బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. పర్సనల్ లైఫ్‌ను పక్కనపెట్టేసి ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. కానీ ఏం లాభం? బేబీ జాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించలేకపోయింది. మిక్స్‌డ్ టాక్ వస్తుండటంతో వసూళ్లు అందుకోవడం కష్టంగా మారింది.
కీర్తి దోస..
ఇకపోతే సినిమా కోసం తరచూ ముంబై వెళ్తోంది కీర్తి. ఈ క్రమంలో గురువారం రాత్రి అక్కడి ఫోటోగ్రాఫర్లు ఆమను కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు తనను కృతి అని పిలిచారు. దీంతో ఆమె.. నా పేరు కృతి కాదు కీర్తి అని చెప్పింది. ఇకపోతే సౌత్ ఇండియన్ యాక్టర్స్‌ను అక్కడి ఫోటోగ్రాఫర్లు దోస అని పిలుస్తుంటారు. అలా కొందరు దోస అని పిలవడంతో ఆమె అభ్యంతరం చెప్పింది. నా పేరు కీర్తి దోస కాదు కీర్తి సురేశ్. కానీ నాకు దోస అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
సినిమా
బేబీ జాన్ (Baby John Movie) విషయానికి వస్తే వరుణ్ ధావన్ హీరోగా నటించగా కీర్తితో పాటు వామిక గబ్బి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. జాకీ ష్రాఫ్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలైంది. తేరీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment