హాస్యనటులతో సంఘవి | Society is a picture of the knights | Sakshi
Sakshi News home page

హాస్యనటులతో సంఘవి

Jul 16 2017 4:14 AM | Updated on Sep 5 2017 4:06 PM

హాస్యనటులతో సంఘవి

హాస్యనటులతో సంఘవి

హాస్య నటులు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్, గంజాకరుప్పు, యోగిబాబుతో నటి సంఘవి ఒక చిత్రంలో నటించనున్నారు.

తమిళసినిమా: హాస్య నటులు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్, గంజాకరుప్పు, యోగిబాబుతో నటి సంఘవి ఒక చిత్రంలో నటించనున్నారు. వీరితో పాటు రోషన్, హర్షిత, మెర్కురి సత్య, కేపీ.శంకర్, జీవిత, స్నేహన్‌రాజా, కేపీ.సెంథిల్‌కుమార్, బోండామణి, త్రిలోక్, వి.రాజా, ఆర్‌.స్టాలిన్, కింగ్‌కాంగ్, రణాదేవి, ఎంఆర్‌జీ.రాజేశ్వరి, మయిలైదేవి, వీరమణి, కాదల్‌ హుస్సేన్‌ ముఖ్య పాత్రలు ధరించనున్నారు. ఈ చిత్రానికి నాన్‌యార్‌ తెరియుమా అనే టైటిల్‌ను నిర్ణయించారు.

గ్లామర్‌ సినీగైడ్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి నవీన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. నాన్‌ యార్‌ తెరియుమా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పోలీస్‌ అధికారి కావాలన్న లక్ష్యంతో చెన్నైకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల జీవితంలో ఒక ఆడ దెయ్యం ప్రవేశిస్తుందన్నారు.ఆ ముగ్గురు పోలీస్‌ అధికారులు కావాలంటే ఆ దెయ్యం మూడు నిబంధనలు విధిస్తుందన్నారు. వాటిని సవాల్‌గా తీసుకున్న ఈ ముగ్గురు పోరాటంలో పడే బాధలను వినోదభరితంగా తెరకెక్కించనున్న చిత్రం నాన్‌ యార్‌ తెరియుమా అని తెలిపారు. దీనికి చంద్రన్‌సామి ఛాయాగ్రహణం, రశాంత్‌ సంగీతాన్ని అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement