Kamya Punjabi
-
తమాషాగా ఉందా? రెండో భర్తకు కూడా విడాకులా?.. నటిపై విమర్శలు
ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. సెలబ్రిటీల కెరీర్ గురించి కాకుండా పర్సనల్ విషయాల్లో ఎక్కువగా వినిపించే పదాలు. ఇండస్ట్రీలో ఈ మూడు చాలా సర్వసాధారణం అయిపోయాయి. నచ్చితే ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి జీవితాన్ని కలిసి కొనసాగించడం, లేదంటే బ్రేకప్, విడాకులతో ఎవరిదారి వారి చూసుకోవడం అక్కడ షరామామూలే! కానీ ప్రేక్షకులు మాత్రం వారి గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అదేంటో తెలుసుకోవాలని తెగ ఆతృత కనబరుస్తుంటారు. నచ్చితే పొగడ్తలు, నచ్చకపోతే విమర్శలు గుప్పించి తారలను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా బుల్లితెర నటి కామ్యా పంజాబీ విషయంలో అదే జరిగింది. కామ్యా తాజాగా ట్విటర్లో 'చరిత్ర పునరావృతమవుతుంది' అని రాసుకొచ్చింది. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'అంటే నువ్వు రెండో భర్తకు కూడా విడాకులిచ్చేస్తున్నావా? విడాకులంటే అంత తమాషాగా ఉందా?' అని కామెంట్ చేశాడు. ఇది నటి కంటపడటంతో అగ్గి మీద గుగ్గిలమైంది. 'మీలాంటివాళ్లకు ఏం చెప్పాలి? నీ చెత్త వాగుడు ఇంకెక్కడైనా వాగు. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నానో కూడా మీకు తెలీదు. కానీ నోటికొచ్చినట్లు వాగుతున్నారు. ముందు నీ తల్లి దగ్గరకు వెళ్లి మర్యాదగా ఎలా మాట్లాడాలో నేర్చుకో.. పో' అని ఫైర్ అయింది. కాగా కామ్యా పంజాబీ 2003లో వ్యాపారవేత్త బంటీ నెగిని పెళ్లి చేసుకోగా 2013లో అతడికి విడాకులిచ్చింది. కొన్నేళ్లపాటు ఒంటరిగానే ఉన్న నటి 2020లో ఢిల్లీకి చెందిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్ శలభ్ డాంగ్‌ను పెళ్లాడింది. Aur kuch kehna hai aapko? Apni gandagi ki dukaan kahi aur le jaaiye, u guys don’t even know what I am talking about but you have to spread ur dirt everywhere! Breathe, have some water n tell ur mother to teach u some manners! https://t.co/TdqJDLCUJm — Kamya Shalabh Dang (@iamkamyapunjabi) February 7, 2023 చదవండి: ఆ విషయం బయటపెడితే నన్ను చంపుతానని బెదిరించాడు: నటి థియేటర్ కూర్చున్నా.. ప్యాంటులో ఎలుక దూరింది: బిగ్‌బీ -
పానీపూరి మైకంలో లక్ష రూపాయలు మరిచిపోయిన నటి..
Actress Kamya Punjabi Forget Rs 1 Lakh At Pani Puri Stall In Indore: పానీపూరి పేరు వింటే చాలు మైమరిచిపోతారు అమ్మాయిలు. వారికి ఇది ఎంతో ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. పానీపూరిని తింటూ లోకాన్నే మరిచిపోతారు అమ్మాయిలు. ఈ విషయంలో సాధారణ యువతులే కాదు సెలబ్రిటీలేం అతీతం కాదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. ఈ పానీపూరి మైకంలో ఏకంగా లక్ష రూపాయలను అక్కడే మరిచిపోయి వచ్చింది ఓ నటి. ఆ నటి ఎవరో కాదు కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి తదితర హిట్ సినిమాల్లో నటించిన కామ్య పంజాబీ. ఆమె ఇటీవల ఇండోర్‌కు వెళ్లిన కామ్య ఓ ఈవెంట్లో పాల్గొంది. అక్కడ బయటకు వెళ్లి పానీపూరిలను ఓ పట్టు పట్టింది. పానీపూరిలు ఆస్వాదిస్తూ అక్కడ టేబుల్‌పై రూ. లక్ష ఉన్న ఎన్వలప్ కవర్‌ను పెట్టింది. తర్వాత అక్కడ ఫొటోలు తీస్తూ తీస్తూ ఆ ఎన్వలప్‌ను అక్కడే మరిచిపోయి హోటల్‌కు తిరిగివెళ్లింది. హోటల్‌కు వెళ్లిన కొద్దిసేపటికే ఎన్వలప్‌ను మరిచిపోయిందనే సంగతి గుర్తుకు వచ్చి తన మేనేజర్‌ను పంపించదట. తాను మరిచిపోయిన చోటుకు వెళ్లిన కామ్య మేనేజర్ ఆ ఎన్వలప్‌ను తిరిగి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎన్వలప్ మరిచిపోయిన సమయంలో తీవ్ర ఒత్తిడిగి గురైనట్లు కామ్య తెలిపింది. 'నిజానికి ఆ డబ్బు దొరకదనుకున్నాను. అంత రద్దీ ప్రదేశంలో విలువైన ఎన్వలప్ దొరకడం ఆశ్చర్యంగా ఉంది. ఇండోర్ ప్రజలు చాలా మంచివారు, దయగలవారు.' అని కామ్య పంజాబీ తెలిపింది. చదవండి: విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్ ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ -
విడాకులు తీసుకుంటే మహిళలు చనిపోవాలా?.. నటి ఘాటు రిప్లై
సినీ ఇండస్ట్రీలో తారలు జంటలుగా మారడం, పలు కారణాలు వల్ల విడాకులు తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో టీవీలో ఇలాంటివి చూసి అయ్యో అనుకునే వాళ్ల అభిమానులు ప్రస్తుత సోషల్‌మీడియా సమాజంలో ట్వీట్, ట్రోల్స్ రూపంలో తమ బాధని, కోపాన్ని, అభిమానాన్ని బయటపెడుతుంటారు. అయితే ఈ క్రమంలో తారలు ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ఈ తరహాలోనే ఓ బాలీవుడ్ సీనియర్ నటి ట్రోలింగ్‌కు గురికాగా తన ట్వీట్‌తో ఘాటుగానే స్పందించింది. సోషల్‌మీడియా వాడుకంలోకి వచ్చినప్పటి నుంచి తారలు అభిమానుల మధ్య బంధం మరింత చేరువైందనే చెప్పాలి. దీని వల్ల వాళ్లు నేరుగా మాట్లాడుకునే, చాట్ చేసుకునే వెసలుబాటు కలిగింది. బాలీవుడ్ సీనియర్ నటి కామ్యా పంజాబీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా గడుపుతూ తన అభిమానులతో ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. నువ్వు నీ మొదటి వివాహ బంధాన్ని కొనసాగించలేకపోయి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నావు. నీకంటూ హద్దులు లేవా? అంటూ ట్రోల్ చేశాడు. ఈ ట్వీట్‌పై కామ్య కాస్త ఘాటుగా స్పందిస్తూ.. మహిళ సంతోషంగా ఉండకూడదా? విడాకుల తరువాత చనిపోవాలా? విడాకులు తీసుకున్న తర్వాత కూడా జీవితం ఉంటుంది. సమాజంలో ప్రతి మహిళ కూడా ధైర్యంగా నీలాంటి వాళ్లకి సమాధానం చెప్పాలి. నన్ను బలహీనురాలిగా భావించవద్దని బదులిచ్చింది. కాగా గతంలో వ్యాపారవేత్త బంటీ నెగి నుంచి 2013లో విడాకులు తీసుకుంది. కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న కామ్య గత ఏడాది శలాబ్ దంగ్ నీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. #लड़की_हूँ_लड़_सकती_हूँ pic.twitter.com/nCYgUQkB4o — Kamya Shalabh Dang (@iamkamyapunjabi) December 8, 2021 చదవండి: Pushpa Movie: సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా! -
కాంగ్రెస్‌లో చేరిన బిగ్‌బాస్ కంటెస్టెంట్..
ముంబై: బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ నటి కామ్యపంజాబీ బుధవారం కాంగ్రెస్‌పార్టీ కండువ కప్పుకున్నారు. సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యతగా చేసిన బిగ్‌బాస్ 7వ సీజన్లో కామ్య పంజాబీ ప్రజాదరణ పొందారు. కాగా, తాజాగా ఆమె.. ముంబైలోని మహరాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చేరారు. ఆమె ముంబై కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భాయ్జగ్తప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆమె ఇటీవల తన సూపర్‌హిట్ షో, శక్తి-అస్థిత్వ కే ఎహసాస్కీ షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా కామ్యపంజాబీ మాట్లాడుతూ.. తాను 20 ఏళ్లకు పైగా సినిపరిశ్రమలో పని చేశానని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చానన్నారు. మహిళల సాధికారికత కోసం పాటుపడతానని తెలిపారు. అదే విధంగా గృహహింస, మహిళలపై దాడులను నివారించడానికి తనవంతుగా కృషిచేస్తానని పేర్కొన్నారు తాను అధికారం కోసం కాకుండా.. ప్రజలకు మంచి చేయాలనే పార్టీలో చేరానని తెలిపారు. తాను.. రాజకీయాలలో చేరినప్పటికి.. సినిమాల్లోకూడా నటిస్తానన్నారు. తాను ప్రజలకు.. చేయగలిగింది మాత్రమే చెప్తానని.. అదే విధంగా ఏదైతే చెప్తానో అది తప్పకుండా చేస్తానని బిగ్‌బాస్ నటి కామ్యపంజాబీ తెలిపారు. చదవండి: పంజాబ్‌లో మారనున్న రాజకీయ సమీకరణాలు Maharashtra: Actress Kamya Punjabi joins Congress in presence of Mumbai Congress president Bhai Jagtap pic.twitter.com/8B2t3s47Qh — ANI (@ANI) October 27, 2021 -
డేటింగ్ గురించి చెప్పేందుకు ఇదా సరైన సమయం?!
దివంగత నటి, 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ ప్రత్యూష బెనర్జీ తాను ప్రేమించుకున్నామని నిర్మాత వికాస్ గుప్తా వెల్లడించాడు. తన గురించి ఎవరో చెడుగా చెప్తే ఆమె నమ్మేసిందని, అలా తమకిద్దరికీ బ్రేకప్ అయిందని తాజా ఇంటర్వ్యూలో వివరించాడు. చెప్పుడుమాటలు నమ్మినందుకు ఆమె మీద విపరీతమైన కోపం పెంచుకున్నానని, ఎక్కడైనా కనిపించినా చూపు తిప్పుకుని తనెవరో తెలియనట్లే వెళ్లిపోయానన్నాడు. అలా తమ మధ్య డేటింగ్ కొన్నాళ్లపాటే సాగిందన్నాడు. నిజానికి ఆమెంటే తనకెంతో ఇష్టమని, తనతో కలిసి ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకున్నానని తెలిపాడు. తాను బైసెక్సువల్ అన్న విషయం విడిపోయాక ఆమెకు తెలిసిందని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూపై ప్రత్యూష క్లోజ్ ఫ్రెండ్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కామ్య పంజాబీ ఫైర్ అయింది. "అతడు చెప్పింది నిజమా? కాదా? అన్నది నిర్ధారించేందుకు ప్రత్యూష మన మధ్య లేదు. వికాస్ ఇప్పుడెందుకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతున్నాడు? ఓహ్ ఫేమస్ కావడానికా! ఇలాంటి విధానాలను నేను అస్సలు మెచ్చుకోను. ఎందుకంటే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేందుకు ఆమె ఈ లోకంలో లేదు" అని చెప్పుకొచ్చింది. చదవండి: సీక్వెల్ సినిమాలో 'జాతిరత్నాలు' హీరోయిన్ సందడి! -
అందుకు రెండున్నరేళ్లు పట్టింది: నటి
‘‘నిజం చెప్పాలంటే కరణ్ నుంచి విడిపోయిన తర్వాత మామూలు మనిషిని కావడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆ తర్వాత నా ప్రేమమయమైన జీవితం మళ్లీ మొదలైంది. కడుపు నిండా తినడం, సమయానికి నిద్ర పోవడం, స్నేహితులతో మాట్లాడటం, పనుల్లో నిమగ్నమవడం. దినచర్య మారిపోయింది. నిజంగా ఆ రెండున్నరేళ్ల కాలం కష్టంగా గడిచింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా’’ అంటూ నటి కామ్యా పంజాబీ తన జీవితంలోని చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో డిప్రెషన్‌తో కుంగిపోయానని.. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాతే మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. మనిషి జీవితంలో కష్టాలు సహజమేనని.. ధైర్యంగా పోరాడి వాటిని అధిగమించాలని స్ఫూర్తి నింపారు. (నటి మూడో పెళ్లి: 'డబ్బుల కోసమే డ్రామాలు' ) భర్త షలభ్ దాంగ్తో కామ్యా కాగా సీరియల్ నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హిందీ బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొని పాపులర్ అయ్యారు. కెరీర్లో దూసుకుపోతున్నప్పటికీ కామ్యా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఆమె.. అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు ‘యే హై మొహబ్బతే’ సీరియల్ ఫేం కరణ్ పటేల్‌తో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు వీరి బంధం సాఫీగానే సాగినప్పటికీ భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2015లో విడిపోయారు. ఈ క్రమంలో కరణ్ మరో నటి అంకితా భార్గవను పెళ్లి చేసుకోగా.. కామ్యా గతేడాది.. వైద్య రంగానికి షలభ్ దాంగ్ అనే వ్యక్తిని వివాహమాడారు. తన కూతురు ఆరా(బంటీ నేగీ సంతానం), భర్తతో కలిసి ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నారు. -
ప్రియుడితో నటి నిశ్చితార్థం
ముంబై: హిందీ టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సీనియర్ నటి కామ్యా పంజాబీ(40) త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. తన ప్రియుడు షలభ్ దాంగ్ను ఆమె వివాహమాడనున్నారు. ఈ క్రమంలో శనివారం కామ్యా- షలభ్ల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. గురుద్వారలో శనివారం వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. నలుపు- బంగారు వర్ణాలతో కూడిన డ్రెస్సులో కామ్యా మెరిసిపోగా.. షలభ్ నీలి రంగు కుర్తాలో హుందాగా కనిపించారు. కాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కామ్యా తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంగరంగ వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం కాగా కామ్యాకు గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2013లో వాళ్లిద్దరూ విడిపోయారు. వీరికి పాప ఆరా(10) కూడా ఉంది. తను కూడా తన తల్లి నిశ్చితార్థ వేడుకలో సందడి చేసింది. ఇక పలు సీరియల్స్‌లో అత్త, అమ్మ పాత్రల్లో నటిస్తున్న కామ్యా.. హిందీ బిగ్‌బాస్ సీజన్ 7లో కూడా పాల్గొని పాపులర్ అయ్యారు. ప్రస్తుతం.. సమాజంలో గుర్తింపు కోసం హిజ్రాలు చేసే పోరాటం నేపథ్యంలో ప్రముఖ హిందీ చానెల్లో ప్రసారమవుతున్న ‘శక్తి’ సీరియల్లో హీరోయిన్ అత్త పాత్రను పోషిస్తున్నారు. ఇక కామ్యాకు కాబోయే భర్త వైద్యరంగానికి చెందినవాడు. -
ఫిబ్రవరిలో ప్రముఖ నటి పెళ్లి
ప్రముఖ సీరియల్ నటి కామ్యా పంజాబీ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. వ్యాపారవేత్త షలబ్‌దాంగ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న కామ్యా దాన్ని వివాహబంధంగా మార్చేందుకు అడుగులు వేసింది. దీనికి సంబంధించిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.తన ప్రియుడితో కలిసి ఫిబ్రవరి 10 నుంచి వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు కామ్యా పంజాబీ రాసుకొచ్చింది. అయితే ఆమె గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల దాంపత్యం అనంతరం 2013లో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషిస్తున్న కామ్యా.. హిందీ బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. View this post on Instagram So here i m with my fav picture with my fav man announcing my fav date #10thFeb2020 ❤️ Bless Us for this New Journey New Beginnings 🙏🏻 A post shared by Kamya Panjabi (@panjabikamya) on Nov 20, 2019 at 8:58pm PST -
రెండోసారి ప్రేమ, పెళ్లి వద్దనుకున్నా..కానీ..
ముంబై : హిందీ టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి కామ్యా పంజాబీ(40) తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. వైద్య రంగానికి చెందిన వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని..త్వరలోనే తామిద్దరం వివాహ బంధంతో ఒక్కటి కానున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం వరుస సీరియళ్లతో బిజీగా ఉన్న కామ్యా గురువారం బాంబై టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నన్ను షలభ్ దాంగ్ను సంప్రదించాల్సిందిగా నా స్నేహితురాలు సూచించింది. అలా గత ఫిబ్రవరిలో అతడిని కలిసే అవకాశం వచ్చింది. ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నెలన్నర పాటు చాటింగ్ చేసిన తర్వాత తను నాకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వచ్చే ఏడాది ఈ సమయానికి పెళ్లైన మహిళగా మీ ముందుకు వస్తాను’ అని చెప్పుకొచ్చారు. కాగా కామ్యా గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల తర్వాత 2013లో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయం గురించి కామ్యా చెబుతూ..‘గతంలో నా వైవాహిక బంధం విచ్చిన్నమైంది. అప్పుడు గుండె పగిలేలా ఏడ్చాను. అందుకే రెండోసారి ప్రేమ, పెళ్లి అనే విషయం వచ్చినపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాను. అయితే షలభ్ ఆలోచనా విధానం నన్ను చేదు అనుభవాల నుంచి బయటపడేలా చేసింది’ అని పేర్కొన్నారు. ఇక పలు సీరియల్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కామ్యా.. హిందీ బిగ్‌బాస్ సీజన్ 7లో కూడా పాల్గొని కావాల్సినంత ప్రచారం పొందారు. -
ఆ నటి ఆత్మకు శాంతి చేకూరదు!
సాక్షి, ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మకు శాంతి చేకూరదని నటి కామ్య పంజాబీ, నటుడు వికాస్ గుప్తా అన్నారు. ఆమె చనిపోయి రెండేళ్లు పూర్తయినా నిందితులకు శిక్ష పడక పోవడంపై బిగ్ బాస్ 11 ఫైనలిస్ట్ వికాస్, కామ్య పంజాబీ విచారం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, ప్రత్యూష మృతి కేసులో దోషులకు ఇప్పటికైనా శిక్ష పడాలన్నారు. ప్రత్యూష రెండో వర్దంతి సందర్భంగా ఈ నటీనటులు తమ ఆవేదనను షేర్ చేసుకున్నారు. మరికొన్ని రోజులైతే ప్రత్యూష ఎవరూ అనే ప్రశ్నలు తలెత్తుతాయని, నిందితులకు శిక్ష పడకముందే ఈ నటిని అందరూ మరిచిపోయే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడ్డారు. రెండేళ్లు పూర్తయింది, కానీ ఎలాంటి చర్యలు లేవు. అయినా ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కామ్య పంజాబీ. నేను ఇష్టపడే ఓ మంచి వ్యక్తిని కోల్పోయాను. ఇప్పటికే రెండుళ్లు గడిచిపోయాయి. ఇంకా రోజులు గడుస్తుంటే అందరూ ప్రత్యూషను మరిచిపోతారేమో. నీ మృతి నాకు జీవితం విలువను నేర్పిందని వికాస్ గుప్తా ట్వీట్ చేశారు. ప్రత్యూష మృతికి కారకులైన వాళ్లను శిక్షించేవరకూ ఆమె ఆత్మకు శాంతి చేకూరదన్నారు. కాగా, 2016 ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మృతికి ప్రియుడు రాజ్సింగే కారణమని ప్రత్యూష కుటుంబీకులు ఫిర్యాదు చేయగా గతంలో ఓసారి అదుపులోకి ముంబై పోలీసులు విచారణ జరిపారు. రెండేళ్లు గడిచినా సెలబ్రిటీ మృతి కేసులోనే న్యాయం జరగలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కామ్య పంజాబీ, వికాస్ గుప్తా ప్రశ్నిస్తున్నారు. -
మరో టీవీనటిపై రాహుల్ ఆరోపణలు..
ముంబై: టీవీనటి ప్రత్యూష్ బెనర్జీ అనుమానాస్పద మరణం కేసు ఒక కొలిక్కి వచ్చేలా కనపడ్డం లేదు. ఆమె చనిపోయి దాదాపు నెల రోజులు దాటినా రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా ఆమె ప్రియుడు, ప్రధాన నిందితుడు రాహుల్ రాజ్ సింగ్ మరో టీవీ నటి కామ్యా పంజాబీపై ఆరోపణలు గుప్పించాడు. ఆమె ప్రత్యూష దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించలేదని ఆరోపించాడు. ప్రత్యూష ఆత్మహత్య కేసులో తన స్నేహితులు చెప్పిందంతా అబద్ధమని పేర్కొన్నాడు. ప్రత్యూష బెనర్జీ దగ్గరనుంచి కామ్యా పంజాబి రెండున్నర లక్షలు అప్పుగా తీసుకుందని, అవి తిరిగి వెనక్కి ఇవ్వలేదని విమర్శించాడు. అయితే ఈ ఆరోపణలను కామ్యా తిరస్కరించింది. రాహుల్ పూర్తిగా తప్పుడు వాదనలు చేస్తున్నాడంటూ కొట్టి పారేసింది. బీసీఎల్ సీజన్ లో తాను జైపూర్ రాజ్ జోషిలే టీంకు యజమానిగా ఉన్నానని తెలిపింది. ఆ సమయంలో తన టీంకు ప్రత్యూష్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిందని కామ్యా తెలిపింది. ఈ క్రమంలో ప్ర్యతూష తండ్రి ఎన్జీవో ప్రమోషన్ లో భాగంగా తనకు రెండున్నర లక్షలు ఇచ్చిందని తెలిపింది. ఆ సమయంలో ఇద్దరం అనేక మీడియా ఇంటర్వ్యూ ల్లో పాల్గొన్నామని పేర్కొంది. దీనికి సంబంధించిన తన దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది. ఇది జరిగి సుమారు మూడేళ్లు అయిందనీ, అప్పటికీ ప్రత్యూష్ జీవితంలోకి అసలు రాహుల్ ప్రవేశించనే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికైనా రాహుల్ నిజాలు చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా గత ఏప్రిల్ 1 బాలికా వధు గా బుల్లితెరకు సుపరిచితమైన ప్రత్యూష బెనర్జీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరి కామ్యా వివరణపై రాహుల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.