![Gurishq Kaur Sheds Over 40 Kg After Suffering Hair Loss](/styles/webp/s3/article_images/2025/02/18/weigh1.jpg.webp?itok=rw8YSAuz)
అవమానాలు చీత్కారాల కారణంగా కొందరూ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన స్ఫూర్తిదాయకమైన కథలను చూశాం. అలా కాకుండా కలవారపాటుకు గురిచేసిన అనారోగ్య సమస్య ఆరోగ్యంపై బాధ్యతగా వ్యవహరించేలా చేసి బరువు తగ్గేందుకు కారణమైంది. ఆ స్ప్రుహే ఆ మహిళను 133 కిలోల నుంచి కనివిని ఎరుగని రీతిలో బరువు తగ్గేందుకు ప్రేరేపించింది. అలా ఆమె ఒక్క ఏడాదికే దాదాపు 40 కిలోల మేరు బరువు కోల్పోయి..గుర్తుపట్టలేనంతగా నాజుగ్గా మారిపోయింది. తనలాంటి బాధపడుతున్న వ్యక్తుల్లో స్ఫూర్తిని నింపేలా తన వెయిట్ లాస్ జర్నీ, డైట్ సీక్రెట్‌ల గురించి నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటంటే..
టొరంటోలో నివసించే గురిష్క్ కౌర్ అనే బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫిబ్రవరి 2024లో 133 కిలోలు మేర అధిక బరువు ఉండేది. అసాదారణమైన వెయిట్‌లాస్ జర్నీతో ఏకంగా 40 కిలోల మేర బరువు కోల్పోయి అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఈ ఏడాది జనవరి కల్లా 86.5 కిలోలకు చేరుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది.
తన వెయిట్ లాస్ జర్నీ గురించి వెల్లడించి ఇతరులు కూడా బరువు తగ్గేలా ప్రోత్సహిస్తోంది. ఆమె ఫిమేల్ ప్యాటర్న్‌గా పిలిచే ఆండ్రోజెనిక్ అలోపేసియా బారిన పడటంతో ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఆ డెసిషన్ ఆమెను బరువు తగ్గే దిశగా నడిపించింది.
బరువుగా ఉన్నప్పుడూ..తాను ఎలా ఒత్తిడి, బలహీనమైన ఆత్మవిశ్వాసంతో బాధపడిందో కూడా వెల్లడించింది. కేవలం శారీరకంగా స్లిమ్‌గా మారడమే కాకుండా స్ట్రాంగ్‌గా తయారవ్వాలని నిర్ణయించుకున్నానని అందువల్లే ఇంతలా బరువు తగ్గినట్లు తెలిపారు కౌర్. అలాగే తన డైట్ సీక్రెట్ ఏంటో కూడా బయటపెట్టింది.
బరువు తగ్గేలా చేసిన డైట్ ట్రిక్..
ముందుగా పోషకాహారంపై సరైన అవగాహన ఉండాలి.
లీన్ ప్రోటీన్ - గుడ్లు, చికెన్, తెల్ల చేప, టోఫు, టెంపే వంటి వాటిని తీసుకునేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి.
నట్స్, గుమ్మడి, పుచ్చకాయ, అవిశె గింజలు, సలాడ్లు, వేయించిన కూరగాయలు తినండి
చిలగడదుంపలు, రై బ్రెడ్, మల్టీగ్రెయిన్ రైస్ తీసుకోవాలి
దీంతోపాటు ముఖ్యంగా 80/20 రూల్‌ని పాటించాలి
80/20 రూల్ అంటే..?: 80 శాతం ఆరోగ్యకరమైనది, 20 శాతం నచ్చిన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలి డైట్‌ని.
డైట్ మంత్ర: ఆకలి నియంత్రణలో ఉండేలా డైట్ ప్లాన్ ఉండాలి. ప్రధానంగా సమతుల్యమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేలా ఫుడ్ తీసుకుంటే ఎవ్వరైనా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గగలుగుతారని చెబుతున్నారు గురిష్క్ కౌర్.
అన్ని కిలోలు ఉన్న ఆమె అంతలా బరువు తగ్గగలిగిందంటే..ఓ మోస్తారు అటు ఇటుగా ఉన్న మనందంరం మరింత సులభంగా బరువు తగ్గిపోగలం అనడంలో సందేహమే లేదు కదూ..!.
(చదవండి: నోరూరించే పాప్‌కార్న్ డ్రెస్‌లో నటి ఎమ్మా స్టోన్..!)
Comments
Please login to add a commentAdd a comment