హైబీపీ... ఏం తింటే తగ్గుతుంది!
హైబీపీతో బాధపడుతున్నప్పుడు ఏమేమి తినకూడదో తెలుసుకుని జాగ్రత్త పడుతుంటారు. అయితే ఏమేమి తినాలో, ఏమేమి తినవచ్చో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. ఆహారంలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువ ఉంటూ సోడియం తక్కువగా ఉండాలి. ఇవి అధికంగా ఉన్న బ్లడ్ ప్రెషర్‌ని సహజంగా అదుపుచేస్తాయి. ఇవి ఎందులో ఉంటాయంటే...
అరటిపండు, ఆపిల్, ఆప్రికాట్, కర్జూరం, ద్రాక్ష, మామిడిపండు, పుచ్చకాయ, కర్బూజ, కమలాలు, పీచ్ పండ్లు తీసుకోవాలి. పండ్లను రసం తీసి తాగడం కంటే పీచుతోపాటు తినడం మంచిది. ఇక కూరగాయలను చూస్తే క్యారట్, పచ్చి బఠాణి, దోసకాయ, కీరదోస, సొరకాయ, బంగాళాదుంప, పాలకూర, గెనుసుగడ్డ, టొమాటో పెరుగులో సోడియం తక్కువగా పొటాషియం, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు మెండుగానూ ఉంటాయి.