
సీనియర్ నటి, స్టార్ హీరోయిన్ రంభ మరోసారి వార్తల్లో నిలిచారు. అప్పట్లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రంభ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పట్లో ఆమె నటించిన చిత్రాల్లో బొంబాయి ప్రియుడు సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి సరసన ఆమె నటించింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వహించిన ఈ మూవీ అప్పట్లో ఓ ట్రెంట్ సెట్టర్‌గా నిలిచిపోయింది.
తాజా ఇంటర్వూలో మాట్లాడుతూ.. 'నాకు చిత్రపరిశ్రమలోని కొద్దిమంది స్నేహితుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. కానీ అతను నా పెళ్లికి రాలేదు. అందుకు చాలా బాధపడ్డా. అతడికి ఫ్రెండ్‌షిప్ చేయడం కూడా రాదు. ఎప్పుడు అబద్ధాలు చెబుతాడు.' అంటూ సరదాగా మాట్లాడింది. రంభ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. 2010లో కెనడాలో స్థిరపడిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుని అక్కడే ఉండిపోయింది.