
మరో కొత్త సినిమా పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల మొదటి వారంలో థియేటర్లలో రిలీజైన డబ్బింగ్ మూవీ 'పట్టుదల'.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఎందులోకి వచ్చింది? దీని సంగతేంటి?
తమిళ స్టార్ హీరో అజిత్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించగా.. అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించిన మూవీ 'విడామయూర్చి'. తెలుగులో 'పట్టుదల' పేరుతో ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే తమిళంలో పాజిటివ్ టాక్ వచ్చింది కానీ తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)
రోడ్ యాక్షన్ థ్రిల్లర్ కావడం, కంటెంట్ పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ రాలేదు. కానీ హీరో అజిత్ కావడంతో కలెక్షన్స్ రూ.100 కోట్లు పైనే వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ ఇప్పుడు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. టైమ్ పాస్ చేద్దామనుకుంటే ఓ లుక్కేసేయండి.
'పట్టుదల' కథ విషయానికొస్తే. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్‌బైజాన్‌లో ఉంటారు. పిల్లలు లేరు, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుందామని అనుకుంటారు. విడిపోయే ముందు ఓ ఆఖరి రోడ్ ట్రిప్ కి రమ్మని అర్జున్, కాయల్ ని అడుగుతాడు. ఆ ప్రయాణంలో వాళ్లకి ప్రమాదాలు ఎదురవుతాయి. కాయల్ ని కిడ్నాప్ చేస్తారు. చివరికి ఏమయ్యిందనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment