![Heroine Rambha shares latest pics with her Children In social media - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/7/rambha.gif.webp?itok=IYr5XafS)
సీనియర్ హీరోయిన్ రంభ కుటుంబం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన ఇద్దరు పిల్లలను కెనడాలో టోరంటోలో స్కూల్ నుంచి తీసుకొస్తుండగా మరో కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభ కూతురు సాషాకు గాయాలవడంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత రెండు రోజులకు హీరోయిన్ రంభ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. తమ కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి రంభ లైవ్)
తాజాగా ఇవాళ సోషల్ మీడియాతో ఫోటోలు పంచుకుంది అందాల భామ రంభ. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న పిక్స్ పోస్ట్ చేసింది. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పిక్స్‌తో పాటు గుడ్ మార్నింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగుందా అంటూ రిప్లై ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment