Marrige
-
చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే
హీరో నాగచైతన్య మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ శుభకార్యం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. సరిగ్గా ఈ టైంలో ఓ పుకారు బయటకొచ్చింది. చైతూ-శోభిత పెళ్లిని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్లకు డీల్ మాట్లాడుకుందని అన్నారు. కానీ అందులో నిజం లేదు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)చైతూ-శోభితకు సన్నిహితుడైన ఓ వ్యక్తి.. ఓటీటీ డీల్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని తేల్చేశారు. పెళ్లి.. చాలా ప్రైవేట్‌గా జరగనుందని క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్లు రావడానికి ఓ కారణముంది. రీసెంట్గా 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరిట ఈమె జీవితాన్ని డాక్యుమెంటరీగా తీసి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. దీనిపై నెగిటివ్ కామెంట్సే వినిపించాయి.ఇదే డాక్యుమెంటరీలో నయన పెళ్లి వీడియోని కూడా చూపించారు. ఈ క్రమంలోనే చైతూ-శోభిత పెళ్లిని కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీలో ప్రసారం చేయనుందనే రూమర్ పుట్టుకొచ్చింది. ఇదంతా అబద్ధమని తేలింది. ప్రస్తుతం చైతూ 'తండేల్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'విరూపాక్ష' దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
బెంగాల్ లెస్బియన్స్.. యూపీలో ఒక్కటయ్యారు!
లక్నో: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ లెస్బియన్ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని ఓ ఆలయంలో సంప్రదాయ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. బెంగాల్లో దక్షిణ పరగణా జిల్లాకు చెందిన జయశ్రీ రాహుల్ (28), రాఖీ దాస్ (23) డియోరియాలోని ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నారు. అక్కడ వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ మొదట తమ వివాహానికి నోటరీ చేయబడిన అఫిడవిట్‌ను పొందారు. ఆపై సోమవారం డియోరియాలోని భవానీ ఆలయంలో జరిగిన వేడుకలో మూడు ముళ్లు వేసుకున్నారని స్థానికులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం దీర్ఘేశ్వరనాథ్ ఆలయంలో ఈ జంట పెళ్లి చేసుకోవడానికి అనుమతి నిరాకరించబడింది. అంతటితో ఆగని ఆ ప్రేమికులు తమ శ్రేయోభిలాషులతో కలిసి ప్రత్యామ్నాయ మార్గంగా పెళ్లికి నోటరీ అఫిడవిట్‌ను పొందారు. ఆ తర్వాత మఝౌలీరాజ్‌లోని భవాని ఆలయానికి వెళ్లి ఆలయ పూజారి సమక్షంలో దండలు మార్చుకున్నారు. వివాహానంతరం ఈ జంట తమ ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో? సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో? వివరించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
స్నేహితురాలిపై ప్రేమతో ఆమె..‘అతని’గా మారాలనుకుంది.. తరువాత జరిగిన దారుణమిదే..
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో ఒక యువతి తన స్నేహితురాలిని గాఢంగా ప్రేమించింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పురుషునిగా మారేందుకు ఒక మాంత్రికుని వద్దకు వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఆ మాంత్రికుడు ఆమెపై ఘాతుకానికి తెగబడ్డాడు. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యులు ఆ యువతి అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మాంత్రికునితో పాటు ఆమె స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు. ఆర్సీమిషన్ పరిధిలో ఉంటున్న పూనమ్ ఇంటి నుంచి ఏప్రిల్ 18న మాయమయ్యింది. ఏప్రిల్ 26న ఆమె సోదరుడు దీనిపై పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాయమైన ఆ యువతి తన స్నేహితురాలు ప్రీతిని పెళ్లాడాలనుకుందని తెలిసింది.ఇదిలా ఉండగా మే 18న లఖీంపురా పరిధిలో ఒక యువతి అస్థిపంజరం పోలీసులకు లభ్యమయ్యింది. పోలీసులు ఆ అస్థిపంజరం శాంపిల్ ల్యాబ్‌కు పంపగా మాయమైన పూనమ్‌దేనని తేలింది. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. పువాయులో ఉంటున్న ప్రీతి, పూనమ్‌లు స్వలింగ సంపర్కులుగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో పూనమ్ తన స్నేహితురాలు ప్రీతిని వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే పూనమ్ కారణంగా ప్రీతికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో ప్రీతి తల్లి ఊర్మిళ.. లఖీంపూర్ ఖీరీ పరిధిలో ఉంటున్న రామ్నివాస్ అనే వ్యక్తిని కలుసుకుంది. తన కుమార్తె వివాహానికి పూనమ్ అడ్డుగా ఉందని, ఆమెను అంతమొందిస్తే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తానని అతనికి చెబుతూ రూ. 5 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. తరువాత ప్రీతి, పూనంలను రామ్నివాస్ ఒక అడవికి తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరికీ వివాహం చేసే విషయమై మాట్లాడాడు. మంత్ర విద్యలతో పురుషునిగా మార్చేస్తానని పూనమ్‌కు రామ్నివాస్ హామీనిచ్చాడు. ఇందుకోసం మరోమారు అడవికి రావాల్సివుంటుందని పూనమ్‌కు చెప్పాడు.అతను చెప్పిన సమయానికి పూనమ్ అడవికి రాగానే రామ్నివాస్ ఆమెపై దాడి చేసి, హత్యచేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని అక్కడున్న పొదల్లో దాచిపెట్టాడు. ఈ కేసు గురించి సిటీ ఎస్పీ సుధీర్ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తాము మే 18న వివిధ ఆధారాలతో పూనమ్‌కు చెందిన అస్థిపంజరాన్ని గోమతి నది ఒడ్డున స్వాధీనం చేసుకున్నామన్నారు. పూనమ్ సోదరుడు పర్వీందర్ తన సోదరి దుస్తులను చూసి గుర్తుపట్టాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ రామ్నివాస్, ప్రీతి, ఆమె తల్లి ఊర్మిళలపై కేసు నమోదు చేశారు. రామ్నివాస్, ప్రీతిలను అరెస్టు చేశారు. పరారైన ఊర్మిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఆ హ్యాండ్సమ్ సీరియల్ కిల్లర్‌పై అమ్మాయిల మోజు.. -
వధువు పరార్... 13 రోజులు పెళ్లి దుస్తులతో వేచివున్న వరుడు.. ఎట్టకేలకు ఏమయ్యిందంటే..
మన దేశంలో పెళ్లిళ్లు ఎంతో వేడుకగా జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లిళ్లలో ఒక్కోసారి అనుకోని ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అటువంటి ఊహకందని ఉదంతం రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్ కుమార్‌తో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి వేడుకలో భాగంగా వరుని తరుపు వారంతా మే 3న పెళ్లికుమార్తె ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. వారికి పెళ్లి కుమార్తె తరుపువారు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. మే 4న ఉదయం వివాహ తంతులో భాగంగా మండపంలోకి పెళ్లి కుమార్తెను తీసుకురావాలని పురోహితుడు కోరాడు. అయితే ఇందుకోసం కొద్దిసేపు వెయిట్ చేయాలని పెళ్లి కుమార్తె తరపువారు చెప్పారు. పెళ్లికుమార్తె మనీషా తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న ఒక బంధువుతోపాటు ఆక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా హడలిపోయారు. ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి ముస్తాబు చేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందని, తరువాత కడుపు నొప్పి వస్తున్నదని చెప్పి టాయిలెట్‌కు వెళ్లిందన్నారు. తరువాత తన మామ కుమారుడు భరత్‌కుమర్‌తో బయటకు వెళ్లిపోయిందన్నారు. కాగా బంధువులు ఎంత నచ్చచెప్పినా ఆమె ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది. అయితే ఆమెపై అమితమైన ప్రేమ కలిగిన వరుడు.. పెళ్లి అలంకరణలో భాగంగా తాను ధరించిన పగడీ కూడా తీయకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతవరకూ పెళ్లి మండపాన్ని అలంకరణతోనే ఉంచారు. అయితే ఎట్టకేలకు బంధువులంతా ఒప్పించి పెళ్లి కుమార్తెను మే 15న కల్యాణ మండపానికి తీసుకురాగలిగారు. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే!
భువనేశ్వర్: ఇటీవల కొన్ని వివాహాలు పీటలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అయితే అందులో కొన్నింటికి వరుడు కారణమైతే, మరికొన్నింటికి వధువు కారణంగా నిలుస్తున్నారు. గతంలో పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెప్తుంటారు. మరి ఇప్పుడు అదే పెద్దలు చూడట్లేదేమో, మండపం వరకు వచ్చిన వివాహాలు చివరి నిమిషంలో పుల్‌స్టాప్ పడుతున్నాయి. తాజాగా ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలోనూ ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. కల్యాణ ఘడియల శుభవేళలో మంగళ వాద్యాలు మారుమోగుతున్న పెళ్లి పందిరిలో అకస్మాతుగా నిశ్శబ్దం ఆవరించింది. వరుడు సొమ్మసిల్లి పోయాడు. దీంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. కాసేపటి తర్వాత తేరుకన్న వరుడు వధువు పాపిట కుంకుమ పెట్టే క్షణంలో ఆమె అందరికీ షాకిస్తూ పెళ్లికి నిరాకరించింది. ఇంతకు ముందే తనకు వేరే వ్యక్తితో వివాహం జరిగినట్లు ప్రకటించి వేదిక నుంచి వైదొలగింది. బాలాసోర్ జిల్లా బలియాపాల్ ఠాణా రెమూ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఊహాతీత ఘటన చోటు చేసుకుంది. చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే? -
66 ఏళ్ల వయస్సులో భారత మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్..!
భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్, బుల్బుల్ సాహా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మే 2 (సోమవారం) కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్‌లో వీరి వివాహం జరిగింది. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 66 ఏళ్ల వయస్సులో అరుణ్ లాల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. లాల్ తన మొదటి భార్య రీనా అంగీకారంతోనే బుల్బుల్ సాహాను పెళ్లి చెసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె లాల్ కంటే 28 ఏళ్ల చిన్నది. ఇక అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాల్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. లాల్ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 156 మ్యాచ్‌లు ఆడిన లాల్.. 30 సెంచరీలతో సహా 10421 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్ రేసులో నిలిచిన కేకేఆర్.. రాజస్తాన్‌పై ఘన విజయం -
విడాకులు తీసుకుంటే మహిళలు చనిపోవాలా?.. నటి ఘాటు రిప్లై
సినీ ఇండస్ట్రీలో తారలు జంటలుగా మారడం, పలు కారణాలు వల్ల విడాకులు తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో టీవీలో ఇలాంటివి చూసి అయ్యో అనుకునే వాళ్ల అభిమానులు ప్రస్తుత సోషల్‌మీడియా సమాజంలో ట్వీట్, ట్రోల్స్ రూపంలో తమ బాధని, కోపాన్ని, అభిమానాన్ని బయటపెడుతుంటారు. అయితే ఈ క్రమంలో తారలు ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ఈ తరహాలోనే ఓ బాలీవుడ్ సీనియర్ నటి ట్రోలింగ్‌కు గురికాగా తన ట్వీట్‌తో ఘాటుగానే స్పందించింది. సోషల్‌మీడియా వాడుకంలోకి వచ్చినప్పటి నుంచి తారలు అభిమానుల మధ్య బంధం మరింత చేరువైందనే చెప్పాలి. దీని వల్ల వాళ్లు నేరుగా మాట్లాడుకునే, చాట్ చేసుకునే వెసలుబాటు కలిగింది. బాలీవుడ్ సీనియర్ నటి కామ్యా పంజాబీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా గడుపుతూ తన అభిమానులతో ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. నువ్వు నీ మొదటి వివాహ బంధాన్ని కొనసాగించలేకపోయి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నావు. నీకంటూ హద్దులు లేవా? అంటూ ట్రోల్ చేశాడు. ఈ ట్వీట్‌పై కామ్య కాస్త ఘాటుగా స్పందిస్తూ.. మహిళ సంతోషంగా ఉండకూడదా? విడాకుల తరువాత చనిపోవాలా? విడాకులు తీసుకున్న తర్వాత కూడా జీవితం ఉంటుంది. సమాజంలో ప్రతి మహిళ కూడా ధైర్యంగా నీలాంటి వాళ్లకి సమాధానం చెప్పాలి. నన్ను బలహీనురాలిగా భావించవద్దని బదులిచ్చింది. కాగా గతంలో వ్యాపారవేత్త బంటీ నెగి నుంచి 2013లో విడాకులు తీసుకుంది. కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న కామ్య గత ఏడాది శలాబ్ దంగ్ నీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. #लड़की_हूँ_लड़_सकती_हूँ pic.twitter.com/nCYgUQkB4o — Kamya Shalabh Dang (@iamkamyapunjabi) December 8, 2021 చదవండి: Pushpa Movie: సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా! -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. చాటింగ్‌లో మునిగితేలారు.. చివరకు
సాక్షి, బనశంకరి(కర్ణాటక): సిలికాన్ సిటీలో ఆన్లైన్ బందిపోట్లు దోచేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో యువతీ యువకులను బురిడీకొట్టించి లక్షలాది రూపాయలు వంచనకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరు నగరంలో ఇద్దరు మహిళలు లక్షలాది రూపాయల వంచనకు గురయ్యారు. ఆన్లైన్లో ఉద్యోగమని మహిళను నమ్మించి రూ.19.67 లక్షలను స్వాహా చేశారు. ఈ ఘటనపై ఆగ్నేయ విభాగం సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మడివాళ మారుతీనగరకు చెందిన 33 ఏళ్ల మహిళ బాధితురాలు. గృహిణి అయిన ఆమె ఇంటి వద్ద నుంచి పార్ట్‌టైం జాబ్ చేసి డబ్బు సంపాదించవచ్చని ఇంటర్నెట్లో పలు ప్రకటనలను చూసింది. ఓ వెబ్సైట్లో శోధించగా, వంచకులు పరిచయమయ్యారు. వస్తువుల విక్రయం ద్వారా దండిగా కమీషన్ పొందవచ్చునని ఆశచూపారు. దరఖాస్తు భర్తీ చేయాలని ఆమె వాట్సప్‌కి ఒక లింక్‌ను పంపించగా క్లిక్‌చేసి భర్తీ చేసింది. ఇక రిజిస్ట్రేషన్ తదితర ఫీజులను చెల్లించాలని ఆమె నుంచి విడతలవారీగా రూ.19.67 లక్షలను రాబట్టారు. చివరకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వకపోగా, ఫోన్లు కూడా స్విచాఫ్ చేసుకున్నారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఆగ్నేయ విభాగ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి కేటుగాళ్ల కోసం గాలిస్తున్నారు. ముంచేసిన డేటింగ్ పరిచయం మొబైల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మోసగాని వల్ల బెంగళూరు మహిళ రూ.18.29 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటనపై కేంద్ర విభాగ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆస్టిన్‌టౌన్ నివాసి అయిన 37 ఏళ్ల మహిళ డేటింగ్ యాప్‌లో ఖాతా తెరిచింది. ఆ యాప్‌లో ఆమెకు ఓ వ్యక్తితో పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్‌లో మునిగితేలారు. ఇద్దరూ ఫోటోలు వినిమయం చేసుకున్నారు. విదేశాల్లో స్థిరపడినట్లు చెప్పుకున్న వంచకుడు ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పగా అంగీకరించింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని నమ్మించి ఆమె నుంచి పలు దఫాలుగా రూ.18.29 లక్షలు జమ చేయించుకున్నాడు. ఓ రోజు వంచకుడు డేటింగ్ యాప్ నుంచి అకౌంట్‌ను తొలగించి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. -
ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి, చివరకు
సాక్షి, పాలకొల్లు: ఏడేళ్లుగా ప్రేమిస్తున్నా పెళ్లికి నిరాకరిస్తుండటంతో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది. పోలీసుల కౌన్సెలింగ్‌తో ఎట్టకేలకు ప్రియుడు పెళ్లికి అంగీకరించడంతో కిందికి దిగి రాగా, వారిద్దరికి దండలు మార్పించి ఒక్కటి చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 18వ వార్డు బెత్లహంపేటకు చెందిన పెట్టెల కేశవాణి, గాంధీనగర్ కాలనీకి చెందిన యడ్ల భాస్కరరావు ఏడేళ్లుగా ప్రేమికులు. తనను పెళ్లి చేసుకోవాలని వాణి కోరగా, భాస్కరరావు ముఖం చాటేస్తున్నాడు. రెండు రోజుల క్రితం యువతి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా భాస్కరరావు రెండు రోజులు గడువు కోరాడు. శనివారం కూడా ఏ విషయం చెప్పకపోవడంతో కేశవాణి తనకు న్యాయం చేయాలంటూ అదే ప్రాంతంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ఎక్కింది. దీంతో బంధువులు భయాందోళనలకు గురై ఫిర్యాదు చేశారు. సీఐ సీహెచ్ ఆంజనేయులు చొరవతో యువతి కిందికి దిగి రాగా, భాస్కరరావు, అతని తల్లిదండ్రులకు సీఐ కౌన్సెలింగ్ ఇవ్వడంతో పెళ్లికి అంగీకరించారు. స్టేషన్ పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రేమజంటకు దండలు మార్పించారు. ఏడాదిలోపు పెళ్లి చేసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు కేశవాణి బంధువులు, స్థానిక పెద్దలు తెలిపారు. ఎస్సై రెహమాన్, స్థానిక పెద్దలు సనమండ ఎబినేజర్, రేణుబాబు, ఖండవల్లి వాసు, రామాంజుల మధు, రాజేష్ కన్నా సమస్య పరిష్కరించడానికి కృషి చేశారు. చదవండి: Paralympics 2021: వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం -
పెళ్లిలో స్నేహితులు ఇచ్చిన విచిత్ర బహుమతి..! వధువు షాక్
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైంది. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఉన్నంతలో ఎంతో ఘనంగా పెళ్లి వేడుకను చేసుకుంటున్నారు. అయితే, పెళ్లికి వచ్చే స్నేహితులు, బంధువు మిత్రులు సైతం ఆ వివాహ వేడుక మరింత గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంభందించిన వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వివాహానికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందటే.. వధూవరులిద్దరూ వేదికపై నిల్చోని ఉన్నారు. ఇంతలో వరుడు స్నేహితులు స్టేజీపైకి వచ్చారు. ఇంతలో మరో స్నేహితుడు వధువుకు ఒక విచిత్ర బహుమతిని అందజేశాడు. అది ఓపెన్ చేసిన చూసిన వధువు షాక్ అవడంతో పాటు.. కోపంతో, ఆమె ముఖం తిప్పింది. ఎందుకంటే.. ఆ గిఫ్ట్ బాక్స్‌లో పాలసీసా ఉంది. అయితే స్నేహితులు చేసిన చిలిపి పనికి అక్కడ ఉన్నవారంతా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు అన్ని సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన వధువు.. ఒక్కో పరదా తొలగిస్తూ..
ప్రతి జంట తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని అనుకుంటారు. ఇటువంటి సన్నివేశానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వధువు వివాహ వేడుక ప్రారంభమయ్యే ముందు వరుడిని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా వరుడు వివాహ వేదికపై బంధుమిత్రులతో కలిసి ఉన్నాడు. వరుడు, స్నేహితులు, కుటుంబ సభ్యులు వధువు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో పెళ్లి మండపం వద్దకు వస్తున్న వధువును కొంతమంది అమ్మాయిలు దుపట్ట అడ్డుపెట్టి కవర్ చేశారు. ఇక వధువును వెంటనే చూడడానికి వీలు లేకుండా వరుడి ముందు కొన్ని పరదాలు వరుసగా ఉంచారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకును సమీపిస్తున్న కొద్దీ ఒక్కో పరదాను తొలగించారు. అలా అన్ని దుపట్టాలు తొలగిపోగా.. ఆ నవ వధువు అందమైన లెహంగాలో దర్శనమిచ్చింది. ఆమెను చూసిన వరుడు ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. పెళ్లి కూతురు కళ్లల్లోకి చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు. ఎందుకంటే.. అతనికి ఎంతో ఇష్టమైన లెహంగాను వధువు ధరించడమే దీనంతటికీ కారణం. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by The Wedding Brigade (@theweddingbrigade) -
పెళ్లిలో వధువు అద్భుత విన్యాసాలు: వావ్ అంటున్న నెటిజన్లు!
చెన్నై: సాధారణంగా పెళ్లంటే ఆటలు, పాటలు... బంధువులు, స్నేహితుల సందడి ఉంటుంది. వధూవరుల కుటుంబాలు పరస్పరం ఆటపట్టించుకోవడాలు జరుగుతుంటాయి. కానీ తమిళనాడులో ఓ వధువు మాత్రం తనలో దాగున్న నైపుణ్యాన్ని వెలికితీసి అతిథులను, గ్రామస్తులను ఆకట్టుకుంది. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలను ప్రదర్శించి పెళ్లికి హజరైనవారితో ఔరా అనిపించుకుంది. వివరాలు.. తమిళనాడులోని తిరుకోలూర్ గ్రామానికి చెందిన నిషాకు ఆదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో వివాహం నిశ్చియించారు. అయితే, తమ వివాహ వేడుక సాదాసీదాగా కాకుండా సమాజానికి ఎంతోకొంత ఉపయోగంగా ఉండాలని భావించాడు వరుడు రాజ్‌కుమార్. కాబోయే భార్యతో గ్రామంలో మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యాడు. వధూవరులు చేసిన పనిని బంధువులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. కాగా.. నిషా.. తన తల్లి ప్రోత్సహంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. పెళ్లి సమయంలో సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణాలను ధరించి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించింది. నిషా మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన వివాహ వేడుకలో హైలెట్‌గా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
వివాహం అవసరమా.. మలాలాపై విమర్శలు
లండన్: తమ ఆంక్షలు లెక్కచేయకుండా చదువుకుంటుందని.. 13 ఏళ్ల వయసులో తాలిబన్ల తూటాలకు బలయ్యింది. అయినా బెదరకుండా ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తూ.. నోబెల్ బహుమతి అందుకుంది పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్. తాజాగా మరోసారి అరుదైన గౌరవం అందుకుంది. ప్రముఖ బ్రిటీష్ మ్యాగ్జైన్ వోగ్ తన జూలై ఎడిషన్ కవర్ మీద మలాలా ఫోటో ప్రచురించింది. ఈ సందర్భంగా మలాలా రాజకీయాలు, సంస్కృతితో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను పంచుకుంది. ఈ క్రమంలో వివాహం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. వివాహం గురించి మలాలా చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మలాలా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను పెళ్లికుమార్తెగా చూడాలని ఆశపడుతున్నారు. అలానే చాలా మంది తమ సంబంధాల కథనాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వీటన్నింటిని చూస్తే నాకు చాలా ఆందోళన కలుగుతుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మన జీవితంలో ఒక భాగస్వామి, తోడు కావాలంటే.. పెళ్లి పత్రాలపై ఎందుకు సంతకాలు చేయాలి.. కేవలం భాగస్వాములుగా ఎందుకు ఉండలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Sad to know about Malala;s thoughts.😢#MalalaOnMarriage pic.twitter.com/vLUujigsW5 — S A M R E E N 🍁 (@SamreeenSohail) June 3, 2021 మలాలా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘నువ్వు విదేశీ వ్యక్తివి అయ్యావ్.. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్’’.. ‘‘నువ్వు ఇలాంటి బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలతో యువతను పెడదోవ పట్టిస్తున్నావ్.. ఇస్లాం సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నావ్’’.. ‘‘నీ వ్యాఖ్యాలు విచారకరం.. ఈ విషయంలో నీకు మద్దతు తెలపడం లేదు’’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు. చదవండి: ‘మలాల.. ఈ సారి తప్పించుకోలేవ్’ -
పెళ్లి విందులో చిందులు.. నేలకొరిగిన ‘మహాత్ముడు’
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం గాజులగూడెం గ్రామంలో పెళ్లి విందులో చిందులు వేస్తున్న కొంతమంది యువకులు ఆదివారం రాత్రి మహాత్మా గాంధీ విగ్రహానికి తగలడంతో అది కింద పడిపోయింది. అయినా సంఘటనకు కారకులైన వారిలో పశ్చాత్తాపం కనిపించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. కాగా మాజీ సర్పంచ్ బాలాగౌడ్ మాట్లాడుతూ విగ్రహాన్ని పునరుద్దరిస్తామని తెలిపారు. పెళ్లి కావడం లేదని.. వెల్దుర్తి(తూప్రాన్): వివాహం కావడం లేదని ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధి ఎల్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కానికె రమేశ్ కుమారుడు గణేష్(24) పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా ఆదివారం రాత్రి భోజనం ముగించుకొని కుటుంబసభ్యులు నిద్రకు ఉపక్రమించారు. అయితే తెల్లవారు జామున చూసేసరికి గణేష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించాడు. వివాహం కావడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్ వెల్లడించారు. చదవండి: బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో చోటు -
నిత్య పెళ్లి కొడుక్కి దేహశుద్ధి
సాక్షి, కరీంనగర్ : భార్య, కొడుకు ఉండగానే మరో మహిళతో కాపురం పెట్టిన నిత్యపెళ్లి కొడుక్కి, భార్య తరపు బంధువులు దేహశుద్ధి చేశారు. తాళ్లతో బంధించి చెప్పులతో, కర్రలతో చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన కొండి సంపత్ కరీంనగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. 2016లో మానకొండూరు మండలం గూడూరుకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. వారికి బాబు జన్మించాడు. భార్య కొడుకు ఉండగా సంపత్ మరో మహిళతో కరీంనగర్లో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య భాగ్యలక్ష్మి బంధువులతో కలిసి కరీంనగర్‌కి వెళ్లి సంపత్‌ను రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గతంలో కూడా పెళ్లి పేరుతో నలుగురి మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభంచారు. సంపత్,భాగ్యలక్షిల పెళ్లి ఫోటోలు -
ఇదే చివరి ముద్దు: నటి
ప్రముఖ నటి నేహా పెండ్సే పెళ్లి సమయం సమీపిస్తోంది. ఇక ఆమె సింగిల్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో నేహా పెండ్సే ఈ కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా ప్రారంభించింది. తనకు కాబోయే భర్తకు గాఢంగా ముద్దుపెడుతూ లోకాన్ని మరిచిపోయిన నేహా ‘లాస్ట్ సింగిల్ గర్ల్ కిస్’ అంటూ దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తన పెళ్లి గురించి చెప్తూ సిగ్గుల మొలకవుతోంది. ‘ప్రస్తుతం నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను కోరుకున్న వ్యక్తితో మనువాడి కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నాను. అక్కడ అందమైన వ్యక్తుల మధ్యకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను. అసలు ఇప్పుడు నాకు కలుగుతున్న ఫీలింగ్ నా జీవితంలోనే గొప్పది’ అంటూ సంతోషంలో తేలియాడుతోంది. కాగా నేహా పెండ్సే ప్రముఖ బిజినెస్మెన్ షాదుల్ సింగ్‌తో గతేడాది ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులక్రితం పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో నేహా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను నేహా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంది. ఇక ‘కేప్టన్ హౌస్’ షోతో బుల్లితెరకు పరిచయమైన నేహా తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఎన్నో హిట్ షోలతో పాటు బిగ్‌బాస్ 12 హిందీలోనూ తళుక్కున మెరిసింది. తెలుగులో కేవలం సొంతం, వీధి రౌడీ చిత్రాల్లో మాత్రమే నటించింది. నేహా పెండ్సే జనవరి 5న పెళ్లికి సిద్ధమవుతుండగా ఏప్రిల్‌లో హనీమూన్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. -
పెళ్లి జరిగినంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు
పట్నా : రెండేళ్ల క్రితం బిహార్‌లో జరిగిన ఓ వివాహం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాధరణంగా అమ్మాయిని కిడ్నాప్ చేసి, బెదిరించి వివాహం చేసుకునే సంఘటనల గురించి చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం అబ్బాయిని గన్నుతో బెదిరించి.. పెళ్లి మంటపానికి లాక్కొచ్చి మరి బలవంతంగా వివాహం జరిపించారు. 2017లో జరిగిన ఈ ‘పకడ్వా వివాహం’(బలవంతపు పెళ్లి) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలు.. వినోద్ కుమార్ అనే వ్యక్తి బొకారో స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న వినోద్‌కు.. సురేంద్ర అనే వ్యక్తి తారసపడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ మీద ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువచ్చాడు సురేంద్ర. అప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. సురేంద్ర చెల్లి పెళ్లి కూతురు స్థానంలో కూర్చుని ఉంది. సురేంద్ర బంధువులంతా మండపం దగ్గర ఉన్నారు. ఇంతలో సురేంద్ర గన్ను తీసి వినోద్ తలకు గురిపెట్టి.. అతడిని పెళ్లిమంటపానికి లాక్కెళ్లాడు. తన చెల్లిని వివాహం చేసుకోకపోతే.. చంపేస్తానని బెదిరించాడు. గతిలేని పరిస్థితుల్లో వినోద్.. ఆ పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. అనంతరం వినోద్.. తనకు బలవంతంగా పెళ్లి చేశారని.. ఈ వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా కోరాడు. అంతేకాక సురేంద్ర కుటుంబం మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే సోషల్ మీడియాలో వినోద్ పెళ్లి వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అనంతరం వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఈ ఏడాది మేలో కోర్టు వినోద్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బలవంతపు వివాహం చెల్లదని పేర్కొంది. వినోద్ పెళ్లి ఆధారంగా ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది. -
పెళ్లి ఆపింది.. బహుమతి పొందింది
భువనేశ్వర్ : పెళ్లి కూతురు అలంకరణలో మమత భోయ్ మెరిసిపోతుంది. మరి కొద్ది క్షణాల్లో తాను నూతన జీవితంలోకి ప్రవేశించబోతున్నాననే ఆలోచనతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. పచ్చని పందిరి మమత నూరేళ్ల జీవితానికి సాక్ష్యమన్నట్లు నిలిచింది. నిండు నూరేళ్లు చల్లగా బతకమని ఆశీర్వదించడానికి తన బంధువులంతా తరలి వచ్చారు. మరి కాసేపట్లో మాంగళ్యధారణ జరుగనుంది. ఈ లోపు వరుడు మంటపానికి వచ్చాడు.. సారి తీసుకొచ్చారు. అతడిని చూస్తే.. పెళ్లి కొడుకు అనే అభిప్రాయం అక్కడున్న ఎవరికి కలగడం లేదు. వరుడు సమీపిస్తోన్న కొద్ది మందు వాసన గుప్పుమంటోంది. మత్తులో తూగుతూ.. స్థిరంగా నిలబడేందుకు కూడా లేక పోవడంతో నలుగురు వ్యక్తులు కలిసి అతడిని మంటపానికి తీసుకొచ్చారు. బంధువులతో పాటు మమత కూడా అతని వాలకానికి ఆశ్చర్యపోయింది. ఇలాంటి వ్యక్తితోనా తాను జీవించబోయేది అనుకుంది. వెంటనే ఓ నిర్ణయానికొచ్చింది. తాను ఈ పెళ్లి చేసుకోబోవడం లేదంటూ మంటపం నుంచి వచ్చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె నిర్ణయాన్ని ఆమోదించారు. విషయం కాస్తా జిల్లా అధికారులకు తెలిసింది. వారు మమత చూపిన తెగువను మెచ్చుకుంటూ రూ. 10 వేల నగదు బహుమతిని అందజేశారు. మమత ధైర్యం ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ విషయం గురించి మమత మాట్లాడుతూ.. ‘మత్తులో జోగుతున్న పెళ్లి కొడుకును చూడగానే ఇతనితో కలిసి జీవితాంతం ఎలా బతకాలి అనిపించింది. ఆ క్షణమే అతడిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నాకు తెలుసు. నా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా నాకు మద్దతుగా నిలిచారు. అందుకు వారికి ధన్యవాదాలు’ అన్నారు మమత. ఆమె చూపిన చొరవను ప్రశంసిస్తూ.. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నాడు ప్రభుత్వం మమతా భోయ్‌ను ప్రశంసించింది. -
పుణెలో కౌకుంట్లవాసి దుర్మరణం
దేవరకద్ర రూరల్: పుణెలో వివాహంలో పాల్గొనేందుకు వెళ్లిన మండలంలోని కౌకుంట్లకు చెందిన ఓ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకోగా.. స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు, అలివేలు దంపతుల కుమారుడు వంశీకృష్ణ(29) పోస్టల్‌శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిన్నప్పుడే మృతి చెందడంతో తల్లి కష్టపడి చదివించింది. గతేడాది డిసెంబర్ 13న నల్లగొండకు చెందిన అమ్మాయితో వంశీకృష్ణకు వివాహమైంది. అయితే ఈ నెల 15న తన తమ్ముడు నవీన్‌కృష్ణతో కలిసి ఓ వివాహంలో పాల్గొనడానికి వంశీకృష్ణ పుణె వెళ్లాడు. వివాహం అనంతరం తమ్ముడు నవీన్‌కృష్ణ, మరో నలుగురితో కలిసి మంగళవారం కారులో తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు పుణె శివారులో ఆగి ఉన్న వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంశీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా.. తమ్ముడు నవీన్‌కృష్ణకు గాయాలయ్యాయి. వంశీకృష్ణ మృతదేహాన్ని బుధవారం స్వగ్రామమైన కౌకుంట్లకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. -
చిన్నారులను మింగిన పెళ్లి భోజనం
నార్నూర్(ఆసిఫాబాద్): విందు భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, 21 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నార్నూర్ మండలంలోని కొలాంగూడలో బుధవారం చోటు చేసుకుంది. కళ్ల ముందే పసి పిల్లల ప్రాణాలు పో తుండడంతో కొలాంగూడ ఆర్తనాదలతో ముని గితేలింది. సరైన సమయంలో 108 వాహనం రాకపోవడంతోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటన నార్నూర్ పీహెచ్సీ వైద్యం తీరు, అధికారుల వైఫల్యాన్ని ఎత్తిచూపింది. జరిగింది ఇది... మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలాంగూడ(గణపతిగూడ)లో 20 కొలాం గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరంతా పూరి గూడిసెలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన లక్ష్మిబాయి ఇంట్లో మంగళవారం పెళ్లి జరిగింది. దీంతో గ్రామస్తులంతా అక్కడే భోజనం చేశారు. మరుసటి రోజు బుధవారం ఉదయం కూడా అక్కడే భోజనం చేశారు. కాసేపటికే వివాహ విందు భోజనం తిన్న 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏడాది వయస్సు ఉన్న చింటు అక్కడికక్కడే మృతిచెందాడు. స్పందించని 108 వాహనం.. చిన్నా, పెద్ద అస్వస్థతకు గురికావడంతో ఆందోళనకు గురైన గిరిజనులు సర్పంచ్ రామేశ్వర్‌కు ఫోన్లో సమాచారం అందించారు. ఆయన వెంటనే గ్రామానికి చేరుకుని 108కి సమాచారం అందించారు. కాని వారు స్పందించకపోవడంతో ప్రైవేట్ ఆటోలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక్కడే అందరికీ వైద్యం అందించేందుకు ప్రయత్నం చేశారు. కాని పీహెచ్సీలో డాక్టర్ తప్పా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. దీంతో ఉట్నూర్, రిమ్స్‌కు రెఫర్ చేశారు. ఈసారి కూడా 108 వాహనం సకాలంలో రాకపోవడంతో మరో ఇద్దరు చిన్నారులు అయ్యు(06), కొడప ముత్తు(01) ఆసుపత్రిలోనే గిలగిలా కొట్టుకుని మృతిచెందారు. మరో 21 మందిని ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. గిరిజనుల ఆగ్రహం.. పీహెచ్సీలో సకాలంలో వైద్యం అందకపోవడం పట్ల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108కి స మాచారం అందించినా గంటసేపు అయినా రాకపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పీహెచ్సీ ఆవరణంలో 108 అంబులెన్స్ ఉన్నా డ్రై వర్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అంతలోనే వేరే కేసు నిమిత్తం పీహెచ్‌సీకి వచ్చిన 108 అం బులెన్స్ ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో వచ్చే వరకూ మృతదేహాలను తీసుకెళ్లేది లేదని తెల్చిచెప్పారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్, గాదిగూడ ఎస్సై సుబ్బారావులు అక్కడకు చేరుకుని గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో.. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య కొలాంగూడను సందర్శించి వివరాలు సేకరించా రు. అస్వస్థతకు గురైనా గిరిజనులకు మెరుగైనా వై ద్యం అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంతరావును ఆదేశించారు. ఘటనపై ఆరా తీశారు. ఐటీడీఏ తరుపున అన్నిరకాల సహాయ, సహకాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలి పారు. గ్రామంలో వైద శిబిరం ఏర్పాటు చేయాల ని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ డేవిడ్, జిల్లా వైద్యాధికారి రాజీవ్‌రాజ్ తదితరులున్నారు. -
పెళ్లింట విషాదం
ఆదిలాబాద్‌రూరల్: ఎన్నో ఆశలతో.. మరెన్నో కలలతో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మరికొద్ది నిమిషాల్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన బోతున్న సమయంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. హృదయ విదారకమైన ఈ రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం దేవాపూర్ ఫారెస్టు చెక్ పోస్టు వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఘటన నవ దంపతుల కుటుంబాల్లో విషాదం నింపింది. కారులో ప్రయానిస్తున్న పెళ్లి కూతురు సోదరి మెట్పల్లి స్వాతి, స్థానికంగా ఉన్న అటవీశాఖ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. మావల మండలంలోని రాంనగర్లో నివాసం ఉంటున్న మెట్పల్లి ముత్తమ్మ, అశోక్ దంపతుల పెద్ద కు మార్తె ప్రియాంకకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్డెడ్ గ్రామానికి చెందిన అడెపల్లి సాయి కుమార్‌తో గురువారం వడ్డేడ్‌లో పెద్దలు వి వాహం జరిపించారు. శుక్రవారం మావల మం డలంలోని రాంనగర్లో (పెళ్లి కూతురు ఇంటివద్ద) రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విందులో పాల్గొనేందుకు నవదంపతులు బంధువులతో కలిసి వడ్డేడ్ నుంచి ఉదయం 9గంటలకు ఆదిలాబాద్‌కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో దేవాపూర్ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారి 44పై ఉదయం 10.24 గంటల ప్రాంతంలో బరంపూర్ వైపు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టర్న్ అవుతున్న క్రమంలో కారు అదుపుతప్పి బస్సును సైడ్‌నుంచి ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ప్రియాంక, ఆమె సోదరీ మణులు స్వాతి, ప్రణవి, కజిన్ బ్రదర్ సాయికు మార్, బంధువు రాజేశ్‌తో పాటు పెళ్లి కుమారుని మేనత్త దొనకంటి రాజమణి ఉండగా పెండ్లి కుమారుడు సాయికుమార్ కారును డ్రైవ్ చేస్తున్నాడు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఫారెస్టు అధికారులు, సిబ్బంది, స్థానికులు కారు అద్దాలను ధ్వం సం చేసి క్షతగాత్రులను బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో అడెపల్లి సాయికుమార్‌తో పాటు ఆయన మేనత్త రాజమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మావల ఎస్సై తెలిపారు. నిలిచి పోయిన ఫంక్షన్.. వివాహం జరిగిన మరుసటి రోజు పెళ్లి కూతురు ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరో గంటలోపు భోజనాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఇంతలో రోడ్డు ప్రమా దం చోటు చేసుకోవడంతో రిసెప్షన్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని రోదిం చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడ్డ వారికి నాణ్య మైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, తదితరులు ఉన్నారు. -
తెల్లారితే పెళ్లి.. వధువు అదృశ్యం
బంజారాహిల్స్: మరికాసేపట్లో... పెళ్లి జరుగనుండగా పెళ్లి కూతురు అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఫిలింనగర్ సమీపంలోని హకీంపేట్‌కు చెందిన సంతోషి(19) వివాహం సికింద్రాబాద్‌కు చెందిన జైపాల్‌తో నిశ్చయమైంది. గురువారం ఉదయం జుమ్మరాత్బజార్లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం వధువు, వరుడి ఇళ్లల్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురును చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే బుధవారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్లిన సంతోషి మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరి స్వప్న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహ నిశ్చితార్థంలో విషాదం
నందికొట్కూరు (కర్నూలు): వివాహ నిశ్చితార్థంలో లడ్డూ కోసం తాగుబోతులు వీరంగం సృష్టించిన ఘట నలో పెళ్లి కుమార్తె సొంత అన్న మృతి చెందాడు. ఈ ఘటన నందికొట్కూరులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనంమేరకు.. కొత్తపల్లి మండలం ఎదురుపాడుకు చెందిన మరియమ్మ, ఏసన్న దంపతుల కుమార్తెకు పాములపాడు మండలం మిట్టకందాలకు చెందిన దిబ్బన్న కుమారుడు ప్రశాంత్‌తో సోమవారం నందికొట్కూరులో వివాహ నిశ్చితార్థం జరిగింది. రాత్రి 12 గంటలకు భోజనాలు వడ్డిస్తున్న జంబులయ్యతో అదనంగా లడ్డూ ఇవ్వాలని తప్ప తాగిన మైకంలో ఉన్న చెన్నయ్య, ఆంజనేయులు గొడవ పడ్డారు. పెళ్లి కుమార్తె సొంత అన్నయ్య కుమార్ అలియాస్ రాజు వారికి సర్దిచెప్పేందుకు వెళ్లాడు. అతనిపై చెన్నయ్య, ఆంజనేయులుతో పాటు సుజాత, మరికొందరు కలిసి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. -
పెళ్లి చేసుకోకుంటే హతమారుస్తా..
సాక్షి, గుంటూరు: ‘ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకోకుంటే హతమారుస్తా’ అంటూ రమావత్ శివానాయక్ అనే యువకుడు నిత్యం వేధిస్తున్నాడని తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తన తండ్రితో కలసి గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడుకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత బాలిక విలేకరులతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేకలదిన్నె తండాకు చెందిన తాను కారంపూడిలోని బ్రహ్మనాయుడు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిపింది. అదే ప్రాంతంలోని గిరిజన సంక్షేమ గృహంలో ఉంటూ రోజూ పాఠశాలకు వెళ్తుండగా.. మేకదిన్నె తండాకు చెందిన శివానాయక్ వెంటపడుతూ ప్రేమించమని వేధిస్తున్నట్లు పేర్కొంది. వేధింపులు తట్టుకోలేక హాస్టల్ వార్డెన్‌కు విషయం తెలియజేయగా ఈ నెల 6న కారంపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చిన శివానాయక్ మళ్లీ హాస్టల్ వద్దకు వచ్చి గొడవ చేస్తున్నాడని, పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ దాడి చేసి హతమారుస్తానని బెదిస్తున్నాడని వివరించింది. కాగా, బాలికపై వేధింపులకు పాల్పడుతున్న రమావత్ శివానాయక్ తాత సింగూ నాయక్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరుడని, అధికార పార్టీ అండతోనే రెచ్చిపోతున్నాడని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి వంచించాడు.. మరో ఘటనలో ప్రేమ పేరుతో బసవబోయిన యుగేంద్ర అనే యువకుడు మోసం చేశాడని ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావుకు ఫిర్యాదు చేసింది. విశాఖపట్నం జిల్లా కశీంకోట గ్రాయానికి చెందిన బాలికకు, ఆమె స్నేహితురాలి ద్వారా గతేడాది డిసెంబర్లో అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, పద్మల తనయుడు బసవబోయిన యుగేంద్రతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి 20న తంతడి బీచ్‌లో పసుపు తాడు తాళిగా కట్టి బాలికను యుగేంద్ర వివాహం చేసుకున్నాడు. అనంతరం 45 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అద్దె గదుల్లో ఉంటూ కాపురం చేశారు. మార్చిలో బాలికను ఇంటి వద్ద వదిలి, మూడు నెలల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి యుగేంద్ర సెల్ స్విచ్ఆఫ్ చేశాడు. యుగేంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించగా గుంటూరు జిల్లా బాపట్ల రూరల్ మండలం అడవిపల్లి గ్రామంలో ఉన్నట్లు తెలిసిందని బాలిక పేర్కొంది. పోలీసులు నిందితుడిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. -
నాలుగు రోజుల నుంచి శవంతో ఆందోళన
గన్నేరువరం(మానకొండూర్) : ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన పాపమో.. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వడం పాపమో గాని అత్తింటి వేధింపులకు స్వప్న అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అమ్మ మృతదేహం శవపెటికలో.. నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి ఆ చిన్నారులది. నాలుగురోజులైన అంత్యక్రియలు జరగకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. బాధితులకు రోజురోజుకు వివిధ పార్టీలు, గ్రామస్తులు, మహిళ సంఘాల మద్దతు పెరుగుతున్నా ఈ కేసు కొలిక్కి రావడం లేదు. నిందితులను పోలీసులే తప్పించారని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తుండగా.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఏదిఏమైనా శవంతో భర్త ఇంటి ఎదుట నాల్గో రోజు ఆందోళన కొనసాగుతోంది. నిందితులను పట్టుకునేదెప్పుడో.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో గుండ్లపల్లికి చెందిన కట్కూరి శ్రీపాల్‌రెడ్డి భార్య కట్కూరి స్వప్న మే 31న అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుళ్లు విస్మయ్య, విన్నత్న ఉన్నారు. తల్లి మృతి చెందడంతో చిన్నారులను తండ్రి పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొంటూ ఆస్తిని పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేయాలనే డిమాండ్‌తో శవంతో ఆందోళన చేపట్టారు. అదేరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మృతురాలి అత్తామామ అరుణ–అంజిరెడ్డిని తరలించారు. అక్కడికి వెళ్లాక మరునాడు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామనే హామీతో మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. రెండోరోజు స్పందన లేకపోవడంతో గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆ సమయంలో 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని సీపీ కమలాసన్‌రెడ్డి హామీతో రాస్తారోకో విరమించి శవాన్ని మళ్లీ భర్త ఇంటికి తరలించారు. అయినా మూడో రోజు వరకు నిందితులను పోలీసులు పట్టుకున్న దాఖలాలు లేవు. ఎమ్మెల్యే పరామర్శ పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో నాల్గోరోజు ఆదివారం శవంతో భర్త ఇంటి ముందు ఆందోళనను మృతురాలి కుటుంబసభ్యుల కొనసాగించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి పరామర్శించి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు శారద–వెంకటప్రకాష్ ఎమ్మెల్యేకు తమ ఆవేదనను విన్నపించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు వేధించి హత్య చేశారని, పిల్లలకు న్యాయం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నాలుగురోజులుగా శవంతో ఆందోళన చేస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. మహిళ సంఘాల సభ్యులు, గ్రామ మహిళలు సైతం జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తీవ్ర దిగ్బ్రాంతి కలిగే విచారకరమైన ఘటన అని, ఇలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అన్నారు. పిల్లలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాయకుల పరామర్శ మృతురాలి కుటుంబ సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వైఎస్సార్ పార్టీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్‌వర్మ, బెజ్జంకి మండల బీజేపీ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు పలువురు స్వప్న కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకటి అనిల్, ఏఐవైఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్కల మల్లేశం, అందె స్వామి, కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మీ, లక్ష్మినారాయణ, మాడిశెట్టి భాగ్యలక్ష్మి, కిన్నెర మల్లవ్వ ఉన్నారు. -
ప్రియురాలు దక్కదని ఆత్మహత్యాయత్నం
జగిత్యాలక్రైం : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో మంచిర్యాల జిల్లా కడెం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన లకవర్తి వినోద్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గంగాపూర్‌కు చెందిన వినోద్ అదే గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే వివాహిత 9 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్వరికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో గురువారం ఇంట్లో చెప్పకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వెళ్లారు. అక్కడ రాత్రి నిద్ర చేసి శుక్రవారం కడెం వెళ్లేందుకు జగిత్యాల కొత్తబస్టాండ్‌కు చేరుకున్నారు. ఇంటికి వెళ్తే ప్రియురాలు రాజేశ్వరి దూరమవుతోందని బస్ దిగిన అనంతరం వినోద్ వెంట తెచ్చుకున్న మాత్రలు మింగాడు. గమనించిన రాజేశ్వరి అడ్డుకోబోగా.. వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడుచుకుంటుండగా ఆమె చేతివేలికి గాయం కాగా.. వినోద్‌కు కూడా గాయమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా.. స్పందించడం లేదని తెలిపారు. -
డీజే శబ్దాల మధ్య డ్యాన్స్ చేస్తూ.. యువకుడు మృతి
భీమదేవరపల్లి : స్నేహితుడి వివాహ వేడుకల్లో యువకులందరూ కలుసుకుని ఉత్సాహంగా గడిపారు. పెళ్లి ఊరేగింపులో డీజే శబ్దాల నడుమ డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రంగయపల్లికి చెందిన ఓ యువకుడి వివాహ వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి డీజేతో ఊరేగింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆశాడపు రాజేష్(22) ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. కాసేపట్లోనే ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రి తరలించేలోపే మృతి చెందాడు. రాజేష్ డిగ్రీ పూర్తి చేసి పోలీస్ కానిస్టేబుల్ కావాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ‘పోలీసు ఉద్యోగం సంపాదించి పోషిస్తావనుకుంటే మమ్ముల్ని విడిచి పోతున్నావా కొడుకా’.. అంటూ రాజేష్ తల్లిదండ్రులు లక్ష్మి, దశరథం రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఏఎస్సై మురళీధర్ తెలిపారు. -
డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
కొత్తకోట : పెళ్లి నిశ్చయమైన ఓ విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కొత్తకోటలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తకోటకు చెందిన చంద్రయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె కృష్ణవేణి(20) స్థానికంగా ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. కాగా వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు (కృష్ణవేణి మేనమామ)తో ఈ నెల 10 వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కాని కృష్ణవేణి ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం గమనించిన కుటుంబీకులు కృష్ణవేణిని కిందకి దించి పరిశీలించగా అప్పటికే మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రవికాంత్‌రావు తెలిపారు. -
నవంబర్‌లో ఆ నటి వివాహం..?
ప్రస్తుతం బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎన్నో ఊహాగానాల నడుమ సోనమ్ కపూర్ పరిణయ ఘడియలను కూడా ప్రకటించారు. ఈ నెల 8న అనిల్‌కపూర్ గారాల పట్టి సోనమ్ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి రణ్వీర్ సింగ్ - దీపిక పదుకోణ్ల వివాహం గురించే. ‘పద్మావత్’ సినిమా విడుదలయిన నాటి నుంచి వీరి వివాహానికి సంబంధించిన పుకార్లు ఎక్కువయ్యాయి. దీపిక పుట్టిన రోజు నాడే వీరిరువురి నిశ్చితార్ధం అయ్యిందని, త్వరలోనే వీరు కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్తలు గతంలో బీ టౌన్లో చక్కర్ల కొట్టాయి. ఇన్ని రోజుల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ వీరి వివాహానికి సంబంధించిన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరులో వీరిరువురు ఓ ఇంటివారు కాబోతున్నారనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ఇరు కుటుంబాలు వారు తరచు కలుసుకుంటున్నారని, రణ్వీర్ - దీపికల వివాహవేడుక గురించి చర్చించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది నవంబర్‌లో రణ్వీర్ - దీపికల వివాహం చేయ్యాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి అటు దీపిక, ఆమె కుటుంబ సభ్యులుగానీ, రణ్వీర్, అతని కుటుంబం నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే గతంలో రణ్వీర్ తన వివాహం గురించి ప్రస్తావిస్తూ తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందరిని పిలిచి మరీ చెప్తాను అన్న సంగతి తెలిసిందే. 2017, డిసెంబరు 11న అనుష్క, విరాట్ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
పెళ్లికూతురు మెడలోంచి తాళి మాయం..!
నాగిరెడ్డిపేట్(ఎల్లారెడ్డి) : నిజామాబాదు జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని కన్నారెడ్డిలో జరిగిన వివాహ వేడుకలో ఏకంగా పెళ్లికూతురు మెడలో నుంచి పుస్తెల తాడును అపహరించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కన్నారెడ్డికి చెందిన పేరుపల్లి బాల పోచయ్య బుధవారం తన కూతురి పెళ్లి వేడుకను నిర్వహించారు. కాగా ముగ్గురి మహిళలు పెళ్లి కుమారుని తరఫున బంధువుల మాదిరిగా వివాహ కార్యక్రమానికి హాజరై పెళ్లి కూతురు మెడలో పూల దండలను సర్దుతూ ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించారు. కొద్దిసేపటికే మెడలో పుస్తెల తాడు లేకపోవడాన్ని గమనించిన పెళ్లి కూతురు తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో అప్రమత్తమైన పెళ్లి బృందం సభ్యులు పుస్తెల తాడు కోసం గాలించారు. కాగా పెళ్లి కూతురు మెడలో నుంచి పుస్తెల తాడును అపహరించడాన్ని గమనించిన వారి బంధువు వెంటనే మిగతా వారిని అప్రమత్తం చేశారు. పెళ్లి కూతురు వద్ద తచ్చాడిన ముగ్గురు మహిళల గురించి ఆరా తీశారు. అదే సమయంలో ముగ్గురు మహిళలు కారులో ఎక్కి వెళ్లిపోతుండగా గ్రామస్తులు వెళ్లి వారిని అడ్డుకున్నారు. దీంతో పాటు మహిళలను, కారులో సోదా చేయగా కారులోని మ్యాట్ కింద పుస్తెలతాడు కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి బృందం సభ్యులతోపాటు గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేసి నాగిరెడ్డిపేట పోలీసులకు అప్పగించారు. కారులో లభించిన పుస్తెల తాడును పోలీసులు పెళ్లి బృందం సభ్యులకు అప్పగించడంతో పెళ్లి తంతు యథావిధిగా కొనసాగింది. పెళ్లి కూతురి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
నర్సంపేటరూరల్ : ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పట్టణంలోని బజ్జు భద్రయ్య కుమారుడు కిషన్‌కు పాలకుర్తికి చెందిన బొగ్గరావు శ్రీనివాస్ కుమార్తె స్వాతి (27)తో గత 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పాప కూడా ఉంది. కిషన్ పట్టణంలో ఓ బుక్‌స్టోర్ షాపును నడిపిస్తున్నాడు. స్వాతి చెన్నారావుపేట మండలంలోని ముగ్దుంపురం శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఉదయం పాపను స్కూల్‌కు పంపించి వచ్చి కిషన్ షాపుకు వెళ్లాడు. తిరి మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఉరి వేసుకుని కనిపించింది. దీంతో చుట్టు పక్కల వారి సాయంతో 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీనిపై స్థానిక పోలీసులను వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
లావుగా ఉన్నానని ఎవరూ ఒప్పుకొలేదు..!
సాక్షి, చెన్నారావుపేట: ఇన్ని రోజులు పెళ్లికి అందం, ఐశ్వర్యం, పెద్దలు ఒప్పుకోకపోవడం ఇవే కారణం అనుకున్నాం. కానీ లావు అనే పదం కూడా వచ్చి చేరింది. పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువకుడి జీవితంలో లావుగా ఉన్నాడనే కారణం విషాదం నింపింది.దీంతో పెళ్లి కావడం లేదనే మనో వేదనతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని చెన్నారావుపేట మండలంలోని ఉప్పెరపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రమేష్(32) మహారాష్ట్రలోని బీవండిలో పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రి ఇంటి నుంచి వెళ్లి పోవడంతో కుటుంబాన్ని ఆయనే పోషిస్తున్నాడు. తన ఇద్దరు చెల్లెళ్లకు వివాహాలు చేశాడు. తన వివాహంపై కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ లావుగా ఉన్నాడనే కారణం అతని పెళ్లికి అడ్డుగా వచ్చింది. అందుకే పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావటంలేదని తీవ్ర మనోవేదన చెందేవాడు. దీంతో అతను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఫేస్బుక్ సాక్ష్యంతో ఆమెకు విడాకులు
సాక్షి, జైపూర్ : సోషల్ మీడియా.. ఆధునిక కాలంలో ఉపయోగించుకునేవారి రీతిని బట్టి.. వారికి ఆయావిధాలుగా సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఫేస్బుక్ మాత్రం ఎవరికి ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతోంది. తమతమ అభిప్రాయాలను వెలువరించేందుకే కాకుండా.. సాక్ష్యాలుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా రాజస్తాన్‌లో ఒక యువతి.. ఫేస్బుక్ కామెంట్లు, ఫొటోలును ఆధారంగా చూపి.. న్యాయం పొందింది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్‌కు చెందిన సుశీల భిష్ణోయ్ (19) కు బాల్య వివాహం చేశారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టు మెట్లు ఎక్కింది. సుశీల వాదనను అమె భర్త పూర్తిగా వ్యతిరేకించాడు. అంతేకాక బాల్య వివాహం జరగలేదు అంటూ కోర్టుకు వివరించారు. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు.. బాల్య వివాహం జరిగిందనడానికి ఆధారాలుంటే సమర్పించాలని సుశీలను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సుశీల, సామాజిక కార్యకర్త కృతి భారతితో కలిసి ఆధారాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సరిగ్గా ఈ సమయంలో.. భర్త ఫేస్బుక్లో పెళ్లి సమయంలో పెట్టిన ఫొటో.. దానికి వచ్చిన కామెంట్లపై సామాజిక కార్యకర్త... సుశీలను అడిగారు. వెంటనే ఇద్దరూ కలిసి భర్త ఫేస్బుక్లో పెళ్లినాటి ఫొటో.. ఆ సమయంలో వచ్చిన కామెంట్లు.. తేదీ, నెల, సంవత్సరం.. వారీగా సేకరించారు. సుశీల భర్త ఫేస్బుక్లో పెళ్లి తేదీ నాడు.. గ్రీటింగ్స్ చెబుతూ వచ్చిన కామెంట్లను సాక్ష్యంగా సుశీల కోర్టులో ప్రవేశపెట్టారు. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేనాటికి తానింకా మైనర్ని అని.. తనను బెదిరించి, భయపెట్టిన పెళ్లి చేశారని సుశీల కోర్టుకు వివరించారు. ఫేస్బుక్ కామెంట్లను కోర్టు సాక్ష్యాలుగా అంగీకరించి.. ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ పెళ్లి జరిగేనాటికి తనకు.. తన భర్తకు కేవలం 12 సంవత్సరాలు మాత్రమేనని సుశీల కోర్టుకు ఫేస్బుక్ కామెంట్లు, పోస్ట్‌లను సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. కోర్టు తీర్పు తరువాత ఆమె మాట్లాడుతూ.. తనకు ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉందని చెప్పారు. -
జనగాం అబ్బాయి... అమెరికా అమ్మాయి
హైదరాబాద్: జనగాం జిల్లాకు చెందిన ఓ యువకుడు హిందూ సంప్రదాయం ప్రకారం అమెరికా యువతిని వివాహం చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ వేడుకకు నాగోలులోని నిమంత్రన్ ఫంక్షన్ హాల్ వేదికైంది. లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన వంచ పద్మారెడ్డి, అవనిజల కుమారుడు అవినిష్ రెడ్డి పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తైన తర్వాత అక్కడే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అమెరికాలో వెంటినా ప్రాంతంలో నివసించే అవినిష్.. అదే ప్రాంతానికి చెందిన ఎరిడాని ఏంజిల్స్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరువురు కుటుంబసభ్యులకు తమ విషయం చెప్పి ఒప్పించారు. వధువు పేరు అనవిగా మార్చిన వరుడి కుటుంబసభ్యులు గురువారం వీరి వైభవంగా వివాహం చేశారు. వరుడి తల్లిదండ్రులే కన్యాదానం కూడా చేశారు. ఈ వివాహానికి వధువు తరఫు కుటుంబసభ్యులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో!
బర్మింగ్ హామ్: ప్రేమించడం అందరూ చేస్తారు. కానీ ఆ ప్రేమను కొందరే నిలుపుకుంటారు. ప్రేమించిన వ్యక్తి ఎప్పుడూ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. వారి ఆలోచనలు అలా మనసులో ఉండిపోతే చాలు.. జీవితాంతం మరే దిగులు లేకుండా బతికేయోచ్చనుకునేవారు కొందరైతే.. తనతో పెళ్లవకపోయినా.. ప్రేమించిన వ్యక్తి ప్రాణాలతో ఎదురుగా ఉంటే అప్పుడప్పుడు చూసైనా సంతోషంగా జీవితాన్ని ముందుకు పోనిద్దాం అని ఆలోచించేవారు మరికొందరు. ఇంకొందరు ప్రారంభంలో ఎంత దూరంగా ఉన్నా.. ఆ వ్యక్తి శాశ్వతంగా దూరమవుతున్నాడని తెలిసినప్పుడు క్షణం కూడా విడిచిపెట్టకుండా తోడుగా ఉండేవారు. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని ఒట్టేసి చెప్పుకునే ప్రేమికులు చాలావరకూ.. పెళ్లి కాకుండానే విడిపోతున్న ఈ రోజుల్లో మరో మూడు రోజుల్లో తనను ప్రేమించిన వ్యక్తి కనుమూస్తాడని తెలిసి ఆ కొద్ది కాలంపాటు జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమైంది హైస్కూల్లో చదివే పదహారేళ్ల అమీ క్రాస్ వెల్. నిచ్చెలి చేయందుకున్న మూడు రోజుల్లోనే అతడు చనిపోయాడు. ఆ జ్ఞాపకాలతో తిరిగి అమీ జీవితాన్ని ప్రారంభించింది. బర్మింగ్ హామ్ కు చెందిన అమీ క్రాస్ వెల్, ఒమర్ అల్ షేక్ అనే ఇద్దరు ఓ హైస్కూల్లో చదువుతున్నారు. వీరిద్దరికి కూడా పదహారేళ్లు. స్కూల్లో చేరిన కొద్ది రోజులకే అమీపై ఒమర్ మనసు పారేసుకున్నాడు. ఎంతో కష్టంతో ఆ విషయాన్ని తెలియజేశాడు. చివరికి అమీ ఒప్పుకోవడంతో అతడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. తన ప్రేమ విషయాన్ని చెప్పిన కొద్ది రోజులకే భయంకరమైన క్యాన్సర్ ల్యుకేమియా తనకు ఉందని, ఎక్కువ రోజులు బతకడని ఒమర్‌కు తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఆ ప్రేమికులిద్దరూ తీవ్ర బాధలోకి కూరుకుపోయారు. ఒమర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అమీ ఒక్కతే స్కూల్‌కు వెళ్లొస్తుండేది. మరో మూడు రోజులు మాత్రమే ఒమర్ బతుకుతాడని తెలిసి.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒమర్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ నిర్ణయాన్ని ఇరువురి కుటుంబసభ్యులకు తెలిపింది. ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అమీ తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో గత సోమవారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో వీల్ చైర్‌పై ఉన్న ఒమర్.. అమీ చేతికి రింగ్ తొడిగాడు. ఆ వెంటనే తన భర్తగా మారిన ప్రేమికుడిని ఆస్పత్రి అధికారుల అనుమతితో కారిడార్‌లో ప్రేమగా కొన్ని మాటలు చెప్పుకుంటూ అటూఇటూ తిప్పింది. ఆ మూడు రోజులు.. క్షణం కూడా విడిచిపెట్టకుండా తన చేతిలో చేయ్యేసి ఆస్పత్రిలోనే ఉండిపోయింది. అమీ కళ్లముందే ఒమర్ శాశ్వతంగా లోకం విడిచి వెళ్లిపోయాడు. ఆ క్షణం అమీ కళ్లలో.. నీళ్ల సుడిగుండం, చేతిలో ఒమర్ చేయి. భారంగా పక్కకు పెట్టింది. ఈ సందర్భంగా ఒమర్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు చనిపోయినా ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన కోడలు తనకు కూతురిగా దొరికిందని చెప్పుతూ ప్రేమగా అమీని ఆలింగనం చేసుకొంది. -
పెళ్ళినుండి పరారైన పెళ్ళికొడుకు