బరువు పెరిగితే మతిమరుపు!
పరిపరి శోధన
బరువు పెరిగితే జ్ఞాపకశక్తి క్షీణించి మతిమరుపు వస్తుందట! స్థూలకాయానికి, జ్ఞాపకశక్తికి విలోమానుబంధం ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్థూలకాయులకు మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో పాటు మతిమరుపు కూడా తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 18-35 ఏళ్ల వయసు గల వారిపై విస్తృత అధ్యయనం నిర్వహించారు. వారిలో సాధారణ బరువుతో ఉన్నవారితో పోలిస్తే, స్థూలకాయుల్లో జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. స్థూలకాయానికి దారితీసే మానసిక కారణాలను విశ్లేషించడంలో తమ పరిశోధన దోహదపడగలదని వారు చెబుతున్నారు.