 లక్షలమందికి ముప్పు
ప్రపంచవ్యాప్తంగా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటారు. హైబీపీ అనేది సెలంట్ కిల్లర్ లాంటిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఉప్పువల్లే ముప్పు ఏర్పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ ఉప్పు వాడకం కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే లక్షల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని కూడా పేర్కొంది.పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే ఇది రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దీని వల్ల హృదయ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, మెనియర్స్ వ్యాధి ,మూత్రపిండాల వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయని తెలిపింది. దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.డైనింగ్ టేబుల్ నుంచి ఉప్పు తీసేయండిప్రాసెస్ చేసిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనీ, తాజా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.నకు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని సూచించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అంతేకాదు డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది. కమర్షియల్ సాస్‌లు, ఫుడ్స్ తగ్గించాలని కూడా కోరింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు , బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది. -
మీ భాగస్వామికి బీపీ ఉందా? అయితే మీరూ జాగ్రత్త!
అధిక రక్తపోటు(హైబీపీ).. ప్రస్తుతం యువత సైతం ఈ సమస్యను ఎదుర్కొంటోంది. అంతేకాదు భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఈ సమ స్య ఉన్నా రెండో వ్యక్తికి వచ్చే అవకాశాలు మెండు గా ఉన్నాయని ప్రముఖ విశ్వవిద్యాలయాలు చేసిన అధ్యయనంలో తేలింది. మన దేశంలో 50 ఏళ్లు పైబడిన 20 శాతం దంపతుల్లో ఇద్దరు హైబీపీతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. హైబీపీ లేని వారిని పెళ్లి చేసుకున్న మహిళలతో పోలిస్తే.. సమస్య ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్న ట్లు తేలింది. ఇంగ్లాండ్, అమెరికా, చైనా దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ మేరకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. ఇవీ సర్వేలో గుర్తించిన కీలక అంశాలు ►మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యా లయాలు 2015–19 మధ్య ఒక అధ్యయనం చేపట్టాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్‌లో 1,086, యూఎస్ఏలో 3,989, చైనాలో 6,514, భారత్‌లో 22,389 జంటల ఆరోగ్యాన్ని పరిశోధ కులు విశ్లేషించారు. వీరంతా యూఎస్ఏ, ఇంగ్లాండ్ దేశాల్లో 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ, చైనా, భారత్‌లో 45 ఏళ్లు, ఆ పైబడిన వయసు వారే ఉన్నారు. ►ఇంగ్లాండ్‌లో 47.1శాతం, యూఎస్‌లో 37.9 శాతం, చైనాలో 20.8శాతం, భారత్‌లో 19.8 శాతం జంటలు (భార్యాభర్తలు) హైబీపీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ►చైనా, భారత్ దేశాల్లో దంపతుల్లో ఏ ఒక్కరికి సమస్య ఉన్నా రెండోవారు కూడా దాని బారినపడే పరిస్థితి బలంగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ►హైబీపీ లేని వ్యక్తులను పెళ్లి చేసుకున్న మహిళల తో పోలిస్తే.. సమస్య ఉన్నవారిని వివాహం చేసుకున్న మహిళలు హైబీపీ బారినపడటానికి అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో 9శాతం ఎక్కువ అవకా శం ఉందని నిర్ధారించారు. చైనాలో అయితే ఏకంగా 26శాతం ఉన్నట్టు వెల్లడించారు. ►పురుషుల విషయంలోనూ ఇలాగే జరుగుతుండటం గమనార్హమని పరిశోధకులు తెలిపారు. ►భార్యాభర్తల మధ్య భావోద్వేగ బంధాలు, ఇష్టా యిష్టాలు, ఒకరిపై మరొకరు ఆధారపడటం, జీవ నశైలి, ఇతర అంశాలు ఆరోగ్యం మీద పరస్పర ప్రభావాన్ని చూపుతున్నట్లు అంచనా వేశారు. -
మనం మారాల్సిందే!
గణాంకాలు వాస్తవ పరిస్థితికి సూచికలు. అనేక సందర్భాల్లో భవిష్యత్ దృశ్యాన్ని ముందుగా కళ్ళ ముందు నిలిపి, గాఢనిద్ర నుంచి మేల్కొలిపే అలారం మోతలు. భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందనీ, అధిక రక్తపోటు సహా జీవనశైలి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికమవుతోందనీ తాజా దేశవ్యాప్త సర్వే వెల్లడించిన అంశాలు అలాంటివే. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సర్వేలోని అనేక విషయాలు ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాలనూ అప్రమత్తం చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు లాంటి జీవనశైలి వ్యాధులపై తక్షణ కార్యాచరణ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మధుమేహం, అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ)పై అతి పెద్ద సర్వే ఇది. ఇందులో 2008 నుంచి 2020 మధ్యకాలంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్ళు, ఆ పైబడిన వయసువాళ్ళను దాదాపు 1.13 లక్షల మందిని సర్వే చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిధులతో భారత వైద్య పరిశోధన మండలితో కలసి మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆందోళన రేపుతున్నాయి. 2017లో భారతీయుల్లో 7.5 శాతం మందికే మధుమేహం ఉండేది. 2021 నాటికి ఆ సంఖ్య 11.4 శాతానికి, మరో మాటలో 10.1 కోట్ల మందికి పెరిగింది. అలాగే 15.3 శాతం మంది, అంటే 13.6 కోట్ల మంది మధుమేహం వచ్చే ముందస్తు లక్షణాలతో జీవితం సాగిస్తున్నారు. అంటే ‘టైప్–2 డయాబెటిస్’ అన్న మాట. ఇక, దేశంలో 28.6 శాతం (25.4 కోట్ల మంది) సాధారణ స్థూలకాయంతో, 39.5 శాతం (35.1 కోట్ల మంది) ఉదర ప్రాంత స్థూలకాయంతో ఉన్నట్టు తేలింది. చెడ్డ కొవ్వు (ఎల్డీఎల్ కొలెస్ట్రాల్)తో 18.5 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారు. నూటికి 35.5 మందిని అధిక రక్తపోటు వేధిస్తోంది. అసాంక్రమిక వ్యాధులు దేశంపై ఎంతటి భారం మోపుతున్నాయో కనుగొనేందుకు గాను దేశంలోని ప్రతి రాష్ట్రాన్నీ అధ్యయనంలో భాగం చేసిన తొలి విస్తృత స్థాయి అధ్యయనం ఇది. దేశంలో ఎక్కువగా మధుమేహం ఉన్న రాష్ట్రాలు – గోవా (26.4 శాతం), పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం). అలాగే, షుగర్ వ్యాధిపీడితులు తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్లలో సైతం వ్యాధిపీడితుల సంఖ్య సర్రున పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం హెచ్చరిక. ముందుగా అనుకున్నదాని కన్నా భారత జనాభాలో మధుమేహం అధికంగా ఉందని ఈ సర్వేతో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇది గడియారం ముల్లు ముందుకు కదులుతున్న టైమ్ బాంబ్’ అని ఈ అధ్యయన సారథి అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి 11 మంది వయోజనుల్లో ఒకరిని మధుమేహం పీడిస్తోందని లెక్క. షుగర్‌తో గుండె పోటు, అంధత్వం, కిడ్నీల వైఫల్యం ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక సరేసరి. ఈ నేపథ్యంలో కాయకష్టం, క్రమబద్ధమైన జీవనశైలి ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, ఆధునిక జీవనశైలి నిండిన పట్టణాల్లోనే మధుమేహం ఎక్కువగా ఉందనేది ఈ అధ్యయన ఫలితం. ఇది ఓ కీలక సూచిక. మనం మార్చుకోవాల్సింది ఏమిటో చెప్పకనే చెబుతున్న కరదీపిక. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వగైరా వంశపారంపర్యం, ఆహారపుటలవాట్లు, జీవనశైలి ద్వారా వస్తాయనేది నిపుణుల మాట. జన్యుపరంగా కుటుంబంలోనే ఉంటే ఏమో కానీ, ఇతరులు మాత్రం తినే తిండి, బతికే తీరులో జాగ్రత్తల ద్వారా ఈ అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ వచ్చినా... జీవనశైలి మార్పులతో యథాపూర్వ ఆరోగ్యాన్ని పొందవచ్చు. వైద్యులు పదేపదే చెబుతున్న సంగతే తాజా అధ్యయనం సైతం తేల్చింది. ఈ మాటను ఇకనైనా చెవికెక్కించుకోవాలి. మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడు అనివార్యంగా జీవన శైలి మారింది. అది మన ఆహారపుటలవాట్లలో మార్పు తెచ్చింది. చివరకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని మనమే బలిపెట్టుకొనే దశకు చేరుకున్నాం. అందుకే ఇకనైనా అనారోగ్యం తెచ్చే ఆహారపుటలవాట్లు, జీవనశైలి సహా అనేకం మనం మార్చుకోవాలి. మరోపక్క అందుకు తగ్గట్టు ప్రజల్లో చైతన్యం పెంచే బాధ్యత ప్రభుత్వాల పైనా ఉంది. అది ఈ అధ్యయనం చెబుతున్న పాఠం. అలాగే, దేశంలో ఆరోగ్య రక్షణ రంగంలో చేయాల్సిన ప్రణాళిక, చేపట్టాల్సిన చర్యలకు ఈ తాజా సర్వే ఫలితాలు మార్గదర్శకమే. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ ధోరణి ఒక స్థిరీకరణ దశకు చేరుకుంటే, అనేక ఇతర రాష్ట్రాల్లో అది పెరుగుతోంది. ఫలితంగా ఆయా రాష్ట్రాల తక్షణ చర్యలకీ అధ్యయనం ఉపకరిస్తుంది. మరోపక్క అన్నిచోట్లా, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు మరింత అందుబాటులో ఉండేలా చూడాలి. ఫాస్ట్‌ఫుడ్ మోజు, సోమరితనం వల్ల పిల్లల్లోనూ జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న వేళ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు ముఖ్యం. ఆరోగ్యకరమైన తిండి, శారీరక శ్రమ వల్ల టైప్–2 మధుమేహాన్ని నూటికి 60 కేసుల్లో తగ్గించవచ్చట. అందుకని ప్రభుత్వాలు పౌరసరఫరా వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేసి, ప్రజలను ఆరోగ్యదాయక ఆహారం వైపు మళ్ళించవచ్చు. ప్రజల్ని అటువైపు ప్రోత్సహించడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలూ చైతన్యశీల పాత్ర పోషించాలి. ఈ జీవనశైలి వ్యాధులు జాతిని నిర్వీర్యం చేసి, అభివృద్ధిని కబళించే ప్రమాదం పొంచివుంది గనక తక్షణమే తగిన విధానాల రూపకల్పన అవసరం. పరిస్థితులు చేయి దాటక ముందే నష్టనివారణ చర్యలకు నడుంకట్టడం వివేకవంతుల లక్షణం. -
30% మందికి బీపీ.. 9.9% మందికి షుగర్
సాక్షి, హైదరాబాద్: అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్/షుగర్) తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ..తద్వారా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇతర కారణాలతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 30 శాతం మంది హైబీపీతో బాధ పడుతుండగా, 9.9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. దేశంలో డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటిపై భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) అధ్యయనం చేసింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 ఏళ్లకు పైబడిన వారిపై సర్వే జరిపింది. జనాభా, ప్రాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. దేశవ్యాప్తంగా 1.13 లక్షల మందిని సర్వే చేశారు. 79,506 మంది గ్రామీణులు, 33,537 మంది పట్టణ ప్రాంత ప్రజల (మొత్తం 1.13 లక్షల మంది) ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 వరకు ఐదు దశల్లో రాష్ట్రాల వారీగా కొనసాగిన సర్వే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగింది. ఆ వివరాలను తాజాగా లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. పట్టణాల్లోనే ఎక్కువ.. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 30 శాతం మందికి పైగా హైబీపీతో బాధపడుతుండగా, గ్రామాల్లో 25–30 శాతం మంది బాధపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 10 శాతం కంటే ఎక్కువగా మధుమేహ బాధితులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 7.4 శాతంగా ఉంది. ఇక 15 శాతం మంది వరకు ప్రీ డయాబెటీస్ (వ్యాధికి ముందు దశ) స్థితిలో ఉన్నారు. పట్టణాల్లో ఇది 10–15 శాతంగా ఉంది. తెలంగాణ గ్రామాల్లో ప్రీ డయాబెటీస్ 15 శాతం వరకు ఉండగా, ఏపీలోని గ్రామాల్లో 10 శాతం వరకు ఉంది. పంజాబ్‌లో 51.8 శాతం మందికి హైబీపీ దేశవ్యాప్తంగా 11.4 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్లు సర్వే నిర్ధారించింది. డయాబెటిస్ ముందు దశలో 15.3 శాతం మంది ఉన్నారు. 35.5 శాతం బీపీతో బాధపడుతుండగా, 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ ఉన్నవారు 39.5 శాతం మంది ఉన్నారు. రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారు 81.2 శాతం ఉన్నారు. అత్యధికంగా గోవాలో 26.4 శాతం మందికి డయాబెటిస్ ఉంది. అతి తక్కువగా యూపీలో 4.8 శాతం మందికి ఉంది. బీపీ బాధితులు అత్యధికంగా పంజాబ్‌లో 51.8 శాతం మంది ఉన్నారు. అత్యంత తక్కువగా మేఘాలయలో 24.3 శాతం మంది ఉన్నారు. దేశంలో ఊబకాయులు 28.6 శాతంగా ఉన్నారు. పాండిచ్చేరిలో ఎక్కువ (53.3 శాతం) మంది, జార్ఖండ్‌లో తక్కువ (11.6 శాతం) మంది ఊబకాయ బాధితులు ఉన్నారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ ఉమ్మడి ఏపీలో ఊబకాయులు 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ గ్రామాల్లో 20 శాతం వరకు ఉన్నారు. గ్రామీణ ఏపీలో 20–25 శాతం మధ్య ఉన్నారు. ♦ పొట్ట దగ్గర అధిక కొవ్వు పేరుకుపోయిన వారు ఉమ్మడి ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ♦ రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉభయ రాష్ట్రాల్లోని 20–25 శాతం మందికి ఉంది. అర్బన్ తెలంగాణలో ఇది 20–25 శాతంగా, ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. గ్రామీణ తెలంగాణలో 20–25 శాతం మధ్య, గ్రామీణ ఏపీలో 15–20 శాతం మధ్య ఉంది. ♦ మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారు తెలంగాణలో 50–60 శాతం మంది ఉండగా, ఏపీలో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15–20 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 20–25 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికంగా ఉంది. చాలా జబ్బులు పట్టణాల్లో ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో షుగర్ తక్కువగా ఉంది. దీర్ఘకాలిక జబ్బులు అధికంగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ప్రీడయాబెటిస్ స్థితిలో ఉన్నవారిని డయాబెటిస్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అధిక షుగర్ బాధితుల్లో తదుపరి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
లక్షణాలు కనపడకుండానే గుండెజబ్బు రావచ్చా? కారణాలేంటి?
కార్డియోమయోపతీ అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో చాలామందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించకపో వచ్చు. అందుకే చాలామందిలో ఇది ఆలస్యంగా బయటపడటం, కొందరిలో ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకోవడం కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఇది వంశపారపర్యంగా కనిపించవచ్చు. గుర్తించడం, చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. లక్షణాలు: ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ముదురుతూ పో వడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించవు. అటు తర్వాత కూడా క్రమక్రమంగా లక్షణాలు బయటపడుతుంటాయి. కానీ ఇంకొందరిలో మాత్రం సమస్య నిర్ధారణకు ముందునుంచే లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. ♦ శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, తరచూ శ్వాస అందక విపరీతమైన ఆయాసం వస్తుండటం ♦ విపరీతమైన అలసట, ♦ పొట్ట – చీలమండ వాపు, కొంతమందిలో కాళ్లవాపు ♦ అరుదుగా ఒక్కోసారి స్పృహ తప్పవచ్చు. రకాలు : కార్డియోమయోపతిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వంశపారంపర్యంగా వచ్చే హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. పైగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో గుండె కండరాలు, గోడలు మందంగా మారడమన్నది రోగులందరిలోనూ ఒకేలా ఉండదు. ఈ తరహా కేసులు మొత్తం కార్డియోమయోపతిలో నాలుగు శాతం వరకు ఉంటాయి. వంశపారంపర్యంగానే వచ్చే మరో రకమైన రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. ఈ తరహా కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. కారణాలు: ♦ మద్యం అలవాటు ♦ వైరల్ ఇన్ఫెక్షన్లు ♦ నియంత్రణలో లేని అధిక రక్తపో టు (హైబీపీ), ♦గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు దీనికి కారణమవుతాయి. అయితే అనువంశీకంగా (వంశపారంపర్యంగా) కొన్ని కుటుంబాల్లో కనిపించే కార్డియోమయోపతికి మాత్రం జన్యువుల్లో మార్పు (మ్యుటేషన్)లే కారణం. అలాంటప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉన్నట్లయితే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స ఎలాగంటే... ♦కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కాకుండా... పరిస్థితి తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తారు. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. ♦ అధిక రక్తపో టు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. ♦ గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. దాన్ని అమర్చడం ద్వారా గుండెస్పందనలు సజావుగా, లయబద్ధంగా జరిగేలా చూస్తారు. గుండెకొట్టుకోవడంలో ఇంకా ఏవైనా లోటుపాట్లు ప్రాణానికి ప్రమాదం తెచ్చేలా ఉంటే... వాటిని సరిచేసి ప్రాణాల్ని కాపాడటం కోసం ఐసీడీ పరికరాన్ని అమర్చుతారు. ♦ హైపో ట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతిలో... అది ఏ రకమైనప్పటికీ చికిత్సలో ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పేషెంట్ పరిస్థితి విషమించకుండా చూడటమే ప్రధానం. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల ,సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ -
Paralysis: పక్షవాతం పడగొడుతోంది!
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు ముస్తాబాద్‌కు చెందిన అనమేని బాలయ్య, శ్యామల. మేస్త్రీ పనిచేస్తూ, వ్యవసాయం చేసుకునే బాలయ్యకు ఏడాదిన్నర క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. రూ.3లక్షల వరకు అప్పు చేసి వైద్యం చేయిస్తున్నారు. కూతురు వెన్నెలను ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదివిస్తున్నారు. బాలయ్యకు నెలకు రూ.13వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ చిత్రంలో మంచానికే పరిమితమైన మెంగని శ్రీనివాస్(51)ది ముస్తాబాద్. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీనివాస్ 2020లో తిరిగొచ్చాడు. ఆరు గెదెలు కొని, డెయిరీతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతలోనే శ్రీనివాస్‌కు పక్షవాతం రాగా.. రూ.8లక్షలు ఖర్చ య్యింది. అయినా నయం కాలేదు. కుటుంబ పెద్ద పక్షవాతానికి గురవడంతో పాలిటెక్నిక్ పూర్తి చేసిన కొడుకు వివేక్ బీటెక్‌కు చదువలేకపోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తండ్రికి ఆసరాగా నిలుస్తున్నాడు. చిన్నకుమారుడు సాత్విక్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో ఇటీవల పక్షవాతానికి గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మారుతున్న జీవన విధానం.. ఆహారమార్పులతో బీపీ(బ్లడ్ ప్రెషర్) పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వ్యక్తులు మంచానికి పరిమితం అవుతుండగా.. చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. మారుతున్న జీవన విధానం ప్రస్తుత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలతో చిన్న వయస్సులోనే పక్షవాతానికి గురవుతున్నారు. పెరుగుతున్న రక్తపోటు(బీపీ), షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటితో పక్షవాతం దాడి చేస్తుంది. ఒకే చోట కదలకుండా పనిచేయడం, మద్యం ఎక్కువగా తాగడం, మాంసం, జంక్‌ఫుడ్ తీసుకోవడం, పొగతాగే అలవాటు ఉన్న వాళ్లలో పెరాలసిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. అతిగా మొబైల్ వినియోగించే వారిలోనూ పెరాలసిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. స్పందించే సమయం ముఖ్యం పక్షవాతానికి గురయ్యే వారికి ముందుగానే లక్షణాలు బయటపడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు ముందుగానే గుర్తించి తక్షణమే వైద్యం అందిస్తే త్వరగా కోలుకునే లక్షణాలు ఉన్నాయి. ఇటీవల సిరిసిల్లకు చెందిన ఒకరు పక్షవాతానికి గురికాగా కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యంత వేగంగా స్పందించిన డ్యూటీ డాక్టర్ పక్షవాతానికి గురైన నాలుగు గంటల్లోపే ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వడంతో శాశ్వత పక్షవాతం నుంచి బయటపడ్డాడు. (క్లిక్: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..) ఇలా తెలుసుకోవాలి మెదడులో ఒక ప్రాంతం ఒక్కో భాగాన్ని నియంత్రిస్తుంది. రక్తప్రసరణ నిలిచిపోయినప్పుడు ఆ భాగంలో రక్తం గడ్డకట్టి తలనొప్పి, కళ్లు తిరగడం, అపస్మారక స్థితిలోకి వెళ్తుంటాయి. నాడీవేగం తగ్గడం, తల, కళ్లు ఒక వైపునకు తిరగడం. కనుపాపలు వెలుతురుకు స్పందించకపోవడం జరుగుతుంది. మూత్ర ఆపుకునే శక్తి సన్నగిల్లడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతి సమస్యలు లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారు బలహీనంగా ఉంటారు. పక్షవాతానికి గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి, ఎంతవేగంగా చికిత్స అందిస్తే రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ–హెల్త్ ద్వారా నమోదు జిల్లాలో ఈ–హెల్త్ అధికారులు సర్వే చేపట్టారు. జిల్లాలో అధిక రక్తపోటు(బీపీ) కేసులు 29,213 ఉన్నాయి. ఇందులోని వారే పెరాలసిస్‌కు గురవుతున్నట్లు ఆరోగ్యశాఖ భావిస్తోంది. జిల్లాలో దాదాపుగా 2500 ఆపైగా పక్షవాతం కేసులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి కారణమయ్యే షుగర్ కేసులు కూడా జిల్లాలో 13,331 కేసులు ఉన్నాయి. పెరాలసిస్ బాధితులకు కూడా ప్రభుత్వం అండగా నిలవాలని పేద కుటుంబాలు కోరుతున్నాయి. (క్లిక్: స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి) జీవన విధానం మార్చుకోవాలి ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చా యి. స్మోకింగ్, ఆల్కహల్, జంక్‌ఫుడ్ తీసుకుంటున్నారు. యువత కూడా పెరాలసిస్‌కు గురవడం సాధారణంగా మారింది. లక్షణాలు బయటపడగానే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. మానసిక ఒత్తిడికి గురికావద్దు. వ్యాయామం, యోగా చేయాలి. – డాక్టర్ చింతోజు శంకర్, ఐఎంఏ జిల్లా మాజీ అధ్యక్షుడు -
తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే..
హై బీపీ.. హెవీ బ్లడ్ ప్రెషర్.. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అధిక రక్తపోటును నిశ్శబ్ద కిల్లర్‌గా సూచిస్తారు. ఇది తరచుగా ఎలాంటి సంకేతాలు, హెచ్చరికలు, లక్షణాలు లేకుండా వస్తుంది కాబట్టి చాలామందికి రక్త పోటు యొక్క ప్రమాద సూచిక అసలు అర్థం కాదు. బీపీ తరచుగా పెరుగుతున్నా.., తరచుగా తట్టుకోలేనంత కోపం వచ్చినా, శరీరంలో తేడా అనిపించినా.. కొన్ని జాగ్రతలు తీసుకుంటే మంచిది. సోడియం లెవల్ సాధారణంగా ఒక లీటర్ రక్తంలో 135 నుంచి 145 మిల్లీ ఈక్వెలంట్స్ మధ్య ఉంటుంది. రక్తపోటు అధికంగా ఉన్నవారు రోజువారీ సోడియం 1,500 మిల్లీగ్రాములకు పరిమితం చేయాలి, ఇది తప్పకుండా పాటించాల్సిన మొదటి జాగ్రత్త. ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2,400 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఆ మేరకు అంచనా వేసుకోవాలి. వెంటనే ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. కారంతోపాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆహారంలో సోడియం తగ్గడం వల్ల రక్తపోటు నార్మల్కు వస్తుంది. ఎందుకంటే, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీర అసమతుల్యతతోపాటు ఉబ్బరం ఏర్పడుతుంది. ఎందుకంటే శరీరం ఉప్పును బయటకు పంపడానికి అదనపు నీటిని నిల్వ చేస్తుంది. ఇది తరచుగా శరీరంలో రక్తపోటును ప్రేరేపిస్తుంది. దీంతో అరోగ్య సమస్యలు మొదలువుతాయి. అందుకే ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అందువల్ల రక్తపోటును తగ్గించే ఏకైక మార్గం ఆహారంలో ఉప్పును తగ్గించడమే. రక్తపోటు స్థాయిలను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే ఆహార పదార్థాలు ఇవి. అరటిపండ్లు ఇవి పొటాషియానికి గొప్ప మూలంగా ఉంటాయి. రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడే ఖనిజంగా పొటాషియం పనిచేస్తుంది. పొటాషియం, సోడియం 2:1 నిష్పత్తిగా ఉంటేనే శరీరంలో రక్తపోటు స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అరటిపండ్లను తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. నేరుగా తినవచ్చు లేదా బనానా షేక్, స్మూతీని తయారు చేసుకోని తిన్నా ఫరావాలేదు. మెగ్నీషియం కోసం బియ్యం, వేరుశెనగ, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం, వోట్స్ లాంటివి మెగ్నీషియంకు మంచి వనరులు. మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సహజంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మెగ్నీషియం నైట్రిక్ ఆక్సైడ్ ధమని గోడలను సడలించి, రక్తం సాఫీగా ప్రవహించేలా చేయడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, 500 మిల్లీగ్రామ్ నుంచి 1,000 మిల్లీగ్రామ్ వరకు మెగ్నీషియం తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పాల ఉత్పత్తులు తాజా లేదా ఇంట్లో తయారుచేసిన పాల ఉత్పత్తులను చేర్చడం వల్ల రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని ఎముకలు, దంతాలలో భారీ మొత్తంలో కాల్షియం నిల్వ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం రక్త నాళాలు విస్తరించడానికి, సంకోచించడంలో సహాయపడుతుంది. అయితే కాల్షియం తగ్గితే హృదయనాళ వ్యవస్థ ద్వారా రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది. దీంతో కాల్షియం పొందేందుకు శరీరం ఇతర వనరుల కోసం వెతకడం మొదలవుతుంది. ఈ పరిస్థితి ఎముకల వ్యాధులకు దారితీస్తుంది. మీ ఆహారంలో పాలు, జున్ను, పెరుగు, మజ్జిగ వంటి కాల్షియం అధికంగా ఉండే వాటిని ఉండేలా చూసుకుంటే, ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒకసారి సోడియం పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. లెవల్స్‌లో తేడా ఉంటే డాక్టర్‌ను కలిసి ఆహార అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు ధ్యానం, యోగా లేదా వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Thyroid Cancer: థైరాయిడ్ క్యాన్సర్.. మహిళలతో పోలిస్తే పురుషులకే ముప్పు ఎక్కువ! లక్షణాలివే -
అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..
గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడాన్నికార్డియాక్ అరెస్ట్ అంటారు. నిజానికి ఇది ఒక రకంగా ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. అమెరికాలో సగానికిపైగా జనాభా దీని భారీన పడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి. ఐతే దీని బారిన పడ్డవెంటనే చికిత్స అందిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు, ఎవరెవరు దీని బారినపడతారో, చికిత్స ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.. కార్డియాక్ అరెస్ట్‌కు కారణాలు ►వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గుండెలో నాలుగు గదులు ఉంటాయి. దిగువ రెండు గదులను జఠరికలు, పై రెండు గదులను కర్ణికలు అంటారు. కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్తప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది కూడా. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ►కర్ణిక దడ ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్ధవంతంగా రక్తాన్ని పంపవు. కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎవరికి ఉంది? ►కరోనరీ హార్ట్ డిసీజ్‌తో బాధపడే వారిలో ఈ సమస్య సాధారణంగా తలెత్తుతుంది. ►గుండె పరిమాణం పెద్దదిగా ఉన్నవారిలోకూడా హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ►పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న పిల్లల్లో కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు. ►గుండె విద్యుత్ వ్యవస్థతో సమస్యలు తలెత్తినా ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఈ కింది కారణాల వల్ల కూడా సంభవించవచ్చు.. ►ధూమపానం ►ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి ►అధిక రక్త పోటు ►ఊబకాయం ►వంశపారంపర్య గుండె జబ్బులు ►45 కంటే ఎక్కువ వయస్సున్న పురుషులకు, 55 కంటే ఎక్కువ వయసున్న మహిళలకు ►పొటాషియం/మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉన్నవారిలో కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ►తలతిరుగుతుంది ►అలసటగా అనిపించడం ►వాంతి ►గుండెల్లో దడ ►ఛాతి నొప్పి ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►స్పృహ కోల్పోవడం ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణం నిలుపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనే పరీక్ష చేసి, సత్వర చికిత్స అందించడం ద్వారా శరీరానికి రక్తం ప్రసరించేలా ప్రేరేపిస్తారు. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడవచ్చు. చదవండి: మత్స్యకారులకు దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద.. -
బీపీ పెరిగిపోతోంది, ‘షుగర్’ పేరుకుపోతోంది.. ఏం చేయాలి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జీవన శైలి జబ్బులైన బీపీ, షుగర్లు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 20.5 శాతం మంది షుగర్ బాధితులున్నారు. అయితే ఈ స్థాయిలో బీపీ, షుగర్ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక గుండెజబ్బులకు గురవుతున్నారు. నియంత్రణకు చర్యలు ► జీవనశైలి జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ►వారానికోసారి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఎన్సీడీ(జీవనశైలి జబ్బులు) స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. ►104 వాహనాల ద్వారా కూడా స్క్రీనింగ్ నిర్వహించి ఉచితంగా మందులిస్తోంది. ►30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ వయసు దాటిన వాళ్లు తరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం లేకే ఈ దుస్థితి ఒత్తిడి కారణంగా ఈ జబ్బులొస్తున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారమూ తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే వారిని క్రీడల వైపు మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. –డా.విద్యాసాగర్, ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, కర్నూలు ప్రభుత్వ వైద్యకళాశాల -
బీపీ ఉందా.. ఈ జాగ్రత్తలు పాటించండి
సాక్షి, హైదరాబాద్: రక్తపోటును (బీపీ) ‘సైలెంట్ కిల్లర్’గా వైద్యులు అభివర్ణిస్తుంటారు. బీపీ నియంత్రణలో లేకపోతే గుండెపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, కంటిచూపు కోల్పోవడం, డిమెన్షియా వంటివి సంభవిస్తాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బీపీ, షుగర్ వంటివి నియంత్రణలో లేక రోగ నిరోధకశక్తి తగ్గి సులభంగా కరోనా బారిన పడే ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగినట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేప థ్యంలో ‘మీ రక్తపోటు ఎంతుందో కచ్చితంగా తెలుసుకోండి. దాన్ని నియంత్రణలో ఉంచండి. దీర్ఘ కాలం జీవించండి’ అనే నినాదంతో ‘వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్’ముందుకు సాగుతోంది. నేడు వరల్డ్ హైపర్‌టెన్షన్ డే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రక్తపోటుతో ముడిపడిన అంశాలు, సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కన్సల్టెంట్ ఫిజీషియన్ డా.ప్రభుకుమార్ చల్లగాలి ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సమస్య గుర్తించగానే చికిత్స చేయాలి.. రక్తపోటులో వస్తున్న మార్పులను గుర్తిస్తే.. వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. దాదాపు 50 శాతం మందికి వారిలో బీపీ సమస్య ఉన్నట్లు అవగాహన కూడా ఉండట్లేదు. బీపీ పెరగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో కొవ్వులు చేరడంతో లోపలి పొర చిట్లిపోయే ప్రమాదం ఉంది. వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ (డబ్ల్యూహెచ్ఎల్) సూచనల ప్రకారం బీపీ ఉందో లేదో తెలుసుకునేందుకు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం డాక్టర్ల వద్ద ఉండే స్ఫిగ్మో మానోమీటర్లు అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన బీపీ డిజిటల్ మీటర్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ 140 నుంచి 80 లోపు రక్తపోటు ఉండేలా చూసుకోవాలి. ముందుగా దీన్ని గుర్తించి మందులు వాడితే ఎక్కువ కాలం జీవించి ఉండేందుకు అవకాశం ఉంటుంది. వారం నుంచి 10 రోజుల పాటు బీపీ చెక్ చేసి, సరాసరి పాయింట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీపీ ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. 140 నుంచి 90 లోపు బీపీ లేకపోతే వెంటనే మందులు వాడాలి. అనియంత్రిత రక్తపోటు ఎక్కువ కాలం ఉంటే కిడ్నీలు పాడవుతాయి. కంటి వెనుక భాగంలో రక్తనాళాలు చిట్లి బ్లడ్ స్పాట్స్ కనిపించడంతో పాటు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. గుండెలో, మెదడులో రక్తనాళాలు చిట్లే అవకాశాలుంటాయి. మెదడులో రక్తం గడ్డ కట్టే ప్రమాదమూ లేకపోలేదు. బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. ► క్రమంతప్పకుండా బీపీ మందులు వాడాలి. ► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెల్లగా ఎక్సర్సైజులు పెంచాలి. ► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. ► కిడ్నీ సమస్యలున్న వారు, రక్తంలో సమస్యలున్న వారికి ప్రోటీన్ ఫుడ్‌తో సమస్యలు వస్తాయి. చేపలు, కోడిగుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. ► కోవిడ్ బాధితులు ఆందోళనతో బీపీ పెంచుకుంటున్నారు. అలా ఆందోళన చెందొద్దు. ► కరోనా బాధితుల్లో బీపీ, షుగర్ స్థాయిలు కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. అందుకు తగిన మందులు వాడాలి. ► బీపీ ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 7 రెట్లు పెరుగుతాయి. బీపీతో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల సులభంగా కోవిడ్ బారిన పడే అవకాశాలుంటాయి. ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.. కోవిడ్ రాక ముందే జాగ్రత్త చర్యల్లో భాగంగా రక్తపోటు నియంత్రణలో ఉండాలి. బీపీ కంట్రోల్లో లేకపోతే రక్త ప్రసరణ బాగా పెరిగి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తాయి. అందువల్ల ముందుగానే మందులు వాడి బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. అందువల్లే కరోనా చికిత్స సమయంలో రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతారు. లో డెన్సిటీ లిపో ప్రోటీన్లు రక్తంలో, రక్తనాళాల్లో పెరిగితే గుండెపోటు వస్తుంది. -
ఉప్పును ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఉప్పు రక్తపోటును పెంచుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే హైబీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఉప్పులేని చప్పిడి తిండి తినడానికి చాలామంది ఇష్టపడరు గానీ, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, బీపీ పెరుగుతుంది. ఉప్పు వల్ల రక్తపోటు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. మనం ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కవగా తీసుకున్నప్పుడు... ఆ ఉప్పు ద్వారా సోడియం అనే మూలకం రక్తంలోకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చేరుతుంది. ఇలా చేరిన ఆ సోడియంను తొలగించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తంలోని సోడియం నరాల లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనిని తట్టుకునేందుకు నరాల లోపలి గోడల్లోని సన్నని కండరాలు మందంగా మారుతాయి. దీనివల్ల నరాల లోపల రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు కావలసిన చోటు కుంచించుకుపోయి, రక్తపోటు పెరుగుతుంది. అతిగా ఉప్పు తింటే మెదడుకు దారితీసే నరాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలు సజావుగా చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి డెమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు అదుపు తప్పితే, గుండెపోటు రావడం, మెదడు వద్ద రక్తనాళాలు చిట్లి పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అందుకే సాధ్యమైనంతవరకు మన ఆహారపదార్థాల్లో ఉప్పును పరిమితంగా తీసుకోవడమే మంచిది. ఇక ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు, ఎక్కువకాలం నిల్వ ఉంచేలా తయారు చేసే బేకరీ ఐటమ్స్ పరిమితంగా తీసుకోవాలి. హైబీపీ ఉన్నవాళ్లు వాటిని తీసుకోకపోవడమే మంచిది. -
హైబీపీ నియంత్రణకి.. హెల్తీ లైఫ్‌స్టైల్ ‘కీ’..
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే కష్టనష్టాలు ఎదుర్కుంటున్నాం. మళ్లీ ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయా? నష్టాలు, ఆదాయాల్లేని ఖర్చులు కొనసాగుతాయా? ఆరోగ్యం ఏమవుతుంది? రకరకాల పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి ఆలోచనలు నగరవాసుల్లో రక్తపోటు సమస్యను తీవ్రతరం చేస్తున్నట్టు ఆసుపత్రుల్లో నమోదవుతున్న హైబీపీ కేసులు వెల్లడిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి తెచ్చిపెడుతున్న అధిక బరువు సమస్య తద్వారా హైబీపీ పేషెంట్స్ పెరుగుతున్నారని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో అపోలో స్పెక్ట్రా కన్సల్టెంట్ యూరాలజిస్ట్, అండ్రాలజిస్ట్ డా.ప్రియాంక్ సలేచా రక్తపోటు సమస్య దాని నివారణ గురించి సూచనలు అందిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నగర జీవనశైలి అధిక రక్తపోటుకు కూడా కారణంగా మారుతోంది. ఎడాపెడా మారుతున్న ఆహార విహారాలు, పనివేళలు, అలవాట్లు, రక్తపోటు సమస్యకు ప్రధాన కారణాలు. నిద్రలేమి... వ్యసనాల హాని... ధూమపానం, ఆల్కహాల్, కెఫైన్ సేవనం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని దూరం చేస్తాయనేది తెలిసిందే. మరీ ముఖ్యంగా అప్పటికే హై బీపీ ఉన్న వారికి ఇవి మరింత ప్రమాదకరం. ధూమపానం వల్ల హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది అదే స్మోకింగ్కి కెఫైన్ వినియోగం జత కలిస్తే రక్తపోటు సమస్య వస్తుంది.. అలాగే ఆరోగ్యాన్ని హరించే అనేక కారణాల్లో శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం ఒకటి. ప్రతి ఒక్కరికీ రోజూ 6గంటల గాఢ నిద్ర తప్పనిసరి. లేని పక్షంలో అది మొత్తంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తరచుగా తక్కువ నిద్రతో సరిపెట్టే పెద్దల్లో మాత్రమే కాదు చిన్నారుల్లో కూడా హై బీపీ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. నిర్ణీత వేళల్లో నిద్రపోవడం ద్వారా హైబీపీని చాలా వరకూ నియంత్రించవచ్చు. హై బీపీ..వ్యాధులకు ఎంట్రీ.. సాధారణంగా అధిక రక్తపోటుతో అనుసంధానంగా వచ్చే సమస్య హృద్రోగం. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవం ఏమిటంటే... కిడ్నీ సమస్యలకు సైతం ప్రధాన కారణాలలో ఒకటి రక్తపోటు. దీని వల్ల కిడ్నీలు పూర్తిగా పనిచేయని పరిస్థితి దాకా రావచ్చు. కిడ్నీతో పాటు దయాబెటిస్కి, బ్రెయిన్, కళ్లు పై కూడా హైబీపీ దుష్ప్రభావం చూపిస్తుంది. నియంత్రణ ఇలా.. కిడ్నీలతో పాటు శరీరంపై ఎటువంటి దీర్ఘకాల ప్రభావాలూ లేకుండా ఉండాలంటే రక్తపోటు స్థాయిల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అధిక రక్తపోటుకు చికిత్స, నివారించే దిశగా కొద్ది కొద్దిగా బరువు కోల్పోవడం ఉపకరిస్తుంది. తక్కువ కార్బెహైడ్రేట్స్, అధికంగా ఫైబర్ ఉన్న రోజువారీ ఆహారం, అలాగే క్రమబద్ధమైన వ్యాయామం... వంటివి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడంలో కీలకపాత్ర పోషించి హై బిపీ రిస్క్ తగ్గిస్తాయి. నిద్రవేళలు సవరించుకోవడం వంటి జీవనశైలి మార్పులతో పాటుగా ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన రీతిలో రక్తపోటు సమస్యను తగ్గింవవచ్చు. ఆహారంలో ఉప్పవాడకం తగ్గించాలి. లో సోడియం డైట్‌ను ఎంచుకోవాలి. పండ్లు, కూరగాయలు... వంటివి బాగా వినియోగించాలి. తక్కువ పరిమాణాల్లో ఎక్కువ మార్లు ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కనీసం 30 నిమిషాల పాటు రోజూ వ్యాయామం చేయాలి. ఇది మన మెటబాలిజమ్‌ని క్రమబద్ధీకరిస్తుంది. బరువు పెరగడాన్ని తద్వారా హైబీపీ ప్రమాదాన్ని నివారిస్తుంది. చదవండి: ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి -
80 ఏళ్ల వృద్ధుడికి.. రూ.80 కోట్ల కరెంట్ బిల్లు
ముంబై: సామాన్యంగా కరెంట్ బిల్లు వందల్లో వస్తుంది. వేసవికాలంలో ఏసీలు, కూలర్లు వినియోగించడంతో వేలల్లో వస్తుంది. సామాన్యులు వందల్లోపు ఉండే కరెంట్ బిల్లు కట్టడానికే ఇబ్బంది పడతారు. అలాంటిది ఏకంగా కోట్లలో కరెంట్ బిల్లు వస్తే.. గుండె ఆగిపోతుంది. తాజగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కరెంట్ బిల్లు చూసి ఆ వృద్ధుడికి నిజంగానే షాక్ తగిలింది. బీపీ పెరిగి పడిపోయాడు. దాంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నలసోపారా టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. గణ్‌పత్ నాయక్(80) అనే వృద్ధుడు నలసోపార్ టౌన్‌లోని నిర్మల్ గ్రామంలో రైస్ మిల్లు నడుపుతున్నాడు. ఈ క్రమంలో వచ్చిన కరెంట్ బిల్లు చూసి అతడికి నిజంగానే షాక్ తగిలింది. వేలల్లో కాదు ఏకంగా కోట్లల్లో కరెంట్ బిల్లు వచ్చింది. 80 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు చూసి అతడి బీపీ పెరిగింది. కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎంఎస్ఈడీసీఎల్) స్పందించింది. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని.. తర్వలోనే బిల్లును సరి చేస్తామన్నారు. మీటర్ రీడింగ్ తీసుకునే ఏజెన్సీ చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది అని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యుత్ బోర్డు అధికారి సురేంద్ర మోనెరే మాట్లాడుతూ.. ‘‘ఏజెన్సీ ఆరు అంకెలకు బదులుగా తొమ్మిది అంకెల బిల్లును తయారు చేసింది. మేము అతడి విద్యుత్ మీటర్‌ను అధ్యయనం చేసి వారికి ఆరు అంకెల కొత్త బిల్లును ఇచ్చాము’’ అని తెలిపారు. ఈ సందర్భంగా గణ్‌పత్ నాయక్ మనవడు నీరజ్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లు వచ్చినప్పుడు అక్కడ పని చేస్తున్న వారు దాన్ని చూసి షాక్ అయ్యారు అని తెలిపాడు. ‘‘ఈ బిల్లు చూసిన వెంటనే మొత్తం జిల్లాకు సంబంధించిన కరెంట్ బిల్లును మాకే పంపించారేమో అనుకున్నాం. దీని గురించి చెక్ చేయడంతో అది మా ఒక్కరి కరెంట్ బిల్లే అని తెలిసింది. విద్యుత్ బోర్టు లాక్డౌన్ కాలానికి సంబంధించి ప్రతి ఒక్కరి నుంచి బకాయిలు వసూలు చేయడం ప్రారంభించింది. మా దగ్గర నుంచి ఈ మొత్తం వసూలు చేస్తుందా ఏంటి అని భయపడ్డాం" అన్నాడు నీరజ్. చదవండి: షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు.. ఏంది సార్ ఆ కరెంటు బిల్లు?: హీరో -
వారిలోనే అధిక రక్తపోటు..
సాక్షి, అమరావతి: కార్యాలయాల్లో సాధారణ పని గంటల కంటే ఎక్కువ సమయం గడిపే వారిలో అధిక రక్తపోటు (హైబీపీ) ఉంటోందని ఓ అధ్యయనంలో తేలింది. తమకు హైబీపీ ఉన్న విషయం, దానివల్ల కలిగే అనర్థాలను వీరు కనిపెట్టలేరని ఆ అధ్యయనంలో స్పష్టమైంది. బీపీ ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఏదో తెలియని ఇబ్బంది అనిపించి వైద్యులకు చూపించుకున్నా.. ఇలాంటి వారిలో హైబీపీ ఉన్న విషయం అంత సులభంగా బయటపడటం లేదు. వారానికి 49 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే.. ►కెనడియన్ పరిశోధనా బృందం భారతదేశం తోపాటు వివిధ దేశాల్లో దీనిపై అధ్యయనం జరిపింది. ►వారానికి 35 గంటల కన్నా తక్కువ పనిచేసే ఉద్యోగులతో పోలిస్తే.. 49 కంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల 70 శాతం ఎక్కువ తెలియని రక్తపోటు వచ్చే అవకాశం ఉందని గుర్తించింది. ►వీరిలో పెరిగిన రక్తపోటు రీడింగ్‌లను తెలుసుకోవడం కష్టమవుతుందని, అందువల్ల వారికి రక్తపోటు లేదనే అభిప్రాయం కలుగుతోందని అధ్యయనం తేల్చింది. ►శరీరంలో మార్పులు తీవ్రమైన తర్వాత ఒకేసారి ఇది బయటపడుతుందని గుర్తించింది. అది ముసుగు రక్తపోటు ►ప్రతి వారం 41 నుంచి 48 గంటలు పనిచేసే వ్యక్తులు తెలియని రక్తపోటు (ముసుగు రక్తపోటు) బారిన పడటానికి 54 శాతం ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనంలో స్పష్టమైంది. ►ఉద్యోగుల్లో తెలియని విధంగా ఉండే రక్తపోటు వల్ల వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. ►ఈ అధ్యయనంలో ఉద్యోగులను బృందాలుగా విభజించి కొన్నేళ్లపాటు పదేపదే పరీక్షలు జరిపారు. ►ఎక్కువ పని గంటలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఉద్యోగులు చాలామందికి ముందే తెలుసని అధ్యయనంలో తేలింది. ►అయితే దీన్ని నియంత్రించుకోవడానికి, తగ్గించుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఉండడం లేదని గుర్తించారు. -
హైపర్ ‘టెన్షన్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా హైపర్ టెన్షన్(అధిక రక్తపోటు) బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పట్టణాల నుంచి గ్రామాలకు సైతం విస్తరించిన ఈ జీవనశైలి జబ్బుపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధిక రక్తపోటును ప్రాథమిక దశలోనే గుర్తించి నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, దీనివల్ల బాధితులు శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారని రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, నియంత్రించడానికి రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లో కేంద్రం పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. తాజాగా దీన్ని మరో 100 జిల్లాలకు విస్తరింపజేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండు జిల్లాలను ఎంపిక చేయనుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో చేపట్టనున్న స్క్రీనింగ్ పరీక్షలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారం అందిస్తోంది. హైపర్ టెన్షన్‌ను సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే రానున్న ఐదేళ్లలో మరో ఐదారు కోట్ల మంది దీనిబారినపడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అధిక రక్తపోటు బాధితులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, 2025 నాటికి ఈ వ్యాధి విస్తరణను కనీసం 25 శాతం అరికట్టాలని సూచించింది. బాధితులకు ప్రభుత్వం తరపున మందులివ్వాలి హైపర్ టెన్షన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్‌కు (పక్షవాతం) గురవుతున్నారని, వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తాజాగా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ (నిర్ధారణ) పరీక్షలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని, ఇందుకోసం నర్సులకు, హెల్త్ వర్కర్లకు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని, బాధితులకు ప్రభుత్వం తరఫునే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్’గా మార్చాలని, గ్రామస్థాయిలో అధిక రక్తపోటు బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికం ఆంధ్రప్రదేశ్‌లో హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల నివేదికలో తేలింది. రాష్ట్రంలో దాదాపు కోటి మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా బాధితులు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోనూ బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హైపర్ టెన్షన్ బాధితులు పెరుగుతున్న కారణంగా గుండెపోటు, పక్షవాతం కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రాథమిక దశలోనే గుర్తించాలి ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాము హైపర్ టెన్షన్ బారిన పడినట్లు కూడా తెలియదు. పట్టణాల్లో కూడా చాలామంది తమకు వ్యాధి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తూ హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన వారు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అసాధారణంగా ఉన్నవారికీ గుండెపోటు వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువ. ప్రాథమిక దశలోనే గుర్తించి, మందులు వాడితే జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు’’ – డా.చంద్రశేఖర్, హృద్రోగ నిపుణులు, సూపరింటెండెంట్, కర్నూలు జనరల్ ఆస్పత్రి -
అల్లంతో హైబీపీకి కళ్లెం!
ముంబై: మీకు హైబీపీ ఉందా. దీనిని నియంత్రించుకునేందుకు వందల రూపాయలు ఖర్చు పెట్టి మందులు కొంటున్నారా? ఇవి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముందని తెలిసినా.. తప్పదని సర్దుకు పోతున్నారా? అయితే, ఇకపై చింతించకండి. నేరుగా వంటగదిలోకి వెళ్లి.. అల్లం ముక్కను తీసుకుని, 4 గ్రాముల ముక్కను తుంచుకుని నమిలి తినండి. రోజూ ఇలా చేయడం ద్వారా హైబీపీతో పాటు రక్తంలోని చక్కెర, శరీరంలోని అధిక కొవ్వు తగ్గిపోవడం ఖాయమని నైజీరియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలోరిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. అల్లం.. హైబీపీని నియంత్రించే అమృతమని పేర్కొన్నారు. అల్లంపై పలు ప్రయోగాలు చేసిన వీరు.. దీనిలోని రసాయనిక గుణాలు, త్వరగా జీర్ణమయ్యే నూనెలు, ఫెనాల్ కాంపౌండ్స్ వంటివి హైబీపీ నుంచి రక్షణ కల్పిస్తాయని వివరించారు. షుగర్‌తో గుండెకు అధిక ముప్పు! న్యూఢిల్లీ: షుగర్‌తో బాధపడే వారికి గుండెజబ్బుల ముప్పు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. షుగర్ రోగులు ఎక్కువగా ఉన్న టాప్–10 దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. 6కోట్ల మంది వరకూ ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. వీరిలో 3 కోట్లమందికిపైగా ప్రాథమిక లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారేనని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ చెబుతోంది. -
కృత్రిమ కిడ్నీ వచ్చేస్తోంది!
మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందా? కిడ్నీ మార్పిడికి దాత కోసం ఎదురు చూస్తున్నారా? నరకప్రాయం అనిపించే డయాలసిస్ వద్దని అనుకుంటున్నారా? మీ సమస్యలన్నీ తీరే రోజు ఎంతో దూరం లేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త షువో రాయ్. ఎందుకంటారా?.... ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మాదిరిగానే పని చేసే కృత్రిమ కిడ్నీ సిద్ధమైంది కాబట్టి!! అక్షరాలా 2.20 లక్షలు... దేశంలో ఏటా కిడ్నీ సమస్యలతో డయాలసిస్ అవసరమవుతున్న వారి సంఖ్య ఇది. ఈ సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా వైద్య సదుపాయాలు మాత్రం పెరగట్లేదు. కిడ్నీ దాతలూ తక్కువగా ఉండటంతో కిడ్నీ మార్పిడి చుట్టూ నేరాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉన్న సెంటర్ల లోనే గంటలకొద్దీ నానా అవస్థలు పడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఎట్టకేలకు శుభవార్త. షువో రాయ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కృత్రిమ కిడ్నీ తయారీలో విజయం సాధించడమే కాదు.. మరో రెండేళ్లలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డయాలసిస్‌తో సమస్యలెన్నో... మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యల కారణంగా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసే మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోతే పనిచేయడమూ మానేస్తాయి. ఇది కాస్తా మరణానికి దారితీస్తుంది. మూత్రపిండాలు కొంతవరకే పనిచేస్తున్న పరిస్థితుల్లో ఓ భారీ యంత్రం సాయంతో రక్తాన్ని అప్పుడప్పుడూ శుద్ధి చేసి మళ్లీ ఎక్కిస్తూంటారు. డయాలసిస్ అని పిలిచే ఈ చికిత్స ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొంత మందికి వారానికి ఒకసారి డయాలసిస్ అవసరమైతే ఇతరులకు నెల, రెండు నెలలకు ఒకసారి సరిపోతుంది. ఇదంతా కొంత ఖరీ దైన వ్యవహారమే. అదే సమయంలో సమస్యలను పూర్తిగా తగ్గించదు కూడా. శుద్ధి చేసే క్రమంలో శరీరానికి అవసరమైన కొన్ని పదార్థాలూ నష్టపోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్‌లాంటి పదార్థాలతో తయారైన ఫిల్టర్ల వాడకం దీనికి కారణం. మూత్రపిండాల్లో సహజసిద్ధంగా ఉండే నెఫ్రాన్లు ఏడు నానోమీటర్ల సైజులో ఉంటే ప్లాస్టిక్ ఫిల్టర్‌లోని రంధ్రాలు ఇంతకంటే ఎక్కువ సైజులో ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక మంది మధుమేహ రోగులున్న భారత్‌లో ఈ సమస్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తితోపాటు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో అత్యధిక కిడ్నీ రోగులు ఉండటం తెలిసిందే. ఏపీ సీఎం వై.ఎస్. జగన్ ప్రభుత్వం డయాలసిస్ రోగులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినా, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా డయాలసిస్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని సంకల్పించినా అవన్నీ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన చర్యలే. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన షువో రాయ్ పరిశోధన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎలా పనిచేస్తుంది? శరీరంలో ఏదైనా కొత్త అవయవం చేరితే రోగ నిరోధక వ్యవస్థ వెంటనే దాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. కానీ షువోరాయ్ తయారు చేసిన కృత్రిమ కిడ్నీతో మాత్రం ఈ సమస్య రాదు. ఎందుకంటే ఇందులో రోగి కణాలనే వాడతారు. స్థూలంగా ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకదాంట్లో నానోస్థాయి రంధ్రాలున్న ఫిల్టర్లు ఒక కట్టలా ఉంటాయి. సిలికాన్‌తో తయారైన ఈ ఫిల్టర్లు రక్తం ప్రవహించే వేగాన్ని ఉపయోగించుకొని రక్తంలోని విషపదార్థాలు, చక్కెరలు, లవణాలను తొలగిస్తాయి. ఫిల్టర్‌లోని రంధ్రాలు కచ్చితమైన సైజు, ఆకారంలో ఉండటం వల్ల రక్త కణాలపై ఒత్తిడి తగ్గుతుంది. లేదంటే రక్తం గడ్డకట్టి రోగికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక రెండో భాగంలో బయో రియాక్టర్ ఉంటుంది. ఇందులో మూత్రపిండాల కణాలే ఉంటాయి. శుద్ధి చేసిన రక్తంలో తగుమోతాదులో నీళ్లు, అవసరమైన లవణాలు, చక్కెరలు ఉండేందుకు బయో రియాక్టర్‌లోని మూత్రపిండ కణాలు ఉపయోగపడతాయి. ఫిల్టర్ల ద్వారా శుద్ధి అయిన రక్తాన్ని పరిశీలించి.. ఏయే పదార్థాలు ఎంత మోతాదులో ఉన్నాయో గుర్తించడం నియంత్రణకు అవసరమైన పనులు చేసేందుకు ఒక మైక్రో కంట్రోలర్‌ను వాడతారు. గతేడాది షువో రాయ్ బృందం సిద్ధం చేసిన కృత్రిమ కిడ్నీ పరికరం నిమిషానికి లీటర్ రక్తాన్ని శుద్ధి చేయగలదని పరీక్షల్లో తేలింది. ఈ పరికరంలో వాడే బయో రియాక్టర్లను 1999 నుంచి జంతువుల్లో విజయవంతంగా పరీక్షిస్తున్నారు. ఎలా అమరుస్తారు షువో రాయ్ అభివృద్ధి చేసిన కృత్రిమ కిడ్నీ సైజు చాలా చిన్నది. ముందుగా ఫిల్టర్లు ఉన్న భాగాన్ని కడుపు భాగంలో చిన్న గాటు పెట్టి మూత్రనాళాలకు కలుపుతారు. రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని నివారించేందుకు నెలరోజులపాటు పరిశీలిస్తారు. ఆ తరువాత రక్తం సక్రమంగా శుద్ధి అవుతున్నదీ లేనిదీ చూస్తారు. ఈ దశలో బయో రియాక్టర్‌ను జోడిస్తారు. కృత్రిమ కిడ్నీని అమర్చుకున్న వారు తమ దైనందిన కార్యకలాపాలను చేసుకోవచ్చు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు కూడా ఈ కృత్రిమ కిడ్నీ ప్రత్యామ్నాయం కానుందని అంచనా. జంతు పరీక్షలు ఇప్పటికే పూర్తయిన నేప థ్యంలో త్వరలోనే మానవ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాలోని కిడ్నీ రోగుల సంస్థ ఈ ప్రయోగాల్లో పాల్గొనడంతోపాటు ప్రాజెక్టు సాకారమయ్యేందుకు ఆర్థికంగానూ సాయపడతామని ఇప్పటికే ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా ఈ కృత్రిమ కిడ్నీని అందుబాటులోకి తెస్తామని షువో రాయ్ చెబుతున్నారు. కిడ్నీ మార్పిడికి 5ృ10 ఏళ్లు పట్టొచ్చని, ఈలోగా కృత్రిమ కిడ్నీ ద్వారా రోగులు సాంత్వన పొందొచ్చని వివరించారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ డయాలసిస్ ప్రక్రియ తొలగింపే లక్ష్యం డయాలసిస్ ప్రక్రియను పూర్తిగా తొలగించాలన్ననే నా లక్ష్యం. రక్తాన్ని శుద్ధి చేస్తూనే సహజసిద్ధ మూత్రపిండాలు చేసే పనులన్నీ నిర్వహించే కృత్రిమ కిడ్నీని తయారు చేయాలని దశాబ్దం కంటే ఎక్కువ కాలం నుంచి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో తగినన్ని నిధులు అందుబాటులోకి వస్తే ఒకట్రెండేళ్లలో మానవ ప్రయోగాలను పూర్తి చేయొచ్చు. ప్రపంచంలో ఏమూల ఉన్న వారికైనా దీన్ని అం దుబాటులోకి తీసుకురావచ్చు. నాతోపాటు మా బృందం మొత్తం ఇదే లక్ష్యంతో పనిచేస్తోంది. - సాక్షితో షువో రాయ్ -
హై–బీపీ రాకుండా నివారించుకోవడం ఎలా?
హై–బీపీ కౌన్సెలింగ్ మా అన్నగారు చాలాకాలం నుంచి హై–బీపీతో బాధపడుతున్నారు. ఇటీవల నేను పరీక్ష చేయించుకుంటే నాకు కూడా కాస్త బీపీ ఎక్కువగా ఉన్నట్లు అర్థమైంది. పూర్తిగా మందులు ఇవ్వకపోయినా కాస్త జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. దయచేసి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త వివరించండి. – సుధీర్‌కుమార్, నల్లగొండ హైబీపీ ఉందని చెప్పగానే అంతగా ఆందోళన పడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మీరు హైపర్‌టెన్షన్ వల్ల వచ్చే సమస్యల గురించి అవగాహన పెంచుకోవాలి. అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియవూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియవూవళిని ‘డ్యాష్’ అంటారు. ‘డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న ఇంగ్లిష్ పదాల సంక్షిప్త రూపమే ఈ డ్యాష్. ఈ నియమాలు బీపీని నివారించుకోవాలనుకుంటున్న వారు కూడా పాటించవచ్చు. ఎందుకంటే ఇవే నివారణకూ తోడ్పడతాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు లేదా దాన్ని నివారించుకోవాలనుకున్నవారు తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉదాహరణకు అరటిపండు వంటి పండ్లలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి అలాంటి పండ్లు తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. హైపర్‌టెన్షన్ నివారించుకోవాలనుకుంటున్నవారితో పాటు అది ఉన్న వారు ఆహారంలో ఉప్పు (సోడియం) పాళ్లను తగ్గించాలి. ఇందుకోసం ఉప్పు (సోడియమ్) పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారాలైన నిల్వ ఉంచిన ఆహారాలు (ప్రిజర్వ్డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. సాధారణంగా పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అవసరానికి మించి కాస్త ఎక్కువగానే ఉప్పు వేస్తుంటారు. లేకపోతే పచ్చడి చెడిపోతుందని అంటుండటం మనం వింటూనే ఉంటాం. అందుకే కాస్త పాత బడ్డ తర్వాత పచ్చళ్లు రుచి తగ్గి, ఉప్పుగా అనిపిస్తుంటాయి. అందుకే పాత ఆవకాయలనూ, పాత పచ్చళ్లను (నిల్వ పచ్చళ్లను) అస్సలు ఉపయోగించకూడదు. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ లేదా వ్యక్తులు లావెక్కుతున్న కొద్దీ అన్ని కణాలకూ రక్తసరఫరా జరగడానికి రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంటుంది. దాంతో స్థూలకాయులకు హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎత్తును లేదా బీఎమ్‌ఐని చూసుకొని, ఎత్తుకు తగ్గ బరువుండేలాగా ఎప్పుడూ మన బరువును నియంత్రించుకుంటూ ఉండాలి. మంచి పోషకాలు ఉండే ఆహారం తినడం వల్ల అంటే పొట్టుతో ఉండే అన్ని రకాల తృణధాన్యాలు, ఆకుపచ్చని ఆకుకూరలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారంతో బరువు తగ్గడంతో పాటు సాధారణ ఆరోగ్యమూ బాగుంటుంది. ఇది పరోక్షంగా బీపీని నివారిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగరు. బరువు పెరగడం, స్థూలకాయం రావడం వంటి అంశాలు హై–బీపీ వచ్చేందుకు రిస్క్ ఫ్యాక్టర్ అన్న విషయం తెలిసిందే. అందుకే వ్యాయామం మన శరీరంలో కొవ్వు పేరుకోకుండానూ, బరువు పెరగకుండానూ చేసి, పరోక్షంగా హై–బీపీని నివారిస్తుంది. ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ తాగగానే రక్తప్రసరణ వేగంలో తక్షణం మార్పు వస్తుంది. కొంత వేగంగానే పెరుగుతుంది. అందుకే ఈ అలవాటును పూర్తిగా మానేయాలి. పొగతాగే అలవాటు వల్ల కూడా ఎన్నో అనర్థాలతో పాటు పొగలో ఉండే నికోటిన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్ప్రేరకాలన్నీ రక్తప్రసరణ వేగాన్ని పెంచేవే. కాబట్టి బీపీ ఉన్నవారూ, దాన్ని నివారించుకోవాలనుకునేవారు ఈ దురలవాటు నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. ఒత్తిడి రక్తపోటును చాలా ఎక్కువగా పెంచుతుంటుంది. అందుకే రక్తపోటును నివారించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ప్రాణాయామ వంటి ప్రక్రియలతో పాటు తమకు ఇష్టమైన అభిరుచులలో (హాబీలలో) కృషిచేస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి. మనం నివారణ కోసం (లేదా అప్పటికే బీపీ ఉన్నవారు నియంత్రణ కోసం) అనుసరించే ఈ మార్గాలన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. కాబట్టి మంచి జీవనశైలిని అనుసరిస్తే బీపీని అదుపులో ఉంచుకోవడం లేదా నివారించుకోవడం చాలా సులభం. బీపీ ఉంటే కిడ్నీ పరీక్ష కూడా ఎందుకు? నేను గత ఐదేళ్లుగా హైబీపీతో బాధపడుతున్నాను. ఇటీవల ఒకసారి బీపీ చెక్ చేయించుకోడానికి డాక్టర్గారిని కలిస్తే ఆయన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. నాకు లక్షణాలేమీ లేకపోయినా ఎందుకిలా చేశారు. వివరించగలరు. – రవికాంత్, మధిర దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలో కొన్నిసార్లు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా రక్తపోటు హెచ్చుతగ్గులు ఉన్నవారిలోనూ, దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలోనూ ఎండ్ ఆర్గాన్స్ అనే కీలకమైన శరీర అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడు, కాలేయం, మూత్రపిండాల వంటి వాటిని ఎండ్ ఆర్గాన్స్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే రక్తం ఇక్కడివరకు చేరి మళ్లీ వెనక్కు తిరుగుతుంది. ఇలాంటి కీలకమైన అవయవాలు హైబీపీ దుష్ప్రభావాల వల్ల దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పైగా కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు చాలావరకు దెబ్బతిన్న తర్వాత గాని వాటికి సంబంధించిన లక్షణాలేవీ బయటపడవు. అందుకే వాటిని ముందే తెలుసుకోగలిగితే రాబోయే ముప్పును సమర్థంగా నివారించవచ్చు. ఈ కారణం వల్లనే హైబీపీ ఉన్నవారిలో తరచూ కీలక అవయవాలైన కాలేయం పనితీరు పరీక్షలనూ, కిడ్నీ పనితీరును తెలుసుకునేందుకు దోహదపడే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్, క్రియాటినిన్ వంటి పరీక్షలు చేయిస్తుంటారు డాక్టర్లు. మీరు డాక్టర్ ఇచ్చిన సలహా పాటించండి. బీపీ ఉంటే కంటికీ ప్రమాదమా? నా వయసు 54 ఏళ్లు. చాలా రోజులుగా హైబీపీ సమస్యతో బాధపడుతున్నాను. ఇటీవల మా డాక్టర్‌గారు ఒకసారి కంటి పరీక్ష చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. ఎందుకా పరీక్ష చేయించమన్నారు. బీపీ వల్ల కంటికీ ప్రమాదమా? దయచేసి చెప్పండి. – ఎమ్. సుదర్శనరావు, నిజామాబాద్ నియంత్రణలో లేకుండా చాలా కాలం నుంచి బీపీ ఉన్నవారిలో కొందరికి కంట్లో ఉన్న రక్తనాళాలు మూసుకుపోవడం, దాంతో కాస్త చూపు తగ్గే అవకాశం ఉంది. ఈ కండిషన్‌ను ఇస్కిమిక్ రెటినోపతి అంటారు. అందుకే హైబీపీ ఉన్నవారిని కంటి పరీక్షలు తరచూ చేయించమని డాక్టర్లు సూచిస్తుంటారు. కాబట్టి మీరు మీ డాక్టర్ చెప్పినట్లుగా ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ ఎమ్. గోవర్ధన్ సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
పప్పుధాన్యాలతో హైబీపీకి చెక్
లండన్ : పప్పు ధాన్యాలతో హైబీపీని నియంత్రంచవచ్చని తాజా అథ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. కూరలు, సూప్స్‌లో వాడే పప్పుధాన్యాలు వయసుతో పెరిగే బీపీని కంట్రోల్ చేస్తాయని ఎలుకలపై చేసిన ప్రయోగంలో తేలింది. హైబీపీని చౌకగా దొరికే ఈ ధాన్యాలతో నియంత్రిచవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మనితోబా అథ్యయనం పేర్కొంది. పప్పుధాన్యాలు రక్తకణాల ఆరోగ్యం క్షీణించకుండా చూస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డల్లాస్‌లో జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వార్షిక సదస్సులో పరిశోధకులు తమ అథ్యయన ఫలితాలను వెల్లడించారని ది డైలీ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. బీపీ నియంత్రణలో పప్పుధాన్యాల పనితీరు అద్భుతంగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని అథ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ పీటర్ జహ్రద్కా చెప్పారు. రక్త సరఫరాలో లోపాలపై నాన్ క్లినికల్ చికిత్సలో భాగంగా పప్పుధాన్యాలు ప్రభావవంతంగా పనిచేశాయని తెలిపారు. సకాలంలో గుర్తించి చికిత్స చేయకుంటే హైపర్‌టెన్షన్‌గా వ్యవహరించే హైబీపీ స్ర్టోక్‌లు, గుండెపోటుకు దారితీస్తుంది. -
యువత ‘మెదడు’ చిట్లుతోంది
సాక్షి, హైదరాబాద్: మారుతున్న జీవనశైలి, పెరుగు తున్న మానసిక ఒత్తిళ్లు కొత్త రోగాలకు కారణమ వుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే మెదడులో రక్తస్రావం సమస్య ఇప్పుడు యువకులనూ బాధిస్తోంది. భరించలేని తలనొప్పితో మొదలయ్యే ఈ సమస్య మనిషిని పూర్తిగా నిశ్చేష్టులుగా మార్చి స ్పృహ కోల్పోయేలా చేస్తోంది. సకాలం లో చికిత్స అందిస్తేగానీ మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టంగా మారుతోంది. మెదడులో రక్తస్రావం కేసులు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశ్రీ తాజా నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడు తున్న యువకుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతున్నట్లు నివేదిక చెబుతోంది. బాధితుల్లో 35 ఏళ్లలోపు వారే 13 శాతం ఉన్నట్లు వెల్లడైంది. ఇవి కేవలం ఆరోగ్యశ్రీ పరిధిలోని చికిత్సల లెక్కలే. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య దీనికి రెండింతలుగా ఉంది. పరిణామాలేంటి..? మెదడు నుంచి బయటకొచ్చిన రక్తం గడ్డకట్టి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరం అదుపుతప్పి రోగికి తల తిరిగినట్లు అవుతుంది. శరీరం పట్టు కోల్పోతుంది. భరించలేనంత తలనొప్పితో వాంతులు అవుతాయి. మూర్చపోవడం, పక్షవాతం వంటి లక్షణాలతో స ్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఇలా అన్ని రకాల సమస్యలతో కోమాలోకి జారుకుంటారు. అధిక రక్తపోటు వల్లే.. అధిక రక్తపోటు కారణంగానే మెదడులో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావమైన 3 గంటల్లో చికిత్స అందిస్తే ఫలితం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమైన సందర్భాల్లో ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. రోగి ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటారో చెప్పడంకష్టం. – డాక్టర్ బోడకుంట్ల ప్రభాకర్, న్యూరోసర్జన్, వరంగల్ కారణాలేంటి..? అధిక రక్తపోటు, నిద్రలేమి, మానసిక ఒత్తిళ్లు, రహదారి ప్రమాదాలు, పుట్టుకతోనే రక్త నాళాల్లో సమస్యలు, మోతాదుకు మించి గర్భనిరోధక మాత్రల వినియోగం మెదడు రక్తస్రావానికి కారణమవుతున్నాయి. రక్తపో టు అదుపుతప్పినప్పుడు మెదడులో నాళాలు చిట్లి మెదడు పైభాగంలో రక్తస్రావం అవుతుంది. ఆరోగ్యశ్రీ నివేదిక ప్రకారంమెదడు రక్తస్రావం శస్త్ర చికిత్సలు ఏడాది చికిత్సలు 2014-15 1,444 2015-16 1,608 2016-17 1,766 2017-18 1,892 -
మహానగరంలో మాయరోగాలు
-
పగటి నిద్ర... ఒకింత మేలే!
పగటి నిద్ర పనికి చేటు అంటుంటారు గానీ పగటి నిద్ర మరీ అంత చెడ్డదేమీ కాదంటున్నారు పరిశోధకులు. రోజూ కనీసం అరగంట పాటు పగటివేళ నిద్రపోయే వారికి చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయట. రాత్రి సరిగా నిద్రపట్టని కారణంగా కలిగే ఆరోగ్యలోపాలను పగటి నిద్ర చాలావరకు రిపేర్ చేస్తుందట. అంతేకాదు... స్థూలకాయం, డయాబెటిస్, హైబీపీ, డిప్రెషన్‌తో బాధపడేవారికి పగటి నిద్ర... వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. పగటినిద్రపోయే వారిలోని మెదడులో ఒత్తిడిని తగ్గించే నార్ఎపీనెఫ్రిన్ అనే హార్మోను ఎక్కువగా తయారై అది గుండెజబ్బులనూ, రక్తపోటునూ తగ్గిస్తుంది. ఈ ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అందుకే పగటిపూట పరిమితంగా కాస్తంత కునుకు తీస్తే అది పవర్న్యాప్లా పనిచేస్తుందన్న విషయం ఆ జర్నల్ ద్వారా మరోమారు నిరూపితమైంది. -
కాబోయే తల్లికి ముఖ్య పరీక్షలివి
కాబోయే తల్లికి ఈ కింది పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తుంటారు. ఆ పరీక్షలేమిటీ, అవి ఎందుకు చేస్తారంటే... ⇒ అధిక రక్తపోటు (బీపీ టెస్ట్): గర్భిణికి రక్తపోటు ఎక్కువగా ఉంటే అది బిడ్డ ఆరోగ్యంపై, ఎదుగుదలపై ప్రభావం చూపవచ్చు. ఒక్కోసారి రక్తపోటు అధికం కావడం వల్ల కాబోయే తల్లికి ఫిట్స్, గుండె సవుస్యలు రావచ్చు. అందుకే... క్రవుం తప్పకుండా అధిక రక్తపోటు ఉందో లేదో చూడటం అవసరం. ⇒ ఏ గ్రూపు రక్తం?... తల్లి రక్తం ఏ గ్రూపునకు చెందిందో తెలుసుకోవడం అవసరం. రక్తంలో సాధారణంగా ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులు ఉంటాయన్నది తెలిసిందే. ఇందులో ప్రతి గ్రూపులోనూ పాజిటివ్, నెగెటివ్ అనే రెండు రీసస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తల్లీ, తండ్రీ... ఇద్దరిదీ ఏ గ్రూపు రక్తం అయినా ఇద్దరి రీసస్ ఫ్యాక్టర్ పాజిటివ్ అయితే ఇబ్బంది లేదు. తల్లిది నెగెటివ్, తండ్రిది పాజిటివ్ అయి, పుట్టబోయే బిడ్డ రీసస్ ఫ్యాక్టర్ నెగెటివ్ అయినా పర్లేదు. కాని తల్లి ఫాక్టర్ నెగెటివ్ అయి, తండ్రిది పాజిటివ్ అయి, ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ బిడ్డకు వచ్చినప్పుడు వూత్రం పాపకు పుట్టుకతోనే ఆరోగ్యసవుస్యలు వస్తాయి. తల్లిలోని యాంటీబాడీస్ పాపలోకి ప్రవేశించి పాప రక్తకణాలను దెబ్బతీయడమే దీనికి కారణం. అయితే ఈ సవుస్య మెుదటి ప్రెగ్నెన్సీ కంటే రెండోసారి గర్భధారణ సవుయంలో తప్పనిసరి. తల్లిదండ్రుల గ్రూపులు తెలుసుకుని, యంటీ–డీ అనే ఒకే ఒక ఇంజెక్షన్ ద్వారా పుట్టబోయే బిడ్డలో కాంప్లికేషన్స్ నివారించడమే కాదు, బిడ్డ ప్రాణాన్నీ రక్షించవచ్చు. ⇒ రక్తహీనత నిర్ధారణ పరీక్ష: మన దేశంలోని దాదాపు మహిళలందరిలోనూ ఉన్న ప్రధాన లోపం రక్తహీనత. ఫలితంగా బలహీనంగా ఉండటం, చిన్న పనికి వెంటనే అలసిపోవడం వంటి లక్షణాలు తల్లుల్లో కనిపిస్తుంటాయి. ఐరన్ వూత్రలతో ఈ పరిస్థితి నివారించవచ్చు. అందుకే కాబోయే తల్లులందరికీ ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ⇒ బ్లడ్ షుగర్ పరీక్ష: గర్భిణి రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకోవడం చాలా అవసరం. గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎలాంటి ఆహారం తీసుకున్నా... ఆ సవుయంలో స్రవించే కొన్ని హార్మోన్ల వల్ల రక్తంలో చక్కెర పాళ్లు పెరిగేందుకు అవకాశం ఉంది. దాంతో ఉవ్మునీరు పెరగడం, శిశువ# పరివూణం పెరగడం వంటివి జరగవచ్చు. ఫలితంగా పాప గడువ#కు వుుందే పుట్టడం (ప్రీమెచ్యూర్ డెలివరీస్), లేదా పిండం గర్భంలోనే చనిపోవడం వంటివి జరిగే ఆస్కారం ఉంది. అందుకే క్రవుం తప్పకుండా బ్లడ్ షుగర్ పాళ్లు తెలుసుకుని, ఒకవేళ అది ఎక్కువగా ఉంటే నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. గర్భిణుల్లో వుుందు నార్మల్‌గా ఉన్నా... వుుఖ్యంగా ఏడు, తొమ్మిది వూసాలప్పుడు ఈ చక్కెరపాళ్లు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సవుయంలో ఈ పరీక్షలు వురింత అవసరం. ⇒సిఫిలిస్ పరీక్ష: ఇది సెక్స్ ద్వారా వ్యాప్తి చెందే ఒక వ్యాధి. తల్లికి నిర్వహించిన పరీక్షల్లో ఇది ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే... అబార్షన్‌కు దారితీయవచ్చు. లేదా వుృతశిశువ# పుట్టవచ్చు. ⇒హెపటైటిస్–బి టెస్ట్: హైపటైటిస్–బి వైరస్ వల్ల సంక్రమించే ఒక వ్యాధి అన్న విషయం తెలిసిందే. అది గర్భంలోని పాపకు పుట్టుకతో రాకుండా నిరోధించేందుకు ఈ పరీక్ష అవసరం. ⇒ హెచ్ఐవీ పరీక్ష: ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష ఇది. కాబట్టి గర్భిణులందరికీ ఈ పరీక్ష తప్పనిసరి. ⇒ వుూత్ర పరీక్ష: ఈ పరీక్ష ద్వారా వుూత్రంలో చక్కెరపాళ్లు, ప్రొటీన్లు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో కూడా చూడాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉండి దానికి సరైన చికిత్స తీసుకోకపోతే పాప గడువ#కు వుుందే పుట్టడం (ప్రీమెచ్యూర్ డెలివరీస్) వంటివి జరగవచ్చు. లేదా బిడ్డ బరువ# తక్కువగానూ పుట్టవచ్చు. ⇒ థైరాయిడ్ పరీక్ష: బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం తల్లిలో స్రవించే థైరాయిడ్ హార్మోన్ ఎంతో అవసరం. బిడ్డ గర్భంలో ఉండే వ్యవధిలో మెుదటి సగం కాలంలో పాప పెరుగుదలకు తల్లి థైరాయిడ్ హార్మోన్‌నే ఉపయోగపడుతుంది. కాబట్టి కాబోయే తల్లిలో ఏవైనా థైరాయిడ్ సవుస్యలుంటే, వాటిని చక్కదిద్దడం వల్ల తల్లిలో అబార్షన్ వంటి సవుస్యలనూ, బిడ్డలో ఎదుగుదల లోపాలనూ అరికట్టడానికి ఈ పరీక్ష ఎంతో అవసరం. బిడ్డలో లోపాలు తెలుసుకోవడం కోసం... పాప పుట్టకవుుందే బిడ్డలో లోపాలేమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పిండదశలోనే కొన్ని పరీక్షలు చేస్తారు. ప్రధానంగా స్కానింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించే పరీక్షలివి... బిడ్డ గురించి చాలా విషయాలను తెలుసుకోవడం కోసం స్కానింగ్ పరీక్షలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు కొన్ని... ⇒ న్యూకల్ ట్రాన్స్ల్యుయెన్సీ టెస్ట్: బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలను తెలుసుకోడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. పదమూడు వారాలప్పుడు చేసే ఈ పరీక్షతో ఇంకా... ⇒ పాప పుట్టబోయే తేదినీ వురింత నిర్దిష్టంగా కనుగొనడం ⇒ పుట్టబోయే పిల్లలు కవలలా, అయితే వారు ఏ రకం కవలలు అన్నది తెలుసుకోవడం ⇒అప్పటికే పుర్రె, బిడ్డ పూర్తి స్వరూపం రూపొందుతుంది కాబట్టి శరీరంలో ఏవైనా అవకరాలున్నాయేమో అన్నది తెలుసుకోవడం ⇒ క్రోమోజోవుల్ సవుస్యలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం సాధ్యవువ#తుంది. ఈ స్కాన్‌ద్వారా దాదాపు 90% సవుస్యలను కనుగొని వాటిని రూల్ అవ#ట్ చేయవచ్చు. ⇒ ఫీటల్ అనావులీ స్క్రీనింగ్: అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రక్రియ ద్వారా పుట్టబోయే బిడ్డలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేస్తారు. సాధారణంగా ఇది ప్రెగ్నెన్సీలో 18–20 వారాలప్పుడు చేసే పరీక్ష. ఈ పరీక్ష ద్వారానే పుట్టబోయే బిడ్డలో ఏవైనా గుండెకు సంబంధించిన లోపాలుంటే తెలుసుకుంటారు. ఫలితంగా ఏదైనా అవసరం ఉంటే పుట్టిన వెంటనే తక్షణ చికిత్స అందించి, పాపను రక్షించుకోడానికి వీలుంటుంది. గ్రహణం మొర్రి (క్లెఫ్ట్ లిప్), వెన్నెవుుకలో లోపాలు లాంటివి ఈ పరీక్ష ద్వారా తెలుసుకునే వీలుంది. ఇలాంటి లోపాలుంటే ఎంత చిన్న వయస్సులో శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తే అంతగా సత్ఫలితాలుంటాయి. ఈ స్కాన్లతో పాటు కొన్ని రక్త (ప్రోటీన్) పరీక్షలతో 95% సవుస్యలను తెలుసుకుని, అవి లేవని నిర్ధారణ చేయవచ్చు. ప్రెగ్నెన్సీలో డిప్రెషన్, యాంగై్జటీలకు దూరంగా... ⇔ మీకు ఇష్టమైన హాబీలు పెంపొందించుకోవాలి. వ్యాపకాలను సృష్టించుకోవాలి. దీనివల్ల మీ మూడ్స్ ఆహ్లాదంగా ఉంటాయి. కంటినిండా నిద్రపోవాలి. ⇔ప్రవసం గురించి ఆందోళన పడకండి. అది చాలా హాయిగా జరిగిపోతుందని అనుకోండి. సిజేరియన్ గురించి, పురిటినొప్పుల గురించి ⇔భయపడకండి. బిడ్డపుట్టాక పాలు పడతాయా లేదా అని ఇప్పటి నుంచే ఆందోళన చెందకండి. ఇలా అనవరసమైన ఆందోళనల వల్ల బిడ్డ మీద ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇔ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల నుంచి వచ్చే సలహాలు, సూచనల్లో మీరు అనుసరించగలిగినవే చేయండి. ⇔ మీకు శ్రమకలిగించే మల్టీటాస్కింగ్ వంటివి ఆ సమయంలో చేయకండి. మీకు మానసిక ఒత్తిడి కలిగించే పనులేమీ చేయవద్దు. ⇔ఈ టైమ్‌లో యాంగై్జటీని తగ్గించడానికి మంచి పుస్తకాలు చదవడం, టీవీలో ఉల్లాసాన్నిచ్చే హాస్యభరితమైన కార్యక్రమాలు చూడటం వంటి పనులు చేయండి. ⇔ ప్రతిదీ మీరే స్వయంగా చేయాలని అనుకోకండి. కొన్ని ఇంటి పనులు మీ కుటుంబసభ్యులకూ అప్పగించండి. డాక్టర్ భావన కాసు కన్సల్టెంట్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో, హైదరాబాద్ -
ములాయం సింగ్‌కు అస్వస్థత
లక్నో : సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా అధిక రక్తపోటు రావడంతో లక్నోలోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. (చదవండి : ఎస్పీలో మళ్లీ ప్రకంపనలు : 'ములాయం’కే ఎసరు ) ములాయం అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. గత రెండు రోజులుగా ఎస్పీలో తలెత్తిన వివాదాల కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ వార్త తెలుసుకోగానే శివపాల్ యాదవ్ ములాయం నివాసానికి చేరుకున్నారు. డాక్టర్లను అడిగి ములాయం ఆరోగ్యపరిస్థితిని వాకబు చేస్తున్నారు. (చదవండి : ఈసీ కోర్టులో ‘ఎస్పీ’ బంతి : ఎవరిది పైచేయి!) -
20 కోట్ల మంది భారతీయులకు హైబీపీ
లండన్: భారత్‌లో ప్రతి ఆరుగురిలో ఒకరికి హైబీపీ ఉందని, 20 కోట్ల మంది దీనితో బాధపడుతున్నారని లండన్ ఇంపీరియల్ కాలేజీ శాస్తవేత్తల సర్వేలో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 113 కోట్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా హైబీపీ బాధితుల సంఖ్య 40 ఏళ్లలో రెట్టింపయ్యింది. 2015లో అధిక బీపీ ఉన్న ప్రజల్లో సగం మంది ఆసియావాసులే. చైనాలో సుమారు 2.26 కోట్ల మందికి హైబీపీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీల కన్నా పురుషుల్లోనే ఈ సమస్య అధికం. జనాభాలో రక్తపోటు ఉన్న వారి శాతాల పరంగా పరిశీలిస్తే పురుషుల్లో క్రొయేషియా(38%), స్త్రీలలో నైగర్(36%) తొలిస్థానంలో నిలిచాయి. -
ప్రెగ్నెన్సీ టైమ్ పరీక్షల్లో బయటపడుతుంది
గర్భిణుల్లో... కొంతమంది మహిళలకు గర్భం దాల్చకముందే హైబీపీ ఉంటుంది. మరికొంతమందిలో గర్భం దాల్చిన 20వ వారంలో ఇది కనిపిస్తుంది. (ఒకవేళ 20వ వారం కంటే ముందే హైబీపీ ఉందంటే... వారికి అంతకు ముందే అధిక రక్తపోటు ఉందనీ, దాన్ని మొదట గుర్తించలేదనీ అర్థం. అంటే 20వ వారం కంటే ముందే రక్తపోటు ఉందంటే అది దీర్ఘకాలిక బీపీ అని, గర్భవతి అయ్యాక చేసే రక్తపరీక్షల్లో అది బయటపడిందని అనుకోవచ్చు. గర్భవతులకు ముప్పు ఉంటే అది మరెన్నో వైద్యసమస్యలకు కారణం కావచ్చు. ఒకవేళ అప్పటికే హైబీపీ ఉన్న మహిళలు గర్భం దాల్చాలని అనుకున్నప్పుడు వాళ్లు వాడే మందుల గురించి డాక్టర్‌ను సంప్రదించి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ విషయంలో డాక్టర్ దగ్గరి నుంచి తగిన సలహాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలి. కొన్ని మందులను గర్భం ధరించిన సమయంలో అస్సలు తీసుకోకూడదు. ఉదాహరణకు ఆంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్, మూత్రం ఎక్కువగా అయ్యేలా చేసే డై-యూరెటిక్స్ వంటివి. అవి పిండానికి హాని చేకూర్చవచ్చు. గర్భవతుల్లో వచ్చే హైబీపీ... గర్భవతుల్లో వచ్చే హైబీపీని ‘జెస్టేషనల్ హైబీపీ’ అంటారు. గర్భం దాల్చిన 20వ వారంలో హైబీపీ కనిపిస్తే దాన్ని ‘ప్రీ అక్లాంప్సియా’ అంటారు. అంతకు మునుపు రక్తపోటు ఉన్న కొంతమంది మహిళల్లో ... గర్భం దాల్చాక మళ్లీ అది కనిపించవచ్చు. ప్రీ-అక్లాంప్సియా ఉన్న మహిళలకు ప్రసవమైన ఆరు వారాల తర్వాత ఆ కండిషన్ తగ్గి మళ్లీ మామూలు కావచ్చు. అక్లాంప్సియా: ఇది ప్రీ-అక్లాంప్సియా కండిషన్ తర్వాత వచ్చే సమస్య. అక్లాంప్సియా సమస్య ఉన్నవారిలో అది ఫిట్స్‌కు దారితీయవచ్చు. ఇది చాలా తీవ్రమైన సమస్య. అందుకోసమే సమస్య ప్రీ-అక్లాంప్సియా దశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకొని అది అక్లాంప్సియా వరకు పోకుండా జాగ్రత్త పడాలి. కారణాలు: గర్భవతుల్లో హైబీపీకి లేదా ప్రీ-అక్లాంప్సియాకు సరైన కారణాలు ఇంకా తెలియదు. నిజానికి గర్భధారణకూ, బీపీ పెరగడానికి ఏదో సంబంధం ఉన్నట్లు వైద్య నిపుణుల పరిశీలనలో తెలిసింది. ప్లాసెంటా పెరుగుదలతో ఏర్పడే కొత్త రక్తనాళాలు అభివృద్ధి చెందడంతోనే సమస్య వస్తుందని నిపుణుల అభిప్రాయం. అయితే ప్రీ-అక్లాంప్సియా సమస్య ఉన్నప్పుడే గుర్తించి, తగిన చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది పిండానికి ఆక్సిజన్, పోషకాలు అందడంపై దుష్ర్పభావం చూపవచ్చు. గర్భధారణ సమయంలో హైబీపీతో సమస్యలు {పీ-అక్లాంప్సియా సమస్య వల్ల కాబోయే తల్లికి పక్షవాతం రావచ్చు. మూత్రపిండాలకు, కాలేయానికి సమస్య రావచ్చు. రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉండవచ్చు. కడుపులోని బిడ్డకు... బిడ్డ ఎదుగుదలలో సమస్య నెలలు నిండకముందే ప్రసవం మృతశిశువు పుట్టే అవకాశం గర్భవతుల్లో బీపీ ఉన్నట్లు తెలియడం ఎలా? భరించలేనంత తలనొప్పి కళ్లు సరిగా కనిపించకపోవడంమసకబారినట్లుగా ఉండటం పొట్టనొప్పి (ముఖ్యంగా పొట్ట పైభా గంలో ఎదుర్రొమ్ము ఎముకల కింద, కుడివైపున నొప్పిగా ఉంటుంది.వేవిళ్లు కాకుండా ఆ తర్వాత కూడా వాంతులుకడుపులోని బిడ్డ కదలికలు సరిగా లేకపోవడం.గర్భం దాల్చిన కొంతమందిలో ముఖం ఉబ్బడం, కాళ్లు-చేతుల వాపు చాలా సాధారణం. అయితే ప్రీ-అక్లాంప్సియా ఉంటే అది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. అలాంటి సమయంలో డాక్టరును తప్పక సంప్రదించాలి. డాక్టర్ భాగ్యలక్ష్మిసీనియర్ గైనకాలజిస్ట్, అండ్ అబ్‌స్టెట్రీషియన్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
క్యాజువల్‌గా చెక్ చేసినప్పుడు తెలుస్తుంది
పిల్లల్లో... వయసు పైబడ్డవారిలో, పెద్దవారిలో హైబీపీ ఉన్నట్లు వినడం సాధారణమే. అయితే మారిన జీవనశైలితో ఇటీవల చిన్నపిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. పిల్లల్లో హైబీపీ కండిషన్ రెండు విధాలుగా ఉండవచ్చు. మొదటిదాన్ని ప్రైమరీ హైపర్‌టెన్షన్ అంటారు. ఇలా హైపర్‌టెన్షన్ పెరగడానికి నిర్దిష్టమైన కారణమేమీటో తెలియనప్పుడు దాన్ని ప్రైమరీ అంటారు. ఇక బీపీ పెరగడానికి నిర్దిష్టమైన కారణం ఉన్న కండిషన్‌ను సెకండరీ హైపర్‌టెన్షన్ అంటారు. బీపీ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పిల్లలకు స్థూలకాయం ఉండటం, క్యాల్షియమ్ జీవక్రియల్లో మార్పులు, కుటుంబ చరిత్రలో ఎవరికైనా బీపీ ఉండటం, రెనిన్ హార్మోన్లో మార్పుల వంటివి ప్రైమరీ హైపర్‌టెన్షన్‌కు కారణం కావచ్చు. అయితే పిల్లల్లో హైపర్‌టెన్షన్ ఉంటే 95% నుంచి 99% మందిలో సెకండరీ హైపర్టెన్షనే అయి ఉండవచ్చు. అంటే ఇతర అవయవ సంబంధమైన వ్యాధులు (ఉదాహరణకు మూత్రపిండాల సమస్య, ఇతర మందులు, విషపదార్థాలుతీసుకోవడం, మెదడుకు సంబంధించిన రుగ్మతలు, గుండెజబ్బులు, గ్రంథులకు సంబంధించిన సమస్యలు, రక్తనాళాల సమస్యలు) ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో బీపీ ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో బీపీ ఉందని నిర్ధరించడం చాలా జాగరూకతతో చేయాలి. సరైన ఉపకరణాలతో, సరైన పద్ధతిలో, ఒకటి రెండుసార్లు పరీక్ష చేసి సెంటైల్ చార్ట్ (బీపీ కొలతలను బట్టి ఏది ఎంత తీవ్రమైనతో తెలిపే చార్ట్) ప్రకారం సరిగ్గా నిర్ధారణ చేయడం చాలా ప్రధానం. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారి పిల్లల విషయంలో మరింత నిశితంగా పరీక్ష చేయాలి. మూడేళ్లు దాటిన పిల్లలకు బీపీ తప్పనిసరిగా చూడాలి. సెంటైల్ చార్ట్‌లో 90వ పర్సంటైల్ ఉంటే బీపీ ఉన్నట్లు కాదు. అయితే ఈ రీడింగ్ వచ్చిన పిల్లలకు తప్పనిసరిగా ప్రతి ఆరునెలలకు ఒకసారి పరీక్ష చేయించాలి. రీడింగ్ 95-99 ఉంటే ఆ పిల్లలకు హైపర్‌టెన్షన్ స్టేజ్-1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్-2గా పరిగణించవచ్చు. ఈ తీవ్రతలను బట్టి అంటే... స్టేజ్-1, స్టేజ్-2లను పరిగణనలోకి తీసుకునే ఏ తీవ్రత ఉన్న పిల్లలకు ఎలాంటి చికిత్స అన్నది నిర్ధారణ చేస్తారు. సాధారణంగా స్కూల్లో ఎన్సీసీ, స్పోర్ట్స్ వంటి వాటిల్లో పాల్గొనే పిల్లలను వైద్యులు పరీక్షించినప్పుడే వాళ్లలో బీపీ ఉన్నట్లు గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా పిల్లల్లో హైబీపీ ఉన్నా దాని లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలతో అది బయటపడుతుంది. అవి... పెరుగుదలలో మార్పులు, తరచూ తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, రక్తస్రావం, కంటిచూపులో మార్పులు, ఫిట్స్ రావడం, పిల్లలు చికాకుగా ఉండటం వంటి కొన్ని లక్షణాలను బీపీ ఎక్కుగా ఉన్న పిల్లల్లో చూడవచ్చు. ఇక నిర్దిష్ట కారణం (సెకండరీ కాజెస్)తో వచ్చే హైపర్‌టెన్షన్‌లో బీపీ వచ్చిన కారణాన్ని గుర్తించి దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ప్రైమరీ హైపర్‌టెన్షన్ నివారణకు... స్థూలకాయం (ఒబేసిటీ) తగ్గేలా చూడటం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించడం నూనె పదార్థాలు, ఉప్పు తగ్గించడం ఏరోబిక్స్ వంటి ఆటల్లో పిల్లలు పాల్గొనేలా చూడటం...ఈ జాగ్రత్తలతో చాలావరకు తగ్గించవచ్చు. స్టేజ్-1లో ఉన్న పిల్లలకు సైతం మందులు లేకుండానే పైన పేర్కొన్న జాగ్రత్తలతో నివారించడం సాధ్యమే. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
60 శాతం మందికి ఆ రోగం ఉన్నట్లే తెలియదు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరం హైబీపీకి కేంద్ర బిందువుగా మారుతోంది. నగరంలో 18-40 ఏళ్ల వారిలో 36 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 18-20 శాతం మంది అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లు తేలింది. నగరంలో ఏటా వెలుగు చూస్తున్న హృద్రోగ మరణాల్లో అత్యధికం హైబీపీ వల్లే న మోదవుతున్నట్లు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వేలో తేలింది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, అతిగా మద్యపానం, ధూమపానం, ఊబకాయం, పని ఒత్తిడి వెరసి గుండె పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గుండె, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్న హైబీపీపై కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా ‘బిగ్ బీపీ క్యాంపెయిన్’పేరుతో ఎనిమిది గంటల పాటు సర్వే నిర్వహించింది. 1.80 లక్షల మందిని పరీక్షించింది. ఇందులో భాగంగా నగరంలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మహాత్మా గాంధీ బస్టేషన్, ఐఎస్ సదన్, జూబ్లీహిల్స్ అపోలో, డీఆర్డీవో అపోలో, మాదాపూర్‌లతో పాటు మరో 65 కేంద్రాల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేసింది. 19,846 మందిని పరీక్షించి, వీరిలో 11,245 శాంపిల్స్‌ను విశ్లేషించింది. బాధితుల్లో 36 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించింది. 60 ఏళ్ల వారితో పోలిస్తే 18-40 ఏళ్లలోపు వారే మూడు రెట్లు ఎక్కువగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. ఆసక్తి కర అంశమైమంటే బాధితుల్లో 60 శాతం మందికి తమకు అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లు తెలియదు. మందులు వాడుతున్న 42 శాతం మం దిలో బీపీ కంట్రోల్లో ఉండటం లేదు. ఇప్పటి నుంచే జాగ్రత్త పడక పోతే 2025 నాటికి ఈ సంఖ్య జనాభాలో మూడు వంతుల మం ది హైబీపీ బారిన పడే ప్రమాదం లేక పోలేదు. మహిళల్లోనూ ఇదే ఒరవడి...: ఇటీవల ఐటీ అనుబంధ రంగాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. పురుషులతో పోటీ పడి పనిచేస్తున్నారు. ఇటు ఇంటి పనుల్లోనూ, అటు ఆఫీసు పనుల్లోనూ వీరు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. జీవనశైలి వల్ల రుతుక్రమంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వంద మంది హృద్రోగ బాధితుల్లో 65 శాతం మంది పురుషులు ఉంటే, 35 శాతం మంది మహిళలు ఉంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆకస్మిక మరణాల రేటు ఎక్కువ . అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఆకస్మిక మరణాల శాతం 1.2 శాతం ఉంటే, గ్రేటర్లో మాత్రం 4.9 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. మహిళల ఆరోగ్యంపై శ్రద్ద చూపక పోవ డం, వైద్య ఖర్చుకు వెనకాడటం, నొప్పి వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకు వెళ్తుండటం కూడా ఇందుకు ఓ కారణమని వై ద్యులు అభిప్రాయపడుతున్నారు. -
గుండె లయలో మార్పులను సరిచేయవచ్చు!
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. ఒక్కోసారి నా గుండె చాలా స్పీడ్‌గా కొట్టుకున్నట్లు అనిపిస్తోంది. అది ఫాస్ట్‌గా దడదడలాడటం నాకు తెలుస్తోంది. ఆ సమయంలో నాకు కళ్లు తిరిగినట్లుగా ఉంటుంది. విపరీతమైన ఆయాసం, నీరసం ఫీలవుతుంటాను. నాకుహైబీపీకూడా ఉంది. అది డౌన్ అవ్వడం వల్ల ఇలా జరుగుతోందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - సత్యనారాయణ, వైజాగ్ మన శరీరంలో నిర్విరామంగా గుండె కొట్టుకోడానికి ఎలక్ట్రికల్ వ్యవస్థ ఒకటి పనిచేస్తుంది. ఇందులో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటే గుండెదడలో కూడా మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా గుండె 70-80 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా అసాధారణంగా గుండెదడ పెరిగినా లేక తగినా దానిని ప్రమాదంగా పరిగణించాలి. తగిన చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు. గుండె నిమిషానికి 100 కంటే ఎక్కువసార్లు కొట్టుకుంటే దానిని ‘ట్యాకి కార్డియా’ అంటారు. గుండె నిమిషానికి 60 సార్ల కంటే తక్కువ సార్లు కొట్టుకుంటే దానికి ‘బ్రాడీ కార్డియా’ అని పేర్కొంటారు. గుండెదడలో మార్పులను ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, ఎలక్ట్రో ఫిజియాలజీ స్టడీ (ఈపీ స్టడీ) పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. మీ విషయానికి వస్తే మీ గుండె స్పీడుగా కొట్టుకోవడం, కళ్లు తిరగడం, ఆయాసం, నీరసం రావడం లాంటివి చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఇవి ‘ట్యాకీకార్డియా’ లక్షణాలను సూచిస్తున్నాయి. కాబట్టి బీపీ డౌన్ అవ్వడం వల్ల మీకు అలా జరిగి ఉండదు. మీరు వెంటనే మంచి నిష్ణాతులైన వైద్యులను సంప్రదిస్తే వారు అన్ని పరీక్షలూ నిర్వహించి, మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో నిర్ధారణ చేస్తారు. దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. ఒకవేళ మీరు ట్యాకీకార్డియాతో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేస్తే మీలో గుండెదడ పెరగడానికి కారణమైన అవాంఛిత ఎలక్ట్రికల్ సర్క్యుట్లను తొలగించి క్రమబద్ధీకరిస్తారు. కాబట్టి మీరు ఎలాంటి అనవసరం భయాలూ పెట్టుకోకుండా వెంటనే మంచి డాక్టర్‌ను కలిసి, మీ సమస్యకు తగిన చికిత్స పొందండి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రాథమిక దశలోనే మీ సమస్యకు తగిన చికిత్సను తీసుకొని, ఆనందంగా ఉండండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నేను గత ఐదేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. నేను ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని అయన చెప్పారు. గత కొంతకాలంగా క్యాల్షియమ్ ఇస్తున్నారు. అయినా నాకు నొప్పి తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా క్యాల్షియమ్ వాడుతుంటే అవి కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉందని నాకు ఇటీవలే తెలిసింది. అప్పట్నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. - శ్రీదేవి, కొత్తగూడెం ఆస్టియో ఆర్థరైటిస్‌లో మొదట ఎముకల చివరల (అంటే కీళ్ల ఉపరితలంలో) ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) క్రమంగా అరిగిపోతుంది. కార్టిలేజ్‌లో క్యాల్షియమ్ ఉండదు. బహుశా మీ డాక్టర్ క్యాల్షియమ్ ఇచ్చింది మీ ఆస్టియో ఆర్థరైటిస్‌కు అయి ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇచ్చే మందుల్లో భాగంగా ఆయన క్యాల్షియమ్‌ను సూచించి ఉంటారు. ఆర్థరైటిస్‌కు కేవలం క్యాల్షియమ్తో గుణం కనిపించదు. మీ మోకాలి నొప్పి తగ్గదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆస్టియో ఆర్థరైటిస్’కు కాకుండా... ‘ఆస్టియో పోరోసిస్’ కండిషన్లో మీ ఎముకలు బలహీనం అయిపోకుండా చూడటానికి క్యాల్షియమ్‌ను డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. మీరు ఒకసారి మళ్లీ మీ డాక్టర్ గారిని సంప్రదించండి. హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 సంవత్సరాలు. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నాకు కొంతకాలంగా విపరీతమైన తలనొప్పి, తలలో ఒకవైపు మొదలై కంటి వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది. డాక్టర్‌కి చూపిస్తే మైగ్రేన్ అని చెప్పి, కొన్ని మందులు ఇచ్చారు. ఆ మందులు వాడుతున్నంతకాలం బాగానే ఉంటుంది. వాడటం మానేస్తే నొప్పి మళ్లీ మామూలే. ఈ నొప్పి వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. నా ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. - ఎస్. పవన్ కుమార్, తెనాలి మీరు ఆందోళన చెందకండి. హోమియో చికిత్స ద్వారా మైగ్రేన్ని పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్య సాధారణంగా 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సున్న వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) అంటే చాలా తీవ్రమైన తలనొప్పి ఉండటం, ఏదో ఒకవైపు తలనొప్పి రావడం సాధారణంగా చూస్తుంటాం. ఇది మెడవెనక భాగంలో ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. పార్శ్వపు నొప్పికి కారణాల గురించి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కానీ తలలోని నరాలలో కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపునొప్పి వస్తుందని అనుభవపూర్వకంగా తేలింది. కారణాలు: శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ సమయం ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, నెలసరి సమయంలో, గర్భిణులలో, మెనోపాజ్ సమయంలో, స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గులు, అతి వెలుగు, గట్టిశబ్దాలు, ఘాటైన వాసనలు, పొగతాగడం లేదా పొగతాగేవారు ఇంట్లో ఉండటం, మద్యం సేవించ డం లేదా ఇంతర మత్తుపదార్థాలు తీసుకోవడం వంటి అంశాలన్నీ మైగ్రేన్‌కి కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: పార్శ్వపునొప్పి వచ్చే కొన్ని గంటలు లేదా నిమిషాల ముందు చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం, కొన్ని రకాల తినుబండారాలు ఎక్కువగా ఇష్టపడటం, వెలుతురు, శబ్దాన్ని తట్టుకోలేక పోవడం, కళ్లు మసకబారడం, కళ్లముందు మెరుపులు లేదా వెలుతురు కనిపించడం జరగవచ్చు. వీటినే ఆరా అంటారు. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: సాధారణం నుండి అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు ఎక్కువగా నొప్పి ఉండటం, నొప్పి నాలుగు గంటల నుంచి 72 గంటల వరకు ఉండొచ్చు. కడుపులో వికారం లేదా వాంతులు అవడం జరుగుతాయి. పార్శ్వపునొప్పి వచ్చిన తర్వాత కనిపించే లక్షణాలు: చికాకు, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం. హోమియోకేర్ చికిత్స: హోమియోలోని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యవిధానం ద్వారా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన చికిత్స ద్వారా పార్శ్వపు నొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు లేని వ్యాధిని సమూలంగా నిర్మూలించే ప్రత్యేక వైద్యం అందించవచ్చు. మీరు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో తగిన పొటెన్సీలో మందులు తీసుకోండి. మీకు మైగ్రేన్ నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది. -
ఓరుగల్లుకు హైబీపీ
హైదరాబాద్: రాష్ట్రంలో వరంగల్ జిల్లావాసులు హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు! ఈ జిల్లాలో అత్యధికంగా పురుషుల్లో 28 శాతం మందికి అధిక రక్తపోటు(హైపర్‌టెన్షన్) ఉన్నట్టు తేలింది. అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 18 శాతం మంది హైబీపీ బారిన పడ్డారు. వైద్యారోగ్య శాఖ రెండేళ్ల కిందట చేపట్టిన జిల్లా స్థాయి ఇంటింటి సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అయిదేళ్లకోసారి ఆరోగ్య విభాగం నిర్వహించే జిల్లా స్థాయి ఇంటింటి, ఆరోగ్య సర్వే(డీఎల్‌హెచ్‌ఎస్) వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో పొందుపరిచింది. 18 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా అధిక రక్తపోటుకు గురవుతున్నట్టు స్పష్టమైంది. పురుషుల్లో 22 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉంటే మహిళల్లో అది 16 శాతం ఉన్నట్లు తేలింది. పురుషులకు సంబంధించి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 28 శాతం, హైదరాబాద్‌లో 24 శాతం మందికి హైబీపీ ఉంది. మహిళల్లో వరంగల్‌లో అత్యధికంగా 18.2 శాతం, మెదక్‌లో 18.4 శాతం మందికి ఈ సమస్య ఉండగా... అత్యల్పంగా నల్లగొండలో 14 శాతం, ఆదిలాబాద్‌లో 14.2 శాతం మందికి అధిక రక్తపోటు ఉన్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. చిన్నారులను పీడిస్తున్న రక్త హీనత రాష్ట్రంలో చిన్నారులను రక్త హీనత(ఎనీమియా) పీడిస్తోంది. ఆరు నెలల వయసు నుంచి అయిదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు రక్తహీనతతో ఉన్నారు. ఈ వయసున్నవారిలో ఏకంగా 71 శాతం మందికి ఎనీమియా ఉన్నట్టు సర్వేలో తేలింది. 6-19 ఏళ్ల వయసు వారిలో 61 శాతం మందికి, 20 ఏళ్లకు మించిన వారిలో 50 శాతం మందికి రక్తహీనత ఉంది. ఖమ్మంలో అత్యధికంగా 80 శాతం, వరంగల్‌లో 75.5 శాతం, నిజామాబాద్‌లో 75 శాతం, కరీంనగర్లో 72 శాతం మంది రక్తహీనత బారినపడ్డారు. పిల్లలకు పౌష్టికాహారం లేదు పౌష్టికాహార లోపం చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలామంది పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు, బరువుతో లేనట్టు సర్వేలో తేలింది. 0-5 ఏళ్ల పిల్లల్లో.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 33.2 శాతం, మహబూబ్‌నగర్‌లో 33.6 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. నిజామాబాద్ జిల్లాలోనే 45.1 శాతం మంది పిల్లలు వయసుకు తగ్గ బరువు లేరు. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు వరంగల్‌లో అత్యధికంగా 42.1 శాతం, మెదక్‌లో 37.3, కరీంనగర్లో 36.8 శాతం మంది ఉన్నారు. ఆరోగ్య సూచీలో అట్టడుగునే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆరోగ్య సూచీలో సగటు స్థాయిని దాటలేకపోయాయి. శిశు జనన, మరణాల రేటు, మాతృ మరణాల రేటు, పిల్లల పౌష్టికాహారం, సాధారణ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం 23 అంశాలవారీగా జిల్లాల ప్రగతి సూచీని అంచనా వేశారు. మొత్తం 23 అంశాల్లో కనీసం 11 అంశాల్లో మెరుగ్గా ఉన్న జిల్లా రాష్ట్రంలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ఆరు అంశాల్లో మెరుగ్గా ఉన్న ఆదిలాబాద్ జిల్లా శిశు, మాతృ మరణాలు, సురక్షిత ప్రసూతి అంశాల్లో అట్టడుగున ఉంది. అత్యధికంగా 9 అంశాల్లో హైదరాబాద్ జిల్లా ముందంజలో ఉంది. -
బరువు పెరిగితే మతిమరుపు!
పరిపరి శోధన బరువు పెరిగితే జ్ఞాపకశక్తి క్షీణించి మతిమరుపు వస్తుందట! స్థూలకాయానికి, జ్ఞాపకశక్తికి విలోమానుబంధం ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్థూలకాయులకు మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో పాటు మతిమరుపు కూడా తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 18-35 ఏళ్ల వయసు గల వారిపై విస్తృత అధ్యయనం నిర్వహించారు. వారిలో సాధారణ బరువుతో ఉన్నవారితో పోలిస్తే, స్థూలకాయుల్లో జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. స్థూలకాయానికి దారితీసే మానసిక కారణాలను విశ్లేషించడంలో తమ పరిశోధన దోహదపడగలదని వారు చెబుతున్నారు. -
కంచం ముందు చెలరేగితే... మంచం మీద పడాల్సిందే!
అసలు మగాడంటే ఎలా ఉండాలి..? కండలు మెలితిరిగి ఉండాలి. కొండలను పిండి చేసేటంత దూకుడుతో ఉండాలి. పొగరుబోతు పోట్లగిత్తలా ఉండాలి. అంతటి మేరునగధీరుడగు మగాడి భోజన ప్రతాపం ఎలా ఉండాలి..? బొత్తిగా బకాసురుడి లెవల్ కాకపోయినా, ‘మాయాబజార్’లోని ఘటోత్కచుడి స్థాయిలోనైనా ఉండాలి... కుంభాలకు కుంభాలను లాగించేసి రాళ్లనయినా మరమరాలంత తేలికగా హరాయించేసుకోవాలి. ఇలా ఉంటేనే... ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అని ఈ సమాజం సదరు మగాడి మెడలో ఓ వీరతాడు పడేస్తుంది. ‘మాచిస్మో’... ఇది స్టీరియోటైప్ మగలక్షణం. మగ పుట్టుక పుట్టాక ఈ లక్షణం ఎంతో కొంత సహజంగానే అబ్బుతుంది. అయితే, ఇదొక్కటే మగలక్షణంగా సమాజం నూరిపోస్తుంది. ఇందుకు భిన్నంగా ఎవడైనా ప్రవర్తిస్తే, వాడి మూతి మీద ఉన్నది మొలిచిన మీసమే అయినా... అలాంటి వాడిని ఈ సమాజం మగాడిగా గుర్తించ నిరాకరిస్తుంది. అయితే, ఈ లక్షణమే మగాళ్ల ఆయువును అర్ధంతరంగా హరించేస్తోంది. సమాజం భావజాలానికి బానిసలైన మగాళ్లు... పొగడ్తల కిక్కు కోసం తమకు తెలియకుండానే ఒళ్లు గుల్ల చేసేసుకుంటారు. డయాబెటిస్, హైబీపీ వంటి జబ్బులు ఒంట్లోకి చేరినా... తిండిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినా... భోజన ప్రతాపాన్ని ఏమాత్రం నియంత్రణలో పెట్టుకోరు. వైద్యులు చెబితే మాత్రం... వ్యాధులకు భయపడటమా..? అంటూ కంచం ముందు చెలరేగిపోతారు. తమపై సమాజం వేసిన ‘మగ’ధీర ముద్ర చెరిగిపోకుండా ఉండాలనే వెర్రి తాపత్రయంతోనే ఇలాంటి వారు వైద్యుల సలహాలను పెడచెవిన పెడతారని, ఫలితంగా ఏదో ఒకరోజు అర్ధంతరంగా తనువు చాలిస్తారని కోపెన్హాగన్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. -
లయ తప్పుతోంది..!
{Vేటర్‌లో 36 శాతం మందికి హైబీపీ సమస్య 60 శాతం మందికి బీపీ ఉన్నట్లే తెలియదు అధిక రక్తపోటు కారణంగానే హృద్రోగ సమస్యలు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడి నేడు వరల్డ్ హార్ట్ డే.. భాగ్యనగరం హైబీపీకి కేంద్ర బిందువుగా మారుతోంది. నగరంలో 18-40 ఏళ్ల వయస్కుల్లో 36 శాతం మంది , గ్రామీణ ప్రాంతాల్లో 18-20 శాతం మంది అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లు తేలింది. నగరంలో ఏటా వెలుగు చూస్తున్న హృద్రోగ మరణాల్లో అత్యధిక శాతం హైబీపీ కారణంగానే జరుగుతున్నట్లు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తాజా సర్వేలో వెల్లడైంది. మంగళవారం ‘వరల్డ్ హార్డ్ డే’ సందర్భంగా హృద్రోగానికి కారణమవుతున్న హైబీపీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం! సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అతిగా మద్యం సేవించడం, దూమపానం, ఊబకాయం, పని ఒత్తిడి వెరసి గుండె పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా ‘బిగ్ బీపీ క్యాంపెయిన్’పేరుతో హెబీపీపై ఎనిమిది గంటల పాటు సర్వే నిర్వహించి, 1.80 లక్షల మందిని పరీక్షించింది. ఇందులో భాగంగా నగరంలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మహాత్మా గాంధీ బస్టేషన్, ఐఎస్‌సదన్, జూబి్లిహ ల్స్ అపోలో, డీఆర్డీఓ అపోలో, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో 65 క్యాంప్‌ల ఏర్పాటు చేసింది. 19,846 మందిని పరీక్షించి, వీరిలో 11,245 శాంపిల్స్‌ను విశ్లేషించగా, బాధితుల్లో 36 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించింది. 60 ఏళ్ల వారితో పోలిస్తే 18-40 ఏళ్లలోపు వారే మూడు రెట్లు ఎక్కువగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అయితే బాధితుల్లో 60 శాతం మందికి తమకు రక్తపోటు సమస్య ఉన్నట్లు కూడా తెలియకపోవడం గమనార్హం. మందులు వాడుతున్న 42 శాతం మందిలోనే బీపీ కంట్రోల్లో ఉండటం లేదు. ఇప్పటి నుంచే జాగ్రత్తపడక పోతే 2025 నాటికి జనాభాలో మూడు వంతుల మంది హైబీపీ భారిన పడే ప్రమాదం ఉందని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ కో ఆర్డినేటర్ డాక్టర్ శివకుమార్, డాక్టర్ వెంకట్ ఎస్ రామ్, డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ నర్సరాజు పేర్కొన్నారు. ఈ మేరకు వారు సోమవారం తాజ్ దెక్కన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించారు. ఐటీ అనుబంధ మహిళల్లోనూ...: ఇటీవల ఐటీ అనుబంధ రంగాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటు ఇంటి పనుల్లోనూ, అటు ఆఫీసు పనుల్లోనూ వారు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. జీవనశైలి వల్ల రుతుక్రమంలోనూ అనేక మారు ్పలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వంద మంది హృద్రోగ బాధితుల్లో 65 శాతం మంది పురుషులు ఉండగా, 35 శాతం మంది మిహ ళలు ఉంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళ ల్లోనే ఆకస్మిక మరణాల రేటు ఎక్కువ గా ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆకస్మిక మరణాలు 1.2 శాతం ఉండగా, గ్రేటర్లో 4.9 శాతం ఉన్నట్లు గుర్తించామన్నారు. మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపక పోవ డం, వైద్య ఖర్చులకు వెనకాడటం, నొప్పి వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకు వెళ్లడం కూడా ఇందుకు ఓ కారణమని వారు పేర్కొన్నారు. అధిక ఉప్పు ఓ కారణం: డాక్టర్ శివ్‌కుమార్ జె, చీప్ కార్డియాలజిస్ట్, అపోలో, సికింద్రాబాద్తల్లిదండ్రులకు బీపీ ఉంటే వారి సంతానానికి కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది.ఆహారంలో తీసుకుంటున్న ఉప్పు కూడా ఓ ప్రధాన కారణం. {పతి రోజు ఆహారంలో ఉప్పు 2 గ్రాములు తీసుకోవాలి.చాలా మంది 9-15 గ్రాములు తీసుకుంటున్నారు.మందు, మాంసం, పొగ, స్వీట్స్, ఐస్‌క్రీమ్, జంక్ఫుడ్డును తగ్గించాలి. తాజా పండ్లు, కాయకూరలు, ముడిబియ్యం, రాగులు, సజ్జలు తీసుకోవాలి. బీపీ 140/90 మించకుండా చూసుకోవాలిః శ్రీధర్ కస్తూరి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, సన్షైన్యువకులు రక్తపోటు 140/90 మించకుండా, వృద్దుల్లో 150/90 మించకుండా చూసుకోవాలి.పరగడుపున షుగర్‌లెవల్స్ 100 ఎంజీ, తిన్న తర్వాత 110-120 ఉండేలా చూసుకోవాలి. {పతి రోజూ 45 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. పని చేసే చోట ఆరోగ్యకర వాతావరణ ం ఉండేలా చూసుకోవాలి.{పతి మూడు మాసాలకోసారి బీపీ చెక్ చేసుకోవాలి కలుషిత నీరు, గాలితోనే గుండె జబ్బులుః డాక్టర్ ప్రవీణ్ సక్సేనా కలుషిత నీరు తాగడంతో పాటు కాలుష్యంతో కూడిన గాలిని పీల్చడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని ప్రముఖ ఎన్విరాన్మెంట్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ సక్సేనా అన్నారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని సోమవారం బషీర్‌బాగ్‌లోని పోగ్రెసీవ్ మెడిసిన్ సెంటర్లో హృద్రోగులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నగరీకరణ వల్ల నీరు, గాలి కలుషితమై పోవడంతో వీటిలోని ప్రమాదకరమైన రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయన్నారు. హృద్రోగం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. -
పేరెంట్స్‌కు బీపీ... నాకూ రావచ్చా?
హైబీపీ కౌన్సెలింగ్ నా వయసు 35. మా కుటుంబంలో తల్లిదండ్రులకు హైబీపీ ఉంది. ఇది నాకు కూడా వస్తుందా? దీన్ని నివారించడానికి నేనేం చేయాలో చెప్పండి. - నాగరాజు, కూసుమంచి మీ తల్లిదండ్రులకూ, మీ రక్తసంబంధీకులకూ, మీకు చాలా దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. అయితే, మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా కుటుంబంలో హైబీపీ చరిత్ర ఉన్నప్పటికీ దీన్ని చాలావరకు నివారించుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది చాలా సులభం. అది... - ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవాలి. అందులో మీరు తీసుకునే సోడియమ్ పాళ్లు 1500 మి.గ్రా.కు మించకుండా చూసుకోవాలి. - మీరు శారీరక శ్రమను ఇష్టపడుతూ చేయండి. నడక వంటి వ్యాయామాలు దీనికి బాగా ఉపకరిస్తాయి. - బరువు పెరగకుండా చూసుకోండి. మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో దానికి మించకుండా నియంత్రించుకుంటూ ఉండండి. - పొగాకు వాడకాన్ని పూర్తిగా మానేయండి. - ఆల్కహాల్ పూర్తిగా మానేయండి. హైబీపీ ఉన్నవారు ఎప్పుడూ కాస్త చాలా ఒత్తిడితో బాధపడుతున్నట్లుగా (నర్వస్‌గా), చెమటలు పడుతున్నట్లుగా, నిద్రపట్టకుండా ఉండే లక్షణాలతో కనిపిస్తుంటారు కదా. నాకు పైన పేర్కొన్న లక్షణాలేమీ లేవు. కానీ హైబీపీ ఉందేమోనన్న సందేహం వెంటాడుతోంది. నాకు బీపీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? - సురేశ్, హైదరాబాద్ చాలామందికి హైబీపీ ఉన్నట్లే తెలియదు కానీ వాళ్లలో చాలామందికి ఆ వ్యాధి ఏళ్లతరబడి ఉంటుంది. అందుకే దీన్ని ‘సెలైంట్ కిల్లర్’ అంటుంటారు. మీకు లక్షణాలు కనిపించనంత మాత్రాన బీపీ లేదని నిర్ధారణ చేసుకోకండి. మీ రక్తనాళాలు పాడైపోయాక గానీ ఆ లక్షణాలు బయటకు కనిపించవు. మీరు ఒకసారి డాక్టర్‌ను కలిసి బీపీ పరీక్షింపజేసుకోండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బంగాళ దుంప తింటే బీపీ తగ్గుతుందా?
రూట్ ఫ్యాక్ట్స్ అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు రోజూ ఒక మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపను తింటుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది. డయేరియాతో బాధపడుతున్నప్పుడు ఆహారంలో ఉడికించిన బంగాళదుంప తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మితిమీరి తింటే అదే విరేచనాలకు కారణం అవుతుంది కూడా. బంగాళదుంపలో క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే శక్తి ఉంటుంది. బంగాళదుంపలో బీ కాంప్లెక్స్, సి విటమిన్లతోపాటు ఖనిజలవణాలు, కొద్ది మోతాదులో పీచు, కెరటినాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు శరీరం లోపలి అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి. కాబట్టి స్థూలకాయులు, షుగర్ ఉన్నవారు బంగాళదుంప చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. -
హైబీపీ తగ్గాలంటే...
వ్యాయామం * త్రయంగ్ ముఖైక పశ్చిమోత్తాసనాన్ని సాధన చేస్తే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. *రెండు కాళ్లను చాపి, రెండు చేతులు మోకాళ్లపై ఉంచి, వెన్నెముక నిటారుగా పెట్టి సమస్థితిలో కూర్చోవాలి. *కుడికాలును మోకాలు వద్ద మడిచి కుడి పిరుదు కిందగా కానీ పక్కగా కానీ ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులను నిటారుగా పైకి లేపి *పూర్తిగా శ్వాస తీసుకుని శరీరాన్ని పైకి లాగినట్లు చేయాలి. *శ్వాసను నిదానంగా వదులుతూ ముందుకి వంగి గడ్డాన్ని ఎడమ మోకాలుకు ఆనించి రెండు చేతులతో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. ఈ స్థితిలో మోచేతులు నేలకు తాకాలి. ఛాతీని కాలిపైన అదిమి ఉంచాలి. ఈ స్థితిలో శ్వాసను వదిలి ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. *ఇదే క్రమాన్ని ఎడమ మోకాలిని వంచి కుడిపాదాన్ని పట్టుకొని కూడా చేయాలి. ఇలా రోజుకు మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. * ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల హైబీపీ అదుపులోకి రావడంతోపాటు అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం పోతాయి. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి, పార్శ్వపు నొప్పిని నివారించవచ్చు. సూచన: మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు, అధికబరువు ఉన్న వాళ్లు, వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. మడమల సమస్య ఉంటే నిపుణుల సలహాతో జాగ్రత్తగా చేయాలి. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి ఆప్టిడోజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధిక రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించే కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ‘ఆప్టిడోజ్’ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అమ్లోడైపిన్ 2.5 ఎంజీ. టెల్మిసర్టన్ 200ఎంజి, హైడ్రోక్లోరోథిజైడ్ 6.25 ఎంజీ కాంబినేషన్లో ప్రవేశపెట్టిన ఆప్టిడోజ్ పది ట్యాబ్లెట్స్ ధరను రూ.80గా నిర్ణయించినట్లు డాక్టర్ రెడ్డీస్ ఇండియా జనరిక్ హెడ్ అలోక్ సోని తెలిపారు. శుక్రవారం ఆప్టిడోజ్‌ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం సోని మాట్లాడుతూ డాక్టర్ రెడ్డీస్ ఆదాయంలో 25 నుంచి 30% హృదయ సంబంధిత విభాగం నుంచే సమకూరుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ మూడు కాంబినేషన్లు వాడే వారు మోతాదును బట్టి ట్యాబ్లెట్‌కు రూ.12 నుంచి రూ.18 వరకు వ్యయం చేయాల్సి వచ్చేదని, కాని ఇప్పుడు మూడు కాంబినేషన్లు కలిపి రూ.8 కే అందిస్తున్నట్లు తెలిపారు. 10 శాతం వృద్ధి: ఈ ఏడాది వ్యాపారంలో 8-10% వృద్ధి నమోదుకావచ్చని అలోక్ తెలిపారు. కొత్త ఔషధ విధానంతో ధరలు తగ్గడం, ఆర్థిక మందగమనం వంటి కారణాలతో ఈ ఏడాది దేశీయ ఫార్మా రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. తప్పనిసరి ఔషధాలపై ధరలను నియంత్రిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ తీసుకున్న నిర్ణయం కంపెనీకి చెందిన 15-20 డ్రగ్స్‌పైపడుతుందని, ఇది ఆదాయంపై 5% వరకు ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. -
భారత్ ఎట్ హైబీపీ
అధిక రక్తపోటుతో దేశవ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది మృతి సాక్షి, హైదరాబాద్ అధిక రక్తపోటు భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. ఎక్కువ మంది మృతికి కారణమవుతున్న జబ్బుల్లో ఇది రెండో స్థానంలో ఉంది. దీన్ని నియంత్రించకపోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. హైబీపీ కారణంగా లక్షలాది మంది మృతి చెందుతున్నారు. లక్షలాది మంది శాశ్వత వైకల్యం పాలవుతున్నారు. దీనిపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని చెబుతున్నారు నేషనల్ బ్రెయిన్ స్ట్రోక్ రిజిస్ట్రీ కన్వీనర్, సీఎంసీ (క్రిస్టియన్ మెడికల్ కాలేజీ) లూథియానా న్యూరో విభాగాధిపతి డా. జయరాజ్ పాండియన్. బ్రెయిన్ స్ట్రోక్ మీద హైదరాబాద్‌లో జరిగిన రెండ్రోజుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అవి ఆయన మాటాల్లోనే.. ఉప్పువల్లే ముప్పు మన దేశీయులు ఉప్పు ఎక్కువగా వాడుతున్నారు. ఇందువల్లే ఎక్కువ మంది అధిక రక్తపోటు(హైబీపీ) బారిన పడుతున్నారు. మనిషికి రోజుకు 4 లేదా 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. కానీ 15 నుంచి 20 గ్రాములు వాడుతున్నారు. ఆహారంలో ఉప్పుతో పాటు అధికంగా కొవ్వు పదార్థాలు తినడం, పొగ తాగడం, మద్యపానం, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ (మెదడులో నరాలు చిట్లిపోవడం) వస్తోంది. రాష్ట్రంలో కేసులు ఎక్కువే నాలుగైదేళ్లుగా దేశంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువయ్యాయి. ఏటా 15 లక్షల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. 4 లక్షల మందికి పైగా మృతి చెందుతున్నారు. 7 లక్షల మంది వైకల్యానికి గురవుతున్నారు. ఇవి ప్రాథమిక గణాంకాలు మాత్రమే. ఇంకా ఎక్కువ కేసులు నమోదై ఉండొచ్చు. నిమ్స్ సహా దేశవ్యాప్తంగా 10 కేంద్రాల్లో బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం కేసుల వివరాలను పక్కాగా నమోదు చేయడం త్వరలో ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లో ఏటా లక్ష మందిలో 148 మందికి బ్రెయిన్‌స్ట్రోక్ వస్తోంది. మిగతా నగరాలతో పోల్చుకుంటే ఇది ఎక్కువే. ఈ కేసుల్లో 65 శాతం పట్టణాల్లో, 35 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఈ స్ట్రోక్ 45 ఏళ్ల లోపు వారికే వస్తూండటం ప్రమాద సూచిక. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారికి తొలి 4 గంటల్లోగా సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయం నుంచి, వైకల్యం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. నియంత్రణ సాధ్యమే ఉప్పు వాడకం బాగా తగ్గించుకోవాలి, కొవ్వులను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. ముఖ్యంగా పొట్టేలు మాంసం తినడం తగ్గించాలి. నూనెలో వేపిన మాంసాహారం వాడకాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించుకోవాలి. రోజూ కనీసం 40 నిమిషాలు వేగంగా నడవాలి.. ఇలా చేయడం ద్వారా హైబీపీని అదుపు చేయొచ్చు. యోగాతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. -
మూత్రపరీక్షతో పిల్లల్లో హైబీపీ ముప్పు గుర్తింపు
వాషింగ్టన్: పిల్లల్లో అధికరక్తపోటు (హైబీపీ) ముప్పును మూత్రపరీక్షతో గుర్తించవచ్చని ఆగస్టాలోని జార్జియా రీజెంట్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. పరిశోధనలో భాగంగా.. 10-19 ఏళ్ల మధ్య ఉన్న 19 మందికి మూత్రపరీక్ష నిర్వహించారు. వారిలో సోడియం స్థాయిలు 7 వద్ద ఉన్నవారిలో హైబీపీ ఉన్నట్లు గుర్తించామని పరిశోధన బృందం సారథి గ్రెగరీ హార్ష్ఫీల్డ్ తెలిపారు. -
హైబీపీనా... నోటెన్షన్
తేలికపాటి శస్త్ర చికిత్సతో బీపీకి చెక్ రక్తపోటు పెంచే ‘కరోటిడ్’ అవయవాల గుర్తింపు వాటిని తొలగిస్తే.. నియంత్రణలోకి రక్తపోటు ఎలుకలపై ప్రయోగం విజయవంతం మూడేళ్లలోగా అందుబాటులోకి మీరు ‘అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)’తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడుతున్నా రక్తపోటు నియంత్రణలో ఉండడం లేదా? మీలాంటి వారికి ఓ శుభవార్త. ‘అధిక రక్తపోటు’ను శాశ్వతంగా నియంత్రణలో ఉంచే సరికొత్త చికిత్సా విధానం అందుబాటులోకి రానుంది. ‘అధిక రక్తపోటు’కు కారణమైన ‘కరోటిడ్’ అవయవాలను బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండె నుంచి మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలపై బియ్యపు గింజ పరిమాణంలో ఉండే ఈ రెండు అతిచిన్న అవయవాలను తొలగిస్తే.. ‘రక్తపోటు’ నియంత్రణలో వస్తుందని వారు చెబుతున్నారు. ఇప్పటికే ప్రయోగశాలలో ఎలుకలపై విజయవంతమైన ఈ చికిత్సను.. 20 మంది మనుషులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మూడేళ్లలోగా ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ‘కరోటిడ్’ రక్తనాళాలపై బియ్యపు గింజ పరిమాణంలో ఉండే రెండు అతిచిన్న అవయవాలు ‘అధిక రక్తపోటు’కు కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దవడల కింద, గొంతుకు రెండు వైపులా ఉండే ఈ అవయవాల్లో కొన్ని నాడులు కలిసి క్లస్టర్‌గా ఏర్పడి ఉంటాయి. వీటి ద్వారా ఎక్కువ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి రక్తంలోని ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్‌ల స్థాయిని పరిశీలిస్తూ మెదడుకు సంకేతాలు పంపుతుంటాయి. అయితే ఒక్కోసారి ఈ ‘కరోటిడ్’ అవయవాలు ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్‌ల స్థాయిపై మెదడుకు తప్పుడు సంకేతాలను పంపుతున్నట్లుగా గుర్తించినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జూలియన్ పాటన్ చెప్పారు. ఈ తప్పుడు సంకేతాల కారణంగా మెదడు శరీరంలో రక్తపోటును అధిక స్థాయిలో ఉంచేలా ఆదేశిస్తుందని తెలిపారు. తొలుత రెండు ‘కరోటిడ్’ అవయవాల్లో ఒకదానిని మాత్రమే తొలగించి పరిశోధన చేస్తున్నామన్నారు. మందులు, జీవన విధానంలో మార్పులతో రక్తపోటు నియంత్రణలోకి రానివారికి ఒక చిన్న శస్త్ర చికిత్స ద్వారా ‘కరోటిడ్’ అవయవాలను తొలగిస్తే చాలు అని జూలియన్ పేర్కొన్నారు.