
ఇంగ్లిష్‌లో బీపీ అని సంక్షిప్తంగా చెప్పే ఓ ఆరోగ్య సమస్య అసలు రూపం బ్లడ్ ప్రెషర్. కానీ నిజానికి దీన్ని హైబీపీగా చె΄్పాలి. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఒత్తిడితో రక్తం ప్రవహించడమని అర్థం. తెలుగులో దీన్నే రక్తపోటు అంటారు. దీని నార్మల్ విలువ 140/90. ఉండాల్సిన విలువకంటే ఎక్కువ ఒత్తిడితోరక్తం ప్రవహిస్తే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు తావిస్తుంది. ఒకప్పుడు కాస్త పెద్ద వయసు వచ్చాకే బీపీ, డయాబెటిస్ కనిపించేవి. కానీ ఇప్పుడు మన దేశంలో అప్పుడే తమ కౌమార దశ దాటి అప్పుడప్పుడే యువకులు/యువతులుగా మారుతున్న వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. ఎన్నో అనర్థాలకు కారణమయ్యే ఈ హైబీపీ సమస్య గురించి విపులంగా తెలుసుకోవడం కోసమే ఈ కథనం.
బీపీ కారణంగా పక్షవాతం, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవడం లాంటి అనర్థాలతోనూ, అలాగే కిడ్నీల వంటి ఎండ్ ఆర్గాన్స్ వైఫల్యంతో ఏటా ఎంతో మంది మరణిస్తున్నారు.
ఇది ఉన్న విషయమే బయటకు తెలియకపోవడం, అది దెబ్బతీసే అవయవాలైన కిడ్నీ వంటివి పూర్తిగా చెడిపోయేవరకు వాటి లక్షణాలేమీ బయటకు కనిపించకపోవడంతో ఇది నిశ్శబ్దంగా అనర్థాలను తెచ్చిపెట్టి, కొన్నిసార్లు మరణాలకు కారణమవుతుంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. హైబీపీ తెచ్చిపెట్టే సమస్యలేమిటి, ఎలా ఉంటాయి, వాటిని అధిగమించడం ఎలా వంటి అనేక విషయాలను తెలుసుకుందాం.
హై–బీపీ అంటే ఏమిటి?
కొంతమంది తాము అతిగా ఉద్రేకపడ్డా లేదా బాగా కోపం ఫీలయినప్పుడు తమకు బీపీ పెరిగిందంటుంటారు. అలాగే మరికొందరు తమకు బాగా తలనొప్పిగా ఉండటం, చెమటలు పడుతుండటం, నర్వస్‌గా ఉండటం, నిద్రపట్టకపోవడం, బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఫీలయినప్పుడు ఆ టైమ్‌లో బీపీ పెరిగిందని చెబుతుంటారు.
అయితే అలా జరిగినప్పడు బీపీ పెరిగి ఉండవచ్చు. కానీ కొందరిలో బీపీ పెరిగాక అది అలాగే కంటిన్యూవస్‌గా ఉండటాన్నే హైబీపీగా చెప్పవచ్చు. ఇక కొంతమందిలో తాము హాస్పిటల్‌కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. ఇంటిదగ్గర రీడింగ్ తీసినప్పుడు నార్మల్‌గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు.
ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరగడం, అలాగే తమలో భావోద్వేగాలు చెలరేగినప్పుడు రక్తపోటు కొంతమేరకు పెరగడం జరగవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరిగినప్పటికీ దాన్ని హైబీపీగా పరిగణించడం జరగదు. అయితే ఓ వ్యక్తిలో అనేక పర్యాయాలు రీడింగ్ తీశాక కూడా... రక్తపోటు (సిస్టోల్ / డయాస్టోల్) విలువలు 140/90 అనే కొలతకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు.
హైబీపీ ఎన్ని రకాలు...
హైబీపీని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్. అంటే ఇది మామూలుగా వచ్చే బీపీ అనుకోవచ్చు. ఇతరత్రా ఎలాంటి కారణం లేకుండా వచ్చే బీపీ ఇది. ఇది చాలా సాధారణంగా కనిపించే హైపర్‌టెన్షన్. ఇక రెండోదాన్ని సెకండరీ హైపర్‌టెన్షన్‌గా చెప్పవచ్చు. ఇది శరీరంలో ఏదో ఇతరత్రా కారణాల వల్ల వస్తుంది.
అంటే బాధితులకు ఒంట్లో థైరాయిడ్ సమస్య ఉండటం వల్లనో, లేదా మూత్రపిండాల వ్యాధి వంటి ఇతర సమస్యల కారణంగా రక్త΄ోటు పెరిగిపోవడం జరుగుతుంది. అందుకే ఒంట్లో బీపీ ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు థైరాయిడ్, కిడ్నీ వంటి ఇతరత్రా సమస్యలేమైనా ఉన్నాయా అంటూ చెక్ చేయించుకుని, వాటికి మందులు వాడాలి. ఈ సెకండరీ కారణాలు చక్కబడితే అప్పుడు బీపీ తగ్గుతుంది. కానీ మొదటిదైన ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ అలా కాదు. ఆ సమస్యకు డాక్టర్ల సూచన మేరకు బీపీని నియంత్రణలో ఉంచే మాత్రలు వాడటం అవసరం.
చిన్నపిల్లల్లోనూ హైబీపీ ఉండవచ్చా?
చిన్నపిల్లల్లో లేదా అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న యువకుల్లో హైబీపీ ఉండక΄ోవచ్చని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్‌టెన్షన్) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు వాళ్లలోనూ, కౌమారం (టీనేజ్)లో ఉన్న పిల్లలు... అంటే 13 నుంచి 19 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది.
అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణకు దాన్ని చాలా జాగ్రత్త (మెటిక్యులస్)గా కొలవాలి. పిల్లల్లో బీపీని తెలిపే చార్ట్‌ను ‘సెంటైల్ చార్ట్’ అంటారు. పిల్లల తాలూకు నార్మల్ విలువలు... వాళ్ల వయసునూ, జెండర్‌నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. పెద్దవాళ్లలో నార్మల్స్ వాళ్లలో నార్మల్ విలువకు సమానం కాదు.
ఉదాహరణకు వారిలో డయాస్టోల్ బీపీ కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు.
లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా?
లక్షణాలేమీ బయటకు కనిపించక΄ోయినప్పటికీ చాలామందికి హైబీపీ ఉండే అవకాశముంది. నిజానికి చాలామందిలోనూ తమకు హైబీపీ ఉన్న విషయమే తెలియకుండా చాలాకాలంగా వాళ్లలో హైబీపీ ఉండే అవకాశం ఉంది. ఇలా చాలాకాలంగా హైబీపీ ఉండటం వల్ల మానవ దేహంలో ఎండ్ ఆర్గాన్స్‌గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి.
అవి పూర్తిగా పాడైపోయాకగానీ ఆ అవయవాలు దెబ్బతిన్నప్పుడు కనిపించే లక్షణాలు బయటపడవు. ఈలోపు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగి΄ోవచ్చు. అందుకే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. కేవలం లక్షణాలు కనిపించనంత మాత్రాన హై–బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్‌ను కలిసి, చెకప్ చేయించుకుని హైబీపీ లేదన్న నిర్ధారణ జరిగాకే నిశ్చింతగా ఉండాలి.
హైబీపీ మందులు చాలాకాలంపాటు వాడుతుంటే, వాటికే అలవాటు పడి... ఇక మున్ముందు బీపీ తగ్గదేమో?
ఒకసారి హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తుంటారు. వారిలోని బీపీ తీవ్రతను బట్టి కొందరికి రెండు, మరికొంతమందికి మూడు, ఇంకొందరిలో నాలుగు... ఇలా మందులను వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. బీపీ కొలతలను తరచూ చూస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్ చేస్తుంటారు.
జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందుల సంఖ్యా, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... మందులకు అలవాటు పడి... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం అనే అంశాలకు ఆస్కారం లేదు.
కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చాక మందులు మానేయవచ్చా?
ఒకసారి హైబీపీ నిర్ధారణ జరిగి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో రక్తపోటు అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ అదుపులోనే ఉంది కదా అని చాలామంది మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియనే తెలియదు.
అందుకే ఒకవేళ హై–బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మళ్లీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ పెరిగినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించి, ఉన్న హై–బీపీ విలువకు తగినట్లుగా తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూనే ఉండాలి.
ఒకవేళ ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు కోసం మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. అందుకే బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. అలాగే తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండటం కూడా తప్పనిసరి.
బీపీ పెరుగుతూ, తగ్గుతూ ఉండటం తరచూ జరగవచ్చంటారు కదా... కాబట్టి హైబీపీ లేకపోయినా, ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడవచ్చు కదా?
హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. హై–బీపీ తాలూకు లక్షణాలు అని పేర్కొనే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలను బట్టే బీపీ ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశమే ఉండదు.
ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి బాడీ పోష్చర్ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గనూవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్ హై΄ోటెన్షన్’ అంటారు. అప్పుడు తల తిరగడం గానీ లేదా కొందరిలో ముందుకు తూలిపడిపోతామనే భావన కలగవచ్చు.
బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్ వంటి లక్షణాలే కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక సందర్భాల్లో అనేక మార్లు అలాగే రకరకాల వేళల్లో కొలిచి చూశాకే... హైబీపీని నిర్ధారణ చేస్తారు. ఒక్కోసారి ఐదు రోజుల పాటు రోజుకు మూడు సార్ల చొప్పున కొలతలు తీశాకే నిర్ధారణ చేస్తారు. కేవలం ఒకటి లేదా రెండు కొలతలతో హైబీపీ నిర్ధారణ చేయరు కాబట్టి డాక్టర్లు పొరబడే అవకాశమే ఉండదు.
హైబీపీకి బార్డర్‌లైన్‌లో ఉన్నవారికి మందులు అవసరం లేదు కదా?
హైబీపీ వస్తున్న సూచనలు కనిపిస్తున్నవారు... అంటే హైబీపీ విలువలు మరీ ఎక్కువగా కాకుండా బార్డర్‌లైన్‌లో ఉన్నవాళ్లు మందులు వాడనక్కర్లేదనీ, వాళ్లు మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ ఉంటే చాలని చెబుతుంటారు. అంటే... క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారన్నది కొందరి వాదన.
ఇక చాలామంది తాము మందులు వాడబోమనీ, మంచి క్రమశిక్షణతో వ్యాయామం, ఆహారనియమాలు పాటించడం వంటి జీవనశైలిని అనుసరిస్తూ, హైబీపీని అదుపు చేయగలమని మొదట్లో ప్రతిఒక్కరూ అనుకుంటుంటారు. అయితే ఒకటి రెండు రోజులు పాటించినప్పటికీ... చాలామంది ఈ జీవనశైలి నియమాలను సరిగా పాటించ(లే)రు.
ఇలాంటి వాళ్లలో తమ కీలకమైన అవయవాలపైన హై–బీపీ తన దుష్ప్రభావం చూపినప్పుడు జరిగే నష్టం... అప్పుడు అవసరమైన వైద్యపరీక్షలకూ, చికిత్సకూ అవసరమైన ఆర్థికభారం, ఏదైనా ఎండ్ ఆర్గాన్ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి డిసీజ్ బర్డెన్‌ను విపరీతంగా పెంచుతాయి. అంతేకాదు... కుటుంబ సభ్యులపైనా ఆర్థిక, భావోద్వేగపరమైన ఒత్తిడీ చాలా ఎక్కువగా పడుతుంది.
ఆ భారంతో పోలిస్తే... అసలు మనపై ఎలాంటి బరువూ పడకుండా చాలా చవగ్గా దొరికే మందుల్ని రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం వల్ల చాలాకాలం పాటు కీలకమైన అవయవాలను సంరక్షించుకుంటూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ఎన్నో వేదనాభరితమైన జబ్బులను తప్పించుకోవచ్చు. పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు హైబీపీని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.
హై–బీపీ ఉన్నవారు ఉప్పు పూర్తిగా మానేయాలా?
హై–బీపీ ఉన్నవాళ్లలో ఉప్పు వల్ల రక్త΄ోటు మరింత పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ముందుజాగ్రత్తగా ఉప్పు మానేసేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే మానవ దేహంలోని కీలకమైన జీవక్రియలకు ఉప్పు / లవణాలు అవసరం. ఉదాహరణకు మెదడు నుంచి నాడుల (నర్వ్స్) ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలన్నీ ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి.
ఉప్పు పూర్తిగా మానేస్తే హైపోనేట్రీమియా అనే కండిషన్ వచ్చి, ఒక్కోసారి అది ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం సరికాదు. దానికి బదులుగా ఇంతకుముందు వాడుతున్న మోతాదులో సగం లేదా సగానికంటే తక్కువగా వాడటం మంచిదని గుర్తుంచుకోవాలి.
మనం వాడే రోజువారీ ఆహారాల్లో మనకు తెలియకుండానే ఉప్పు ఉంటుంది. మనం తీసుకునే చిప్స్ వంటివీ లేదా బేకరీ పదార్థాల్లో, ప్యాకేజ్‌డ్ ఫుడ్స్‌లో ఉప్పు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఉప్పుకూ బీపీ పెరుగుదలకు నేరుగా సంబంధముంటుంది. అంతేకాదు... ఆకుకూరల్లోనూ లవణాల రూపంలో ఉప్పు ఉంటుంది. ఉప్పును చాలాపరిమితంగా తీసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే హైబీపీ ఉన్నవాళ్లలో ఒక వ్యక్తికి కేవలం రోజుకు రెండు గ్రాముల ఉప్పు అనే మోతాదు సరిపోతుంది.
మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలోకి రాలేదంటే... ఆ పేషెంట్ మందులకు రెసిస్టెన్స్ పెంచుకోవడం వల్లనేనా?
కొంతమంది బీపీ నిర్ధారణ సమయంలో ... మొదటిసారి మాత్రమే డాక్టర్‌ను కలుస్తారు. అప్పుడు డాక్టర్ రాసిన మందులనే ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్ సరి΄ోతోందా, లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు.
ఇవన్నీ సరికాదు. అలాగే మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా సరికాదు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి హై–బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాల సమయం పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే వాస్తవం, అదే నిజమనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది కూడా సరికాదు.
అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్‌కు వెళ్తుండాలి. తరచూ పరీక్ష చేయిస్తూ తమలో రక్త΄ోటు అదుపులో ఉందా లేదా అన్నది తెలుసుకుంటూ, ఒకవేళ బీపీ ఇంకా పెరిగితే దాన్ని బట్టి మందులు మార్చడం లేదా మోతాదు మార్చడం జరుగుతుంది.
బీపీ అకస్మాత్తుగా పెరిగిపోతే...
బీపీ అకస్మాత్తుగా పెరగడం చాలా ప్రమాదమని గుర్తించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ... బీపీ విలువ నార్మల్ కంటే ఎక్కువగానే ఉంటుంది కదా! ఈ అపోహ చాలామందిలో ఉంది. ఇది చాలాకాలం పాటు రాజ్యమేలింది కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క.
తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకూ హైబీపీ వస్తుందా?
తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చేలాంటి జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడావచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment