
అజిత్ కథానాయకుడిగానే కాకుండా , కారు రేస్, రైఫిల్ షూటింగ్ క్రీడా రంగాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన విడాముయర్చి (పట్టుదల) చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా అజిత్ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం గుడ్ బాడ్ అగ్లీ. ఈ చిత్ర షూటింగ్ డబ్బింగును పూర్తి చేసిన అజిత్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.
అయితే అంతకుముందు దుబాయ్‌లో జరిగిన కారు రేస్ శిక్షణలో పాల్గొని ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా మరోసారి ఈయన కార్ రేస్ శిక్షణలో ఘోర ప్రమాదానికి గురై ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అజిత్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరగనున్న కారు రేస్ పోటీలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా అక్కడ శనివారం కారు రేస్ శిక్షణలో పాల్గొంటున్నారు. అయితే ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ అజిత్‌కు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment