విడాకులు తీసుకుంటే మహిళలు చనిపోవాలా?.. నటి ఘాటు రిప్లై | Bollywood Kamya Punjabi Befitting Reply To Trolls should Women Die After Divorce | Sakshi
Sakshi News home page

Kamya Punjabi: విడాకులు తీసుకుంటే మహిళలు చనిపోవాలా?.. నటి ఘాటు రిప్లై

Published Fri, Dec 10 2021 8:34 PM | Last Updated on Fri, Dec 10 2021 9:11 PM

Bollywood Kamya Punjabi Befitting Reply To Trolls should Women Die After Divorce - Sakshi

సినీ ఇండస్ట్రీలో తారలు జంటలుగా మారడం, పలు కారణాలు వల్ల విడాకులు తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో టీవీలో ఇలాంటివి చూసి అయ్యో అనుకునే వాళ్ల అభిమానులు ప్రస్తుత సోషల్‌మీడియా సమాజంలో ట్వీట్‌, ట్రోల్స్‌ రూపంలో తమ బాధని, కోపాన్ని, అభిమానాన్ని బయటపెడుతుంటారు. అయితే ఈ క్రమంలో తారలు ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ఈ తరహాలోనే ఓ బాలీవుడ్‌ సీనియర్‌ నటి ట్రోలింగ్‌కు గురికాగా తన ట్వీట్‌తో ఘాటుగానే స్పందించింది.

సోషల్‌మీడియా వాడుకంలోకి వచ్చినప్పటి నుంచి తారలు అభిమానుల మధ్య బంధం మరింత చేరువైందనే చెప్పాలి. దీని వల్ల వాళ్లు నేరుగా మాట్లాడుకునే, చాట్‌ చేసుకునే వెసలుబాటు కలిగింది. బాలీవుడ్ సీనియర్ నటి కామ్యా పంజాబీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా గడుపుతూ తన అభిమానులతో ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. నువ్వు నీ మొదటి వివాహ బంధాన్ని కొనసాగించలేకపోయి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నావు. నీకంటూ హద్దులు లేవా? అంటూ ట్రోల్ చేశాడు. 

ఈ ట్వీట్‌పై కామ్య కాస్త ఘాటుగా స్పందిస్తూ.. మహిళ సంతోషంగా ఉండకూడదా? విడాకుల తరువాత చనిపోవాలా? విడాకులు తీసుకున్న తర్వాత కూడా జీవితం ఉంటుంది. సమాజంలో ప్రతి మహిళ కూడా ధైర్యంగా నీలాంటి వాళ్లకి సమాధానం చెప్పాలి. నన్ను బలహీనురాలిగా భావించవద్దని బదులిచ్చింది. కాగా గతంలో వ్యాపారవేత్త బంటీ నెగి నుంచి 2013లో విడాకులు తీసుకుంది. కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న కామ్య గత ఏడాది శలాబ్ దంగ్ నీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.


చదవండి: Pushpa Movie: సమంత ఐటమ్‌ సాంగ్‌ పాడిన సింగర్‌.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement