లండన్: తమ ఆంక్షలు లెక్కచేయకుండా చదువుకుంటుందని.. 13 ఏళ్ల వయసులో తాలిబన్ల తూటాలకు బలయ్యింది. అయినా బెదరకుండా ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తూ.. నోబెల్ బహుమతి అందుకుంది పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్. తాజాగా మరోసారి అరుదైన గౌరవం అందుకుంది. ప్రముఖ బ్రిటీష్ మ్యాగ్‌జైన్ వోగ్ తన జూలై ఎడిషన్ కవర్ మీద మలాలా ఫోటో ప్రచురించింది. ఈ సందర్భంగా మలాలా రాజకీయాలు, సంస్కృతితో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను పంచుకుంది. ఈ క్రమంలో వివాహం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. వివాహం గురించి మలాలా చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మలాలా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను పెళ్లికుమార్తెగా చూడాలని ఆశపడుతున్నారు. అలానే చాలా మంది తమ సంబంధాల కథనాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వీటన్నింటిని చూస్తే నాకు చాలా ఆందోళన కలుగుతుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మన జీవితంలో ఒక భాగస్వామి, తోడు కావాలంటే.. పెళ్లి పత్రాలపై ఎందుకు సంతకాలు చేయాలి.. కేవలం భాగస్వాములుగా ఎందుకు ఉండలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sad to know about Malala;s thoughts.😢#MalalaOnMarriage pic.twitter.com/vLUujigsW5
— S A M R E E N 🍁 (@SamreeenSohail) June 3, 2021
మలాలా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘నువ్వు విదేశీ వ్యక్తివి అయ్యావ్.. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్’’.. ‘‘నువ్వు ఇలాంటి బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలతో యువతను పెడదోవ పట్టిస్తున్నావ్.. ఇస్లాం సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నావ్’’.. ‘‘నీ వ్యాఖ్యాలు విచారకరం.. ఈ విషయంలో నీకు మద్దతు తెలపడం లేదు’’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు.
చదవండి: ‘మలాల.. ఈ సారి తప్పించుకోలేవ్’
Comments
Please login to add a commentAdd a comment