
టెక్నాలజీ సాయంతో తిమ్మిని బమ్మి చేయొచ్చు.. బమ్మిని తిమ్మి చేయొచ్చు. లేనివారు ఉన్నట్లు, ఆడుతున్నట్లు, పాడుతున్నట్లు.. ఇలా ఏదైనా చేసేయొచ్చు. కానీ కొన్ని సార్లు టెక్నాలజీ దుర్వినియోగం మితిమీరిపోతోంది. ఆ మధ్య డీప్ ఫేక్ ఉపయోగించి రష్మిక వీడియో సృష్టించారు. ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సమంత (Samantha) బేబీ బంప్ ఫోటోలు తయారు చేశారు.
పిచ్చిపనులు
వీటిని సోషల్ మీడియాలో వదలగా విపరీతంగా వైరలవుతున్నాయి. ఇలాంటివి చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిచ్చి పనులకు సెలబ్రిటీలను వాడేసుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సమంతకు ప్రెగ్నెన్సీ అని పుకారు సృష్టించడం నీచమని కామెంట్లు చేస్తున్నారు.
అంతా కోరుకునేది..
ఇకపోతే సమంత సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. కొన్నిసార్లు పరిగెత్తడం మానేసి కూర్చుంటే బాగుంటుంది. కాసేపైనా ఆ హడావుడిని పక్కన పెట్టేయాలి. ఈ బిజీ ప్రపంచంలో మనమంతా కోరుకునేది ఒక సామాన్య జీవితం. అసలు ఏం చేయాలన్న ప్రణాళిక లేకపోవడం కూడా ఒక ప్లానేమో! అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ప్రశాంతంగా..
అందులో తన పూజగదిని, ప్రకృతిని చూపించడమే కాకుండా మంచంపై హాయిగా, ప్రశాంతంగా నిద్రిస్తున్న ఫోటోలను సైతం పంచుకుంది. కాగా గతేడాది శాకుంతలం, ఖుషి (Kushi Movie) చిత్రాలతో పలకరించిన సమంత ఈ ఏడాది 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌తో అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment