Actress Rambha, Sangita Meets Meena At Her Home, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Meena: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్‌

Aug 9 2022 1:07 PM | Updated on Aug 9 2022 1:29 PM

Rambha, Sangita Meets Meena At Her Home, Photo Goes Viral - Sakshi

మీనాను పరామర్శించేందుకు సీనియర్‌ హీరోయిన్స్‌ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీనా వారితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. భర్త చనిపోయాక మీనా చేసిన తొలి పోస్ట్‌ ఇది. 

ప్రముఖ నటి, సీనియర్‌ హీరోయిన్‌ మీనా ఇటీవలే భర్త విద్యాసాగర్‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అతడి మరణంతో ఆమె కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తాజాగా మీనాను పరామర్శించేందుకు సీనియర్‌ హీరోయిన్స్‌ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీనా వారితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. భర్త చనిపోయాక మీనా చేసిన తొలి పోస్ట్‌ ఇది. ఇందులో మీనా నవ్వుతూ కనిపించగా ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు.

కాగా ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్‌ జూన్‌ 28న మరణించారు. ఆయన మరణంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. ఇటీవలే ఆమె ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్‌లో రాజేంద్రప్రసాద్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేయగా ఆ వేడుకల్లో మీనా తళుక్కున మెరిసింది.

చదవండి: మహేశ్‌కు చిరు, వెంకీల స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌
 ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement