సాక్షి, హైదరాబాద్: తోటి మనిషి బాగును కోరుకోవడమే కాళోజీకి మనం అందించే నివాళి అని చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్. నేడు కాళోజీ వర్ధంతి సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య గరిమను ప్రపంచానికి చాటారని అన్నారు.
కాళోజీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..‘తోటి మనిషి బాగు కోరుకోవడమే కాళోజీకి ఘన నివాళి. కవిగా తన కలాన్ని, గళాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య గరిమను ప్రపంచానికి చాటారు. కాళోజీ స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించడానికి కృషి చేశాం. తెలంగాణ సమాజం కోసం వారు పడిన తపన, వారు అందించిన పోరాట స్ఫూర్తి, మలిదశ ఉద్యమంలో అనంతరం బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇమిడి ఉంది. ఈ మేరకు బీఆర్‌ఎస్ పలు కార్యక్రమాలను చేపట్టింది. తోటి మనిషి క్షేమాన్ని కోరుకోవడం, సబ్బండ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కాళోజీకి మనం అందించే ఘన నివాళి’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment