Potassium
-
జుట్టుకు పోషకాలతో పట్టు
ఇటీవలి కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని వెనుక వంశపారంపర్య కారణాలు ఉంటే దానిని నివారించడం కష్టం. అయితే బట్టతలను కొంతకాలం పాటు వాయిదా వేయచ్చు. కానీ ప్రతిసారీ ఈ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల మాత్రం రాదని తెలుసుకోవాలి. జుట్టు రాలడం లేదా బట్టతల రావడం అనేది మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి జన్యుపరమైన సమస్య కాదని సైన్స్ చెబుతోంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొన్ని అవసరమైన మూలకాలు లేకపోవడమే. కానీ ఆ మూలకాల లోపం వంశపిరంపర్యంగా ఉంటుంది. వారసత్వం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అయిన జన్యువులది మాత్రమే కాదు. బదులుగా కొన్నిసార్లు పోషకాల లోపం కూడా ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది.బయోటిన్బయోటిన్ అనేది జుట్టుకు అవసరమైన మూలకం. ఇది లేకపోవడం వల్ల జుట్టు పలుచబడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు కూడా విరిగిపోతాయి. కండరాల అలసట, బలహీనత, మైకం, కాళ్ళలో తిమ్మిరి వంటివి బయోటిన్ లోపం లక్షణాలు. ఇది శరీరానికి అవసరమైన మూలకం. కానీ జుట్టు, గోళ్లకు ఇది చాలా ముఖ్యమైనది.రాగి: సాధారణంగా శరీరంలో రాగి లోపం ఉండదు. కానీ ఏదైనా కారణం వల్ల అది లోపిస్తే జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా భారతదేశం వంటి దేశంలో శరీరంలో కాపర్ సమస్య ఉండదు. కాని ఇది లోపిస్తే మోకాలు, కీళ్లలో భరించలేని నొప్పి ఉంటుంది.కొల్లాజెన్: కొల్లాజెన్ అనేది జుట్టు మూలాలను బలపరిచే మూలకం. ఇది జుట్టుని మందం చేస్తుంది. దీని లోపం వల్ల జుట్టు బలహీనపడి ఎక్కువ ఊడిపోతుంది.విటమిన్ బి6జుట్టుకి విటమిన్ బి కాంప్లెక్స్ చాలా ముఖ్యం. దీని లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. విటమిన్ బి 6 మన జుట్టు ఆరోగ్యానికి సంబంధించినది. ఈ విటమిన్ లోపం ఉన్నట్లయితే జుట్టు బలహీనంగా మారుతుంది. ఎక్కువగా ఊడిపోయి బట్టతల వస్తుంది.జింక్జింక్ లోపం ప్రధాన లక్షణం జుట్టు వేగంగా రాలడం. మీ జుట్టు అకస్మాత్తుగా రాలడం ్ర΄ారంభించిందని మీకు అనిపిస్తే అది జింక్ లోపం వల్ల కావచ్చునని భావించి జింక్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు. అందువల్ల ఒకసారి మంచి ట్రైకాలజిస్టును కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకుని ఏ కారణం వల్ల జుట్టు ఊడి΄ోతోందో తెలుసుకుని ఆ విటమిన్ లోపాన్ని పూరించడం ద్వారా జుట్టు రాలకుండా నివారించుకోవచ్చు.కండరాల నొప్పులా? మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పోటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. పోటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పోటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పోటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. మనం తినే ఆహారాల నుంచే మనకు పోటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పోటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.ఎందులో లభిస్తుంది?కోడిగుడ్లు, టమాటాలు, చిలగడ దుంపలు, విత్తనాలు, నట్స్, అరటి పండ్లు, యాప్రికాట్స్, చేపలు, తృణ ధాన్యాలు, పెరుగు, ΄ాలు, మాంసం, తర్బూజా, క్యారెట్, నారింజ, కివీ, కొబ్బరినీళ్లు, బీట్రూట్ వంటి ఆహారాల్లో పోటాషియం విరివిగా లభిస్తుంది -
ఇకపైన పొటాషియం ఉప్పు వాడకం?!
మానవ జీవితంలో ప్రాధాన్యం ఉన్న లవణం ఉప్పు (సోడియం క్లోరైడ్). దీన్ని ఆహారంలో తీసుకునే పరిమాణాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుందనేది ప్రచారంలో ఉన్న విషయం. ఒకప్పుడు అయోడిన్ అనే సూక్ష్మ పోషకం లోపం కారణంగా చాలామంది ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నందున అయోడిన్ కలిపిన ఉప్పును వాడుతూ ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. పొటాషియాన్ని తగినంతగా తీసుకోకపోవడం వల్ల బీపీ (బ్లడ్ ప్రెషర్) పెరుగుతున్నదనీ, అందువల్ల ఉప్పులో పొటాషియంను కలిపి తీసుకోవాల్సిన అవసరం ఉందనీ పరిశోధకుల సలహా.ప్రజల్లో అయోడిన్ లోపాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వపరంగా నిర్ణయాలు జరిగాయి. పరిశ్రమల వారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కనుక ప్రపంచంలో అందరికీ ఉప్పుతో పాటు అయోడిన్ కూడా అందింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక ఆరోగ్య సమస్యకు అన్ని దేశాల వారూ కలిసి సమాధానం తెలుసుకుని అమలు చేయగలిగారు. మరి అదే విధంగా పొటాషియం లోపాన్ని తగ్గించడానికి ఇంతటి కృషి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? మనకు తెలిసి హైపర్ టెన్షన్, లేదా అధిక రక్తపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్య. అసలు నిజానికి అనారోగ్యాలు, మరణాలకు ఇదే ఎక్కువగా కారణంగా ఉంటున్నది. అందుకు కారణం ఏమిటి అని వెతికితే ఉప్పు ఎక్కువగా తినడం అని తెలిసిపోయింది. ఇంకేముంది, అందరూ వీలైనంత తక్కువగా ఉప్పు తింటున్నారు. చాలామంది కారం కూడా తినడం లేదు. మొత్తానికి తిండి తీరు మారిపోయింది. ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉన్నది. ఉప్పు ప్రభావం అందరి మీద ఉంటుంది అనడానికి లేదు. ప్రభావం కనిపించే 50 శాతం మందిలో మాత్రం అది సూటిగా తెలిసిపోతుంది. ఉప్పు ప్రభావం మీద జన్యుపరంగా వచ్చే లక్షణాల పాత్ర ఉందని తెలిసింది. పరిశోధకులు అంతా పూనుకుని ఈ విషయం గురించి ఎన్నో సంగతులను కనుగొన్నారు. ఇప్పుడు అందరూ పొటాషియం కలిపిన ఉప్పు తింటే ఈ బ్లడ్ ప్రెషర్ సమస్య తగ్గుతుందని అంటున్నారు. అంటే మనం తినే తిండి తీరు మరొకసారి మారిపోతుందన్నమాట. ఏదో ఒక పేరున అందరూ సోడియం బాగా తింటున్నారు. అవసరం కన్నా ఎక్కువ తింటున్నారు. కనుక రక్తపోటు పెరుగుతున్నది. ఎవరికీ ప్రయత్నించి పొటాషియం తినడం అన్నది తెలియదు. శరీరానికి అవసరమైనంత పొటాషియం తినేవారు మొత్తం జనాభాలో 14 శాతం మాత్రమే ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. సోడియం పూర్తిగా తినకుండా ఉండడం కుదరదు. అదే సమయంలో శరీరంలో సోడియం – పొటాషియం ఉండవలసినంత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంగతి ఎవరికీ అంత వివరంగా తెలియదు. అంటే మరోసారి ప్రభుత్వాలు, పరిశ్రమల వారు పరిస్థితిని గుర్తించి పనిలోకి దిగవలసిన సమయం వచ్చింది. ఒకప్పుడు ఉప్పుతో కలిపి అయోడిన్ తిన్నట్టే, ఇప్పుడు ఉప్పుతోనూ, మరిన్ని రకాలుగానూ సోడియం బదులు పొటాషియం తీసుకోవాలి. ఈ మార్పు వస్తే వెంటనే బ్లడ్ ప్రెషర్ అంటే రక్త పోటు అనే సమస్యకు దానంతట అదే సమాధానం దొరుకుతుంది. కనుక ప్రస్తుతం మన పరిస్థితిని గుర్తించుకొని వెంటనే అదనంగా పొటాషియం తీసుకోవడం మొదలుపెట్టాలి. పరిశ్రమల వారు ఉప్పుతోనూ, తిండి పదార్థాలతోనూ పొటాషియం అదనంగా అందించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి. రక్తపోటు పెరగడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలకు ప్రపంచం తల్లడిల్లి పోతున్నది. సోడియంతో పాటు పొటాషియం తిన్నందుకు రుచిలో ఎటువంటి తేడా కూడా రాదు. ఇది అందరూ గుర్తించవలసిన మరొక విషయం. సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ఉన్న ‘జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే సంస్థలో పనిచేస్తున్న బ్రూస్ నీల్ పొటాషియం వాడుక మంచిదని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం తినే తిండిలో ఎంత పొటాషియం ఉంది అని గుర్తించడం కష్టం. అందరూ అవసరమైన దానికి తక్కువ తీసుకుంటున్నారు అన్నది మాత్రం నిజం. కనీసం 3.5 గ్రాముల పొటాషియం శరీరానికి అందాలి. అందుకోసం అందరూ పండ్లు ఎక్కువగా తినాలట! అన్నట్టు అరటిపళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పళ్లలో కూడా ఉంటుంది. ఏదో రకంగా పొటాషియం శరీరానికి అందే పద్ధతులు రావాలి. త్వరలోనే రక్తపోటు సమస్య తగ్గుతుందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. డా. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత ‘ 98490 62055 -
ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: రబీ సీజన్లో పాస్ఫరస్, పొటాషియం (పీ అండ్ కే) సంబంధిత ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 50 కేజీల డీఏపీ బస్తా ధరను రూ.1,350గానే కొనసాగించాలని నిర్ణయించింది. 2023–24 రబీ సీజన్(2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 దాకా)లో పోషకాల ఆధారిత సబ్సిడీకి ఎరువులు, రసాయనాల శాఖ చేసిన ప్రతిపాదనలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియాకు వెల్లడించారు. రైతులకు అందుబాటు ధరల్లో చాలినన్ని ఎరువులను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయంలు పాత ధరకే లభిస్తాయి. అంటే బస్తా నత్రజని పాత రూ.1,470 ధరకే, ఎస్ఎస్పీ(సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) బస్తా దాదాపు రూ.500కు దొరుకుతాయి. ఫొటాష్(ఎంఓపీ) బస్తా ధర రూ.1,655కు తగ్గనుంది’ అని మంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్‌కు రూ.38,000 కోట్ల ఎరువుల సబ్సిడీని కేంద్రం అందజేయడం తెలిసిందే. మొత్తం వార్షిక ఎరువుల సబ్సిడీ రూ.2.55 లక్షల కోట్లకు పెరిగిందని ఠాకూర్ చెప్పారు. -
దారుణం.. కూతుర్ని చంపమని సుపారీ ఇచ్చిన తండ్రి..
లక్నో: కన్నతండ్రే కూతురి పాలిట విలన్‌గా మారాడు. ఆమె ఓ యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి మందలించాడు. అతడ్ని దూరం పెట్టమని పదే పదే హెచ్చరించాడు. అయినా ఆమె వినకపోవడంతో కిరాతక ఆలోచన చేశాడు. తన కుమార్తెను చంపమని హాస్పిటల్లో వార్డు బాయ్‌కి రూ.లక్ష సుపారీ ఇచ్చాడు. దీంతో అతడు ఆమెకు పోటాషియం క్లోరైడ్ అధిక మోతాదులో ఇంజెక్ట్ చేశాడు. ఫలితంగా యువతి తీవ్ర అనారోగ్యం పాలైంది. తండ్రితో పాటు వార్డు బాయ్, అతనికి సహకరించిన ఆస్పత్రిలో ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కూతురు ప్రేమలో ఉందని తెలిసి నవీన్ కుమార్ అనే తండ్రి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తాను చెప్పినా వినడం లేదని ఆమెను హతమార్చాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి ఆనారోగ్యంపాలైందని శుక్రవారం రాత్రి మొరాదాబాద్ జిల్లా కంకర్ఖేడాలోని ఆస్పత్రిలో చేర్పించాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమెను ఫ్యూచర్ ఆస్పత్రికి మార్చాడు. కానీ కొద్ది సేపటికే యువతి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పొటాషియం క్లోరైడ్ అధిక మోతాదులో ఇచ్చినట్లు గుర్తించారు. వెంటనే సీసీటీవీని పరిశీలించగా అసలు విషయం తెలిసింది. వార్డు బాయ్‌గా పనిచేసే నరేశ్ కుమార్ యువతికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అతడికి ఓ మహిళా ఉద్యోగి సహకరించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు యువతి తండ్రితో పాటు వార్డు బాయ్ నరేశ్ కుమార్, మహిళా ఉద్యోగిని అరెస్టు చేశారు. నరేశ్ నుంచి రూ.90వేలు స్వాధీనం చేసుకున్నారు. విచారణతో తండ్రి నేరం అంగీకరించాడు. అంతేకాదు తన కూతురు కోతులను చూసి భయపడిందని చెప్పి ఆస్పత్రిలో అడ్మిట్ చేశానని, కానీ నిజానికి ఆమె ఇంటిపై నుంచి దూకిందని వెల్లడించాడు. చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ -
Health Tips: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! నిర్లక్ష్యం వద్దు! ఇవి తింటే...
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. అదే విధంగా.. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. పొటాషియం లోపిస్తే మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. ►కండరాలు బలహీనంగా మారుతాయి. ►కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. ►అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. ►అందువల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ►సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు. పొటాషియం ఎందులో లభిస్తుందంటే(Potassium Rich Foods).. ►కోడిగుడ్లు ►టమాటాలు ►చిలగడ దుంపలు ►విత్తనాలు ►నట్స్ ►అరటి పండ్లు ►యాప్రికాట్స్ ►చేపలు ►తృణ ధాన్యాలు ►పెరుగు ►పాలు ►మాంసం ►తర్బూజా ►క్యారెట్ ►నారింజ ►కివీ ►కొబ్బరినీళ్లు బీట్రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది. చదవండి: Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే.. 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! -
ఉత్సాహాన్నిచ్చే పోటాషియం కావాలా? బనానా కివీ స్మూతీ తీస్కో!
కావలసినవి: పాలు – కప్పు, అరటిపండు – ఒకటి, కివి – ఒకటి, తేనె – మూడు టేబుల్ స్పూన్లు, లేత పాలకూర – కప్పు, ఆవకాడో – అర చెక్క, ఐస్‌క్యూబ్స్ – కప్పు. తయారీ: ⇔ అరటిపండు, కివి తొక్కతీసి ముక్కలుగా తరగాలి ⇔ పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ⇔ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అరటిపండు, కివి ముక్కలు వేయాలి. దీనిలోనే పాలకూర, అవకాడోను ముక్కలు తరిగి వేయాలి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేయాలి చదవండి👉🏻 అసలే ఎండాకాలం.. చుండ్రు సమస్యా? సులభైన 2 చిట్కాలు మీకోసం ⇔ అన్నీ మెత్తగా నలిగాక పాలు, ఐస్‌క్యూబ్స్ వేసి మరొసారి గ్రైండ్ చేసి ..గ్లాసులో పోసుకోవాలి. దీనిలో తేనె వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ⇔తక్కువ క్యాలరీలు తీసుకోవాలనుకున్నవారికి ఈ స్మూతీ మంచి డ్రింక్ గా పనిచేస్తుంది. దీనిలో క్యాలరీలు, సోడియం తక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉంటాయి. ⇔ విటమిన్ బి, సి, పీచుపదార్థంతోపాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ⇔పొటాషియం జీవనశైలిని మరింత ఉత్సాహపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కండరాలను సంరక్షిస్తుంది. ⇔ అరటి, కివిలలో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. చదవండి👉🏼 సత్తువ పెంచే సగ్గుబియ్యం -
బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఇవి తినండి.. నాజూకుగా..
నాజూకుగా.. సరైన బరువుతో.. ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అయితే, కొందరికి మాత్రం ఇది ఎప్పటికీ నెరవేరని కలలాగే మిగిలిపోతుంది. కానీ.. ఆలోచిస్తే ఆరువేల ఉపాయాలు ఉండనే ఉన్నాయిగా..! పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలతో అధికబరువుకు చెక్‌పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ 7 చక్కని మార్గాల ద్వారా ఏ విధంగా బరువు తగ్గొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం. పొటాషియంతో ఎన్నో ప్రయోజనాలు.. పొటాషియం అనేది ఒక ముఖ్యమైన పోషకాహార ఖనిజం. మన శరీరంలోని కీలకమైన జీవక్రియల్లో దీని పాత్ర ఎనలేనిది. చెడు ద్రావణాల నుంచి రక్షణ కల్పించి, కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీవక్రియ సమతౌల్యానికి తోడ్పడుతుంది. గుండె, కిడ్నీలు సక్రమంగా, సమర్థవంతంగా పనిచేసేలా చూస్తుంది. ఈ అనేకానేక ప్రయోజనాలతోపాటు బరువు తగ్గడంలో కూడా పొటాషియం కీలకపాత్ర పోషిస్తుందన్నది నిపుణుల మాట. నూట్రియంట్స్ జర్నల్ ప్రచురించిన టెల్ అవివ్ యూనివర్సిటీ పరిశోధనల నివేదిక ప్రకారం శరీరంలో పొటాషియం స్థాయి పెరగడం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) గణనీయంగా తగ్గుతుంది. ఆహారం ద్వారా పొటాషియం తీసుకున్న తర్వాత బీఎమ్‌ఐలో అంతకు మునుపు లేని మార్పులు కనిపించాయని అధ్యనాలు వెల్లడించాయి. కాబట్టి తగినంత పొటాషియం ఉన్న ఆహార పదార్ధాలు తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు. అవిసె గింజలు అవిసె గింజల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని నేరుగా తినొచ్చు లేదా ఇతర మిశ్రమాలతో కలిపి ద్రావణంగా తీసుకోవచ్చు. బరువు తగ్గడ్డానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అరటి పండు సాధారణంగా ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉండదగ్గ ఫలాల్లో అరటి ఒకటి. అరటి పండులో ఐరన్, పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. దీనిని నేరుగా తినవచ్చు లేదా ఇతర తృణధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు. మీ బరువు తగ్గించేందుకు అరటి సహాయపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అవకాడో పండు అవకాడో పండ్లు మెత్తగా, క్రీమీగా మధురమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిని గుజ్జులా చేసుకుని అనేక రకాలుగా వినియోగిస్తారు. దీనిని వివిధ రకాలైన ఆహార పదార్ధలతో కలిపి తినోచ్చు. చేప పొటాషియం మాత్రమేకాకుండా బ్రెయిన్ హెల్త్‌కు ఎంతో ఉపకరించే ఒమేగా-3 కోవ్వు ఆమ్లాలు కూడా చేపలో అధికంగా ఉంటాయి. చేపలో క్యాలరీలు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బరువుతగ్గేందుకు సహాయపడే ఆహారాల్లో చేపలు ఉత్తమమైనవి. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా..? కొబ్బరి తింటే సరి! శనగలు శాఖాహారులు ప్రత్యామ్నాయంగా వినియోగించదగిన ప్రొటీన్ ఫుడ్.. శనగలు. ఒక రాత్రంతా బాగా నానబెట్టిన శనగల్లో ఇతర ఇన్గ్రీడియన్ట్స్ మిక్స్ చేసి రుచి కరమైన హమ్మస్ క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని బ్రెడ్ లేదా చపాతి తో కలిపి తినవచ్చు. మీ ఆహారంలో శనగలు చేర్చి తినడం ద్వారా సులువుగా బరువు తగ్గొచ్చు. స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంప ఆవిరిపై ఉడికించిన చిలగడ దుంపలను కొన్ని రకాల మసాలా దినుసులతో కలిపి తినవచ్చు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్డీఏ) అధ్యయనం ప్రకారం వంద గ్రాముల స్వీట్ పొటాటోలో 337 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. కిడ్నీ బీన్స్ లేదా రాజ్మా రాజ్మాలో ప్రొటీన్లతోపాటు పొటాషియం కూడా అధిక స్థాయిలో ఉంటుంది. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ప్రతి రోజూ మీ శరీరానికి అవసరమైన 35 శాతం పొటాషియం అందుతుంది. ►ఈ ఆహారపు అలవాట్లతో మీరు కోరుకునే శరీరాకృతిని సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది. చదవండి: National Nutrition Week 2021: రోజూ ఉదయం ఈ డ్రింక్స్ తాగారంటే.. -
ఉప్పు తెచ్చే ముప్పు
ఉప్పుని శరీరానికి హితశత్రువు అనుకోవచ్చు. వంటకానికి రుచి తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేసుకుంటుంది ఉప్పు. ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటారు. మానవ శరీరం అసంఖ్యాక కణజాల నిర్మితం. కణం లోపల ఉండే పొటాషియానికి, కణం బయట ఉండే సోడియానికి ఉండే పరిమాణ నిష్పత్తి 8:1; ఇది సృష్టి ధర్మం. ప్రకృతి దత్తమైన ఆహార పదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియముల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. మన ఆహారసేవన లో ఈ రెంటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవాలి. మనం వంట వండే విధానం వల్ల స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గిపోయి, సోడియం గణనీయంగా పెరిగిపోవటం. ఇది ప్రమాదకరం. లవణాన్ని ఎక్కువ తినకూడదని ఆయుర్వేదం చెప్పింది. చరక సంహిత విమానస్థానంలో: ‘‘అథ ఖలు త్రీణి ద్రవ్యాణి న అతి ఉపయుంజీతాధికం... పిప్పలీ క్షారం లవణమితి’ అంటే పిప్పళ్లు, క్షారం (కొన్ని ద్రవ్యాల నుండి వెలికి తీసిన గాఢమైన సారం), ఉప్పు ఎక్కువ తినవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి 3 – 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. (బయట కొన్న ఉప్పు, ప్రకృతి ద్రవ్యాలైన పళ్లు, ఆకు కూరలు, శాకాలు, పాలు మొదలైనవి కలిపి). కాని మనం రోజుకి 15 – 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం అనేక రోగాలకు దారి తీస్తుంది. పరిమిత పరిమాణంలో... వాగ్భట సంహితలో: లవణం స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్ని కృత్ స్వేహనః స్వేదనః తీక్ష›్ణ రోచనః ఛేద భేద కృత్ ‘‘ రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. శరీరంలో కొవ్వును, కంతులను కరిగించి జడత్వాన్ని పోగొడుతుంది. స్వేదాన్ని కలిగిస్తుంది. అతిగా సేవిస్తే అనర్థాలు రక్తస్రావం, దప్పిక పెరుగుతాయి. బలం నశిస్తుంది. విషతుల్యం. సంధులలో వాపు పుడుతుంది. జుత్తు నెరుస్తుంది. బట్టతల, చర్మంలో ముడతలు, ఇతర చర్మ వికారాలు కలుగుతాయి. సోతియుక్తో అస్రపవనం ఖలితం పలితం వలిమ్ తృట్ కుష్ఠ విషవిసర్పాన్ జనయేత్ క్షపయేత్ బలమ్ శరీరంలో నీటిని నిల్వ ఉండేట్టు చేసి, ఊబకాయం, వాపులు కలుగచేస్తుంది. రక్తనాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్త ప్రసరణకు అవరోధం కలిగిస్తుంది. తద్వారా బీపీ పెరిగి.. పక్షవాతం, హార్ట్ ఎటాక్, కీళ్లవాపులు వంటి వ్యాధులకు దారి తీస్తుంది. నేటి జీవనశైలి వలన ఈ వ్యాధులు కలగడానికి మరింత దోహదం చేస్తుంది. మన రక్తంలోని గ్లూకోజ్.. కణాలలోనికి ప్రవేశించినప్పుడే శక్తి లభిస్తుంది. కణం యొక్క పొరను దాటి గ్లూకోజ్ లోపలకి వెళ్లాలంటే ఇన్సులిన్ హార్మోను అవసరం. అక్కడ ఇన్సులిన్ సక్రమంగా పనిచెయ్యాలంటే ఉప్పు తక్కువ స్థాయిలో ఉండా లి. అందువల్లే మధుమేహ రోగులు ఉప్పు తక్కువ తినాలి. ఇటీవలి కాలంలో జపాన్ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఐదు రకాల లవణాలు సాముద్ర లవణం (90 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది), ఔద్భిజ లేక రోమ లవణం (70 శాతం n్చఛి , సైంధవ లవణం (టౌఛిజు ట్చ ్ట: 70% N్చఛి ) బిడాల లవణం (కరక్కాయ, ఉసిరికాయ వంటి కొన్ని ద్రవ్యాల సారాన్ని తీసి, ప్రత్యేకంగా తయారుచేస్తారు. 40% N్చఛి ) సౌవర్చ లవణం (భూమిలోని లోపలి పొరలు, నదీ తీర ప్రాంతాలు దీనికి మూలాధారం. 30% N్చఛి ) తప్పించుకోవడం ఎలా? నిషిద్ధం: ఊరగాయలు, నిల్వపచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వంటివి, ఉప్పు కారం చల్లిన వేపడాలు, డీప్ ఫ్రైలు మానేయాలి. ఉడికించిన కూరలలో నామ మాత్రం ఉప్పు అలవరచుకోవాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి పోకూడదు. బజారులో ఉప్పు కొనడం తగ్గించాలి. సేవించవలసినవి ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పాలు, బీట్రూట్, ముల్లంగి, ఆకు కూరలు, గ్రీన్సలాడ్సు మొదలైనవి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరకురసం వంటివి. కాయగూరలు, పండ్లు మొదౖలñ నవి పెస్టిసైడ్స్, కార్బైడ్స్ యొక్క విష ప్రభావాలకు గురైనవే మనకు లభిస్తున్నాయి. ఆ విషాల్ని కొంతవరకు నాశనం చేయాలంటే... గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాలు ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో కాయగూరల్ని కాని, పళ్లని కాని ఓ అరగంట నానబెట్టి, అనంతరం మంచినీటితో రెండు మూడు సార్లు కడుక్కోవాలి. గమనిక రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను ‘రుచి రోగాలు’ అంటారు. ఇవి కూడా ‘సుఖరోగాల’ వలే అనర్థదాయకం. ఆరోగ్యప్రదమైన కొత్త రుచులను అలవాటు చేసుకోవడానికి నాలుకకు రెండు వారాల సమయం చాలు. -
హైబీపీ... ఏం తింటే తగ్గుతుంది!
హైబీపీతో బాధపడుతున్నప్పుడు ఏమేమి తినకూడదో తెలుసుకుని జాగ్రత్త పడుతుంటారు. అయితే ఏమేమి తినాలో, ఏమేమి తినవచ్చో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. ఆహారంలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువ ఉంటూ సోడియం తక్కువగా ఉండాలి. ఇవి అధికంగా ఉన్న బ్లడ్ ప్రెషర్ని సహజంగా అదుపుచేస్తాయి. ఇవి ఎందులో ఉంటాయంటే... అరటిపండు, ఆపిల్, ఆప్రికాట్, కర్జూరం, ద్రాక్ష, మామిడిపండు, పుచ్చకాయ, కర్బూజ, కమలాలు, పీచ్ పండ్లు తీసుకోవాలి. పండ్లను రసం తీసి తాగడం కంటే పీచుతోపాటు తినడం మంచిది. ఇక కూరగాయలను చూస్తే క్యారట్, పచ్చి బఠాణి, దోసకాయ, కీరదోస, సొరకాయ, బంగాళాదుంప, పాలకూర, గెనుసుగడ్డ, టొమాటో పెరుగులో సోడియం తక్కువగా పొటాషియం, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు మెండుగానూ ఉంటాయి. -
కీరదోస... కంప్లీట్ హెల్త్
గుడ్ ఫుడ్ కీరదోసలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. కీరదోస ఎండ తాపం నుంచి కాపాడడమేకాదు, హైబీపీని అదుపు చేస్తుంది. రోజూ ఒక కీరదోస తింటే సన్‌స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు, హైబీపీని నియంత్రించుకోవచ్చు. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపేస్తుంది.ఎముకలు కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ (మతిమరుపు) సమస్యను నివారిస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కడుపులో లద్దెపురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు. -
ఆరోగ్య ఫలం... అత్తిపండు!
తిండి గోల అత్తిపండంటే తెలంగాణలో అందరికీ అంతగా తెలియదేమోగానీ, అంజీరపండంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో అందరికీ తెలుసు. అంజీర అనేది హిందీపదం. ఆంగ్లంలో ఫిగ్స్ అంటారు. మర్రి, మేడి, అత్తి ఒకేజాతికి చెందినవి. అతి పురాతనమైన ఫలవృక్షాలలో అత్తి ఒకటి. దీనిని ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు. ఆకులు బొప్పాయి ఆకుల్లా ఉంటాయి. 15-25 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. దాదాపు 150 రకాలున్నప్పటికీ నాలుగైదు రకాలే బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉండి , పక్వానికి వచ్చాక తియ్యగా ఉండే ఈ పళ్లు మూడు నాలుగు రోజులకి మించి నిల్వ ఉండవు. అందుకే వీటిని ఎండబెడతారు. ఎండిన కొద్దీ తియ్యగా ఉంటాయి. పోషక విలువలు కూడా పెరుగుతాయి. ఎ,ఇ,కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఏదైనా వ్యాధిబారిన పడి కోలుకుంటున్న వారికి ఇవి తినడం వల్ల తొందరగా బలం పుంజుకుంటారు. అంతేకాదు, ఇది హృద్రోగులకు చాలా మంచిది. ఎముకలు ఫెళుసుబారకుండా ఉండాలంటే అత్తిపళ్లు తరచు తింటూ ఉండాలి. అయితే వీటిని మితంగా తినడమే మేలు... -
తీసి... పారేయకండి
ఫుడ్ ఫ్యాక్ట్స్ అరటిపండు తిని తొక్క పడేస్తాం..కానీ తొక్కతో చాలా లాభాలున్నాయి. అందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల చుట్టూ ఉన్న ముడతలను మాయం చేస్తుంది. తాజా అరటిపండు తొక్కలోపలి భాగాన్ని కళ్లచుట్టూ సున్నితంగా రుద్దితే ముడుతలు, ఐ బాగ్స్ అడ్రస్ లేకుండా పోతాయి. చీమ, దొమ వంటి కీటకాలు కుట్టిన చోట వాపు, దురదలాంటివి ఉంటే అరటిపండు తొక్కతో రుద్దితే ఉపశమనం కలుగుతుంది.అరటిపండు మనుషులకే కాదు మొక్కలకూ ఆరోగ్యమే. పండు తిని తొక్కను డస్ట్‌బిన్‌లో వేయకుండా గులాబి మొక్కల తొట్లలో వేస్తే గులాబీలు విరగబూస్తాయి. -
‘అనంత’లో అరేబియన్ పంట
ప్రయోగాత్మకంగా ఖర్జూరం సాగు ఖర్జూరం పండులో క్యాల్షియం, సల్ఫర్, ఇనుము, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, రాగి, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నివారించే శక్తి ఈ పండుకు ఎక్కువ. ఖర్జూరం శాస్త్రీయ నామం ఫీనిక్స్డాక్టిలిఫెరా. తాటిచెట్టు మాదిరిగా పెరిగే ఈ చెట్లు ఆడ, మగ వేరువేరుగా ఉంటాయి. రాయదుర్గం : అరబ్ దేశాల్లో పండించే ఖర్జూరం పంట ఇప్పుడు మన ప్రాంతానికీ విస్తరించింది. కరువు పీడిత ప్రాంతంగా పేరొందిన ‘అనంత’ నేలలో పండించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం బెణకల్లుకు చెందిన రామక్రిష్ణారెడ్డి తన స్నేహితుడి సలహా మేరకు ఆరేళ్ల క్రితం 15 ఎకరాల విస్తీర్ణంలోని నల్లరేగడిలో దాదాపు 1500 మొక్కలు నాటాడు. రెండు వ్యవసాయబోర్ల ద్వారా మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తున్నాడు. మొదట్లో ఇరుగుపొరుగు రైతులు ఎగతాళి చేసినా పట్టించుకోకుండా కంటికి రెప్పలా ఖర్జూరం మొక్కలను కాపాడుకుంటూ వచ్చాడు. పశువుల ఎరువును ఎక్కువశాతం వాడుతూ, అడపాదడపా క్రిమిసంహారక మందు కూడా తక్కువ మోతాదులో ఉపయోగిస్తున్నాడు. మొక్కకూ.. మొక్కకూ 20 అడుగుల దూరం పాటించాడు. కట్టెల నుంచి కాల్చిన బొగ్గును కూడా ఎరువుగా ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం వంద ఖర్జూరం చెట్లు కాపుకొచ్చాయి. ఆరు నెలల క్రితం అంతర్ పంటగా 1500 దానిమ్మ మొక్కలు నాటాడు. ఫలదీకరణ ప్రక్రియ :ఖర్జూరం పంట మొగ్గదశలో మగచెట్ల పరాగరేణువులను తీసుకుని, ఆడ ఖర్జూర చెట్లకు సంబంధించిన పండ్ల గుత్తిలో పెట్టి వల ఏర్పాటు చేస్తారు. 50 ఆడ చె ట్లను ఫలవంతం చేయడానికి ఒక మగచెట్టు పరాగరేణువులు ఉపయోగపడుతాయి. ఈ పంట 5 నుంచి 8 సంవత్సరాలకు కాపుకొస్తుంది. -
బంగాళ దుంప తింటే బీపీ తగ్గుతుందా?
రూట్ ఫ్యాక్ట్స్ అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు రోజూ ఒక మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపను తింటుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది. డయేరియాతో బాధపడుతున్నప్పుడు ఆహారంలో ఉడికించిన బంగాళదుంప తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మితిమీరి తింటే అదే విరేచనాలకు కారణం అవుతుంది కూడా. బంగాళదుంపలో క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే శక్తి ఉంటుంది. బంగాళదుంపలో బీ కాంప్లెక్స్, సి విటమిన్లతోపాటు ఖనిజలవణాలు, కొద్ది మోతాదులో పీచు, కెరటినాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు శరీరం లోపలి అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి. కాబట్టి స్థూలకాయులు, షుగర్ ఉన్నవారు బంగాళదుంప చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. -
పంటకు ఈ పోషకాలూ అవసరమే!
పాడి-పంట: మొక్కల పెరుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత అవసరమో కాల్షియం, మెగ్నీషియం, గంధ కం, జింక్, బోరాన్, ఇనుము, రాగి వంటి సూక్ష్మ పోషకాలూ అం తే అవసరం. బెట్ట పరిస్థితుల్లోనూ, వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు పంటల్లో సూక్ష్మ ధాతు లోపాలు అధికంగా కన్పిస్తుంటా యి. ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాల గురించి ఆచార్య ఎన్.జి.రం గా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి అందిస్తున్న వివరాలు... ఎందుకు లోపిస్తున్నాయి? పంటలకు వేస్తున్న కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువుల (యూరియా, పొటాష్) వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి. సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో రైతులు పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని వాడేవారు. వీటి ద్వారా మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోతోంది. ఫలితంగా చాలా పంటల్లో సూక్ష్మ పోషకాలు లోపించి, దిగుబడులు తగ్గుతున్నాయి. ఏ పంటలో ఏ లోపం? వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, శనగ, పత్తి పంటల్లో ఎక్కువగా జింక్ ధాతువు లోపిస్తోంది. మొక్కజొన్నలో ఇనుప ధాతు లోపం కూడా అధికంగానే ఉంటోంది. ఈ ధాతువు వరి, వేరుశనగ, శనగ, చెరకు పంటల్లోనూ లోపిస్తోంది. ఇక బీటీ పత్తి పంటను మెగ్నీషియం, జింక్, బోరాన్ ధాతు లోపాలు అతలాకుతలం చేస్తున్నాయి. జింక్ దేనికి ఉపయోగం? మొక్కల ఎదుగుదలకు ఎంజైములు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, మాంసకృత్తులు అవసరమవుతాయి. ఇవి తయారు కావడానికి జింక్ దోహదపడుతుంది. కణజాలాల్లో కొన్ని ప్రత్యేక ఎంజైములు లోపిస్తే మొక్కల్లో పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. మనం పంటకు అందిస్తున్న నత్రజని, భాస్వరం ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరగాలంటే జింక్ వాడకం తప్పనిసరి. వరిలో లోపిస్తే... నాట్లు వేసిన 2 నుంచి 6 వారాల్లో వరిలో జింక్ లోపం కన్పిస్తుంది. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. పైరు పలచబడుతుంది. మిగిలిన పిలకలు కూడా దుబ్బు కట్టవు. ఆకుల్లో మధ్య ఈనె ఆకుపచ్చ రంగును కోల్పోయి, పసుపు రంగుకు మారుతుంది. ఆకు చివర్లు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ముదురు ఆకులపై మధ్య ఈనెకు రెండు పక్కల తుప్పు రంగు మచ్చలు కన్పిస్తాయి. ఆకులు చిన్నవిగా నూలు కండె ఆకారంలో, పెళుసుగా ఉంటాయి. వాటిని విరిస్తే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. జింక్ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పైరు పిలకలు తొడగదు. కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉంటాయి. పైరు గిడసబారుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది. మొక్కజొన్నలో ఏమవుతుంది? మొక్కజొన్న పైరులో జింక్ లోపిస్తే ఆకు ఈనెల మధ్య భాగం తేలికపాటి చారలతో లేదా తెల్లని పట్టీల మాదిరిగా కన్పిస్తుంది. అయితే ఆకుల అంచులు, పెద్ద ఈనెలు, చివర్లు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. మొక్కలు గిడసబారతాయి. జింక్ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తెల్ల మొగ్గ లక్షణాలు కన్పిస్తాయి. కొత్తగా వచ్చే ఆకులు దాదాపు తెల్లగా ఉంటాయి. ఆకులు చిన్నవి అవుతాయి తేలికపాటి నేలల్లో, సున్నం అధికంగా ఉండే నేలల్లో, ముంపు నేలల్లో సాగు చేసిన వేరుశనగ పైరులో జింక్ లోపం కన్పిస్తుంది. సాగునీటిలో బైకార్బొనేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ధాతువు లోపిస్తుంది. జింక్ లోపించినప్పుడు ఆకులు మామూలు సైజులో ఉండక చిన్నవిగా ఉంటాయి. రెండు ఆకుల మధ్య పొడవు తగ్గిపోతుంది. ఫలితంగా ఆకులు చిన్నవిగా, గుబురుగా కన్పిస్తాయి. ఈనెల మధ్య ఉండే ఆకు భాగం లేత పసుపు రంగులోకి మారవచ్చు. శనగలో జింక్ ధాతువు లోపిస్తే ముదురు ఆకులు లేత పసుపు రంగుకు మారతాయి. ధాతు లోప తీవ్రత ఎక్కువైన కొద్దీ ఆకులు ఎర్రగా మారతాయి. వేరుశనగ పైరులో మాదిరిగా ఆకులు చిన్నవిగా మారి, మొక్కలు కుదించుకుపోతాయి. ఆకులు తుప్పు రంగుకు మారతాయి బంకమన్ను అధికంగా ఉన్న నల్లరేగడి నేలల్లో, సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లో సాగు చేస్తున్న పత్తి పైరులో జింక్ లోపించే అవకాశం ఉంది. విత్తనాలు వేసిన 3 వారాల తర్వాత లోప లక్షణాలు కన్పిస్తాయి. పాత, కొత్త ఆకులు ఎరుపుతో కూడిన తుప్పు రంగుకు మారతాయి. లేత పైరులో మధ్య ఆకులు తమ సహజ ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. ఈనెల మధ్య భాగం బంగారం లాంటి పసుపు రంగుకు మారుతుంది. ఆకుల చివర్ల నుంచి మొదలుకు గోధుమ రంగు మచ్చలు వ్యాపిస్తాయి. ఆకుల చివర్లు ఎండిపోతాయి. ఆకులు పైకి లేదా కిందికి ముడుచుకుంటాయి. మొక్కల్లో పెరుగుదల సరిగా ఉండదు. ఆకులు, కాండం చిన్నవిగా మారి, గుబురుగా కన్పిస్తాయి. (మిగతా వివరాలు వచ్చే వారం) -
కీరదోస తింటే...
కాయ‘ఫలాలు’ కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినడం చక్కటి మార్గం. ఇందులోని ‘కె’ విటమిన్ ఎముకలు, కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరు మెరుగవడంతో అల్జీమర్స్ (మతిమరుపు) రాదు. కీరదోస... గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కడుపులో పురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు.