Judwaa Actress Rambha Thanks Fans For Prayers After Car Accident - Sakshi

Rambha: ఫస్ట్‌ టైం లైవ్‌లోకి వచ్చా, మీ అందరికీ రుణపడి ఉంటా

Nov 2 2022 8:44 PM | Updated on Nov 3 2022 9:01 AM

Actress Rambha First Instagram Live After Car Accident - Sakshi

మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్‌. మీ అందరికీ ఎంతగానో రుణపడి ఉంటాను. ఇప్పుడు

సీనియర్‌ హీరోయిన్‌ రంభ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే!  పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకువస్తున్న సమయంలో ఆమె కారు యాక్సిడెంట్‌ అయింది. రంభ కూతురు సాషాకు గాయాలవడంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫొటోలు నిన్న ఎంతగానో వైరల్‌ అయ్యాయి.

తాజాగా కారు యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చింది రంభ. తన కూతురి కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్‌ చెప్పింది. 'మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ ఎంతగానో రుణపడి ఉంటాను. ఇప్పుడు నా కుటుంబం క్షేమంగా ఉంది. నా కూతురు సాషా కూడా క్షేమంగా ఉంది. తనను ఇంటికి తీసుకొచ్చాం. మా మీద ఇంత ప్రేమ చూపించినందుకు ఆనందంగా ఉంది' అని ఎమోషనలైంది రంభ.

చదవండి: అల్లు శిరీష్‌ నాకు అప్పటినుంచే తెలుసు: అనూ ఇమ్మాన్యుయేల్‌
మరోసారి విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల వీడియోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement