Sanghavi
అజిత్‌కు జంటగా అమరావతి చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈ చిత్రం 1993లో తెరపైకి వచ్చింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే ఆ తరువాత అసిన్, నయనతార వంటి గ్లామరస్ హీరోయిన్ల పోటీని తట్టుకోలేక వెనుకబడ్డారు. ప్రస్తుతం అడపాదడపా తెరపై కనిపిస్తున్న ఈ భామ పెళ్లి చేసుకుని సంసారజీవితంలో సెటిల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో స్పందించిన సంఘవి తనకు వివాహం జరిగినట్లు, నటనకు స్వస్తి చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. నిజానికి తనకింకా పెళ్లి కాలేదని పేర్కొన్నారు. అయితే ఇంట్లో వరుడి అన్వేషణ జరుగుతోందని తెలిపారు. అదే విధంగా తాను ఇటీవల పోలీసు కమిషన్ కార్యాలయానికి వెళ్లడాన్ని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు తుపాకీ లెసైన్స్ ఉందని అందులో చిరునామా మార్చుకోవడానికి తాను పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లినట్లు వివరించారు. మొత్తం మీద ఇప్పుడు పెళ్లి కాపోయినా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారన్నమాట.