బంగాళ దుంప తింటే బీపీ తగ్గుతుందా? | Consumption of potatoes is in BP? | Sakshi
Sakshi News home page

బంగాళ దుంప తింటే బీపీ తగ్గుతుందా?

Published Mon, Jul 7 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

బంగాళ దుంప తింటే బీపీ తగ్గుతుందా?

బంగాళ దుంప తింటే బీపీ తగ్గుతుందా?

రూట్ ఫ్యాక్ట్స్
 
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు రోజూ ఒక మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపను తింటుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది.
     
డయేరియాతో బాధపడుతున్నప్పుడు ఆహారంలో ఉడికించిన బంగాళదుంప తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మితిమీరి తింటే అదే విరేచనాలకు కారణం అవుతుంది కూడా. బంగాళదుంపలో క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే శక్తి ఉంటుంది.
     
బంగాళదుంపలో బీ కాంప్లెక్స్, సి విటమిన్‌లతోపాటు ఖనిజలవణాలు, కొద్ది మోతాదులో పీచు, కెరటినాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు శరీరం లోపలి అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి. కాబట్టి స్థూలకాయులు, షుగర్ ఉన్నవారు బంగాళదుంప చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది.
     
పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement