మెరీనా అబ్రహం (Marina Abraham Sahni).. అమెరికా అమ్మాయి సీరియల్‌తో అందర్నీ ఇట్టే కట్టిపడేసింది. బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ (Bigg Boss Reality Show)లో భర్త రోహిత్ సాహ్నితో కలిసి పాల్గొంది. వీరిద్దరూ కలిసి సొంతంగా ఓ ఫోటోస్టూడియో కూడా నెలకొల్పారు. ఇకపోతే కొంతకాలంగా యాక్టింగ్‌కు దూరంగా ఉంటోంది మెరీనా. ఈ మధ్య కాస్త బొద్దుగా అవడంతో తను ప్రెగ్నెంట్ అన్న రూమర్స్ మొదలయ్యాయి. దీనికి మెరీనా.. యూట్యూబ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
2021లో ప్రెగ్నెంట్
లావయ్యానంటే దానికి చాలా కారణాలుంటాయి. మీకు ముందుగా నా గతం గురించి చెప్తాను. 2021లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ మొదటి స్కానింగ్‌లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. అయినా మళ్లీ హార్ట్‌బీట్ వస్తుందేమోనని ఎదురుచూశాం. మూడునెలలవరకు తీయించుకోలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఇన్‌ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంతో దాన్ని తీసేయించుకోవాల్సి వచ్చింది. 2022లో మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు హార్ట్‌బీట్ వచ్చింది.
అందుకే..
ఒత్తిడి వల్లో.. నా శరీరం వీక్‌గా ఉందనో కానీ గర్భస్రావమైంది. అప్పుడు నా బాడీలో చాలా మార్పులు వచ్చాయి. ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు స్టెరాయిడ్లు ఇవ్వాల్సి వచ్చింది. తినకపోయినా లావైపోయాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నేను ప్రెగ్నెంటా? కాదా? అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ సమాధానం దాటవేసింది. కానీ తన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే మెరీనా ప్రెగ్నెంట్ అని సులువుగా తెలిసిపోయిందంటున్నారు ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment