Sanghavi
-
ఆ తెలుగు డైరెక్టర్ ప్రేమలో సంఘవి.. దీంతో కెరియరే నాశనమైందా..?
అందాలతో కనువిందు చేస్తూ, అభినయంతోనూ అలరించిన నటి సంఘవి. కావ్య రమేష్‌గా కర్ణాటకలోని మైసూరులో 1977 అక్టోబర్ 4న పుట్టింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. తర్వాత ఆయన మరణించడంతో ఆమె కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఆమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో 8వ తరగతి వరకే ఆగిపోయింది. కన్నడ నటి ఆరతి సంఘవి కుటుంబానికి దగ్గరి బంధువు కావడంతో ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల బాల్యంలోనే చదవు ఆపేసి బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా 1993లో ఆమెకు తమిళ హీరో అజిత్ సరసన అమరావతి సినిమాలో హీరోయిన్గా తొలిసారి అవకాశం దక్కింది. అలా ఆమె 90వ దశకంలోని టాప్ హీరోల అందరితోనూ సినిమాలు చేసింది. చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేశ్,జూ. ఎన్టీఆర్, రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో నటించింది సంఘవి. ఆ హీరోతో ప్రేమ వల్ల అవకాశాలు పోగొట్టుకున్న సంఘవి అజిత్ సినిమా తర్వాత తమిళ్ స్టార్ దళపతి విజయ్‌తో ఆమె జోడిగా సినిమా ఛాన్స్ దక్కింది. ఆ సినిమాకు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అయినా కూడా సంఘవి- విజయ్ జోడిగా మూడు సినిమాలను ఆయన డైరెక్ట్ చేశాడు. నాలుగో సినిమా కూడా వారిద్దరితో ప్లాన్ చేసిన చంద్రశేఖర్ షూటింగ్ మధ్యలోనే ఆర్థాంతరంగా ఆపేశాడు. దీనికి ప్రధాన కారణం విజయ్- సంఘవి ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారం రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు కోలీవుడ్‌లో సినిమా అవకాశాలు రాకుండా పోయాయి. తెలుగులో లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఆ డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి శ్రీకాంత్‌తో తాజ్‌మహల్ సినిమా నిర్మిస్తున్న డి రామానాయుడు సెకండ్ హీరోయిన్ కోసం సర్చ్ చేస్తున్న సమయంలో సంఘవి వచ్చి ఆయన్ను కలవడంతో ఆడిషన్స్ చేసి అలా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సురేష్ ప్రొడక్షన్స్‌లో సుమారు అరడజనుకు పైగా సినిమాలు చేసింది. ఇదే క్రమంలో చిరంజీవి,వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. అలా ఆమె కెరియర్ టాప్ రేంజ్లో దూసుకుపోతుండగా రాజశేఖర్‌తో 'శివయ్య' సినిమాలో నటించింది. ఆ సినిమాకు తెలుగు డైరెక్టర్ అయిన సురేష్ వర్మ తెరకెక్కించాడు. సినిమా సమయంలో అతనితో ప్రమలో పడిన సంఘవి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్.. ఎవరా మిస్టరీ మ్యాన్?) ఈ పెళ్లి ఆమె తల్లికి ఇష్టం లేదు అయినా ప్రేమ కోసం ఇంట్లో నుంచి వచ్చేసింది సంఘవి. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత సపోర్టింగ్ యాక్టర్, ఐటెం సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయింది. ఇలాంటి సమయంలోనే పెళ్లైన ఏడాదికి భార్యభర్తల మధ్య విబేదాలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం సురేష్ వర్మ ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉండటం. అంతేకాకుండా షూటింగ్‌కు వెళ్లి వస్తున్న సంఘవి పట్ల అతనికి అనుమానం రావడం వంటి కారణాలు అప్పట్లో వచ్చాయి. దీన్ని తట్టుకోలేని సంఘవి అతనికి విడాకులు ఇచ్చేసి తల్లి వద్దకు వెళ్లిపోయింది. అలా టాప్ రేంజ్లో ఉండాల్సిన సంఘవి ప్రేమ పెళ్లితో ఆ అవకాశం చేజార్చుకుంది. పెళ్లి విషయంలో ఎన్నో కష్టాలు విడాకుల తర్వాత సంఘవికి సినిమా అవకాశం వచ్చింది. జూ.ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలో ఆమె కనిపించింది. తర్వాత పలు సినిమాలు చేసినా అవి అంతగా మెప్పించకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తల్లి సూచన మేరకు సీరియల్స్లలో నటించింది. అక్కడా ఆమె ఫేట్ మారలేదు. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని ఒక ఎన్ఆర్ఐ సంబంధాన్ని ఆమె తల్లి తెచ్చింది. కొన్ని కారణాల వల్ల అదీ ఆగిపోయింది. అప్పటికే సంఘవికి 39 ఏళ్లు దీంతో ఆమె పెళ్లిపై తల్లికి ఆందోళన పెరగడం. ఎలాగైనా తనకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం ప్రారంభించింది. అలా కర్ణాటకకు చెందిన ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్‌ను 2016లో ఆమె పెళ్లి చేసుకుంది. సంఘవి కన్నడ అమ్మాయి కాగా, వెంకటేశ్ మలయాళీ. 42 సంవత్సరాల వయస్సులో ఆమెకు మొదటి సంతానంగా పాప జన్మించింది. సంఘవి ఆస్తుల విలువ వెంకేశన్తో పెళ్లి తర్వాత ఆమె టీవి సీరియళ్లతో పాటు పలు డ్యాన్స్ షోలకు జడ్జ్‌గా వ్యవహరించింది. కానీ 2019 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నటి సంఘవి ఈరోజు తన 46వ పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకుంటుంది. కర్ణాటకలోని మైసూరులో భర్తతో ఉంటున్న నటి సంఘవి ఆస్తి సుమారు రూ. 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. -
ఎల్బీనగర్లో దారుణం.. ప్రేమ వ్యవహారమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఇంట్లో ఉన్న అక్కాతమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడి మృతిచెందగా.. అక్కకు తీవ్రగాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు ఓ గదిలో బంధించారు. వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో శివకుమార్ అనే వ్యక్తి.. సంఘవి, పృథ్వీపై కత్తితో దాడి చేశాడు. సంఘవి, శివకుమార్ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సంఘవితో ఆదివారం మాట్లాడటానికి శివకుమార్ ఎల్బీనగర్కు వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని సంఘవిపై శివ ఒత్తిడి తెచ్చాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆవేశానికి లోనైన శివకుమార్.. సంఘవిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఇంట్లోనే పృధ్వీపై కూడా శివకుమార్ చేయడంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను చూసిన స్థానికులు శివకుమార్‌ను గదిలో బంధించి.. సంఘవి, పృథ్వీలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పృథ్వీ మృతిచెందగా.. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. అక్కాతమ్ముళ్లు ఇద్దరూ ఎల్బీనగర్లో ఉంటూ చదువుకుంటున్నారు. సంఘవి హోమియోపతి చదువుతోంది, పృథ్వీ బీటెక్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడి శివని అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్‌ను రామాంతపూర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: సరదాగా ఈతకెళ్లి.. కానరాని లోకాలకు.. -
హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!
ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సంఘవి తెలుగు తెరపై కనిపించక 18 ఏళ్లవుతోంది. ఆమె చివరగా కొలాంజి అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసి పర్సనల్ లైఫ్‌కే పూర్తి సమయం కేటాయించింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది కానీ బయట మాత్రం పెద్దగా కనిపించలేదు. అయితే గత నెలలో మాత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సంఘవి. తాజాగా మరోసారి తన కుటుంబంతో కలిసి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన సంఘవి ప్రస్తుతం జడ్జిగా సినిమాలు చేస్తున్నానని, ఏదైనా మంచి రోల్స్ వస్తే తప్పకుండా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. దీంతో తను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. కాగా సంఘవి అసలు పేరు కావ్యా రమేష్. ఆమె మొదట తమిళంలో అజిత్‌కు జంటగా నటించిన 'అమరావతి' సినిమాతో చిత్రసీమకు పరిచయమైంది. ఆ తరువాత విజయ్, కార్తీక్ తదితర ప్రముఖ తమిళ హీరోలతో నటించింది. రజనీకాంత్ 'బాబా' చిత్రంలోనూ తళుక్కుమని మెరిసింది. తెలుగులో నాగార్జున, రాజశేఖర్ వంటి ప్రముఖ హీరోలతో జతకట్టి.. అనేక సినిమాలతో అభిమానులను మెప్పించింది. సూర్యవంశం, శివయ్య, సమరసింహారెడ్డి, సీతారామరాజు, మృగరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, ఆంధ్రావాలా.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఆమె నటించిన హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. దక్షిణాది భాషలన్నింటిలోనూ సంఘవి హీరోయిన్గా నటించింది. ఈమె మలయాళీ కుటుంబం నుంచి వచ్చిన ఐటీ సంస్థ అధినేత ఎన్. వెంకటేశ్‌ను 2016 ఫిబ్రవరి 3న పెళ్లి చేసుకుంది. వీరికి 2020లో కూతురు పుట్టింది. చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల హవా లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ -
భర్త చనిపోయాక తొలిసారి అలా కనిపించిన మీనా..
బాలనటిగా తెరంగేట్రం చేసిన మీనా ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించి దక్షిణాది ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నటిగా మంచి ఫామ్‌లో సమయంలో 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప జన్మించింది. ఓపక్క కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాలు చేస్తున్న మీనా జీవితంలో గతేడాది పెను విషాదం చోటుచేసుకుంది. గతేడాది జూన్ నెలలో ఆమె భర్త కన్నుమూశారు. ఎప్పుడూ బిజీగా ఉంటూ ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది మీనా. సినిమాలకు కూడా సైన్ చేసి షూటింగ్స్‌లో పాల్గొంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ తిరిగి నార్మల్ అవడానికి ట్రై చేస్తోంది. అయితే భర్త చనిపోయాక మొదటిసారి డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. సీనియర్ హీరోయిన్ సంఘవితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: నీ ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు: విష్ణుప్రియ రెండుసార్లు బ్రేకప్.. అది బ్లాక్‌డే అంటున్న బ్యూటీ -
భర్త చనిపోయాక మీనా తొలిసారి ఇలా.. ఫొటో వైరల్
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే భర్త విద్యాసాగర్‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అతడి మరణంతో ఆమె కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తాజాగా మీనాను పరామర్శించేందుకు సీనియర్ హీరోయిన్స్ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీనా వారితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త చనిపోయాక మీనా చేసిన తొలి పోస్ట్ ఇది. ఇందులో మీనా నవ్వుతూ కనిపించగా ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. కాగా ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న మరణించారు. ఆయన మరణంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. ఇటీవలే ఆమె ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్‌లో రాజేంద్రప్రసాద్ బర్త్‌డే సెలబ్రేట్ చేయగా ఆ వేడుకల్లో మీనా తళుక్కున మెరిసింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: మహేశ్‌కు చిరు, వెంకీల స్పెషల్ బర్త్‌డే విషెస్ ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ -
హాస్యనటులతో సంఘవి
తమిళసినిమా: హాస్య నటులు పవర్‌స్టార్ శ్రీనివాసన్, గంజాకరుప్పు, యోగిబాబుతో నటి సంఘవి ఒక చిత్రంలో నటించనున్నారు. వీరితో పాటు రోషన్, హర్షిత, మెర్కురి సత్య, కేపీ.శంకర్, జీవిత, స్నేహన్రాజా, కేపీ.సెంథిల్‌కుమార్, బోండామణి, త్రిలోక్, వి.రాజా, ఆర్.స్టాలిన్, కింగ్‌కాంగ్, రణాదేవి, ఎంఆర్జీ.రాజేశ్వరి, మయిలైదేవి, వీరమణి, కాదల్ హుస్సేన్ ముఖ్య పాత్రలు ధరించనున్నారు. ఈ చిత్రానికి నాన్‌యార్ తెరియుమా అనే టైటిల్‌ను నిర్ణయించారు. గ్లామర్ సినీగైడ్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి నవీన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. నాన్ యార్ తెరియుమా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పోలీస్ అధికారి కావాలన్న లక్ష్యంతో చెన్నైకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల జీవితంలో ఒక ఆడ దెయ్యం ప్రవేశిస్తుందన్నారు.ఆ ముగ్గురు పోలీస్ అధికారులు కావాలంటే ఆ దెయ్యం మూడు నిబంధనలు విధిస్తుందన్నారు. వాటిని సవాల్‌గా తీసుకున్న ఈ ముగ్గురు పోరాటంలో పడే బాధలను వినోదభరితంగా తెరకెక్కించనున్న చిత్రం నాన్ యార్ తెరియుమా అని తెలిపారు. దీనికి చంద్రన్సామి ఛాయాగ్రహణం, రశాంత్ సంగీతాన్ని అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ
శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజ్‌మహల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ సంఘవి. తరువాత సింధూరం, సూర్యవంశం, సమరసింహారెడ్డి, సీతారామరాజు లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించిన సంఘవి, సౌత్ స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. 2010 తరువాత సినిమాలకు దూరమైన ఈ భామ, ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టిన ఈ భామ మరోసారి వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే రెండు తమిళ సినిమాలను అంగీకరించిన సంఘవి, తాజాగా తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్లో గ్లామరస్ అత్త, అమ్మ పాత్రలకు మంచి డిమాండ్ ఉండటంతో తన వయసుకు తగ్గ పాత్ర కోసం దర్శకనిర్మాతలను సంప్రదిస్తోంది. మరి రీ ఎంట్రీలో ఈ భామ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
నటి సంఘవి పెళ్లి చేసుకోబోతోంది!
తమిళ సినిమా (చెన్నై): ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సంఘవి బుధవారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నది. కర్ణాటకకు చెందిన సంఘవి ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్‌ను బుధవారం పెళ్లి చేసుకోబోతున్నది. వీరి వివాహం ఉదయం 9 గంటలకు బెంగళూరు ఎంజీ రోడ్డులోని వివాంత తాజ్ హోటల్లో జరుగనుంది. ఉదయం 11 గంటలకు రిసెప్షన్ నిర్వహించనున్నారు. సంఘవి కన్నడ అమ్మాయి కాగా, వెంకటేశ్ మలయాళీ. సంఘవి అసలు పేరు కావ్యా రమేష్. ఆమె మొదట తమిళంలో అజిత్‌కు జంటగా 'అమరావతి' సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయమైంది. ఆ తరువాత విజయ్, కార్తీక్ తదితర ప్రముఖ తమిళ హీరోలతో నటించారు. రజనీకాంత్ 'బాబా' చిత్రంలోనూ కనిపించింది. దక్షిణాది భాషలన్నింటిలోనూ సంఘవి నాయికగా నటించింది. తెలుగులో నాగార్జున, రాజశేఖర్ వంటి ప్రముఖ హీరోలతో జతకట్టి.. అనేక సినిమాల్లో అభిమానులను మెప్పించింది. -
సంఘవి రీ ఎంట్రీ
బహుభాషా నటీమణుల్లో సంఘవి ఒకరు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోలందరితోను జత కట్టారు. ఇళయదళపతి విజయ్, అజిత్ కెరీర్ తొలిరోజుల్లో సంఘవినే వారి హీరోయిన్. విజయ్‌తో కోయంబత్తూరు మాప్పిళ్లై తదితర చిత్రాలలో నటించారు. ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్గా రాణించిన ఈమె మధ్యలో కొంతకాలం సినిమాకు దూరం అయ్యారు. కారణాలేమైనా రీఎంట్రీ అవుతున్న జాబితాలో తాజాగా సంఘవి చేరారు. ఈమె ఇప్పుడు దర్శకుడు సముద్రకణికి జంటగా నటించడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు నలన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కొలంజి. రాజాజీ, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నగర నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. సముద్రకణి సరసన సంఘవి జంటగా నటిస్తున్నారని చెప్పారు. వీరివి ఈ చిత్రంలో చాలా కీలక పాత్రలని అన్నారు. రాజాజీకు జంటగా నవ నటి నటిస్తున్నారని తెలిపారు. ఇది నగర జీవితంలో జరిగే విభిన్న ప్రేమకథా చిత్రం అని వివరించారు. చిత్రం కోసం రెండు పాటలను కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించినట్లు దర్శకుడు నలన్ వెల్లడించారు. -
తెరపైకి మళ్లీ... సంఘవి
సంఘవి గుర్తుంది కదూ.. సింధూరం, తాజ్‌మహల్, సీతారామరాజు, సమరసింహారెడ్డి లాంటి చిత్రాల్లో నటించిన సంఘవి కొంత విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ‘కొళంజి’ అనే తమిళ చిత్రంలో సముద్రఖని సరసన ఆమె నటించనున్నారు. ‘అమరావతి’ చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమైన సంఘవి ఆ తర్వాత రసిగన్, కోయంబత్తూర్ మాపిళ్లయ్.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. తెలుగు తెరపై ఆమె కనిపించి ఐదారేళ్లు కాగా, తమిళంలో దాదాపు పదేళ్లవుతోంది. -
నాకింకా పెళ్లి కాలేదు
అజిత్‌కు జంటగా అమరావతి చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈ చిత్రం 1993లో తెరపైకి వచ్చింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే ఆ తరువాత అసిన్, నయనతార వంటి గ్లామరస్ హీరోయిన్ల పోటీని తట్టుకోలేక వెనుకబడ్డారు. ప్రస్తుతం అడపాదడపా తెరపై కనిపిస్తున్న ఈ భామ పెళ్లి చేసుకుని సంసారజీవితంలో సెటిల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో స్పందించిన సంఘవి తనకు వివాహం జరిగినట్లు, నటనకు స్వస్తి చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. నిజానికి తనకింకా పెళ్లి కాలేదని పేర్కొన్నారు. అయితే ఇంట్లో వరుడి అన్వేషణ జరుగుతోందని తెలిపారు. అదే విధంగా తాను ఇటీవల పోలీసు కమిషన్ కార్యాలయానికి వెళ్లడాన్ని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు తుపాకీ లెసైన్స్ ఉందని అందులో చిరునామా మార్చుకోవడానికి తాను పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లినట్లు వివరించారు. మొత్తం మీద ఇప్పుడు పెళ్లి కాపోయినా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారన్నమాట.