
పెద్ద హీరోల సినిమా విడుదలైతే చాలు ఫ్యాన్స్‌లో సందడి మామూలుగా ఉండదు. ట్రైలర్ విడుదలైతే వ్యూస్ లెక్కలేసుకుంటారు. సినిమా వచ్చాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలో పోటీ పడుతారు. చివరకు తమ హీరోల భారీ కటౌట్స్ ఏర్పాటు విషయంలో కూడా అభిమానులు పోటీ పడుతున్నారు. తమదే రికార్డుగా మిగిలిపోవాలనే తాపత్రయం ఇప్పుడున్న ఫ్యాన్స్‌లలో క్లియర్‌గా కనిపిస్తోంది. ఇటీవల్ విజయవాడలో గేమ్‌ఛేంజర్ సినిమా విడుదల సమయంలో రామ్‌చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. రామ్‌చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత భారీ కటౌట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దానిని కోలీవుడ్‌లో అజిత్ ఫ్యాన్స్ బీట్ చేయాలనుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు.

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. అతిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడులోని తెంకాశి పట్టణంలో ఉన్న ఒక థియేటర్ వద్ద 285 అడుగుల అత్యంత భారీ అజిత్ కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఇనుముతో తయారు చేసిన ఫెన్సింగ్ గ్రిల్స్ ఏర్పాటు చేసి ఒక్కో భాగాన్ని పెడుతూ వెళ్లారు. అజిత్ తల భాగం ఉంచిన కొద్ది సేపటికే అది కూలిపోయింది. దీనిని గమనించిన జనం వెంటనే అప్రమత్తం అయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
తనకు ఫ్యాన్స్ అసోషియన్స్ వద్దని అజిత్ పలుమార్లు వారించాడు. అయినా అభిమానుల్లో మాత్రం మార్పు రావడం లేదు. 2019 విశ్వాసం సినిమా విడుదల సమయంలో అజిత్ కటౌట్‌కు పాలాభిషేకం చేస్తున్న క్రమంలో ఐదుగురు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అజిత్ తీవ్రంగా ఆగ్రహాం చెందారు. వారికి చికిత్స చేయించి ఇలాంటి పనులు మరోసారి చేయకండి అంటూ చెప్పారు. తనకు ఎలాంటి బిరుదులు వద్దు.. సినిమా నచ్చితే చూడండి. కానీ, ఇలాంటి పనులు చేస్తే తాను ఏంతమాత్రం సహించను అని చెప్పాడు. అయితే, ఈ ప్రమాదం గురించి అజిత్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

ఇండియాలోనే అత్యంత భారీ కటౌట్ రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్) 256 అడుగులతో టాప్‌లో ఉంది. తర్వాత సలార్ (236), కెజిఎఫ్ 2 (216) విశ్వాసం (185) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ రామ్ చరణ్ పేరుతో ఉన్న రికార్డ్‌ను దాటేద్దాం అనుకున్నారేమో.. అందుకే వారు 285 అడుగుల ఏత్తులో ఉండేలా కటౌట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఇలా కూలిపోవడంతో అభిమానుల్లో నిరాశ కనిపించింది.
Namaku yethuku intha vela!!🤦♂️
pic.twitter.com/jzVcKO1n1P— Christopher Kanagaraj (@Chrissuccess) April 6, 2025