China HMPV : కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం తాలూకు గుర్తులు ఇంకా సమసి పోనేలేదు. ఇంతోనే చైనాలో మరో వైరస్ విజృంభణ ఆందోళన రేపుతోంది. కరోనా బీభత్సం జరిగిన ఐదేళ్ల తరువాత చైనాలో HMPV వేగంగా విస్తరిస్తోంది. ఈవైరస్ సోకిన రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయని, శ్మశాన వాటికల్లో స్థలంకూడా లేదంటూ , సోషల్ మీడియా వస్తున్న వీడియోలు, నివేదికలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.
ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోనే ప్రభావం అధికంగా ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 లాంటివి వైరస్‌లు చైనాలో వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది.
అసలేంటీ హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్
2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.
అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే ఇతర వైరస్‌ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.
హెచ్ఎంపీవీ లక్షణాలు
ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.
దగ్గు
జ్వరం
జలుబు,
గొంతు నొప్పి
ఊపిరి ఆడకపోవడం
జాగ్రత్తలు
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్‌బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment