
బ్యాచిలర్లకు మాత్రమే ఉద్యోగాలిచ్చే కంపెనీల గురించి విన్నాం. పెళ్లి చేసుకున్న వారికి జాబ్స్ ఇచ్చే కంపెనీలను చూసాం. కానీ పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుంది అని అంటోంది ఓ సంస్థ. దీని గురించి మరిన్ని వివరాలు విపులంగా ఇక్కడ తెలుసుకుందాం.
చైనాలోని 'షాన్‌డాంగ్ షుంటియన్ కెమికల్ గ్రూప్ కో. లిమిటెడ్' కంపెనీ ఒంటరిగా ఉన్న, విడాకులు తీసుకున్న ఉద్యోగులు సెప్టెంబర్ నాటికి వివాహం చేసుకోవాలి. లేకుంటే.. ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది. అయితే వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టిన కంపెనీని అధికారులు మందలించారు.
అధికారులు మందలించినప్పటికీ.. కంపెనీ మాత్రం తమ విధానాన్ని సమర్ధించుకుంది. దేశంలో వివాహ రేటు గణనీయంగా తగ్గుతోంది. వివాహ రేటును మెరుగుపరచాలనే ప్రభుత్వ పిలుపుకు మద్దతుగా ఈ ప్రకటన జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు కూడా విమర్శించారు.
ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం మీద.. పెకింగ్ యూనివర్సిటీ లా స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ 'యాన్ టియాన్' మాట్లాడుతూ.. చైనా కార్మిక చట్టాల ప్రకారం, కంపెనీలు ఉద్యోగ దరఖాస్తుదారులను వారి వివాహం లేదా పిల్లలు కనడానికి సంబంధించిన విషయాలను గురించి అడగడానికి అనుమతి లేదు. ఇది వారి స్వేచ్చకు భంగం కలిగించడం అవుతుందని అన్నారు. వివాదం ముదరడంతో.. కంపెనీ నోటీసును రద్దు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment