car raceing
-
అజిత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
కోలీవుడ్ హీరో అజిత్ కారు రెండు పల్టీలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్పెయిన్‌లో జరుగుతున్న కారు రేసింగ్‌లో అజిత్ పాల్గొన్నారు. రేసింగ్‌లో భాగంగా మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన కారు ట్రాక్ తప్పింది. అయితే, సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఆయన సురక్షితంగా బయటకొచ్చారు. ఇదే విషయాన్ని ఆయన యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో అజిత్ తప్పులేదని వారు తెలిపారు. రేసులో ఉన్న ఇతర కార్ల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. అయితే, మళ్లీ అజిత్ రేసులో పాల్గొనడం విశేషం.అజిత్ కారు రేసింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. అజిత్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆప్పుడు కూడా ఆయన ప్రమాదానికి గురికావడం జరిగింది. స్పెయిన్ రేసులో పాల్గొనేందుకు ఆయన శిక్షణ తీసుకుంటున్న సమయంలో కూడా ప్రమాదం జరిగింది. అయితే, ఆయన అన్నిసార్లు కూడా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళ చెందుతూ జాగ్రత్తగా ఉండాలని అజిత్‌ను సూచిస్తున్నారు.అజిత్ కుమార్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. త్రిష హీరోయిన్ . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. ఇండియన్ మూవీ చరిత్రలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing) -
ది డెటోనా 500 మోటార్ కార్ రేసులో ట్రంప్ బీస్ట్ (ఫొటోలు)
-
మరోసారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అజిత్
అజిత్ కథానాయకుడిగానే కాకుండా , కారు రేస్, రైఫిల్ షూటింగ్ క్రీడా రంగాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన విడాముయర్చి (పట్టుదల) చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా అజిత్ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం గుడ్ బాడ్ అగ్లీ. ఈ చిత్ర షూటింగ్ డబ్బింగును పూర్తి చేసిన అజిత్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు దుబాయ్‌లో జరిగిన కారు రేస్ శిక్షణలో పాల్గొని ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా మరోసారి ఈయన కార్ రేస్ శిక్షణలో ఘోర ప్రమాదానికి గురై ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అజిత్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరగనున్న కారు రేస్ పోటీలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా అక్కడ శనివారం కారు రేస్ శిక్షణలో పాల్గొంటున్నారు. అయితే ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ అజిత్‌కు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
కేటీఆర్ కు మూడు ఆప్షన్స్!
-
Formula E Car Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
-
సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేసు పెట్టించారు: KTR
-
ఈ స్టార్ హీరో ఓ సాహసి.. స్పెయిన్ బార్సిలోనా ఎఫ్ 1 రేసులో అజిత్ కుమార్ (ఫొటోస్)
-
హైదరాబాద్: ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్ ( ఫొటోలు)
-
ఇన్ఫోసిస్ సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
*భర్త పరిస్థితి విషమం, కుమారుడికి గాయాలు *మూడు కార్లు ధ్వంసం *'మత్తు'లో కారు రేసింగ్తోనే ప్రమాదం హైదరాబాద్: తప్ప తాగి... స్నేహితులతో కలిసి కారు రేసింగ్ చేస్తూ ఓ వ్యక్తి సిగ్నల్ వద్ద నిలిపి ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందగా... ఆమె భర్త, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ భోపాల్ పరిధిలోని సాగర్ గ్రామానికి చెందిన సోనీరాం చందానీ(36), హరీష్ ప్రసాద్(40) ప్రేమవివాహం చేసుకున్నారు. సోనీ ఇన్ఫోసిస్‌లో సాప్ట్వేర్ ఇంజినీర్ కాగా.. హరీష్ వ్యాపారం చేస్తున్నాడు. వీరు మాదాపూర్‌లోని విఠల్రావునగర్లో ఉంటున్నారు. గురువారం రాత్రి 8.50కి బైక్‌పై హరీష్ ప్రసాద్, సోనీ, కొడుకు మోక్ష్(4) నానక్‌రాంగూడ నుంచి ఔటర్‌పై గచ్చిబౌలి వైపు వస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్లో రెడ్ సిగ్నల్ పడటంతో బైక్ ఆపాడు. ఔటర్‌పై వెనుక నుంచి వచ్చిన స్కోడా కారు (టీఎస్09 ఈసీ9599) బైక్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందున్న హోండా సిటీ, ఇన్నోవా కార్లను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే సోనీ మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండటంతో హరీష్ ప్రసాద్‌ను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. మోక్ష్కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. హోండా సిటీ కారులో ఉన్న ఓ మహిళ, వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హోండా సిటీ, ఇన్నోవా కార్లు ధ్వంసమయ్యాయి. రేసింగ్ వల్లే ప్రమాదం... డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేసే శ్వేతాబ్కుమార్ తోటి ఉద్యోగులు ఐదుగురిని తీసుకొని రేసింగ్‌కు బయలుదేరాడు. శంషాబాద్ నుంచి మితిమీరిన వేగంతో వస్తూ బైక్, కార్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కారులో ఉన్న బీరు సీసాలు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్కోడా కారులో ఉన్న శ్వేతాబ్ కుమార్‌తో పాటు వినోద్, రిషాబ్, శ్రీవాత్సవలకు గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. శ్వేతాబ్ కుమార్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొంది పారిపోయాడన్నారు. పరారైనట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు.