breaking news
toranto
-
జితాంక్ జీత్ గయా!
మొన్నటి వరకు...‘జితాంక్ సింగ్ గుర్జార్ పేరు విన్నారా?’ అనే ప్రశ్నకు వెంటనే వచ్చే జవాబు... ‘సారీ... తెలియదు’ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు పరిచయం అయింది. ‘ఎవరీ జితాంక్ సింగ్ గుజ్జార్?’ అని సెర్చ్ ఇంజిన్లను అడిగేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సింగ్. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (టిఐఎఫ్ఎఫ్)లో జితాంక్ సింగ్ గుర్జార్ తీసిన విముక్త్ (ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై) ప్రతిష్ఠాత్మమైన నెట్పాక్ (నెట్వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియా సినిమా) అవార్డ్ గెలుచుకుంది.పక్కా పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల జితాంక్ ప్రకృతి ప్రపంచానికి చేరువయ్యే అవకాశం దొరికింది. రణగొణ ధ్వనులు లేని ఆ ప్రశాంతత బాగా ఇష్టంగా ఉండేది. తనకు ఆశ్చర్యంగా అనిపించేవాటిని, అద్భుతంగా అనిపించేవాటిని అందమైన కథలుగా చెబుతుండేవాడు. ఆ కథలు చెప్పే అలవాటే జితాంక్సింగ్ను సినిమా ప్రపంచంలోకి తీసుకువచ్చింది.గ్రామీణ ప్రపంచం... కథల చలమగ్రామీణ ప్రపంచంలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని ప్రపంచానికి చెప్పడం అంటే జితాంక్కు ఇష్టం.‘ది మోస్ట్ పర్సనల్ ఈజ్ ది మోస్ట్ క్రియేటివ్’ అనే విలువైన మాట అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘విముక్త్’ కథకు స్క్రీన్‌ప్లే సమకూర్చి సినిమాగా మలిచాడు. ఇది నిర్మాత పూజా విశాల్ శర్మ రాసిన కథ. నటులు, సాంకేతిక వర్గం ఫైనల్ అయ్యాక... ‘ఇదీ కథ’ అని వారికి చె΄్పాడు. ప్రతి క్యారెక్టర్ గురించి విశ్లేషించి వివరంగా చె΄్పాడు. నటులు తమ క్యారెక్టర్లలో పూర్తిగా మమేకం కావడానికి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించాడు.కుంభమేళాలో షూటింగ్జనసముద్రంలో మహా కుంభమేళాలో షూటింగ్ అంటే మాటలు కాదు. తమది చిన్న యూనిట్ కావడంతో ప్రతి సీన్ గురించి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నాడు. ఏ దృశ్యాన్ని ఎక్కడ చిత్రించాలనేదాని కోసం ఎన్నో స్థలాలను పరిశీలించాడు. సరిౖయెన లొకేషన్లను ఎంపిక చేసుకోవడం ఒక సవాలు అయితే, జనమూహాలలో సహజ చిత్రీకరణ అనేది మరో సవాలు. ఎలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా షూటింగ్ పూర్తిచేశాడు జితాంక్.‘మహాకుంభమేళా సన్నివేశాలు లేక΄ోతే ఈ సినిమాయే లేదు. కాబట్టి కుంభమేళాలోని సన్నివేశాలనే మొదట చిత్రీకరించాం. ఆ తరువాత మధ్యప్రదేశ్‌లోని బరై, పద్వా గ్రామాలలో షూటింగ్ చేశాం’ అంటాడు జితాంగ్ సింగ్. ‘గ్రామీణ ప్రాంత కథలు మాత్రమే కాదు పట్ణణాలలోని ఎన్నో సంక్లిష్ట జీవితాలకు చిత్రరూపం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటున్నాడు జితాంక్ సింగ్ గుర్జార్.ప్రాంతీయ భాషలో తీసిన చిత్రాన్ని ప్రపంచం మెచ్చిందిఆ దంపతులకు వయసు పైబడుతోంది. జీవనాధారమైన తమ పొలాన్ని కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. ఒక్కగానొక్క కొడుకు నారన్కు మేథో సామర్థ్యాలు లేవు. మానసికంగా అస్థిరంగా ఉంటాడు. ఒకవైపు నారన్ను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. మరో వైపు ఆర్థిక కష్టాలు. ఎన్నో సమస్యల మధ్య ఒక పరిష్కారాన్ని ఆశిస్తూ మహాకుంభమేళాకు వారి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే తమ కష్టాలు తీరుతాయని వారు ఆశిస్తారు. గ్రామీణ భారత జీవితం, నమ్మకాలు, అపనమ్మకాలకు, అదృష్ట దురదృష్టాలకు అద్దం పట్టిన సినిమాగా ‘విముక్త్’ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బ్రజ్ భాషలో తీశారు. కేవలం పదకొండురోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సెంటర్ పీస్ సెక్షన్లో ప్రదర్శించారు. (చదవండి: Weight Loss Story: బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్‌గా..! జస్ట్ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..) -
జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..
అవమానాలు చీత్కారాల కారణంగా కొందరూ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన స్ఫూర్తిదాయకమైన కథలను చూశాం. అలా కాకుండా కలవారపాటుకు గురిచేసిన అనారోగ్య సమస్య ఆరోగ్యంపై బాధ్యతగా వ్యవహరించేలా చేసి బరువు తగ్గేందుకు కారణమైంది. ఆ స్ప్రుహే ఆ మహిళను 133 కిలోల నుంచి కనివిని ఎరుగని రీతిలో బరువు తగ్గేందుకు ప్రేరేపించింది. అలా ఆమె ఒక్క ఏడాదికే దాదాపు 40 కిలోల మేరు బరువు కోల్పోయి..గుర్తుపట్టలేనంతగా నాజుగ్గా మారిపోయింది. తనలాంటి బాధపడుతున్న వ్యక్తుల్లో స్ఫూర్తిని నింపేలా తన వెయిట్ లాస్ జర్నీ, డైట్ సీక్రెట్ల గురించి నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటంటే..టొరంటోలో నివసించే గురిష్క్ కౌర్ అనే బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఫిబ్రవరి 2024లో 133 కిలోలు మేర అధిక బరువు ఉండేది. అసాదారణమైన వెయిట్‌లాస్ జర్నీతో ఏకంగా 40 కిలోల మేర బరువు కోల్పోయి అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఈ ఏడాది జనవరి కల్లా 86.5 కిలోలకు చేరుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన వెయిట్ లాస్ జర్నీ గురించి వెల్లడించి ఇతరులు కూడా బరువు తగ్గేలా ప్రోత్సహిస్తోంది. ఆమె ఫిమేల్ ప్యాటర్న్గా పిలిచే ఆండ్రోజెనిక్ అలోపేసియా బారిన పడటంతో ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఆ డెసిషన్ ఆమెను బరువు తగ్గే దిశగా నడిపించింది. బరువుగా ఉన్నప్పుడూ..తాను ఎలా ఒత్తిడి, బలహీనమైన ఆత్మవిశ్వాసంతో బాధపడిందో కూడా వెల్లడించింది. కేవలం శారీరకంగా స్లిమ్‌గా మారడమే కాకుండా స్ట్రాంగ్‌గా తయారవ్వాలని నిర్ణయించుకున్నానని అందువల్లే ఇంతలా బరువు తగ్గినట్లు తెలిపారు కౌర్. అలాగే తన డైట్ సీక్రెట్ ఏంటో కూడా బయటపెట్టింది. బరువు తగ్గేలా చేసిన డైట్ ట్రిక్..ముందుగా పోషకాహారంపై సరైన అవగాహన ఉండాలి. లీన్ ప్రోటీన్ - గుడ్లు, చికెన్, తెల్ల చేప, టోఫు, టెంపే వంటి వాటిని తీసుకునేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నట్స్, గుమ్మడి, పుచ్చకాయ, అవిశె గింజలు, సలాడ్లు, వేయించిన కూరగాయలు తినండిచిలగడదుంపలు, రై బ్రెడ్, మల్టీగ్రెయిన్ రైస్ తీసుకోవాలిదీంతోపాటు ముఖ్యంగా 80/20 రూల్‌ని పాటించాలి80/20 రూల్ అంటే..?: 80 శాతం ఆరోగ్యకరమైనది, 20 శాతం నచ్చిన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలి డైట్‌ని. డైట్ మంత్ర: ఆకలి నియంత్రణలో ఉండేలా డైట్ ప్లాన్ ఉండాలి. ప్రధానంగా సమతుల్యమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేలా ఫుడ్ తీసుకుంటే ఎవ్వరైనా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గగలుగుతారని చెబుతున్నారు గురిష్క్ కౌర్. అన్ని కిలోలు ఉన్న ఆమె అంతలా బరువు తగ్గగలిగిందంటే..ఓ మోస్తారు అటు ఇటుగా ఉన్న మనందంరం మరింత సులభంగా బరువు తగ్గిపోగలం అనడంలో సందేహమే లేదు కదూ..!. View this post on Instagram A post shared by Gurishq Kaur (@gurishqkaur) (చదవండి: నోరూరించే పాప్‌కార్న్ డ్రెస్‌లో నటి ఎమ్మా స్టోన్..!) -
కెనడా తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నా,పెద్దా అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆడిపాడారు. విత్బ్య్ నగర ఎంపీపీ లాన్ కాయ్ ,డిప్యూటీ మేయర్ మలీహా షాహిద్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన డీటీసీ కార్య సభ్యులను, వాలంటీర్లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంటర్ ప్రూనేర్ అఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన అవంత్ సోలుషన్స్ అధినేత శ్రీనివాస్ వర్మ అట్లూరిని సత్కరించారు. డుర్హం తెలుగు కెనడా క్లబ్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ..ఖండాంతరాలు దాటినా మన తెలుగు సంస్కృతిని ఇనుమడింప చేసేలా దీపావలి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు కుటుంబాలకు ప్రత్యక అభినందనలు తెలిపారు. -
కారు ప్రమాదం తర్వాత రంభ పోస్ట్.. పిల్లలు ఇప్పుడెలా ఉన్నారంటే?
సీనియర్ హీరోయిన్ రంభ కుటుంబం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన ఇద్దరు పిల్లలను కెనడాలో టోరంటోలో స్కూల్ నుంచి తీసుకొస్తుండగా మరో కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభ కూతురు సాషాకు గాయాలవడంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత రెండు రోజులకు హీరోయిన్ రంభ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. తమ కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి రంభ లైవ్) తాజాగా ఇవాళ సోషల్ మీడియాతో ఫోటోలు పంచుకుంది అందాల భామ రంభ. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న పిక్స్ పోస్ట్ చేసింది. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పిక్స్‌తో పాటు గుడ్ మార్నింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగుందా అంటూ రిప్లై ఇస్తున్నారు. View this post on Instagram A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) -
కెనడాలో ఘనంగా దివాలీ సంబరాలు
కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లా పెద్దా అంతా ఆటపాటలు, టపాసులతో ఆనందోత్సాహాల మధ్య వేడుకను నిర్వహించుకున్నారు. ♦కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. ♦ 14 రకాల ఐటమ్స్ తో అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలను ఆరగించారు. సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు. ♦ టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండియా కెనడా బంధం మరింత ముడి వేయించుకోవాలని ఆకాంక్షించారు. ♦ ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించిన బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల,సూర్య కొండేటి, ప్రతాప్ బొల్లవరం, విష్ణు వంగల, రమేష్ తుంపర, శ్రీకాంత్ బండ్లమూడి, రాజశేఖర్ రెడ్డి, మూర్తి వారణాసి, నరసింహారెడ్డి, సర్దార్ ఖాన్, రామ సుబ్బారెడ్డి. ఈకార్యక్రమానికి విజయవంతానికి మిషన్ అఫ్ మదర్ (Mission Of Mothers ( MOM) చాలా సహకరించారు. ♦ ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్ ,ఇలాంటి మరిన్ని మనదైన పండుగలను జరుపుతూ కెనడాలోని తెలుగువారికి సంస్కృతి సంప్రదాయాలను కాపాడతామని చెప్పారు. దీనా రెడ్డి ముత్తుకూరు, రామ్ జిన్నల, శ్రీకాంత్ లింగమనేని, ఫణీన్ద్ర కుమార్ కొడాలి, భరత్ కుమార్ రెడ్డి, మినర్వా రెస్టారెంట్, హార్టుఫుల్ రిలాక్సేషన్ సౌజన్యం తో ఈ వేడుక ఘనంగా ముగిసినది. ఈ వేడుకను విజయంతంం చేసిన 120 మంది వాలంటీర్లు మరో ఆర్గనైజర్ సూర్య కొండేటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
పౌరసత్వ వివాదం: అక్షయ్ షాకింగ్ వీడియో!
-
దెబ్బకు ట్రక్కు వంద ముక్కలైంది..
-
ఆరు రోజులు లంగ్స్ లేకుండానే..!
టొరంటో: తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు కెనడా వైద్యులు లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ప్రాణం పోశారు. ఇందుకోసం వారు అవలంభించిన విధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సరైన సమయంలో ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి దాతల నుంచి లంగ్స్ దొరక్కపోవడంతో సుమారు ఆరు రోజులపాటు ఓ మెషిన్ ద్వారానే మహిళకు కృత్రిమ శ్వాస అందించారు. ఇది వైద్య చరిత్రలో చాలా అరుదైన చికిత్సగా.. దీనికి సంబంధించిన వివరాలను టొరంటో జనరల్ ఆసుపత్రి వర్గాలు ఇటీవల మీడియాతో వెల్లడించాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్ మూలంగా మెలిస్సా బినాట్(32) అనే మహిళ ఊపిరితిత్తులు చెడిపోయాయి. దీనికి తోడు స్వైన్ ఫ్లూ కూడా సోకడంతో ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి ఆ సమయంలో దాతలు లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఇక ఆమె బ్రతకడం కష్టమే అని వైద్యులు తేల్చేశారు కూడా. అయితే చివరి ప్రయత్నంగా పూర్తిగా పాడైపోయిన ఆమె ఊపిరితిత్తులను తొలగించి.. దాతలు దొరికేవరకు 'నోవాలంగ్'గా పిలిచే కృత్రిమ ఊపిరితిత్తుల ద్వారా ఆమెకు శ్వాస అందించారు. ఈ విధానంలో కొద్ది సమయం వరకు పేషెంట్‌కు శ్వాస అందించడం ఓకేగానీ.. సుమారు ఒక వారం పాటు బినాట్ ఈ మెషిన్‌పై ఆధారపడి ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం ఓ దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ఆమెకు అమర్చారు. ప్రస్తుతం బినాట్ కోలుకొని తన రెండేళ్ల కూతురు ఒలీవియాతో ఆడుతోంది. -
టొరంటోలో నేడు తెలంగాణ ఉత్సవాలు
హైదరాబాద్: తెలంగాణ డెవలప్మెం ట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటో నగరంలో శనివారం తెలంగాణ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇంగ్లండ్తోపాటు చాలా దేశాల్లో తెలంగాణ ఉనికిని చాటుతూ ఉత్సవాలు నిర్వహించిన టీడీఎఫ్ ఈసారి కెనడాను ఎంచుకుంది. టొరంటోలో నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక అతి థిగా హాజరవుతారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేయడంతోపాటు ఆటపాటలు, కెరీర్ గెడైన్స్, ఇమ్మిగ్రేషన్ చట్టాలపై అవగాహనకు సలహా లు, సూచనలందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తెలంగాణ నైట్‌లో ఏర్పాటు చేసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. తెలంగాణ వంటకాలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.