Rambha
-
స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు.. అంతలోనే కనుమరుగైన స్టార్స్ వీళ్లే!
సినిమా అంటే రంగుల ప్రపంచం. ఈ రంగంలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు.. అవకాశాలు కూడా అలా వెతక్కుంటూ వస్తాయి. అయితే అదే క్రేజ్ కెరీర్ మొత్తం ఉంటుందనుకోవడం పొరపాటే. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే ఈ పరిస్థితి కాస్తా భిన్నంగా ఉంటుంది. ఒకసారి గుర్తింపు వచ్చినా.. దాన్ని కెరీర్ మొత్తం నిలబెట్టుకోవడం కష్టమే. అలా మొదట స్టార్ హీరోయిన్లుగా ఫేమ్ తెచ్చుకున్న కొందరు స్టార్స్ తర్వాత తెరపై పెద్దగా కనిపించలేదు. అలాంటి వారి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ స్టార్ డమ్ నుంచి కనుమరుగైన నటీమణులెవరో మీరు చూసేయండి.అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి..తెలుగులో రవితేజ సరసన అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో మెప్పించిన కోలీవుడ్ భామ ఆసిన్. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె తన కెరీర్ తమిళంలో పోక్కిరి, కావలన్, తెలుగులో లక్ష్మీ నరసింహ, రెడీ, ఘర్షణ, హిందీలో గజిని, హౌస్‌ఫుల్ 2 వంటి భారీ విజయాలు దక్కించుకుంది. అంతేకాకుండా ఆసిన్, ఫిల్మ్‌ఫేర్, సైమా లాంటి అనేక అవార్డులను గెలుచుకుంది. తన కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన 2015 నుంచి చిత్ర పరిశ్రమ నుండి పూర్తిగా కనుమరుగైంది.అజిత్ భార్య శాలిని..తొలి రోజుల్లో బేబీ శాలినిగా గుర్తింపు పొందిన శాలిని అజిత్ కుమార్. 1980లలో మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. ఎంటే మమట్టిక్కుట్టియమ్మక్కు, టీవీ సిరీస్ అమ్లూ వంటి చిత్రాలలో బాలనటిగా మెప్పించింది. అంతేకాకుండా పలు క్లాసిక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ 2000 ఏడాదిలో నటుడు అజిత్ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత వెండితెరపై కనిపించలేదు. 2002 తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది.నగ్మాతెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటి నగ్మా. 1990లో తమిళం, తెలుగు, హిందీ, భోజ్‌పురి సినిమాల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఘరనా మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి అల్లుడు లాంటి హిట్ సినిమాల్లో కనిపించింది. తమిళంలో కాదలన్, బాషా, మెట్టుకుడి, తమిళంలో చతురంగం, చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కానీ 2008లో తన సినీ కెరీర్లో దూసుకెళ్తున్న సమయంలోనే నగ్మా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.గోపికమలయాళంలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నటి గోపిక. ముఖ్యంగా ఫోర్ ది పీపుల్ అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా గోపిక తనదైన ముద్ర వేసింది. రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీలో అభిమానులను మెప్పించింది. అయితే 2008లో వివాహం తర్వాత గోపిక సినీ పరిశ్రమను పూర్తిగా విడిచిపెట్టేసింది.తెలుగులో స్టార్ హీరోయిన్..రంభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి యీది కాగా.. సినిమాలతో వచ్చిన గుర్తింపు వల్ల రంభగా మార్చుకుంది. 1990ల్లో దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగింది. అరుణాచలం, ఉల్లతై అల్లిత, క్రానిక్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలలో ప్రేక్షకులను అలరించింది. తెలుగులో భైరవ ద్వీపం, బంగారు కుటుంబం, హిట్లర్, గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో విజయవంతంగా దూసుకెళ్తోన్న రంభ 2011లో నటనకు ఎండ్ కార్డ్ ఇచ్చేసింది. -
రంభ పిల్లల్ని చూశారా?.. ప్రాంక్ వీడియోతో శ్రీలీల
కొడుకు ఇద్దరు కూతుళ్లతో ఒకప్పటి హీరోయిన్ రంభహీరో నితిన్‌ని ప్రాంక్ చేసిన యంగ్ సెన్సేషన్ శ్రీలీలకేరళ బీచ్‌లో సర్ఫింగ్ చేసిన హీరోయిన్ ఆషికా రంగనాథ్మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న హన్సికకొత్త సినిమా షూటింగ్లో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేనాభి అందాలతో కట్టిపడేస్తున్న రీతూ చౌదరిపొట్టి నిక్కర్లో కేక పుట్టిస్తున్న తెలుగమ్మాయి రమ్య View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Anju Kurian (Ju) (@anjutk10) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) -
రంభ కూతురిని చూశారా? అందంలో తల్లిని మించిపోయేలా! (ఫొటోలు)
-
హీరో విజయ్ను కలిసిన రంభ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! (ఫోటోలు)
-
దళపతితో పాటు ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా?
దళపతి విజయ్ ప్రస్తుతం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. లియో సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి విజిలేస్కో అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అయితే విజయ్ మూవీ షూటింగ్ ప్రస్తుతంలో కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రంభను కలిశారు. ఆమె తన కుటుంబంతో కలిసి విజయ్‌తో దిగిన ఫోటోలను తాజాగా ట్విటర్లో పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత నాకు ఇష్టమైన హీరోను కలిశానంటూ రంభ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. It was nice meeting you and catching up after years at @actorvijay :) Congratulations! Wish you the very best #tamilagavetrikalagam #NortherUni #Magickhome #magickhomecanada #Magickwoods pic.twitter.com/Rv2wztbl5q— Rambha Indrakumar (@Rambha_indran) July 17, 2024Shivin with our favourite beloved Thalapathy @actorvijay 🥰 pic.twitter.com/G4XqGDw8ei— Rambha Indrakumar (@Rambha_indran) July 17, 2024 -
రజనీకాంత్‌పై 'రంభ' వైరల్ కామెంట్లు.. సోషల్‌మీడియాలో వివాదం!
రంభ 90వ దశకంలో తమిళ,తెలుగు చిత్రసీమలో అగ్రనటిగా కొనసాగింది. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, చిరంజీవి వంటి ప్రముఖ నటులందరితోనూ ఆమె నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిన నటి రంభ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రంభ షూటింగ్ స్పాట్లో నటుడు రజనీకాంత్‌తో తన పాత జ్ఞాపకాలను పంచుకుంది., నటుడు రజనీకాంత్ చిలిపి పనులలో మునిగిపోతారని రంభ చెప్పిన మాటలను కట్ చేసి రజనీకాంత్ హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోను కొందరు ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 1997లో సుందర్ సి దర్శకత్వంలో అరుణాచలం చిత్రంలో రజనీ, సౌందర్య, రంభ నటించారు. ఈ సినిమాలో రంభ కీలక పాత్ర పోషించింది. అందులో రజనీకాంత్‌కు అసిస్టెంట్‌గా ఆమె మెప్పించింది. ఆ సినిమా సెట్లో జరిగిన సంఘటన గురించి ఆమె ఇలా తెలిపింది. 'అరుణాచలం సినిమాతో పాటు నేను ఆ సమయంలో సల్మాన్ ఖాన్‌తో బంధన్ చిత్రం కూడా ఒప్పుకున్నాను. అప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ హైదరాబాద్‌లో జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుణాచలం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బంధన్ షూటింగ్ చేశాను. ఆ సమయంలో రజనీకాంత్‌ను కలిసేందుకు హిందీ నటుడు సల్మాన్ ఖాన్ వచ్చాడు.. అప్పుడు నేను ఆయన్ను చూసి వెంటనే వెళ్లి కౌగిలించుకుని పలకరించాను.. ఆ సమయంలో రజనీ దూరంగా కూర్చొని మమ్మల్ని చూస్తున్నాడు.. ఆ తర్వాత రజనీ షూటింగ్ ఆపి దర్శకుడు సుందర్ సితో మాట్లాడుతున్నారు. సల్మాన్ ఖాన్ వెళ్లిన తర్వాత అసలు కథ స్టార్ట్ అయ్యింది. సెట్లో గందరగోళం.. నెలకొంది. రజనీకాంత్ టవల్ విసిరికొట్టి నాతో ఆగ్రహంతో మాట్లాడారు. అప్పుడు సుందర్ సి నా వైపు కంగారుగా చూశారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న కెమెరామెన్ కలుగచేసుకుని ఏంటి మేడమ్..? ఇలా చేశారు, ఇకపై మీతో నటించను అని రజినీసార్ అంటున్నారని ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో నేను వెంటనే ఏడ్చేశాను . అప్పుడు నేను ఏడుస్తున్నట్లు రజనీ సార్ గమనించి భయపడి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఆమెను ఎందుకు ఏడిపించారని అక్కడున్న వారందరిపై మండిపడ్డారు. నేనేం తప్పు చేశాను సార్.. ఏం జరిగింది..? అని నేను అడిగాను. అప్పడు వెంటనే షూటింగ్ స్పాట్లో ఉన్న వారందరినీ రజనీ అక్కడికి పిలిచారు. ఉదయం సల్మాన్ ఖాన్ రాగానే రంభ వెంటనే పరుగెత్తుకుంటు వెళ్లి కౌగిలించుకుంది.. ఇక్కడ ఎవరినైనా ఎప్పుడైనా అలా హగ్ చేసుకుందా అంటూ దానిని ఆయన ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. అదే మా సినిమా సెట్లో అయితే.. గుడ్ మార్నింగ్ సార్ అని మాత్రమే చెప్పి వెళ్లిపోతుంది. తన బాలీవుడ్ సినిమా హీరో అయితే కౌంగిలించుకుని మరీ విష్ చేస్తుంది అంటూ అందరి రజనీకాంత్ సరదాగా నన్ను ఆటపట్టించారు. నన్ను ఇలా ఆట పట్టించాలని వారు ముందే ప్లాన్ చేసుకున్నారని తర్వాత అర్థం అయింది. అదేం నాకు తెలియకపోవడంతో చాలా సమయం పాటు నేను ఏడ్చాను. అలా సరదాగా రజనీ సార్ నన్ను ఏడిపించారు.' అని ఆనాటి విషయాలను రంభ గుర్తు చేసుకుంది. ఏదేమైనా రజనీ సర్ని ఎప్పుడూ అలా చూడలేదని రంభ చెప్పింది. ఇది ఉత్తర భారత సంస్కృతి అని ఆయనతో చెప్పాను. వెంటనే తను రేపటి నుంచి యూనిట్లో అందరూ వరుసలో నిలుచోవాలని కోరారు. రేపటి నుంచి రంభ వచ్చి అందరినీ కౌగిలించుకుని గుడ్ మార్నింగ్ చెపుతుందని మరోసారి రజనీ సార్ ఆటపట్టించారని ఆమె గుర్తుచేసుకుంది. కానీ కొందరు సోషల్ మీడియాలు రంభ వ్యాఖ్యలను కొంత వరకు మాత్రమే కట్ చేసి రజనీ కాంత్ పట్ల నెగటివ్‌ను వ్యాప్తి చేయడం గమనార్హం. #Rajinikanth made cute & sweet pranks to #Rambha at #Arunachalam sets 😊😊pic.twitter.com/sknYOopbSt — VCD (@VCDtweets) January 3, 2024 #Rajinikanth made cute & sweet pranks to #Rambha at #Arunachalam sets 😊😊pic.twitter.com/sknYOopbSt — VCD (@VCDtweets) January 3, 2024 -
తనకు మూవీస్ ఇష్టం లేదు అని నటించడం మానేసా
-
నాకు క్లాసికల్ డాన్స్ ఇష్టం.. కానీ రాదు..!
-
చిరంజీవిని చూసి చాలా సిగ్గుపడేదాన్ని..!
-
అలా చేస్తే ఛాన్స్ వచ్చాయి: రంభ
-
ఈ సినిమాలో కష్టం ఒకరిది.. ఫలితం ఇంకొకరిది..!
-
నేను కొన్ని సినిమాలు అలా చేయడం వెనుక కారణం..!
-
సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటే.. సంచలనం అయిపోయింది..!
-
హీరోయిన్ రంభ కూతురిని చూశారా?
-
ఆ హీరో చెప్పేవన్నీ అబద్ధాలే: రంభ
సీనియర్ నటి, స్టార్ హీరోయిన్ రంభ మరోసారి వార్తల్లో నిలిచారు. అప్పట్లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రంభ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పట్లో ఆమె నటించిన చిత్రాల్లో బొంబాయి ప్రియుడు సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి సరసన ఆమె నటించింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వహించిన ఈ మూవీ అప్పట్లో ఓ ట్రెంట్ సెట్టర్‌గా నిలిచిపోయింది. తాజా ఇంటర్వూలో మాట్లాడుతూ.. 'నాకు చిత్రపరిశ్రమలోని కొద్దిమంది స్నేహితుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. కానీ అతను నా పెళ్లికి రాలేదు. అందుకు చాలా బాధపడ్డా. అతడికి ఫ్రెండ్షిప్ చేయడం కూడా రాదు. ఎప్పుడు అబద్ధాలు చెబుతాడు.' అంటూ సరదాగా మాట్లాడింది. రంభ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. 2010లో కెనడాలో స్థిరపడిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుని అక్కడే ఉండిపోయింది. -
యాక్సిడెంట్ తర్వాత తొలిసారి రంభ లైవ్
సీనియర్ హీరోయిన్ రంభ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే! పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తున్న సమయంలో ఆమె కారు యాక్సిడెంట్ అయింది. రంభ కూతురు సాషాకు గాయాలవడంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫొటోలు నిన్న ఎంతగానో వైరల్ అయ్యాయి. తాజాగా కారు యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది రంభ. తన కూతురి కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. 'మొదటిసారి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ ఎంతగానో రుణపడి ఉంటాను. ఇప్పుడు నా కుటుంబం క్షేమంగా ఉంది. నా కూతురు సాషా కూడా క్షేమంగా ఉంది. తనను ఇంటికి తీసుకొచ్చాం. మా మీద ఇంత ప్రేమ చూపించినందుకు ఆనందంగా ఉంది' అని ఎమోషనలైంది రంభ. View this post on Instagram A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) చదవండి: అల్లు శిరీష్ నాకు అప్పటినుంచే తెలుసు: అనూ ఇమ్మాన్యుయేల్ మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు -
హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం
-
Rambha Car Accident: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం, ధ్వంసమైన కారు.. ఫొటోలు వైరల్
సీనియర్ హీరోయిన్, నటి రంభకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురి అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా రంభ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయలు కాలేదని, ఆమె కూతురు సాషాకు చిన్నపాటి గాయలకారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు రంభ ట్వీట్ చేస్తూ.. ప్రమాదానికి గురైన కారు ఫొటోలు, ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఫొటోలను పంచుకుంది. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, ‘వెంకి మామ’ కూతురు ‘పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా... ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేమంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలో ఉంది. బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మా కోసం దేవుడిని ప్రార్థించండి. చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకోండి. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. కాగా ఈ ప్రమాదంలో కారు డోర్ పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. Ouw car was hit by another car at an intersection wayback from picking kids from school! "Me with kids and my nanny" All of us are safe with minor injuries 😔my little Sasha is still in the hospital 😞 bad days bad time 😪😰please pray for us 🙏 your prayers means a lot 🙏🙏 pic.twitter.com/BqgrNjfdpi — Rambha Indrakumar (@Rambha_indran) November 1, 2022 -
ఇండియా వచ్చిన రంభ, వీడియో వైరల్
అలనాటి హీరోయిన్ రంభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా దుమ్ము రేపిన ఆమె బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, బెంగాలీ.. ఇలా పలు ఇండస్ట్రీలలో సైతం స్టార్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు టాలీవుడ్లో స్టార్ హీరోలందరితోనూ నటించిన ఆమె 2010లో బిజినెస్మెన్ ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుని కెనడా వెళ్లిపోయింది. ముగ్గురు పిల్లలతో అక్కడే సెటిలైపోయింది. తాజాగా ఆమె ఓ పెళ్లి కోసం భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అక్క కూతురు పెళ్లి కోసం ఇండియా వచ్చానంది. ఫ్యామిలీతో కలిసి తిరుపతి దర్శనం చేసుకున్నానంది. ప్రస్తుతానికి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చింది రంభ. చదవండి: రౌడీ హీరోకు ఉంగరం తొడిగి ఏడ్చేసిన మహిళా అభిమాని, వీడియో వైరల్ విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్, ఐశ్వర్య.. ఫొటో వైరల్ -
భర్త చనిపోయాక మీనా తొలిసారి ఇలా.. ఫొటో వైరల్
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే భర్త విద్యాసాగర్‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అతడి మరణంతో ఆమె కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తాజాగా మీనాను పరామర్శించేందుకు సీనియర్ హీరోయిన్స్ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీనా వారితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త చనిపోయాక మీనా చేసిన తొలి పోస్ట్ ఇది. ఇందులో మీనా నవ్వుతూ కనిపించగా ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. కాగా ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న మరణించారు. ఆయన మరణంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. ఇటీవలే ఆమె ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్‌లో రాజేంద్రప్రసాద్ బర్త్‌డే సెలబ్రేట్ చేయగా ఆ వేడుకల్లో మీనా తళుక్కున మెరిసింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: మహేశ్‌కు చిరు, వెంకీల స్పెషల్ బర్త్‌డే విషెస్ ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ -
మందు తాగి చిందేసిన జగపతిబాబు, శర్వానంద్
Hey Rambha Rambha Song In Maha Samudram: శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "మహా సముద్రం". 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. జూలై 9న షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా హే రంభ పాట రిలీజైంది. రంభ మాయలో పడిపోయిన జగపతిబాబు, శర్వానంద్ మందేసి చిందేస్తున్నారు. అందాల రంభకు వీరాభిమానులమంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. పూటుగా తాగుతూ 'హే రంభ.. హే రంభ' అని ఆమె జపమే చేస్తున్నారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను చైతన్ భరద్వాజ్ ఆలపించాడు. వైజాగ్ బీచ్‌లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మార్మోగిపోతోంది. మరి మీరు కూడా ఓసారి ఈ పాటను వినేయండి.. -
నటి రంభ.. వెండితెరకు దూరమై 13ఏళ్లు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే!
ఒకప్పుడు తెలుగు తెరపై స్టార్ హీరోలందరితో నటించి తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసిన నటి రంభ వెండితెరకు దూరమై దాదాపు 13 ఏళ్లు అవుతుంది. తెలుగు హీరోయిన్ అయినప్పటికి దాదాపు అన్ని భారత చలన చిత్ర పరిశ్రమల్లో నటిగా సత్తా చాటారు ఆమె. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, భోజ్‌పూర్, పంజాబీతో పాటు పలు పరిశ్రమల్లో రంభ నటించారు. ఆమె నటించిన సినిమాలన్ని దాదాపు సక్సెస్‌ను అందుకున్నాయి. రంభ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తెలుగు కుటుంబంలో జన్మించారు. చదువుతున్న రోజుల్లో పాఠశాల, కళాశాలల్లో స్టేజ్ షోల్లో నటించిన రంభకు అనుకోకుండా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ తగ్గిపోతున్న క్రమంలో రంభ ఒక్కసారిగా వెండితెరపై మెరిశారు. హిందీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా గ్లామర్ పాత్రలు పోషించి అందరిని మెప్పించారు. అలా తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలకు అసలు సెట్ అవ్వరనే ముద్రను ఆమె చెరిపేసి తనదైన ముద్రను వేసుకున్నారు. అంతగా గుర్తింపు తెచ్చుకున్న రంభ సినిమాలకు దూరమయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తున్నారు. అయితే మొదట్లో రంభను చూసి అందరూ నార్త్ హీరోయిన్ అనుకున్నారట, తెలుగు హీరోయిన్ అంటే ఎవరూ నమ్మవారు కాదట. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు మూవీతో తొలి హిట్ అందుకుని ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ తెలుగులో బిజీ హీరోయిన్గా మారారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో నటించిన రంభ దాదాపు దశాబ్దా కాలం పాటు స్టార్ హీరోయిన్గా రాణించారు. కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమలోని స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించారు. ఆ తర్వాత కూడా యువ హీరోలతో స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడిన రంభ 2008 తర్వాత రెగ్యూలర్ మూవీస్ చేయడం మానేశారు. అనంతరం 2010 వరకు అడపాదడపగా కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో నటించినప్పటికి అవి పెద్దగా గుర్తిపు పొందలేదు. ఈ క్రమంలో 2010లో శ్రీలంకన్ బిజినెస్ మెన్ ఇంద్రకుమార్ పథ్మనాథన్‌ను పెళ్లి చేసుకుని కెనడా వెళ్ళిపోయారు. ప్రస్తుతం కుటుంబంతో సహా అక్కడే సెటిలైయిపోయారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు సంతానం. తరుచు తన పిల్లలతో భర్తతో కెనడా సందడి చేస్తున్న ఫొటోలను రంభ సందర్భాన్ని బట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. అయితే వివాహం అనంతరం కూడా పలు డ్యాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరించిన ఆమె తిరిగి నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారో లేదో వేచి చూడాలి. -
సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్చల్!
రంభ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. 1992లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రంభ.. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ, భోజ్‌పూరీ భాషట్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగమ్మాయే అయిన రంభ మొదట సర్గం అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా అవతారమెత్తారు. అదే ఏడాది ఆ ఒక్కటి ఆడక్కు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, రౌడీ అన్నయ్య, బొంబాయి ప్రియుడు, హిట్లర్, బావగారు బాగున్నారా, హలో బ్రదర్, తొలిముద్దు, ఇద్దరు మిత్రులు వంటి చిత్రాల్లో నటించింది. దాదాపు అప్పటి స్టార్ హీరోలంరితోనూ జోడీ కట్టారు. ఇక చివరగా ఆమె 2008లో వచ్చిన దొంగ సచ్చినోడు సినిమాలో నటించారు. తరువాత 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రంభ సినిమాల నుంచి తప్పుకున్నారు. మూవీస్‌కు గుడ్‌బై చెప్పి ప్రస్తుతం కుటుంబంతో గుడుపుతున్నారు. అనంతరం బుల్లితెరపై కొన్ని షోలకు వ్యాఖ్యాతగా వచ్చారు. అయితే తాజాగా రంభ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం 'మహా సముద్రం'. వివాఖపట్నం బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా సినిమా రూపొందుతోంది. జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో జగపతిబాబు, శర్వానంద్‌పై ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటలో రంభ ఫొటోలు, ఫ్లెక్సీలు కనిపిస్తాయి. దీంతో పాటలో రంభ ఆడిపాడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి సాంగ్‌లో కేవలం రంభ ఫోటోలు మాత్రమే కనిపిస్తాయో.. లేక రంభ కూడా కనిపించనుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాలి. చదవండి: ఐసోలేషన్లోకి ప్రభాస్.. రాధేశ్యామ్ షూటింగ్‌కు బ్రేక్! -
మధురమైన జ్ఞాపకం
‘‘మా పదో వివాహ వార్షికోత్సవం కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరిగింది’’ అన్నారు రంభ. ఈ వేడుకల గురించి ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారామె ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేను, నా భర్త (ఇంద్రకుమార్) మా పిల్లల (కుమార్తెలు లాణ్య, సాషా, కుమారుడు శివన్) సమక్షంలో మా వివాహ వార్షికోత్సవాన్ని ఇంట్లోనే చేసుకున్నాం. ఈ వేడుకలో మా బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. అయినప్పటికీ ఇది మా జీవితాల్లోనే ఒక మధురమైన వేడుక అని చెప్పగలను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలను పంచిందీ వేడుక. ఒకొరికొకరం సాయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లూ మేమే చేసుకున్నాం. ఆర్డర్ చేయకుండా మా కేక్‌ను మేమే సొంతంగా తయారు చేసుకున్నాం. ఈ కేక్‌లోని ప్రతి చిన్న భాగంలోనూ మా పదేళ్ల ప్రేమ దాగి ఉంది. మా కుమార్తెలు లాణ్య, సాషా మాకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ గ్రీటింగ్ కార్డ్‌ను బహుమతిగా ఇచ్చి మా ఆనందాన్ని మరింత పెంచారు. ఈ సెల్ఫ్ క్వారంటైన్ సమయంలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబంతో సమయాన్ని గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అని పేర్కొన్నారు రంభ. 1992 నుంచి 2010 వరకు నటిగా వెండితెరపై సత్తా చాటారు రంభ. ఆ తర్వాత బుల్లితెర షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించారామె. 2010 ఏప్రిల్ 8న కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను రంభ వివాహం చేసుకున్నారు. ఫ్యామిలీతో రంభ -
చక్రపాణి ఇంద్రలోక యాత్ర
దేవేంద్రుని మందిరం.ఇంద్రుడు కోపంతో బుసలు కొడుతూ అటు ఇటూ పచార్లు చేస్తుంటాడు.రంభ చెంపకు చేయి చేర్చి విచారంగా ఆసనాన్ని ఆనుకుని నిలబడి ఉంటుంది.‘‘అసలు నిన్ను భూలోకం పంపడం నా బుద్ధితక్కువ...నారదుడి మాట విని ఇంత అనర్థం తెచ్చుకున్నాను...ఎక్కడ దేవేంద్రలోకం! ఎక్కడ నీచ మానవలోకం! ఛీఛీ...చెప్పడానికైనా నీకు సిగ్గు లేదా రంభా! నీవేనా ఈవిధంగా మారావు! ఎంత అవివేకం! ఎంత అవమానం!’’‘‘ఇందులో అవమానం ఏమున్నది ప్రభూ! మానవులు కూడా ఎంతటి ప్రతిభావంతులో మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు...నిజమైన కళాసేవ చేసి తరించాలంటే మానవలోకంలోనే సాధ్యమవుతుంది. సరస్వతిదేవి అక్కడే స్థిరనివాస మేర్పరచుకున్నది. మానవలోకంలోని సుఖఃదుఃఖాలు మనకు లేవనిపిస్తోంది...అన్నీ ఉంటేనే జీవితం అనీ, మనం అమృతం తాగి ఎప్పుడూ మత్తుగా పడి ఉంటామనీ, మన జీవితాలు ఎందుకూ పనికిరావనీ చక్రపాణిగారు చెప్తుండేవారు’’‘‘బుద్ధిహీనురాలా! అతడి పేరు నా దగ్గిర ఎత్తకు. నా విరోధిని మెచ్చుకుని నన్ను అవమానిస్తావా?’’ ‘‘ఇందులో అవమానించడం ఏమున్నది ప్రభూ!...మీ విరోధుల్ని ఎంతమందిని నేను లొంగతీసి మీ పాదాల ముందు పడవేయలేదు! ఎంతమందిని తపోభ్రష్టులను చేయలేదు. కాని చక్రపాణిగారి విషయం అలా కాలేదు’’‘‘అంటే చక్రపాణి మానవాతీతుండటావా!’’‘‘అనుకోవాల్సిందే! ఆయన మనిషి కాడు...అయితే నా ఓటమికి అర్థం లేదుకదా ప్రభూ!’’‘‘మూర్ఖురాలా– ఆ సామాన్య మానవుడికి నీవు దాసోహం అన్నది చాలక నన్ను కూడా ఓటమిని ఒప్పుకోమంటావా!’’ ‘‘అది ఓటమిగా నేను భావించడం లేదు ప్రభూ...చక్రపాణిగారి మంచితనం చూసి నా అంతట నేనే ఆయన దగ్గిర ఉండి కళాసేవ చేసి తరిద్దామనుకున్నాను. నిజంగా నాది ఓ జీవితమేనా అనిపించింది. నా మీద నాకు రోత పుట్టింది. ఎప్పుడూ మీ దర్బారులో నాట్యం చేయడం తప్ప నా జీవితానికి ఏ విధమైన అర్థం లేకుండా పోయింది...అక్కడ అనేక విధాలయిన పాత్ర పోషణలో నవరసాలు నటనలూ చిందించే కళాజీవుల్ని గురించి విని నా మనసు ఉప్పొంగిపోయింది. చక్రపాణిగారిని వేషమిప్పించమని నేనే అడిగాను. అందులోనూ మంచి బరువువైన పతివ్రత పాత్ర ఇచ్చారు...నా కోసం రాయించారు పాపం... నేను ఎంత పాపిని! చిత్రం పూర్తి చేయకుండా మధ్యలోనే వచ్చేశాను. ఆయన నా వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో!’’‘‘ఛీ! జ్ఞానహీనురాలా! ఇంకా నీ వా భూలోకం మరచి పోలేకపోతున్నావా! పైగా ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతున్నావా! నీవల్ల నారదాదుల దగ్గిర నాకెంత అవమానం. ఆ నారదుడు ఊరుకోడే! ముల్లోకాలలోనూ నా ఈ అపజయాన్ని చాటుతాడే! నీ వా భూలోకం సంగతి మర్చిపోయి నీ నిత్యవిధులు నిర్వర్తించు...’’‘‘నావల్ల కాదు ప్రభూ! ఇక నేనే మీ దర్బారులో ఆడలేను. నేను భూలోకానికి పోతాను. నా కక్కడ కొత్తజీవితం కనిపించింది. నన్ను క్షమించండి. నన్ను వెళ్లనివ్వండి...’’ రంభ కదుల్తుందిముందుకు...ఇంద్రుడు తటాలున అడ్డు నిలిచి ‘‘రంభా’’ అంటూ పెద్ద రంకె వేస్తాడు.రంభ నిశ్చలంగా నిలబడి, ‘‘మీరు కేకలు వేసి ప్రయోజనం లేదు ప్రభూ! నా నిశ్చయం మారదు. నేను చలనచిత్రాల్లో నటించి తీరాలి. నన్నాకపండి’’ రెండడుగులు వేస్తుంది.ఇంద్రుడు మళ్లీ అడ్డునిలిచి కోపంతోనూ, అవమానంతోనూ కంపించిపొతూ, ‘‘నీ నిశ్చయం మారదా, నీ పట్టు విడవ్వా?’’‘‘విడవలేను. నా ఆశయం నెరవేరాలి. నేను ఒక గొప్ప నటిననిపించుకుని–అటు భూలోకానికి, ఇటు ఇంద్రలోకానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలి. రంభ కేవలం నాట్యకత్తే కాదు అనిపించుకోవాలి. అలాంటి పాత్రఇచ్చారు ‘‘ఛీ,దౌర్భాగ్యురాలా! ఆ సన్యాసి పేరెత్తుకు నా దగ్గిర’’‘‘నారాయణ’’ అంటూ నారదుడు ప్రవేశిస్తాడు.‘‘ఏమిటి ఇంద్రా, రంభతో ఘర్షణ పడుతున్నట్లున్నావు. ఏమైంది రంభ?’’ఇంద్రుడు కాస్త చల్లబడి, ‘‘చూడు నారదా! భూలోకం నుండి వచ్చినప్పటి నుంచి నే వెళతాను భూలోకానికి అంటుంది’’‘‘నారాయణ...అందాకా వచ్చిందీ కథ. నేనప్పుడే చెప్పాను గదయ్యా! ఆ మానవులు అసాధ్యులు. అందులోనూ ఆ సినిమాజీవులు అఖండులని...అయితే ఇంతకూ రంభ మళ్లీ ఎందుకు వెళతానంటూందీ!’’‘‘ఎందుకా! నా విరోధి చక్రపాణి తీసే చిత్రంలో నటించడానికట...’’‘‘నిజమే. మరి పాపం సగంలో మనిద్దరం వెళ్లి రంభను తీసుకొచ్చామాయే–అయినా మళ్లీ వెళ్లి లాభం ఏమిటి! రంభకు బదులు ఎవరిచేతనో ఆ పాత్ర వేయించి చిత్రం పూర్తి చేస్తున్నట్టున్నాడే’’‘‘ఆ! నిజంగానా! హతవిధి...నే నెంతగా ఆశపడ్డానే! ఎంతో కష్టపడి నటించానే...మీ వల్ల నా నటనా జీవితం నాందిలోనే ఈవిధంగా అయిందే! ఇక నేను జీవించి ప్రయోజనం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటాను’’ అంటూ రంభ వెక్కివెక్కి ఏడుస్తుంది.ఇంద్రుడు ఖంగారు పడిపోతూ ‘‘నారదా! ఇప్పుడేది దారి! రంభకు పిచ్చి ఎలా వదుల్తుంది?’’‘‘నీవు పిక్చరు తీస్తే వదుల్తుంది...’’ ‘‘పిక్చరా! అంటే?’’‘‘అంటే ఏముంది ఇంద్రా...ఆ మానవులు చలనచిత్రాలు ఎలా తీస్తున్నారో అలాగే ఇంద్రలోకంలో నవ్వూ ఒక చిత్రశాల కట్టించు...’’‘‘చిత్రశాల నేను కట్టించడమా! ఏమిటి నారదా మీరనేది! అది మనకెలా సాధ్యం!’’‘‘ఆ వివరాలన్నీ చక్రపాణిని కనుక్కుంటే సరి...’’‘‘నేనంటే కిట్టనివాడిని రంభ కోసం ‘అన్యధా శరణం నాస్తి’ అంటూ అర్థించమంటావా!’’‘‘ఏంచేస్తాం ఇంద్రా! మనకు తెలియని విషయాలు తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు’’ఇంద్రుడు బరువుగా నిట్టూర్పు విడిచి, ‘‘అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు నారదా?’’‘‘ఏంలేదు...తక్షణం ఆ చక్రపాణిని పిలిపించి ఇక్కడే ఒక చిత్రశాల కట్టించే ఏర్పాట్లు చేయి...రంభ కోసం నీవే ఇక్కడ చలనచిత్రాలు తీయవచ్చు. అందుకు కావలసిన పరికరాలూ, ఇతర వివరాలూ చక్రపాణి చెప్తాడు. అతడు ఎలా చెప్తే అలా చేయి...ఏం రంభా!’’‘‘అవును స్వామీ...మీరు చెప్పింది చాలా బాగున్నది. చక్రపాణిగారు మన ఇంద్రలోకానికి రావాలేగాని, వస్తే వారు మన కన్ని వివరాలు చెప్తారు’’ అంటూ సంతోషంగా చెప్తుంది రంభ.కోపం దిగమింగుకుని కొరకొర చూస్తాడు ఇంద్రుడు‘‘నారాయణ!...ఆ ఏర్పాట్లేవో వెంటనే చూడు ఇంద్రా!’’‘‘సరే ప్రారబ్దం మహామహులకే తప్పలేదు. ఇంతకూ ఆ మానవుడిని ఇక్కడికి ఎలా తీసుకురావడం! అతడు ఒట్టి మొండివాడే! పిలిస్తే రాడే!’’‘‘నిజమే! పిలిస్తే వచ్చేమనిషికాడు–నిద్రపోతూండే సమయంలో మంత్రశక్తితో తీసుకురావలసిందే. నేను వెళ్లొస్తాను...నారాయణ’’భూలోకంచక్రపాణిగారి గది...చక్రపాణిగారు నిద్రపోతుంటారు. నిద్దట్లో కలవరిస్తాడు...‘‘ఏంకదది! ఆడి కద ఈడు కాపీ గొట్టాడు...అసలు కద ఛండాలం...గుండమ్మకద బాగ లేదన్నాడు గదాడు!...’’ అని గొణుగుతూ ఒత్తిగిలి పడుకుంటాడు...మంచం కదుల్తుంది...మరుక్షణం అదృశ్యమౌతుంది.ఇంద్రలోకం చక్రపాణిగారికి మెలకువ వస్తూనే కండ్లుకూడా తెరవకుండా మంచం పక్క టీపాయి ఉందనుకుని సిగరెట్ డబ్బా కోసం చెయ్యి చాస్తడు. పండ్లూ ఫలహారాలు చేతికి తగుల్తాయి...గొణుక్కుంటూ లేచికూర్చుంటాడు...ఎదురుగా ఒక పెద్ద వెలుగల్లే ఇంద్రుడు కనిపిస్తాడు...అంత వెలుగు చూడలేక ఒక చేయి కండ్ల కడ్డుంచుకుని విసుగ్గా...‘‘ఎవర్నువ్వు!’’ అంటాడు.‘‘నేను ఇంద్రుడిని’’‘‘అట్టనా! అద్సరేగానీనాసిగరెట్ డబ్బా చూశావా!’’ఇంద్రుడు వెలవెలబోతాడు.మరుక్షణం రత్నాలపెట్టెలో బంగారుచుట్టలు తెచ్చి చక్రపాణిగారికి అందించబోతాడు సేవకుడు.‘‘అబ్బే! ఇందేంటి ఛండాలం! నాకు స్టేటెక్స్ప్రెస్ కావాల...’ఇంద్రుడు ‘‘చిత్తం’’ అంటూ అర్థం కాక సేవకుడి వైపు చూస్తాడు...సేవకుడు అదృశ్యమౌతాడు...‘‘అద్సరే. నే నెక్కడున్నా నిప్పుడూ?’’‘‘చిత్తం. ఇంద్రలోకంలో...’’‘‘అట్టనా!...అయినా నన్నెందుకు తెచ్చావ్ ఇక్కడికి. అస్సలు నువ్వు ఇంద్రుడివేనా లేక వేషం వేశావా?’’ఇంద్రుడు చిన్నబుచ్చుకొని, ‘‘వేషం కాదు... నేనుదేవేంద్రుణ్ణి...’’‘‘పైన ఆ ‘దేవ’ ఎందుకులే...ఒట్టి ఇంద్రుడంటే చాల్దూ!...అస్సరేగానీ నా సిగరెట్ డబ్బా ఏదీ!’’‘‘చిత్తం. ఇదుగో’’ అంటూ సేవకుడు చక్రపాణిగారికి సిగరెట్ డబ్బా అందిస్తాడు.‘‘అగ్గిపెట్టేదీ?’’‘‘తమరు ధూమపానం చేయండి. నా శక్తితో దానంతట అదే వెలుగుతుంది’’ అంటాడు ఇంద్రుడు.‘‘దీనికి నీ బోడిశక్తెందుకూ?’’ అగ్గిపుల్లతో పోయేదానికి!అగ్గిపుల్లెలిగించకపోతే సిగరెట్ తాగినట్టుండదు...అగ్గిపెట్టొకటి తెప్పిచ్చు...చిత్తం...మరుక్షణం అగ్గిపెట్టె చక్రపాణిగారి చేతి కందిస్తాడు సేవకుడు. చక్రపాణిగారు సిగరెట్ వెలిగిస్తూ, ‘‘అవునుగానీ, నా క్కాఫీ కావాల్నే! దొరుకుద్దా!’’‘‘చిత్తం...తెప్పిస్తాను’’ అంటూ ఇంద్రుడు సేవకుని వైపు చూస్తాడు.‘‘అద్సరేగానీ, బాత్రూమెక్కడా. అసలుందా బాత్రూము!’’‘‘చిత్తం’’ ఇంద్రుడు తిరిగి చూస్తాడు. ఇద్దరు సేవకులు వస్తారు.చక్రపాణిగారు మంచం దిగి కాళ్లు కిందపెడతాడు. ‘‘అరెరె? నా చెప్పులేయి! ఇదేంటి కాళ్లకింద ఇంత మెత్తగుంది!’’‘‘అది పూలరెక్కల రత్నకంబళం’’‘‘కాళ్లకింద పూల్రెక్కల కార్పేట్టేంటి ఛండాలం...గొర్రెబొచ్చుది దొరకదు మీకూ’’ఇంద్రుడు చక్రపాణిగారి వేపు అయోమయంగా చూస్తాడు.‘‘అన్నట్లు రంభేదీ! బాగుందా!’’ అని చక్రపాణిగారు అడుగుతుండగానే రంభ ఒక స్తంభం చాటు నుండి పరుగెత్తుకొచ్చి ఏడుస్తూ చక్రపాణిగారి పాదాల మీద పడుతుంది. ఇంద్రుడు అవమానంతో ముఖం తిప్పుకుంటాడు. చక్రపాణిగారు కాస్త ఇబ్బందిపడుతూ, కాళ్లు వెనక్కి లాక్కుని ‘‘ఇదేంటి సినిమాలో సీనులాగా...లేలే...బాగున్నావా...పతివ్రతేషం కావాలని కోరికోరి ఏసిందానివిసగంలోనే రంభ లేచి నిలబడి ‘‘అందుకే క్షమించమంటున్నాను. నా తప్పులేదు చక్కన్నగారూ. తప్పంతా వారిది’’ అంటూ ఇంద్రుణ్ణి చూపిస్తుంది. ఇంద్రుడు కోపాన్ని దిగమింగి తలవంచుకుంటాడు.‘‘సరేలే, దానికి నువ్వేడవడం ఎందుకూ...ఎనకటికి ఎవతో మొగుణ్ణి గొట్టి ఏడ్చిందట...పిచ్చెరు సగంలో నువ్వొచ్చినందుకు ప్రొడ్యూసరేడవాలిగాని నువ్వేడుస్తావేం! బాతురూమ్ కెళ్తొస్తా’’ అంటూ సేవకుల వెంటనడుస్తాడు.పారిజాతవనంఇంద్రుడు, రంభ, చక్రపాణిగారూ ఆసీనులై ఉంటారు. సేవకుడు నవరత్నాలు పొదిగిన పాన పాత్రల్లో అమృతం నింపి తీసుకొచ్చి వారి ముందుంచుతాడు. ఇంద్రుడు ఒక అమృతపాత్ర అందివ్వబోతాడు. అది చూస్తూనే ‘‘ఇదేమిటి ఛండాలం...ఇదెవుడు తాగుతాడు. నాకిదొద్దు. స్కాచ్‌విస్కీ ఉంటే తెప్పిచ్చు’’ అని నసుగుతాడు చక్రపాణిగారు.ఇంద్రుడు వెలవెలబోతాడు.‘‘అవును ప్రభూ! చక్కన్నగారికి అమృతం అంటేనే అసహ్యం’’ అంటుంది రంభ. ఇంద్రుడు రంభను మింగేట్లుచూస్తాడు. మరుక్షణం ‘స్కాచ్‌విస్కీ బాటిల్’ గ్లాసుతో సహా చక్రపాణిగారి పక్కనున్న టేబిల్ మీదకనిపిస్తుంది. ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ మరొక చేత్తో విస్కీగ్లాస్ తీసుకుంటాడు. ఇంద్రుడు అమృతం సేవిస్తూ, రంభను కూడా తీసుకోమంటాడు. చక్రపాణిగారు కొప్పడతారు ఒద్దని సౌంజ్ఞతో చెప్తుంది రంభ...ఇంద్రుడి కండ్లునిప్పుకణాల్లా ఎర్రబడతాయి.‘‘ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్లు?’‘‘మీతో ఒక గొప్ప పనివుండే తీసుకొచ్చాం చక్కన్నగారూ!’’ అంటుంది రంభ. ‘‘నాతో మీకేం పని! అన్నట్లుగా నాకవతల షూటింగుందే. పదిగంటలకే నే నక్కడుండాల్నే...’’రంభ కంగారు పడిపోతూ ‘‘చక్కన్నగారూ! త్వరగా వెళ్లడానికి వీల్లేదు. మీరు కొంతకాలం ఉండి ఇక్కడ నా కోసం చిత్రం తీసే ఏర్పాట్లు చేయించాలి. ఏది కావాలన్నా...క్షణంలో సమకూర్చగల ఇంద్రలోకం ఇది’’‘‘క్షణంలో మీరేం జేసినా, కథనీ, టెక్నిషియన్లనీ క్షణంలో తయారుజేయలేరే.... మాయం చెయ్యడం, మాయం గావడంలా తేలికపన్లు గావియ్యన్నీ... అయినా మీ కెందుకుకా స్టూడియోల పిక్చెర్లూ...పన్లేనిపనిగాకపోతే’’ఇంద్రుడు తలపట్టుకొని ఒక్క నిట్టూర్పు విడుస్తాడు.రంభ అనునయంగా కాస్త చక్రపాణిగారి దగ్గరకు జరిగి–‘‘నా కోసమే చక్కన్నగారూ! భూలోకం నుంచి వచ్చినప్పటి నుంచి నాకు నటించాలనే కోరిక తీవ్ర రూపం దాల్చింది. మీ చిత్రంలో మీరు చెప్పినట్లు విని ఎంతో ఉత్సాహంతో నటించాను...ఎన్ని కలలుకన్నాను. కాని ఆ చిత్రం పూర్తి చేసే భాగ్యం లేకుండా పోయింది’’‘‘దానికింత గొడవెందుకూ! మళ్లీ నువ్వే అక్కడి పో! అక్కడే ఏదో ఒకేషం ఏస్తే పోయేదానికి. నీ ఒక్కదాని కోసం ఇంతదూరంలోవేరేస్టూడియో ఎందుకూ...’’ఫర్వలేదు చక్కన్నగారూ! నా కోసం దేవేంద్రులు ఏంకావాలన్నా సమకూరుస్తారు...ఒక్క స్టూడియో ఏమిటి...’’‘అద్సరేలే...ఇంద్రుడు నీ చేతిలో ఉన్నాడని నువ్వు స్టూడియోలు కట్టించొచ్చు. కాని ఇక్కడికొచ్చి పిక్చెరు తీసేవాడుండొద్దూ! పైగా ఇక్కడ ఏంగావాలన్నా అక్కణ్ణించి రావాలాయె...ఎందుకొచ్చింది...ఏదోవషం ఇప్పిస్తా’’రంభ సంతోషపడిపోతూ ‘‘మీరెలా చెప్తేఅలాచేస్తాను చక్కన్నగారూ’’ అంటుంది.ఇంద్రుడు గాభరపడిపోతూ...‘‘అదికాదు చక్రపాణిగారూ! రంభ లేకపోతే ఇంద్రలోకంలో ఏముంటుంది’’‘‘లేకపోతే పోద్దీ...కళ కోసం నీ పరువు పోగొట్టుకుంటావానీలాంటోళ్లు పిక్చెర్లనీ, స్టూడియోలని మొదలెలెడితే అది కాస్తా కంపౌద్ది...గవర్నమెంటోళ్లు సినిమాలు తీయించినట్టుంది’’ఇంద్రుడు ఏం సమాధానం చెప్పాలో తోచక రంభ వైపు ‘నాకక్కడషూటింగుందే! వాళ్లంతా ఏం కంగారు పడుతున్నారో! ఇదంతా ఒక్కరోజులో జరిగేది కాదే! అయినా ఇప్పుడుడెంటనే పిక్చెరు తీయడానికి ఇక్కడ మీకేం ఉంది? ఎట్ట దీస్తారంట!’’రంభ, ఇంద్రుడు ఒకరిముఖాలు ఒకరు చూసుకుంటారు అర్థం గాక.‘అంటే చిత్రశాల లేదని అంటున్నారా?’’ అని అడుగుతుంది రంభ....‘‘మీరే చెప్పండి చక్కన్నగారూ ఏంకథ బావుంటుందో!’’ అంటూ ఉత్సాహంగా ముందుకువంగి కూర్చుంటుంది రంభ.‘‘బాగానే ఉంది. మాకే మంచి కథల్దొరక్క అవస్తగా ఉంటే నీకేం చెప్పేది...మీరే చెప్పండి’’రంభ ముభావంగా ఇంద్రుడి వైపు చూస్తుంది...ఇంద్రుడు లేని ఉత్సాహం తెచ్చుకుని‘‘మూమూలు కథల కంటే పురాణగా«థలే మేలంటాను చక్రపాణిగారూ...ఎందువల్లంటే వాటివల్ల పుణ్యమూ, పురుషార్థమూ లభిస్తుంది. దేవదానవ వైరమనేది యుగయుగాల సమస్య. అటువంటి కథా వస్తువు తీసుకొని, రాక్షసులు దేవతలను పెట్టే బాధలతో కథ ఉంటుంది’’‘‘చెత్త చేస్తానంటావ్. అంతేగా! అసల్నువ్వు ఎటువంటోడివంట! ఆ తల్లేని రాక్షసులు అరణ్యాలూ, కొండలూ, గుహలు పట్టుకుని బ్రతుకుతుంటే, వాళ్లని చూసి నువ్వు ఇంత దూరాన్నించే ఒణుకుతుంటివి...వాళ్లొచ్చి నిన్నేం అవస్తలు పెడుతున్నారంట! అసలు వాళ్లు తల్చుకుంటే నిన్నిక్కణ్ణుంచి ఎప్పుడో పీకేసేవాళ్లంటా నేను’’ఇంద్రుడు చిన్నబుచ్చుకుని వెనక్కి జరుగుతాడు. రంభ సంభాషణ మార్చడానికి ప్రయత్నిస్తూ...‘‘పోనీ మన బృహస్పతులవారి చేత వ్రాయిద్దామా’’ అంటుంది.‘‘ఏంటి! నీ జాతకమా! సినిమా కథ ఆయనేం రాస్తాడు! ఆయన్రాస్తే ఆయనలాంటోళ్లు జూడాల్సిందే’’ఇంద్రుడు కాస్త భయపడుతూనే ‘‘చూడండి చక్రపాణిగారూ! భూలోకంలో కత్తియుద్ధాలూ, నాట్యాలు ఉంటే చిత్రాలు రాణిస్తాయని రంభ చెప్పింది...మరి మనకు రంభతో బాటు ఊర్వశీ, మేనక, తిలొత్తమాదినాట్యకత్తె లెందరో ఉన్నారు’’‘‘వాళ్ళాడితే ఎవుడు జూస్తాడు నువుదప్పితే...ఏనాటి మేనక! ఏనాటి తిలోత్తమ! నీ దగ్గిర ‘పెన్షన్’ తీసుకుని బతికే ఆ ముసలొళ్ల చేత ఏం ఆడిస్తావులే...ఏదన్నా సెంటిమెంటుండాలో కథలో...లేదంటేగుండమ్మకథలాగానన్నా ఉండాలా...అయ్యన్నీ మీరేం తీస్తారుగానీ,ఏదన్నాగొప్పోడి కథ తీస్తే బాగుంటది’’ఇంద్రుడు కోపంతో, అవమానంతో కంపించిపోతాడు లోలోపలే. రంభ కాస్త గాభరపడుతూ...‘‘అదికాదు చక్కన్నగారూ, గొప్ప గుణాలు రాక్షసుల్లో ఎలా ఉంటాయి! దేవతల్లో ఉంటాయి’’‘‘అని మీరు చెప్పుకోవాల్సిపందే. గొప్పగుణాలుండే రాక్షసుల్లేరూ? చెప్పమంటావా! బలి న్దీసుకో! బలి ఎట్టాంటోడు! ఎంత గొప్పోడు! ఆడి కాలిగోటికి పోల్డే మీ ఇంద్రుడు! వాడుతన కంటే గొప్పోడవుతున్నాడనంగానే వాన్ని పాతాళానికి తొక్కించిందాకా నిదురబోలేదే ఇతను. బలిని పాతాళానికి తొక్కినా అతని కీర్తి ఆకాశానికి ఎగిసింది. ఈరోజు బలి గొప్ప దాతంటారుగాని, ఇంద్రుణ్నెవురుజెప్పుకుంటారు! సోదిలో గూడారాడే!’’రంభ ఇంద్రుడి ముఖం చూస్తుంది. ఇంద్రుడు అగ్నిపర్వతంలా కుములుతుంటాడు లోలోపలే. రంభ చూపులు కిందికి దించుకుని ‘‘మరి బలిచక్రవర్తి కథకు మాటలూ, పాటలూ కావలిగా!...వాళ్లంతా...’’‘‘అక్కణ్ణించి రావాల్సిందే...అంతేగాదు ఇంకా శానమంది రావాలి. టెక్నిషియన్సూ, మ్యూజికోళ్ళూ, కెమెరా, సౌండ్ ఎక్విప్‌మెంటూ, లైట్లు, లైట్ బాయిసూ, ప్లేబేక్ వాళ్లూ్ల, మిగతా ఆర్టిస్టులందరూ అక్కణ్ణించి రావల్సిందే...ఇక్కడోళ్లెవరూ పనికిరారు’’‘‘ఎందకని చక్కన్నగారూ! ఇక్కడ కూడా ఎందరో కళాకారులున్నారే’’ అంటుది రంభ కాస్త రోషంతో...‘‘ఉంచొచ్చుగానీ, మా ‘నేటివిటీ’ రాదుగా! అట్టనుకుంటే మద్రాసులో ఆర్టిస్టులూ, టెక్నిషియన్లూ లేకనా–ఎక్స్ట్రా దగ్గర్నుంచి బొంబాయినించే రావాలంటారు–మెడ్రాసులో హిందీ పిక్చర్ తీసే బొంబాయోళ్లంతా...ఎవడి భాషవాడికిగొప్ప...రంభ తప్ప మిగతా అంతా మా వోళ్లు రావాల్సిందే’’ అని చక్రపాణిగారు అంటుండగానే అయిదుగురు గంధర్వులు ‘ఆర్క్ లైట్లు’లా కండ్లు చెదిరేంత వెలుగుతో అక్కడ ప్రత్యక్షమై ఇంద్రుడిచెవిలో ఏదో చెప్తారు.వెంటనే ఇంద్రుడు రౌద్రాకారంతో చివాల్న లేచి నిలబడి ‘‘ఔరా! నే నెంత మూర్ఖుణ్ణి! మతి లేని రంభ కోసం నా వివేకాన్ని కోల్పోయాను. అజ్ఞానంలో పడి అంతా మర్చిపోయాను. నా ఇంద్రత్వాన్నే కోల్పోయే పరిస్థితికి జారిపోయాను. ఈ అనర్థం అంతా ఈ దౌర్భాగ్యురాలు రంభ వల్ల జరిగింది’’ అని ఇంద్రుడు ఆవేశంతో అంటుంటే చక్రపాణిగారు తాపీగా మిగిలిన విస్కీ చివరిగుటక తాగి గ్లాసు టేబిల్ మీద పెడతారు.ఇంద్రుడు శపిస్తాడోనని రంభ గజగజా వణుకుతూ నిలబడుతుంది.‘‘దేవేంద్రా, మానవులంటే వానరజాతి, ఇంద్రలోకం ధ్వంసం కాకముందే ఇతడిని తక్షణం పంపివెయ్యండి’’ అంటూ గంధ్వర్వులుచెప్తుండగానే....‘‘ఇదుగో ఈ క్షణమే’’ అంటూ ఇంద్రుడి ముందు మత్తుగా కూర్చున్న చక్రపాణిగారి చెయ్యి పట్టుకొని లాగి కింద పడేస్తాడు.తన గదిలో మంచం మీద నిద్రపోతున్న చక్రపాణిగారు దుబుక్కున మంచం మీద నుంచి కిందపడి గొణుక్కు కూచుంటాడు. ∙ భానుమతీ రామకృష్ణ -
స్ట్రాబెర్రీ అంత తియ్యగా...
‘బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు, గణేశ్’ వంటి చిత్రాలతో అలరించిన రంభను అంత సులువుగా మరచిపోలేం. ఇంద్రకుమార్ పద్మనాధన్ అనే బిజినెస్‌మ్యాన్‌ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారామె. 2008 తర్వాత తెలుగు సినిమాలు చేయకపోయినా టీవీ షోస్ చేస్తున్నారు. ఈ జంటకు ఆల్రెడీ సాషా, లాన్య అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈ సెప్టెంబర్‌లో రంభ ఒక బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు ‘శివిన్’ అని నామకరణం చేశారు. తాజాగా ఆ బాబు ఫొటోలను పంచుకున్నారు రంభ. ‘‘శివిన్ని చేతిలోకి తీసుకోగానే చిన్న పంచదార బ్యాగ్ కంటే ఇంకా చిన్నగా ఉన్నాడు. పసిపిల్లలు ఎంత సుకుమారంగా, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటారో అనిపిస్తుంది. వేసవిలో కాచే స్ట్రాబెర్రీలా మా అబ్బాయి నవ్వు ఎంత తీయగా ఉందో.. నేను ఊహించినదానికంటే తన కళ్లు ఎంత మెరుస్తున్నాయో’’ అని మురిసిపోయారు రంభ. అంతేకాదు... ‘‘నేను బతికి ఉన్నంత కాలం వాడిని సంరక్షిస్తూనే ఉంటాను. నా పిల్లల మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు’’ అని తల్లి తాలూకు ఉద్వేగాన్ని కూడా పంచుకున్నారు రంభ. ∙రంభ, శివిన్ -
మస్త్ హ్యాపీ
వెండితెరపై సెంచరీని ఎప్పుడో పూర్తి చేసిన అందాల తార రంభ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్లీ సౌత్‌లోనే కాదు, హిందీ చిత్రాల్లోనూ నటించి సత్తా చాటారు. బుల్లితెరపై కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఇప్పుడు రంభను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే... ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చారు. 2010లో కెనడాకి చెందిన ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్నారు రంభ. ఈ దంపతులకు ఆల్రెడీ లాణ్య, షాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ఈ నెల 23న బేబీ బాయ్‌కి జన్మనిచ్చాను. పేరెంటింగ్ లైఫ్ చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు రంభ. కాగా, 2007లో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన రంభ 2008లో కీలక పాత్ర చేసిన ‘దొంగ సచ్చి నోళ్లు’ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. బుల్లితెరపై మాత్రం కనిపిస్తున్నారు. -
సీమంతం వేడుక..స్టెప్పులతో అదరగొట్టారు!
-
తన సీమంతంలో డ్యాన్స్‌తో అదరగొట్టిన నటి
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందారు రంభ. వీటితో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో కూడా మెరిశారు. కెనడా బిజినెస్‌మ్యాన్ ఇంద్రన్ పద్మనాభన్‌తో వివాహమయ్యాక సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు లాన్య, శాషా ఉన్నారు. కాగా తను మూడో బేబికి జన్మనివ్వబోతున్నానే శుభవార్తను రంభ ఇటీవలే తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భర్త, బంధువుల సమక్షంలో రంభ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రంభ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో అభిమానులు, సన్నిహితుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1990ల్లో హీరోలతో కలిసి పోటాపోటీగా స్టెప్పులు వేసిన రంభ.. తన సీమంతం వేడుకలోనూ స్టెప్పులతో అదరగొట్టారు. -
సల్మాన్‌ఖాన్‌ను కలిసిన రంభ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అమెరికాలో ‘ద - బాంగ్’ షోతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్లూ భాయ్ షోకు ఓ అనుకోని అతిథి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకు ఏవరా అతిథి అనుకుంటున్నారా..? 1997 నాటి సల్మాన్ ‘జుడ్వా’లో అతనితో జత కట్టిన ముద్దుగుమ్మ.. ఇంకా గుర్తుకు రాలేదా..? ఆమె మరెవరో కాదు మన ‘హిట్లర్’ భామ రంభ. ప్రస్తుతం ఆమె తన భర్త, పిల్లలతో కలిసి అమెరికా విహారయాత్రలో ఉన్నారు. తన భర్త, పిల్లలతో కలిసి సల్మాన్ నిర్వహిస్తున్న ‘ద - బాంగ్’ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ సందర్భంగా రంభ ఒకప్పటి తన ‘జుడ్వా’ హీరోతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. సల్మాన్‌ను మాత్రమే కాక 2017 ‘జుడ్వా 2’ హీరోయిన్ జాక్వెలిన్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, ప్రభుదేవా వంటి బాలీవుడ్ ప్రముఖులందరిని కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘జుడ్వా 1’, ‘జుడ్వా 2’ అనే కాప్షన్ ఇచ్చారు. 1997లో వచ్చిన ‘జుడ్వా 1’ లో కరిష్మా కపూర్‌తో పాటు రంభ కూడా నటించారు. ఆ తర్వాత 1998లో వచ్చిన ‘బంధన్’ చిత్రంలోనూ సల్మాన్‌ఖాన్‌తో జత కట్టారు. రంభ - సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘బంధన్’ ఆఖరుది. A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on Jul 8, 2018 at 11:26pm PDT -
మూడో బేబీకి తల్లి కాబోతున్నా:రంభ
90స్లో టాప్ హీరోస్ అందరితో యాక్ట్ చేసిన రంభని అంత సులువుగా మరచిపోలేం. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో కూడా రంభ మంచి పేరు తెచ్చుకున్నారు. కెనడా బిజినెస్‌మ్యాన్ ఇంద్రన్ పద్మనాథన్‌ని వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్నారామె. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు లాన్య, శాషా ఉన్నారు. మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు రంభ. ఈ విషయం గురించి రంభ చెబుతూ –‘‘ఈ హ్యాపీ మూమెంట్లో నన్ను అభిమానించే వారందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మూడో బేబీకి తల్లి కాబోతున్నాను. ఈ ఆనందాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియట్లేదు’’ అన్నారు. -
ఎన్టీఆర్ సినిమాలో సీనియర్ హీరోయిన్
జై లవ కుశ సినిమాతో మంచి విజయం సాధించిన ఎన్టీఆర్ కొంత విరామం తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తొలి షెడ్యూల్లో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించిన త్రివిక్రమ్, రెండో షెడ్యూల్లో ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్రకు సీనియర్‌ను హీరోయిన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన సీనియర్ హీరోయిన్లకు మంచి గుర్తింపు వచ్చింది. అత్తారింటికి దారేదిలో నదియా, సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ, అజ్ఞాతవాసిలో ఖుష్బూలు కీలక పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం మరో సీనియర్ హీరోయిన్ రంభను తీసుకున్నాడట త్రివిక్రమ్. ఎన్టీఆర్ సరసన నాగ, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన రంభ ఇప్పుడు తన సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. త్వరలోనే రంభ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొననుందన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతిబాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
విడాకులు తీసుకోవడం లేదు
-
విడాకులు తీసుకోవడం లేదు
చెన్నై: నటి రంభ విడాకుల కేసు సుఖాంతమైంది. ఇంద్రన్‌కుమార్, రంభ కలసి జీవించేందుకు సమ్మతించారు. రంభ నటనకు స్వస్తి చెప్పి 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్కుమార్ను పెళ్లి చేసుకొని కెనడాలో స్థిరపడింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం అనంతరం మనస్పర్థలు రావడంతో రంభ భర్తను వదిలి చెన్నైకి వచ్చేసింది. దీంతో విడాకులు మంజూరు చేయాలని కోరుతూ 2016లో రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2.50 లక్షలు చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని కోరింది. దీనిపై పలుమార్లు విచారణ నిర్వహించిన కోర్టు.. ఇంద్రన్కుమార్తో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. ఈ మేరకు చర్చించుకున్న రంభ, ఇంద్రన్కుమార్లు కలసి జీవించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని వీరిద్దరూ బుధవారం న్యాయస్థానానికి తెలియజేయడంతో కేసును మూసివేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
సామరస్యంగా పరిష్కరించుకోండి
పెరంబూర్: నటి రంభ, ఆమె భర్త ఇంద్రకుమార్ తమ సమస్యలను సామరస్యంగా చర్చిం చుకుని పరిష్కరించుకోవాలని చెన్నై హైకోర్టు సూచించింది. వివరాలు.. నటి రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను ప్రేమించి 2010లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కెనడాలో కాపురం పెట్టిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రంభకు ఇంద్రకుమార్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తడంలో రంభ తన ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నైకి తిరిగొచ్చేశారు. కాగా 2016లో భర్తతో తనను కలపాలని కోరుతూ చెన్నై హైకోర్టు, కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పిల్లల విద్య, సంరక్షణ ఖర్చుల కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. నటి రంభ తన ఇద్దరు పిల్లలతో కోర్టుకు హాజరయ్యారు. అదే విధంగా ఆమె భర్త ఇంద్రకుమార్ కూడా కోర్టుకు వచ్చారు. దీంతో ఇది కుటుంబ సమస్య కాబట్టి రంభను ఆమె భర్తను ఒక ప్రత్యేక గదిలో ఉంచి సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ఒక న్యాయవాదిని నియమించారు. కాగా తదుపరి విచారణలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
సామరస్యంగా పరిష్కరించుకోండి
పెరంబూర్: నటి రంభ, ఆమె భర్త ఇంద్రకుమార్ తమ సమస్యలను సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని చెన్నై హైకోర్టు సూచించింది. వివరాలు.. నటి రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను ప్రేమించి 2010లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కెనడాలో కాపురం పెట్టిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రంభకు ఇంద్రకుమార్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తడంలో రంభ తన ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నైకి తిరిగొచ్చేశారు. కాగా 2016లో భర్తతో తనను కలపాలని కోరుతూ చెన్నై హైకోర్టు, కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పిల్లల విద్య, సంరక్షణ ఖర్చుల కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. నటి రంభ తన ఇద్దరు పిల్లలతో కోర్టుకు హాజరయ్యారు. అదే విధంగా ఆమె భర్త ఇంద్రకుమార్ కూడా కోర్టుకు వచ్చారు. దీంతో ఇది కుటుంబ సమస్య కాబట్టి రంభను ఆమె భర్తను ఒక ప్రత్యేక గదిలో ఉంచి సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ఒక న్యాయవాదిని నియమించారు. కాగా తదుపరి విచారణలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
న్యాయనిర్ణేతగా మాస్ మహారాణి
అందాల రాణి రంభ సిల్వర్ స్క్రీన్ మీద చిందులేసినంత కాలం కురక్రారు కంటి మీద కునుకు లేదు. ఆమె అందానికి అందరూ దాసోహమన్నారు. స్టెప్పుల్లో, స్పీడ్‌లో రంభ స్టైలే వేరు. హీరోరుున్‌గానే కాకుండా డ్యాన్స లోనూ కొత్త ఒరవడి సృష్టించిన రంభ... ఇప్పుడు తమ టాలెంట్‌ను నిరూపించుకోవాలనుకొనే వారికి వేదిక కాబోతున్న ‘ఏబీసీడీ’ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నట్లు జీ తెలుగు ప్రతినిధి గురు వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా అవకాశాలు తగ్గింతే చాలామంది నటీమణులు బుల్లితెరకు షిప్ట్ అవుతున్న విషయం తెలిసిందే. సీరియల్స్ లో నటించడంతో పాటు, డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు కూడా. 'జయం' చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అయిన సదా...'ఢీ' జోడీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న రంభ తాజాగా 'ఏబీసీడీ' కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం. -
వివాహిత అనుమానాస్పద మృతి
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం నందివలస గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంభ(32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆమె భర్త మాత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని అంటుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం అతడే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రించడానికి యత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. -
సినీ నటి రంభ నగలు చోరీ!
-
రంభ బంగారు, వజ్రాల నగలను కాజేశారు..
సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు బంజారాహిల్స్: సినీ నటి రంభ బంగారు, వజ్రాల నగలు ఆమె వదిన, అక్కలు కాజేశారని, ఈ మేరకు తాము చెన్నై విరువుంబాకం పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశామని రంభ సోదరుడు వై.శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అతడి భార్య పల్లవి, ఆమె సోదరి శాంతిసింగ్‌చౌహాన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ (పల్లవి సోదరుడు), ఆయన భార్య వాణిజ్య పన్నుల శాఖాధికారిణి సంయుక్త తదితరులు కలిసి రంభకు చెందిన నాలుగున్నర కోట్ల విలువైన ఆభరణాలు కాజేయడమే కాకండా గతంలో తనపై, తన కుటుంబ సభ్యులపై అకారణంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపించారు. తన కుమారుడిని ఏడాదిగా చూపించడం లేదని పశ్చిమ మండలం డీసీపీకి ఫిర్యాదు కూడా చేశానని, ఆ కేసు విషయమై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడేళ్ల నుంచి రంభ కెనడాలో ఉందని ఇటీవల రెండు నెలలు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిందని తెలిపారు. గతంలో తాము ఇక్కడ లేని సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తమపై కేసు పెట్టారని పల్లవి, శాంతిసింగ్ చౌహాన్, ఆమె సోదరుడు రవికిరణ్, సంయుక్తలపై చెన్నైలో తొలుత తామే ఫిర్యాదు చేశామని, కేసు నమోదైందని తెలిపారు. -
కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ
-
అది తప్పుడు కేసు: రంభ సోదరుడు
తన భార్య పల్లవి పెట్టినది తప్పుడు కేసని, తమ ఇంట్లో ఉన్న వజ్రాల నగలు, పిల్లలను తీసుకుని ఆమె ఫిబ్రవరి 3వ తేదీన చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లిపోతే.. 4వ తేదీన తమ తండ్రి చెన్నైలో కేసు నమోదు చేశారని రంభ సోదరుడు శ్రీనివాస్ తెలిపారు. తన భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు విషయమై ఆయన 'సాక్షి'తో మాట్లాడారు. కెనడాలోని టొరంటోలో ఉన్న తాను ఈ విషయం తెలిసి ఫిబ్రవరి 12వ తేదీన వచ్చానన్నారు. దొంగతనం కేసును తప్పుదోవ పట్టించడానికే ఇప్పుడీ వరకట్నం కేసు పెట్టారని ఆయన అన్నారు. తమకు పెళ్లయ్యి 15 సంవత్సరాలు అయ్యిందని, పెద్ద కొడుకుకు 14 ఏళ్లు, చిన్న కుమారుడికి 10 ఏళ్లు ఉన్నాయని తెలిపారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని వేధింపులు ఇప్పుడే ఎలా గుర్తుకొచ్చాయని శ్రీనివాస్ ప్రశ్నించారు. తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా, తనను అరెస్టు చేయకూడదని కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన వివరించారు. 1999లో పల్లవితో తనకు పెళ్లయ్యే సరికి వాళ్లు అద్దె ఇంట్లో ఉండేవారని, ఇప్పుడు వాళ్లకు ఒక బంగ్లా, మూడు ఫ్లాట్లు ఎక్కడినుంచి వచ్చాయని ఆయన అడిగారు. అసలు వాళ్లు ఏ రూపంలో కట్నం ఇచ్చారో రుజువు చేయాలన్నారు. తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, అయితే 498ఎ సెక్షన్‌ను ఇలా దుర్వినియోగం చేయడం మాత్రం సరికాదని ఆయన చెప్పారు. -
కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ నటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావు భార్య పల్లవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెస్ట్ జోన్ డీసీసీ సత్యనారాయణ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు రంభ, తల్లిదండ్రులు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. త్వరలోనే వారికి నోటీసులు పంపుతామని వెల్లడించారు. వారి వాంగ్మూలాన్ని తీసుకుంటామని చెప్పారు. కేసుపై అన్నివైపుల విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పల్లవి భర్త శ్రీనివాస్‌తో పాటు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావుపై బంజారాహిల్స్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
అప్పుడు ఆమని...ఇప్పుడు రంభ
గృహ హింస నిరోధక చట్టం 498ఎ పేరు చెబితే చాలు భర్తల గుండెల్లోనే కాదు అతని తల్లిదండ్రులు, అక్కా, చెల్లెళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి నెలకొంది. భర్త, అత్తింటివారు వేధిస్తున్నారంటూ 498ఎ కింద మహిళలు పెడుతున్న కేసులు నానాటికి అధికం అవుతున్న విషయం తెలిసిందే. పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లోనో, ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్న ఆడపడుచులు సైతం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పరిస్థితి సాధారణ మహిళలకే కాదు సెలబ్రిటీలకు తప్పటం లేదు. గతంలో సినీ నటి ఆమని ... తాజాగా రంభ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వరకట్నం కోసం భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచు వేధిస్తున్నారంటూ సినీనటి రంభపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఈ కేసు పెట్టింది. హైదరాబాద్ కు చెందిన పల్లవికి 1999లో రంభ సోదరుడు శ్రీనివాస వెంకటేశ్వర్రావుతో వివాహం జరిగింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా రంభ తరచు తిట్టడం, కొట్టడం చేస్తోందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో మరో నటి ఆమనిపై కూడా వరకట్న వేధింపుల కేసు నమోదు అయ్యింది. కట్నం కోసం భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచు ఆమని వేధిస్తుందంటూ ఆమె సోదరుడు మాదప్ప శ్రీనివాస్ భార్య లీలావతి ఫిర్యాదు చేసింది. అప్పట్లో నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఆమనిపై కేసు కూడా నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఆమె కోర్టు చుట్టూ తిరిగారు కూడా. విచారణ అనంతరం ఆమనిపై న్యాయస్థానం కేసు కొట్టివేసింది. ఇక ఢిల్లీలో పేరుగాంచిన తీహార్ జైల్లో ‘సాస్-ననంద్ బ్యారక్’గా అందరూ పిలుచుకునే అక్కడి ఆరో నెంబర్ బ్యారక్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అక్కడ ఖైదీలంతా మహిళలే కావడం విశేషం. వరకట్న వేధింపుల కేసుల్లో పోలీసులు అరెస్టు చేసిన అత్తలు, ఆడపడుచులతో సుమారు 3000 మందితో ఆ ప్రాంగణం నిత్యం కిటకిటలాడుతుంది. ఇక 498ఎ కింద బెయిల్ వచ్చే పరిస్థితి లేనందున, విచారణ దశలో కేసును ఉపసంహరించుకునే వీలు లేనందున ఖైదీలు నెలల తరబడి జైలులో గడపాల్సిందే. వరకట్నం కేసుల్లో సెక్షన్ 498ఎ బాగా దుర్వినియోగం అవుతున్నట్లు సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. -
'పబ్లిసిటీ కోసమే నాపై, రంభపై ఆరోపణలు'
చెన్నై : పబ్లిసిటీ కోసమే తన భార్య పల్లవి ఆరోపణలు చేస్తోందని సినీనటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ రంభపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. పల్లవి కుటుంబ సభ్యులే వెనకుండి ఆమెను ఆడిస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. కాగా కొంతకాలంగా భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ బంజారాహిల్స్ నివాసి పల్లవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన పోలీసులు రంభతో పాటు ఆమె భర్త శ్రీనివాస్, అత్తా మామలపై ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద కేసు నమోదు చేశారు. -
సినీనటి రంభపై వరకట్న వేధింపుల కేసు
హైదరాబాద్: సినీనటి రంభపై బంజారాహిల్స్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 5లో నివసించే పల్లవి 1999లో చెన్నైలో నివసిస్తున్న నటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావును వివాహం చేసుకుంది. ఆ సందర్భంగా తగినన్ని కట్న కానుకలు, లాంఛనాలు పూర్తి చేశారు. కొంతకాలంగా ఆమెను శ్రీనివాస్‌తో పాటు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావు అదనపు కట్నం కోసం వేధించసాగారు. వీరు నిర్మించిన సినిమాలకు నష్టాలు రావడంతో కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో డబ్బుల కోసం పల్లవిని వేధించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో వేధింపులు భరించలేక బాధిత మహిళ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వీరిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దర్యాప్తు చేసిన పోలీసులు రంభతో పాటు ఆమె భర్త శ్రీనివాస్, అత్తా మామలపై ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద కేసు నమోదు చేశారు. -
సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై కేసు
-
సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై కేసు
హైదరాబాద్: సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఈ కేసు పెట్టారు. అదనపు కట్నం కోసం తనను అత్తింటివారు వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా శ్రీనివాస్ పై కేసు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, వ్యాపారవేత్త ఇంద్రకుమరన్‌ని రంభ పెళ్లి చేసుకున్న కెనడాలో ఉంటున్నారు. వీరికి ‘లాన్య’ అనే పాప ఉంది. అయితే భర్త నుంచి రంభ విడాకులు తీసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సీనియర్ నటి కుష్బూ ఖండించారు. రంభ చక్కగా కాపురం చేసుకుంటోందని ఆమె తెలిపారు. రంభ గురించి అలాంటి ప్రచారం చేయొద్దు: కుష్బూ -
రంభ గురించి అలాంటి ప్రచారం చేయొద్దు : కుష్బూ
గాసిప్పురాయుళ్లను నోరుమూసుకోమని చెబుతున్నారు కుష్బూ. అంత మాట అన్నారంటే, కుష్బూ గురించి చేయకూడని ప్రచారం ఏదో చేసే ఉంటారని ఊహించవచ్చు. కానీ, కుష్బూ ఈ విధంగా స్పందించింది తనకోసం కాదు.. రంభ కోసం. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమరన్‌ని రంభ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లకో పాప ఉంది. పేరు ‘లాన్య’. పెళ్లయినప్పట్నుంచీ కెనడాలోనే ఉంటున్నారు రంభ. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడానికి ఆమె ఇండియా రానున్నారని, నిర్మాతగా కూడా మారనున్నారని అడపా దడపా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇటీవల మాత్రం తన భర్త నుంచి రంభ విడాకులు తీసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయం గురించే కుష్బూ ఘాటుగా స్పందించారు. ఇటీవల ఆమె కెనడా వెళ్లారు. కుష్బూ అక్కడికొచ్చిన విషయం తెలుసుకుని రంభ తన ఇంటికి ఆహ్వానించడం, ఈమె వెళ్లడం జరిగింది. రంభతో కబుర్లు చెప్పడంతో పాటు ఆమె కూతురు లాన్యని కూడా ముద్దు చేశారు కుష్బూ. అది మాత్రమే కాదు నయాగరా జలపాతాలను వీక్షించాలనుకున్న కుష్బూతో కలిసి రంభ, ఆమె భర్త కూడా వెళ్లారు. అక్కడ బాగా ఎంజాయ్ చేశామని కుష్బూ పేర్కొన్నారు. రంభ, ఇంద్రకుమరన్‌ని చూస్తే, చాలా ముచ్చటేసిందని ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారని కుష్బూ చెప్పారు. ఈ దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారామె. -
ధర్డ్ ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్న భామ
-
అదిరే స్థాయిలో రంభ రీ-ఎంట్రీ
ప్రముఖ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి, కుర్రకారుని ఉర్రూతలూగించిన రంభ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. రంభ అభిమానులకు ఇది శుభవార్త అయినప్పటికీ, మరో బాధాకరమైన వార్త ఏమిటంటే ఆమె భర్త నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది. ఓ ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లాడిన రంభ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి హాయిగా కాపురం చేసుకుంటుంది. అయితే వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె స్వదేశానికి తిరిగి వచ్చి చెన్నైలోనే పుట్టినింట్లో ఉంటోందని తెలుస్తోంది. గతంలో 'మేజిక్ వూడ్స్' అనే సంస్థకు రంభ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఆ తర్వాత ఆ సంస్థ యజమాని, కెనడాలో స్థిరపడిన ప్రవాసభారతీయుడు, వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్తో ప్రేమలో పడింది. 2010, ఏప్రిల్ 8న ఇంద్రన్ పద్మనాథన్‌ను వివాహం చేసుకుంది. వారి వివాహం తిరుపతిలో ఎంతో వైభంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆమె భర్తతో కలిసి టోరంటో వెళ్లి పోయింది. సినిమాలకు స్వస్తి చెప్పి అక్కడే స్థిరపడింది. ఈ దంపతులకు 2011, జనవరి 14న ఆడ పిల్ల జన్మించింది. ఆ పాప పేరు లాశ్య. 2012లో కూడా రంభ తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో రంభ ఆ వార్తలను ఖండించింది. భర్త ఇంద్రన్, కూతురు లావణ్యతో టోరంటోలో సంతోషంగా ఉన్నానని అప్పట్లో వివరణ ఇచ్చింది. ఇటువంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులను కోరింది. భర్త తరపువారు తనను బాగా చూసుకుంటున్నట్లు కూడా తెలిపింది. ఇప్పుడు మళ్లీ వారు విడిపోయినట్లు తెలుస్తోంది. రంభ వందకుపైగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలలో నటించింది. దక్షిణాది అగ్రహీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, మమ్ముట్టీ, బాలీవుడ్లో మిథున్ చక్రవర్తి, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సునీల్ శెట్టి, విజయ్, గోవింద....... వంటివారి సరసన నటించి మెప్పించింది. అప్పట్లో రంభ తన అందంతో అభిమానులకు పిచ్చెక్కించింది. హావభావాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు చెన్నైలో ఉన్న రంభ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోంది. వందకు పైగా చిత్రాలలో నటించిన రంభ తన రీ ఎంట్రీ అదిరిపోయేట్లు ఉండాలన్న ఆలోచనతో ఉంది. చిత్రంలో ప్రాధాన్యత గల కీలక పాత్ర, అవసరమైతే అక్క, వదిన వంటి పాత్రలు కూడా చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ జనాలు పలువురు సినిమా ఆఫర్లతో ఆమె వద్దకు వెలుతున్నారు. పలువురు నిర్మాతలు, దర్శకులు ఆమెతో చర్చలు జరుపుతున్నారు. శింబు హీరోగా నటించే ఒక తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె శింబుకు అక్కగా నటిస్తున్నట్లు పరిశ్రమ వార్గాల బోగట్టా. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమైనది చెబుతున్నారు. కోలీఉడ్ నుంచే కాకుండా టాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. రంభ అంగీకరిస్తే ఆమె కోసమే ప్రత్యేకంగా కథలు రాయించి చిత్రాలు నిర్మించడానికి కొందరు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.