![తెరపైకి మళ్లీ... సంఘవి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51426181212_625x300.jpg.webp?itok=Gqc-E27o)
తెరపైకి మళ్లీ... సంఘవి
సంఘవి గుర్తుంది కదూ.. సింధూరం, తాజ్‌మహల్, సీతారామరాజు, సమరసింహారెడ్డి లాంటి చిత్రాల్లో నటించిన సంఘవి కొంత విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ‘కొళంజి’ అనే తమిళ చిత్రంలో సముద్రఖని సరసన ఆమె నటించనున్నారు. ‘అమరావతి’ చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమైన సంఘవి ఆ తర్వాత రసిగన్, కోయంబత్తూర్ మాపిళ్లయ్.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. తెలుగు తెరపై ఆమె కనిపించి ఐదారేళ్లు కాగా, తమిళంలో దాదాపు పదేళ్లవుతోంది.