
కోలీవుడ్ హీరో అజిత్ కారు రెండు పల్టీలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్పెయిన్‌లో జరుగుతున్న కారు రేసింగ్‌లో అజిత్ పాల్గొన్నారు. రేసింగ్‌లో భాగంగా మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన కారు ట్రాక్ తప్పింది. అయితే, సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఆయన సురక్షితంగా బయటకొచ్చారు. ఇదే విషయాన్ని ఆయన యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో అజిత్ తప్పులేదని వారు తెలిపారు. రేసులో ఉన్న ఇతర కార్ల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. అయితే, మళ్లీ అజిత్ రేసులో పాల్గొనడం విశేషం.
అజిత్ కారు రేసింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. అజిత్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆప్పుడు కూడా ఆయన ప్రమాదానికి గురికావడం జరిగింది. స్పెయిన్ రేసులో పాల్గొనేందుకు ఆయన శిక్షణ తీసుకుంటున్న సమయంలో కూడా ప్రమాదం జరిగింది. అయితే, ఆయన అన్నిసార్లు కూడా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళ చెందుతూ జాగ్రత్తగా ఉండాలని అజిత్‌ను సూచిస్తున్నారు.
అజిత్ కుమార్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. త్రిష హీరోయిన్ . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. ఇండియన్ మూవీ చరిత్రలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment