ఫిబ్రవరిలో ప్రముఖ నటి పెళ్లి | Kamya Punjabi Tie Knot With Shalabh Dang On February 10 | Sakshi
Sakshi News home page

పెళ్లి డేట్‌ ఫిక్స్‌ చేసిన బిగ్‌బాస్‌ నటి

Published Thu, Nov 21 2019 4:14 PM | Last Updated on Thu, Nov 21 2019 4:45 PM

Kamya Punjabi Tie Knot With Shalabh Dang On February 10 - Sakshi

ప్రముఖ సీరియల్‌ నటి కామ్యా పంజాబీ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. వ్యాపారవేత్త షలబ్‌దాంగ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న కామ్యా దాన్ని వివాహబంధంగా మార్చేందుకు అడుగులు వేసింది. దీనికి సంబంధించిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.తన ప్రియుడితో కలిసి ఫిబ్రవరి 10 నుంచి వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు కామ్యా పంజాబీ  రాసుకొచ్చింది. అయితే ఆమె గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల దాంపత్యం అనంతరం 2013లో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషిస్తున్న కామ్యా.. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement