జుట్టుకు పోషకాలతో పట్టు | Everything You Need to Know About Hair Loss | Sakshi
Sakshi News home page

జుట్టుకు పోషకాలతో పట్టు

Published Sat, Jul 6 2024 8:28 AM | Last Updated on Sat, Jul 6 2024 8:28 AM

Everything You Need to Know About Hair Loss

ఇటీవలి కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని వెనుక వంశపారంపర్య కారణాలు ఉంటే దానిని నివారించడం కష్టం. అయితే బట్టతలను కొంతకాలం పాటు వాయిదా వేయచ్చు. కానీ ప్రతిసారీ ఈ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల మాత్రం రాదని తెలుసుకోవాలి. జుట్టు రాలడం లేదా బట్టతల రావడం అనేది మస్కులర్‌ డిస్ట్రోఫీ లాంటి జన్యుపరమైన సమస్య కాదని సైన్స్‌ చెబుతోంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొన్ని అవసరమైన మూలకాలు లేకపోవడమే. కానీ ఆ మూలకాల లోపం వంశపిరంపర్యంగా ఉంటుంది. వారసత్వం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అయిన జన్యువులది మాత్రమే కాదు. బదులుగా కొన్నిసార్లు పోషకాల లోపం కూడా ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది.

బయోటిన్‌
బయోటిన్‌ అనేది జుట్టుకు అవసరమైన మూలకం. ఇది లేకపోవడం వల్ల జుట్టు పలుచబడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు కూడా విరిగిపోతాయి. కండరాల అలసట, బలహీనత, మైకం, కాళ్ళలో తిమ్మిరి వంటివి బయోటిన్‌ లోపం లక్షణాలు. ఇది శరీరానికి అవసరమైన మూలకం. కానీ జుట్టు, గోళ్లకు ఇది చాలా ముఖ్యమైనది.

రాగి: సాధారణంగా శరీరంలో రాగి లోపం ఉండదు. కానీ ఏదైనా కారణం వల్ల అది లోపిస్తే జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా భారతదేశం వంటి దేశంలో శరీరంలో కాపర్‌ సమస్య ఉండదు. కాని ఇది లోపిస్తే మోకాలు, కీళ్లలో భరించలేని నొప్పి ఉంటుంది.

కొల్లాజెన్‌: కొల్లాజెన్‌ అనేది జుట్టు మూలాలను బలపరిచే మూలకం. ఇది జుట్టుని మందం చేస్తుంది. దీని లోపం వల్ల జుట్టు బలహీనపడి ఎక్కువ ఊడిపోతుంది.

విటమిన్‌ బి6
జుట్టుకి విటమిన్‌ బి కాంప్లెక్స్‌ చాలా ముఖ్యం. దీని లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. విటమిన్‌ బి 6 మన జుట్టు ఆరోగ్యానికి సంబంధించినది. ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లయితే జుట్టు బలహీనంగా మారుతుంది. ఎక్కువగా ఊడిపోయి బట్టతల వస్తుంది.

జింక్‌
జింక్‌ లోపం ప్రధాన లక్షణం జుట్టు వేగంగా రాలడం. మీ జుట్టు అకస్మాత్తుగా రాలడం ్ర΄ారంభించిందని మీకు అనిపిస్తే అది జింక్‌ లోపం వల్ల కావచ్చునని భావించి జింక్‌ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు. అందువల్ల ఒకసారి మంచి ట్రైకాలజిస్టును కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకుని ఏ కారణం వల్ల జుట్టు ఊడి΄ోతోందో తెలుసుకుని ఆ విటమిన్‌ లోపాన్ని పూరించడం ద్వారా జుట్టు రాలకుండా నివారించుకోవచ్చు.

కండరాల నొప్పులా? 
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పోటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్‌ జాబితాకు చెందుతుంది. పోటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్‌ రాకుండా చూస్తుంది. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పోటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పోటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. మనం తినే ఆహారాల నుంచే మనకు పోటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పోటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.

ఎందులో లభిస్తుంది?
కోడిగుడ్లు, టమాటాలు, చిలగడ దుంపలు, విత్తనాలు, నట్స్, అరటి పండ్లు, యాప్రికాట్స్, చేపలు, తృణ ధాన్యాలు, పెరుగు, ΄ాలు, మాంసం, తర్బూజా, క్యారెట్, నారింజ, కివీ, కొబ్బరినీళ్లు, బీట్‌రూట్‌ వంటి ఆహారాల్లో పోటాషియం విరివిగా లభిస్తుంది 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement